ఓటీటీకి మలయాళ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Malayalam Film Chinna Chinna Aasai Movie OTT Release Date Confirmed, Check Out Streaming Platform Details Inside | Sakshi
Sakshi News home page

Chinna Chinna Aasai OTT: ఓటీటీకి మలయాళ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Jul 17 2026 10:12 PM | Updated on Jul 18 2026 10:49 AM

Malayalam film Chinna Chinna Aasai movie ott streaming date locked

ఓటీటీల్లో మలయాళ సినిమాలకు ప్రత్యేక డిమాండ్ ఉంటోంది. ఈ చిత్రాలకు ఇతర భాషల్లో ఆడియన్స్‌ ఎక్కువగా ఆదరిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే సరికొత్త కంటెంట్‌ సినిమాలు వస్తూనే ఉన్నాయి. మలయాళంలో హిట్‌ మూవీస్‌ తెలుగులోనూ ఆదరణ దక్కించుకుంటున్నాయి. తాజాగా మరో మలయాళ సినిమా ఓటీటీకి వచ్చేస్తోంది.

ఈ ఏడాది మలయాళంలో రిలీజైన చిన్న చిన్న ఆసై ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు చేశారు. ఈనెల 28 నుంచి జియో హాట్‌స్టార్ వేదికగా అందుబాటులోకి రానుంది. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి వర్ష వాసుదేవ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ఇంద్రన్స్, మధు, అపర్ణ బాలమురళి, జాఫర్ సాదిక్, విష్ణు అగస్త్య కీలక పాత్రల్లో నటించారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement