ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లీగ్-2లో పోర్ట్‌హిల్ వేదికగా స్కాట్లాండ్- కెనడా మధ్య జరిగిన మ్యాచ్ ఓ చారిత్రత్మక రికార్డుకు వేదికైంది. ఈ పోరుతో అంతర్జాతీయ వన్డే క్రికెట్ 5,000 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకుంది. 1971లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరిగింది.
వన్డే క్రికెట్ ప్రారంభంలో ఇన్నింగ్స్‌కు 60 ఓవర్లు ఉండేవి. 1975, 1979, 1983 ప్రపంచకప్‌లు 60 ఓవర్ల ఫార్మాట్‌లోనే జరిగాయి. ఆ తర్వాత 1987 ప్రపంచకప్ నుంచి 50 ఓవర్ల ఫార్మాట్‌గా మారింది.
తొలి 1,000 మ్యాచ్‌లు పూర్తికావడానికి 24 ఏళ్లు (1995) పట్టగా.. తదుపరి 31 ఏళ్లలోనే వన్డేల సంఖ్య 5,000కు చేరుకోవడం విశేషం. అయితే అత్యధిక వన్డు మ్యాచ్‌లు ఆడిన జట్టుగా టీమిండియా కొనసాగుతోంది. భారత్ ఇప్పటివరకు 1050కు పైగా వన్డేలు ఆడింది.
ఆ తర్వాతి స్ధానాల్లో ఆస్ట్రేలియా(1000కు పైగా), పాకిస్తాన్(970+) ఉన్నాయి. కాగా ఈ ఫార్మాట్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా మాత్రం ఆసీస్ టాప్ ప్లేస్‌లో ఉంది. 6 వన్డే ప్రపంచకప్‌లు, 600కు పైగా విజయాలు ఇప్పటివరకు కంగారులు సాధించారు.
5000 వన్డేల మైలురాళ్ల ప్రయాణం
మొదటి వన్డే: ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ (మెల్‌బోర్న్, 1971)
1000వ వన్డే: వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్ (నాటింగ్‌హామ్, 1995)
2000వ వన్డే: పాకిస్థాన్ వర్సెస్ జింబాబ్వే (షార్జా, 2003)
3000వ వన్డే: ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ (సౌతాంప్టన్, 2010)
4000వ వన్డే: హాంకాంగ్ వర్సెస్ పాపువా న్యూ గినియా (హరారే, 2018)
5000వ వన్డే: కెనడా వర్సెస్ స్కాట్లాండ్ (డూండీ, 2026)


