మన దగ్గర లాటరీ కల్చర్ తక్కువగానీ కేరళలో లాటరీ టికెట్స్ కొనడం లాంటివి చాలా సాధారణమైన విషయం. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు లాటరీ టికెట్స్ కొనుగోలు చేస్తూ, అప్పుడప్పుడు బహుమతులు, నగదు గెలుచుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా నటుడు బాల.. సరదాగా లాటరీ టికెట్స్ కొంటే అదృష్టం వరించింది. అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
(ఇదీ చదవండి: 'ఇడుపు కాయితం' అంటే ఏంటి? తెలంగాణ vs ఆంధ్రా)
'మంచి ఆలోచనలో ఉంటే మంచి విషయాలే జరుగుతాయి. మా ఫాంహౌస్ నుంచి ఎర్నాకుళం వస్తుండగా ఓ వృద్ధుడు లాటరీ టికెట్స్ అమ్ముతూ కనిపించారు. ఆయనకు సాయం చేయాలనే ఉద్దేశంతో నాలుగు టికెట్స్ కొన్నాను. లాటరీ గెలవాలనే ఆశతో ఈ టికెట్స్ కొనలేదు. మీకు సాయం చేయడానికే కొంటున్నాను అని ఆయనతో చెప్పాను. ఆ వయసులోనూ ఆయన కష్టపడుతుండటం చూసి నేను టికెట్స్ కొన్నా. కానీ నేను కొన్న నాలుగు టికెట్స్‌కి గిఫ్ట్స్ రావడం ఎంతో ఆనందంగా ఉంది. మీరు తప్పకుండా లాటరీ గెలుస్తారని ఆ తాత నాతో చెప్పిన మాట నిజమైంది. ఇది పెద్ద మొత్తం కాకపోవచ్చు కానీ భగవంతుడి అనుగ్రహం ఉంటేనే లాటరీ గెలవగలం' అని బాల చెప్పుకొచ్చాడు.
అయితే బాల దంపతులు లాటరీ గెలవడం కొత్తేం కాదు. గతేడాది 'కారుణ్య లాటరీ'లో ఈ నటుడి భార్య రూ.25 వేలు గెలుచుకుంది. 'భాగ్యలత లాటరీ'లోనూ మరో రూ.100 గెలుచుకుంది. ఇప్పుడు బాల కూడా లాటరీలో బహుమతులు గెలుచుకోవడం చూస్తుంటే వీళ్లకు అదృష్టం రాసిపెట్టినట్లు ఉంది.
(ఇదీ చదవండి: విజయ్.. నెలకు 20 రోజులు మాత్రమే)


