ఎవరికి ఏ శాఖ ఇవ్వాలి? | Karnataka Cabinet Portfolio Allocation: CM DK Shivakumar Consults Congress High Command | Sakshi
Sakshi News home page

ఎవరికి ఏ శాఖ ఇవ్వాలి?

Aug 5 2026 8:04 AM | Updated on Aug 5 2026 10:00 AM

cm dk shivakumar discusses portfolios for new ministers

కర్ణాటక: కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు గురించి సీఎం డీకే శివకుమార్‌ హైకమాండ్‌తో చర్చలు జరిపారు. కొందరు మంత్రులతో వ్యక్తిగతంగా మాట్లాడారు. గతంలో సిద్దరామయ్య సర్కారులో పనిచేసిన మంత్రులకు ఇప్పుడు అవే శాఖలను కేటాయించే అవకాశముంది. పాత మంత్రులు శాఖల మార్పును వాంఛిస్తున్నారు. 

మంత్రి కే.హెచ్‌.మునియప్ప ఆహారపౌరసరఫరాల శాఖకు బదులుగా సాంఘిక సంక్షేమ శాఖ ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో వ్యవసాయ శాఖను చూసిన ఎన్‌.చెలువరాయస్వామికి అదే శాఖను ఇస్తారని తెలుస్తోంది. సిద్దు హయాంలో మంత్రులుగా ఉండి, మళ్లీ ఇప్పుడు పదవులు చేపట్టిన శివరాజ్‌ తంగడగి,  బీ.జేడ్‌ జమీర్‌ అహ్మద్‌ ఖాన్, సంతోష్‌ లాడ్, మధుబంగారప్ప, నాగేంద్ర, ఎస్‌.ఎస్‌.మల్లికార్జున్‌లకు పాత శాఖలే ఇచ్చినా ఆశ్చర్యం లేదు.  

కొత్త మంత్రులకు ఈ శాఖలు? 
కొత్తగా చేరిన రుద్రప్ప లమాణికి–ఎక్సైజ్, కే.ఎస్‌.బసవంతప్ప–పురపాలక, టీ.రఘుమూర్తి–ఎస్టీల సంక్షేమం, రిజ్వాన్‌ హర్షద్‌–ఉన్నత విద్య, పుట్టరంగశెట్టి–పశు సంవర్ధక, పట్టు, అజయ్‌సింగ్‌–చిన్న పరిశ్రమల–కే.ఎం.శివలింగేగౌడ, హెచ్‌.సీ.బాలకృష్ణ–అటవీ, పర్యావరణ,  బసవరాజరాయరెడ్డి–న్యాయ, అసెంబ్లీ వ్యవహారాలు, విజయానంద కాశప్పనవర్‌–జౌళి, లక్ష్మణ్‌ సవది–సహకార, చక్కెర శాఖలు    లభించే అవకాశముంది.      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement