పంటకు కాపలాగా అందాల భామలు | Drishti Bomma Crop Fields Protection In Bangalore | Sakshi
Sakshi News home page

పంటకు కాపలాగా అందాల భామలు

Oct 27 2026 1:20 PM | Updated on Oct 27 2026 1:20 PM

Drishti Bomma Crop Fields Protection In Bangalore

బెంగళూరు: సాధారణంగా పంటలను దిష్టి నుంచి కాపాడేందుకు రైతులు దిష్టి బొమ్మలు ఏర్పాటు చేస్తుంటారు. అయతే ఓ రైతు ఏకంగా సినీ హీరోయిన్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గదగ్‌ తాలూకా ముళగుంద గ్రామానికి చెందిన రైతు శివానంద సాగు చేసిన మిర్చి పంట దిగుబడి ఆశాజనకంగా వచ్చింది.

ఈ నేపథ్యంలో గ్రామస్తుల దిష్టి తగలకుండా హీరోయిన్లు  రచితరామ్, రశ్మిక మందన్న ఫ్లెక్సీలను పొలంలో ఏర్పాటు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రైతు వినూత్న ఆలోచనను నెటిజన్లు కొనియాడుతున్నారు. 

ఇదీ చదవండి: అమ్మలా లాలించి.. అన్నం వడ్డించి


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement