ప్రియాంక చోప్రా బర్త్‌డే(జులై 18) సందర్భంగా ఆమె అభిమానులకు రాజమౌళి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా సడెన్‌గా ‘వారణాసి’ చిత్రం నుంచి ప్రియాంక చోప్రా లుక్ రిలీజ్ చేశాడు. ఈ చిత్రంలో ఆమె మందానికి పాత్రలో సందడి చేయనున్నారు. ‘ఆమె నవ్వితే అందం.. నవ్వకపోతే నిప్పు కణిక’ అనే క్యాప్షన్‌తో ఆమె ఫోటోలను ఎక్స్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వారణాసి విషయానికొస్తే.. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ అండ్ మైథాలజీ మూవీ ఇది. ఈ చిత్రంలో మహేశ్.. రుద్ర, శ్రీరాముడుగా రెండు పాత్రల్లో నటిస్తున్నాడు. మందాకిని పాత్రలో ప్రియాంకా చోప్రా , కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ చిత్రం రిలీజ్ కానుంది.
Grace when she smiles.
Fire when she doesn’t.
Mandakini… @PriyankaChopra in #Varanasi pic.twitter.com/4lYerYbm4Q— rajamouli ss (@ssrajamouli) July 18, 2026


