పెళ్లికి ముందు అందమైన ఫొటోలు దిగాలనుకుంది. అందుకోసం భారీ బెలూన్లతో ప్రత్యేకంగా ముస్తాబైంది. సముద్ర తీరంలో ఫొటోషూట్ ప్రారంభించింది. కానీ అంతలోనే ఒక్కసారిగా బలంగా వీచిన గాలులు ఆమెను భయపెట్టాయి. చేతిలో ఉన్న భారీ బెలూన్లు గాలికి ఎగరడంతో.. వాటి వెంట వధువు కూడా గాల్లోకి లేచే పరిస్థితి ఏర్పడింది. చివరకు ఫొటోగ్రాఫర్ చాకచక్యంగా స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బోస్ఫరస్ జలసంధి తీరంలో ఓ యువతి తన పెళ్లికి ముందు ఫొటోషూట్ కోసం వెళ్లింది. ఫొటోలు అందంగా రావాలనే ఉద్దేశంతో పెద్ద సైజులో ఉన్న లేత గోధుమ రంగు బెలూన్లను చేతిలో పట్టుకుని కెమెరాకు పోజులిచ్చింది. అయితే అదే సమయంలో బలమైన గాలులు వీయడంతో బెలూన్లు ఒక్కసారిగా పైకి లేచాయి. వాటిని పట్టుకున్న వధువు గాలికి నిలబడలేక ఇబ్బంది పడింది. ఓ బలమైన గాలి తాకిడికి బెలూన్లు ఆమెను సమీపంలోని సముద్రపు గోడ వైపు లాగాయి. దీంతో ఆమె దాదాపు నేలపై నుంచి పైకి లేచే పరిస్థితి ఏర్పడింది.
She was supposed to float down the aisle, not float away before the wedding even started. A bride-to-be was posing for photos by the water, holding a big bunch of balloons, when a gust of wind hit them head-on. Suddenly she was being dragged toward the seawall, and for a second, it looked like she might actually lift off the ground. Her photographer jumped in and grabbed her right before she slammed into a building. And like a true champ, she shook it off and finished the whole photoshoot. That photographer deserves a tip and a seat at the head table. Would you have let go of the balloons, or held on for the perfect shot?
— Tony Lane 🇺🇸 (@TonyLaneNV) October 30, 2026
సమీపంలోని బ్రిడ్జీని ఢీకొట్టే ప్రమాదం కనిపించడంతో ఫొటోగ్రాఫర్ వెంటనే అప్రమత్తమయ్యాడు. ఆమెను గట్టిగా పట్టుకుని కిందకు లాగడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లి ఫొటోషూట్‌లో అందమైన జ్ఞాపకాలు మిగులుతాయని భావిస్తే.. జీవితాంతం గుర్తుండిపోయే భయానక అనుభవం ఎదురైందంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వీడియోపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌లో హై టెన్షన్.. నెతన్యాహు ఇంటి వద్ద ఉద్రిక్తత


