రైలులో ఎంపీ భార్యకు ‘భయానక’ అనుభవం | Tejasvi Surya Wife Recounts Traumatic Train Ride | Sakshi
Sakshi News home page

రైలులో ఎంపీ భార్యకు ‘భయానక’ అనుభవం

Sep 25 2026 5:29 PM | Updated on Sep 25 2026 5:47 PM

Tejasvi Surya Wife Recounts Traumatic Train Ride

బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య భార్య, కర్ణాటక సంగీత గాయని శివశ్రీ స్కందప్రసాద్‌కు రైలు ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. 56 సీట్ల కోచ్‌లో దాదాపు 40 మంది పెద్దగా మాట్లాడటం, నవ్వడం, పాటలు పాడటంతో తీవ్ర ఇబ్బందికి గురైన ఆమె.. ఈ ఘటనను భయంకరమైన ప్రయాణంగా అభివర్ణించారు. సుమారు ఐదు గంటల పాటు పురుషులు.. పెద్దగా అరుస్తూ ఇబ్బంది పెట్టారంటూ ఆమె ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

కళాకారులు నిశ్శబ్దంలోనే సృజనాత్మకంగా ఆలోచిస్తారు. ప్రశాంతంగా రైలు ప్రయాణం చేయాలన్న తన కోరిక ఆ వ్యక్తుల వల్ల భగ్నమైందన్నారు. “కళాకారులుగా మన మనసులో ఒకేసారి ఎన్నో ఆలోచనలు నడుస్తుంటాయి. మేము నిశ్శబ్దంలోనే అభివృద్ధి చెందుతాం. కానీ 56 సీట్ల కోచ్‌లో 40 మంది పురుషులు కూర్చుని, ఐదు గంటల పాటు అందరితో అంత గట్టిగా.. నిరంతరం మాట్లాడితే ఎలా ఉంటుంది?” అంటూ ఆమె రాసుకొచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో ఇతరులను గౌరవించకపోవడం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.

మరో కోచ్‌లో తనకు సీటు ఏర్పాటు చేయాలని టికెట్ ఎగ్జామినర్‌ను అడిగానని.. అయితే సీట్లు ఖాళీగా లేకపోవడంతో అది సాధ్యం కాలేదని చెప్పారు. తర్వాత అప్పటికే గోల గోల చేసిన ఓ ఎనిమిది మంది వ్యక్తులు యూనో గేమ్ ఆడటం మొదలుపెట్టారు. దీంతో టీటీఈకి ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. టీటీఈ వారిని ఆడటం ఆపమని చెప్పగానే వారు వెంటనే ఆపారని ఆమె అంగీకరించారు.

అయితే కొన్ని నిమిషాల తర్వాత టీటీఈ స్వయంగా తిరిగి వచ్చి.. వారు ఎందుకు ఇంత ఇబ్బంది కలిగిస్తున్నారంటూ వ్యంగ్యంగా అడిగారని ఆమె చెప్పారు. దీంతో మరోసారి నవ్వులు మొదలయ్యాయని ఆమె తెలిపారు. వారు ఆయనతో మాట్లాడుతూ ‘సార్.. మీరు కూడా రండి.. ఆడుదామన్నారని అని స్కందప్రసాద్ పేర్కొన్నారు. ఆ తర్వాత వారు బాలీవుడ్ పాటలు పాడటం ప్రారంభించారని ఆమె తెలిపారు. ఇక్కడ సమస్య ఎవరు గెలిచారనే దాని గురించి కాదు. వారితో పాటు నేనూ ఒక భారతీయురాలిగా పౌరస్పృహ విషయంలో ఓడిపోయానంటూ ఆమె ట్వీట్‌ చేశారు.

ఇదీ చదవండి: ఎట్టకేలకు 59 ఏళ్ల వయసులో టీచర్‌ ఉద్యోగం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement