ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి దక్కలేదు | Karnataka Congress Cabinet Expansion Row: Senior MLAs MY Gopalakrishna and MC Sudhakar Rebel Over Minister Posts | Sakshi
Sakshi News home page

ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి దక్కలేదు

Aug 5 2026 8:12 AM | Updated on Aug 5 2026 10:02 AM

Senior Congress MLAs Rebel Over Minister Post

సీఎం శివకుమార్‌

కర్ణాటక: కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ ఎమ్మెల్యేల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది, మా కష్టాల గురించి అడిగేవారే లేరని, అమ్మా నాన్న లేని అనాథలుగా అనిపిస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఎంవై గోపాలకృష్ణ అన్నారు. మంగళవారంనాడు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు మంత్రి పదవి దక్కకపోవడం ఆశ్చర్యంగా, అవమానంగా ఉందన్నారు. మంత్రివర్గ విస్తరణ లో అనేక లోపాలున్నాయన్నారు. నియోజకవర్గ ప్రజలు ఎక్కువగా బాధపడుతున్నారన్నారు.  

సిద్దుకు ఆప్తుడనని ఇవ్వలేదు: సుధాకర్‌ 
యశవంతపుర: తాజా మాజీ మంత్రి, చింతామణి ఎమ్మెల్యే డాక్టర్‌ ఎంసీ సుధాకర్‌ సీఎం శివకుమార్‌ను ప్రస్తావించకుండా ప్రభుత్వ ముఖ్యులు కారణమని ఎదురుదాడి చేశారు. వచ్చే రోజుల్లో గట్టి నిర్ణయం తీసుకోక తప్పదన్నారు. మంత్రి స్థానం  తప్పడంపై స్పందిస్తూ, సిద్ధరామయ్య  పనితీరును చూసి దగ్గరయ్యా, ఆ ద్వేషంతో నాకు మంత్రి పోస్టు ఇవ్వలేదని పరోక్షంగా సీఎంపై విమర్శలు చేశారు. గతంలో మంత్రులుగా ఉన్నవారికి మళ్లీ ఇచ్చారు, వారిలో ఏం చూసి ఇచ్చారో తనకు తెలియదన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement