యేసుప్రభు జీవిత చరిత్రతో ఇంతకుముందు పలు సినిమాలు వచ్చాయి. తాజాగా 'ప్రజాపతి' పేరుతో మరో మూవీ తెరకెక్కబోతోంది. అల్లేలూయ ప్రేయర్ ఫెలోషిప్ సంస్థ సమర్పణలో బి.రూబెర్ట్ కథ,దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రమిది. ప్రజాపతి పేరుతో యేసు క్రీస్తు జీవిత చరిత్రను ఈయన గత 25 ఏళ్లుగా నాటకాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. కాగా ప్రభు ఆదేశాలు మేరకు ఈ నాటకాన్ని వెండితెరపై ఆవిష్కరించడానికి పూనుకున్నట్లు బి.రూబెర్ట్ శనివారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్ నిర్వహించిన ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పేర్కొన్నారు.
చిత్ర నిర్మాణానికి ముందే ట్రైలర్‌ను రూపొందించడం విశేషం. కాగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రజాపతి చిత్ర ట్రైలర్‌ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. చాలా కార్యక్రమాలు ఉన్న రూపేష్ ఆహ్వానించడంతో ఇందులో పాల్గొనడానికి అంగీకరించాను. ఎందుకంటే ఇది ఈ కాలంలో జరగాల్సిన ముఖ్యమైన ప్రయత్నం గా నేను భావించాను. ఇప్పుడు సమాజానికి మంచి విషయాన్ని ప్రకటించడం చాలా అవసరం ఆ ఉద్దేశంతో అక్కనున్న ఈ చిత్రం ప్రేక్షకులను హత్తుకునే విధంగా రూపొందాలని సూచించడంతో పాటూ శుభాకాంక్షలు అందించారు. చిత్ర ట్రైలర్ చాలా అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు.


