ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’! | NDA Weekly Parliamentary Meeting Gets New Name Mangal Milan Ahead Of Monsoon Session, Focus Shifts To Key Legislative Agenda | Sakshi
Sakshi News home page

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

Jul 17 2026 3:22 PM | Updated on Jul 17 2026 3:38 PM

The name of the NDA Parliamentary Party meeting changed

న్యూఢిల్లీ: ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి కొత్తగా మంగళ్ మిలన్ అని పేరు మార్చారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో సాధారణంగా మంగళవారాల్లో జరిగే ఈ ఎన్డీఏ కూటమి ఎంపీల వ్యూహాత్మక భేటీని ఇకపై మంగళ్ మిలన్‌గా పిలవాలని నిర్ణయించారు. ఈ మేరకు పేరు మార్పు నిర్ణయాన్ని నేడు(శుక్రవారం, జూలై 17వ తేదీ) అధికారికంగా ప్రకటించారు. 

రాబోయే సమావేశం: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జూలై 21, ఉదయం 9:30 గంటలకు పార్లమెంట్ హౌస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ "మంగళ్ మిలన్" మొదటి సమావేశం జరగనుంది.

కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభం కానున్నాయి.  దీనిలో భాగంగా బీజేపీ తన 'మిషన్ 360' ప్రయత్నాలను వేగవంతం చేసింది. నరేంద్ర మోదీ సర్కార్ మహిళలకు రిజర్వేషన్, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లును మళ్లీ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. 

ఈ రెండు అంశాలను ఒకదానితో ఒకటి అనుసంధానించాలనే ఆలోచనలో ఉంది. ఏప్రిల్‌లో జరిగిన 3 రోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లుకు అవసరమైన రెండు వంతుల మెజారిటీ లభించలేదు. దీంతో మరోసారి ప్రయత్నించే ముందు మద్దతు పెంచుకునే చర్యలను ఎన్డీఏ ముమ్మరం చేసింది.

ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిస్థితులు ఈ సారి సర్కార్‌కు అనుకూలంగా ఉండొచ్చని బీజేపీ భావిస్తోంది. పార్లమెంట్‌లో తన బలాన్ని పెంచుకునే లక్ష్యంతో అధికార పార్టీ విస్తృత స్థాయిలో సంప్రదింపులు చేపట్టింది. మరోవైపు కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా సమావేశాలకు ముందు చర్చలు వేగవంతం చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement