రీసెంట్ టైంలో మహేశ్ బాబు 'వారణాసి', ప్రభాస్ 'స్పిరిట్' సినిమాలు ఊహించని విధంగా ఒకే సమస్యలో చిక్కుకున్నాయి. వీటికి సంబంధించిన టైటిల్స్‌ని వేరే నిర్మాతలు కూడా తమ చిత్రాలకు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది. అయితే వీటి విషయంలో మూవీ టీమ్స్ ఏం నిర్ణయం తీసుకుంటారోనని అంతా అనుకున్నారు. అయితే 'వారణాసి' టైటిల్ వివాదం ముగిసింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి నాగదుర్గ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)
ఇదివరకే 'వారణాసి' టైటిల్‌ని రిజిస్ట్రేషన్ చేయించుకున్న నిర్మాత సుబ్బారెడ్డి.. ఈ పేరుపై హక్కులు తనకే ఉన్నప్పటికీ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా రాజమౌళి-మహేశ్ ప్రాజెక్టుకి ఇచ్చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తన అభిమాన హీరో మహేశ్ బాబు చిత్రానికి టైటిల్ ఇవ్వడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగు దర్శకుల సంఘం మాజీ అధ్యక్షుడు వీరశంకర్, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ సమక్షంలో 'వారణాసి' సినిమా టైటిల్‌కి సంబంధించిన పత్రాల్ని నిర్మాత కె.ఎల్.నారాయణకు సుబ్బారెడ్డి ఇటీవల అందజేశారు.
అయితే ఈ చిత్ర టైటిల్ వివాదం ముగిసింది గానీ 'స్పిరిట్' విషయంలో సందిగ్ధం కొనసాగుతోంది. తెలుగులోనే ఇదే పేరుతో ఓ చిన్న సినిమాని కూడా తీశారు. అయితే తమకు నోటీసులు పంపించారని సదరు చిన్న నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మరి 'స్పిరిట్' టైటిల్ వివాదం ఎప్పుడు ముగుస్తుందో?
(ఇదీ చదవండి: ఏడాది కష్టపడ్డా.. 'జన నాయగన్'లో నా సీన్ తీసేశారు: తమిళ నటి)


