నెక్ట్స్‌ లెవల్‌ : దోసె, ఫిల్టర్‌ కాఫీకి జర్మన్‌ యువకుడు ఫిదా! | Feels Like Home German Man In Bengaluru Found Comfort In Dosa Filter Coffee | Sakshi
Sakshi News home page

నెక్ట్స్‌ లెవల్‌ : దోసె, ఫిల్టర్‌ కాఫీకి జర్మన్‌ యువకుడు ఫిదా!

Oct 28 2026 6:32 PM | Updated on Oct 28 2026 7:02 PM

Feels Like Home German Man In Bengaluru Found Comfort In Dosa Filter Coffee

దోసె, ఫిల్టర్‌ కాఫీ ఈ కాంబో  అంటే  ఎవ్వరికి మాత్రం ఇష్టం ఉండదు. ఇక దక్షిణాది ఆహార ప్రియులకైతే  ఫిల్టర్‌ కాఫీ లేనిదే రోజు గడవదు అంటే అతిశయోక్తి కాదు.  కానీ దోసె, ఫిల్టర్ కాఫీకి  ఒక జర్మన్ యువకుడు, కంటెంట్ క్రియేటర్ ఫిదా కావడం విశేషం. ఈ రెండూ  తనకు ఎంత ఇష్టమో సొంత ఇంట్లో ఉన్న ఫీలింగ్‌ అంటూ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

కొత్త దేశానికి వెళ్లినప్పుడు తరచుగా అక్కడి విభిన్న ఆహారానికి అలవాటు పడాల్సి వస్తుంది. కానీ కొన్ని వంటకాలు నెమ్మదిగా మనకు ఇష్టమైనవిగా మారిపోతాయి.  అచ్చం ఇలాగే బెంగళూరులో నివసిస్తున్న 'మ్యాడ్స్' (Mads) అనే జర్మన్ కంటెంట్ క్రియేటర్ దక్షిణ భారతదేశంలో అత్యంత ఇష్టపడే భోజనాలలో ఒకటైన దోసె  ఫిల్టర్ కాఫీని తాను ఇప్పుడు ఎంతగా ఆస్వాదిస్తున్నాడో పంచుకున్నాడు. జయానగర్‌లోని హోటల్‌లో (Dakshin Thindi) దోసె,ఫిల్టర్ కాఫీని ఆస్వాదిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పంచు కున్నాడు. కాలేజీ ముగిసిన తర్వాత జయానగర్‌లో దోసె, కాఫీ తాగడం తనకు స్వదేశంలో ఉన్నంత సొంత అనుభూతిని ఇస్తోందని పేర్కొన్నాడు.

నెటిజన్ల కామెంట్లు
ఈ పోస్ట్‌పై స్పందిస్తూ, ఒక యూజర్, “మరి నేను ఇక్కడ జర్మనీలో డోనర్ తింటున్నాను” అని రాశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు "దోశ తిని సగం భారతీయుడిగా మారిపోయాడు", "అతనికి అధికారికంగా ఆధార్ కార్డ్ మంజూరు చేయవచ్చు", "ఇకపై అతను జయానగర్ లోకల్" అంటూ ఫన్నీ కామెంట్లు వెల్లువెత్తాయి. మరొకరు, దోసె తిన్న తర్వాత కాఫీ తాగితే ఆ అనుభూతే వేరు అని పేర్కొన్నారు..  “బ్రోకి ఎదురుగా కాలిఫోర్నియా బురిటో ఉన్నా, అతను మాత్రం దక్షిణ తిండినే ఎంచుకున్నాడు. సంస్కృతిని గౌరవించడం అంటే ఇదే.”  కదా ఇంకొకరు వ్యాఖ్యానించారు. <

ఇదీ చదవండి: రూ. 20 కచోరి తిందామని ఆగితే.. రూ. 20 లక్షలు మాయం!

 

మరో విశేషం ఏమిటంటే..
డెన్మార్క్‌కు చెందిన పీటర్ (Peter Kjærgaard Christensen) అనే వ్యక్తి బెంగళూరులో 6 నెలలు నివసించిన తర్వాత అతని రుచులు ఎలా మారాయో ఒక వీడియో ద్వారా పంచుకున్నాడు. మొదట్లో మసాలా దోసె కారంగా అనిపించి, స్పూన్ , ఫోర్క్‌తో తినడం కష్టంగా అనిపించేదట.  అదే పీటర్‌ ఆరు నెలల తర్వాత చేత్తో తినడమే కాకుండా, ఇంకా కాస్త ఎక్కువ కారం వేయమని అడిగే స్థాయికి మారి పోవడం విశేషమే మరి. 

ఇదీ చదవండి: బౌద్ధసన్యాసికి భిక్షవేసి కాళ్లు మొక్కిన యాచకుడు : వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement