సీజేపీ ప్రొటెస్ట్‌లో విద్యార్థినులపై పోలీసుల అసభ్య వైఖరి : నెట్టింట దుమారం | Delhi Polices assault on a female student At cjp rally video goes viral | Sakshi
Sakshi News home page

సీజేపీ ప్రొటెస్ట్‌లో విద్యార్థినులపై పోలీసుల అసభ్య వైఖరి : నెట్టింట దుమారం

Jul 21 2026 5:14 PM | Updated on Jul 21 2026 6:04 PM

Delhi Polices assault on a female student  At cjp rally video goes viral

నీట్‌ పేపర్‌ లీక్‌, విద్యాశాఖమంత్రి ధర్మేంద్రప్రధాన్‌ రాజీనామా, ఆత్మహతల్యకు పాల్పడ్డ  నీట్‌ విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్ట పరిహారంలాంటి డిమాండ్స్‌లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ‘సంసద్ చలో’ మార్చ్‌ (పార్లమెంట్ మార్చ్‌) సందర్భంగా పోలీసులు  ఉద్యమ కారులపై విరుచుకుపడ్డారు. 

శాంతియుతంగా ఆందోళన   చేస్తున్న విద్యార్థులపై స్వయంగా పోలీసులే రాళ్లు రువ్వడం, లాఠీలతో విరుచుకుపడటం లాంటి ఘటనలకు సంబంధించిన వీడియో సోషల్‌  మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని రగిలించాయి.  

ముఖ్యంగా మహిళా నిరసనకారులు, విద్యార్థినుల, పోలీసుల వైఖరి, ప్రవర్తించిన తీరు  తీవ్ర విమర్శలకు తావిచ్చింది. మహిళలు, విద్యార్థినుపై పోలీసులు వారిపై అమానుషంగా ప్రవర్తించారని ప్రతిపక్షాలు, ఉద్యమకారులు ఆరోపణలు చేశారు. కొంతమంది విద్యార్థినుల ప్రైవేట్‌ పార్ట్స్‌పై  కావాలనే దాడిచేశారని  సోషల్‌ మీడియాలో దుమారం రేగింది. ఇదేనా బేటీ బచావ్‌ అంటూ పలువురు మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోపై దేశవ్యాప్తంగా మహిళల భద్రత మరియు ప్రజాస్వామ్య హక్కులపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. బాధ్యులపై పోలీసు  అధికారులపై కఠిన చర్యలుతీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేశారు.

నిరసనకారులను, విద్యార్థినులను పోలీసులు బలవంతంగా లాగి, వాహనాల్లోకి ఎక్కించే క్రమంలో పలువురు మహిళల దుస్తులు చిరిగిపోయాయని సమాజ్వాదీ పార్టీ ఎంపీ డింపుల్‌ యాదవ్, CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు. అనుమతి లేకుండా మార్చ్ నిర్వహిస్తున్నారనే నెపంతో పోలీసులు శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారని, బాష్పవాయువు ప్రయోగించి బాలికలపై తీవ్రంగా విరుచుకుపడ్డారని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్బంధంలో ఉన్న సమయంలో కొందరు పోలీసు అధికారులు మహిళలను తీవ్రమైన అసభ్య పదజాలంతో దూషించారని ఒక మహిళా ఉద్యమకారిణి ఆరోపించింది.

 

ఇదీ చదవండి: ఉద్యోగిని పెర్‌ఫామెన్స్‌ బాలేదని పెయిడ్‌ లీవ్‌ : కంపెనీకి భారీ క్రేజ్‌

అయితే ఈ ఆరోపణలపై పోలీసులు వివరణ ఇచ్చారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నందున ఢిల్లీ పరిసరాల్లో ఆంక్షలు ఉన్నాయని, నిరసనకారులు అనుమతి లేకుండా పార్లమెంట్ వైపు దూసుకుపోవడానికి ప్రయత్నించారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. నిరసనకారులలో కొందరు పోలీసులపైకి రాళ్లు రువ్వారని, ఆ క్రమంలో గుంపును చెదరగొట్టడానికి కనీస బలప్రయోగాన్ని మాత్రమే ఉపయోగించామని స్పష్టం చేశారు. నెట్టివేతలు, బారికేడ్ల పైనుంచి పడిపోవడం మరియు తొక్కిసలాట లాంటి పరిస్థితుల వల్లే నిరసనకారులకు గాయాలయ్యాయని, కావాలని ఎవరిపై దాడి చేయలేదని పోలీసులు అధికారికంగా ప్రకటించారు. 
ఇదీ చదవండి: ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్‌ కారు కావాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement