ఇది తెలుగు సినిమా కాదు.. డబ్బింగ్ చేశామంతే | Director Venky Atluri Reacts Suriya Vishwanath And Sons Movie | Sakshi
Sakshi News home page

Suriya: సూర్య మూవీ.. దర్శకుడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Jul 24 2026 3:18 PM | Updated on Jul 24 2026 3:29 PM

Director Venky Atluri Reacts Suriya Vishwanath And Sons Movie

సూర్య ‍స్వతహాగా తమిళ హీరోనే కానీ డబ్బింగ్ సినిమాలతో తెలుగులో బోలెడంత ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. అందుకు తగ్గట్లే దాదాపు ప్రతి మూవీ ఒకేసారి ఇక్కడ కూడా థియేటర్లలో రిలీజ్ అవుతూ ఉంటుంది. రీసెంట్ టైంలో అయితే 'కరుప్పు'ని 'వీరభద్రుడు' పేరుతో రిలీజ్ చేస్తే పర్లేదనిపించింది. వచ్చే నెలలో 'విశ్వనాథ్ అండ్ సన్స్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం గురించి దర్శకుడు వెంకీ అట్లూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ సినిమా)

తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ.. సూర్యతో చేస్తున్నారని ప్రకటన వచ్చినప్పటి నుంచి అంతా ఇది.. ఈ హీరో తెలుగులో చేస్తున్న తొలి సినిమా అనుకున్నారు. కానీ స్ట్రెయిట్ తమిళ చిత్రం అని, తెలుగులో డబ్బింగ్ చేశామని స్వయంగా డైరెక్టర్ క్లారిటీ ఇచ్చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సంగతి బయటపెట్టాడు.

'గతంలో ధనుష్‌తో 'వాతి'(సార్) సినిమా టైంలో ప్రయోగం చేయాలనుకున్నాం. ఓటీటీల కారణంగా ధనుష్‌కి తెలుగులో భారీగా అభిమానులు పెరిగారు. దీంతో ఈ మూవీని తెలుగు, తమిళంలో ఒకేసారి చిత్రీకరించాం. కానీ 'విశ్వనాథ్ అండ్ సన్స్' స్టోరీ దృష్ట్యా ముందుగా తమిళంలో పూర్తిచేసి తర్వాత తెలుగులో డబ్బింగ్ చేశాం. సూర్యతో ముందుగా ఓ బయోపిక్ చేయాలనుకున్నాను. కానీ దానికి హక్కుల విషయంలో కాస్త ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ లైన్‌లోకి వచ్చింది. సూర్యతో సినిమా చేయాలనేది నా చిరకాల కోరిక. భవిష్యత్తులో ఆయనతో తప్పకుండా మ‌రో సినిమా చేయాలనుంది' అని వెంకీ అట్లూరి చెప్పుకొచ్చాడు.

40 ఏళ్ల వ్యక్తితో 20 ఏళ్ల అమ్మాయి ప్రేమలో పడటం అనే స్టోరీతో 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా తీశారు. ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇందులో సూర్య సరసన మమిత బైజు హీరోయిన్‌గా చేసింది. రాధిక, రవీనా టండన్ తదితరులు ఇతర కీలక పాత్రలు చేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించాడు.

(ఇదీ చదవండి: రిలీజ్ రోజే 'చెన్నై లవ్ స్టోరీ' కలెక్షన్స్ పోస్టర్.. ఇదేం విడ్డూరం?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement