నటికి చేదు అనుభవం.. లేడీ ఫ్యాన్ అత్యుత్సాహం | Nikita Rawal Gets Unexpected Kiss From Female Fan, Viral Video Sparks Buzz In Social Media | Sakshi
Sakshi News home page

Nikita Rawal: నటికి ఇలా ముద్దు పెట్టేసిందేంటి?

Aug 9 2026 8:39 PM | Updated on Aug 10 2026 9:29 AM

Nikita Rawal Latest Video Viral

హిందీలో మూడు నాలుగు సినిమాలు చేసిన నటి నిఖితా రావల్‌కి ఊహించని అనుభవం ఎదురైంది. తాజాగా ఓ కార్యక్రమంలోనే ఈమె ఫొటోలకు పోజులిస్తుండగా ఓ మహిళా అభిమాని వచ్చి సెల్ఫీ అడిగింది. ఈ క్రమంలోనే అత్యుత్సాహం ప్రదర్శించింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: ఇప్పుడు వైజాగ్ రోడ్డుపై నడవలేకపోతున్నా: అల్లు అర్జున్)

మిస్టర్ హాట్ మిస్టర్ కూల్, బ్లాక్ అండ్ వైట్, హీరో తదితర సినిమాల్లో నటించిన నిఖితా రావల్ మంచి డ్యాన్సర్‌గానూ గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అయితే కొత్త ప్రాజెక్టులేం చేయట్లేదు. ఇప్పుడు అభిమాని ఈమెకు లిప్ కిస్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‍అయితే బాలీవుడ్‌లో ఇలాంటివి నిజంగా జరగడం కంటే ఎక్కువగా పీఆర్ స్టంట్స్‌గా చేస్తుంటారు. తమ గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎలాంటి మూవీ ఛాన్సులు రాకపోతే ఏదో ఒకలా వైరల్ అవ్వాలని ప్రయత్నిస్తుంటారు. మరి నిఖితా రావల్ కూడా ఇలాంటి స్టంట్ ఏమైనా చేసిందా? లేదంటే నిజంగా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: మూడు నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగు సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement