ఆ పెద్దమనిషిలా కాదు.. నేనైతే కుట్ర అనను! | Teleprompter Failed Carney Took a Swipe at Trump | Sakshi
Sakshi News home page

ఆ పెద్దమనిషిలా కాదు.. నేనైతే కుట్ర అనను!

Aug 6 2026 1:29 PM | Updated on Aug 6 2026 1:34 PM

Teleprompter Failed Carney Took a Swipe at Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, కెనడా ప్రధాని మార్క్‌ కార్నీల మధ్య మాటల యుద్ధం మరోసారి తెరపైకి వచ్చింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న కార్నీకి అనుకోని అవాంతరం ఎదురైంది. అయితే ఇదే అదనుగా ఆయన ట్రంప్‌పై పరోక్షంగా సెటైర్లు సంధించారు. 

కెనడాలో గృహ నిర్మాణ విధానంపై టొరంటోలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాని మార్క్‌ కార్నీ మాట్లాడుతుండగా టెలిప్రాంప్టర్‌ అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోయింది. దీంతో ఆయన చిరునవ్వుతో స్పందిస్తూ.. “టెలిప్రాంప్టర్‌ పనిచేయడం నిలిచిపోయిందని మీకు తెలియజేస్తున్నాను. అయితే ఆ పెద్దమనిషిలా.. ప్రత్యేక ప్రపంచ నేతలా కాకుండా దీనైతే నేను కుట్రగా భావించడం లేదు” అని వ్యాఖ్యానించారు. కార్నీ వ్యాఖ్యలతో అక్కడున్నవారు ఘోల్లున నవ్వారు. 

కార్నీ చేసిన ఈ వ్యాఖ్యలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఉద్దేశించినవేనన్న చర్చ నడుస్తోంది. గతంలో న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి హెడ్‌ ఆఫీస్‌కు వెళ్లిన ట్రంప్‌.. జనరల్‌ అసెంబ్లీలో ప్రసంగించే సమయంలో టెలిప్రాంప్టర్‌, ఎస్కలేటర్‌ సమస్యలు ఎదురయ్యాయి. ఆ ఘటనల వెనుక కుట్ర ఉందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ట్రంప్‌ విచారణకు డిమాండ్‌ చేయడం అప్పట్లో చర్చకు దారితీసింది.

ట్రంప్‌ విధానాలపై కార్నీ పోరాటం
ట్రంప్‌ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా–కెనడా సంబంధాల్లో పలు విభేదాలు చోటుచేసుకున్నాయి. కెనడా దిగుమతులపై అమెరికా సుంకాలు విధించడం, కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా మార్చాలంటూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

ఈ నేపథ్యంలో కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ.. దేశ ఆర్థిక, దౌత్య విధానాల్లో అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రంప్‌ వాణిజ్య విధానాలను వ్యతిరేకిస్తూ కెనడా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. ప్రపంచంలోని బలమైన దేశాలు ఆర్థిక సంబంధాలను రాజకీయ ఆయుధాలుగా ఉపయోగిస్తున్నాయని కార్నీ చేసిన వ్యాఖ్యలు కూడా గతంలో చర్చకు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement