జైలులో హీరో దర్శన్.. కారు యాక్సిడెంట్ వివాదంలో కొడుకు | Actor Darshan’s Son Vinish Accident Rumours, Family Issues Clarification And Denies Driving Claims, Check Out Statement | Sakshi
Sakshi News home page

Darshan Son: కారు ప్రమాదంపై క్లారిటీ ఇచ్చిన దర్శన్ భార్య

Jun 26 2026 3:40 PM | Updated on Jun 26 2026 4:23 PM

Actor Darshan Son Latest Issue And Clarification

అభిమానిని హత్య చేసిన కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ గత కొన్నేళ్లుగా జైలులో ఉన్నాడు. ఇప్పట్లో బెయిల్ వచ్చేలా కనిపించడం లేదు. మరోవైపు ఇతడి కొడుకు వినీష్.. ఓ రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడని కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. వినీష్‌కి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలోనూ చేర్పించారనే న్యూస్ వచ్చింది.

(ఇదీ చదవండి: నన్ను ‘బిగ్‌బాస్‌’లోకి తీసుకోండి.. ఎస్సై విజ్ఞప్తి, వీడియో వైరల్‌)

బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్ రోడ్డుపై వెళ్తున్న ఫోర్డ్ ఎండీవర్ లగ్జరీ కారు.. ఓ బైకుని వెనుక నుంచి ఢీకొట్టింది. అనంతరం స్థానికులకు, కారులో ఉన్నవారికి మధ్య గొడవ జరిగిందని, ఆ కారు దర్శన్ కుమారుడు వినీష్‌దే అంటూ వీడియోలు వైరల్ అయ్యాయి. వినీష్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ వచ్చారు. వీటిపై దర్శన్ భార్య విజయలక్ష్మి క్లారిటీ ఇచ్చారు. ఓ నోట్ విడుదల చేశారు.

'వినీష్ రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారంటూ కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. వినీష్ క్షేమంగానే ఉన్నాడు. ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగినప్పుడు వినీష్ కారు డ్రైవింగ్ చేయలేదు.డ్రైవర్‌ కారు నడుపుతున్నాడు. బెంగళూరు ట్రాఫిక్‌లో సాధారణంగా జరిగే చిన్నపాటి రోడ్డు ప్రమాదమే ఇది. బైకర్ వల్లే తప్పిదం జరిగింది. వాళ్లు తమ తప్పుని అంగీకరించి క్షమాపణ కూడా చెప్పారు'

'ప్రమాదం జరిగిన తర్వాత బైక్‌పై ఉన్నవాళ్లు క్షేమంగా ఉన్నారా అని తెలుసుకునేందుకు మాత్రమే వినీష్.. కారు నుంచి బయటకు వచ్చాడు. ఆ విషయాన్ని కొందరు నెగిటివ్‌గా చూపిస్తూ పుకార్లు సృష్టించారు. మా కుటుంబం ఇప్పటికే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇలాంటి టైంలో నిజాలు కాని ఈ వార్తలు మాకు మరింత ఆందోళన పెంచుతున్నాయి. నిజాలు తెలుసుకున్న తర్వాతే న్యూస్ టెలికాస్ట్ చేయాలని, ప్రజలు కూడా ఇలాంటి రూమర్స్ నమ్మకుండా, షేర్ చేయొద్దు' అని విజయలక్ష్మి పేర్కొన్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ డార్క్ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement