జానీ మాస్టర్‌పై ఫిల్మ్‌ ఫెడరేషన్‌ సంచలన నిర్ణయం | Film Federation Sensational Decision On Jani Master Over Alleged Union Rule Violation, Announces Non-Cooperation Against Him | Sakshi
Sakshi News home page

జానీ మాస్టర్‌పై ఫిల్మ్‌ ఫెడరేషన్‌ సంచలన నిర్ణయం

Jul 18 2026 9:22 AM | Updated on Jul 18 2026 10:07 AM

Film Federation Sensational Decision On Jani Master

కొరియోగ్రాఫర్‌ జానీపై ఫిల్మ్‌ ఫెడరేషన్‌ సంచనల నిర్ణయం తీసుకుంది. ఫెడరేషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో ఆయనకు సహాయ నిరాకరణ ప్రకటించింది. ఇకపై జానీ మాస్టర్‌ దేశ వ్యాప్తంగా ఏ సినిమాకు వర్క్‌ చేసినా.. మిగతా 23 క్రాప్ట్‌లు సహకరించబోవని తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని నిర్మాతలకు తెలియజేయనుంది. యూనియన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

జానీ మాస్టర్‌ తన భార్య పదవిని అడ్డుపెట్టుకొని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫెడరేషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఈ నెల 12న జానీ చేసిన వ్యాఖ్యలు, సభ్యులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన తీరు, సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడంపై మండిపడింది. ఈ నెల 14న విచారణకు పిలిచినా హాజరు కాలేదని, ఇందుకు సంబంధించి 7 రోజుల్లోగా లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది.  ఇచ్చిన గడువు లోగా వివరణ ఇవ్వకపోతే శాశ్వత బహిష్కరణ తప్పదని ఫెడరేషన్‌ హెచ్చరించింది. 

ఒకవేళ ఫెడరేషన్ ప్రకటించిన సహాయ నిరాకరణ అమల్లోకి వస్తే.. జానీ మాస్టర్‌తో సినిమా చేయాలనుకునే నిర్మాతలు, దర్శకులకు ఇది పెద్ద అడ్డంకిగా మారనుంది. అతనితో పని చేసే దర్శక నిర్మాతలకు ఇబ్బందులు ఎదరయ్యే అవకాశం ఉంటుంది. మరి జానీ మాస్టర్‌ వివరణ ఇస్తాడో లేదో చూడాలి. ఒకవేళ వివరణ ఇచ్చినా.. ఫెడరేషన్ ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement