మరింత ముదురుతున్న 'జానీ మాస్టర్‌' డాన్సర్ అసోసియేషన్ వివాదం | Jani Master: Dancer Association controversy is getting worse | Sakshi
Sakshi News home page

మరింత ముదురుతున్న 'జానీ మాస్టర్‌' డాన్సర్ అసోసియేషన్ వివాదం

Jul 17 2026 11:45 PM | Updated on Jul 17 2026 11:56 PM

Jani Master: Dancer Association controversy is getting worse

డాన్సర్స్ అసోసియేషన్ – ఫెడరేషన్ మధ్య జరుగుతున్న వివాదం మరింత ముదురుతోంది. శుక్రవారం మధ్యాహ్నం ఫెడరేషన్ జానీ మాస్టర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దాంతో సాయంత్రం జానీ మాస్టర్‌ ఫెడరేషన్ నాయకులపై నిర్మాతలకు ఫిర్యాదు చేశారు. ఫిలిం ఛాంబర్‌లోని పెద్దలను కలిసిన జానీ మాస్టర్ యూనియన్‌లో అవినీతి చేసే వారిపై చర్యలు తీసుకుంటే ఫెడరేషన్ అడ్డుపడుతోందని ఆరోపించారు. అంతేకాక సస్పెండ్ చేసిన సభ్యులను తిరిగి తీసుకోవాలని ఫెడరేషన్ వారిపై ఒత్తిడి తెస్తోందని, నిర్మాతలను మోసం చేస్తున్న వారిపై ప్రెసిడెంట్ సుమలత చర్యలు తీసుకుంటే ఆమెను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఫెడరేషన్ పెద్దలు ఆమెపై లింగభేదం చూపుతున్నారని కూడా ఆయన ఆరోపించారు.

జానీ  మాస్టర్ భార్య, ప్రెసిడెంట్ సుమలత కూడా నిర్మాతలతో సమావేశమైయ్యారు. ఫెడరేషన్ జోక్యం లేకుండా చూడాలని కోరారు. తప్పు చేసిన సభ్యుల ఆధారాలను ఛాంబర్ పెద్దలకు అందజేశాం. అవినీతి చేస్తున్న వారిని శిక్షించి వారికి సహకరిస్తున్న ఫెడరేషన్ పెద్దలను మందలించాలని విజ్ఞప్తి చేశారు. డాన్సర్స్ అసోసియేషన్‌లో కొంతమంది సభ్యులు నిర్మాతలను మోసం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఫెడరేషన్ మాత్రం వారిని కాపాడుతోందని డాన్సర్స్ అసోసియేషన్ నాయకత్వం ఆరోపిస్తోంది. ఈ వివాదం ఫిలిం ఛాంబర్ వరకు చేరింది. ఇప్పుడు ఫెడరేషన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement