breaking news
Tejasvi Surya
-
మెట్రో సేవల్లో అంతరాయం.. చుక్కలు చూసిన ప్రయాణికులు!
సిలికాన్ సిటీగా ప్రపంచవ్యాప్తంగా పేరు గాంచిన బెంగళూరులో మంగళవారం సాయంత్రం ఊహించని దృశ్యాలు కనిపించాయి. కార్యాలయాల నుంచి ఇళ్లకు బయల్దేరిన వేలాది మంది ఉద్యోగులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. కొందరు గంటల తరబడి స్టేషన్లలో చిక్కుకుపోగా.. మరికొందరు ఇంటికి చేరుకునేందుకు లారీలు, ట్రక్కులెక్కాల్సి వచ్చింది. దీనికి కారణం నగర మెట్రో వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపమే.బెంగళూరు నమ్మ మెట్రోలో అత్యంత రద్దీగా ఉండేది పర్పుల్ లైన్. అయితే మంగళవారం సాయంత్రం ఈ లైన్‌లోని కబ్బన్ పార్క్ మెట్రో స్టేషన్ వద్ద ఓ రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఈ బిజీ లైన్లో రైళ్ల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వైట్‌ఫీల్డ్‌తో పాటు నగరంలోని కీలక ప్రాంతాలను అనుసంధానించే ఈ మార్గంలో సర్వీసులు నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.Bengaluru Metro services disrupted on Purple Line after technical fault at Cubbon Park station @OfficialBMRCLhttps://t.co/Q5X1D3FHNn pic.twitter.com/j6PEjSFAo7— ChristinMathewPhilip (@ChristinMP_) June 23, 2026స్టేషన్లలో భారీ రద్దీమెట్రో అధికారులు కొన్ని రైళ్లలోని ప్రయాణికులను మధ్యలోనే దింపేయడంతో ఒక్కసారిగా స్టేషన్ల వద్ద భారీ రద్దీ నెలకొంది. ఆఫీసుల నుంచి తిరిగి వస్తున్న ఉద్యోగులు ప్రత్యామ్నాయ రవాణా కోసం రోడ్లపైకి రావడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కూడా స్తంభించింది. క్యాబ్‌లు, ఆటోలకు ఒక్కసారిగా భారీ డిమాండ్ పెరగడంతో ప్రయాణికులు మరింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో విచిత్రమైన పరిస్థితులు కనిపించాయి.India's Silicon Valley or India's Biggest Infrastructure Failure? IT Employees Forced to Hitch Rides on Trucks After Yet Another Metro BreakdownBengaluru proudly calls itself India's Silicon Valley, a global technology hub that powers innovation, startups, and multinational… pic.twitter.com/qAGDEQfyNj— Karnataka Portfolio (@karnatakaportf) June 24, 2026లారీలు, ట్రక్కులెక్కిన టెక్కీలుఈ గందరగోళంలో ఇంటికి వెళ్లేందుకు కొందరు ఉద్యోగులు లారీలు, ట్రక్కులు ఎక్కి ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సాధారణంగా ఐటీ హబ్‌గా గుర్తింపు పొందిన నగరంలో ఇలాంటి దృశ్యాలు కనిపించడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.థర్డ్ వరల్డ్ గవర్నెన్స్..ఈ ఘటనపై స్పందించిన బెంగళూరు దక్షిణ లోక్‌సభ సభ్యుడు తేజస్వి సూర్య Tejasvi Surya.. కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. “ఫస్ట్ వరల్డ్ టెక్ టాలెంట్.. థర్డ్ వరల్డ్ గవర్నెన్స్.. ఇదే బెంగళూరి కథ” అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. మెట్రో సేవల్లో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని, మెట్రో ఆగిపోయిన ప్రతిసారీ నగరం మొత్తం గందరగోళంలో పడిపోతోందని ఆయన విమర్శించారు.First-world tech talent. Third-world governance.That is the story of Bengaluru.Metro disruptions have become alarmingly frequent. And every time the Metro fails, the entire city descends into chaos. Cabs disappear. Autos refuse rides. Citizens are stranded.Yesterday,… pic.twitter.com/0URP0FbtFK— Tejasvi Surya (@Tejasvi_Surya) June 24, 2026రాత్రంతా మరమ్మతులులోపాన్ని గుర్తించిన మెట్రో సిబ్బంది వెంటనే మరమ్మతు పనులు ప్రారంభించారు. కొంతసేపటి తర్వాత ఎంజీ రోడ్ నుంచి వైట్‌ఫీల్డ్ మధ్య పరిమిత సేవలను పునరుద్ధరించినప్పటికీ.. రద్దీ మాత్రం తగ్గలేదు. రాత్రంతా కొనసాగిన మరమ్మతుల తర్వాత.. బుధవారం ఉదయం 5 గంటల నాటికి సమస్యను పూర్తిగా పరిష్కరించినట్లు మెట్రో అధికారులు తెలిపారు. ప్రస్తుతం పర్పుల్ లైన్లో సాధారణ సేవలు కొనసాగుతున్నాయి. -
తేజస్వీ సూర్య ఒక వెదవ
-
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం
సాక్షి,తెలంగాణ భవన్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్నీ కమిటీలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. త్వరలో అన్నీ స్థాయిల కమిటీలు నియమించాలని ఆదేశించారు. కమిటీల నియామక బాధ్యతల్ని కేసీఆర్‌కు అప్పగించారు. కొత్త కమిటీలకు శిక్షణా తరగతులు నిర్వహించాలని సూచించారు. సోమవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో రైతుల పరిస్థితి దిగజారుతోంది. రాష్ట్రంలోని ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు. ప్రభుత్వానికి ధాన్యం కొనడానికి చేతకావడం లేదు. కాంగ్రెస్‌ది చిల్లర ప్రభుత్వం’అని ధ్వజమెత్తారు. మరోవైపు, కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తేజస్వి సూర్య ఒక వెధవ. ఆయన అలా మాట్లాడుతుంటే ఒక్కరూ నోరుమెదపలేదు. బీఆర్ఎస్ ఎంపీలు సభలో ఉంటే రణరంగం అయ్యేది. ఒక్క తెలంగాణ బీజేపీ ఎంపీ నోరు మెదపలేదు’అని అన్నారు. -
BJP సెల్ఫ్ గోల్! ఇరుకున పడేసిన తేజస్వి సూర్య
-
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై కోమటి రెడ్డి ఫైర్
హైదరాబాద్: పార్లమెంట్ వేదికగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమైనవని, ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా ఖండించారు."తెలంగాణ రాష్ట్రం వందలాది మంది విద్యార్థులు, యువకుల ప్రాణత్యాగాల ఫలితం. దశాబ్దాల పోరాటం, ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంట్లో ఆమోదించిన చట్టం ద్వారా ఏర్పడిన రాష్ట్రాన్ని, రక్తపాతంతో కూడిన దేశ విభజనతో పోల్చడం తేజస్వి సూర్య అజ్ఞానానికి పరాకాష్ఠ. ఇది అమరుల త్యాగాలను కించపరచడమే." అని మంత్రి మండిపడ్డారు."భారత రాజ్యాంగం ప్రకారం జరిగిన రాష్ట్ర విభజనకు తేడా తెలియని వారు పార్లమెంట్లో ఉండటం దురదృష్టకరం. కోట్లాది మంది ప్రజలను అవమాన పరిచేలా మాట్లాడిన తేజస్వి సూర్యపై లోక్ సభ స్పీకర్ గారు చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేస్తున్న. రాజకీయ లబ్ధి కోసం దేశ సమగ్రతను, ప్రాంతీయ సామరస్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం భావ్యం కాదు.""తెలంగాణ సమాజాన్ని కించపరిచిన తేజస్వి సూర్య తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలి" తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ ఇలాంటి విషపూరిత వ్యాఖ్యలు చేస్తోందని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని మంత్రి హెచ్చరించారు.ఇదీ చదవండి: ఏపీ విభజనపై ఎంపీ తేజస్వీ సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు -
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యకు హరీష్ రావు వార్నింగ్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ సాక్షిగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దశాబ్దాల పోరాటం, వేలాది మంది విద్యార్థులు, యువత, ఉద్యోగులు, ప్రజల త్యాగాల ఫలితం. అలాంటి మహోన్నత ఉద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం చరిత్రను అవమానించడమే. అమరుల త్యాగాలను తక్కువ చేసి చూపించమే. రాజ్యాంగ బద్దంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్‌గా నిలవడాన్ని బీజేపీ తట్టుకోలేకపోతోందనడానికి తేజస్వి అహంకార పూరిత వ్యాఖ్యలే నిదర్శనం . బీజేపీ అధిష్టానం వెంటనే ఈ వ్యాఖ్యలను ఖండించి, తన పార్టీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలి. లేదంటే ఇది బీజేపీ అధికారిక ధోరణిగానే ప్రజలు భావిస్తారు.ఇండియా పాకిస్థాన్ విభజన లాంటిదే తెలంగాణ ఏర్పాటు అయితే ఆనాడు బీజేపీ విభజన బిల్లుకు ఎందుకు మద్దతు తెలిపింది?. ప్రధాని మోడీ కూడా గతం లో అనేక సార్లు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై విషం చిమ్మారు. నాడు మోదీ అయినా నేడు తేజస్వి సూర్య అయినా తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరచడమే పనిగా పెట్టుకున్నారు.తేజస్వి సూర్య అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ నుంచి గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు ఖండించకుండా గుడ్లప్పగించి చూడడం సిగ్గుచేటు. లోక్ సభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే తేల్చేవారు. బీజేపీ ఎంపీలు అయినా కాంగ్రెస్ ఎంపీ లైనా తెలంగాణ పాలిట దిష్టి బొమ్మలుగా మారారు. తెలంగాణ పేరుతో గెలిచి, తెలంగాణ అవమానాన్ని చూసి నిశ్శబ్దంగా కూర్చున్న ఎంపీలు ప్రజలకు సమాధానం చెప్పాలి.ఢిల్లీ పెద్దల ముందు వంగి, తెలంగాణ గౌరవాన్ని తాకట్టు పెట్టే నాయకత్వాన్ని ప్రజలు ఎప్పటికీ క్షమించరు. తెలంగాణను అవమానించే ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్య పద్ధతిలో గట్టి సమాధానం ఇస్తాం. రాష్ట్ర హక్కులు, ఆత్మగౌరవంపై దాడి చేసే శక్తులను తెలంగాణ ప్రజలు ఎన్నడూ అంగీకరించరు. తెలంగాణ అంటే పోరాట గాథ… త్యాగాల చరిత్ర.. స్వాభిమానానికి ప్రతీక. దానిని అగౌరవ పరిస్తే, అవమానిస్తే సహించేది లేదు’అని హెచ్చరించారు. The @BRSparty strongly condemns the highly insensitive and irresponsible remarks made by @Tejasvi_Surya Member of Parliament from the @BJP4India His comparison of the formation of Telangana state with the creation of Pakistan is not only factually incorrect but also deeply…— Harish Rao Thanneeru (@BRSHarish) April 16, 2026 -
సౌత్ స్టేట్స్ కు అన్యాయం జరిగితే నేనే కేంద్రాన్ని ప్రశ్నిస్తా:ఎంపీ తేజస్వీ
-
రేవంత్‌ది ఫూలిష్ ప్రతిపాదన.. లోక్‌సభలో తేజస్వీ సూర్య
సాక్షి, న్యూఢిల్లీ: డీలిమిటేషన్ విషయంలో ప్రతిపక్షాలు చేస్తోంది రాద్ధాంతమేనని.. మహిళా రిజర్వేషన్ల బిల్లు అడ్డుకోవడమే వాళ్ల ధ్యేయంగా కనిపిస్తోందని బెంగళూరు సౌత్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అన్నారు. గురువారం కేంద్రం ప్రవేశపెట్టిన మూడు కీలక బిల్లులపై చర్చ సందర్భంగా ఆయన విపక్షాలపై ధ్వజమెత్తారు. 1996 నుంచి మహిళా రిజర్వేషన్ల బిల్లు పెండింగ్‌లో ఉంది. గత ప్రభుత్వాలు ఈ బిల్లును విస్మరించాయి. కానీ, ప్రధాని మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని మహిళలందరి తరపున ప్రధాని మోదీకి ధన్యవాదాలు. కానీ, మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆలస్యమయ్యేలా ప్రతిపక్షాలు కొత్తదారులు వెతుక్కుంటున్నాయి. రాజ్యాంగం ప్రకారం డీలిమిటేషన్ తప్పనిసరి. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రజలను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి. డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ప్రచారం చేస్తున్నాయి. తమిళనాడులోనూ కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు. కానీ, డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు. డీలిమిటేషన్ వద్దని ప్రతిపక్షాలు అంటున్నాయి. కానీ, అదే జరిగితే కేరళలో పది సీట్లు పెరుగుతాయి. ఇది కేరళకు లాభమే గానీ నష్టం కాదు. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న వాదనలో అర్థమే లేదు. డీలిమిటేషన్ సాకుగా చూపించి మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకోవాలని విపక్షాలు చూస్తున్నాయి. 1996లో మొదలైన మహిళా రిజర్వేషన్ల బిల్లు ఇప్పుడు ఓ కొలిక్కి వస్తోంది. ఈరోజు కోసం దేశం 40 ఏళ్లుగా ఎదురు చూస్తోంది. 2029లో అమలయ్యే మహిళా రిజర్వేషన్లతో దేశం అభివృద్ధిలో సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. సూర్యనారీశక్తి బిల్లును విపక్షాలు అడ్డుకోవడం సరికాదు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం చావడానికైనా నేను సిద్ధం’’ అని తేజస్వీ సూర్య ప్రసంగించారు.సీఎం రేవంత్ ప్రతిపాదనపై స్పందిస్తూ.. డీలిమిటేషన్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వాదనను చర్చ సందర్భంగా తేజస్వీ సూర్య తప్పుబట్టారు. ‘‘రేవంత్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆయన హైబ్రిడ్ వాదన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. జీఎస్డీపీ ఆధారంగా సీట్ల సంఖ్య పెంచమని రేవంత్ అన్నారు. ఆ సలహా ఆయనకు ఎవరు ఇచ్చారో తెలియదు. ఆయనత ఎచ్చిన ప్రతిపాదన ఫూలిష్‌గా ఉంది. జీఎస్డీపీ తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. ఆ లెక్కన సీట్ల సంఖ్య మారుతూ ఉండాలా?. ఆదాయం ప్రకారం ఓట్లు ఇస్తే అంబానీకి లక్ష ఓట్లు ఇవ్వాలి. రాజ్యాంగం ప్రకారం.. ఒకరికి ఒక్క ఓటే ఉంటుంది. డీలిమిటేషన్ ఏపీ, తెలంగాణలో 52 శాతం సీట్లు పెరుగుతాయి. తమిళనాడులో 49 సీట్లు పెరుగుతున్నాయి. మొత్తంగా దక్షిణాది రాష్ట్రాల్లో 23.9 శాతం సీట్లు పెరుగుతాయి. ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్ల పెంపు అనేది రాజ్యాంగబద్ధమే. డీలిమిటేషన్‌తో సీట్ల పెంపులో దక్షిణాది రాష్ట్రాలకు న్యాయమే జరుగుతుంది’’ అని తేజస్వీ అన్నారు.


