రూ. 6.5 కోట్లు, 44 ఏళ్లకే ఉద్యోగానికి గుడ్‌బై : టెక్కీ ఫైర్ జర్నీ తెలిస్తే | 44 year old techie retires from corporate life after building Rs 6 crore portfolio | Sakshi
Sakshi News home page

రూ. 6.5 కోట్లు, 44 ఏళ్లకే ఉద్యోగానికి గుడ్‌బై : టెక్కీ ఫైర్ జర్నీ తెలిస్తే

Jul 17 2026 5:25 PM | Updated on Jul 17 2026 6:08 PM

 44 year old techie retires from corporate life after building Rs 6 crore portfolio

ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన 20 ఏళ్ల  సక్సెస్‌ఫుల్‌   స్టార్టప్ కెరీర్‌కు స్వస్తి పలికారు. ఎందుకో తెలుసా? టెక్నాలజీపై ఆసక్తి లేకా? లేక పని  ఒత్తిడి కారణంగానా?  ఈ వివరాలు తెలియాలంటే  రెడ్డిట్ (Reddit) పోస్ట్‌లో 44 ఏళ్ల టెకీ పంచుకున్న వివరాలు గురించి తెలుసుకోవాలి. "మై ఫైర్ జర్నీ: వాకింగ్ అవే ఎట్ 44" అనే పేరుతో ఉన్న ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈయను భార్య, 11 ఏళ్ల కుమారుడు ఉన్నారు. యూజీ, పీజీ, ఇంజనీరింగ్ టియర్-1 కాలేజీలో చదుకున్నారు. ఆ తరువాత చాలాకాలం స్టార్టప్‌లలో పనిచేశారు. కానీ ఏళ్ల తరబడి ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల డబ్బు కంటే ఎంతో విలువైన దాన్ని దూరం చేశాననే భావనతో ఉద్యోగానికి గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. అయితే దీనివెనుక పెద్ద ప్రణాళిక, ఆర్థిక విజయం ఉండటం విశేషం.

స్టార్టప్ ప్రపంచంలో గడిపిన దాదాపు రెండు దశాబ్దాలను వెనక్కి తిరిగి చూసుకున్నారట. దీంతో స్టార్టప్‌లో వారానికి 6 రోజులు, రోజుకు 14 గంటల చొప్పున పనిచేయాల్సి రావడం, ఆఫీస్ రాజకీయాలతో  మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఫలితంగా సరిగ్గా నిద్రలేక బోర్డర్ లైన్ డయాబెటిస్, అధిక రక్తపోటు (High BP),భారీ పొట్ట పలకరించడంతో  ఆందోళన మొదలైంది. 2023లో తన ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకున్న తర్వాత ఆయనకు 'ఫైర్' (FIRE - Financial Independence, Retire Early) ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనకు ఆయన అప్పటికే పెట్టుబడులు, వాటి ఫలితాలు ఊతమిచ్చాయి.

2018 నుండి ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాతో SIP లలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. 2019లో ఆయన పనిచేస్తున్న స్టార్టప్‌ను వేరొక సంస్థ కొనుగోలు చేయడంతో రూ. 1.4 కోట్ల (ESOP) డబ్బు వచ్చింది. దాన్ని ఖర్చు చేయకుండా మళ్లీ ఇన్వెస్ట్ చేశారు. అలా 2026 ఏప్రిల్ నాటికి ఆయన ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియో రూ. 6.5 కోట్లకు చేరింది. ఇందులో 60శాతం ఈక్విటీలలో, మిగిలిన 40 శాతం  డెట్ ఫండ్స్, లిక్విడ్ ఇన్వెస్ట్‌మెంట్స్, పీఎఫ్ లలో ఉంది.

సొంత ఇల్లు ఉంది. కుటుంబ వార్షిక ఖర్చులు దాదాపు రూ. 14 లక్షలు. ఇక కొడుకు ఉన్నత చదువుల ఖర్చును తాతయ్యగారే చూసుకుంటామని చెప్పడంతో భవిష్యత్తు భారం తగ్గింది.

ఇదీ చదవండి: మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్‌

‘‘పక్కా లెక్కలున్నాయి,సరిపడా డబ్బు ఉంది. అందుకే ఉద్యోగం మానేశాను. ఇంజనీరింగ్ నుండి రిటైర్ అవ్వలేదు, కేవలం పని ఒత్తిడి (Burnout) నుండి మాత్రమే రిటైర్ అయ్యాను,"  అంటారాయన.

రిటైర్మెంట్ తరువాత ఆరోగ్యం
ఉద్యోగం మానేసిన మూడు నెలల్లోనే బరువు తగ్గారు, బీపీ అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం ఆయన ధ్యానం, వ్యాయామం చేస్తూ, కుటుంబంతో గడుపుతున్నారు. అలాగే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs) పై పరిశోధన చేస్తూ, ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్‌లకు సహకరిస్తున్నారు.

ఈ వయస్సులోనే రూ. 6.5 కోట్ల భారీ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోతో, వచ్చే రాబడితో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితాంతం సంతోషంగా అనుభవించ వచ్చని ఆయన నిరూపించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ముఖ్యమైన సూత్రాలు పంచుకున్నారు.

  • కెరీర్ ప్రారంభంలోనే రిటైర్మెంట్‌కు ఎంత డబ్బు కావాలో (FIRE Target) లెక్క వేసుకోండి.

  •  తన కెరీర్‌లో ఎప్పుడూ జీతం గురించి నెగోషియేట్ చేయలేదు, దీనివల్ల కోట్ల రూపాయలు నష్టపోయాను.

  • సొంత ఇల్లు ఉండటం వల్ల అద్దె భారం తగ్గి, రిటైర్మెంట్‌కు కావాల్సిన మొత్తం (Corpus) తగ్గింది.

  • లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లేషన్‌ అంటే  విలాసాలకు దూరంగా ఉంటూ ఖర్చులను అదుపులో పెట్టుకోవడం వల్ల పెట్టుబడి పెట్టడం సులువైంది.

భవిష్యత్తులో ఏదైనా మంచి అవకాశం వస్తే మళ్లీ పనిచేసే ఆలోచన ఉందని, ప్రస్తుతం మాత్రం తన జీవితాన్ని తన నిబంధనల ప్రకారమే గడుపుతున్నానని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
 

ఇదీ చదవండి: అమెరికా యుద్ధ విమానాల్ని కూల్చేశాం, భారీ నష్టం : ఇరాన్ ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement