నన్ను ‘బిగ్‌బాస్‌’లోకి తీసుకోండి.. ఎస్సై విజ్ఞప్తి, వీడియో వైరల్‌ | Bigg Boss 10: SI Nagarjuna Reddy Video Goes Viral | Sakshi
Sakshi News home page

‘బిగ్‌బాస్‌’ లో చాన్స్‌ ఇవ్వండి.. ఎస్సై విజ్ఞప్తి, వీడియో వైరల్‌

Jun 25 2026 3:26 PM | Updated on Jun 25 2026 3:40 PM

Bigg Boss 10: SI Nagarjuna Reddy Video Goes Viral

బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’ సందడి మళ్లీ మొదలైంది. ఇప్పటికే 9 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ బిగ్‌ రియాల్టీ షో 10వ సీజన్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోని ఇటీవల రిలీజ్‌ చేశారు. ఈ సారి సామాన్యులకు భారీగానే అవకాశం ఇచ్చే చాన్స్‌ ఉంది. దాదాపు 10 మంది  వరకు తీసుకుంటారని సమాచారం. దీని కోసం ‘అగ్ని పరీక్ష’ నిర్వహించనున్నారు మేకర్స్‌. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లేందుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున రిక్వెస్ట్‌లు మొదలయ్యాయి. ఈ మేరకు వీడియోలు చేసి సోషల్‌ మీడియా వేదికగా ‘బిగ్‌బాస్‌’టీమ్‌కి విజ్ఞప్తి చేస్తున్నారు. 

ఇలా విజ్ఞప్తి చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. దానికి గల కారణం.. బిగ్‌బాస్‌లోకి తీసుకోమని విజ్ఞప్తి చేసిన వ్యక్తి ఓ పోలీసు అధికారి అవ్వడమే. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలకు చెందిన ఎస్సై నాగార్జున రెడ్డి  ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ బిగ్‌బాస్‌ టీమ్‌కు విజ్ఞప్తి చేస్తున్నాడు. 

తాను ప్రస్తుతం నంద్యాల జిల్లా గడివేముల పోలీసు స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నానని,  ఒక్క అవకాశం ఇచ్చి బిగ్‌బాస్‌ షోలోకి తీసుకుంటే తన టాలెంట్ నిరూపించుకుంటానని చెబుతున్నాడు.  బిగ్ బాస్ షోను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే తన కూతుళ్లు ఇస్తున్న సపోర్టుతోనే ‘బిగ్‌బాస్’ వెళ్లాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొన్నాడు. ‘పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉంటూ నిత్యం ఎన్నో సవాళ్లను, మానసిక ఒత్తిడిని తట్టుకుని డ్యూటీ చేస్తున్నాను. నాకు గనుక బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం ఇస్తే.. అక్కడ ఉండే ఎలాంటి మైండ్ గేమ్స్ అయినా ఆడగలను, నాలోని లీడర్‌షిప్ క్వాలిటీస్ ఏంటో నిరూపించుకుని సత్తా చాటుతా అని నాగార్జున రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement