నార్త్ కరోలినా (North Carolina)లో సూ రౌలీ ఇన్‌సోమ్నియా బాధపడుతోంది. అలా నిద్రపట్టని ఒక రాత్రి ఆమెకు ఏకంగా రూ. 1.4 కోట్ల జాక్‌పాట్ తెచ్చిపెట్టింది. కేవలం కాలక్షేపం కోసం ఆడిన ఆన్‌లైన్ లాటరీ గేమ్ ఆమెకు భారీ బహుమతిని అందించింది. మోరెస్విల్లే నివాసి అయిన సూ రౌలీ (Sue Rowley) జూలై 8 రాత్రి నిద్ర రాకపోవడంతో సమయం గడపడానికి స్మార్ట్‌ఫోన్‌లో ఆన్‌లైన్ లాటరీ గేమ్ ఆడటం ప్రారంభించింది. అలా కొత్తగా వచ్చిన 'టంబ్లింగ్ ట్రెజర్స్' (Tumbling Treasures) అనే గేమ్‌లో రౌలీ 30 డాలర్లు పెట్టి ఆడింది. కానీ ఆమెకు అనుకోని అదృష్టం కలిసి వస్తుందని అస్సలు ఊహించలేదు. లాటరీ అధికారుల ప్రకారం, ఈ గేమ్‌లో ఇంత పెద్ద బహుమతి గెలుచుకునే అవకాశం 20 లక్షలమందిలో ఒకరికి మాత్రమే ఉంటుందట.
తెరపై అంత పెద్ద మొత్తాన్ని చూసినప్పుడు మొదట నమ్మలేకపోయానని రౌలీ చెప్పింది. అర్థరాత్రి నిద్ర రాక, ఊరికే అలా ఫోన్‌తో ఆడుకుంటూ ఉండగా వరించిన అదృష్టమని తెలిపింది. ముందు అస్సలు నమ్మలేకపోయాను అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. సోమవారం (జూలై 13) రాలీలోని లాటరీ ప్రధాన కార్యాలయంలో తన బహుమతి మొత్తాన్ని అందుకుంది. నిద్రలేమిని కాస్తా అదృష్టంగా మార్చుకున్న రౌలీ, ఈ డబ్బుతో తన ఇంటిని రిపేర్/రినోవేషన్ చేయించు కోవాలని ప్లాన్ చేస్తోంది.
గతంలో బౌద్ధ సన్యాసికి
గత నెలలో 73 ఏళ్ల బౌద్ధ సన్యాసి, బ్యాంక్ లక్కీ డ్రాలో గెలిచి రాత్రికి రాత్రే మిలియనీర్ అయ్యారు. పూర్వం ఫ్యాక్టరీ కార్మికుడిగా పనిచేసి,ప్రస్తుతం ఆశ్రమంలో ఉంటున్న చాన్ చాయ్ సియాంగ్ సుమారు రూ. 2.28 కోట్లు గెలుచుకున్నారు.
ఇదీ చదవండి: డొనాల్డ్ ట్రంప్‌ను హతమారిస్తే. రూ. 96 కోట్లు


