'ఇడుపు కాయితం' అంటే ఏంటి? సోషల్ మీడియాలో తెలంగాణ vs ఆంధ్రా | Iduppu Kayitham Meaning In Telugu And New Movie Details | Sakshi
Sakshi News home page

Iduppu Kayitham Meaning: టైటిల్ తెచ్చిన తంట.. ఎందుకింత చర్చ?

Jun 26 2026 5:59 PM | Updated on Jun 26 2026 6:24 PM

Iduppu Kayitham Meaning In Telugu And New Movie Details

యూట్యూబ్ సెన్సేషన్ నాగదుర్గ.. హీరోయిన్‌గా చేస్తున్న లేటెస్ట్ తెలుగు సినిమా 'ఇడుపు కాయితం'. ప్రియదర్శి హీరోగా నటిస్తుండగా వంశీరెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాయి. బన్నీవాసు, సుకుమార్ రైటింగ్స్ పతాకంపై కలిసి నిర్మిస్తున్నారు. అయితే అసలు 'ఇడుపు కాయితం' అంటే ఏంటి అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రా, తెలంగాణ నెటిజన్ల మధ్య వార్ నడుస్తోంది.

(ఇదీ చదవండి: జైలులో హీరో దర్శన్.. కారు యాక్సిడెంట్ వివాదంలో కొడుకు)

'ఇడుపు కాయితం' అనేది పక్కా తెలంగాణ గ్రామీణ పదం కావడంతో ఆంధ్రాతో పాటు హైదరాబాద్‌లో నివసిస్తున్న చాలామందికి దీని అర్థమేంటి అనేది తెలియడం లేదు. ఇడుపు కాయితం అంటే విడాకుల పత్రం. భార్యభర్తలు విడిపోవడానికి పెద్దల సమక్షంలో కుదుర్చుకున్న ఒప్పంద పత్రాన్ని ఇలా పిలుస్తారు. ఇప్పుడంటే విడాకుల కోసం కోర్టులకు వెళ్తున్నారు. డివోర్స్ అని ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు.

కానీ కొన్నాళ్ల క్రితం కలిసి బతకలేం అని నిర్ణయించుకున్న దంపతులు.. పెద్ద మనుషుల సమక్షంలో విడిపోవడానికి ఒప్పందం చేసుకునేవాళ్లు. దీన్ని ఇడుపు కాయితం అని పిలిచేవాళ్లు. హైదరాబాద్ లాంటి నగరాల్లో దీన్ని పెద్దగా ఉపయోగించట్లేదు గానీ తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఇడుపు కాయితం రాసుకుని విడిపోతున్న జంటలు ఉన్నాయి. ఇడుపు, ఇడుసు అంటే వదిలిపెట్టడం. ఇడుపు కాయితం అంటే విడిపోయేటప్పుడు రాసుకునే అగ్రిమెంట్.

అయితే ఈ పదం అంటే ఏంటో తెలియని కొందరు ఆంధ్రా నెటిజన్లు.. ఈ సినిమా తెలుగులో డబ్బింగ్ చేస్తారా అని ఫన్నీ పోస్టులు పెట్టడంతో తెలంగాణకు చెందిన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ చిన్న సినిమా టైటిల్ గురించి పెద్ద చర్చే నడుస్తోంది.  ఓ రకంగా చెప్పాలంటే మూవీ టీమ్‌కి ఇది ప్లస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే షూటింగ్ మొదలవకముందే మూవీ గురించి నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారుగా మరి!

(ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ మిస్టరీ థ్రిల్లర్.. గొర్రెలు డిటెక్టివ్స్ అయితే? తెలుగు రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement