వీడని బిగ్‌ మిస్టరీ: 23 ఏళ్లుగా ప్రముఖ నటుడు అదృశ్యం! | The 23 Year Old Mystery of Missing Bollywood Actor Raj Kiran | Sakshi
Sakshi News home page

వీడని బిగ్‌ మిస్టరీ: 23 ఏళ్లుగా ప్రముఖ నటుడు అదృశ్యం!

Jul 27 2026 1:02 PM | Updated on Jul 27 2026 1:11 PM

The 23 Year Old Mystery of Missing Bollywood Actor Raj Kiran

బాలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగి, ఆ తర్వాత కనిపించకుండా పోయిన ప్రముఖ నటుడు రాజ్ కిరణ్ అదృశ్యమై రెండు దశాబ్దాలకు పైగా గడిచినా, అతని ఆచూకీ తెలియకపోవడం పెద్ద మిస్టరీగా మారింది. ‘కరాజ్’, ‘అర్థ్’, ‘బసేరా’ తదితర చిత్రాలతో గుర్తింపు పొందిన ఆయన, 2003 నుంచి తన కుటుంబ సభ్యులకు కనిపించకుండా పోయారు. మానసిక అనారోగ్య సమస్యలు, కెరీర్లో ఎదురుదెబ్బల కారణంగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పలుమార్లు వార్తలు వచ్చాయి.

అమెరికాలోని అట్లాంటాలో గల ఒక సంస్థలో ఆయన ఉన్నట్లు దివంగత నటుడు రిషి కపూర్ గతంలో తెలిపారు. అయితే, రాజ్ కిరణ్ కూతురు రిషిక ఆ వాదనను ఖండించారు. తన తండ్రి అట్లాంటాలో లేరని, ఆయనను వెతికేందుకు తాము ప్రైవేట్ డిటెక్టివ్‌లను, న్యూయార్క్ పోలీసులను కూడా ఆశ్రయించామని ఆమె తెలిపారు. మరోవైపు ఆయన న్యూయార్క్‌లో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారనే వదంతులు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే దీనికి ఎలాంటి అధికారిక ఆధారాలు లభించలేదు.

దివంగత రిషి కపూర్‌కు ఇచ్చిన మాటిను నిలబెట్టుకునేందుకు ప్రముఖ నటి, సామాజిక కార్యకర్త సోమీ అలీ సుమారు 20 ఏళ్లుగా అమెరికా అంతటా ఆయన కోసం అన్వేషిస్తున్నారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి ఖచ్చితమైన సమాచారం లభించలేదు. రాజ్ కిరణ్ స్వచ్ఛందంగా తన పాత జీవితాన్ని వదిలేశారా? లేక అనారోగ్యం కారణంగా ఒంటరిగా మిగిలిపోయారా? అనే ప్రశ్నలకు ఏళ్లు గడుస్తున్నా సమాధానం దొరకలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement