ఆ వీడియోలు నావి కావు.. రూ.400 చెల్లించొద్దు: రితికా సింగ్ | Actor Ritika Singh Deepfake Videos Viral | Sakshi
Sakshi News home page

Ritika Singh Videos: రితికా సింగ్ డీప్‌ఫేక్‌ వీడియోలు.. రూ.400 చొప్పున వసూలు!

Oct 30 2026 5:42 PM | Updated on Oct 30 2026 6:07 PM

Actor Ritika Singh Deepfake Videos Viral

సోషల్ మీడియాలో తన పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి, ఏఐ డీప్‌ఫేక్‌ వీడియోలు ప్రచారం చేస్తున్నారంటూ నటి రితికా సింగ్  సోషల్‌ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు తన పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ప్రొఫైల్స్‌ క్రియేట్ చేసి నెలకు రూ.400 చొప్పున సబ్‌స్క్రిప్షన్‌ వసూలు చేస్తున్నారని వెల్లడించారు. ఇలాంటి ఖాతాలను నమ్మి అభిమానులు డబ్బులు పోగొట్టుకోవద్దని హెచ్చరించారు.

సబ్‌స్క్రిప్షన్ లింకులను నమ్మవద్దు..
ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూ టిక్‌ ఉన్న ఖాతా మాత్రమే తన అధికారిక అకౌంట్‌ అని స్పష్టం చేశారు. తన పేరుతో ఉన్న ఇతర నకిలీ ఖాతాలను గుర్తించి వెంటనే రిపోర్ట్ చేయాలని అభిమానులకు సూచించారు.  అనధికారిక ప్రొఫైల్స్‌లో కనిపించే వీడియోలు, సబ్‌స్క్రిప్షన్ లింకులను నమ్మవద్దని  ఈ సందర్భంగా కోరారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏఐ సాయంతో రూపొందిస్తున్న డీప్‌ఫేక్‌ వీడియోలు, నకిలీ ప్రొఫైల్స్‌ ద్వారా జరుగుతున్న మోసాలపై ఆమె చేసిన ఈ హెచ్చరిక చర్చనీయాంశంగా మారింది.
 (ఇదీ చదవండి: ఆరేళ్ల చిన్నోడుతో సెలబ్రిటీ పెళ్లి..! ప్రపోజ్‌ చేసిన స్టార్‌ నటి కొడుకు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement