కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బిగ్‌ షాక్ | Film Federation Gives notices to choreographer Jani Master | Sakshi
Sakshi News home page

Jani Master: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బిగ్‌ షాక్

Jul 17 2026 7:59 PM | Updated on Jul 17 2026 8:46 PM

Film Federation Gives notices to choreographer Jani Master

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్‌కు ఫిల్మ్ ఫెడరేషన్‌  షాకిచ్చింది. ఇటీవల తలెత్తిన వివాదంపై ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫెడరేషన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపించింది. ఈనెల 12న చేసిన కామెంట్స్‌పై ఫెడరేషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 14 న విచారణకు పిలిచిన హాజరు కాలేదని మండిపడింది.

ఈ నేపథ్యంలోనే జానీ మాస్టర్‌కు షోకాజ్ నోటీసులిచ్చింది. 7 రోజుల్లోగా లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని జాను మాస్టర్‌ను ఆదేశించింది. బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఫెడరేషన్ హెచ్చరించింది. జానీ మాస్టర్‌కు ఫెడరేషన్ తరపున సహాయ నిరాకరణ అమలు చేయాలని నిర్ణయించింది.

సుమలత తీరుపై ఆగ్రహం..

డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత తీరుపై ఫెడరేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జనరల్ బాడీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని ఆమెకు సూచించింది.  డాన్సర్స్ ఉపాధికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపింది.  ఫెడరేషన్ తీసుకోబోయే తదుపరి నిర్ణయం వరకు సహాయ నిరాకరణ కొనసాగుతుందని ఫెడరేషన్ ప్రకటించింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement