మైక్ విసిరేసిన సీఎం డీకే శివకుమార్! | DK Shivakumar Angry On Darshan Fans: Karnataka CM Throws Mic At Event | Sakshi
Sakshi News home page

ప్రసంగం మధ్యలోనే మైక్ విసిరేసిన సీఎం డీకే శివకుమార్!

Aug 6 2026 2:06 PM | Updated on Aug 6 2026 2:09 PM

CM DK Shiva Kumar Fire On Darshan Fans

బెంగళూరు: ప్రముఖ నటుడు, హత్య కేసులో జైలుపాలైన దర్శన్‌ ఫ్యాన్స్‌పై సీఎం డీకే శివకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఏకంగా మైకు విసిరారు. అసలేం జరిగిందంటే... రామనగరలో ప్రసిద్ధ శ్రీచాముడేశ్వరి కరగ మహోత్సవం ఏర్పాటు చేశారు. సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మైకు తీసుకుని మాట్లాడడం ప్రారంభించగా దర్శన్‌ అభిమానులు ది బాస్, ది బాస్‌ అంటూ నినాదాలు చేయసాగారు.

 మౌనంగా ఉండండి అని ఎంత చెప్పినా వినకపోవడంతో సీఎంకు కోపం ముంచుకొచ్చి మైకు పడేసి మాట్లాడడం నిలిపివేశారు. ఎమ్మెల్యే ఇక్బాల్‌ హుసేన్‌ కూడా వారి పట్ల అసహనం వ్యక్తం చేశారు. తరువాత మాట్లాడిన సీఎం డీకే.. మీ అభిమానాన్ని నేను గౌరవిస్తాను, ఇది భక్తి కార్యక్రమం, కోర్టులో ఉన్న విషయాలను ఇక్కడ మాట్లాడలేను, అందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తున్నాను అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement