బాలీవుడ్ దర్శకురాలు నిత్య మెహ్రా ఓ యానిమేషన్ సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ హాలీవుడ్ యానిమేషన్ సినిమాను పారామౌంట్ పిక్చర్స్, జొనాథన్ గోల్డ్‌స్టైన్, జాన్ ఫ్రాన్సిస్ డేలీ, కునాల్ నయ్యర్ కలిసి నిర్మించనున్నారట. న్యూజెర్సీకి చెందిన ఇండో–అమెరికన్ టీనేజ్ అమ్మాయి అనుకోకుండా బాలీవుడ్ మ్యూజికల్ ప్రపంచంలోకి వెళ్లినప్పుడు, ఈ యంగ్ అమ్మాయికి ఎదరైన సవాళ్లు? పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని హాలీవుడ్ టాక్.
‘బార్ బార్ దేఖో’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయిన నిత్య ఆ తర్వాత ‘మేడ్ ఇన్ హెవెన్’ సిరీస్‌తో పాపులర్ అయ్యారు. ఇప్పుడు హాలీవుడ్‌లో చేయనున్న యానిమేషన్ మూవీపై ఫోకస్ పెట్టారు.


