నటుడు చనిపోయిన 16 ఏళ్లకు సొంతింటి కల సాకారం | Cochin Haneefa Family Moves Own House After 16 Years His Death | Sakshi
Sakshi News home page

Cochin Haneefa: ప్రముఖ నటుడి కుటుంబానికిది ఎమోషనల్ మూమెంట్

Jul 27 2026 12:42 PM | Updated on Jul 27 2026 12:49 PM

Cochin Haneefa Family Moves Own House After 16 Years His Death

'శివాజీ' సినిమాలో ప్రొఫెషనల్ ఎథిక్ అంటూ డైలాగ్ చెప్పే నటుడు మీకు గుర్తుండే ఉంటుంది. ఆ ఒక్క డైలాగ్‌తో తెలుగులోనూ చాలా ఫేమస్ అయిన ఈయన మలయాళ నటుడు కొచ్చిన్ హనీఫా. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కలిపి 300కి పైగా చిత్రాల్లో నటించారు. 2010లో సడన్‌గా చనిపోవడంతో ఈయన కుటుంబం సొంతింటిని నిర్మించుకునే విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఎట్టకేలకు ఆ కల తాజాగా సాకారమైంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

నటుడిగా ఉన్నప్పుడే హనీఫా.. సొంతింటిని కట్టుకోవాలని చాలా ఆశపడ్డారు. అందుకోసం కొద్దికొద్దిగా డబ్బుని పొదుపు చేసుకున్నారు. కానీ 2010లో మరణించిన తర్వాత ఈయన ఆస్తులకు సంబంధించి న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యాయి. ఫలితంగా ఇంటి నిర్మాణం ఎన్నో ఏళ్లు ఆలస్యమైంది. దీంతో ఈయన భార్య ఫసీలా, కవల కుమార్తెలు సఫా, మార్వా.. కొచ్చిలోని కడవంత్ర ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లోకి మారారు. అప్పటినుంచి అక్కడే ఉంటూ వచ్చిన హనీఫా కుటుంబం.. ఎ‍ట్టకేలకు ఇప్పుడు సొంతింటిలో అడుగుపెట్టారు. ఈ శుభకార్యంలో హీరో దిలీప్ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు.

కొచ్చిలోని వెన్నల ప్రాంతంలో నిర్మించిన ఈ మూడు అంతస్తుల ఇంటికి 'కొచ్చిన్ హనీఫాస్ ఏబీ మంజిల్' అని పేరు పెట్టారు. తమకు నాలుగేళ్ల వయసున్నప్పుడు తండ్రిని కోల్పోయిన సఫా, మార్వా.. తమ కొత్త ఇంటికి ఇంటీరియర్ డిజైన్‌ చేయడం విశేషం. ఇంటి నిండా హనీఫా ఫొటోలు, ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలని ఏర్పాటు చేశారు.

మా కుటుంబం ఒక్క రూపాయి కోసం కూడా ఎవరి ముందు చేయి చాచలేదు. చట్టపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ హనీఫా దాచిన సొమ్ముతోనే ఈ ఇంటిని కట్టుకున్నాం. అదే ఆయన కోరిక కూడా. హనీఫా ఉపయోగించిన టయోటా ఇన్నోవా కారును తన సినిమా షూటింగ్‌లకు వినియోగించేలా ఏర్పాటు చేసి, దాదాపు 16 సంవత్సరాల పాటు కుటుంబానికి స్థిరమైన ఆదాయం వచ్చేలా దిలీప్ సహకరించారు అని హనీఫా భార్య ఫసీలా చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి లవ్ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement