దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ ఇటీవలే సిగ్మా మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది. తొలి మూవీనే నిరాశ పరచడంతో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అట్లీ నిర్మాణంలో డ్యూడ్ ఫేమ్ కార్తీశ్వరన్ డైరెక్షన్‌లో చేయనున్నట్లు కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.
అయితే తాజాగా జేసన్ సంజయ్ అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. తనకు ఎలాంటి అభిమాన సంఘాలు లేవని వెల్లడించారు. ఎవరైనా తన పేరుతో నకిలీ ఖాతాలు సృష్టిస్తే వాటితో తనకెలాంటి సంబంధం లేదన్నారు. అలాగే తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల వివరాలను పంచుకున్నారు. మిగిలివన్నీ ఫేక్ అకౌంట్స్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు.
జేసన్ తన పోస్ట్‌లో రాస్తూ..'నా పేరు, ఫొటోతో ఉన్న నకిలీ ఖాతాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. వాటి నుంచి వచ్చే పోస్టులకు నాది బాధ్యత కాదు. నా పేరుతో ఎవరైనా అధికారిక అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రచారం చేస్తే నమ్మొద్దు' అని రాసుకొచ్చారు.
My only official accounts are Instagram - jason.sanjay_official , Facebook - JasonSanjay , and X - @official_jsj — Jason Sanjay https://t.co/xdGYHQJqYC
— Jason Sanjay Official (@official_jsj) October 29, 2026


