మధ్య తరగతి వాళ్ల భావోద్వేగాలు ఇంత తీవ్రంగా ఉంటాయ్‌ | Man Surprises Parents With Unexpected Return | Sakshi
Sakshi News home page

మధ్య తరగతి వాళ్ల భావోద్వేగాలు ఇంత తీవ్రంగా ఉంటాయ్‌

Aug 9 2026 3:45 PM | Updated on Aug 9 2026 3:45 PM

 Man Surprises Parents With Unexpected Return

విదేశాలకు వెళ్లిన పిల్లలు తిరిగి ఇంటి వచ్చే క్షణం ప్రతి కుటుంబానికీ ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. ఎన్నో రోజుల ఎదురుచూపులు, జ్ఞాపకాలు ఒక్కసారిగా కళ్లముందు ప్రత్యక్షమవుతాయి. ఆనందం, ఆశ్చర్యం, ప్రేమ కలిసిన అలాంటి సందర్భాలు ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. కుటుంబ బంధాల విలువను గుర్తు చేసే క్షణాలు సోషల్ మీడియాలోనూ విశేష ఆదరణ పొందుతుంటాయి. అలాంటి హృదయాలను హత్తుకునే ఓ వీడియో ప్రస్తుతం నెటిజన్లను భావోద్వేగానికి గురిచేస్తోంది.

కెనడా నుంచి ఐదేళ్ల తర్వాత వచ్చి తల్లిదండ్రులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు ఓ యువకుడు. అతడు ఇంటికి తిరిగి రావడాన్ని చూసిన కుటుంబ సభ్యుల భావోద్వేగానికి లోనయ్యారు. కెనడాలో ఐదేళ్లు గడిపిన తర్వాత సూర్య నాయర్ తన ఇంటికి సర్‌ప్రైజ్‌గా రావడం అతనికి, అతని కుటుంబాన్ని సంతోషంలో ముంచెత్తింది. తాను ఇంటికి వస్తున్న విషయం తెలియని తన తల్లిదండ్రులకు ఎలా సర్‌ప్రైజ్ ఇచ్చాడో చూపిస్తూ నాయర్ తన రాకకు సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేశాడు.

“వారిని కలవబోతున్నందుకు నేను నిజంగా చాలా ఆత్రుతగా ఉన్నాను” అని చెప్పాడు. నాయర్ తన కుటుంబ సభ్యులను కలుసుకున్న క్షణాలు ఈ వీడియోలో ఉన్నాయి. అతడిని చూసిన కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి లోనై భావోద్వేగానికి గురైనట్టు కనిపించారు.

నాయర్ ఇంటికి తిరిగి రావడాన్ని చూసిన కుటుంబ సభ్యుల భావోద్వేగాలను ఈ అనుకోని కలయిక ప్రతిబింబించింది. సూర్య ఇచ్చిన సర్‌ప్రైజ్, అతని స్పందనలు ఆ క్షణాన్ని హృదయానికి హత్తుకునేలా చేశాయి.

సోషల్ మీడియా యూజర్లు సూర్య, అతని కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అనుబంధాన్ని ఎంతగానో ప్రశంసిస్తున్నారు. ఓ యూజర్‌ “ఈ రోజు ఇంటర్నెట్‌లో ఇదే అత్యుత్తమ వీడియో” అని పేర్కొన్నాడు. మరో యూజర్‌ “కొన్ని రీల్స్‌ను ఇష్టపడకుండా ఉండలేం” అని పేర్కొన్నాడు. “ఇది ఎంతో హృదయానికి హత్తుకునే వీడియో” అని మరో వినియోగదారు వ్యాఖ్యానించాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement