breaking news
world news
-
“మా వాళ్లకే ప్రాధాన్యం”.. నెట్‌ఫ్లిక్స్ సంచలన నిర్ణయం
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చూసే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మా వాళ్లకే ప్రాధాన్యం అంటూ సంస్థ నుంచి భారీగా ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు లేఆఫ్స్‌పై ప్రకటన కూడా చేసింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఉద్యోగుల తొలగింపు ఇది కాగా.. ఆ సంస్థ చరిత్రలో ఇదే పెద్దది కావడం గమనార్హం. “ప్రపంచాన్ని వినోదంతో అలరించడమే మా లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే మా ఉద్యోగులు, వనరులను ఎక్కడ వినియోగించాలనే విషయంలో క్రమశిక్షణతో వ్యవహరించాలి” అని నెట్‌ఫ్లిక్స్ సహ-సీఈవోలు టెడ్ సరండోస్, గ్రెగ్ పీటర్స్ ఉద్యోగులకు పంపిన సందేశంలో పేర్కొన్నారు. ఇక్కడ ‘మా వాళ్లు’ అంటే ఏంటన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. అయితే ఉద్యోగులు, ఇతర వనరులను అవసరమైన విభాగాల్లో వినియోగిస్తూ సంస్థను మరింత సమర్థంగా నడపాలన్నది వారి మాటల ఉద్దేశం అని మాత్రం అర్థమవుతోంది.100లో 6 అవుట్!నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 16 వేల మంది పూర్తిస్థాయి ఉద్యోగులు పనిచేస్తున్నారు!. వీరిలో దాదాపు వెయ్యి మందిని తొలగించనుంది. అంటే ప్రతి వంద మంది ఉద్యోగుల్లో సుమారు ఆరుగురు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి. ఈ కోతల ప్రభావం ప్రధానంగా కంటెంట్, సాంకేతికత, న్యాయ సేవలు, మానవ వనరుల విభాగాలపై పడనుంది. పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించే ఈ ప్రక్రియనే ‘మాస్ లేఆఫ్స్’ అంటారని తెలిసిందే.యూట్యూబ్, టిక్‌టాక్‌తో పోటీలో ఢీలా!మరి వ్యాపారం బాగుందని చెబుతున్న సంస్థ ఉద్యోగులను ఎందుకు తొలగిస్తోంది? దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి ప్రేక్షకుల కోసం పెరుగుతున్న పోటీ. నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూడాలంటే సాధారణంగా చందా తీసుకోవాలి. అదే యూట్యూబ్, టిక్‌టాక్ వంటి వేదికల్లో ఉచితంగా వీడియోలు చూసే అవకాశం ఉంది. దీంతో ప్రేక్షకులు ఏ వేదికపై ఎక్కువ సమయం గడుపుతున్నారు? నెట్‌ఫ్లిక్స్ కోసం చెల్లించే డబ్బుకు తగ్గ వినోదం లభిస్తోందా? అనే అంశాలు సంస్థకు కీలకంగా మారాయి.ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కొత్త సినిమాలు, సిరీస్‌లపై ఖర్చు చేయడంతోపాటు.. ప్రకటనలతో కూడిన సబ్స్క్రిప్షన్లు, ప్రత్యక్ష ప్రసారాలు, గేమింగ్ వంటి కొత్త మార్గాల ద్వారా ఆదాయం పెంచుకోవాలని నెట్‌ఫ్లిక్స్ ప్రయత్నిస్తోంది. ఈ పోటీలో ఖర్చులను నియంత్రించుకుంటూ, ఎక్కువ ప్రయోజనం కలిగించే విభాగాలపై దృష్టి పెట్టాలన్నది సంస్థ వ్యూహంగా కనిపిస్తోంది.నెట్‌ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నా.. దాని పూర్తిస్థాయి ఉద్యోగుల సంఖ్య సుమారు 16 వేలే!. ఎందుకంటే ఇది వేలాది బ్రాంచ్‌లు, సినిమా థియేటర్లు నిర్వహించే సంస్థ కాదు. ఇంటర్నెట్ ద్వారా సినిమాలు, వెబ్‌సిరీస్‌లను ప్రేక్షకులకు అందిస్తుంది. అందువల్ల ప్రతి దేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు అవసరం ఉండదు. ఇక సినిమాలు, సిరీస్‌ల నిర్మాణంలో పనిచేసే కొందరు తాత్కాలిక సిబ్బంది, కాంట్రాక్టర్లు ఈ పూర్తిస్థాయి ఉద్యోగుల లెక్కకు అదనం.ఏ ప్రాంతంలో ఎంతమంది?నెట్‌ఫ్లిక్స్ 2025 డిసెంబర్ 31 నాటి అధికారిక నివేదిక ప్రకారం.. అమెరికా, కెనడాలో అత్యధికంగా 10,900 మంది ఉద్యోగులు ఉన్నారు. యూరప్, మిడిల్ఈస్ట్, ఆఫ్రికా ప్రాంతాల్లో 2,500 మంది, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 1,900 మంది, లాటిన్ అమెరికాలో 700 మంది పనిచేస్తున్నారు. ఈ నాలుగు ప్రాంతాల్లో కలిపి మొత్తం 16 వేల మంది పూర్తిస్థాయి ఉద్యోగులు ఉన్నారు.ఇప్పుడు వీరిలో దాదాపు వెయ్యి మందిని తొలగిస్తే.. ప్రతి వంద మంది ఉద్యోగుల్లో ఆరుగురికి పైగా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి. ఈ కోతల ప్రభావం ప్రధానంగా ప్రొడక్ట్, టెక్నాలజీ, న్యాయ సేవలు, మానవ వనరుల విభాగాలపై పడనుంది.ఉద్యోగుల్లో ఆందోళననెట్ఫ్లిక్స్ వ్యాపారం బలంగా ఉందని, ఈ ఏడాది ఆదాయ లక్ష్యాలను చేరుకుంటామని సహ-సీఈవోలు చెబుతున్నారు. అయినప్పటికీ, భవిష్యత్తులో వృద్ధిని కొనసాగించేందుకు సంస్థలో మార్పులు అవసరమని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే నిర్ణయం తీసుకున్నారు. 2022లో చందాదారులు(సబ్స్క్రయిబర్లు) భారీగా తగ్గిన సమయంలోనూ నెట్‌ఫ్లిక్స్ వందలాది ఉద్యోగాలను తొలగించింది. రెండు విడతలుగా.. 450 మందిని తొలగించింది. ఇప్పుడు మరోసారి భారీ కోతలకు దిగుతోంది.ఇదీ చదవండి: ఆ గలీజు రోబోను ఏం చేశారంటే! -
సీజేపీపై అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు
కాక్రోచ్ జనతా పార్టీ, దాని వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై అమెరికన్ గాయని మేరీ మిల్బెన్ ఆరోపణలు చేశారు. అమెరికాకు చెందిన కొందరు దాతలు వాళ్లకు నిధులు సమకూరుస్తున్నారని అన్నారు. భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వ్యతిరేకించే శక్తులు ఈ నిధుల వెనుక ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. దేశంలో పాలనను అస్థిరపరిచే ప్రయత్నాలను అడ్డుకోవాలంటూ భారత యువతకు పిలుపునిచ్చారామె.ఎక్స్‌లో చేసిన పోస్టులో మిల్బెన్.. మోదీని వ్యతిరేకించే అమెరికా దాతలు దీప్కే, సీజేపీకి నిధులు అందిస్తున్నారని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయవాద నాయకులను లక్ష్యంగా చేసుకోవడం కొందరు దాతల పద్ధతిగా మారిందని పేర్కొన్నారు. అమెరికాలో చదువుకున్న వ్యక్తులను గుర్తించి, వారిని తీవ్రవాద భావజాలం వైపు మళ్లించి, తిరిగి వారి దేశాలకు పంపి గందరగోళం సృష్టించేందుకు నిధులు సమకూరుస్తున్నారని ఆరోపించారు.To all the beautiful young patriots in India: This is not the time to be silent. @abhijeet_dipke and the @Cockroachisback are being funded by donors in the U.S. who are against Prime Minister @NarendraModi and your future under his leadership. Do not fear, my young patriots. Your Prime Minister, who has served India for 25 years, 12 years as Prime Minister, elected three consecutive terms, is not going to bow to disruptive forces from my country. And these select donors have a pattern globally - target conservative global leaders, find an U.S. educated person from the country, radicalize them, send them back to the country, and fund them to start chaos and destruction. None of them have been successful but have impacted the development and governance of the country. It is time for a new voice in #India, born, raised, educated on the soil of India, to RISE UP, organize, and peacefully protest the disruptive spirit of the Cockroach Party. There should always be a counter movement to uphold democracy and freedom. Rise up, young patriots! Rise up!— Mary Millben (@MaryMillben) October 14, 2026ప్రజాజీవితంలో 25 ఏళ్ల అనుభవం, ప్రధానిగా 12 ఏళ్ల పాలన ఉన్న మోదీ.. తన దేశానికి చెందిన విచ్ఛిన్నకర శక్తులకు తలొగ్గబోరని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛను కాపాడేందుకు ప్రతిఉద్యమం ఉండాలని పేర్కొంటూ.. భారత యువత సంఘటితమై సీజేపీకి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని కోరారు. ‘ఇది మౌనంగా ఉండాల్సిన సమయం కాదు.. యువ దేశభక్తులారా, ముందుకు రండి’ అంటూ పిలుపునిచ్చారు.బ్యాక్‌గ్రౌండ్ ఇదే..మేరీ మిల్బెన్ అమెరికాకు చెందిన గాయని, నటి. ఆఫ్రికన్-అమెరికన్ నేపథ్యానికి చెందిన ఆమె.. దేశభక్తి గీతాలు, జాతీయ గీతాల ఆలాపనతో గుర్తింపు పొందారు. అమెరికాలోని ఓక్లహోమాలో పాస్టర్ కుమార్తెగా పెరిగిన ఆమె.. సంగీత రంగంలోకి రాకముందు అప్పటి అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ. బుష్ ప్రభుత్వంలో వైట్‌హౌస్ ప్రెసిడెన్షియల్ అపాయింటీగా పనిచేశారు. అనంతరం గాయనిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికా అధ్యక్షుల కార్యక్రమాలు, రాజకీయ సమావేశాలు, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చారు. ఆమె అధికారిక వెబ్సైట్ ప్రకారం.. ఐదుగురు అమెరికా అధ్యక్షుల కార్యక్రమాల్లో జాతీయ గీతాలు, దేశభక్తి గీతాలు ఆలపించారు.మోదీతో ప్రత్యేక అనుబంధంభారత్లోనూ మేరీ మిల్బెన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. 2022లో భారత స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన వేడుకల్లో పాల్గొనేందుకు భారత ప్రభుత్వ ఆహ్వానంపై ఆమె తొలిసారి భారత్‌కు వచ్చారు. అదే ఏడాది స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ఆమె ప్రదర్శనలు ఇచ్చారు. 2023 జూన్‌లో ప్రధాని మోదీ అమెరికా అధికారిక పర్యటన సందర్భంగా వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన కార్యక్రమంలో భారత జాతీయ గీతం ‘జనగణమన’ ఆలపించారు. మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ పాల్గొన్న అధికారిక కార్యక్రమాల నేపథ్యంలో ఆమె పేరు భారత్‌లో బాగా చర్చకు వచ్చింది. మోదీ ప్రభుత్వానికి మద్దతుగా గతంలోనూ ఆమె పలుమార్లు వ్యాఖ్యలు చేశారు.ఇప్పటికే బీజేపీ నేతల ప్రశ్నలుసీజేపీకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న అంశంపై బీజేపీ నేతలు కూడా ఆరోపణలు చేశారు. పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్.. ప్రతిపక్ష నేతలు, సీజేపీ విదేశీ మద్దతుతో దేశాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సైతం డిప్కే కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నవారెవరని ప్రశ్నించారు. అయితే ఈ ఆరోపణలను దీప్కే తోసిపుచ్చారు. పైగా విదేశీ నిధులు సీజేపీ కార్యకలాపాలకు చేరి ఉంటే, అది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వైఫల్యమే అవుతుందని వ్యాఖ్యానించారు. అదెలాగో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఉన్న మంత్రిత్వ శాఖనే వివరించాలని సెటైర్ వేశారు. ప్రస్తుతం సీజేపీ నేతలు, మద్దతుదారులు ఎన్నికల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో మిల్బెన్ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఈ క్రమంలో విదేశీ నిధుల ఆరోపణలు రాజకీయంగా కొత్త చర్చకు దారితీశాయి.ఇదీ చదవండి: అప్రకటిత ఎమర్జెన్సీ ఎందుకు మోదీగారూ? -
సౌదీ సుప్రీంకోర్టులో శివకు బిగ్ రిలీఫ్
సోషల్ మీడియాలో పెట్టిన ఓ కామెంట్.. ఆ యువకుడి జీవితాన్ని అతలాకుతలం చేసింది. తొలుత జైలు శిక్ష, భారీ జరిమానాకు దారితీసింది. ఆ తర్వాత శిక్ష తగ్గించాలని పిటిషన్ వేస్తే.. అది ఊహించని మలుపు తిరిగి మరణశిక్ష పడేలా చేసింది. దీంతో ఆ యువకుడి కుటుంబం తల్లడిల్లిపోయింది. అతన్ని కాపాడుకునేందుకు అన్ని విధాల ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే.. సుప్రీం కోర్టు జోక్యంతో ఆ యువకుడికి భారీ ఊరట లభించింది.శ్రీలంకకు చెందిన 24 ఏళ్ల హిందూ వలస కార్మికుడు అనోజన్ శివరాసా విషయంలో ఇప్పుడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇస్లాం ప్రవక్త మహమ్మద్‌పై అభ్యంతరకర వ్యాఖ్య చేశాడనే ఆరోపణలతో సౌదీ అరేబియా కోర్టు విధించిన మరణశిక్షను ఆ దేశ సుప్రీంకోర్టు అక్టోబర్ 13న రద్దు చేసింది. శ్రీలంక ప్రభుత్వం చేపట్టిన దౌత్య, న్యాయపరమైన ప్రయత్నాల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. అయితే అనోజన్‌కు పూర్తిగా విముక్తి లభించిందా? శిక్ష కొనసాగనుందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.అసలు వివాదం అక్కడే మొదలైంది..ఈ ఏడాది జూన్ చివర్లో శ్రీలంకలో హిందూ యాత్రికులు వెళ్తున్న సమయంలో ఓ ముస్లిం యువకుడు కుక్కను తన్నుతున్నట్లు చూపించే వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో ఫేస్బుక్లో మతపరమైన వాదోపవాదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఓ వ్యక్తి హిందూ దేవతపై అభ్యంతరకర వ్యాఖ్య చేశాడు. దీనికి స్పందించిన సౌదీలో పనిచేస్తున్న శివ.. తమిళంలో ప్రవక్త మహమ్మద్‌పై వ్యాఖ్య చేశాడు. అది ఇస్లాంను, ప్రవక్తను అవమానించేలా ఉందంటూ వివాదం చెలరేగింది.పరిస్థితి తీవ్రతను గుర్తించిన అనోజన్ కొద్దిసేపటికే ఆ కామెంట్‌ను తొలగించాడు. అనంతరం వీడియో ద్వారా క్షమాపణ కూడా చెప్పాడు. అయినప్పటికీ అప్పటికే ఆ వ్యాఖ్యకు సంబంధించిన స్క్రీన్షాట్లు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. శ్రీలంకలోని కొందరు వ్యక్తులు అనోజన్ పనిచేస్తున్న సౌదీ సంస్థకు ఈ వివరాలను ఈమెయిల్ చేశారు. దీంతో సౌదీ అధికారుల దృష్టికి ఈ వ్యవహారం వెళ్లింది. అనోజన్ ఎలక్ట్రానిక్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వార్తా కథనాలు వెల్లడించాయి.జైలు శిక్ష నుంచి మరణశిక్షకు..జూలై 15న అల్-అహ్సా క్రిమినల్ కోర్టు అనోజన్‌కు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 30 లక్షల సౌదీ రియాళ్ల జరిమానా విధించింది. అది సుమారు 8 లక్షల అమెరికన్ డాలర్లకు సమానం. సౌదీ సైబర్ నేరాల చట్టం కింద ఈ శిక్ష విధించినట్లు కథనాలు పేర్కొన్నాయి.అయితే కేసు అక్కడితో ముగియలేదు. సెప్టెంబర్ 17న సౌదీ అప్పీల్ కోర్టు ఆయనకు విధించిన అసలు శిక్షను పక్కనపెట్టి, షరియా చట్టం కింద దైవదూషణకు సంబంధించిన నేరంగా పరిగణిస్తూ మరణశిక్ష విధించింది. దీంతో అనోజన్ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. సెప్టెంబర్ 28 తర్వాత ఆయన కుటుంబ సభ్యులతో సంబంధాలు తెగిపోగా.. తమ కుమారుడికి ఏమవుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందారు.Mother of Anojan Sivarasa pleading.. This is painful to watch. Come on Saudi Arabia.. Give him an excuse.. and send him back to Sri Lanka 🙏 #Anojan https://t.co/GefBlpQKk4— Nibraz Ramzan (@nibraz88cricket) October 11, 2026శ్రీలంక ప్రభుత్వం దౌత్య ప్రయత్నాలు..మరణశిక్షను రద్దు చేయించేందుకు శ్రీలంక ప్రభుత్వం దౌత్య, న్యాయపరమైన చర్యలను ముమ్మరం చేసింది. సెప్టెంబర్ 21న అనోజన్ కుటుంబ సభ్యులు శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకను కలిసి తమ కుమారుడిని కాపాడాలని కోరారు. క్షమాభిక్ష కోసం అన్ని ప్రయత్నాలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. న్యాయపరమైన ఖర్చులను భరించేందుకు కూడా ప్రభుత్వం ముందుకొచ్చింది.మరోవైపు, శ్రీలంకకు చెందిన ఆరుగురు తమిళ, ముస్లిం ఎంపీలు సెప్టెంబర్ 24న సౌదీ విదేశాంగ మంత్రికి లేఖ రాసి అనోజన్పై కరుణ చూపించాలని కోరారు. శ్రీలంక రాయబారి అమీర్ అజ్వాద్ అక్టోబర్ 8న దమ్మామ్ సెంట్రల్ జైలులో అనోజన్ను కలిసి ఆయన పరిస్థితిని తెలుసుకున్నారు. జైలులో తోటి ఖైదీ దాడి చేసినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ఆయన క్షేమసమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. అదనపు సొలిసిటర్ జనరల్ ఆజాద్ నవావి, ప్రెసిడెంట్స్ కౌన్సెల్ ఫైజర్ ముస్తఫా, ఉపుల్ కుమారపెరుమ, న్యాయవాది హఫీల్ ఫారిస్లతో కూడిన ప్రత్యేక న్యాయ బృందం కూడా కేసులో తదుపరి చర్యల కోసం రియాద్‌కు వెళ్లింది.సుప్రీంకోర్టులో అప్పీల్.. మరణశిక్ష రద్దుశ్రీలంక ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాల్లో కీలక పరిణామం అక్టోబర్ 13న చోటుచేసుకుంది. అక్టోబర్ 11న సౌదీ సుప్రీంకోర్టులో దాఖలైన అప్పీల్ విచారణ అనంతరం అనోజన్‌కు విధించిన మరణశిక్షను కోర్టు రద్దు చేసింది. ఈ విషయాన్ని శ్రీలంక విదేశాంగ, విదేశీ ఉపాధి, పర్యాటక మంత్రిత్వ శాఖ అక్టోబర్ 14న అధికారికంగా వెల్లడించింది.మరణశిక్ష రద్దు కావడంతో అనోజన్ కుటుంబానికి పెద్ద ఊరట లభించినప్పటికీ, ఆయనపై ఉన్న నేరారోపణలన్నీ కొట్టివేశారా? లేక గతంలో విధించిన ఐదేళ్ల జైలు శిక్ష, జరిమానా మళ్లీ అమలులోకి వస్తాయా? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ అంశంపై సౌదీ అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.సోషల్ మీడియా వ్యాఖ్యలపై మరోసారి చర్చసౌదీ అరేబియాలో సోషల్ మీడియా పోస్టుల కారణంగా కఠిన శిక్షలు విధించిన ఘటనలు గతంలోనూ ఉన్నాయి. 2023లో సౌదీ మాజీ ఉపాధ్యాయుడు మహమ్మద్ అల్-ఘమ్దీకి సోషల్ మీడియా పోస్టుల కేసులో తొలుత మరణశిక్ష విధించగా, ఆ తర్వాత దాన్ని 30 ఏళ్ల జైలు శిక్షగా మార్చారు.అనోజన్ కేసులోనూ మరణశిక్ష రద్దు కావడం కీలక పరిణామమే అయినప్పటికీ, ఆయనకు పూర్తిస్థాయిలో విముక్తి లభించే వరకు న్యాయపరమైన ప్రక్రియ కొనసాగాల్సి ఉంది. క్షణికావేశంలో సామాజిక మాధ్యమాల్లో చేసే వ్యాఖ్యలు ఎంతటి తీవ్రమైన పరిణామాలకు దారితీయవచ్చో ఈ ఘటన మరోసారి చర్చకు తెచ్చింది.ఇదీ చదవండి: మిషిగాన్ స్పీకర్ రేసులో రణ్జీవ్! ఎవరీయన అంటే.. -
ఇరాన్ కొత్త గేమ్.. ట్రంప్–నెతన్యాహుకు చుక్కలే!
ఇరాన్ యుద్ధంలో మరో కీలక మలుపు! అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో సైనికంగా దెబ్బతిన్నా.. హార్ముజ్ జలసంధి వద్ద కొత్త వ్యూహాలతో ఇరాన్ ఎదురుదాడికి దిగుతోంది. చమురు నౌకలపై దాడులను పెంచడంతో పాటు, తమ ఆంక్షలను ఉల్లంఘించే నౌకలకు ఈ మార్గాన్ని మూసివేయాలని భావిస్తోంది. ప్రపంచ చమురు ధరలు తగ్గకుండా చూడటం, నవంబర్ 3న జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లికన్ల అవకాశాలను దెబ్బతీయడం కూడా తమ వ్యూహంలో భాగమని ఇరాన్ అధికారులు చెబుతున్నారు.మరోవైపు, ఇరాన్‌పై మళ్లీ భారీ సైనిక దాడులు చేయాలా? లేదంటే ఆర్థిక ఆంక్షలు, నౌకాదళ దిగ్బంధనంతో ఒత్తిడి కొనసాగించాలా? అనే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సందిగ్ధంలో ఉన్నాడట. ఇటు ఇరాన్ అణు కార్యక్రమం తిరిగి ఊపందుకుంటోందన్న ఆందోళనతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కొత్త దాడులకు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.హార్ముజ్ వద్ద కొత్త ఎత్తుగడలుఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి హార్ముజ్ జలసంధిపై పట్టు సాధించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోంది. యుద్ధానికి ముందు ప్రపంచ చమురు, ఎల్ఎన్జీ రవాణాలో దాదాపు ఐదో వంతు ఈ మార్గం నుంచే సాగేది. నౌకల రాకపోకలను పరిమితం చేసి అమెరికాపై ఒత్తిడి పెంచాలని టెహ్రాన్ భావిస్తోంది. గత పది రోజులుగా దాడుల వ్యూహాన్ని మార్చినట్లు ఇద్దరు సీనియర్ ఇరాన్ అధికారులు రాయిటర్స్‌కు వెల్లడించారు.చిన్న పడవలతో నిఘా.. ఆపై దాడులు!అమెరికా దాడుల్లో ఇరాన్ రాడార్ వ్యవస్థలు దెబ్బతినడంతో ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) కొత్త పద్ధతిని అనుసరిస్తున్నట్లు అమెరికా సైనిక అధికారి తెలిపారు. ఆయుధాలు లేని చిన్న పడవల్లో నిఘా సిబ్బందిని పంపి, అమెరికా నౌకాదళంతో పాటు ఇతర లక్ష్యాల కదలికలను గుర్తిస్తున్నట్లు వివరించారు. గత వారం ఇలాంటి ఓ పడవలోని సిబ్బంది సమాచారాన్ని ఐఆర్‌జీసీకి చేరవేస్తున్నట్లు గుర్తించిన అమెరికా బలగాలు వారిని బయటకు పంపించి, పడవను ధ్వంసం చేశాయని తెలిపారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదన్నారు.గల్ఫ్ ఆఫ్ ఒమన్ వరకూ విస్తరణ?హార్ముజ్కే పరిమితం కాకుండా గల్ఫ్ ఆఫ్ ఒమన్, ఖతార్, యూఏఈ తీరాలకు సమీపంలోని సముద్ర జలాల్లోనూ కార్యకలాపాలను విస్తరించాలన్నది ఇరాన్ వ్యూహంగా కనిపిస్తోంది. గత 48 గంటల్లో ట్యాంకర్లతో సహా వాణిజ్య నౌకలకు సంబంధించి కనీసం ఐదు ఘటనలు నమోదయ్యాయి. వీటిలో డ్రోన్ దాడులు కూడా ఉన్నట్లు సమాచారం. తమ ఆంక్షలను ఉల్లంఘించే నౌకలకు హార్ముజ్ మార్గాన్ని పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. చమురు ధరలను తగ్గించేందుకు అమెరికా, దాని మిత్రదేశాలు చేసే ప్రయత్నాలను అడ్డుకుంటామని పేర్కొంటున్నారు. హార్ముజ్ వద్ద వాణిజ్య నౌకలకు ముప్పు తీవ్రంగానే ఉందని జాయింట్ మారిటైమ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా హెచ్చరించింది.దాడులు చేయాలా? ఆగాలా?ఇరాన్‌పై మళ్లీ సైనిక చర్య చేపట్టే అంశంపై ట్రంప్, నెతన్యాహు చర్చించినట్లు ఆక్సియోస్ కథనం వెల్లడించింది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పునరుద్ధరించే ప్రయత్నాల్లో భాగంగా ‘పికాక్స్ మౌంటెన్’ ప్రాంతాన్ని యురేనియం శుద్ధి కేంద్రంగా ఉపయోగించే అవకాశం ఉందని ఇజ్రాయెల్ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, సెంట్రల్ కమాండ్ నాయకత్వం సైనిక చర్యకు మద్దతిస్తున్నట్లు కథనం పేర్కొంది. అయితే ట్రంప్ సలహాదారుల్లో ఎక్కువమంది ఆర్థిక ఆంక్షలు, ఇతర ఒత్తిడి మార్గాలకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.దాడులపై ట్రంప్ తుది నిర్ణయం తీసుకోలేదని, నవంబర్ 3న జరిగే మధ్యంతర ఎన్నికలకు ముందు ఇరాన్‌పై దాడి చేయబోమని ఆయన ప్రకటించినట్లు వైట్‌హౌస్ తెలిపింది. ట్రంప్, నెతన్యాహు మళ్లీ యుద్ధం ప్రారంభించే అంశంపై చర్చించారన్న వార్తలను వైట్‌హౌస్ అధికారి ఖండించారు. ఇరువురు నేతల మధ్య క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుగుతాయని నెతన్యాహు కార్యాలయం పేర్కొంది.ఎన్నికలే అసలు లెక్కా?ఇజ్రాయెల్‌లో అక్టోబర్ 27న, అమెరికాలో నవంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తే నెతన్యాహుకు రాజకీయంగా ప్రయోజనం కలగవచ్చన్న అంచనాలున్నా, ఇరాన్ ప్రతిదాడులతో ఎన్నికలు వాయిదా పడే ప్రమాదం ఉందన్న ఆందోళన కూడా ఉంది. అమెరికాలో యుద్ధం కారణంగా చమురు ధరలు పెరిగితే ట్రంప్ రిపబ్లికన్లకు ఎన్నికల్లో నష్టం వాటిల్లవచ్చు. అందుకే సైనిక చర్యపై ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు విశ్లేషణలు చెబుతున్నాయి.అమెరికా ఇరాన్ ఓడరేవులపై నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తూ ఆర్థిక ఆంక్షలను కఠినతరం చేస్తోంది. హార్ముజ్ వద్ద ఇరాన్ కొత్త వ్యూహాలు, అమెరికా–ఇజ్రాయెల్ సైనిక సన్నద్ధత మధ్య ట్రంప్ తీసుకునే నిర్ణయం యుద్ధ భవిష్యత్తుతో పాటు ప్రపంచ చమురు ధరలు, ఎన్నికల రాజకీయాలపైనా ప్రభావం చూపనుంది.ఇదీ చదవండి: 30 ఏళ్ల తర్వాత వీడిన మిస్టరీ! -
ట్రంప్ కోడలిగా ఛాన్స్ మిస్.. రాయబారి పదవికీ ఎసరు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. గ్రీస్‌లో అమెరికా రాయబారిగా పనిచేస్తున్న కింబర్లీ గిల్ఫాయిల్ను రాజీనామా చేయాలని వైట్‌హౌస్ ఆదేశించింది. ట్రంప్ ప్రభుత్వంలోని కీలక అధికారులతో పరిచయాలు కల్పిస్తానంటూ ఓ సంపన్న మద్దతుదారుడిని తన క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించాలని ఆమె కోరినట్లు వచ్చిన ఆరోపణలు ఈ పరిణామానికి దారితీశాయి. ఈ వ్యవహారం ఇప్పుడు అమెరికా దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.గిల్‌ఫాయిల్(57) వ్యవహారంపై సెప్టెంబర్ చివరి నుంచి వాల్‌స్ట్రీట్ జర్నల్ వరుస కథనాలు ప్రచురించింది. గ్రీకు ఇంధన సంస్థకు చెందిన లాబీయిస్ట్తో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆ సంస్థ వ్యాపార ప్రయోజనాలను ప్రోత్సహించారని ఆరోపించింది. ప్రైవేటు దౌత్య సమావేశాలకు ఆ లాబీయిస్ట్‌ను అనుమతించారన్న ఆరోపణలూ వెలువడ్డాయి.మరో కథనంలో.. ఓ విందు సందర్భంగా అమెరికా కోరుకుంటే గ్రీకు ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయగలదని గిల్‌ఫాయిల్ వ్యాఖ్యానించిదని వార్త ఇచ్చింది. గ్రీకు వ్యాపారవేత్తలతో విలాసవంతమైన పర్యటనలు, దావోస్‌లో జరిగిన కార్యక్రమానికి ఆహ్వానం పొందేందుకు ఆమె చేసిన ప్రయత్నాలపైనా వార్తలు వచ్చాయి. ఏథెన్స్లోని అమెరికా రాయబార కార్యాలయ సిబ్బందితో ఆమె వ్యవహారశైలిపై ఫిర్యాదులు వచ్చినట్లు బ్రిటన్ మీడియా వెల్లడించింది.లక్ష డాలర్ల బిల్లుతో వివాదం ముదిరి..ఈ ఆరోపణల్లో అత్యంత తీవ్రమైనది క్రెడిట్ కార్డు బిల్లుకు సంబంధించినది. ట్రంప్ మద్దతుదారుడైన వ్యాపారవేత్త ఎరిక్ డీటర్స్ వెల్లడించిన వివరాలను ఉటంకిస్తూ వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది. గిల్‌ఫాయిల్ తన లక్ష డాలర్ల క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించాలని ఆయనను కోరినట్లు తెలుసస్తోంది. ప్రతిఫలంగా ట్రంప్ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులను కలిసే అవకాశం కల్పిస్తానని చెప్పినట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించిన సందేశాలనూ పత్రిక ప్రస్తావించింది.అయితే గిల్‌ఫాయిల్ న్యాయవాదులు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఆమె రాయబారిగా నామినేట్ కావడానికి ముందే నిర్వహించిన ప్రసంగాలు, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన బకాయి పారితోషికమే ఆ మొత్తమని వివరించారు. ప్రైవేటు విమానాల వినియోగంపై వచ్చిన ఆరోపణలను కూడా ఖండించారు. ప్రయాణాలకు ముందు విదేశాంగ శాఖ మార్గదర్శకాలు తీసుకున్నారని, నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించారని తెలిపారు.ట్రంప్ కోడలి చాన్స్ మిస్కింబర్లీ గిల్‌ఫాయిల్ వ్యక్తిగత జీవితంలోనూ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. గతంలో ఆమె కాలిఫోర్నియాలో ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. అనంతరం ఫాక్స్ న్యూస్ వ్యాఖ్యాతగా గుర్తింపు పొందారు. ట్రంప్ రాజకీయ ప్రచార బృందంలోనూ పనిచేశారు. ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌తో 2020 చివర్లో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. అయితే ఈ విషయం రెండేళ్ల తర్వాత అధికారికంగా బయటకు వచ్చింది. ఆ తర్వాత ఏమైందో ఏమోగానీ.. 2024 సెప్టెంబర్‌లో ఆ బంధం ముగిసింది. అంత జరిగినా.. అనంతరం ట్రంప్ ఆమెను గ్రీస్‌లో అమెరికా రాయబారిగా నియమించారు. 2025 నవంబర్‌లో ఏథెన్స్లో బాధ్యతలు చేపట్టిన ఆమె.. అమెరికా ఇంధన ప్రయోజనాల కోసం ఎల్ఎన్జీ దిగుమతులు, చమురు-గ్యాస్ అన్వేషణ ఒప్పందాలను ప్రోత్సహించారు.ట్రంప్ అసంతృప్తి.. రాజీనామాకు ఆదేశాలువరుస కథనాలపై సోమవారం విలేకరులు ప్రశ్నించగా.. గిల్ఫాయిల్ను తొలగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ట్రంప్ చెప్పారు. వెలువడుతున్న వార్తలతో తాము సంతోషంగా లేమని వ్యాఖ్యానించారు. మంగళవారం వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కేటీ జకారియా ఆమెను రాజీనామా చేయాలని కోరినట్లు ధ్రువీకరించారు. గిల్‌ఫాయిల్ తమ బృందానికి ఎంతో ఉపయోగపడ్డారని, ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నామని పేర్కొన్నారు.మరోవైపు గిల్‌ఫాయిల్ ఎక్స్‌లో స్పందిస్తూ.. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. తన పేరు, ప్రతిష్ఠ, నిజాయితీని కాపాడుకునేందుకు న్యాయపరంగా పోరాడతానని పేర్కొన్నారు. ట్రంప్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో పట్ల తన గౌరవం, మద్దతు కొనసాగుతాయని స్పష్టం చేశారు.దర్యాప్తునకు డెమోక్రాట్ల డిమాండ్గిల్ఫాయిల్ వ్యవహారంపై విచారణ జరపాలని డెమోక్రటిక్ పార్టీకి చెందిన గ్రెగరీ మీక్స్, జీన్ షాహీన్, రాబర్ట్ గార్సియా డిమాండ్ చేశారు. ఆమె అధికారిక హోదాను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై స్పష్టత రావాలని కోరారు. అంతకుముందు గ్రీస్ పర్యటనలో రూబియో ఆమెను సమర్థమైన రాయబారిగా అభివర్ణించారు. అయితే ఆరోపణలను ధ్రువీకరించకుండా, అజ్ఞాత వర్గాల సమాచారాన్ని వాస్తవాలుగా పరిగణించకూడదని విలేకరులకు సూచించారు.నాటోలో కీలక మిత్రదేశమైన గ్రీస్.. తూర్పు మధ్యధరా ప్రాంతంలో అమెరికా భద్రతా కార్యకలాపాలకు అవసరమైన సైనిక సదుపాయాలను అందిస్తోంది. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల రక్షణకు ఉద్దేశించిన యూరోపియన్ యూనియన్ సముద్ర మిషన్‌లోనూ కీలక పాత్ర పోషిస్తోంది. ఇలాంటి వ్యూహాత్మక దేశంలో అమెరికా రాయబారిపై వివాదం చెలరేగడం దౌత్యపరంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గిల్ఫాయిల్పై వచ్చిన ఆరోపణలపై గ్రీస్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.కొసమెరుపు.. కింబర్లీకి గతంలో రెండుసార్లు వివాహమైంది. 2001లో గావిన్ న్యూసమ్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆయన ప్రస్తుతం కాలిఫోర్నియా గవర్నర్‌గా ఉన్నారు. వీరిద్దరూ 2005లో విడాకులకు దరఖాస్తు చేసుకోగా, 2006లో విడాకులు ఖరారయ్యాయి. అదే ఏడాది వ్యాపారవేత్త ఎరిక్ విలెన్సీని వివాహం చేసుకున్న కింబర్లీకి ఒక కుమారుడు ఉన్నాడు. ఈ వివాహం కూడా 2009లో ముగిసింది.ఇక డొనాల్డ్ ట్రంప్ జూనియర్ 2005లో వెనెస్సా ట్రంప్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు పిల్లలు. 2018లో విడిపోయిన ఈ జంటకు అదే ఏడాది విడాకులు ఖరారయ్యాయి. ఆ తర్వాత 2018లో తనకన్నా వయసులో 9 ఏళ్లు పెద్దదైన కింబర్లీతో ప్రేమలో పడ్డాడు. 2020 డిసెంబరు 31న నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని 2022లో బహిరంగంగా వెల్లడించారు. 2024లో వీరిద్దరూ విడిపోయారు.ఇదీ చదవండి: ఎన్నికలయ్యాక మీ అంతు చూస్తా.. ట్రంప్ సాలిడ్ వార్నింగ్ -
సౌదీనే వణికిస్తున్న హౌతీలు.. అంత పవర్ ఎక్కడిది అసలు?
ఒకప్పుడు యెమెన్‌లోని పర్వత ప్రాంతాలకే పరిమితమైన తిరుగుబాటు బృందం.. ఇప్పుడు సౌదీ అరేబియా రాజధాని రియాద్ వరకు క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసే స్థాయికి ఎదిగింది. విమానాశ్రయాలు, చమురు కేంద్రాలే లక్ష్యంగా విరుచుకుపడుతున్న హౌతీలను అడ్డుకోవడం సౌదీ రక్షణ వ్యవస్థకూ సవాలుగా మారింది. అత్యాధునిక ఆయుధాలు ఉన్న దేశాలకే వీరిని నిలువరించడం ఎందుకు కష్టమవుతోంది?. ఇంతకీ హౌతీలకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది?..హౌతీ రెబల్స్ తొలుత యెమెన్‌లో పుట్టుకొచ్చిన రాజకీయ, సైనిక, మత ఉద్యమం. వీరు తమను తాము ‘అన్సార్ అల్లా’గా పిలుచుకుంటారు. 1990లలో ఉత్తర యెమెన్‌లో జైదీ షియా మత సంప్రదాయ పునరుజ్జీవన ఉద్యమంగా మొదలైన ఈ సంస్థ.. క్రమంగా సాయుధ శక్తిగా మారింది. 2011లో అరబ్ వసంతం నిరసనలతో యెమెన్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడిన తర్వాత ఉత్తర ప్రాంతాల్లో తమ పట్టును పెంచుకుంది. 2014లో రాజధాని సనాను స్వాధీనం చేసుకుని, అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వాన్ని వెనక్కి నెట్టింది.2015లో హౌతీలను ఓడించి యెమెన్ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు యుద్ధంలోకి దిగాయి. అయితే పర్వత ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు, సుదీర్ఘ పోరాటం, హౌతీల గెరిల్లా వ్యూహాల కారణంగా ఆ సైనిక చర్య వారికి నిర్ణయాత్మక ఓటమిని తీసుకురాలేకపోయింది. యెమెన్‌లోని వాయవ్య ప్రాంతాలపై హౌతీలు తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు.ఇరాన్ అండ.. అదే అసలు బలం!హౌతీల సైనిక శక్తి వెనుక ఇరాన్ మద్దతు కీలకంగా కనిపిస్తోంది. క్షిపణులు, డ్రోన్ల తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ, ఆయుధాలు, నిఘా సమాచారాన్ని ఇరాన్ అందిస్తోందని అమెరికా సహా పలు దేశాలు ఆరోపిస్తున్నాయి. అయితే హౌతీలు తమను ఇరాన్ చేతిలో కీలుబొమ్మలుగా అభివర్ణించడాన్ని తిరస్కరిస్తున్నారు. తమ ఆయుధాలను తామే అభివృద్ధి చేసుకుంటున్నామని చెబుతున్నారు.అయితే నిపుణుల అంచనా ప్రకారం.. ఇరాన్ సాయం హౌతీలకు సుదూర లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాన్ని పెంచింది. వాళ్ల అమ్ముల పొదిలో బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, దాడి డ్రోన్లు ఉన్నాయి. వీటితో సౌదీ చమురు కేంద్రాలు, విమానాశ్రయాలే కాకుండా ఇజ్రాయెల్‌ను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. ఒకేసారి వేర్వేరు వేగాలు, మార్గాల్లో క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించడం ద్వారా ప్రత్యర్థి రక్షణ వ్యవస్థలను గందరగోళానికి గురిచేసే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు.సౌదీకి ఎందుకీ ఇబ్బంది?సౌదీ అరేబియా ప్రపంచంలో అత్యధికంగా రక్షణ రంగంపై ఖర్చు చేసే దేశాల్లో ఒకటి. అయినప్పటికీ హౌతీల దాడులను పూర్తిగా అడ్డుకోలేకపోతోంది. దీనికి పలు కారణాలున్నాయి. హౌతీలు పర్వత ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం, ఆయుధాలను రహస్య ప్రదేశాల్లో దాచడం, చిన్న డ్రోన్ల నుంచి సుదూర క్షిపణుల వరకు వివిధ రకాల ఆయుధాలను ఉపయోగించడం సౌదీకి సవాలుగా మారాయి.అత్యాధునిక రక్షణ వ్యవస్థలు ఉన్నా ప్రతి దాడిని అడ్డుకోవడం సులభం కాదు. దాడులు ఎక్కడి నుంచి వస్తాయో ముందుగా గుర్తించడం, ఏ లక్ష్యాన్ని ముందుగా కాపాడాలో నిర్ణయించడం, అందుబాటులో ఉన్న క్షిపణి నిరోధక ఆయుధాలను సమర్థంగా వినియోగించడం కీలకం. రియాద్ విమానాశ్రయంపై దాడుల నేపథ్యంలో తమ రక్షణ వ్యవస్థలు ఎందుకు ముందస్తు హెచ్చరిక ఇవ్వలేకపోయాయన్న అంశంపై సౌదీ ఇప్పటికీ వివరణ ఇవ్వలేకపోయింది!.ప్రపంచ చమురు రవాణాపైనా పట్టు!హౌతీలకు మరో ప్రధాన బలం యెమెన్ భౌగోళిక స్థానం. ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌తో కలిపే బాబ్ అల్ మండేబ్ జలసంధికి యెమెన్ సమీపంలో ఉంటుంది. ప్రపంచ వాణిజ్యానికి, చమురు రవాణాకు ఇది కీలకమైన మార్గం. ఈ ప్రాంతంలో నౌకలపై దాడులు లేదా రవాణాకు ఆటంకాలు సృష్టిస్తే అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం పడుతుంది. నౌకలు ఆఫ్రికా చుట్టూ ఎక్కువ దూరం ప్రయాణించాల్సి రావడంతో రవాణా ఖర్చులు, సమయం పెరుగుతాయి.2023 నవంబర్ నుంచి గాజా యుద్ధానికి ప్రతిస్పందనగా ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు, ఇజ్రాయెల్‌పై క్షిపణి, డ్రోన్ ప్రయోగాలు చేపట్టిన హౌతీలు.. ప్రాంతీయ ఘర్షణల్లో మరింత కీలక శక్తిగా మారారు. తాజా పరిణామాలతో సౌదీ చమురు ఎగుమతులు, విమాన ప్రయాణాలు, అంతర్జాతీయ సరఫరా మార్గాల భద్రతపై ఆందోళనలు పెరిగాయి.అసలు బలం ఏంటి?హౌతీల శక్తి కేవలం ఇరాన్ ఇచ్చే ఆయుధాల్లోనే లేదు. యెమెన్‌లోని విస్తారమైన ప్రాంతాలపై నియంత్రణ, దీర్ఘకాలిక యుద్ధ అనుభవం, పర్వత ప్రాంతాలను అనుకూలంగా మలుచుకునే సామర్థ్యం, క్షిపణులు–డ్రోన్ల సమన్వయ వినియోగం, కీలక సముద్ర మార్గాలపై ఒత్తిడి తీసుకురాగలగడం.. ఇవన్నీ వారికి బలాన్నిస్తున్నాయి.అందుకే భారీ సైన్యం, ఆధునిక యుద్ధ విమానాలు, క్షిపణి రక్షణ వ్యవస్థలు ఉన్న సౌదీకి కూడా హౌతీలను పూర్తిగా అణచివేయడం కష్టమవుతోంది. ఇరాన్ మద్దతు వారికి ఆయుధ బలాన్నిస్తే.. యెమెన్ భౌగోళిక పరిస్థితులు, సముద్ర మార్గాలపై వ్యూహాత్మక పట్టు వారిని మరింత ప్రమాదకర శక్తిగా మారుస్తున్నాయి.ఇదీ చదవండి: భారత్‌తో పెట్టుకున్నాడు.. మస్క్ పరువు పోయిందిగా! -
యువతులపై రోబోట్ పాడు పని.. చివరికి పోలీసుల ఎంట్రీ!
‘ఇనుములో హృదయం మొలిచెనే..’ అంటూ శంకర్ తీసిన రోబో చిత్రం యావత్ దేశాన్ని ఉర్రూతలూగించింది. అయితే ఫీలింగ్స్ సంగతి పక్కనపెడితే మనుషులకు సాయం చేయాల్సిన యంత్రుడు.. లైంగిక వేధింపులకు పాల్పడితే!. ఈ ఉదంతం ఇప్పుడు నెట్టింట వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.జర్మనీ వీధుల్లో ఓ రోబోట్ చేసిన పాడు పని.. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. స్నేహితులతో ఉన్న ఓ 16 ఏళ్ల బాలిక వద్దకు వచ్చిన రోబోట్.. ఆమెను వెనుక నుంచి తాకుతూ అసభ్యంగా ప్రవర్తించింది. అంతేకాదు.. మరో యువతితోనూ అదే అదే రీతిలో వ్యవహరించింది. మొదటి ఘటనపై యువతి పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు రోబోట్‌తో పాటు దానిని హ్యాండిల్ చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని.. వాళ్ల ఫోన్లను స్వాధీనం చేసుకుని.. దర్యాప్తు చేపట్టారు.బ్రిటన్ టాబ్లాయిడ్ డైలీ మెయిల్ కథనం ప్రకారం.. జర్మనీలోని కొలోన్ నగరంలో ఆదివారం రాత్రి సుమారు 11.45 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. నగరం మధ్యలోని హోహెన్జోలెర్న్రింగ్ వీధిలో ఓ ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్ బయట బాలిక తన స్నేహితులతో కలిసి ఉంది. ఆ సమయంలో సుమారు 1.2 మీటర్ల ఎత్తున్న ఎరుపు, బంగారు రంగుల ‘అహ్మద్’ అనే రోబోట్ వెనుక నుంచి ఆమె వద్దకు వచ్చింది. ఆ రోబోట్ బాలికను అసభ్యంగా తాకడమే కాకుండా.. సైగలు, చేష్టలు ప్రదర్శించింది. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. మరో ఘటనలోనూ ఇలాగే ఓ యువతితో రోబోట్ పాడు పని చేసింది.Roboter »Ahmed« fasst einer 16-Jährigen auf den Kölner Ringen von hinten ans Gesäß und führt Stoßbewegungen aus. Der 16-jährige Besitzer aus Wegberg und sein 19-jähriger Begleiter haben den Vorfall gefilmt, live gestreamt und moderiert haben. Die Polizei fand das Gerät kurz darauf im Kofferraum eines VW. Roboter und Handys wurden beschlagnahmt. Ermittelt wird wegen des Verdachts der Beleidigung auf sexueller Grundlage. Die Kriminalpolizei prüft, ob und von wem der Roboter zum Tatzeitpunkt gesteuert wurde.— Dara 🇩🇪 (@Raeubertochtah) October 12, 2026ఈ ఘటనలో రోబోట్ 16 ఏళ్ల బాలుడికి చెందినదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. జర్మనీలోని వెగ్బెర్గ్కు చెందిన ఆ బాలుడు, అతనితో ఉన్న 19 ఏళ్ల యువకుడు ఘటనను చిత్రీకరించి నెట్టింట అప్లోడ్ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.German police are reportedly investigating an incident in Cologne where a robot allegedly touched a 16-year-old girl inappropriately. The robot and two phones were seized as investigators examine whether its movements were deliberately controlled. #Robotics #Germany #Technology https://t.co/52uVYeUKYw— Cyrus (@Cyrus_In_The_X) October 12, 2026In #Germany, a robot pinched a girl on the butt and ended up in the police — Cologne cops seized the robot after receiving a report about harassment of a 16‑year‑old girl. According to the police, the 1.2‑meter‑tall robot approached the girl from behind and touched her buttocks. Its 16‑year‑old owner and a 19‑year‑old friend allegedly streamed the incident on social media and commented on it. Now investigators are trying to find out who was operating the robot. The iron man himself, along with two phones, was taken as evidence, and the people are being held as suspects. Source: https://t.co/wAHVZZHXZC— PulseWire (@PulseWire_live) October 12, 2026రిమోట్‌తో నియంత్రించారా?రోబోట్ ఆ సమయంలో ఎలా పనిచేసింది? దాని కదలికలను ఎవరైనా రిమోట్ ద్వారా నియంత్రించారా? లేక ముందుగా ప్రోగ్రామ్ చేసిన విధంగా కదిలిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలికను వేధించే ఉద్దేశంతోనే రోబోట్‌ను కావాలని అలా నడిపించారా? అన్నది కూడా పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై లైంగిక వేధింపుల అనుమానంతో క్రిమినల్ దర్యాప్తు ప్రారంభించినట్లు కొలోన్ పోలీసులు తెలిపారు. రోబోట్ కదలికల వెనుక ఎవరున్నారు? ఈ ఘటనను చిత్రీకరించి సోషల్ మీడియాలో ప్రసారం చేయడంలో ఎవరి పాత్ర ఎంత? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.ఇదీ చదవండి: ఉక్రెయిన్ యుద్ధంలో కామారెడ్డి వాసి మృతి -
నక్కజిత్తుల మస్క్.. అడ్డంగా బుక్కయ్యాడుగా!
భారత్‌లో వ్యాపార గుత్తాధిపత్యాలపై గళమెత్తిన టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు అమెరికాలో ఎదురుదెబ్బ తగిలింది. స్టార్‌లింక్‌కు భారత్‌లో అనుమతులు ఆలస్యం కావడానికి కొందరు సంపన్న వ్యాపారవేత్తలే కారణమంటూ ఆరోపించిన మస్క్.. రిలయన్స్, బీజేపీ మధ్య సంబంధాలపై విమర్శలు గుప్పించారు. అయితే, అమెరికాలో రిపబ్లికన్లు అధికారంలో కొనసాగేందుకు భారీగా రాజకీయ విరాళాలు అందించడంపై ఇప్పుడు ఆయనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ సెనేటర్ బెర్నీ శాండర్స్ మస్క్‌పై తీవ్రంగా స్పందించారు.అమెరికాలో రాజకీయాల కోసం మస్క్ ఖర్చు చేస్తున్న భారీ మొత్తాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు కాంగ్రెస్‌పై తమ పట్టును కొనసాగించేందుకు మస్క్ సుమారు 36.6 కోట్ల డాలర్లు ఖర్చు చేసినట్లు వార్తా నివేదికలు వెల్లడించాయి. ఇందులో జూలై నుంచి అందించిన విరాళాలే కనీసం 27.6 కోట్ల డాలర్లుగా ఉన్నట్లు పేర్కొన్నాయి.రిపబ్లికన్ సెనేట్ అభ్యర్థులకు మద్దతిచ్చే సెనేట్ లీడర్షిప్ ఫండ్‌కు 15.8 కోట్ల డాలర్లు, తన రాజకీయ కమిటీ అమెరికా పీఏసీకి 7.6 కోట్ల డాలర్లు అందించినట్లు నివేదికలు తెలిపాయి. ఇతర రిపబ్లికన్ అనుకూల రాజకీయ కమిటీలకూ ఆయన నిధులు సమకూర్చారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా కూడా మస్క్ భారీగా ఖర్చు చేశారు.‘సంపన్నుల గుప్పిట్లో రాజకీయాలా?’మస్క్ విరాళాలపై అమెరికా సెనేటర్ బెర్నీ శాండర్స్ తీవ్రంగా స్పందించారు. 2024లో ట్రంప్ గెలుపు కోసం మస్క్ సుమారు 29 కోట్ల డాలర్లు ఖర్చు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌పై రిపబ్లికన్ల పట్టు కొనసాగేందుకు మరో 36.6 కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నారని విమర్శించారు. సంపన్నులు తమ ఆర్థిక శక్తితో రాజకీయ వ్యవస్థపై అసాధారణ ప్రభావం చూపుతున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.ఎన్నికల ప్రచారానికి కొద్దిమంది బిలియనీర్లు భారీగా నిధులు సమకూర్చే పరిస్థితి పెరిగితే.. సామాన్య ప్రజల సమస్యల కంటే సంపన్నుల ప్రయోజనాలకే రాజకీయాల్లో ప్రాధాన్యం పెరిగే ప్రమాదం ఉందన్నది శాండర్స్ వాదన. రాజకీయ వ్యవస్థ కొద్దిమంది ధనవంతుల గుప్పిట్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మస్క్ విరాళాలను ప్రస్తావిస్తూ, సంపదను రాజకీయ అధికారాన్ని ప్రభావితం చేసేందుకు ఉపయోగిస్తున్నారని విమర్శించారు.స్టార్‌లింక్ ఎంట్రీతో మొదలైన వివాదంప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్న మస్క్‌కు భారత్ కీలక మార్కెట్. అయితే, దేశంలో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన అనుమతుల ప్రక్రియ కొనసాగుతుండటంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. కొందరు భారతీయ ‘ఒలిగార్క్’లు తమ వ్యాపార గుత్తాధిపత్యాన్ని కాపాడుకునేందుకు స్టార్‌లింక్ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.‘ఒలిగార్క్’ అంటే ఆర్థిక, రాజకీయ వ్యవస్థలపై అసాధారణ ప్రభావం చూపగల కొద్దిమంది సంపన్నులు లేదంటే శక్తిమంతుల సమూహం. భారత్‌లో అలాంటి వ్యాపారవేత్తలే పోటీని అడ్డుకుంటున్నారన్నది మస్క్ వాదన. స్టార్‌లింక్‌కు మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తే వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందని ఆయన అభిప్రాయం. అయితే, అనుమతుల ప్రక్రియలో జాప్యానికి వ్యాపార గుత్తాధిపత్యాలే కారణమన్న ఆరోపణ నిర్ధారణ కాలేదు.‘ప్రధాని అంబానీనా?’ అంటూ వ్యంగ్యాస్త్రాలుఈ వివాదంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని లక్ష్యంగా చేసుకుని మస్క్ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. ‘భారత్‌కు అసలైన బాస్ అంబానీనా?’ అన్న అర్థం వచ్చేలా ప్రశ్నించడంతోపాటు ‘డియర్ ప్రైమ్ మినిస్టర్ అంబానీ’ అంటూ వ్యంగ్యంగా పోస్టు చేశారు. భారత్‌లో టెలికాం, ఇంటర్నెట్ రంగాల్లో వ్యాపార ప్రయోజనాలు, పోటీ, ప్రభుత్వ అనుమతులపై ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. భారత్‌లోనూ మస్క్‌కు కౌంటర్లుమస్క్ వ్యాఖ్యలపై భారతీయుల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. ఒక సంస్థకు మార్కెట్లో పోటీ చేసే అవకాశం ఉండాలని కోరడం వేరు.. తన వ్యాపారానికి అనుకూలంగా నిర్ణయాలు రావాలని కోరుతూ దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలపై ఆరోపణలు చేయడం వేరన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. స్టార్‌లింక్‌కు అనుమతులు ఇవ్వాలా వద్దా అన్నది నిబంధనలు, భద్రతా ప్రమాణాల ఆధారంగా నిర్ణయించాలే తప్ప, వ్యాపారవేత్తల మధ్య ఆరోపణలతో తేల్చకూడదని పలువురు పేర్కొన్నారు.మస్క్ వాదనకే ఎదురుప్రశ్న!ఇక్కడే మస్క్ వాదనపై విమర్శకులు ఎదురుప్రశ్నలు సంధిస్తున్నారు. భారత్ విషయంలో సంచలన ఆరోపణలు చేస్తూ.. అమెరికాలో మాత్రం ఒక రాజకీయ పక్షం అధికారంలో కొనసాగేందుకు భారీగా నిధులు సమకూరుస్తున్నారు. ఇతరుల ఆర్థిక ప్రభావాన్ని ప్రశ్నిస్తున్న వ్యక్తి.. తన సంపదతో రాజకీయాలపై ప్రభావం చూపడాన్ని ఎలా చూడాలన్న ప్రశ్నను సీనియర్ పొలిటీషియన్ అయిన శాండర్స్ ముందుకు తెచ్చారు. మరి అమెరికాలో తన రాజకీయ విరాళాలపై వస్తున్న ప్రశ్నలకు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: ఏఐ విషయంలో అన్నీ అతి భయలేనా? -
హౌతీల దెబ్బకు అజ్ఞాతంలోకి సౌదీ యువరాజు!
ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైనిక వ్యవస్థల్లో ఒకటిగా పేరొందిన సౌదీ అరేబియాకు ఇప్పుడు హౌతీ తిరుగుబాటుదారుల దాడులు తీవ్ర తలనొప్పిగా మారాయి. క్షిపణి దాడులతో రాజధాని రియాద్ సహా కీలక ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఈ పరిణామాల మధ్య సౌదీ యువరాజు, ఆ దేశ అసలు అధికార కేంద్రంగా భావించే మొహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) భద్రతపై ఉత్కంఠ నెలకొంది.భద్రత కట్టుదిట్టంగా ఉండే ఒక రాజభవనం నుంచి మరో రాజభవనానికి తరలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బంకర్లు ఉన్న భవనాల్లో ప్రత్యేక భద్రతా బృందం పర్యవేక్షణలో బిన్ సల్మాన్ ఉంటున్నట్లు సమాచారం. అయితే, ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వస్తున్న కథనాలపై సౌదీ ప్రభుత్వం అధికారికంగా స్పందించాల్సి ఉంది.రక్తదానం తర్వాత మాయం!41 ఏళ్ల మొహమ్మద్ బిన్ సల్మాన్ చివరిసారిగా మంగళవారం ఒక జాతీయ రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు బహిరంగంగా కనిపించారు. ఆ తర్వాత నుంచే ఆయన అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారన్నది ఆ కథనాల సారాంశం!. ఈ నేపథ్యంలో ఆయన కదలికలపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. యువరాజు కదలికల గురించి తెలిసిన అధికారులను ఉటంకిస్తూ, ఆయనను అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న రాజభవనాల మధ్య తరలిస్తున్నట్లు పేర్కొంది. ఈ భవనాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా బంకర్లు కూడా ఉన్నట్లు తెలిపింది. యువరాజు భద్రత కోసం ఆయనకు అత్యంత విశ్వసనీయమైన ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు వెల్లడించింది.హౌతీ తిరుగుబాటుదారుల దాడులు తీవ్రం కావడం, సౌదీపై ముప్పు పెరుగుతుండటంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు కథనం పేర్కొంది. అయితే, ఆయన ఎక్కడ ఉన్నారు? ఎప్పటికప్పుడు ఎందుకు నివాసం మారుస్తున్నారు? అనే సమాచారం అంత్యంత గోప్యంగా ఉంచారు.దశాబ్దంలోనే అత్యంత తీవ్రమైన దాడి!సౌదీ అరేబియాపై హౌతీలు ఇటీవల జరిపిన దాడులు అక్కడి భద్రతా వ్యవస్థకు సవాలుగా మారాయి. శనివారం జరిగిన దాడిని గత దశాబ్ద కాలంలోనే అత్యంత తీవ్రమైన దాడిగా నివేదికలు అభివర్ణించాయి. రాజధాని రియాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై కనీసం ఒక హౌతీ క్షిపణి దాడి జరిపింది. ఈ దాడిలో కనీసం 13 మంది మరణించగా, మరో 300 మందికిపైగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇరాన్ యుద్ధానికి సంబంధించి అమెరికా లేదా గల్ఫ్ మిత్రదేశాలపై జరిగిన దాడుల్లో ఇదే అత్యంత ప్రాణాంతకమైన ఘటనగా అధికారులకు వివరించినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.ఈ దాడి తీవ్రతకు బాధితులు ఎదుర్కొన్న పరిస్థితులు అద్దం పడుతున్నాయి. 28 ఏళ్ల ఈజిప్టు విమాన సహాయకురాలు ఒకరు చేతిని కోల్పోయి తీవ్ర రక్తస్రావంతో మరణించినట్లు కథనం వెల్లడించింది. మరికొందరు కూడా అవయవాలు కోల్పోయినట్లు పేర్కొంది.ఐదు రోజుల్లో నాలుగుసార్లు!రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా వరుస దాడులు జరగడం సౌదీ అధికారులను కలవరపెడుతోంది. గత ఐదు రోజుల్లో ఈ విమానాశ్రయంపై నాలుగుసార్లు దాడులు జరిగినట్లు నివేదికలు తెలిపాయి. వారాంతపు దాడి తర్వాత విమానాశ్రయాన్ని మూసేశారు. కీలక మౌలిక సదుపాయాలపై పదేపదే దాడులు జరగడం వల్ల సౌదీ భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారీగా ఖర్చు చేసి అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకున్నప్పటికీ, హౌతీల దాడులను పూర్తిగా అడ్డుకోలేకపోవడం ఆ దేశానికి సవాలుగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో సౌదీ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్అజీజ్ బిన్ సల్మాన్ తీవ్ర హెచ్చరిక చేశారు. దాడుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సౌదీ ప్రతిస్పందన కూడా అంతే తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేసినట్లు నివేదిక పేర్కొంది.రంగంలోకి దిగనున్న ట్రంప్?హౌతీలపై సౌదీ అరేబియా జరుపుతున్న దాడుల్లో తాము కూడా పాల్గొనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. దీంతో యెమెన్ సంక్షోభం మరింత విస్తరించే అవకాశాలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. మరోవైపు, సౌదీ అరేబియాకు మక్కా ఒప్పందంలోని మిత్రదేశాలు కూడా మద్దతు ప్రకటించాయి. ఈ పరిణామాలు హౌతీలపై సైనిక ఒత్తిడిని పెంచే దిశగా సాగుతున్నాయి.కాల్పుల విరమణకు బ్రేక్!సౌదీ అరేబియా, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల మధ్య పోరాటం కొత్తది కాదు. 2015లో యెమెన్ అంతర్యుద్ధంలో అక్కడి ప్రభుత్వానికి మద్దతుగా సౌదీ సైనిక జోక్యం చేసుకోవడంతో ఈ పోరు మరింత తీవ్రమైంది. అనంతరం ఇరుపక్షాల మధ్య సుదీర్ఘ ఘర్షణలు కొనసాగాయి. 2022లో కుదిరిన కాల్పుల విరమణతో పరిస్థితులు కొంతమేర అదుపులోకి వచ్చినప్పటికీ, ఆ ఒప్పందం ఈ ఏడాది జూలైలో కుప్పకూలినట్లు నివేదిక పేర్కొంది. అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరగడం కూడా ఈ ఘర్షణలకు ఆజ్యం పోసింది.సనా విమానాశ్రయంలో ఇరాన్ నుంచి వస్తున్న విమానం దిగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో సౌదీ దళాలు కాల్పులు జరిపాయని ఆరోపిస్తూ హౌతీలు మళ్లీ దాడులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.మధ్యవర్తిత్వానికి ఇరాన్ సిద్ధం?పశ్చిమాసియాలో ఇరాన్‌కు అత్యంత భారీ ఆయుధ సామర్థ్యం ఉన్న మిత్ర బలగాల్లో హౌతీలు ఒకటిగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో సౌదీ–హౌతీ ఘర్షణలు ప్రాంతీయ రాజకీయాలపైనా ప్రభావం చూపుతున్నాయి. అరేబియా ద్వీపకల్పంలో పరిణామాలపై ఇరాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తెలిపారు. ఈ పోరాటం వల్ల ఇజ్రాయెల్‌కు మాత్రమే ప్రయోజనం చేకూరుతుందని ఆయన వ్యాఖ్యానించారు.ఆదివారం రాత్రి సౌదీ, ఇరాన్ విదేశాంగ మంత్రులు కూడా తాజా పరిణామాలపై చర్చించారు. సైనిక చర్యలపైనే పట్టుబట్టి, రాజకీయ పరిస్థితులను విస్మరించడం సరికాదని తాను హెచ్చరించినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తెలిపారు. సౌదీ, హౌతీల మధ్య చర్చలు ప్రారంభించేందుకు సహకరించడానికి తమ దేశం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.మొత్తానికి, హౌతీల క్షిపణి దాడులు సౌదీ భద్రతా వ్యవస్థకు సవాలు విసురుతున్న వేళ.. యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ భద్రత, ఆయన బహిరంగంగా కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇదీ చదవండి: ఒక్క దాడి.. ఎన్నో అనుమానాలు! -
సౌదీపై హౌతీల పంజా.. అమెరికా ఎంట్రీ ఖాయమేనా?
పశ్చిమాసియాలో మరో యుద్ధం ముంచుకొస్తోందా? యెమెన్‌లోని హౌతీ రెబల్స్ సౌదీ అరేబియాపై దాడులను తీవ్రతరం చేయడంతో ఈ ప్రశ్న తలెత్తుతోంది. రాజధాని రియాద్‌లోని ప్రధాన విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు జరగడం, మరోవైపు ఎర్ర సముద్రానికి దక్షిణ ప్రవేశ ద్వారమైన బాబ్ అల్-మండేబ్ సమీపంలో పోరు ఉధృతం కావడం పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చాయి. ఈ దాడుల్లో అమెరికా పౌరుడు కూడా మరణించడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై స్పందించాలన్న ఒత్తిడి పెరుగుతోంది. అమెరికా నేరుగా రంగంలోకి దిగితే ఈ ఘర్షణ మరింత విస్తరించే ప్రమాదం ఉంది.యెమెన్‌లో ప్రభుత్వ దళాలు, హౌతీ తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణలు మళ్లీ తీవ్రరూపం దాల్చుతున్నాయి. సౌదీ మద్దతుతో యెమెన్ ప్రభుత్వ దళాలు హౌతీల ఆధీనంలోని ప్రాంతాలపై ఒత్తిడి పెంచుతుండగా.. హౌతీలు సౌదీ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగడం వల్ల ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇటీవలి దాడుల్లో ప్రాణనష్టం, గాయాల సంఖ్య పెరగడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. సౌదీపై దాడులు కొనసాగితే యెమెన్‌లో ఇప్పటికే ఉన్న సంఘర్షణ పొరుగు దేశాలకు విస్తరించే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.అమెరికా ఏం చేయబోతోంది?ఇప్పటికే ఈ దాడుల్ని ట్రంప్ ఆమోద యోగ్యం కాదని అన్నారు. అయితే అమెరికన్ మృతిపై మాత్రం ఆయన ఇంకా స్పందించాల్సి ఉంది. సౌదీ అరేబియా అమెరికాకు కీలక ప్రాంతీయ భాగస్వామి. ఆ దేశంపై దాడులు పెరిగి, అమెరికా పౌరుల ప్రాణాలకు ముప్పు ఏర్పడితే వాషింగ్టన్ స్పందన ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. హౌతీలపై ప్రత్యక్ష సైనిక చర్యకు దిగాలా? లేదంటే సౌదీ రక్షణ వ్యవస్థలకు సహకారం అందిస్తూ పరిస్థితిని అదుపులో ఉంచాలా? అనే అంశాలపై అమెరికా నిర్ణయం కీలకం కానుంది.అమెరికా నేరుగా దాడులకు దిగితే హౌతీలు ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశముంది. దాంతో సౌదీతోపాటు ఎర్ర సముద్రం, గల్ఫ్ ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారొచ్చు. మరోవైపు, సైనిక చర్యకు బదులుగా దౌత్యపరమైన ఒత్తిడి, రక్షణ సహకారం వంటి మార్గాలను ఎంచుకుంటే ఘర్షణ విస్తరణను అడ్డుకునే అవకాశం ఉంటుంది. ట్రంప్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఈ ప్రాంత భవిష్యత్ పరిణామాలపై ప్రభావం చూపనుంది.బాబ్ అల్-మండేబ్ వద్ద కీలక పోరుఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ అడెన్‌తో కలిపే బాబ్ అల్-మండేబ్ జలసంధి అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకం. ఈ మార్గం గుండా నౌకలు సూయజ్ కాలువ వైపు ప్రయాణిస్తాయి. ఇక్కడ నౌకాయానానికి అంతరాయం ఏర్పడితే ఆసియా–యూరప్ మధ్య సరుకు రవాణా ఆలస్యమవడంతోపాటు రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. యెమెన్ తీర ప్రాంతాల్లో హౌతీల ప్రభావం, సముద్ర మార్గాలపై దాడుల ముప్పు కారణంగా అంతర్జాతీయంగా ఈ ప్రాంతంపై నిఘా పెరిగింది. సౌదీపై దాడులు, బాబ్ అల్-మండేబ్ వద్ద ఉద్రిక్తతలు ఒకేసారి పెరిగితే సమస్య కేవలం రెండు పక్షాల మధ్య ఘర్షణగా మిగలదు. అంతర్జాతీయ వాణిజ్యం, చమురు సరఫరా, సముద్ర భద్రతపైనా ప్రభావం పడవచ్చు.పాకిస్తాన్, టర్కీ సాయం ఎంతవరకు?సౌదీ అరేబియా తన భద్రత కోసం ప్రాంతీయ భాగస్వాముల సహకారాన్ని కోరే అవకాశం ఉంది. పాకిస్తాన్, టర్కీతో సౌదీకి ఉన్న రక్షణ సంబంధాలు ఈ నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంటాయి. అయితే, రక్షణ ఒప్పందాలు ఉన్నంత మాత్రాన ఈ దేశాలు నేరుగా యుద్ధంలోకి దిగుతాయని చెప్పలేం. ఎలాంటి దాడి జరిగితే ఎలాంటి సహకారం అందించాలి? అది రక్షణకే పరిమితమా? లేక ప్రత్యక్ష సైనిక చర్యకూ విస్తరిస్తుందా? అనేది ఆయా దేశాల నిర్ణయాలు, ఒప్పంద నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.సౌదీకి రక్షణ సహకారం పెరిగితే హౌతీల దాడులను అడ్డుకునే సామర్థ్యం మెరుగుపడవచ్చు. అదే సమయంలో, అనేక దేశాలు ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటే ఘర్షణ మరింత విస్తరించే ప్రమాదమూ ఉంది. అందుకే సైనిక సన్నద్ధతతోపాటు దౌత్యపరమైన చర్చలు కూడా కీలకం కానున్నాయి.పెట్టుబడులు, చమురు మార్కెట్లపై ప్రభావంపశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగినప్పుడల్లా చమురు మార్కెట్లు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు అప్రమత్తమవుతారు. సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిలో కీలక దేశం కావడంతో అక్కడి భద్రతకు ముప్పు ఏర్పడితే ధరల్లో ఒడిదుడుకులు తలెత్తవచ్చు. ఎర్ర సముద్రం, బాబ్ అల్-మండేబ్ మార్గాల్లో నౌకాయానానికి అంతరాయం కలిగితే సరుకు రవాణా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది.సౌదీ చేపడుతున్న భారీ అభివృద్ధి ప్రాజెక్టులు, విదేశీ పెట్టుబడులపై కూడా దీర్ఘకాలిక అస్థిరత ప్రభావం చూపవచ్చు. అయితే, దాడులు జరిగినంత మాత్రాన చమురు సరఫరా లేదంటే పెట్టుబడులకు తక్షణమే భారీ నష్టం వాటిల్లుతుందని భావించలేం. దాడుల తీవ్రత, వాటి కొనసాగింపు, కీలక మౌలిక సదుపాయాలకు జరిగే నష్టం వంటి అంశాలే ప్రభావాన్ని నిర్ణయిస్తాయి.యుద్ధం విస్తరిస్తుందా?ప్రస్తుతం ప్రధానంగా గమనించాల్సిన అంశాలు మూడు. సౌదీపై హౌతీల దాడులు కొనసాగుతాయా? అమెరికా ప్రత్యక్ష సైనిక చర్యకు దిగుతుందా? బాబ్ అల్-మండేబ్ వంటి కీలక సముద్ర మార్గాల్లో భద్రతకు ముప్పు పెరుగుతుందా? వీటికి లభించే సమాధానాలే తదుపరి పరిణామాలను నిర్దేశించనున్నాయి. సౌదీపై దాడులకు ప్రతిగా పెద్ద ఎత్తున సైనిక చర్యలు జరిగితే యెమెన్ ఘర్షణ ప్రాంతీయ యుద్ధంగా మారే ప్రమాదం ఉంది. అదే సమయంలో, దౌత్యపరమైన ప్రయత్నాలు, రక్షణ చర్యలు పరిస్థితిని అదుపులోకి తీసుకురావొచ్చు. ఒక్కో దాడి వెనుక వ్యూహం ఏమిటి? దానికి ప్రతిస్పందనగా ఏ దేశం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అన్నదే ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతోంది.BIG BREAKING 🇸🇦 Houthis Launched Another Fresh attack on Riyadh, Saudi Arabia; One Indian k*lled, 11 people injured in this attack; Airport operations have been suspended. #Houthis #DroneAttack #RiyadhAirport #SaudiArabia https://t.co/EywQwa2AJt— Kamalraj Singh (@kamalrajsingh_) October 12, 2026ఇదీ చదవండి: హర్ముజ్‌పై ఊహించని ట్విస్ట్ -
కార్లు, విమానాలకంటే ప్రమాదకరం..! బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు
కృత్రిమ మేధ సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ దాని వల్ల కలిగే ముప్పులపైనా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్లు, విమానాలు, ఔషధాల మాదిరిగానే అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్/సూపర్ ఇంటెలిజెన్స్ పైనా కఠినమైన నియంత్రణలు, భద్రతా ప్రమాణాలు అవసరమని స్పష్టం చేశారు. అపారమైన ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఈ టెక్నాలజీ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు తగిన రక్షణ చర్యలు తప్పనిసరని పేర్కొన్నారు.ఏఐ/ఎస్ఐపై నియంత్రణలతో అన్ని ప్రమాదాలనూ పూర్తిగా తొలగించలేమని బిల్‌గేట్స్ అంగీకరించారు. అయితే, చెడు ఉద్దేశాలతో వ్యవహరించే వ్యక్తులు ఈ మోడళ్లను దుర్వినియోగం చేయకుండా నిరోధించేందుకు ఈ నిబంధనలు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ దిశగా ప్రపంచవ్యాప్తంగా మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ టెక్నాలజీ సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుంటూనే, దాని వల్ల కలిగే ముప్పులను తగ్గించేందుకు సమతుల్య విధానం అవసరమని అభిప్రాయపడ్డారు.అది అతిశయోక్తేనా?ఏఐ/ఎస్ఐ వల్ల మానవాళి మొత్తం అంతమయ్యే ప్రమాదం ఉందన్న వాదనలపైనా గేట్స్ స్పందించారు. ఈ తరహా భయాలను కొన్ని సందర్భాల్లో అతిగా చిత్రీకరిస్తున్నారని అన్నారు. అయితే, దాని వల్ల జరిగే ప్రమాదాలను పూర్తిగా కొట్టిపారేయలేమని స్పష్టం చేశారు. కార్లు, విమానాలు, ఔషధాల కంటే ఏఐతో ముడిపడిన ప్రమాదాలు మరింత తీవ్రమైనవిగా ఉండొచ్చని హెచ్చరించారు. నియంత్రణ కోల్పోతే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశముందని, పరిశ్రమలోని సంస్థలు సైతం ఈ ముప్పులపై అప్రమత్తం చేస్తున్నాయని తెలిపారు. ఈ టెక్నాలజీ అభివృద్ధిని పూర్తిగా అడ్డుకోకుండా.. భద్రతకు ప్రాధాన్యమిచ్చే మధ్యేమార్గాన్ని అనుసరించాలని సూచించారు.అలాగే.. సీఎన్ఎన్ జర్నలిస్ట్ జేక్ టాపర్‌తో ఆదివారం ఇదే అంశంపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేసే వ్యక్తుల వల్ల బయోటెర్రరిజం (జీవాయుధాల ద్వారా ఉగ్రదాడులు) ముప్పు పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళన మాత్రం వ్యక్తం చేశారు.పాలకుల పర్యవేక్షణ అవసరంమైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్ కూడా ఏఐ/ఎస్ఐ నియంత్రణలపై ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీ కంటే వాషింగ్ మెషీన్లు, పాల ఉత్పత్తులపై కూడా ఎక్కువ భద్రతా నిబంధనలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. కాబట్టి ఈ సాంకేతికత ఒక సాధనంగానే కాకుండా, ఆయుధంలా కూడా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా భద్రతా ప్రమాణాల రూపకల్పనను ఆలస్యం చేయకూడదని అన్నారు.మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సైతం కృతిమ మేధ మోడళ్లను గుడ్డిగా నమ్మకూడదని ఇటీవల సూచించారు. అవి మరింత శక్తిమంతంగా మారుతూ వ్యక్తిగత సమాచారాన్ని పొందగలుగుతున్న నేపథ్యంలో, వాటిలో లోపాలు లేదంటే భద్రతాపరమైన సమస్యలు తలెత్తవచ్చని అప్రమత్తం చేశారు. ముందునుంచే ప్రమాదాలను నియంత్రించే ఏర్పాట్లు ఉండాలని పేర్కొన్నారు.టెక్ దిగ్గజాల మధ్య భిన్నాభిప్రాయాలుఏఐ/ఎస్ఐ నియంత్రణల విషయంలో టెక్ పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓపెన్ఏఐ, ఆంథ్రోపిక్ వంటి సంస్థలు బలమైన భద్రతా నిబంధనలకు మద్దతు ఇస్తుండగా, మెటా, ఎన్విడియా వంటి సంస్థలు నియంత్రణలపై భిన్నమైన వైఖరిని ప్రదర్శిస్తున్నాయి. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూపర్ ఇంటెలిజెన్స్ అభివృద్ధిపై అతిగా నియంత్రణలు విధిస్తే, ఈ రంగంలో చైనా అమెరికాను అధిగమించే అవకాశం ఉందని గతంలో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఈ టెక్నాలజీ అభివృద్ధి వేగాన్ని కొనసాగిస్తూనే, దాని దుర్వినియోగాన్ని అడ్డుకోవడం, ప్రజల భద్రతను కాపాడటం ప్రపంచ దేశాల ముందున్న కీలక సవాలుగా మారింది.ఇదీ చదవండి: శభాష్.. స్కూల్స్‌లో ఇక డిజిటల్ పాఠాలు రద్దు -
హౌతీల దాడిలో హైదరాబాదీ మృతి.. ఐసీయూలో ముగ్గురు భారతీయులు!
రియాద్ ఎయిర్‌పోర్టుపై హౌతీ మిలిటెంట్ల వరుస దాడులు కలకలం రేపుతున్నాయి. తొలి దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ భారతీయుడు మృతి చెందడంతో మృతుల సంఖ్య 13కు చేరింది. తాజాగా నిన్న జరిగిన మరో దాడిలోనూ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. రెండు దాడుల్లోనూ వందల మంది గాయపడ్డారు. వరుస దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. సౌదీలోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీ మిలిటెంట్ల వరుస దాడులు కలకలం రేపుతున్నాయి. అక్టోబర్ 10న జరిగిన తొలి దాడిలో తీవ్రంగా గాయపడిన హైదరాబాద్‌కు చెందిన భారతీయుడు మృతి చెందడంతో మరణాల సంఖ్య 13కు చేరింది. తాజాగా అక్టోబర్ 11న జరిగిన మరో దాడిలోనూ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనల్లో పలువురు గాయపడ్డారు. దాడులను భారత్ తీవ్రంగా ఖండించడంతోపాటు, సౌదీలోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.రియాద్ విమానాశ్రయంపై జరిగిన దాడిలో తెలంగాణలోని హైదరాబాద్ మెహిదీపట్నానికి చెందిన ఐటీ నిపుణుడు మహమ్మద్ యూసుఫ్ అలీ (46) తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించారు. ఉమ్రా యాత్ర కోసం కుటుంబంతో కలిసి సౌదీ అరేబియా వెళ్లిన ఆయన.. మదీనాకు వెళ్లేందుకు విమానాశ్రయంలో వేచి ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన ఇద్దరు కుమారులు కూడా గాయపడ్డారు. తొలి దాడిలో మొత్తం 11 మంది భారతీయులు గాయపడినట్లు సమాచారం.ఐసీయూలో ముగ్గురు భారతీయులుగాయపడిన భారతీయుల ఆరోగ్య పరిస్థితిని భారత రాయబార కార్యాలయం పర్యవేక్షిస్తోంది. ముగ్గురు భారతీయులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని ఎంబసీ వెల్లడించింది. మరో ఇద్దరు సాధారణ వార్డుల్లో చికిత్స పొందుతుండగా, మిగతావారు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. యూసుఫ్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు, బాధిత కుటుంబానికి సహాయం అందించేందుకు స్థానిక అధికారులతో ఎంబసీ సమన్వయం చేసుకుంటోంది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా యూసుఫ్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.24 గంటల్లో రెండో దాడితొలి దాడి జరిగిన మరుసటి రోజే.. అక్టోబర్ 11న రియాద్ విమానాశ్రయంలోని టెర్మినల్-4పై మరోసారి దాడి జరిగింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, 11 మంది గాయపడినట్లు నివేదికలు వెల్లడించాయి. అదే రోజు సౌదీలోని కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయంపైనా దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి. వరుస దాడులతో విమానాశ్రయాలు, ఇతర పౌర మౌలిక సదుపాయాల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.దాడులను ఖండించిన భారత్పౌరులు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. సౌదీ అరేబియాలోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారుల సూచనలు, హెచ్చరికలను పాటించాలని రాయబార కార్యాలయం కోరింది. అవసరమైనప్పుడు ఇళ్లలోనే ఉండాలని సూచించింది. వరుస దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియాలో భద్రతా పరిస్థితులపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.ఇదీ చదవండి: సౌదీపై దాడి ఎఫెక్ట్.. హౌతీలకు దిమ్మతిరిగే షాక్? -
బీజేపీ–రిలయన్స్ లింక్.. మస్క్‌పై భారతీయుల ఫైర్!
భారత్‌లో స్టార్‌లింక్ సేవల ప్రవేశంపై రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్.. తాజాగా కొత్త రచ్చకు కారణమయ్యారు. రిలయన్స్, దానితో సంబంధాలున్న సంస్థలు అధికార బీజేపీకి భారీగా విరాళాలు ఇచ్చాయని గుర్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్లను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో స్టార్‌లింక్ వివాదం కాస్తా.. రాజకీయ మలుపు తీసుకుంది. భారత్‌లో స్టార్‌లింక్ సేవలకు అనుమతుల విషయంలో జాప్యం జరుగుతోందంటూ ఎలాన్ మస్క్ కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత్‌లో గుత్తాధిపత్యం ప్రదర్శించే కొందరు స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నారని సంచలన ఆరోపణలకు దిగారాయన. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ వాదనలను తోసిపుచ్చింది. ఉపగ్రహ ఇంటర్నెట్ సేవల సంస్థలు భద్రతా నిబంధనలు, నియంత్రణ ప్రమాణాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. స్టార్లింక్తోపాటు ఇతర సంస్థలకూ భద్రతా అనుమతులు, స్పెక్ట్రమ్ కేటాయింపు వంటి అంశాలు కీలకంగా ఉన్నాయని గుర్తు చేసింది. రాహుల్ ఎంట్రీ! డియర్ పీఎం అంబానీ అంటూ.. ఆ వెంటనే ఎలాన్ మస్క్ ‘ఆ బాస్ అంబానీయేనా?’ అంటూ ట్వీట్ చేయగా దానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. వెల్కమ్ టు ఇండియా మస్క్.. ఇంకో పేరు త్వరలోనే బయటకు వస్తుందంటూ రీట్వీట్ చేశారు. దానికిగానూ రాహుల్‌కు థ్యాంక్స్ చెప్పిన మస్క్.. ఇది నిజంగా భయంకరంగా ఉంది అంటూ మరో బదులు ఇచ్చారు.ఈ నేపథ్యంలో అంబానీని ఉద్దేశిస్తూ గత రాత్రి.. ‘డియర్ ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. భారత్‌కు అసలు బాస్ మీరేనని గుర్తించలేకపోయినందుకు క్షమించండి’ అంటూ వ్యంగ్యంగా పోస్టు చేశారు. భారత మార్కెట్లో స్టార్‌లింక్ పోటీని అనుమతించాలని కోరారు. ఇంటర్నెట్ సౌకర్యాలు అందని ప్రాంతాలకు తమ సేవలు చేరితే పిల్లలకు విద్యావకాశాలు, చిన్న వ్యాపారులకు ప్రయోజనం కలుగుతాయని పేర్కొన్నారు.Dear Prime Minister Ambani, Please accept my humble apologies for not realizing that you are the real boss of India. Naturally, you would prefer to maintain your monopolistic exploitation of the great people of India, but would you nonetheless consider allowing Starlink to compete? There are many areas of India, as there are in all countries, with no Internet access, which denies children the opportunity for education and for small businesses the opportunity to sell their goods to a global market. Starlink would change their lives for the better. Thank you 🙏— Elon Musk (@elonmusk) October 9, 2026బీజేపీ ప్రచారానికి రిలయన్స్ ఫండ్స్..ఇప్పుడు మస్క్ తాజాగా షేర్ చేసిన కథనాల్లో ఒకటి అల్‌జజీరా 2022 మార్చి 14న ప్రచురించిన పరిశోధనాత్మక కథనం. ‘హౌ ఏ రిలయన్స్-ఫండెడ్ ఫర్మ్ బూస్ట్స్ బీజేపీస్ క్యాంపెయిన్స్ ఆన్ ఫేస్బుక్’ను మస్క్ ఇప్పుడు షేర్ చేశారు. అలాగే మస్క్ షేర్ చేసిన మరో కథనం 2024 మార్చి 21న ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ‘రిలయన్స్-లింక్డ్ క్విక్ సప్లై గేవ్ రూ.385 కోట్లు టు బీజేపీ, రూ.25 కోట్లు టు శివసేన’ పేరిట ప్రచురితమైంది. రిలయన్స్‌తో సంబంధాలు ఉన్న క్విక్ సప్లై అనే కంపెనీ బీజేపీకి వందల కోట్ల విరాళాలు ఇచ్చిందన్నది ఆ కథనం సారాంశం. https://t.co/DJYynAyO0W— Elon Musk (@elonmusk) October 10, 2026మస్క్ వ్యవహారశైలిపై నెటిజన్ల ప్రశ్నలుఅంబానీని లక్ష్యంగా చేసుకుని పాత కథనాలను షేర్ చేస్తున్న మస్క్ తీరుపై కొందరు భారతీయ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయ పార్టీలకు ఇలాంటి ఫండింగ్‌లు సర్వసాధారణమేని గుర్తు చేస్తున్నారు. బీజేపీకి మాత్రమే కాదని.. ఇతర పార్టీలకు కూడా అలాంటి వ్యాపారవేత్తలు విరాళాలు ఇస్తుంటారని అంటున్నారు. అంతెందుకు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా మస్క్ కూడా భారీగా ఖర్చు చేశారంటూ కొందరు అందుకు సంబంధించిన స్క్రీన్షాట్లను పోస్టు చేస్తున్నారు. ఇతరుల రాజకీయ సంబంధాలు, విరాళాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నప్పుడు.. తన రాజకీయ మద్దతు, ఖర్చులపైనా అదే ప్రమాణం వర్తించాలంటూ వ్యాఖ్యానిస్తున్నారు.స్టార్‌లింక్ వివాదం.. రాజకీయ విరాళాల చర్చస్టార్లింక్ భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు అవసరమైన అనుమతులపై మొదలైన వివాదం ఇప్పుడు కార్పొరేట్ గుత్తాధిపత్యం, రాజకీయ పార్టీలకు అందే విరాళాలు, ఎన్నికల ప్రచారంలో సంస్థల పాత్ర వంటి విస్తృత అంశాలపై చర్చకు దారితీసింది. అంబానీపై మస్క్ చేసిన ‘డియర్ పీఎం అంబానీ’ వ్యాఖ్యకు తోడు, పాత కథనాలను ఆయన మళ్లీ షేర్ చేయడం.. దానికి భారతీయుల కౌంటర్ ఈ చర్చకు మరింత ప్రాధాన్యం తెచ్చింది. ఇదీ చదవండి: ఎలాన్ మస్క్‌పై స్టార్ నటుడి ఫైర్ -
పనామాను వణికించిన భూకంపం.. తొలగిన సునామీ భయం!
మధ్య అమెరికా దేశం పనామాను భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి, ఎత్తైన భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని ప్రాంతాల్లో భవనాలు కూలిపోగా.. రహదారులు దెబ్బతిన్నాయి. తొలుత పనామాతో పాటు పలు దేశాల తీర ప్రాంతాలకు జారీ చేసిన సునామీ హెచ్చరికలను అధికారులు ఆ తర్వాత ఉపసంహరించారు. దీంతో తీర ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టంపై అధికారులు అంచనాలు కొనసాగిస్తున్నారు.భారత కాలమానం ప్రకారం.. శుక్రవారం రాత్రి పనామాను భారీ భూకంపం వణికించింది. హెర్రెరా ప్రావిన్స్‌లోని పిటలోజా అర్రిబా ప్రాంతానికి సమీపంలో ఉన్నట్లు అమెరికా భూగర్భ సర్వే సంస్థ (యూఎస్జీఎస్) వెల్లడించింది. పనామా రాజధాని పనామా సిటీకి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. దాదాపు నిమిషం పాటు ప్రకంపనలు కొనసాగడంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.కోక్లే ప్రావిన్స్‌లోని పెనోనోమే ప్రాంతంలో చారిత్రక చర్చి, గవర్నర్ కార్యాలయ భవనం సహా పలు నిర్మాణాలు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రహదారులు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హెర్రెరా, లాస్ శాంటోస్ ప్రాంతాల్లోనూ ఇళ్లు, ఇతర నిర్మాణాలకు నష్టం వాటిల్లినట్లు వార్తలు వెలువడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, ఫోన్‌కాల్స్-ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగింది.A massive magnitude 7.7 earthquake struck Panama, shaking buildings more than 100 miles away and prompting evacuations, according to the U.S. Geological Survey. Tremors were felt in Panama City, where buildings shook and people evacuated into the streets. https://t.co/46kFq5wpSV https://t.co/jsr5g6uLDv— CBS News (@CBSNews) October 9, 202680కి పైగా ప్రకంపనలుప్రధాన భూకంపం తర్వాత వరుసగా ప్రకంపనలు(ఆఫ్టర్ షాక్స్) రావడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. వాటిల్లో ఒకటి 6.6 తీవ్రతతో సంభవించింది. పనామా సిటీలో ఎత్తైన భవనాల నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. టోకుమెన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలను కొద్దిసేపు నిలిపివేసి, తనిఖీల అనంతరం తిరిగి ప్రారంభించారు. పనామా కాలువలో మాత్రం కార్యకలాపాలకు అంతరాయం కలగలేదని సమాచారం. భూకంపం కారణంగా ప్రాణనష్టం జరిగినట్లు తొలుత అధికారికంగా ధ్రువీకరించలేదు. అయితే పలువురికి స్వల్ప గాయాలైనట్లు, దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వార్తా సంస్థలు వెల్లడించాయి. భవనాల నష్టం, రహదారుల పరిస్థితి, ఇతర మౌలిక సదుపాయాలపై అధికారులు అంచనా వేస్తున్నారు.భయంతో.. భూకంప కేంద్రానికి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని పనామా సిటీలోనూ ప్రకంపనల తీవ్రత కనిపించింది. ఎత్తైన భవనాల్లో ఉన్నవారు భయంతో బయటకు పరుగులు తీశారు. 15 అంతస్తుల భవనం నుంచి రెండోసారి బయటకు వచ్చిన సాలమన్ ఆండియన్ అనే వ్యక్తి.. ఫర్నిచర్, మంచం, వంటగదిలోని వస్తువులు బలంగా కదిలాయని వెల్లడించారు.TERREMOTO EN PANAMÁ ▪️Panamá afectado por este terrible terremoto de 7.6. Se sintió en Ciudad de Panamá, hay Alerta de tsunami; se produjeron varias réplicas. #Terremoto #Panamá #Sismo https://t.co/udnuMfvWiQ— @ALTOS_NOTICIASpy (@Altosnoticiasp1) October 9, 202620 అంతస్తులకు పైగా ఉన్న ఓ భవనం పైకప్పుపై ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్ నుంచి నీరు కిందకు జారిపడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పనామా కాలువపై ఉన్న ఓ వంతెన సైతం తీవ్రంగా కంపించినా కూలిపోలేదు. ఆ సమయంలో వాహనాలు వంతెనపై ప్రయాణిస్తున్న దృశ్యాలు ఆందోళన కలిగించాయి.సునామీ వార్నింగ్ ఎత్తివేతభూకంపం తర్వాత పనామాతో పాటు కొలంబియా, కోస్టారికా, ఈక్వెడార్, పెరూ, నికరాగువా, గ్వాటెమాలా, ఎల్ సాల్వడార్, మెక్సికో తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. అనంతరం సునామీ ముప్పు తొలగిపోయినట్లు అధికారులు ప్రకటించారు. అయినప్పటికీ తీర ప్రాంత ప్రజలు స్థానిక అధికారుల సూచనలు పాటించాలని, భూకంపానంతర ప్రకంపనల(After Shocks) పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అధ్యక్షుడి ప్రకటన.. విద్యాసంస్థలు బంద్భూకంప తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో ప్రజలు ఆందోళన చెందవద్దని, అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని ప్రజలకు పిలుపునిచ్చారు. భూకంపం తర్వాత పరిస్థితిని సమీక్షించేందుకు ఆయన పెనోనోమే ప్రాంతాన్ని సందర్శించారు. దేశవ్యాప్తంగా పాఠశాలల్లో తరగతులను నిలిపివేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. యూనివర్సిటీ ఆఫ్ పనామా సహా విద్యాసంస్థల్లోనూ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు, అగ్నిమాపక కేంద్రాల్లోనూ నష్టం నమోదైంది. 17 ఆరోగ్య సంస్థల్లో భవనాలకు సంబంధించిన సమస్యలు గుర్తించగా, కొన్ని ఆసుపత్రుల్లో రోగులను ముందుజాగ్రత్తగా బయటకు తరలించారు. పలు పాఠశాలలు, అగ్నిమాపక కేంద్రాల్లోనూ గోడలకు పగుళ్లు, పైకప్పుల పెచ్చులు ఊడిపోవడం వంటి నష్టం కనిపించింది. అధ్యక్షుడు, అధికారులు నష్టంపై సమీక్ష కొనసాగిస్తుండగా.. పొరుగుదేశాలు, అమెరికా సైతం సహాయానికి ముందుకొచ్చాయి.గతంలోనూ లాటిన్ అమెరికాలో భారీ విధ్వంసంలాటిన్ అమెరికా ప్రాంతం భూకంపాల ముప్పు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఒకటి. భూమి లోపల ఉన్న టెక్టానిక్ పలకల కదలికల కారణంగా ఇక్కడ తరచూ తీవ్ర ప్రకంపనలు సంభవిస్తుంటాయి. 2010లో హైతీలో సంభవించిన 7.0 తీవ్రత భూకంపం భయానక విధ్వంసాన్ని సృష్టించింది. అధికారిక అంచనాల ప్రకారం సుమారు 3.16 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా, మరో 3 లక్షల మంది గాయపడ్డారు. అదే ఏడాది చిలీలో 8.8 తీవ్రతతో వచ్చిన భూకంపం, దాని తర్వాత సంభవించిన సునామీ కారణంగా 521 మంది మరణించగా, మరో 56 మంది ఆచూకీ లభించలేదు. సుమారు 3.7 లక్షల ఇళ్లు దెబ్బతినడమో లేదంటే పూర్తిగా ధ్వంసమయ్యాయి. అంతకుముందు 1960లో చిలీలో సంభవించిన 9.5 తీవ్రత భూకంపం ఆధునిక చరిత్రలో నమోదైన అత్యంత శక్తిమంతమైన భూకంపంగా గుర్తింపు పొందింది. ఆ భూకంపం, దాని తర్వాత వచ్చిన సునామీ కారణంగా చిలీలోనే సుమారు 1,600 మంది ప్రాణాలు కోల్పోగా, హవాయి, జపాన్, ఫిలిప్పీన్స్ తదితర ప్రాంతాల్లో మరో 200 మంది మరణించారు. ఇదీ చదవండి: ఏకంగా ఐసీసీపైనే అమెరికా ఆంక్షలు -
పొరపాటున కూడా ‘ఏఐ’ అనొద్దు.. అన్నారో ఇక అంతే!: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కృత్రిమ మేధస్సు(AI-ఏఐ) అనే పదానికి బదులుగా ‘సూపర్ ఇంటెలిజెన్స్’ అనాలని సూచించారు. కాదని పాత పదాన్ని ఉపయోగించేవారిని శత్రువులుగా పరిగణిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ వేదికగా వ్యాఖ్యలు చేశారు. అయితే ఏం చేస్తారన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.ఏఐపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ పేరు మార్పు ప్రయత్నం చేస్తున్నారు. ‘ఆర్టిఫిషియల్’ అనే పదం ఈ సాంకేతికతను తక్కువ చేసి చూపిస్తోందని, ప్రస్తుత సాంకేతిక సామర్థ్యాలను ‘సూపర్ ఇంటెలిజెన్స్’ అనే పదమే బాగా వివరిస్తుందని ఆయన వాదిస్తున్నారు. సెప్టెంబర్ 29న ఆయన సంతకం చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల ప్రకారం.. అమెరికా ప్రభుత్వ విభాగాలు అధికారిక సమాచారంలో ఏఐ(AI), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పదాలకు బదులుగా ఎస్ఐ(SI), సూపర్ ఇంటెలిజెన్స్ పదాలను ఉపయోగించాలి.మస్క్ కూడా ఓకే అన్నారు!ట్రంప్ ఆలోచనకు ఆయన సన్నిహితుడు, స్పేస్ఎక్స్ ఏఐ విభాగం అధిపతి ఎలాన్ మస్క్ కూడా మద్దతు పలికారు. తన సంస్థ పేరును ‘స్పేస్ఎక్స్ఏఐ’ నుంచి ‘స్పేస్ఎక్స్ఎస్ఐ’గా మార్చుతారా? అని ఓ ఎక్స్ వినియోగదారు అడగ్గా.. ‘అవును, ఆ మార్పు చేస్తాం’ అని మస్క్ బదులిచ్చారు. అయితే, పేరు మార్పునకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు.విమర్శలకు సమాధానంగానే.. కృత్రిమ మేధస్సు వినియోగం పెరుగుతున్న కొద్దీ దాని భద్రత, దుర్వినియోగం, నియంత్రణపై చర్చలు తీవ్రంగా సాగుతున్నాయి. ప్రభుత్వ వెబ్సైట్లు, కంపెనీల వ్యవస్థలపై ఏఐ ఆధారిత దాడుల ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఈ సాంకేతికతపై ప్రజల్లో భయాలు, వ్యతిరేకత పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో దాని పేరును సానుకూలంగా మార్చడం ద్వారా ప్రజల దృష్టిని దాని అవకాశాలవైపు మళ్లించాలని ట్రంప్ భావిస్తున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రభుత్వ వెబ్సైట్లోనూ మార్పులుట్రంప్ ఆదేశాల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వ ఏఐ వెబ్సైట్లోనూ ‘SI’ అనే పదాన్ని ప్రముఖంగా ప్రదర్శించారు. అయితే వెబ్సైట్ చిరునామా మాత్రం ‘AI.gov’గానే ఉంది. మరోవైపు, వైట్‌హౌస్‌లోని కొన్ని వెబ్పేజీల్లో ఇప్పటికీ ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ అనే పదం కనిపిస్తుండటం గమనార్హం.ఏఐపై నియంత్రణ వద్దు..అమెరికా ఏఐ రంగంలో ముందంజలో ఉందని, చైనాతో పోటీలో వెనుకబడకుండా ఈ సాంకేతికత అభివృద్ధిని వేగవంతం చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ రంగంలోని కంపెనీలు స్వీయ నియంత్రణ పాటించగలవని ఆయన గతంలో పేర్కొన్నారు. అయితే ఏఐ భద్రతపై ప్రభుత్వ నియంత్రణలు అవసరమనే డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. పేరును మార్చడం వల్ల సాంకేతికతపై ఉన్న భద్రతా సందేహాలు తొలగిపోతాయా? లేదంటే ఇది కేవలం ప్రచార వ్యూహంగానే మిగిలిపోతుందా? అన్నది చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: మిడ్ టర్మ్‌లో ట్రంప్‌కు ఘోర పరాభవం తప్పదా? -
సూర్యుడిపై మహా విస్ఫోటనం.. భూమిని తాకనున్న సోలార్ సునామీ!
సూర్యుడిపై షరా మాములుగా భారీ పేలుడు సంభవించింది. కాకపోతే కాస్త ఎక్కువ తీవ్రతతో!. దాని నుంచి వెలువడిన శక్తిమంతమైన తరంగం సూర్యుడి వాతావరణం అంతటా విస్తరించగా.. మరోవైపు వేడెక్కిన ప్లాస్మా, అయస్కాంత క్షేత్రాలతో కూడిన పదార్థం అంతరిక్షంలోకి దూసుకొచ్చింది. ఇప్పుడు వీటి ప్రభావం భూమిపై ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మరో మూడు రోజుల్లో సౌర ఉద్గారాలు భూమి అయస్కాంత క్షేత్రాన్ని తాకే అవకాశం ఉందని అంచనాలు నెలకొన్నాయి. దీంతో భూ అయస్కాంత తుపాన్లు ఏర్పడవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మరి ఈ సౌర కల్లోలంతో భూమిపై ఏం జరగనుంది?అక్టోబర్ 8న సన్‌స్పాట్ 4549 ప్రాంతంలో మరోసారి భారీ విస్ఫోటనం సంభవించింది. దీని నుంచి ఎం6.7 తరగతికి చెందిన సౌర జ్వాల (సోలార్ ఫ్లేర్) వెలువడింది. ఈ తరహా జ్వాలలు సూర్యుడి నుంచి ఒక్కసారిగా పెద్ద మొత్తంలో శక్తిని విడుదల చేస్తాయి. వీటి వల్ల కొన్ని పరిస్థితుల్లో రేడియో సమాచార వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడవచ్చు. ఈ పేలుడుతోపాటు సూర్యుడి వాతావరణంలో ‘సోలార్ సునామీ’గా పిలిచే మోరెటన్ తరంగం కూడా ఏర్పడింది. ఇది భూమిపై సముద్రాల్లో వచ్చే సునామీలా కాదు. సూర్యుడి వాతావరణంలో వేగంగా విస్తరించే వేడైన ప్లాస్మా, అయస్కాంత శక్తితో కూడిన భారీ తరంగం. గంటకు పది లక్షల మైళ్లకు పైగా వేగంతో ప్రయాణించగల ఈ తరంగం సూర్యుడి కనిపించే ఉపరితలంలో విస్తృత ప్రాంతాన్ని ప్రభావితం చేసింది.భూమి వైపు దూసుకొస్తున్నది ఏమిటి?సౌర జ్వాల నుంచి వెలువడే కాంతి, ఎక్స్-కిరణాలు భూమిని త్వరగా చేరగలవు. అయితే కరోనా మాస్ ఇజెక్షన్లు (సీఎంఈలు) అని పిలిచే భారీ ప్లాస్మా ఉద్గారాలు భూమిని చేరేందుకు కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల వరకు పట్టొచ్చు. తాజా అంచనాల ప్రకారం, అక్టోబర్ 8న వెలువడిన ఉద్గారం అక్టోబర్ 11న భూమిని తాకవచ్చు. మరో రెండు ఉద్గారాలు కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.ఎలాంటి ప్రభావం ఉండొచ్చు?సీఎంఈలు భూమిని చేరినప్పుడు మన గ్రహం చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రం అల్లకల్లోలానికి గురవుతుంది. దీన్నే భూ అయస్కాంత తుపాను అంటారు. ఈ ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందనేది సౌర ఉద్గారాల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ పరిపాలన సంస్థ (నోవా) ప్రకారం.. ఇలాంటి తుపాన్లు ఉపగ్రహాల పనితీరు, జీపీఎస్ నావిగేషన్, రేడియో సమాచార వ్యవస్థలు, విద్యుత్ గ్రిడ్లపై ప్రభావం చూపవచ్చు.అయితే ప్రతి సౌర తుపానూ భారీ నష్టాన్ని కలిగించాలన్న గ్యారెంటీ లేదు. స్వల్ప స్థాయి తుపాన్ల వల్ల ఉపగ్రహాల కార్యకలాపాల్లో చిన్నపాటి సమస్యలు లేదంటే విద్యుత్ గ్రిడ్లలో స్వల్ప హెచ్చుతగ్గులు ఏర్పడవచ్చు. బలమైన తుపాన్ల సమయంలో కొన్ని ప్రాంతాల్లో రేడియో, నావిగేషన్ వ్యవస్థలకు అంతరాయాలు కలగవచ్చు. ప్రస్తుతం అంచనా వేస్తున్న ప్రభావాల తీవ్రతను బట్టి ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని చెప్పడానికి ఆధారాలు లేవు.ఆకాశంలో రంగుల వెలుగులు!ఈ సౌర ఉద్గారాల వల్ల మరో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమయ్యే అవకాశముంది. సూర్యుడి నుంచి వచ్చిన ఆవేశిత కణాలు(Charged particles) భూమి వాతావరణంలోని వాయువులతో పరస్పర చర్య జరిపినప్పుడు ఆకుపచ్చ, ఎరుపు, ఊదా వంటి రంగుల్లో అరోరాలు కనిపిస్తాయి. సాధారణంగా ధ్రువ ప్రాంతాల వద్ద కనిపించే ఈ కాంతులు.. తుపాను బలంగా ఉన్నప్పుడు మరింత దక్షిణం లేదా ఉత్తరాన ఉన్న ప్రాంతాలకూ విస్తరించవచ్చు. అయితే అవి ఎక్కడ కనిపిస్తాయనేది తుపాను తీవ్రత, అయస్కాంత క్షేత్రాల దిశపై ఆధారపడి ఉంటుంది.శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?ఆస్ట్రేలియా అంతరిక్ష వాతావరణ కేంద్రం తాజా అంచనాల ప్రకారం.. అక్టోబర్ 8న వెలువడిన ఎం6.7 తరగతి సౌర జ్వాల తర్వాత ఒక కరోనా మాస్ ఇజెక్షన్ నమోదైంది. ఇది అక్టోబర్ 11న భూమిని పాక్షికంగా తాకే అవకాశం ఉందని నమూనాలు సూచిస్తున్నాయి. ఈ మధ్యలో మరిన్ని సౌర జ్వాలలు వెలువడే అవకాశమూ ఉందని అంచనా. అయితే భూమిపై వాస్తవ ప్రభావం ఎంత ఉంటుందనేది ఉద్గారాలు చేరిన తర్వాతే స్పష్టమవుతుంది.మొత్తానికి.. సూర్యుడిపై సంభవించిన భారీ పేలుడు అంతరిక్ష వాతావరణాన్ని ప్రభావితం చేసే అవకాశమున్నా, భూమిపై ఏదో పెను విపత్తు తప్పదని భావించాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో సౌర ఉద్గారాల గమనాన్ని శాస్త్రవేత్తలు పర్యవేక్షించనున్నారు. వాటి వేగం, అయస్కాంత లక్షణాలే భూమిపై ప్రభావం ఎంత ఉంటుందో నిర్ణయించనున్నాయి.గమనిక: సోలార్ సునామీ తరంగం నేరుగా భూమిని ఢీకొంటుందని కాదు. సూర్యుడి వాతావరణంలో ఏర్పడిన ఆ తరంగం, దాని వెంట వెలువడిన ప్లాస్మా ఉద్గారం వేర్వేరు అంశాలు. భూమిపై ప్రభావం ప్రధానంగా భూమి దిశగా వచ్చే సీఎంఈల వేగం, సాంద్రత, వాటి అయస్కాంత క్షేత్రాల దిశపై ఆధారపడి ఉంటుంది.ఇదీ చదవండి: కాల్చి చంపేటప్పుడు లైవ్‌లో చూపించడం సబబేనా? -
లైవ్‌లోనే మరణశిక్ష.. ట్రంప్ సర్కార్ ఎందుకిలా?
అమెరికాలో సంచలనం రేపిన ఓ సైనిక స్థావరంపై కాల్పుల కేసులో ట్రంప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2009లో టెక్సాస్‌లోని ఫోర్ట్ హుడ్ సైనిక స్థావరంలో 13 మందిని కాల్చి చంపిన మాజీ ఆర్మీ మానసిక వైద్యుడు నిడాల్ హసన్‌కు మరణశిక్ష అమలు చేసే ముహూర్తం ఖరారు చేశారు. అంతేకాదు.. అతడిని ఫైరింగ్ స్క్వాడ్‌తో కాల్చి చంపే ప్రక్రియను లైవ్‌స్ట్రీమింగ్ చేయనున్నట్లు పెంటగాన్ ప్రకటించింది. నిడాల్ హసన్‌కు డిసెంబర్ 3, 2026న గురువారం మధ్యాహ్నం 1 గంటకు అమెరికా సెంట్రల్ టైమ్ ప్రకారం (భారత కాలమానం ప్రకారం డిసెంబర్ 4న అర్ధరాత్రి 12:30 గంటలకు) మరణశిక్ష అమలు చేయనున్నారు. టెక్సాస్‌లోని ఫోర్ట్ హుడ్ సైనిక స్థావరంలో ఫైరింగ్ స్క్వాడ్(తుపాకీతో కాల్చి చంపడం) ద్వారా శిక్ష అమలు చేయాలని నిర్ణయించారు. అమెరికాలో మరణశిక్షను ప్రత్యక్ష ప్రసారం చేయడం ఇదే తొలిసారి కానుంది. అయితే.. ఈ నిర్ణయం వెనుక శిక్ష తీవ్రతను ప్రజలకు చాటాలనే ఉద్దేశం ఉందని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. అదే సమయంలో లైవ్ టెలికాస్టింగ్పై న్యాయపరమైన ప్రశ్నలతోపాటు నైతిక చర్చ కూడా మొదలైంది.రక్షణ మంత్రి హెగ్సెత్ ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ.. ఇలాంటి చర్యలకు తీవ్రమైన పరిణామాలు ఉంటాయనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పారు. ఫోర్ట్ హుడ్‌లో గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు శిక్ష అమలు చేయాలని నిర్ణయించడం కూడా యాదృచ్ఛికం కాదని ఆయన వ్యాఖ్యానించారు. 2009లో హసన్ కాల్పులకు తెగబడిన రోజు, సమయం, అదే స్థావరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అసలు నిడాల్ హసన్ ఎవరు?నిడాల్ హసన్ (56) గతంలో అమెరికా సైన్యంలో మానసిక వైద్యుడిగా పనిచేశారు. 2009 నవంబర్ 5న టెక్సాస్‌లోని ఫోర్ట్ హుడ్ సైనిక స్థావరంలో ఉన్న వైద్య కేంద్రంలోకి వెళ్లి తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 13 మంది మరణించగా, మరో 32 మంది గాయపడ్డారు. మృతుల్లో గర్భిణీ సైనికురాలు కూడా ఉన్నారు. కాల్పుల సమయంలో హసన్ సెమీ ఆటోమేటిక్ హ్యాండ్‌గన్ ఉపయోగించినట్లు నివేదికలు వెల్లడించాయి.ఈ దాడి జరిగినప్పుడు హసన్ మరికొద్ది వారాల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు విధులపై వెళ్లాల్సి ఉంది. అమెరికా ముస్లిం దేశాల్లో చేపట్టిన యుద్ధాలకు ప్రతీకారంగానే దాడి చేసినట్లు ఆయన పేర్కొన్నారని వార్తా కథనాలు తెలిపాయి. అరెస్టు చేసే సమయంలో పోలీసులు కాల్పులు జరపడంతో హసన్ పాక్షికంగా పక్షవాతానికి గురయ్యారు. అప్పటి నుంచి వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు.2013లోనే మరణశిక్ష విధింపుఈ కేసులో సైనిక న్యాయస్థానం 2013 ఆగస్టులో హసన్‌ను దోషిగా తేల్చింది. ముందస్తు ప్రణాళికతో హత్యలు చేయడం, హత్యాయత్నాలకు పాల్పడటం కలిపి 45 అభియోగాల్లో ఆయన దోషిగా తేలారు. అనంతరం సైనిక జ్యూరీ మరణశిక్ష విధించాలని సిఫార్సు చేసింది. అప్పటి నుంచి ఆయన మరణశిక్ష ఖైదీగా ఉన్నారు.అమెరికా సైనిక చట్టాల ప్రకారం సైనికుడికి మరణశిక్ష అమలు చేయడానికి అధ్యక్షుడి ఆమోదం తప్పనిసరి. రక్షణ మంత్రి హెగ్సెత్ సిఫార్సు మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా శిక్ష అమలుకు ఆమోదం తెలిపినట్లు పెంటగాన్ వెల్లడించింది. డిసెంబర్ 3న టెక్సాస్‌లోని అదే ఫోర్ట్ హుడ్ స్థావరంలో మధ్యాహ్నం ఒంటి గంటకు శిక్ష అమలు చేయాలని సైన్యం ప్రకటించింది.అమెరికా చరిత్రలోనే అరుదైన పరిణామంఅమెరికాలో మరణశిక్షలను టెలివిజన్‌లో ప్రసారం చేయాలంటూ గతంలో మీడియా సంస్థలు ప్రయత్నించినప్పటికీ, కోర్టుల ద్వారా అడ్డంకులు ఎదురయ్యాయి. ఇప్పుడు సైనిక స్థావరంలో అమలు చేయబోయే శిక్షను లైవ్‌స్ట్రీమింగ్ చేయాలన్న నిర్ణయం చట్టపరమైన, నైతికపరమైన ప్రశ్నలకు దారితీస్తోంది. అమెరికాలో చివరిసారిగా చట్టబద్ధంగా బహిరంగంగా మరణశిక్ష అమలు చేసింది 1936లో. అప్పట్లో వేలాది మంది ప్రేక్షకుల సమక్షంలో ఉరిశిక్ష అమలు చేశారు. అప్పటి నుంచి అమెరికాలో మరణశిక్షలు సాధారణంగా ప్రజలకు కనిపించకుండా, నిర్దిష్ట ప్రదేశాల్లోనే అమలు చేస్తున్నారు.ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా అమెరికా సైన్యం చివరిసారిగా 1945లో మరణశిక్ష అమలు చేసింది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సైనిక విధుల నుంచి పారిపోయిన ఎడ్డీ స్లోవిక్ను ఫ్రాన్స్‌లో కాల్చి చంపారు. అయితే, అమెరికా సైన్యంలో చివరిసారిగా మరణశిక్ష అమలైంది 1961లో. ఆ సందర్భంలో జాన్ బెన్నెట్‌కు ఉరిశిక్ష విధించారు. అందువల్ల హసన్‌కు శిక్ష అమలైతే, 1945 తర్వాత అమెరికా సైన్యంలో ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా మరణశిక్ష విధించిన తొలి వ్యక్తిగా ఆయన నిలుస్తారు.న్యాయ నిపుణుల అభ్యంతరాలుఈ నిర్ణయంపై న్యాయ నిపుణులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. యేల్ లా స్కూల్లో ఉపన్యాసాలు ఇచ్చే సైనిక న్యాయ నిపుణుడు యూజీన్ ఫిడెల్.. మరణశిక్షను ప్రత్యక్ష ప్రసారం చేయడం అత్యంత అసాధారణమని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై అమెరికా సుప్రీంకోర్టు ఇప్పటివరకు స్పష్టమైన తీర్పు ఇవ్వలేదని తెలిపారు. హసన్ తన మరణాన్ని ప్రజలకు ప్రదర్శించడాన్ని అడ్డుకోవాలనుకుంటే ఫెడరల్ కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.సైనిక న్యాయ చరిత్రకారుడు జోనాథన్ లూరీ కూడా ఈ నిర్ణయాన్ని ప్రశ్నించారు. మరణశిక్షను బహిరంగంగా చూపించడం వల్ల ఏమి ప్రయోజనం ఉంటుందనే సందేహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం శిక్షను ప్రజలకు చూపించడం ద్వారా నేరాలపై భయం కలిగించాలని భావిస్తున్నప్పటికీ, అది అవసరమా అనే చర్చ మొదలైంది.మరణశిక్ష విధానాలపై మళ్లీ చర్చప్రస్తుతం అమెరికాలో కొన్ని రాష్ట్రాలు ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా మరణశిక్ష అమలుకు అనుమతిస్తున్నాయి. డెత్ పెనాల్టీ ఇన్ఫర్మేషన్ సెంటర్ ప్రకారం.. కనీసం ఐదు రాష్ట్రాల్లో ఈ విధానం చట్టబద్ధంగా ఉంది. 2025లో దక్షిణ కరోలినా 15 ఏళ్ల విరామం తర్వాత ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా మరణశిక్ష అమలు చేసిన తొలి రాష్ట్రంగా నిలిచింది. మరోవైపు, ప్రాణాంతక ఇంజెక్షన్ల కోసం అవసరమైన మందులు లభించడంలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం ఫైరింగ్ స్క్వాడ్, కరెంట్ షాకివ్వడం, విషవాయువుతో ఊపిరాడకుండా చేయడం వంటి పద్ధతులను కూడా చేర్చింది. ఇటీవల టెన్నెసీలో క్రిస్టా పైక్ అనే మహిళకు ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా మరణశిక్ష అమలు చేసే ప్రయత్నం విఫలమవడం కూడా ఈ చర్చకు మరింత ప్రాధాన్యం తెచ్చింది. ఇంజెక్షన్ ప్రక్రియలో సమస్యలు తలెత్తడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రపంచవ్యాప్తంగా చట్టబద్ధమైన మరణశిక్షలను ప్రత్యక్ష ప్రసారం చేయడం అత్యంత అరుదైన విషయం. ఇటీవలి కాలంలో బహిరంగ మరణశిక్షలు అమలు చేసిన దేశాలుగా ఇరాన్, తాలిబన్ల పాలనలోని ఆఫ్ఘనిస్తాన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అమెరికా సైన్యం కూడా ఈ దిశగా అడుగువేస్తుండటంతో.. నేరాలకు శిక్ష విధించే విధానం, దాని ద్వారా ప్రజలకు ఏ సందేశం ఇవ్వాలనే అంశాలపై అంతర్జాతీయంగా చర్చ జరిగే అవకాశం ఉంది. మొత్తానికి.. 13 మందిని చంపిన కేసులో నిడాల్ హసన్‌కు మరణశిక్ష విధించడం కొత్త విషయం కాదు. కానీ ఆ శిక్షను ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా అమలు చేయడంతోపాటు ప్రజలు ప్రత్యక్షంగా చూడగలిగేలా ప్రసారం చేయాలన్న నిర్ణయమే ఇప్పుడు అమెరికాలో కొత్త వివాదానికి కేంద్రంగా మారింది.ఇదీ చదవండి: ఎన్నారైలే టార్గెట్.. ట్రంప్ బిగ్ స్కెచ్ -
రాజు నోరెళ్లబెట్టేలా.. రాణి ఏం చేసిందో తెలుసా?
సాధారణంగా రాజకుటుంబ సభ్యులు విలాసవంతమైన జీవితం, అధికారిక కార్యక్రమాలతో వార్తల్లో నిలుస్తుంటారు. కానీ థాయ్‌లాండ్ రాణి సుతిదా(48) మాత్రం తన సాహసంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఏకంగా యుద్ధ విమానాన్ని ఒంటరిగా నడిపి తన ఏవియేషన్ కెరీర్లో కీలక మైలురాయిని చేరుకున్నారు. తద్వారా ప్రపంచంలోనే తొలి పైలట్ క్వీన్ ఘనత సాధించారు. భర్త, థాయ్ రాజు మహా వజిరలాంగ్‌కార్న్ నోరెళ్లబెట్టి చూస్తుండగా ఆమె ఈ ఘనత సాధించడం విశేషం.థాయ్‌లాండ్ దక్షిణ ప్రాంతంలోని సూరత్ థాని ప్రావిన్స్‌లో ఉన్న వింగ్ 7 వైమానిక స్థావరంలో గురువారం (అక్టోబర్ 8) రాణి సుతిదా ఈ సాహసయాత్ర చేపట్టారు. స్వీడన్లో తయారైన జేఏఎస్ 39సీ గ్రిపెన్ సింగిల్ సీటర్ యుద్ధ విమానంలో తొలిసారి ఒంటరిగా ప్రయాణించారు. విమానయాన ప్రణాళికపై వివరాలు తెలుసుకుని, టేకాఫ్‌కు ముందు విమానాన్ని తనిఖీ చేసిన అనంతరం ఆమె గగనతలంలోకి దూసుకెళ్లారు.ఈ ఘట్టాన్ని రాజు మహా వజిరలాంగ్‌కార్న్ ప్రత్యక్షంగా వీక్షించారు. ఆ సమయంలో ఆయన ఆశ్చర్యపోతూ చూస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. విమానం నుంచి దిగిన తర్వాత రాణికి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. గ్రిపెన్ యుద్ధ విమానాన్ని నడిపిన గుర్తింపుగా ఇచ్చే ‘గ్రిపెన్ ఆర్డర్ గోల్డెన్ ప్యాచ్’ను కూడా అందజేశారు.విమానయానంలో అపార అనుభవంరాణి సుతిదాకు విమానాలు నడపడంలో మంచి అనుభవమే ఉంది. ఇప్పటివరకు వివిధ రకాల విమానాల్లో కలిపి 1,188.48 గంటల పాటు ప్రయాణించినట్లు బ్యాంకాక్ పోస్ట్ వెల్లడించింది. సెస్నా, పిలాటస్, పైపర్ వంటి విమానాలతోపాటు బోయింగ్ 737 ప్రయాణికుల విమానాలను కూడా ఆమె నడిపారు. 2010 మే 13న బ్యాంకాక్‌లోని వింగ్ 6 స్థావరంలో సెస్నా టీ-41డీ విమానాన్ని నడపడంతో ఆమె పైలట్ ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత రెండు సీట్ల గ్రిపెన్ జేఏఎస్ 39డీ యుద్ధ విమానంలోనూ ప్రయాణించారు. తాజాగా సింగిల్ సీటర్ గ్రిపెన్ను ఒంటరిగా నడిపి మరో మైలురాయిని చేరుకున్నారు.రాజుతో కలిసి విమాన ప్రయాణాలురాణి సుతిదా రాజుతో కలిసి దేశీయ, అంతర్జాతీయ పర్యటనల సందర్భంగా విమానాల్లో కో-పైలట్‌గా కూడా వ్యవహరించారు. గతేడాది ఏప్రిల్‌లో భూటాన్ పర్యటన సందర్భంగా రాజదంపతులు కలిసి రాజకుటుంబ విమానాన్ని నడిపారు. పర్వత ప్రాంతాల మధ్య అత్యంత క్లిష్టమైన విమానాశ్రయంగా పేరున్న పారో విమానాశ్రయంలో విమానాన్ని దించారు.🇹🇭 ‘The World’s only Pilot Queen’ – #Thailand’s Queen Suthida of Thailand passed her solo flight training with JAS 39C #Gripen. King Vajiralongkorn observed the training and congratulated her with a bouquet of flowers at Wing 7 Royal Air Force Base #SuratThani. พระปรีชาสามารถของ “พระราชินีนักบิน” หนึ่งเดียวในโลก #พระราชินี ทรงฝึกทำการบินโซโล่เดี่ยวกับเครื่องบินขับไล่ JAS 39C Gripen เป็นครั้งแรก และผ่านการทดสอบไปได้ด้วยดี ซึ่ง #ในหลวง ได้ทอดพระเนตรและพระราชทานช่อดอกไม้แสดงความยินดีในครั้งนี้ ณ กองบิน 7 #สุราษฎร์ธานี #KingVajiralongkorn #QueenSuthida #ThaiRoyalFamily #ข่าวในพระราชสำนัก #ทรงพระเจริญ— Royal World Thailand 🇹🇭 (@rwthofficial) October 8, 2026తాజా సోలో ఫ్లైట్‌తో సైనిక, పౌర విమానయాన రంగాల్లో తన అనుభవాన్ని రాణి మరోసారి చాటుకున్నారు. రాజకుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే విమానయానంపై ఆసక్తిని కొనసాగిస్తున్న ఆమె.. ఇప్పుడు యుద్ధ విమానాన్ని ఒంటరిగా నడిపిన ఘనతతో వార్తల్లో నిలిచారు.74 ఏళ్ల థాయ్‌లాండ్ రాజు మహా వజిరలాంగ్‌కార్న్ (రామా X)కు ఇప్పటివరకు నలుగురు భార్యలు ఉన్నారు. ఆయన మొదట 1977లో సోమ్సావలిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత యువధిదా పోల్ప్రసెర్త్ను పెళ్లి చేసుకున్నారు. మూడో భార్య శ్రీరస్మి సువాదీతో 2001లో వివాహం జరగ్గా, 2014లో విడిపోయారు. నాలుగో భార్యగా 2019లో సుతిదాను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె థాయ్‌లాండ్ రాణిగా కొనసాగుతున్నారు.బాడీగార్డ్ నుంచి క్వీన్‌గా 1978 జూన్ 3న దక్షిణ థాయ్‌లాండ్‌లోని హాట్ యాయ్‌లో జన్మించిన సుతిదా అసలు పేరు సుతిదా తిడ్జాయ్. బ్యాంకాక్‌లోని అసంప్షన్ యూనివర్సిటీలో కమ్యూనికేషన్ ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. 2000–2003 మధ్య జపాన్ ఎయిర్‌లైన్స్‌లో, ఆ తర్వాత 2008 వరకు థాయ్ ఎయిర్వేస్లో విమాన సహాయకురాలిగా పనిచేశారు. అనంతరం రాజు భద్రతా విభాగంలో చేరి సైనిక, రాజభవన భద్రతా బాధ్యతల్లో ఉన్నత స్థానాలకు ఎదిగారు. 2019 మే 1న రాజు వజిరలాంగ్కార్న్ను వివాహం చేసుకోగా, అదే ఏడాది మే 4న ఆయన పట్టాభిషేకం సందర్భంగా రాణి హోదా పొందారు.ఇదీ చదవండి: అదే నిజమైతే .. పాక్ నాలుగు ముక్కలవ్వడం ఖాయం -
హెచ్-1బీ వీసాలపై వాన్స్ ఆగ్రహం.. మైక్రోసాఫ్ట్‌పై గురి!
హెచ్-1బీ వీసా విధానాన్ని తప్పుడు దోవలో వినియోగించుకుంటూ అమెరికన్ల ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నారంటూ ఐటీ దిగ్గజ కంపెనీలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికన్ ఉద్యోగులను తొలగించి.. వారి స్థానంలో తక్కువ వేతనాలకు విదేశీయులతో పనిచేయించుకుంటున్నారని ఆరోపించారు. పైగా విదేశీ ఉద్యోగులను ‘వెట్టి చాకిరీ చేసే బానిసలు’గా ఉపయోగించుకోవడాన్ని సహించబోమని స్పష్టం చేశారు.ఈ క్రమంలో దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్‌నే లక్ష్యంగా చేసుకుని ఆయన విరుచుకుపడ్డారు. గత ఏడాది 6,000 మంది అమెరికన్ ఉద్యోగులను తొలగించగా.. అదే సమయంలో 6,300 హెచ్-1బీ వీసాలు పొందిందని వాన్స్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకుంటూ, విదేశీ ఉద్యోగులకు గ్రీన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసే ప్రక్రియలో మైక్రోసాఫ్ట్‌పై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు.ఒక్కో ఉద్యోగికి బదులుగా..మైక్రోసాఫ్ట్ అమెరికన్ ఉద్యోగులను తొలగిస్తూ.. విదేశీ ఉద్యోగుల నియామకాలను కొనసాగించడంపై వాన్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ఏడాది సంస్థ 6,000 మంది అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగించిందని, అదే సమయంలో 6,300 హెచ్-1బీ వీసాలు పొందిందని, దాదాపు 3,000 గ్రీన్‌కార్డుల ప్రక్రియలకు సంబంధించిన ప్రయోజనాలు పొందిందని చెప్పారు.“మైక్రోసాఫ్ట్ గొప్ప అమెరికన్ సంస్థే. కానీ అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వాలి. అమెరికన్ ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో విదేశీ ఉద్యోగులతో వెట్టి చాకిరీ చేయించుకోలేరు” అని వాన్స్ వ్యాఖ్యానించారు. లెక్కలు చూస్తే.. తొలగించిన ప్రతి అమెరికన్ ఉద్యోగికి బదులుగా 1.5 మంది విదేశీ ఉద్యోగులను తీసుకున్నట్లుగా ఉందని ఆరోపించారు. ఇలాంటి విధానాన్ని అమెరికా ఇంతకాలం అనుమతించడం సిగ్గుచేటని విమర్శించారు.అతితక్కువ వేతనాలతో.. హెచ్-1బీ వీసాలపై అమెరికాకు వస్తున్న ఉద్యోగులు, ముఖ్యంగా ఔట్సోర్సింగ్ సంస్థల ద్వారా నియమితులవుతున్నవారు, తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారని వాన్స్ ఆరోపించారు. ఉద్యోగం కోల్పోతే దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉండటంతో కొందరు విదేశీ ఉద్యోగులు యజమానులపై ఆధారపడాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ కారణంగానే వారిని ‘ఫారిన్ ఇండెంచర్డ్ సర్వెంట్స్’గా అభివర్ణించారు. హెచ్-1బీ విధానం నైపుణ్యం కలిగిన ఉద్యోగులను అమెరికాకు తీసుకురావడానికి ఉద్దేశించిందని, అమెరికన్లను తక్కువ వేతనాలతో విదేశీయులతో భర్తీ చేయడానికి కాదని వాన్స్ వాదించారు.మైక్రోసాఫ్ట్ వివరణ ఇదీ..అయితే వాన్స్ ఆరోపణలపై మైక్రోసాఫ్ట్ స్పందించింది. గత ఆర్థిక సంవత్సరంలో హెచ్-1బీ వీసాలకు సంబంధించి తాము చేసిన దరఖాస్తుల్లో సుమారు 80 శాతం ఇప్పటికే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల వీసాల పొడిగింపు లేదంటే హోదా మార్పుల కోసమేనని తెలిపింది. అవన్నీ కొత్తగా విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి చేసిన దరఖాస్తులు కావని స్పష్టం చేసింది. అమెరికాలో తమ ఉద్యోగుల్లో అత్యధికులు అమెరికన్లేనని, హెచ్-1బీ ఉద్యోగులకు కూడా సమానమైన పనికి ఇతర ఉద్యోగులతో పోల్చదగిన వేతనాలు చెల్లిస్తున్నామని సంస్థ పేర్కొంది. వీసా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలను ప్రభుత్వం ఎలా నిర్ధారిస్తుందన్నది, ఈ చర్యలపై తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు కీలకంగా మారింది.గ్రీన్‌కార్డు దరఖాస్తులపై నిలిపివేతమైక్రోసాఫ్ట్తో పాటు అడోబ్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, క్యాప్‌జెమినీ సంస్థలను కూడా పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రక్రియ నుంచి నిలిపివేస్తున్నట్లు అమెరికా కార్మిక శాఖ ప్రకటించింది. ఈ సంస్థలకు సంబంధించిన కొత్త దరఖాస్తులను స్వీకరించబోమని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కూడా ప్రాసెస్ చేయబోమని అధికారులు తెలిపారు. ఈ చర్య అమెరికాలో పనిచేస్తున్న విదేశీ నిపుణులకు యజమాని ద్వారా గ్రీన్‌కార్డు పొందే ప్రక్రియపై ప్రభావం చూపుతుంది. అమెరికన్ ఉద్యోగులకు నష్టం కలగకుండా విదేశీ ఉద్యోగులను నియమిస్తున్నారా అనే అంశాన్ని ఈ ప్రక్రియలో పరిశీలిస్తారు.విదేశీ ఉద్యోగుల నియామకాలపై నిబంధనలను కఠినతరం చేయాలన్న ట్రంప్ ప్రభుత్వ వైఖరికి అనుగుణంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు, భారతీయ ఐటీ రంగానికి చెందిన సంస్థలపై ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉండటంతో, అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణులు తదుపరి పరిణామాలపై దృష్టి సారిస్తున్నారు.ఇటు నాదెళ్లకు ట్రంప్ సన్మానం!హెచ్-1బీ వీసాలపై జేడీ వాన్స్ మైక్రోసాఫ్ట్‌ను విమర్శించిన రోజే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ సంస్థ సీఈవో సత్య నాదెళ్లను సత్కరించారు. సాంకేతిక రంగంలో విశేష కృషికి గుర్తింపుగా నాదెళ్లకు నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పురస్కారాన్ని అందించారు. మైక్రోసాఫ్ట్ అభివృద్ధిలో, క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో ఆయన పోషించిన పాత్రను ప్రశంసించారు.#WATCH | US President Donald Trump presents the National Medal of Technology and Innovation to Microsoft CEO & Chairman Satya Nadella at the 'A New Golden Age' summit in Washington. (Source: The White House) https://t.co/nUwCYMeXOT— ANI (@ANI) October 8, 2026ఒకవైపు అమెరికన్ల ఉద్యోగాలను విదేశీయులతో భర్తీ చేస్తున్నారంటూ మైక్రోసాఫ్ట్‌పై వాన్స్ విమర్శలు.. మరోవైపు అదే సంస్థ సీఈవోకు ట్రంప్ నుంచి పురస్కారం! ఇలా ఒకే రోజు చోటుచేసుకున్న ఈ రెండు పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. -
సౌదీలో హైటెన్షన్.. భారతీయులకు బిగ్ అలర్ట్
సౌదీ అరేబియాలో హౌతీల దాడులు తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి. రాజధాని రియాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అక్కడ నివసిస్తున్న భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని, అవసరమైనప్పుడు ఇళ్లలోనే ఉండాలని, స్థానిక అధికారులు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరింది.ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు సంబంధించిన వీడియోలు, వార్తలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం, తిరిగి పోస్టు చేయడం మానుకోవాలని స్పష్టం చేసింది. మరోవైపు, సౌదీలో నెలకొన్న భద్రతా పరిస్థితుల నేపథ్యంలో ఎయిరిండియా, ఇండిగో, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. రియాద్‌కు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమాన సర్వీసులను అక్టోబర్ 10 వరకు రద్దు చేశాయి. ప్రభావితమైన ప్రయాణికులకు పూర్తి రీఫండ్ లేదంటే ప్రత్యామ్నాయ తేదీల్లో ప్రయాణించే అవకాశం కల్పిస్తామని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రకటించింది.రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ప్రయాణికులకు సూచనలు జారీ చేసింది. విమానాశ్రయానికి బయలుదేరే ముందు సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించి, తమ విమాన సర్వీసుల తాజా పరిస్థితిని తెలుసుకోవాలని కోరింది. గురువారం సౌదీ రాజధాని రియాద్ మీదుగా పలు పేలుళ్ల శబ్దాలు వినిపించిన నేపథ్యంలో ఈ సూచన ప్రాధాన్యం సంతరించుకుంది.ఆ సేవలు యథాతథంసౌదీలోని భారతీయులకు అవసరమైన సహాయం అందించేందుకు రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని భారత కాన్సులేట్ సాధారణంగానే పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. వీఎఫ్ఎస్ ద్వారా అందించే సేవలు కూడా కొనసాగుతున్నాయని వెల్లడించారు. పరిస్థితులకు అనుగుణంగా అవసరమైనప్పుడు కొత్త సూచనలు జారీ చేస్తామని పేర్కొన్నారు.భారతీయుల కోసం 24 గంటలూ అందుబాటులో ఉండే ప్రవాసీ భారతీయ సహాయ కేంద్రం (PBSK) టోల్‌ఫ్రీ నంబర్ 8002471234 ద్వారా సంప్రదించవచ్చని రాయబార కార్యాలయం తెలిపింది.అమెరికాకు మద్దతుపై హౌతీల గురి?ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఇటీవలి రోజుల్లో సౌదీ అరేబియాలోని విమానాశ్రయాలు, సైనిక స్థావరాలు, చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాకు సౌదీ మద్దతు ఇస్తుండటమే ఈ దాడులకు కారణమని వారు పేర్కొంటున్నారు. సౌదీ గగనతలం తమ సైనిక కార్యకలాపాలకు వేదికగా మారుతోందని ఆరోపిస్తూ.. అక్కడి గగనతలంలో కార్యకలాపాలు నిర్వహించే అంతర్జాతీయ విమానయాన సంస్థలకు గురువారం మరోసారి హెచ్చరికలు జారీ చేశారు.బుధవారం రియాద్, అభా విమానాశ్రయాలపై జరిగినట్లు హౌతీలు ప్రకటించిన దాడుల్లో ముగ్గురు మరణించినట్లు సౌదీ అధికారులు వెల్లడించారు. హౌతీలపై సౌదీ అరేబియా, దానికి మద్దతుగా ఉన్న యెమెన్ బలగాలు పెద్ద ఎత్తున భూతల, వైమానిక దాడులు ప్రారంభించిన తర్వాత ఈ మరణాలు సంభవించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో సౌదీలో నివసిస్తున్న భారతీయులు అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని, అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని, భద్రతా సూచనలను నిర్లక్ష్యం చేయవద్దని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.ఇదీ చదవండి: గ్రీన్‌కార్డ్ ఆశలకు షాక్ -
యుద్ధంలోకి లాగుతారా..? చిచ్చు రాజేసిన మక్కా కూటమి!
హౌతీల దాడులతో సౌదీ అరేబియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ.. సౌదీ, టర్కీ, పాకిస్తాన్ కలిసి ఏర్పాటు చేసిన మక్కా రక్షణ కూటమి ఇప్పుడు రాజకీయ చిచ్చు రాజేసింది. సౌదీ రక్షణకు అవసరమైన సైనిక బలగాలు, రక్షణ సామర్థ్యాలను వేగంగా మోహరించేందుకు కూటమి నిర్ణయించడంపై టర్కీ విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నిర్ణయం టర్కీని యెమెన్ యుద్ధంలోకి లాగొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ ఆగస్టు 7న మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం మూడు దేశాల్లో ఏదైనా ఒక దేశంపై సాయుధ దాడి జరిగితే.. దాన్ని మిగిలిన దేశాలపై జరిగిన దాడిగా పరిగణించి ఉమ్మడిగా స్పందించాలి. రక్షణ సహకారం, పరస్పర నిరోధక సామర్థ్యాన్ని పెంచుకోవడం దీని ప్రధాన ఉద్దేశం. అంటే.. సరిగ్గా నాటో తరహా అన్నమాట. మక్కాలో జరిగిన ఈ భేటీలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్, పాకిస్థాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్‌తో కలిసి టర్కీ అధ్యక్షుడు రెజెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఈ రక్షణ ఒప్పందంపై సంతకం చేశారు.అయితే యెమెన్‌లోని హౌతీలు సౌదీపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తుండటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 5న రియాద్‌లో మక్కా కూటమి వ్యూహాత్మక-రాజకీయ, రక్షణ కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఉమ్మడి రక్షణ చర్యలను తక్షణమే అమలు చేయాలని, సౌదీలో అవసరమైన సైనిక బలగాలు, సామర్థ్యాలను వేగంగా మోహరించాలని నిర్ణయించారు. అయితే ఆయా దేశాల జాతీయ చట్టాలకు అనుగుణంగానే ఈ చర్యలు ఉంటాయని సంయుక్త ప్రకటనలో స్పష్టం చేశారు. ‘ఇది రాజ్యాంగ నేరం!’మక్కా కూటమి నిర్ణయంపై టర్కీ ప్రధాన ప్రతిపక్ష నేత ఒజ్గుర్ ఓజెల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఆమోదం లేకుండా సైనిక మోహరింపుపై నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుబట్టారు. యుద్ధంలో ఉన్న దేశంతో రక్షణ ఒప్పందం చేసుకోవడం ద్వారా టర్కీ కూడా ఆ యుద్ధంలో భాగస్వామిగా మారే ప్రమాదం ఉందన్నారు. ‘వందేళ్ల తర్వాత టర్కీ సైనికులను యెమెన్ ఎడారులకు పంపే సాహసాన్ని మేం అంగీకరించం’ అని ఓజెల్ స్పష్టం చేశారు. ఇయీ పార్టీ ఎంపీ తుర్హాన్ కొమెజ్ కూడా ప్రభుత్వంపై మండిపడ్డారు. టర్కీ రాజ్యాంగంలోని 90, 92 అధికరణాలను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. అమెరికా, ఇజ్రాయెల్, సౌదీ ప్రయోజనాల కోసం టర్కీ సైనికులను యెమెన్‌కు పంపకూడదని పేర్కొన్నారు. మరో ప్రతిపక్ష నేత నామిక్ టాన్ అయితే మక్కా ఒప్పందం అసలు చట్టబద్ధంగా ఏ రూపంలో ఉందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఆమోదం లేకుండా దాన్ని అమలు చేయలేమన్నారు. సైనిక బలగాలు లేదా రక్షణ సామర్థ్యాలను యెమెన్‌కు పంపుతున్నట్లు వస్తున్న వార్తలు నిజమైతే అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని హెచ్చరించారు. పార్లమెంట్ ఆమోదం ఉందా?ఇదే ఇప్పుడు టర్కీలో ప్రధాన ప్రశ్న. మక్కా రక్షణ ఒప్పందాన్ని టర్కీ పార్లమెంట్ ఇంకా ఆమోదించలేదు. విదేశీ గడ్డపై టర్కీ సైన్యాన్ని మోహరించేందుకు కూడా సాధారణంగా పార్లమెంట్ అనుమతి అవసరం. టర్కీ రాజ్యాంగంలోని 90, 92 అధికరణాలను ఉటంకిస్తూ విపక్షాలు ఇదే విషయాన్ని లేవనెత్తుతున్నాయి. అయితే మక్కా కూటమి ఒప్పందాన్ని పార్లమెంట్ ఆమోదం కోసం త్వరలోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికారపక్ష వర్గాలు చెబుతున్నాయి. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత టర్కీ సైనిక సహకారం మరింత విస్తరించే అవకాశముంది.ఇప్పటికే సౌదీలో టర్కీ సహకారంఅయితే టర్కీ పూర్తిగా పక్కన ఉన్న దేశం కాదు. సౌదీ రక్షణకు టర్కీ ఇప్పటికే సాంకేతిక, రక్షణ సహకారం అందిస్తోంది. వైమానిక రక్షణ వ్యవస్థలు, డ్రోన్ ఆపరేటర్లు, నిఘా–సమాచార సేకరణ, వ్యూహాత్మక ప్రణాళిక, లాజిస్టిక్స్ వంటి అంశాల్లో సహాయం అందిస్తున్నట్లు అధికార వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. ప్రస్తుతం ఈ సహకారం ప్రధానంగా ద్వైపాక్షిక స్థాయిలోనే కొనసాగుతోందని, మక్కా ఒప్పందాన్ని టర్కీ పార్లమెంట్ ఆమోదించిన తర్వాత దాని పరిధి పెరిగే అవకాశం ఉందని సమాచారం.యెమెన్‌లోకి నేరుగా దిగుతారా?ఇక్కడే మరో కీలక అంశం. టర్కీ ప్రస్తుతం పెద్ద సంఖ్యలో సైనికులను యెమెన్‌లోకి పంపే ఆలోచన లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. సౌదీ రక్షణను బలోపేతం చేయడమే ప్రస్తుత లక్ష్యమని.. ముఖ్యంగా వైమానిక రక్షణ, డ్రోన్లను అడ్డుకోవడం, నిఘా సామర్థ్యాల పెంపుపైనే దృష్టి ఉంటుందని పేర్కొంటున్నాయి. అయితే పార్లమెంట్ ఆమోదం తర్వాత సౌదీకి అదనపు వైమానిక రక్షణ వ్యవస్థలు, సాంకేతిక సిబ్బంది, పైలట్లు, విమానాలను పంపే అవకాశంపై కూడా నివేదికలు వెలువడ్డాయి. హౌతీల డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కోవడమే వీటి ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. హౌతీలతో పోరు.. టర్కీకి కొత్త చిక్కుసౌదీ మద్దతున్న యెమెన్ బలగాలు హౌతీలపై దాడులను ముమ్మరం చేసిన సమయంలోనే మక్కా కూటమి యాక్టివేషన్ జరిగింది. ముఖ్యంగా ఎర్ర సముద్రానికి కీలకమైన బాబ్ అల్-మండేబ్ జలసంధి చుట్టూ పోరు తీవ్రతరమవుతోంది. హౌతీల దాడుల నుంచి సౌదీని రక్షించేందుకు కొత్త కూటమి తన సైనిక సామర్థ్యాలను సిద్ధం చేస్తోంది. అయితే సౌదీ రక్షణలో భాగంగా టర్కీ మరింత ముందుకెళ్తే.. అది యెమెన్ యుద్ధంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భాగస్వామి అయ్యే ప్రమాదం ఉందన్నది టర్కీ విపక్షాల ప్రధాన ఆందోళన. అందుకే మక్కా కూటమి ఇప్పుడు టర్కీ అంతర్గత రాజకీయాల్లోనూ పెద్ద చర్చకు దారితీసింది.ఇదీ చదవండి: మరో మహమ్మారి! రష్యా ఏదైనా దాస్తోందా? -
స్టూడెంట్స్‌పైకి పోలీసులు.. రక్షణగా నిలబడ్డ మేయర్
నిరసనకారులను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు దూకుడుగా వ్యవహరించే దృశ్యాలు తరచూ కనిపిస్తుంటాయి. అంతెందుకు మన దేశంలోనూ మొన్నీమధ్య సీజేపీ, నిన్న ఈసీ వ్యతిరేక ఆందోళనల్లోనూ పోలీసులు–నిరసనకారుల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి సమయంలో ఫ్రాన్స్‌లో చోటుచేసుకున్న ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఫ్రాన్స్‌లో విద్యార్థుల ఆందోళనలు ఉధృతమవుతున్న వేళ.. సెయింట్-డెనిస్ మేయర్ బల్లి బగయోకో పోలీసులకు, విద్యార్థులకు మధ్యలో నిలబడ్డారు. మంగళవారం పారిస్‌లో జరిగిన మార్చ్‌లో పోలీసులు విద్యార్థులపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆయన వారిని అడ్డుకుంటూ ‘స్టాప్.. స్టాప్’ అంటూ గట్టిగా అరిచారు. విద్యార్థులకు రక్షణగా నిలిచిన ఆయన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.‘నా పిల్లల లాంటివాళ్లు’తాను విద్యార్థులకు మద్దతుగా నిలవడం తన బాధ్యతగా భావించానని బగయోకో చెప్పారు. “వీధుల్లో ఉన్న హైస్కూల్ విద్యార్థులు నా పిల్లల లాంటివాళ్లు. వారి పక్షాన నిలబడటం నా బాధ్యత” అని పేర్కొన్నారు. పోలీసులు విద్యార్థులపైకి దూసుకెళ్లాలని నిర్ణయించుకున్నారని.. వారిలో చాలామంది పోలీసులపై ఎలాంటి దూకుడు ప్రదర్శించలేదని ఆయన అన్నారు. చివరకు పోలీసులు విద్యార్థులతో పాటు తనపైనా టియర్ గ్యాస్ ప్రయోగించారని తెలిపారు.This has to be the video of the year. Bally Bagayoko who is the mayor of French city Saint-Denis shouts at police to “Stop!” and protects the student protesters. https://t.co/XyXc7AUz6d— Power to the People ☭🕊 (@ProudSocialist) October 6, 2026అయితే పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణ కోసం పనిచేస్తుంటారని.. నిరసనకారులను నియంత్రించడం కూడా వారి విధుల్లో భాగమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు తమ విధులు నిర్వర్తించకుండా అడ్డుకోవడం కూడా సరైన విధానం కాదనే చర్చ సాగుతోంది. మేయర్ ఉద్దేశం విద్యార్థులకు రక్షణ కల్పించడమే అయినప్పటికీ.. పోలీసుల విధుల్లో జోక్యం చేసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బల్లి బగయోకో ఎవరు?బల్లి బగయోకో (52) మాలీ మూలాలున్న కుటుంబంలో జన్మించి సెయింట్-డెనిస్‌లో పెరిగారు. రవాణా సంస్థ ఆర్ఏటీపీలో ఉద్యోగిగా పనిచేస్తూనే.. బాస్కెట్‌బాల్ కోచ్‌గా, సామాజిక కార్యకర్తగా స్థానికంగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2001లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. డిప్యూటీ మేయర్, ప్రాంతీయ రాజకీయ నేతగా పనిచేశారు. 2026 మార్చిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 50.77 శాతం ఓట్లతో సెయింట్-డెనిస్ మేయర్‌గా ఎన్నికయ్యారు. వామపక్ష పార్టీ ‘లా ఫ్రాన్స్ ఇన్సూమిస్’ (LFI)కు చెందిన బగయోకో.. విద్య, సామాజిక సమానత్వం వంటి అంశాలపై గళమెత్తుతున్నారు. ఆయనకు నలుగురు పిల్లలు.రెండు వారాలుగా ఆందోళనలుఫ్రాన్స్లో రెండు వారాలకు పైగా విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. కిక్కిరిసిన, సౌకర్యాలు లేని తరగతి గదులు, ఉపాధ్యాయుల కొరత, విద్యలో అసమాన అవకాశాలను నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ నిరసనలు పలు ప్రాంతాలకు విస్తరించడంతో వేలాది మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు పాఠశాలల ధ్వంసం, పోలీసులపై దాడుల వంటి ఘటనలు కూడా చోటుచేసుకున్నాయని అధికారులు చెబుతున్నారు.15 ఏళ్ల విద్యార్థి చేయి పోవడంతో..నిరసనల సమయంలో 15 ఏళ్ల విద్యార్థి చేయి కోల్పోయిన ఘటన పోలీసుల చర్యలపై తీవ్ర విమర్శలకు దారితీసింది. లెన్స్ నగరంలో పోలీసుల గ్రెనేడ్ పేలడంతో బాలుడి చేయి తెగిపోయింది. దీంతో విద్యార్థుల నిరసనల్లో స్టన్ గ్రెనేడ్ల వినియోగాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కూడా కొనసాగుతోంది.డిమాండ్లపై ప్రభుత్వం స్పందనమరోవైపు విద్యార్థుల డిమాండ్లను పరిశీలించి అక్టోబర్ చివరినాటికి ప్రతిపాదనలు వెల్లడిస్తామని ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను తెలిపారు. అయితే నిరసనలు మాత్రం కొనసాగుతున్నాయి. విద్యార్థులకు మద్దతుగా నిలిచిన మేయర్ బగయోకో వీడియో ఇప్పుడు ఈ ఆందోళనల్లో పోలీసుల తీరుపై జరుగుతున్న చర్చకు మరింత ప్రాధాన్యం తెచ్చింది.ఇదీ చదవండి: రాహుల్ గాంధీ ధర్నాలో పోలీసులపై దాడి! -
ఏఐతో ఓ చిన్నదేశం.. పెద్ద అద్భుతాలు! మరి మనం?
కృత్రిమ మేధ.. ఈ మాట ఇప్పుడు ఎవరి నోట విన్నా వినిపిస్తోంది. ఫోన్లో ఫొటోలు మార్చుకోవడం దగ్గర నుంచి కథలు, పాటలు, వీడియోలు తయారు చేసుకోవడం వరకు ఆ సాంకేతికత మన జీవితాల్లోకి వచ్చేసింది. కానీ ఒక చిన్న దేశం మాత్రం ఏఐని మరో స్థాయిలో ఉపయోగించేందుకు ప్రయత్నిస్తోంది. రైతు పొలంలో ఏ పురుగు వచ్చిందో చెప్పడం నుంచి విద్యార్థి చదువు మానేసే ప్రమాదాన్ని ముందే గుర్తించడం వరకు.. వైద్య సేవల నుంచి ప్రభుత్వ నిర్ణయాల వరకు.. ప్రజల సమస్యలకు ఉపయోగిస్తోంది.ఆ దేశమే రువాండా. ఆఫ్రికాలోని చిన్న దేశం. జనాభా, ఆర్థిక శక్తి, వనరుల విషయంలో భారత్‌తో పోల్చితే చాలా చిన్నది. అయినా AI విషయంలో అది పెట్టుకున్న లక్ష్యం మాత్రం పెద్దది. AIని కేవలం కొత్త టెక్నాలజీగా కాకుండా దేశ అభివృద్ధికి ఉపయోగపడే సాధనంగా మార్చాలని రువాండా జాతీయ విధానాన్ని రూపొందించుకుంది. రైతుకు 24 గంటలూ సలహారువాండాలో వ్యవసాయానికి సంబంధించిన ఓ ఏఐ వ్యవస్థను ప్రయోగిస్తున్నారు. రైతు తన భాష కిన్యారువాండాలో ప్రశ్న అడిగితే.. పంటకు వచ్చిన తెగులు, వ్యాధులు, వాతావరణ పరిస్థితులపై సలహా ఇచ్చేలా దీన్ని రూపొందించారు. అంటే రైతు ‘‘నా పంటకు ఈ సమస్య వచ్చింది.. ఏం చేయాలి?’’ అని అడిగితే సమాధానం చెప్పే సాంకేతికత.మన దేశంలో కూడా వ్యవసాయానికి AI ప్రయోగాలు జరుగుతున్నాయి. కానీ రువాండా ప్రత్యేకత ఏమిటంటే.. తన దేశ ప్రజలు మాట్లాడే భాషలో, వారి రోజువారీ సమస్యకు నేరుగా ఉపయోగపడేలా AIని రూపొందించడం.పిల్లాడు బడికి దూరమా?.. అలర్ట్రువాండా ఏఐని విద్యారంగంలోనూ ప్రయోగిస్తోంది. విద్యార్థి చదువు మధ్యలోనే ఆపేసే ప్రమాదం ఉందా? అనే విషయాన్ని ముందుగానే గుర్తించే AI మోడల్‌ను ప్రయోగిస్తున్నారు. అలాగే విద్యార్థుల స్థాయికి అనుగుణంగా గణితాన్ని బోధించే అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ట్యూటరింగ్ వ్యవస్థను కూడా పరీక్షిస్తున్నారు. అంటే పిల్లాడు స్కూల్ మానేసిన తర్వాత సమస్యను గుర్తించడం కాదు.. ఆ పిల్లాడు చదువు మానేసే అవకాశం ఉంది అని ముందే పట్టించుకోండి అని వ్యవస్థ హెచ్చరించే దిశగా ఆలోచన.ఆస్పత్రికి వెళ్లకముందే AI సాయంఆరోగ్య రంగంలోనూ రువాండా ఏఐతో ప్రయోగాలు చేస్తోంది. జాతీయ టెలీమెడిసిన్ సేవలో దాని ఆధారిత ప్రాథమిక పరిశీలన, వైద్య నిర్ణయాలకు సహాయక వ్యవస్థలను అభివృద్ధి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే సమయంలో వైద్యులకు చికిత్స నిర్ణయాల్లో సహాయపడే టూల్స్‌ను ప్రయోగిస్తున్నారు. అలాగని అదేం వైద్యుడిని పూర్తిగా భర్తీ చేయడం లక్ష్యం కాదు. వైద్యుడికి మరింత సమాచారం అందించి నిర్ణయం తీసుకోవడంలో సహాయం చేయడం మాత్రమే!.రక్తం.. మందులు డ్రోన్లతో!ఇంకో ఆసక్తికరమైన ఉదాహరణ రువాండాలో ఇప్పటికే అమల్లో ఉన్న స్వయంచాలక డ్రోన్ ద్వారా మందులు, రక్తం వంటి వైద్య సామగ్రి పంపిణీ. రోడ్లు, దూర ప్రాంతాలు, అత్యవసర పరిస్థితులు అడ్డంకిగా మారినప్పుడు.. డ్రోన్లను ఉపయోగించి వైద్య సరఫరాలు చేరవేసే వ్యవస్థను అక్కడ విస్తరించారు. ప్రభుత్వానికి కూడా.. రువాండా ఏఐని ఒకటి రెండు శాఖల ప్రయోగంగా వదిలేయకుండా.. పాలనలో భాగంగా మార్చే ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. ఆ సంస్థ పని కేవలం ఈ టెక్నాలజీపై చర్చించడం కాదు.. ప్రభుత్వంలో ఏఐ అమలు, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, పాలన, పరిశ్రమల అభివృద్ధి వంటి అంశాలను సమన్వయం చేయడం. ఇంకా ముందుకు వెళ్లి.. ప్రభుత్వ నిర్ణయాలు ‘‘గతంలో ఏం జరిగింది?’’ అనే నివేదికలపై మాత్రమే ఆధారపడకుండా, ‘‘ఇప్పుడు ఏం జరుగుతోంది? తర్వాత ఏం జరగొచ్చు?’’ అనే అంచనాలకు AI, డేటాను ఉపయోగించే దిశగా ఆ దేశం ప్రణాళికలు రూపొందిస్తోంది. మరి మన దగ్గర?పేద దేశమైన రువాండాలోనే కాదు.. రిచ్చెస్ట్ ఎకానమీ ఉన్న సింగపూర్‌లోనూ దాదాపు ఏఐ వినియోగం ఇదే స్థాయిలో నడుస్తోంది. ఇక్కడే మనం ఒక్కసారి ఆగి ఆలోచించాలి. భారత్ ఆ విషయంలో వెనుకబడిన దేశం కాదు. ఇండియాఏఐ మిషన్(IndiaAI Mission) ద్వారా కంప్యూటింగ్ వనరులు, డేటా, స్వదేశీ AI మోడళ్లు, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లకు మద్దతు వంటి రంగాల్లో ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోంది. ప్రభుత్వ విభాగాల్లోనూ AI వినియోగానికి ప్రణాళికలు ఉన్నాయి. అంటే సమస్య ‘‘భారత్ AIని పట్టించుకోవడం లేదు’’ అనేది కాదు.కానీ, మనం AIని ఎంతగా, ఎటువైపు ఉపయోగిస్తున్నాం?.. అదే అసలు ప్రశ్నసినిమాల్లో హీరో ముఖాన్ని, హీరోయిన్లను అశ్లీలంగా మార్చడానికి..సోషల్ మీడియాలో నకిలీ వీడియోలు చేయడానికి.. రాజకీయ ప్రచారంలో భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి..క్లిక్‌ల కోసం సంచలన కంటెంట్ తయారు చేయడానికి..నకిలీ ఫొటోలు, డీప్‌ఫేక్‌లు సృష్టించడానికి! ఇలా..కానీ అదే టెక్నాలజీతో.. ఒక రైతుకు సరైన సమయంలో సలహా ఇవ్వగలమా?ఒక పేద విద్యార్థి చదువు మానేయకుండా ముందే గుర్తించగలమా?ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుడికి అదనపు సహాయం అందించగలమా?వరదలు, కరువు, కాలుష్యం వంటి సమస్యలను ముందుగానే అంచనా వేయగలమా?ప్రభుత్వ పథకం నిజంగా ఎవరికి చేరడం లేదో డేటా ద్వారా గుర్తించగలమా?ఏఐ వచ్చిన తర్వాత మనం తరచూ ‘‘ఎన్ని ఉద్యోగాలు పోతాయి?’’ అని అడుగుతున్నాం. ‘‘ఎన్ని ఉద్యోగాలు వస్తాయి?’’ అని కూడా చర్చిస్తున్నాం. కానీ మరో ప్రశ్న కూడా ఉండాలి. దాని వల్ల సామాన్యుడి జీవితం ఎంత సులభమవుతుంది?. ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతున్న దేశాల్లో రువాండా ఒక ఉదాహరణగా కనిపిస్తోంది. ఆ దేశం AI కోసం ప్రత్యేక విధానం, సంస్థలు, డేటా వ్యవస్థలు, నైపుణ్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. 2026లో ప్రభుత్వం AIని ఆరోగ్యం, విద్య, ప్రభుత్వ సేవల్లో బాధ్యతాయుతంగా ఉపయోగించేందుకు ఆంత్రోపిక్(Anthropic)తో మూడేళ్ల భాగస్వామ్యాన్నీ ప్రకటించింది.చిన్న దేశం.. మనకు పెద్ద పాఠంరువాండా మనకంటే పెద్ద దేశం కాదు. మనకంటే ఎక్కువ వనరులున్న దేశం కూడా కాదు. కానీ ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా చెబుతోంది. ఏఐ అంటే ఫొటోలు, వీడియోలు జనరేట్ చేసుకోవడం కాదు. ఫేక్ వీడియోలు చేయడం కాదు. ఎన్నికల ప్రచారానికి కొత్త ఆయుధం అంతకంటే కాదు. దానిని సరిగ్గా ఉపయోగిస్తే రైతుకు సలహాదారు కావొచ్చు. విద్యార్థికి గురువు కావొచ్చు. డాక్టర్‌కు సహాయకుడు కావొచ్చు. ప్రభుత్వానికి ముందస్తు హెచ్చరిక వ్యవస్థ కావొచ్చు. సామాన్యుడికి వేగవంతమైన సేవ కావొచ్చు. మన దగ్గర కూడా ఆ సామర్థ్యం ఉంది. సాంకేతిక నిపుణులు ఉన్నారు. డేటా ఉంది. ప్రతిభ ఉంది. భారీ మార్కెట్ ఉంది. కావాల్సింది ఒక్కటే..ఏఐని ఎవరి వినోదానికి ఉపయోగిస్తున్నాం?. ఎవరి రాజకీయ ప్రయోజనానికి ఉపయోగిస్తున్నాం?. ఎవరి లాభానికి ఉపయోగిస్తున్నాం?. అన్నింటికంటే ముఖ్యంగా.. ఎప్పుడు, ఎలా, ఎందుకు ప్రజల కోసం ఉపయోగిస్తున్నాం?. రువాండా లాంటి చిన్న దేశం ఈ ప్రశ్నకు తనదైన సమాధానం వెతుకుతోంది. మరి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్.. AI యుగంలో సామాన్యుడి జీవితాన్ని మార్చే తదుపరి అడుగు ఎప్పుడు వేస్తుంది?. :::వెబ్ డెస్క్ ప్రత్యేకం -
కిమ్ నార్త్ కొరియా మిషన్ ఫోన్లో వింత మెసేజ్!
అదొక దేశానికి చెందిన కీలక దౌత్య కార్యాలయపు ఫోన్ నంబర్. ఆ నెంబర్‌కు కాల్ చేయగానే.. అవతలి నుంచి వచ్చిన మెసేజ్ విని ఒక్కసారిగా షాక్ అయ్యారు. సాధారణంగా అధికారిక సమాచారం లేదంటే స్వాగత సందేశం వినిపించాల్సిన చోట.. ఊహించని మాటలు వినిపించాయి. తొలిసారి విన్నవారికి అసలు ఇది ఆ కార్యాలయ అధికారిక సందేశమేనా? లేక ఎవరో కావాలనే మార్చేశారా? అనే అనుమానం కలిగింది. ఇంతకీ ఆ ఫోన్లో ఏం వినిపిస్తోంది? అసలు ఈ వింత మెసేజ్ వెనుక ఎవరున్నారు?అమెరికా గడ్డపై ఉత్తర కొరియాకు ఉన్న ఏకైక దౌత్య కేంద్రం.. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి (యూఎన్)లో ఉన్న ఆ దేశ శాశ్వత మిషన్. ప్రపంచ దేశాలతో దౌత్య సంబంధాల విషయంలో ఈ కార్యాలయానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. యూఎన్ సభ్యదేశాల అధికారిక డైరెక్టరీలో ఈ మిషన్ ఫోన్ నంబర్ కూడా అందుబాటులో ఉంటుంది. ఆ నంబర్‌కు ఫోన్ చేసినప్పుడు వినిపించే వాయిస్మెయిల్నే తాజాగా ఓ ఆసక్తికరమైన వ్యవహారానికి కేంద్రంగా మారింది.ఏం వినిపించిందంటే..తాజాగా ఆ నంబర్‌కు ఫోన్ చేసినప్పుడు వాయిస్మెయిల్లో సాధారణ కార్యాలయ సందేశానికి బదులు.. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ను ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడే సందేశం వినిపించింది. అందులో ఉత్తర కొరియాలోని ఆహార కొరత, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రస్తావిస్తూ కిమ్‌పై సెటైర్లు వేసినట్లు సీక్రెట్ ఆడియోలో ఉంది. చివర్లో సందేశాలు స్వీకరించే మెయిల్‌బాక్స్ నిండిపోయిందని ఆటోమేటెడ్ వాయిస్ చెబుతోంది.అంటే.. ఎవరో ఆ మిషన్ ఫోన్ వాయిస్‌మెయిల్ గ్రీటింగ్ను మార్చి, దాన్ని కిమ్‌ను ఎగతాళి చేసే సందేశంగా మార్చినట్లు కనిపిస్తోంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఆ సందేశాన్ని ఎవరు పెట్టారు?.మిషన్ సిబ్బందికే షాక్ఈ వ్యవహారాన్ని తెలుసుకునేందుకు సదరు మిషన్‌ను సంప్రదించగా.. ఈ నంబర్ తమది కాదన్నట్లుగా అక్కడి ఓ సిబ్బంది స్పందించడం మరింత ఆసక్తి రేపింది. ఈ నంబర్‌కు సంబంధించిన వాయిస్‌మెయిల్ గురించి అడిగినప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేసి, ‘‘ఇది మా నంబర్ కాదు’’ అని చెప్పి తలుపు మూసేశారని సమాచారం.అయితే విచిత్రమేమిటంటే.. కొన్ని రోజుల తర్వాత ఉత్తర కొరియా ఉప విదేశాంగ మంత్రి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించినప్పుడు ఆయన ప్రసంగ పత్రం మొదటి పేజీలో ఇదే ఫోన్ నంబర్ కనిపించింది. అంటే నంబర్ మాత్రం ఉత్తర కొరియా మిషన్దేనన్న విషయం స్పష్టమవుతోంది. కానీ వాయిస్ మెయిల్‌ను ఎవరు మార్చారన్నదే మిస్టరీగా మిగిలింది.ఎలా మార్చగలిగారు?ఇది వినగానే పెద్ద సైబర్ దాడి జరిగిందేమో అనిపించొచ్చు. కానీ సైబర్ భద్రతా నిపుణుల ప్రకారం.. ఇలాంటి వాయిస్‌మెయిల్ వ్యవస్థల్లో భద్రత బలహీనంగా ఉంటే వాటిని మార్చడం అంత కష్టమైన పని కాకపోవచ్చు. కొన్ని ఫోన్ వ్యవస్థల్లో వాయిస్‌మెయిల్ పాస్వర్డ్లు సులభంగా ఊహించగలిగే నాలుగు అంకెల కోడ్లుగా ఉండొచ్చు. వాటిని ఆటోమేటెడ్ కాల్స్‌తో కూడా ప్రయత్నించి యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇది ఏదైనా దేశం చేసిన అత్యంత క్లిష్టమైన సైబర్ ఆపరేషనే అని చెప్పడానికి ఆధారాలు లేవు. ఒక వ్యక్తి చేసిన చిలిపి పని కావొచ్చు!. ఎవరో కావాలనే రాజకీయ వ్యంగ్యంగా వాయిస్ మెయిల్‌ను మార్చేసి ఉండొచ్చు!!. అసలు ఎవరు చేశారన్నది మాత్రం తెలియరాలేదు.ఇది ఇప్పుడే మొదలైందా?కాదు. ఈ నంబర్ వాయిస్‌మెయిల్ గతంలో కూడా ఇదే తరహాలో ఉండేదా? అనే విషయాన్ని పరిశీలించినప్పుడు మరో ఆసక్తికరమైన అంశం బయటపడింది. 2023 నవంబర్‌లో ఈ నంబర్‌కు ఫోన్ చేసిన ఓ వ్యక్తి.. అప్పట్లో సాధారణ వాయిస్‌మెయిల్ సందేశమే వినిపించిందని చెప్పాడు. అంటే ప్రస్తుత వ్యంగ్య సందేశం ఆ తర్వాత ఎప్పుడో మార్చి ఉండే అవకాశం ఉంది.ఒకప్పుడు కీలక దౌత్య మార్గంన్యూయార్క్లోని ఉత్తర కొరియా మిషన్‌కు గతంలో మరింత ప్రాధాన్యం ఉండేది. అమెరికా–ఉత్తర కొరియా మధ్య నేరుగా సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న సమయంలో ఈ మిషన్ ఒక అనధికారిక కమ్యూనికేషన్ మార్గంగా పనిచేసేది. 1990లలో ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై జరిగిన కీలక చర్చల్లోనూ ఈ ‘న్యూయార్క్ ఛానల్’ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ప్రస్తుతం అమెరికా–ఉత్తర కొరియా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉత్తర కొరియా రష్యాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంది. దీంతో న్యూయార్క్‌లోని ఈ దౌత్య మార్గం గతంతో పోలిస్తే అంత క్రియాశీలంగా లేదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు అదే మిషన్ ఫోన్లో కిమ్‌ను ఎగతాళి చేస్తూ ఓ వింత సందేశం వినిపించడం చర్చనీయాంశంగా మారింది. -
నవంబర్ 13.. అసలు ఏం జరగబోతోంది?
నవంబర్ 13, 2026.. ఈ తేదీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కారణం.. ఆ రోజే ప్రపంచం అంతం కానుందంటూ వైరల్ అవుతున్న ప్రచారం. ఏకంగా 66 ఏళ్ల క్రితమే శాస్త్రవేత్తలు ఈ తేదీని ‘డూమ్స్‌డే’గా పేర్కొన్నారని పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అసలు ఏం జరుగుతుంది? నిజంగానే నవంబర్ 13న ప్రపంచం అంతం కాబోతోందా?.. కంగారుపడాల్సిన అవసరమే లేదు! అసలు విషయం ఏంటో చర్చిద్దాం.ఈ ప్రచారానికి కారణం 1960లో ప్రముఖ శాస్త్రీయ జర్నల్ ‘సైన్స్’లో ప్రచురితమైన పరిశోధనా పత్రం. ఆస్ట్రియాలో జన్మించిన భౌతిక శాస్త్రవేత్త హెయింజ్ వాన్ ఫోయర్స్టర్, అతని సహచరులు ప్యాట్రిసియా ఎం. మోరా, లారెన్స్ డబ్ల్యూ. అమొరే ఈ అధ్యయనాన్ని రూపొందించారు. దీనికి డూమ్స్ డే: ఫ్రైడే నవంబర్ 13 ఏడీ 20206 (Doomsday: Friday, 13 November, A.D. 2026) అనే పేరు పెట్టారు.క్రీస్తు శకం ప్రారంభం నుంచి 1958 వరకు ప్రపంచ జనాభా పెరుగుదలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి.. దాన్ని గణిత నమూనాలో విశ్లేషించారు. జనాభా పెరుగుదల సాధారణ వేగంతో కాకుండా.. కాలం గడిచేకొద్దీ మరింత వేగంగా పెరుగుతోందని వారు గుర్తించారు.లెక్కలు అనంతానికి వెళ్తే..అప్పటి జనాభా పెరుగుదల రేటు ఎలాంటి మార్పూ లేకుండా ఇలాగే కొనసాగుతుందని ఊహించి తమ గణిత సూత్రాన్ని భవిష్యత్తులోకి పొడిగించారు. అలా లెక్కలు వేస్తే ఒక దశలో జనాభా సంఖ్య ‘అనంతం’ (infinity) వైపు వెళ్తుందని తేలింది. ఆ గణిత నమూనాలో ఈ ‘సింగ్యులారిటీ’కి చేరుకునే తేదీ నవంబర్ 13, 2026గా వచ్చింది. అందుకే పరిశోధకులు ఆ తేదీకి ‘డూమ్స్‌డే’ అనే పేరు పెట్టారు. అంతేగానీ ఇది ప్రపంచం పేలిపోతుందని, భూమి నాశనమవుతుందని చేసిన జోస్యం కాదు. జనాభా పెరుగుదలను ఒకే గణిత సూత్రంతో నిరవధికంగా కొనసాగిస్తే వచ్చే అసాధ్యమైన ఫలితాన్ని చూపించడానికి పెట్టిన పేరు.శాస్త్రవేత్తలు ఏం చెప్పాలనుకున్నారు?ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా జనాభా వేగంగా పెరుగుతోంది. కుటుంబాల్లో ఎక్కువ మంది పిల్లలు ఉండటం, తదుపరి తరాల్లోనూ అదే ధోరణి కొనసాగడం వంటి పరిస్థితులు జనాభా విస్ఫోటంపై ఆందోళనలకు దారితీశాయి. “మన మునిమనుమలు ఆకలితో చనిపోరు.. జనాభా ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అవుతారు” అనే భావనను పరిశోధకులు అప్పట్లో వ్యక్తం చేశారు. అంటే వారి ప్రధాన ఉద్దేశం మానవాళిని భయపెట్టడం కాదు.. జనాభా పెరుగుదల, ఆహారం, వనరులు, పర్యావరణం వంటి అంశాలపై ముందుగానే ఆలోచించాల్సిన అవసరాన్ని చెప్పడం.మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి?1960లో వేసిన లెక్కలు యథాతథంగా కొనసాగలేదు. ప్రపంచవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక పరిస్థితులు మారాయి. పట్టణీకరణ పెరగడం, మహిళల విద్య, కుటుంబ నియంత్రణ, వివాహాల వయసులో మార్పులు, జీవనశైలిలో మార్పులు వంటి అనేక కారణాలతో చాలా దేశాల్లో జననాల రేటు గణనీయంగా పడిపోయింది. ఒకప్పుడు జనాభా వేగంగా పెరుగుతున్న దేశాల్లోనూ ఇప్పుడు జననాల రేటు తగ్గుతోంది. కొన్ని దేశాల్లో జనాభా ఇప్పటికే తగ్గడం మొదలైంది.ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం ప్రస్తుతం ప్రపంచ జనాభా 8.2 బిలియన్లకు పైగా ఉంది. ప్రస్తుత ధోరణుల ప్రకారం ప్రపంచ జనాభా ఈ శతాబ్దం మధ్య తర్వాత గరిష్ఠ స్థాయికి చేరుకుని.. ఆ తర్వాత స్థిరపడటం లేదంటే క్రమంగా తగ్గే అవకాశం ఉంది.నవంబర్ 13న ఏం జరగబోతోంది?అందుకే 1960 పరిశోధన పత్రంలోని తేదీని చూసి భయపడాల్సిన అవసరం లేదు. నవంబర్ 13, 2026న ప్రపంచం అంతం అవుతుందని ఆ పేపర్ చెప్పలేదు. అలా ఏదైనా ప్రచారం కనిపిస్తే.. పట్టించుకోకండి. ఎవరైనా ప్రపంచ అంతానికి సంబంధించిన శాస్త్రీయ అంచనాగా చెబితే అది తప్పుదోవ పట్టించడమే.మొత్తానికి.. 1960లో చేసిన ఓ గణిత లెక్కకు వచ్చిన తేదీ ఇప్పుడు సోషల్ మీడియాలో ‘ప్రపంచ అంతం’గా వైరల్ అవుతోంది. కానీ నవంబర్ 13, 2026ను డూమ్స్డేగా భావించాల్సిన అవసరం లేదు. కానీ, ఆ పరిశోధన చెప్పిన సందేశం మాత్రం ఇప్పటికీ కీలకమే!. భూమిపై ఉన్న వనరులకు అనుగుణంగా మానవ జనాభా, వినియోగాన్ని నిర్వహించుకోవాల్సిన అవసరం.ఇదీ చదవండి: ప్రవక్తపై హిందూ యువకుడి పోస్ట్.. మరణశిక్షతో కలకలం -
ఫేస్బుక్ కామెంట్‌తో మరణశిక్ష!
సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. ముఖ్యంగా సున్నితమైన అంశాలపై చేసే వ్యాఖ్యలు తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. క్షణికావేశంలోనో.. అత్యుత్సాహంతోనో పెట్టిన ఓ కామెంట్ తర్వాత తొలగించినా.. దాని ప్రభావం మాత్రం వెంటాడొచ్చు. ఫేస్బుక్లో పెట్టిన ఓ కామెంట్ చివరకు మరణశిక్షకు దారితీసిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.జూన్ చివర్లో శ్రీలంకలో ఓ ముస్లిం యువకుడు హిందూ యాత్రికులపై దాడి చేసినట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ఫేస్బుక్లో మతపరమైన వాదనలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఓ వ్యక్తి హిందూ దేవుళ్లపై అభ్యంతరకర వ్యాఖ్య చేశాడు. దానికి.. సౌదీ అరేబియాలో పని చేస్తున్న 24 ఏళ్ల శ్రీలంక వలస కార్మికుడు అనోజన్ శివరాసా స్పందించాడు.సదరు కామెంట్‌కు స్పందిస్తూ.. అనోజన్ తమిళంలో ఇస్లాం ప్రవక్త మహమ్మద్‌పై వ్యాఖ్య చేశాడు. అయితే అది ప్రవక్తను అవమానించేలా ఉందంటూ కొందరు అతన్ని తిట్టిపోశారు. పరిస్థితి చేజారిపోతుందని గమనించిన శివరాసా.. వెంటనే ఆ కామెంట్‌ను తొలగించి, ఆపై వీడియో ద్వారా క్షమాపణ కూడా చెప్పాడు. అప్పటికే ఆ వ్యాఖ్యకు సంబంధించిన స్క్రీన్షాట్లు సౌదీ అధికారులకు చేరాయి. అనోజన్ పనిచేస్తున్న సంస్థకు కూడా ఈ విషయం తెలియడంతో.. జూలైలో అతన్ని అరెస్టు చేశారు. అనంతరం ఆయన ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు కుటుంబం తెలిపింది.జైలు శిక్ష కాస్త మరణశిక్షగా..ఈ కేసులో అల్-అహ్సా క్రిమినల్ కోర్టు తొలుత అనోజన్‌కు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 30 లక్షల సౌదీ రియాల్స్ జరిమానా విధించింది. శిక్షను తగ్గించాలని ఆయన తరఫు న్యాయవాదులు అప్పీల్ చేశారు. అయితే ఆ అప్పీల్‌తో కేసు మరింత తీవ్ర మలుపు తిరిగింది. సెప్టెంబర్ 17న సౌదీ ప్రాసిక్యూషన్ ఈ కేసును సైబర్ నేరాల చట్టం కింద కాకుండా షరియా చట్టం కింద విచారించాలని అప్పీల్ చేసింది. అప్పీల్ కోర్టు ఆ అభ్యర్థనను అంగీకరించి.. అనోజన్‌కు మరణశిక్ష విధించింది.మరణశిక్ష పడిందా? అంతే!సెప్టెంబర్ 28 తర్వాత అనోజన్ కుటుంబ సభ్యులతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. సాధారణంగా అక్కడి మరణశిక్ష ఖైదీలకు వ్యక్తిగత మొబైల్ ఫోన్ల వినియోగం ఉండదని, ఫోన్ కాల్స్ జైలు అధికారుల పర్యవేక్షణలోనే ఉంటాయి. దీంతో ఆయన కుటుంబం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. తమ బిడ్డను ఎలా రక్షించుకోవాలనుకుని ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఇప్పటివరకు మరణశిక్ష అమలుకు సౌదీ అధికారులు ఎలాంటి తేదీని ప్రకటించలేదు. క్షమాభిక్ష కోసం శ్రీలంక ప్రభుత్వం దౌత్య మార్గాల్లో ప్రయత్నాలు కొనసాగిస్తోంది.అధ్యక్షుడికి వేడుకోలుఅనోజన్ కుటుంబ సభ్యులు సెప్టెంబర్ 21న శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకను కలిసి తమ కుమారుడిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. క్షమాభిక్ష కోసం అన్ని ప్రయత్నాలు చేస్తామని అధ్యక్షుడు హామీ ఇచ్చినట్లు సమాచారం. సౌదీ అధికారులతో దౌత్య మార్గాల్లో సంప్రదింపులు జరపాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు బౌద్ధ, హిందూ మత పెద్దలు కూడా అనోజన్‌కు క్షమాభిక్ష కల్పించాలని కోరారు. కేసులో తదుపరి న్యాయపరమైన అవకాశాలను పరిశీలించేందుకు నలుగురు సభ్యులతో కూడిన శ్రీలంక న్యాయ బృందం సౌదీ అరేబియాకు వెళ్లనుంది.సోషల్ మీడియా పోస్టులపై కఠిన చర్యలుసౌదీ అరేబియాలో సోషల్ మీడియా వ్యాఖ్యలకు కఠిన శిక్షలు విధించిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. 2023లో సౌదీకి చెందిన మాజీ ఉపాధ్యాయుడు మహమ్మద్ అల్-ఘమ్దీకి సోషల్ మీడియా పోస్టుల కేసులో తొలుత మరణశిక్ష విధించారు. అనంతరం ఆ తీర్పు 30 ఏళ్ల జైలు శిక్షగా మారింది. అనోజన్ కేసులోనూ ప్రస్తుతం మరణశిక్ష అమలుకు తేదీ ఖరారు కాలేదు. శ్రీలంక ప్రభుత్వం క్షమాభిక్ష కోసం దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలు ఎంతటి పరిణామాలకు దారితీయగలవో ఈ ఘటన మరోసారి చర్చకు తెచ్చింది.ఇదీ చదవండి: ఐస్ మాములు సాయం చేయలేదుగా! -
ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలకు మతం, వలసలను ముడిపెడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అదే సమయంలో.. పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో లాస్ ఏంజెల్స్, శాన్‌డియాగో నగరాలను ఇరాన్ ‘‘తుడిచిపెట్టేసుకోవచ్చు’’ అన్నట్లు మాట్లాడిన తీరుపైనా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్రాన్స్‌లో స్టూడెంట్స్ ఆందోళనలు కొనసాగుతున్నాయి. వీటిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు.. ‘‘ఇది పాఠశాలల సమస్య కాదు.. ఫ్రాన్స్‌ను ఇస్లాం ఆక్రమించుకోవాలని చూస్తోంది’’ అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా తీవ్ర దుమారం రేగింది. ఫ్రాన్స్‌లో సెప్టెంబర్ చివరి నుంచి హైస్కూల్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వందలాది పాఠశాలల ప్రవేశ ద్వారాలను విద్యార్థులు దిగ్బంధించారు. మెరుగైన విద్యా వసతులు, ఉపాధ్యాయుల కొరతను పరిష్కరించడం, అధిక విద్యార్థులతో కిక్కిరిసిన తరగతులను తగ్గించడం, పాడైపోయిన పాఠశాల భవనాలను బాగుచేయడం వంటి డిమాండ్లు వాటిల్లో ఉన్నాయి. వేడిని తట్టుకోలేని భవనాలు, అధిక పని భారం, సిబ్బంది కొరతపైనా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఆందోళన క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించింది. అక్టోబర్ 6న ఒక్కరోజే దాదాపు 2.56 లక్షల మంది నిరసనల్లో పాల్గొన్నారని ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. యూనియన్లు మాత్రం ఈ సంఖ్య 4.5 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నాయి. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా నిరసనలకు మద్దతుగా రోడ్డెక్కారు. ఘర్షణలతో ఉద్రిక్తతఅయితే కొన్ని ప్రాంతాల్లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. పోలీసులు, విద్యార్థుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పోలీసులు టియర్ గ్యాస్, లాఠీలు, అల్లర్ల నియంత్రణకు ఉపయోగించే ఆయుధాలను ప్రయోగించారు. కొన్ని చోట్ల నిరసనకారులు రాళ్లు విసరడం, వాహనాలు, బస్ షెల్టర్లకు నిప్పుపెట్టడం వంటి ఘటనలు జరిగాయి.ఫ్రాన్స్ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. ఆందోళనలు మొదలైనప్పటి నుంచి 215 మంది విద్యార్థులు, 715 మంది పోలీసులు గాయపడ్డారు. 5,000 మందికిపైగా అరెస్టయ్యారు. వారిలో 87 శాతం మంది మైనర్లే. 24 పాఠశాలలు ధ్వంసం లేదా అగ్నిప్రమాదాలకు గురయ్యాయి. ఇటు పోలీసుల చర్యలపైనా విమర్శలు వస్తున్నాయి. ఓ 15 ఏళ్ల విద్యార్థి పోలీసుల స్టన్ గ్రెనేడ్ కారణంగా చేతిని కోల్పోయాడు. మరో 14 ఏళ్ల బాలుడి ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సైతం ఫ్రాన్స్ పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో పోలీసుల ప్రవర్తనపై పలు అంతర్గత విచారణలు కూడా ప్రారంభమయ్యాయి. ‘ఇది ఇస్లాం ఆక్రమణ’.. ట్రంప్ వ్యాఖ్యఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు అసలు వివాదానికి కారణమైంది. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఆందోళనలను ప్రస్తావిస్తూ.. ‘‘ఇది అదుపు తప్పిన భారీ వలసల ఫలితం. ఇది పాఠశాలల గురించి కాదు.. ఒకప్పుడు గొప్ప దేశమైన ఫ్రాన్స్‌ను ఇస్లాం ఆక్రమించుకోవాలని చూస్తోంది’’ అంటూ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో రాశారు. అయితే ఫ్రాన్స్‌లో విద్యార్థులు చేస్తున్న ప్రధాన డిమాండ్లకు, ట్రంప్ చెప్పిన ‘‘ఇస్లాం ఆక్రమణ’’కు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు నిరసనలపై వచ్చిన తాజా వివరాల్లో ఎలాంటి ఆధారం కనిపించడం లేదు. విద్యార్థులు ప్రధానంగా విద్యా వ్యవస్థలోని సమస్యలపైనే ఆందోళన చేస్తున్నారు. ఇదే విషయాన్ని ట్రంప్ వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్నవారు ప్రశ్నిస్తున్నారు.ట్రంప్, ఆయన మద్దతుదారులు మాత్రం యూరప్‌లో వలసలు, భద్రత, సామాజిక సమస్యలను అనుసంధానిస్తూ చాలాకాలంగా ప్రచారం చేస్తున్నారు. అమెరికా మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఫ్రాన్స్ పరిణామాలను కూడా వలస వ్యతిరేక రాజకీయ ప్రచారానికి ఉపయోగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.అమెరికాలోనూ మరో మాట.. ఇదే సమయంలో ఇరాన్ యుద్ధంపై ట్రంప్ చేసిన మరో వ్యాఖ్య అమెరికాలో కలకలం రేపింది. నెబ్రాస్కాలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. యుద్ధం కారణంగా అమెరికాలో ఇంధన ధరలు పెరగడం దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు చెల్లించే ‘‘చిన్న మూల్యం’’ అని అన్నారు. ఆ తర్వాత.. ‘‘వాళ్లు ఒక నగరాన్ని తుడిచిపెట్టేయొచ్చు. లాస్ ఏంజెల్స్‌ను తుడిచేయనివ్వండి. శాన్‌డియాగోను తుడిచేయనివ్వండి’’ అన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు సభలో కొందరు మద్దతుదారులు చప్పట్లు కొట్టారు. ట్రంప్ వ్యాఖ్యలపై కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ తీవ్రంగా స్పందించారు. ట్రంప్‌ను ‘‘ప్రమాదకరమైన, మతిభ్రమించిన వ్యక్తి’’ అంటూ విమర్శించారు. లాస్ ఏంజెల్స్ మేయర్ కరెన్ బాస్.. అధ్యక్షుడి వ్యాఖ్యలు నగర భద్రతకు ముప్పు కలిగించేలా ఉన్నాయని అన్నారు. శాన్‌డియాగో మేయర్ టాడ్ గ్లోరియా.. తమ నగరం ‘‘యుద్ధంలో త్యాగం చేయాల్సిన వస్తువు కాదు’’ అంటూ మండిపడ్డారు. వైట్‌హౌస్ వివరణ ఇదీ..అయితే ట్రంప్ వ్యాఖ్యలపై వెల్లువెత్తుతున్న విమర్శలను వైట్‌హౌస్ తోసిపుచ్చింది. ట్రంప్ ఉద్దేశం అమెరికా నగరాలపై ఇరాన్ దాడిని కోరుకోవడం కాదని స్పష్టం చేసింది. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని సాధించకుండా అడ్డుకోవడం వల్లే లాస్ ఏంజెల్స్, శాన్‌డియాగో వంటి అమెరికా నగరాలు సురక్షితంగా ఉన్నాయని ఆయన చెప్పాలనుకున్నారని వివరించింది. అయినా అధ్యక్షుడి నోట ‘‘లాస్ ఏంజెల్స్‌ను తుడిచేయనివ్వండి.. శాన్‌డియాగోను తుడిచేయనివ్వండి’’ అనే మాటలు రావడం తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా యుద్ధం, ఇంధన ధరలు, అమెరికా మధ్యంతర ఎన్నికలు కీలకంగా మారిన సమయంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కూడా ప్రభావం చూపే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది.ఇదీ చదవండి: ఇరాన్ దెబ్బకు షాకింగ్ డెసిషన్ తీసుకున్న ట్రంప్ -
ఇరాన్ దెబ్బతో ట్రంప్ షాకింగ్ డెసిషన్?!
పశ్చిమాసియా ఉద్రిక్తతల్లో అమెరికా అనూహ్య నిర్ణయం తీసుకుంది. బ్రిటన్‌లోని కీలకమైన రాయల్ ఎయిర్ ఫోర్స్ ఫెయిర్‌ఫోర్డ్ స్థావరం నుంచి తమ బి-1 బాంబర్లన్నింటినీ వెనక్కి తరలించింది. ఇరాన్ ముప్పు ఉందన్న సమాచారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అయితే ఈ తరలింపుపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో మాత్రం మరో కారణం చెబుతున్నారు. లండన్‌కు సుమారు 145 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫెయిర్‌ఫోర్డ్ స్థావరంలో అమెరికా సుమారు 12 బి-1 బాంబర్లను మోహరించింది. ఇరాన్‌పై అమెరికా చేపట్టిన సైనిక చర్యల్లో ఈ స్థావరం కీలకంగా మారింది. అయితే సెప్టెంబర్ 27న స్థావరానికి సమీపంలో ఐదుగురు యువకులను ఉగ్రవాద చర్యలకు సన్నాహాలు చేస్తున్నారన్న అనుమానంతో పోలీసులు అరెస్టు చేశారు. వారి వాహనాల్లో పేలుడు పదార్థాలు లభించకపోయినా కొంత పెట్రోల్ దొరికినట్లు పోలీసులు తెలిపారు. తొలుత వాళ్లు ఇరాన్ ఏజెంట్లు అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత వారిని బెయిల్‌పై విడుదల చేశారు. మరో యూకే-ఇరాన్ ద్వంద్వ పౌరుడిని కూడా అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేశారు. ఈ పరిణామాల తర్వాత బాంబర్లను అమెరికాలోని స్వదేశీ స్థావరాలకు తరలించారు. దీనిపై ట్రంప్ మాట్లాడుతూ.. తమకు ముప్పు ఉందని సమాచారం వచ్చిందని, అలాంటి పరిస్థితుల్లో బాంబర్లను అక్కడే ఎందుకు ఉంచాలని ప్రశ్నించారు. ముప్పు సృష్టించిన వ్యక్తులు ఎవరన్నది తమకు తెలుసని కూడా చెప్పారు. ఆ ముప్పు ఇరాన్‌తో ముడిపడి ఉందా అని అడిగితే.. అవుననే అర్థం వచ్చేలా సమాధానం ఇవ్వడం కొసమెరుపు.ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా బాంబర్ల తరలింపు ముందుజాగ్రత్త చర్యేనని చెప్పారు. తమ సైనిక సిబ్బంది భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. బ్రిటన్‌లోని అమెరికా ఆస్తులకు ఇరాన్ నుంచి ముప్పు ఉందన్న అంచనాలు కొనసాగుతున్నాయని నాటో వర్గాలు కూడా తెలిపాయి.రుబియో మాత్రం మరోలా.. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. బాంబర్ల తరలింపునకు బ్రిటన్‌లో జరిగిన అనుమానిత కుట్రతో నేరుగా సంబంధం ఉందని చెప్పలేమని విదేశాంగ మంత్రి మార్కో రుబియో స్పష్టం చేశారు. అమెరికా రక్షణ శాఖ అవసరాన్ని బట్టి ప్రపంచవ్యాప్తంగా తన సైనిక వనరులను ఎప్పటికప్పుడు పునర్వ్యవస్థీకరిస్తుంటుందని చెప్పారు. అంటే ఓవైపు ట్రంప్ ఇరాన్ ముప్పును ప్రస్తావిస్తుండగా.. రుబియో మాత్రం ఈ రెండు పరిణామాలను నేరుగా ముడిపెట్టకపోవడం గమనార్హం.ఫెయిర్‌ఫోర్డ్ ఎందుకంత కీలకం?ఫెయిర్‌ఫోర్డ్ అమెరికాకు యూరప్‌లో అత్యంత కీలకమైన బాంబర్ స్థావరాల్లో ఒకటి. భారీ బాంబర్లను నిర్వహించగల అరుదైన వైమానిక స్థావరాల్లో ఇది కూడా ఒకటి. అమెరికా ఇరాన్‌పై చేపట్టిన చర్యల్లో ఇక్కడి నుంచి బాంబర్లు కార్యకలాపాలు సాగించాయి. అమెరికా నుంచి నేరుగా పశ్చిమాసియాకు వెళ్లడం కంటే ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తే దూరం, సమయం తగ్గుతాయి. అందుకే ఈ స్థావరం నుంచి బాంబర్లను వెనక్కి తరలించడం వ్యూహాత్మకంగా ప్రాధాన్యం సంతరించుకుంది.అయితే బాంబర్లను అమెరికాకు తరలించినంత మాత్రాన ఇరాన్‌పై దాడి చేసే అమెరికా సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయినట్లు కాదంట!. పెంటగాన్ ప్రకారం.. అమెరికా బాంబర్ బలగాలు ప్రపంచవ్యాప్తంగా అవసరమైన చోట ఖచ్చితమైన దాడులు నిర్వహించేందుకు సిద్ధంగానే ఉన్నాయి. అయితే ఫెయిర్‌ఫోర్డ్ నుంచి లభించే వేగవంతమైన ప్రాంతీయ స్పందన సామర్థ్యం మాత్రం తాత్కాలికంగా తగ్గే అవకాశం ఉందని రక్షణ నిపుణులు చెబుతున్నారు.ఇరాన్ రియాక్షన్ ఏంటంటే.. ఫెయిర్‌ఫోర్డ్ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ ఆరోపణలు నిరాధారమని పేర్కొంది. మరోవైపు బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్‌హామ్ మాత్రం ఈ కుట్ర వెనుక ఇరాన్ ప్రమేయం ఉండొచ్చని ఇంతకు ముందు ప్రకటించారు. దీంతో అసలు కుట్రకు ఎవరు తెర వెనుక ఉన్నారన్నది ఇంకా పూర్తిగా తేలలేదు.ఉన్నట్లుండి ఎందుకు వెనక్కి తగ్గారు?ఇక్కడే ఇప్పుడు కీలక ప్రశ్న. అమెరికా అధ్యక్షుడు స్వయంగా ఇరాన్ ముప్పును ప్రస్తావించగా.. ఆయన విదేశాంగ మంత్రి మాత్రం నేరుగా సంబంధం లేదంటున్నారు. మరోవైపు ఫెయిర్‌ఫోర్డ్ సమీపంలో అరెస్టులు, ఇరాన్ నుంచి గతంలో వచ్చిన హెచ్చరికలు, అమెరికా బాంబర్ల ఆకస్మిక తరలింపు.. ఇవన్నీ ఒకేసారి చోటుచేసుకున్నాయి. అయితే ఈ పరిణామాల మధ్య ఖచ్చితమైన సంబంధం ఏమిటన్నది అమెరికా అధికారికంగా పూర్తిగా వెల్లడించలేదు.ఇదీ చదవండి: ఫ్లైదుబాయ్ ఫ్లైట్‌ను కూల్చేయాలనుకున్న ఇజ్రాయెల్! -
29 ఏళ్లకే ఎంపీ.. షాకింగ్ స్కాండల్.. జైలు.. ఆ తర్వాతే అసలు కథ!
కొన్ని జీవితాలు సినిమాటిక్‌గా ఉంటాయి.. మరికొన్ని జీవితాలే ఓ కథగా మారుతాయి. బ్రిటన్ ప్రముఖ రచయిత జెఫ్రీ ఆర్చర్ జీవితం రెండో కోవకు చెందుతుంది. రాజకీయాల్లో అతి చిన్న వయసులోనే ఎంపీగా అడుగుపెట్టి.. సెక్స్ స్కాండల్‌తో కెరీర్ దెబ్బతిని.. జైలుకెళ్లి.. చివరికి ఆ జైలు జీవితం నుంచే ప్రపంచాన్ని తన కథలతో కట్టిపడేసిన స్టార్ రైటర్‌గా ఎదిగారు. అలాంటి రచయిత చివరికి తన చివరి నవల విడుదలకు ఒక్కరోజు ముందు కన్నుమూశారు.దిగ్గజ నవలా రచయిత జెఫ్రీ ఆర్చర్ (jeffrey archer) సోమవారం కన్నుమూశారు. ఆయన వయసు 86 ఏళ్లు. ఇంట్లో రచనా పనిలో ఉండగానే “అకస్మాత్తుగా, ప్రశాంతంగా” మృతి చెందినట్లు ప్రచురణ సంస్థ హార్పర్‌కాలిన్స్ తెలిపింది. ఆయన నవల అడమ్ అండ్ ఈవ్ అక్టోబర్ 6న రిలీజ్ కావాల్సి ఉంది. ఈలోపే మహా కథకుడి ప్రయాణం ముగియడంతో.. సాహిత్య ప్రపంచం విషాదంలో మునిగింది.అప్పుడు జెఫ్రీ ఆర్చర్ వయసు 29 సంవత్సరాలు. బ్రిటన్ రాజకీయాల్లోకి వచ్చిన ఆయన లౌత్ నియోజకవర్గం నుంచి కన్జర్వేటివ్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. అప్పటికే అతనిలో రాజకీయ నాయకుడి కంటే పెద్ద లక్ష్యాలు కనిపించేవి. ప్రసంగాలు, పరిచయాలు, నిధుల సేకరణలో ఆయనకు మంచి పేరు వచ్చింది. కానీ రాజకీయ జీవితం ఎక్కువకాలం సాగలేదు. కెనడాకు చెందిన ఓ పారిశ్రామిక కంపెనీలో భారీగా పెట్టుబడి పెట్టి నష్టపోవడంతో ఆయన అప్పుల్లో కూరుకుపోయారు. దాదాపు దివాళా అంచుకు చేరుకున్నారు. చివరకు 1974లో పార్లమెంట్‌ను వీడాల్సి వచ్చింది. అక్కడితో కథ ముగిసిపోయి ఉంటే.. జెఫ్రీ ఆర్చర్ పేరు ఇవాళ ఎవరికీ తెలియకపోయేదేమో.డబ్బుల్లేవు.. అప్పులు మాత్రం భారీగాఆర్థికంగా పూర్తిగా దెబ్బతిన్న సమయంలో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. రాయాలి. తన అప్పులు తీర్చుకోవడానికి రచయితగా మారారు. 1976లో వచ్చిన తొలి నవల నాట్ ఏ పెన్నీ మోర్.. నాట్ ఏ పెన్నీ లెస్ Not a Penny More, Not a Penny Less ఆయన జీవితాన్నే మలుపుతిప్పింది. విమర్శకులు పెద్దగా పట్టించుకోకపోయినా పాఠకులు మాత్రం పట్టించుకున్నారు. అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూడలేదు.ఆ తర్వాత వచ్చిన కేన్ అండ్ ఎబెల్(Kane & Abel) ఆయనకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చింది. ఇద్దరు వ్యక్తులు.. రెండు భిన్న ప్రపంచాలు.. డబ్బు, అధికారం, ఆశయం, ప్రతీకారం.. ఆర్చర్ కథల్లో కనిపించే ఈ అంశాలన్నీ పాఠకులను కట్టిపడేశాయి. కాలక్రమంలో ఆయన పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్లకు పైగా అమ్ముడయ్యాయి. ఆయన రచనలు 47కుపైగా భాషల్లో, 100కుపైగా దేశాల్లో పాఠకులను చేరుకున్నాయి.రచయితగా ఎదిగినకొద్దీ.. రాజకీయ ఆశలు కూడాఆర్చర్ రాజకీయాలను పూర్తిగా వదిలేయలేదు. 1980లలో మళ్లీ కన్జర్వేటివ్ పార్టీలో కీలకంగా ఎదిగారు. 1985లో అప్పటి ప్రధాని మార్గరెట్ థాచర్ ఆయనను పార్టీ డిప్యూటీ చైర్మన్‌గా నియమించారు. ఒకప్పుడు ఆర్థికంగా కుప్పకూలిన వ్యక్తి.. ఇప్పుడు అధికార పార్టీలో అగ్రస్థానానికి చేరువయ్యారు. కానీ ఈసారి సమస్య డబ్బు కాదు.ఒక మహిళతో సంబంధానికి సంబంధించిన ఆరోపణ ఆయన రాజకీయ జీవితాన్ని మరోసారి కుదిపేశాయి. డైలీ స్టార్ పత్రికపై పరువు నష్టం దావా వేసి భారీ మొత్తంలో పరిహారం కూడా గెలుచుకున్నారు. ఆ కేసులో తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. అయితే కొన్నేళ్ల తర్వాత అదే వ్యవహారం ఆయన జీవితంలోనే అతిపెద్ద కుంభకోణంగా మారింది.లండన్ మేయర్ కల, కానీ..1990ల చివర్లో జెఫ్రీ ఆర్చర్ లక్ష్యం మరింత పెద్దదైంది. లండన్ తొలి ఎన్నికైన మేయర్ కావాలి. 1999లో కన్జర్వేటివ్ పార్టీ ఆయనను మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేసింది. రాజకీయంగా తిరిగి పుంజుకున్నానని అనుకుంటున్న సమయంలో పాత కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. 1987లో డైలీ స్టార్‌పై వేసిన పరువు నష్టం కేసులో తనకు అనుకూలంగా తప్పుడు అలీబీ సృష్టించేందుకు స్నేహితుడిని ఉపయోగించుకున్నారన్న విషయం బయటపడింది. ఇక రాజకీయ పునరాగమనం అక్కడితో ఆగిపోయింది.కోర్టులో అబద్ధం.. జైలు2001లో జెఫ్రీ ఆర్చర్ పర్జరీ, న్యాయ ప్రక్రియను అడ్డుకోవడానికి కుట్ర చేసిన నేరాల్లో దోషిగా తేలారు. ఆయనకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. 2003లో పెరోల్‌పై విడుదలయ్యారు. సుమారు రెండేళ్లు జైలులో గడిపారు. ఇక్కడే ఆర్చర్ జీవితంలో మరో అసాధారణ అధ్యాయం మొదలైంది. జైలులో కూడా రాశారు.తన జైలు అనుభవాలనే ఏ ప్రిజన్ డైరీ(A Prison Diary)గా మూడు భాగాలుగా(.. Hell, Purgatory, Heaven) రాశారు. అంటే.. ఒకప్పుడు తన కథల్లో జైలు, కోర్టు, రాజకీయాలు, కుట్రలు రాసిన రచయిత.. ఇప్పుడు వాటినే స్వయంగా అనుభవించి రాశారు.జైలు అతన్ని ఆపలేదుసాధారణంగా ఇలాంటి కుంభకోణం తర్వాత ఒక ప్రజా వ్యక్తి పేరు కనుమరుగవుతుంది. ఆర్చర్ విషయంలో అలా జరగలేదు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా రాయడం కొనసాగించారు. A Prisoner of Birth, Paths of Glory, The Clifton Chronicles, William Warwick సిరీస్ వంటి రచనలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా పాఠకులు ఆయన వెంట నడిచారు. ఆయన జీవితంలోని ఓ విచిత్రమైన విషయం ఏమిటంటే.. తనను కూల్చిన అనుభవాలనే కథలుగా మార్చుకుని మళ్లీ పాఠకుల ముందుకు రావడం. ఆర్థిక పతనం ఆయనకు తొలి నవలను ఇచ్చింది. రాజకీయాలు ఆయనకు పాత్రలను ఇచ్చాయి. కోర్టు, జైలు ఆయనకు మరో ప్రపంచాన్ని ఇచ్చాయి.భార్య మేరీ.. ప్రతి మలుపులోనూ తోడుగాజెఫ్రీ ఆర్చర్ జీవితంలో మరో ముఖ్యమైన పాత్ర ఆయన భార్య డేమ్ మేరీ ఆర్చర్‌ది. భర్త ఎదుర్కొన్న రాజకీయ ఆరోపణలు, కోర్టు కేసులు, జైలు.. అన్నింటి మధ్యా ఆమె ఆయనకు అండగా నిలిచారు. శాస్త్రవేత్త అయిన మేరీ ఆర్చర్ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ బకింగ్‌హామ్ చాన్స్‌లర్‌గా కూడా పనిచేశారు. ఆర్చర్ తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో తుఫాన్లు ఎదుర్కొన్నప్పటికీ.. కుటుంబ జీవితం పూర్తిగా విచ్ఛిన్నం కాలేదు.30 కోట్లకు పైగా.. ఒక విచిత్రమైన రికార్డుఆర్చర్ గురించి చెప్పేటప్పుడు ఒక సంఖ్య తప్పక చెప్పాలి. 300 మిలియన్లకు(30 కోట్లకు) పైగా. అంతటి స్థాయిలో పుస్తకాలు అమ్ముడైన రచయిత ఆయన. అంతేకాదు.. ఆయన అధికారిక వెబ్సైట్ ప్రకారం ఫిక్షన్, షార్ట్ స్టోరీస్, నాన్-ఫిక్షన్ మూడు విభాగాల్లోనూ నంబర్ వన్ బెస్ట్‌సెల్లర్‌గా నిలిచిన ఏకైక రచయితగా ఆయన రికార్డు పేర్కొంటారు. అతని కథల్లో వేగం ఉంటుంది. మలుపులు ఉంటాయి. అధికారాన్ని కోరుకునే వ్యక్తులు ఉంటారు. డబ్బు కోసం పోరాటం ఉంటుంది. ప్రేమ ఉంటుంది. ద్రోహం ఉంటుంది. విచిత్రమేమిటంటే.. ఆయన స్వయంగా అలాంటి కథలో ప్రధాన పాత్రలా జీవించారు.86 ఏళ్ల వయసులోనూ.. రాయడం ఆపలేదుజెఫ్రీ ఆర్చర్ చివరి దశ వరకు రచన కొనసాగించారు. Adam & Eveను తన చివరి నవలగా ప్రకటించారు. 50 ఏళ్ల కథా రచనా ప్రయాణానికి ముగింపు పలుకుతున్నానని స్వయంగా చెప్పారు. ఈ నవల అక్టోబర్ 6న విడుదల కావాల్సి ఉంది(అయ్యింది కూడా). నవల కథ కూడా ఆయనకు ఇష్టమైన భారీ కాన్వాస్లోనే సాగుతుంది. 1918లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే సమయంలో పుట్టిన ఇద్దరు పిల్లలు. ఒకరు కౌంట్ కుమార్తె, మరొకరు గొర్రెల కాపరి కుమారుడు. వారి జీవితాలు, ప్రేమ, రెండో ప్రపంచ యుద్ధం.. కథ ముందుకు సాగుతుంది. ఇక ఆ పుస్తకం విడుదలకు ఒక్కరోజు ముందు.. జెఫ్రీ ఆర్చర్ చనిపోయారు. ఇంతకంటే విచిత్రమైన ముగింపు ఒక రచయిత జీవితానికి దొరకడం కష్టం.భారత్‌లోనూ జెఫ్రీ ఆర్చర్‌కు ప్రత్యేకమైన అభిమానగణం ఉంది. ‘కేన్ అండ్ ఏబెల్’, ‘నాట్ ఎ పెన్నీ మోర్, నాట్ ఎ పెన్నీ లెస్’, ‘ది క్లిఫ్టన్ క్రానికల్స్’ వంటి రచనలు ఇక్కడ విశేష ఆదరణ పొందాయి. 2019లో జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో ఆయనను వినేందుకు ఏకంగా 7,500 మంది తరలివచ్చారు. భారతీయులు, తాను సహజమైన స్నేహితుల్లాంటివారమని ఆర్చర్ చెప్పేవారు. ఆయన పుస్తకాలకు ఉన్న డిమాండ్ కారణంగా కొన్ని సందర్భాల్లో బ్రిటన్ కంటే ముందే భారత్‌లో విడుదల చేసేవారు. ‘క్లిఫ్టన్ క్రానికల్స్’లో భారత్ నేపథ్యం, భారతీయ పాత్రలు కనిపించడంతోపాటు.. ఆర్.కె. నారాయణ్ రచనలను కూడా ఆయన అభిమానించేవారు. అందుకే భారత్ ఆయనకు కేవలం ఓ మార్కెట్ కాదు.. ప్రత్యేకమైన పాఠకుల ప్రపంచం.::వెబ్‌డెస్క్ ప్రత్యేకం -
ఫ్లైదుబాయ్ ఘటనలో బిగ్ ట్విస్ట్
ఆ విమానంలో 170 మందికిపైగా ప్రయాణికులు.. వారిలో ఎక్కువమంది ఇజ్రాయెల్ పౌరులు. దుబాయ్ నుంచి టెల్‌అవీవ్‌కు వెళ్తున్న విమానం ఒక్కసారిగా వేల అడుగుల మేర కిందికి పడిపోయింది. కాక్‌పిట్‌లో పైలట్‌పై కో-పైలట్ దాడి చేశాడు. విమానం అదుపు తప్పుతున్నట్లు కనిపించింది. ఆ సమయంలో ప్రయాణికులు, సిబ్బంది ధైర్యంగా స్పందించకపోయి ఉంటే పెను విషాదమే జరిగేది. ఇప్పుడు ఈ ఘటనపై దర్యాప్తులో వరుసగా కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. ప్లైదుబాయ్ ఘటనను ఉగ్ర దాడిగా అటు యూఏఈ, ఇటు ఇజ్రాయెల్‌లు ప్రకటించాయి. పైగా అల్‌ఖైదా స్పందనతో హమామ్ అల్-హమ్మామీ ఆ సంస్థలోనే ట్రైనింగ్ తీసుకుని ఉంటాడని దాదాపుగా అంచనాకు వచ్చారు. ఈ తరుణంలో ఓ బిగ్ ట్విస్ట్ బయటపడింది. “గాజా ప్రతీకారం కోసం చేశాను.. అమరుడిగా చనిపోవాలనుకున్నా” అంటూ కో-పైలట్ హమామ్ అల్-హమ్మామీ విచారణలో చెప్పినట్లు తాజాగా ఇజ్రాయెల్ మీడియా కథనాలు వెల్లడించాయి. అదే సమయంలో విమానం ఇజ్రాయెల్ వైపు కొనసాగి ఉంటే.. ప్రయాణికులతో నిండిన ఆ విమానాన్ని కూల్చివేయడానికి కూడా ఇజ్రాయెల్ సిద్ధమైందన్న విషయం వెలుగులోకి వచ్చింది.గాజా ప్రతీకారం కోసమా?ఫ్లైదుబాయ్ ఘటనలో ఇరాన్ కోణంపై అమెరికా, ఇజ్రాయెల్‌లు అనుమానాలు వ్యక్తం చేశాయి. అయితే దర్యాప్తులో మాత్రం కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. విచారణలో హమామీ “గాజాకు ప్రతీకారంగా చేశాను. అమరుడిగా చనిపోవాలనుకున్నాను” అని చెప్పినట్లు సమాచారం. దీనిని దర్యాప్తు అధికారులు గనుక ధృవీకరిస్తే.. కీలక సమాధానమే దొరికినట్లవుతుంది. అయితే హమామీ ఒంటరిగానే ఈ దాడికి పాల్పడ్డాడా? ఎవరైనా అతడిని ప్రేరేపించారా? ఎవరైనా సంస్థ అతడిని ఉపయోగించుకుందా? ప్రయాణాలు, పరిచయాలు, విదేశాల్లో ఎవరెవరిని కలిశాడు? ఇలా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఇజ్రాయెల్ దర్యాప్తు వర్గాలు దీనిని లొన్-వోల్ఫ్ దాడి అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాయట. ముందే స్కెచ్ వేశాడా?హమామీ విచారణలో మరో సంచలన విషయం కూడా బయటకొచ్చింది. హమామీ ఫ్లైదుబాయ్‌లో చేరకముందే ఈ దాడికి ప్రణాళిక వేసుకున్నట్లు ఇజ్రాయెల్ అధికారి ఒకరు ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. విమానాన్ని చివరకు టెల్‌అవీవ్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంలో కూల్చేయాలన్నది అతడి ఉద్దేశమని ఆ అధికారి చెప్పినట్లు నివేదిక పేర్కొంది. అంతేకాదు.. టెల్‌అవీవ్‌కు వెళ్లే విమానాల్లో పని చేసే అవకాశం కోసం అతడు ఫ్లైదుబాయ్‌లో చేరాడా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. దీంతో.. ఇది అకస్మాత్తుగా జరిగిన దాడి కాదా? ముందే లక్ష్యాన్ని ఎంచుకుని పథకం ప్రకారం చేశాడా? అనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి.విమానం కూల్చేందుకు ఇజ్రాయెల్ రెడీ!ఇక ఈ ఘటనలో మరో ఉత్కంఠభరితమైన విషయం తాజాగా బయటపడింది. విమానం కాక్‌పిట్‌లో దాడి జరిగిన తర్వాత అది సుమారు 14 వేల అడుగుల మేర ఒక్కసారిగా కిందికి పడిపోయింది. ఇజ్రాయెల్ వైమానిక దళం కాక్‌పిట్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించినా స్పందన రాలేదు. దీంతో అక్కడి అధికారులు 9/11 తరహా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముందే రూపొందించుకున్న ప్రోటోకాల్‌ను అమల్లోకి తెచ్చారు. కమాండ్ సెంటర్ ఏర్పాటు చేసి.. యుద్ధ విమానాలను రంగంలోకి దించారు. ఇజ్రాయెల్ గగనతలాన్ని కూడా మూసివేశారు.విమానం ఇజ్రాయెల్‌కు సుమారు 400 మైళ్ల దూరంలో ఉన్నప్పుడు మాత్రం పరిస్థితి మారింది. ఎఫ్‌జెడ్1073 విమానం ఇజ్రాయెల్ వైపు కాకుండా సౌదీ అరేబియా వైపు మళ్లినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను వెనక్కి పిలిచింది. సౌదీ కూడా తన యుద్ధ విమానాలను రంగంలోకి దించింది.170 మందికిపైగా ఉన్నా.. అదే చివరి నిర్ణయం!అయితే విమానం ఇజ్రాయెల్ వైపే కొనసాగి ఉంటే పరిస్థితి మరింత భయంకరంగా ఉండేది. విమానం హైజాక్ అయిందని నిర్ధారణై, కాక్‌పిట్ నుంచి ఎలాంటి స్పందన లేకపోతే యుద్ధ విమానాలు దాని దగ్గరకు వెళ్లి కాక్‌పిట్, ప్రయాణికుల పరిస్థితిని పరిశీలించేవి. ఆ తర్వాత కూడా ముప్పు కొనసాగితే రక్షణ మంత్రి, ప్రధానమంత్రితో అత్యవసర చర్చ జరిగేది.అక్కడే అత్యంత కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చేది. ఇజ్రాయెల్ ప్రోటోకాల్ ప్రకారం.. నియంత్రణలో లేని విమానం కీలక ప్రాంతాల వైపు దూసుకొస్తోందని నిర్ధారణ అయితే దాన్ని కూల్చివేసే అవకాశం ఉంది. ఆ తుది నిర్ణయం ప్రధానమంత్రిదే. ప్రయాణికులతో నిండిన విమానం కూల్చడం కంటే.. అది టెల్‌అవీవ్‌లోని విమానాశ్రయం లేదంటే ఇతర కీలక ప్రాంతాన్ని ఢీకొట్టి వందల మందిని చంపే ప్రమాదాన్ని అడ్డుకోవడమే ఈ విధానం ఉద్దేశమని ఇజ్రాయెల్ వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ మీడియా కథనం ఇచ్చింది.చివరి నిమిషంలో పెను ప్రమాదం తప్పిందిఇదంతా జరుగుతున్న సమయంలో కాక్‌పిట్‌లో మాత్రం మరో పోరాటం సాగుతోంది. హమామీ దాడిలో గాయపడిన భారత పైలట్ స్మిట్ మచ్చార్ అతడిని అడ్డుకోవడానికి పోరాడాడు. చివరకు కాక్‌పిట్ తలుపు తెరవగలిగాడు. దీంతో ప్రయాణికులు, ఫ్లైదుబాయ్ సిబ్బంది లోపలికి వెళ్లి హమామీని అదుపులోకి తీసుకున్నారు. విమానంలో ఉన్న ఇద్దరు ఆఫ్-డ్యూటీ పైలట్లు నియంత్రణ చేపట్టారు. అనంతరం విమానం సౌదీ అరేబియాలోని టబుక్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఫ్లైదుబాయ్ ఘటన వెనుక దాగి ఉన్న కొత్త కోణాలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నాయి. దాడి వెనుక అతడొక్కడే ఉన్నాడా? ఎవరైనా అతడిని నడిపించారా? అన్నది తేలాల్సి ఉంది.ఇదీ చదవండి: హమామీ క్లియరెన్స్‌పై ఒమన్ సంచలన వ్యాఖ్యలు -
అతడి విషయంలో ఎక్కడో పెద్ద తప్పే జరిగింది!
ఫ్లైదుబాయ్ ఘటనలో కో-పైలట్ హమామ్ అల్-హమ్మామీ విషయంలో ఒమన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. హమామీ వ్యవహారంలో ఎక్కడో పెద్ద తప్పు జరిగి ఉండొచ్చని అక్కడి సీనియర్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అతడి ఆన్లైన్ కార్యకలాపాలపై గతంలోనే అనుమానాలు వ్యక్తమైనప్పటికీ.. ఆ సమాచారాన్ని సరైన రీతిలో పరిగణనలోకి తీసుకుని ఉంటే ఈ దాడి జరిగి ఉండేది కాదేమోనని వ్యాఖ్యానించాయి.హమామీపై గతంలో ఒమన్ బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏవియేషన్ రంగంలో శిక్షణ పొందుతున్న సమయంలోనే అతడి ఆన్లైన్ కార్యకలాపాలపై నిఘాలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయని ఒమన్ అధికార వర్గాలు తెలిపాయి. తీవ్రవాద, ఉగ్రవాద సంబంధిత కంటెంట్‌పై అతడికి ఆసక్తి ఉన్నట్లు గుర్తించిన తర్వాత.. ఒమన్‌లో ఏవియేషన్ కెరీర్‌ను కొనసాగించకుండా అడ్డుకున్నామని వెల్లడించాయి.హమామీ తండ్రి మా దేశస్థుడే. తల్లి మాత్రం సిరియన్. అయితే అతడు జీవితంలో ఎక్కువ కాలం ఒమన్ వెలుపలే గడిపాడు. గతంలో ఒమన్‌లోని ఓ విమానయాన సంస్థలో కొంతకాలం ట్రైనీగా పనిచేసిన సమయంలో అతడి ఇంటర్నెట్ కార్యకలాపాలను అధికారులు గమనించారు. తీవ్రవాద భావజాలానికి సంబంధించిన వెబ్సైట్లు, కంటెంట్‌పై అతడి ఆసక్తిని గుర్తించిన తర్వాత.. అతడిని ఏవియేషన్ రంగంలో కొనసాగనివ్వలేదు అని ఓ సీనియర్ అధికారి భారత్‌కు చెందిన ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.అయినా పైలట్‌గా ఎలా?ఇదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఒమన్‌లోనే హమామీపై భద్రతాపరమైన అనుమానాలు వ్యక్తమైనప్పుడు.. ఆ తర్వాత అతడు మరోచోట ఏవియేషన్ రంగంలో(రెండు సంస్థల్లో!) ఎలా కొనసాగాడు?. అతడిని నియమించే ముందు అతడి గత రికార్డులపై తనిఖీలు జరిగాయా? ఒమన్‌లో గుర్తించిన అంశాలు ఇతర దేశాలు లేదా సంబంధిత సంస్థలకు ఎందుకు తెలియలేదు? అన్నదానిపై దర్యాప్తు సాగుతోంది.ఈ వ్యవహారంపై ఒమన్ వర్గాలు తీవ్రంగా స్పందించాయి. ‘‘హమామీ విషయంలో ఎక్కడో పెద్ద తప్పు జరిగింది’’ అని వ్యాఖ్యానించాయి. అతడిని కో-పైలట్‌గా నియమించే ముందు భద్రతా ధ్రువీకరణ కోసం ఒమన్‌ను ఎవరూ సంప్రదించలేదని ఆ దేశ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఒకవేళ అధికారికంగా సమాచారం కోరితే.. తమ వద్ద ఉన్న వివరాలన్నింటినీ సంబంధిత వర్గాలతో పంచుకునేవారమని ఆ సీనియర్ అధికారి పేర్కొన్నారు.ఇలాంటి నియామకాల సమయంలో విమానయాన విధివిధానాలను పాటించడంలో లోపం జరిగి ఉండొచ్చని అన్నారాయన. ఇందులో నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం లేదంటే ఉద్దేశపూర్వకంగా విషయాన్ని పట్టించుకోకపోవడం వంటి అంశాలు ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.అయినా ఇజ్రాయెల్ విమానంలో ఎలా?హమామీ ఒమన్ జాతీయుడైతే.. ఇజ్రాయెల్‌కు వెళ్లే విమానంలో కో-పైలట్‌గా ఎలా పనిచేశాడన్న అంశంపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇజ్రాయెల్–యూఏఈ మధ్య ఉన్న విమానయాన ఏర్పాట్ల ప్రకారం సంబంధిత విమానాల్లో యూఏఈ పౌరులు లేదంటే ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు ఉన్న దేశాల పౌరులకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయని ఒమన్ వర్గాలు చెబుతున్నాయి. ఒమన్‌కు ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు లేనందున.. హమామీకి మరో దేశ పౌరసత్వం కూడా ఉండి ఉండొచ్చని ఆ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు.దాడిపై దర్యాప్తుసెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్‌అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ కాక్‌పిట్‌లో కెప్టెన్ స్మిట్ మచ్చార్‌పై దాడి చేశాడు. ఈ ఘటనను యూఏఈ, ఇజ్రాయెల్ అధికారులు ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. ప్రస్తుతం దర్యాప్తులో హమామీ గత రికార్డులు, అతడికి లభించిన భద్రతా అనుమతులు, ఫ్లైట్ సిబ్బందిగా నియామకానికి ముందు జరిగిన తనిఖీలు కీలకంగా మారాయి. ఒమన్‌లో గతంలోనే అనుమానాలు వ్యక్తమైన వ్యక్తి.. చివరకు ఇజ్రాయెల్ వెళ్లే విమానానికి కో-పైలట్‌గా ఎలా నియమితుడు అయ్యాడనే మిస్టరీ వీడాల్సి ఉంది. ఇదీ చదవండి: జర్మనీలో వేల ఏళ్ల కిందటే ఆ టెక్నాలజీ! -
సౌదీకి ముప్పు! రంగంలోకి పాక్, టర్కీ బలగాలు
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. యెమెన్‌లో హౌతీల దూకుడు, సౌదీ అరేబియాపై వరుస దాడుల నేపథ్యంలో.. సౌదీ రక్షణకు పాకిస్థాన్, టర్కీ రంగంలోకి దిగుతున్నాయి. సౌదీ, పాక్, టర్కీ కలిసి ఏర్పాటు చేసిన మక్కా డిఫెన్స్ అలయన్స్‌ను ఇప్పుడు అధికారికంగా యాక్టివేట్ చేశారు. రియాద్‌లో జరిగిన అత్యవసర సమావేశం తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.యెమెన్‌లో ఇరాన్ మద్దతున్న హౌతీలు ఇటీవలి వారాల్లో తమ ఆధీనంలోని ప్రాంతాలను విస్తరించేందుకు దూకుడుగా ముందుకు సాగుతున్నారు. సౌదీ సరిహద్దులు, నగరాలు, కీలక మౌలిక సదుపాయాలపై కూడా దాడుల ముప్పు పెరిగింది. మక్కా, మదీనాలను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నాలను, సౌదీలోని నగరాలు, పౌర, ఆర్థిక మౌలిక సదుపాయాలపై దాడులను మక్కా ప్యాక్ట్ సభ్య దేశాలు తీవ్రంగా ఖండించాయి.ఈ నేపథ్యంలో అక్టోబర్ 5న రియాద్‌లో మక్కా అలయన్స్ స్ట్రాటజిక్-పొలిటికల్, డిఫెన్స్ కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించింది. దాడులకు ప్రతిస్పందనగా ఉమ్మడి రక్షణ చర్యలను అమలు చేయాలని.. అవసరమైన సైనిక బలగాలు, రక్షణ సామర్థ్యాలను సౌదీలో వేగంగా మోహరించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ చర్యలు ఇప్పటికే కుదిరిన ఏర్పాట్లు, మూడు దేశాల చట్టాల ప్రకారమే ఉంటాయని స్పష్టం చేశారు.ఆగస్టులోనే మక్కా ప్యాక్ట్సౌదీ, పాకిస్థాన్, టర్కీ మధ్య పరస్పర రక్షణ ఒప్పందం ఆగస్టు 7న కుదిరింది. ఒప్పందంలోని ప్రధాన సూత్రం.. ఒక సభ్య దేశంపై సాయుధ దాడిని అన్ని సభ్య దేశాలపై దాడిగా పరిగణించడం. అప్పట్లో ఇది భవిష్యత్తులో ఎదురయ్యే భద్రతా ముప్పులకు ఉమ్మడిగా స్పందించేందుకు రూపొందించిన రక్షణ వ్యవస్థగా పేర్కొన్నారు. అయితే ఒప్పందం కుదిరిన కొద్దికాలానికే యెమెన్‌లో పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. హౌతీల దాడులు, యెమెన్‌లో వారి దూకుడు పెరగడంతో.. ఇప్పుడు మక్కా ప్యాక్ట్ తొలిసారి ప్రత్యక్ష భద్రతా సంక్షోభంలో అమల్లోకి వస్తోంది.పాక్, టర్కీ ఏం చేయబోతున్నాయి?సౌదీ రక్షణకు అవసరమైన సైనిక బలగాలు, సామర్థ్యాలను వేగంగా మోహరించేందుకు పాకిస్థాన్, టర్కీ అంగీకరించాయి. అయితే ఇప్పటివరకు ఎన్ని బలగాలు, ఏ రకమైన ఆయుధ వ్యవస్థలు, ఎలాంటి ప్రత్యేక దళాలు పంపుతారనే పూర్తి వివరాలను వెల్లడించలేదు. అందువల్ల భారీ సంఖ్యలో సైనికులు ఇప్పటికే సౌదీకి చేరుకున్నారంటూ వస్తున్న కొన్ని ప్రచారాలను ధ్రువీకరించకుండా చూడాల్సి ఉంటుంది.మక్కా అలయన్స్‌కు తొలి సెక్రటరీ జనరల్‌గా పాకిస్థాన్‌కు చెందిన రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ నౌమన్ మహ్మూద్ను మూడేళ్ల కాలానికి నియమించారు. కూటమి వ్యవస్థను సంస్థాగతంగా బలోపేతం చేసే బాధ్యత ఆయనపై ఉండనుంది.యెమెన్‌లో ‘యెమెన్ డాన్’.. 100 యుద్ధ విమానాలుఒకవైపు మక్కా ప్యాక్ట్ కదులుతుండగా.. మరోవైపు యెమెన్‌లో హౌతీలపై సౌదీ మద్దతు ఉన్న బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. యెమెన్ ప్రభుత్వ బలగాలు హౌతీల ఆధీనంలోని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ‘యెమెన్ డాన్’ పేరిట ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ ఆపరేషన్‌కు సౌదీ నేతృత్వంలోని కూటమి నుంచి భారీ వైమానిక మద్దతు లభిస్తోంది. 100 యుద్ధ విమానాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయని కూటమి ప్రకటించింది. బాబ్ అల్-మండేబ్ జలసంధికి వైమానిక రక్షణ కల్పిస్తున్నామని, వందలాది హౌతీ లక్ష్యాలను ధ్వంసం చేశామని కూటమి తెలిపింది.బాబ్ అల్.. ఇంత కీలకం ఎందుకు?యెమెన్ పశ్చిమ తీరంలో ఉన్న బాబ్ అల్ మండేబ్ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటి. ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌తో కలిపే ఈ మార్గం ద్వారా అంతర్జాతీయ వాణిజ్య నౌకలు రాకపోకలు సాగిస్తాయి. ఇటీవల హౌతీలు ఈ ప్రాంతంలో తమ పట్టును పెంచుకోవడంతో.. సముద్ర రవాణా, ఇంధన సరఫరాలపై ఆందోళనలు పెరిగాయి. అందుకే బాబ్ అల్ మందెబ్పై నియంత్రణ ఎవరి చేతిలో ఉంటుందనేది ఇప్పుడు యెమెన్ యుద్ధంలో కీలక అంశంగా మారింది.యెమెన్ ప్రభుత్వ బలగాలు బాబ్ అల్ చుట్టుపక్కల కీలక ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించాయి. ధుబాబ్ ప్రాంతం, విమానాశ్రయం, మొఖా వైపు వెళ్లే మార్గాలపై కూడా తమకు పట్టు లభించిందని తెలిపాయి. సనా వైపు కూడా దూకుడుబాబ్ అల్ మండేబ్ ప్రాంతంలోనే కాకుండా.. హౌతీల ప్రధాన స్థావరమైన రాజధాని సనా వైపూ యెమెన్ ప్రభుత్వ బలగాలు వ్యూహాత్మక దాడిని ప్రారంభించినట్లు ప్రకటించాయి. హౌతీల ఆధీనంలో ఉన్న ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. మరోవైపు హౌతీలు కూడా సౌదీపై దాడులు కొనసాగించగల సామర్థ్యం తమకు ఉందని చెబుతున్నారు. సౌదీ కీలక చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వారు చెబుతున్నారు.ఇక ముందు ఏం జరుగుతుంది?ఇప్పటివరకు యెమెన్ యుద్ధం ప్రధానంగా సౌదీ మద్దతున్న ప్రభుత్వ బలగాలు, హౌతీల మధ్యే సాగింది. ఇప్పుడు మక్కా ప్యాక్ట్ అమల్లోకి రావడంతో పాకిస్థాన్, టర్కీ కూడా సౌదీ భద్రతకు సైనికంగా మద్దతు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. అదే సమయంలో సౌదీ మద్దతు ఉన్న యెమెన్ బలగాలు బాబ్-అల్-మండేబ్ నుంచి సనా వరకు దూకుడును పెంచుతున్నాయి. దీంతో యెమెన్‌లోని పోరు మరోసారి ప్రాంతీయ ఘర్షణగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సౌదీ భూభాగంపై దాడులు పెరిగితే మక్కా ప్యాక్ట్ కింద పాక్, టర్కీ సైనిక పాత్ర ఎంతవరకు విస్తరిస్తుందన్నదే ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.ఇదీ చదవండి: బ్లాక్‌సీ జర్నీ.. భారతీయులకు ముప్పేనా? -
గగనతలంలో ఘోరం.. 32 మంది దుర్మరణం
నైజీరియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న సైనిక విమానం ఒకటి కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాదంలో 32 మంది అక్కడికక్కడే మరణించారు. ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదని నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు స్వయంగా ప్రకటించారు. నైజీరియాలో ఇటీవలి సంవత్సరాల్లో చోటుచేసుకున్న అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాల్లో ఇది ఒకటిగా పేర్కొన్నారాయన.నైజీరియా వైమానిక దళానికి చెందిన ఏటీఆర్-42 విమానం సాధారణ మిషన్‌లో భాగంగా సోమవారం బెనిన్ సిటీ నుంచి లాగోస్‌కు సైనిక విమానం వెళ్తోంది. ఉదయం 8:13 గంటలకు (జీఎంటీ) విమానంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత విమానం కోసం భారీ స్థాయిలో గాలింపు చేపట్టారు. చివరకు ఒండో రాష్ట్రంలోని తీర ప్రాంత పట్టణం ఇగ్బోకొడా సమీపంలో విమానం శకలాలను గుర్తించారు. సహాయక, గాలింపు బృందాలు అక్కడికి చేరుకుని మృతదేహాలను వెలికితీసే చర్యలు చేపట్టాయి. స్థానికులు పడవల్లో వెళ్లి విమాన శకలాలను గుర్తించేందుకు సహాయక బృందాలకు సాయం చేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది ఎవరూ సజీవంగా బయటపడలేదని నైజీరియా విమానయాన శాఖ మంత్రి ఫెస్టస్ కేయామో వెల్లడించారు.ప్రత్యక్ష సాక్షి అకింటె టోలువలాసే తన కళ్ల ముందే విమానం కూలిందని చెప్పాడు. ఘటనా స్థలంలో కొందరి వ్యక్తిగత వస్తువులు, మృతదేహాల అవశేషాలు కనిపించాయన్నాడు. విమానం చిత్తడి నేలలో కూలిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడిందని.. అందుకే తాము అధికారులకు సాయం చేశామని చెప్పాడు.విమానం ఎందుకు కుప్పకూలిందన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు వైమానిక దళాన్ని ఆదేశించారు.‘‘ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ప్రమాదానికి గల కారణాలను పూర్తిగా తెలుసుకునేందుకు వెంటనే దర్యాప్తు ప్రారంభించాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి’’ అని అధ్యక్షుడు టినుబు పేర్కొన్నారు.32 people have died after a Nigerian Air Force aircraft crashed near Igbokoda in Ondo State, Nigeria As Locals, Search Igbokoda. Locals are searching the swampy riverine area of Igbokoda, Ondo State, where a military aircraft was reported to have crashed earlier today, after some parts of the aircraft were spotted in the area.— McCharlie 🇳🇬 🇬🇧 🇬🇷 (@DGBiGG1) October 5, 2026ప్రమాదానికి ముందు విమానంలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తిందా? వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? విమానం కూలిపోవడానికి ముందు పైలట్ నుంచి ఏమైనా అత్యవసర సందేశం వచ్చిందా? అనే అంశాలపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించనున్నారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా 9 వేల అడుగుల కిందకు విమానం! -
రష్యా డ్రోన్ దాడి.. ముగ్గురు భారతీయులు సేఫ్.. కెప్టెన్ మృతి
నల్ల సముద్రంలో రష్యా దాడుల కలకలం రేపింది. వాణిజ్య నౌకపై డ్రోన్ విరుచుకుపడడంతో అది మునిగిపోయింది. ఈ దాడిలో ఒకరు మరణించగా.. మొత్తం 11 మంది సురక్షితంగా బయటపడ్డారు. వాళ్లలో ముగ్గురు భారతీయులు ఉండగా.. ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఎంవీ రోయాద్ మమ్మదోవ్ అనే సరకు రవాణా నౌకపై రష్యా దాడి జరిపింది. మంటలు చెలరేగి అనంతరం సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో నౌక కెప్టెన్ మృతి చెందగా.. ముగ్గురు భారతీయ సిబ్బంది సహా మొత్తం 11 మందిని రొమేనియా సైన్యం రక్షించగలిగింది. ఈ దాడిని ఖండించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ.. టర్కీకి చెందిన ఈ నౌకలో అజర్బైజాన్, భారత్‌కు చెందిన సిబ్బంది ఉన్నారని తెలిపారు.దాడి సమాచారం అందిన వెంటనే రొమేనియాలోని భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. తొలుత నౌకలో ముగ్గురు భారతీయులు ఉన్నట్లు, వారి పరిస్థితిపై వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపింది. అనంతరం ముగ్గురితో నేరుగా మాట్లాడినట్లు వెల్లడించింది. ముగ్గురు భారతీయులూ సురక్షితంగా ఉన్నారని, వారిలో ఒకరికి గాయాలు కావడంతో వైద్య చికిత్స అందుతున్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది. ఆసుపత్రి అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, భారతీయ సిబ్బందికి అవసరమైన అన్ని సహాయాలు అందిస్తున్నామని పేర్కొంది.రెండు డ్రోన్లతో దాడిఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ ఘటనపై స్పందిస్తూ.. రెండు రష్యా డ్రోన్లు పౌర నౌకపై దాడి చేశాయని ఆరోపించారు. నౌకలో మొక్కజొన్న సరకు ఉందన్నారు. దాడిలో నౌక కెప్టెన్ మృతి చెందినట్లు జెలెన్స్కీ వెల్లడించారు. మరో వ్యక్తి ఆచూకీపై కొంతసేపు స్పష్టత లేదని, 11 మంది సిబ్బందిని రక్షించగా వారిలో ఒకరికి గాయాలయ్యాయని తెలిపారు. అయితే ఈ ఆరోపణలపై రష్యా నుంచి వెంటనే అధికారిక స్పందన రాలేదు. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అంతకుముందు విడుదల చేసిన రోజువారీ బులెటిన్‌లో రెండు సరకు రవాణా నౌకలపై రష్యా దళాలు దాడులు చేసినట్లు పేర్కొన్నప్పటికీ.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించలేదు.ఇటలీకి వెళ్తుండగా..ఎంవీ రోయాద్ మమ్మదోవ్ మొక్కజొన్న సరుకుతో ఇటలీలోని రావెన్నా వైపు వెళ్తోంది. ఇది సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ జెండాతో ప్రయాణిస్తోంది. అంతకుముందు ఉక్రెయిన్‌లోని ఇజ్మాయిల్ నౌకాశ్రయంలో ఈ నౌక నిలిచినట్లు నౌకల కదలికలను పర్యవేక్షించే వెసెల్‌ఫైండర్ సమాచారం వెల్లడించింది. ఇజ్మాయిల్ ఉక్రెయిన్‌లోని డాన్యూబ్ నదీ తీరంలో రొమేనియా సరిహద్దుకు సమీపంలో ఉన్న కీలక నౌకాశ్రయం. యుద్ధం కారణంగా నల్ల సముద్రంలోని ఇతర మార్గాలపై ప్రమాదాలు పెరగడంతో ఉక్రెయిన్ నుంచి వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఇది ముఖ్యమైన మార్గంగా మారింది. రొమేనియా మీడియా కథనాల ప్రకారం.. నౌకపై దాడి రొమేనియా ఇంధన సంస్థ ఓఎంవీ పెట్రోమ్ నిర్వహించే చమురు వేదిక సమీపంలో జరిగినట్లు తెలుస్తోంది.భారతీయ నావికులకు పెరుగుతున్న ముప్పురష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో నల్ల సముద్రంలో వాణిజ్య నౌకల ప్రయాణం ప్రమాదకరంగా మారింది. క్షిపణులు, డ్రోన్ల దాడులతో పాటు సముద్రంలో కొట్టుకొచ్చే మందుపాతరలు కూడా వాణిజ్య నౌకలకు ముప్పుగా మారుతున్నాయి. ఈ ప్రాంతంలో ఇప్పటికే పలుమార్లు భారతీయ నావికులు దాడుల బారినపడ్డారు. జూలైలో ఉక్రెయిన్‌లోని ఒడెసా నౌకాశ్రయం నుంచి బయలుదేరుతున్న సమయంలో ఎంవీ గోల్డెన్ లియో నౌకపై రష్యా క్షిపణి దాడి జరగడంతో నలుగురు భారతీయ నావికులు మృతి చెందారు. అంతకుముందు ఎంవీ ఒమోర్ఫి నౌకపై జరిగిన దాడిలో మరో భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోయాడు. అదే నెలలో ఒడెసా నౌకాశ్రయంలో ఎంవీ ఏజీఎన్ రాగ్నర్ నౌకపై కూడా దాడి జరిగింది. అందులో నలుగురు భారతీయులు ఉండగా.. ఇద్దరు సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారించారు. మరో ఇద్దరి ఆచూకీపై తొలుత ఆందోళన వ్యక్తమైంది. వరుస ఘటనల నేపథ్యంలో యుద్ధ ప్రభావిత నల్ల సముద్ర ప్రాంతంలో వాణిజ్య నౌకల్లో ఉద్యోగాలు తీసుకునే ముందు భద్రతాపరమైన ముప్పులను జాగ్రత్తగా అంచనా వేసుకోవాలని భారత్ తన పౌరులకు సూచించింది.ఇదీ చదవండి: దుబాయ్ బంపర్ ఆఫర్.. వాళ్లకు మాత్రమే! -
భారత్‌లో ఎన్నికలట!.. సోయి లేకుండా ట్రంప్ పోస్ట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా సందేశాలను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పరిశీలిస్తుంటారు. అయితే తాజాగా ఆయన చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమెరికా ఎన్నికల వ్యవస్థను విమర్శించే క్రమంలో.. భారత్‌ను ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తితో పాటు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రంప్‌ను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు.ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో.. 125 మిలియన్ల మంది ఈరోజు భారత్ అధ్యక్ష ఎన్నికల తొలి దశలో ఓటేశారు. పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు ఫలితాలు వచ్చాయి అని రాశారు. అయితే ఆ రోజు మన దేశంలో ఎలాంటి ఎన్నికలు జరగలేదు కదా!. పైగా మన దేశంలో అధ్యక్షుడు(రాష్ట్రపతి)ని జనాలు కాదు కదా ఎన్నుకునేది. అయితే ఆయన పేర్కొన్న 125 మిలియన్ల ఓట్ల సంఖ్య కూడా మరో దేశంలో జరిగిన ఎన్నికల గణాంకాలకు దగ్గరగా ఉండటం ఇప్పుడు అసలు ట్విస్ట్‌గా మారింది.ట్రంప్ పేర్కొన్న 125 మిలియన్ల సంఖ్య ఎక్కడి నుంచి వచ్చిందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే తాజాగా జరిగిన బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో(తొలి దశ) మొత్తం 125,272,513 చెల్లుబాటు అయ్యే ఓట్లు నమోదయ్యాయి. సో.. ఈ సంఖ్య ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్న 125 మిలియన్లకు అత్యంత దగ్గరగా ఉంది. దీంతో బ్రెజిల్ ఎన్నికల గణాంకాలను భారత్‌కు ఆపాదిస్తూ ట్రంప్ పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉండటంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ముఖ్యంగా భారత్‌లో రాష్ట్రపతి ఎన్నిక ప్రత్యక్ష ప్రజా ఓటుతో జరగదన్న విషయాన్ని నెటిజన్లు ప్రస్తావిస్తూ ట్రంప్ పోస్ట్‌పై సెటైర్లు వేస్తున్నారు.బ్రెజిల్లో ఏం జరిగింది?అక్టోబర్ 4న బ్రెజిల్లో అధ్యక్ష ఎన్నికల తొలి దశ పోలింగ్ జరిగింది. ఇందులో ప్రస్తుత అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా, సెనేటర్ ఫ్లావియో బొల్సొనారో(మాజీ అధ్యక్షుడు జైర్ బొల్సోనారో కొడుకు) రెండో దశకు చేరుకున్నారు. దాదాపు పూర్తి ఫలితాల ప్రకారం ఫ్లావియో బొల్సొనారోకు 47.03 శాతం, లులాకు 45.16 శాతం ఓట్లు వచ్చాయి. ఎవరికీ 50 శాతానికి పైగా ఓట్లు రాకపోవడంతో అక్టోబర్ 25న రెండో దశ పోలింగ్ జరగనుంది.భారత అధ్యక్షుడి ఎన్నిక ఎలాగంటే.. భారత్‌లో రాష్ట్రపతిని ప్రజలు నేరుగా ఓటు వేసి ఎన్నుకోరు. ఎన్నికైన ఎంపీలు, రాష్ట్రాలు, ఢిల్లీ, పుదుచ్చేరి శాసనసభల్లోని ఎన్నికైన సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఈ ప్రక్రియలో సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు విధానాన్ని, రహస్య బ్యాలెట్‌ను ఉపయోగిస్తారు.అంటే బ్రెజిల్, అమెరికా వంటి దేశాల్లో జరిగే ప్రత్యక్ష ప్రజా ఓటుతో అధ్యక్షుడిని ఎన్నుకునే విధానానికి భారత్ రాష్ట్రపతి ఎన్నిక పూర్తిగా భిన్నం. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రస్తావించిన ‘‘భారత్ అధ్యక్ష ఎన్నికల తొలి దశ’’ అన్న విషయమే వాస్తవ పరిస్థితికి సరిపోలడం లేదు.అమెరికా ఎన్నికలపైనా ట్రంప్ విమర్శలుభారత్ ఎన్నికలను ప్రస్తావించిన ట్రంప్.. ఇదే పోస్టులో అమెరికా ఎన్నికల వ్యవస్థపైనా విమర్శలు చేశారు. డెట్రాయిట్, ఫిలడెల్ఫియా, కాలిఫోర్నియా తదితర ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపునకు వారాలు పడుతున్నాయని పేర్కొన్నారు. ‘‘వోటింగ్ ఇన్ అమెరికా ఈజ్ కరప్ట్’’ అంటూ ఆరోపించారు. గతంలో భారత్ ఎన్నికలపై ప్రశంసలుఇదిలా ఉండగా.. ట్రంప్ గతంలో మాత్రం భారత్ ఎన్నికల విధానాన్ని ప్రస్తావించారు. ఆగస్టులో అమెరికాలో ఓటర్ గుర్తింపు నిబంధనలను కఠినతరం చేయాలన్న వాదనకు మద్దతుగా భారత్‌లోని ఓటర్ కార్డు వ్యవస్థను ఉదాహరణగా పేర్కొన్నారు. భారత్‌లో భారీ సంఖ్యలో ప్రజలు ఓటు వేసినా పోస్టల్ బ్యాలెట్ వినియోగం చాలా తక్కువగా ఉందని అప్పట్లో వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: అమెరికాకు ఆ రెండు దేశాల నుంచి బిగ్ చాలెంజ్! -
మరిన్ని ఆంక్షల వేళ.. ఇరాన్లో అనూహ్య పరిణామం!
అమెరికా ఆంక్షలు, నౌకాదళ దిగ్బంధనంతో చమురు ఎగుమతులు, ఆదాయాలపై తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న ఇరాన్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ చమురు మంత్రి మొహ్సెన్ పాక్నెజాద్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించినప్పటికీ.. దీని వెనక వ్యవహారం వేరే ఉందన్న చర్చ ఇప్పుడు జోరుందుకుంది. రాజీనామా ప్రకటన తర్వాత.. ఇరాన్ అధ్యక్ష రాయబార కార్యాలయంలో హైడ్రామా నడిచింది. పాక్నెజాద్ను పునరాలోచన చేయాలని అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కోరారు. అయినప్పటికీ పాక్నెజాద్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో చివరకు రాజీనామాను ఆమోదించారు. ఆ వెంటనే నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ (NIOC) చీఫ్ హమీద్ బోవర్డ్ను తాత్కాలిక చమురు మంత్రిగా నియమించారు. అమెరికా గురి వల్లే..ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు చమురు ఎగుమతులే ప్రధాన ఆదాయ వనరు. ప్రస్తుతం అమెరికా ఆంక్షలు, నౌకల రాకపోకలపై ఆంక్షలతో ఆ రంగంపైనే తీవ్ర ప్రభావం పడుతోంది. ఫిబ్రవరి చివర్లో అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమయ్యే ముందు హార్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ ముడిచమురు, ఎల్ఎన్జీ రవాణాలో దాదాపు ఐదో వంతు జరిగేది. తర్వాత హార్ముజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడం, వాణిజ్య నౌకల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఇరాన్ చమురు ఎగుమతులను అడ్డుకోవడం, ఆ దేశానికి చమురు ద్వారా వచ్చే ఆదాయం, విదేశీ మారకద్రవ్య ప్రవాహాన్ని పరిమితం చేయడమే అమెరికా చర్యల లక్ష్యంగా ఉంది. దీనివల్ల టెహ్రాన్‌తో పాటు ఇతర నగరాల్లో పెట్రోల్ కోసం పొడవాటి క్యూలు కనిపిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.రికార్డు స్థాయికి ఇరాన్ కరెన్సీ పతనంఅమెరికా ఒత్తిడితో పాటు ఇరాన్ ఆర్థిక పరిస్థితి కూడా మరింత దిగజారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ కరెన్సీ రియాల్ తాజాగా డాలర్‌తో పోలిస్తే రికార్డు కనిష్టానికి పడిపోయింది. ఒక డాలర్‌కు సుమారు 26.88 లక్షల రియాళ్లకు చేరినట్లు సమాచారం. గత ఏడాది కాలంలో రియాల్ విలువ సగానికి పైగా పడిపోయింది. దేశంలో ద్రవ్యోల్బణం 70 శాతాన్ని దాటినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. నిత్యావసర వస్తువులు, ఇళ్ల ఖర్చులు సామాన్యులపై భారంగా మారుతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం మార్చి 21 నుంచి జూన్ 20 మధ్య ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఏడాది ప్రాతిపదికన 10.1 శాతం కుదించుకుంది. ఇదే సమయంలో చమురు, గ్యాస్ రంగ కార్యకలాపాలు ఏకంగా 26.4 శాతం తగ్గినట్లు సమాచారం.బోవర్డ్ చేతిలో కీలక బాధ్యతఇలాంటి పరిస్థితుల్లో తాత్కాలిక చమురు మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న హమీద్ బోవర్డ్పై కీలక బాధ్యతలు పడనున్నాయి. ఆయన ఇప్పటికే ప్రభుత్వ రంగంలోని నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీకి నాయకత్వం వహిస్తున్నారు. చమురు ఎగుమతుల ద్వారా ఆదాయాన్ని కొనసాగించడం, అమెరికా ఆంక్షలు–దిగ్బంధనాన్ని ఎదుర్కొంటూ ఇంధన రంగాన్ని నడిపించడం ఆయన ముందున్న ప్రధాన సవాళ్లుగా మారాయి.పాక్నెజాద్ మాత్రం రాజీనామాకు ముందు చమురు ఆదాయాలపై ప్రజలకు భరోసా ఇచ్చారు. తాము ఇప్పటికే విక్రయించిన చమురుకు సంబంధించిన ఆదాయం వస్తూనే ఉందని, అది కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.అమెరికా నుంచి మరిన్ని ఆంక్షలుమరోవైపు ఇరాన్‌పై అమెరికా ఆర్థిక ఒత్తిడి మరింత పెరుగుతోంది. శుక్రవారం అమెరికా ట్రెజరీ ఇరాన్‌కు చెందిన రైలు, ఆటోమొబైల్ రంగాలను లక్ష్యంగా చేసుకుని కొత్త ఆంక్షలు ప్రకటించింది. ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్’లో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా తెలిపింది. ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.. యుద్ధానికి నిధులు సమకూర్చుకునే టెహ్రాన్ సామర్థ్యాన్ని తగ్గించడమే లక్ష్యమని చెప్పారు. ఇరాన్ మిగిలిన చమురు ఆదాయ మార్గాలను కూడా కట్టడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అమెరికా వెల్లడించింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చమురు ధరలు తగ్గుతున్నాయని శనివారం వ్యాఖ్యానించారు. ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యాలను దాదాపుగా వదులుకుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమయంలో అమెరికా–ఇరాన్ మధ్య యుద్ధం ఎనిమిదో నెలలోకి ప్రవేశించింది. అయితే పాక్నెజాద్ రాజీనామాకు అమెరికా ఆంక్షలు లేదంటే యుద్ధ పరిస్థితులే కారణమని ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా చెప్పలేదు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన పదవి నుంచి తప్పుకున్నారని అధ్యక్ష కార్యాలయం తెలిపింది. అయినప్పటికీ దేశంలోని కీలకమైన చమురు రంగంపై అమెరికా ఒత్తిడి పెరుగుతున్న సమయంలోనే మంత్రి మారడం అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: నిరసన వెంటనే తుపాకీ పట్టారే! -
కొత్త ముప్పు!: రష్యా ల్యాబ్ నుంచి డేంజరస్ ఇన్ఫెక్షన్!!
రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఓ అనుమానాస్పద అంటువ్యాధి కేసు కలకలం రేపుతోంది. ఇర్కుట్స్క్ సమీపంలోని యాంటీ–ప్లేగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పనిచేసే 28 ఏళ్ల ల్యాబ్ టెక్నీషియన్ డారియా షిపిలోవా తీవ్ర న్యుమోనియాతో మృతి చెందారు. అయితే ఆమెకు ప్లేగ్ సోకి ఉండొచ్చన్న అనుమానాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆమెతో ఈ మధ్యకాలంలో కాంటాక్ట్ అయిన దాదాపు 200 మందిని పలు ఆసుపత్రుల్లో క్వారంటైన్లో ఉంచారు.రష్యన్ మీడియా కథనాల ప్రకారం.. డారియా యాంటీ–ప్లేగ్ పరిశోధనా కేంద్రంలో నమూనాలను పరీక్షిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ లైవ్ బ్యాక్టీరియా ఉన్న టెస్ట్‌ట్యూబ్ పగిలినట్లు సమాచారం. ఈ ఘటన జరిగిన తర్వాతే ఆమె అనారోగ్యానికి గురైనట్లు చెబుతున్నారు. మరణానికి కొద్దిసేపటి ముందు ఆసుపత్రి సిబ్బందికి కూడా డారియా ఈ విషయాన్ని చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి.డారియా సెప్టెంబర్ 29న తీవ్రమైన న్యుమోనియా లక్షణాలతో షెలెఖోవ్లోని ఆసుపత్రిలో చేరారు. ఆమె పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. రెండు రోజులకే మృతి చెందినట్లు స్థానిక స్వతంత్ర మీడియా సంస్థలు తెలిపాయి. ఆమె మరణానికి ప్లేగ్ కారణమై ఉండొచ్చన్న అనుమానాలు అప్పటి నుంచే మొదలయ్యాయి. అయితే రష్యా ప్రజారోగ్య సంస్థ రోస్పోట్రెబ్నాడ్జోర్ మాత్రం ఆ పరిశోధనా కేంద్రంలో అలాంటి ప్రమాదమేమీ జరగలేదని పేర్కొన్నట్లు సమాచారం.డారియాతో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించి అధికారులు వైద్య పర్యవేక్షణలోకి తీసుకున్నారు. రష్యా మీడియా కథనాల ప్రకారం.. కనీసం 197 మందిని ఐసోలేషన్‌లో ఉంచారు. వీరిలో 100 మందికిపైగా ఆసుపత్రుల్లోనే ఉన్నట్లు సమాచారం. ఇర్కుట్స్క్లో కనీసం నాలుగు ఆసుపత్రుల్లో క్వారంటైన్ విధించినట్లు స్థానిక వార్తా సంస్థలు వెల్లడించాయి. రోగులను సందర్శించడంపైనా ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోనూ మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేసినట్లు సమాచారం.ఈ పరిణామాల నేపథ్యంలో ఇర్కుట్స్క్ ప్రాంతంలో ముందుగా నిర్ణయించిన కొన్ని బహిరంగ కార్యక్రమాలను కూడా రద్దు చేసినట్లు రష్యన్ మీడియా తెలిపింది. ఆరోగ్య భద్రతా నిబంధనల ఉల్లంఘన జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.అదే అయితే.. ఎంత ప్రమాదం?ప్లేగ్‌కు కారణమయ్యే బ్యాక్టీరియాను యెర్సినియా పెస్టిస్ అంటారు. సాధారణంగా ఈ వ్యాధి మూడు ప్రధాన రూపాల్లో కనిపిస్తుంది. అవి బుబోనిక్, సెప్టిసిమిక్, న్యుమోనిక్ ప్లేగ్. వీటిలో న్యుమోనిక్ ప్లేగ్ ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇతర ప్లేగ్ రూపాలతో పోలిస్తే ఇది వేగంగా తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. సోకిన వ్యక్తి నుంచి శ్వాసకోశ బిందువుల ద్వారా మరొకరికి వ్యాపించే ప్రమాదం కూడా ఉంటుంది. మధ్యయుగ కాలంలో యూరప్‌లో కోట్లాది మంది ప్రాణాలను బలిగొన్న ‘బ్లాక్ డెత్’కు కూడా యెర్సినియా పెస్టిస్ బ్యాక్టీరియానే కారణమైంది.మంగోలియా సరిహద్దులోనూ అప్రమత్తతఇర్కుట్స్క్ ప్రాంతం మంగోలియాకు సమీపంలో ఉండటంతో అక్కడి పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి. డారియా బురియాటియా ప్రాంతానికి వెళ్లిన తర్వాత అనారోగ్యానికి గురైనట్లు కొన్ని రష్యన్ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అయితే బురియాటియా ప్రాంత అధిపతి అలెక్సీ సిడెనోవ్ ఈ వాదనను ఖండించారు. ఆమె బురియాటియాను సందర్శించినట్లు ఆధారాలు లేవని, ఆ ప్రాంతంలో ప్లేగ్ వ్యాప్తి లేదని ఆయన తెలిపారు. ఇన్ఫెక్షన్కు మూలం బురియాటియాకు సంబంధం లేని పరిస్థితుల్లో ఉండొచ్చని పేర్కొన్నారు.రష్యా అధికారుల ప్రత్యేక చర్యలుపరిస్థితిని పర్యవేక్షించేందుకు రష్యా చీఫ్ శానిటరీ డాక్టర్ అన్నా పోపోవా ఇర్కుట్స్క్ ప్రాంతానికి వెళ్లినట్లు సమాచారం. రోస్పోట్రెబ్నాడ్జోర్ అవసరమైన అంటువ్యాధి నియంత్రణ చర్యలు చేపడుతోందని అధికారులు చెబుతున్నారు. డారియాతో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించడం, వారిని పర్యవేక్షించడం, అనుమానాస్పద కేసులను పరీక్షించడం వంటి చర్యలు కొనసాగుతున్నాయి.అయితే రష్యా ప్రభుత్వం ప్లేగ్ వ్యాప్తిని అధికారికంగా ప్రకటించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు అధికారులు పరిస్థితి అదుపులోనే ఉందని చెబుతుండగా.. మరోవైపు ఆసుపత్రుల్లో క్వారంటైన్, వందల మందిపై నిఘా, ప్రజా కార్యక్రమాల రద్దు వంటి చర్యలు అనుమానాలకు తావిస్తున్నాయి.అమెరికా కూడా ఆరారష్యాలో వెలుగుచూసిన ఈ పరిణామాలపై అంతర్జాతీయంగానూ దృష్టి పడింది. ఈ వ్యవహారంపై రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నామని, సమాచారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటున్నామని అమెరికా వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పరిస్థితిని గమనిస్తోంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్లేగ్ జంతువుల్లో కనిపించే వ్యాధిగా అనేక ప్రాంతాల్లో ఉంది. 2019 నుంచి 2025 మధ్య ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4,000 అనుమానిత ప్లేగ్ కేసులు నమోదయ్యాయి. ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికాలో గతంలో ప్లేగ్ వ్యాప్తులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, మడగాస్కర్‌లో మనుషులకు సోకిన సందర్భాలు ఎక్కువగా నమోదయ్యాయి.ప్రస్తుతం రష్యాలో వెలుగుచూసిన ఘటన నిజంగా న్యుమోనిక్ ప్లేగ్ కేసేనా? ల్యాబ్‌లోనే ఇన్ఫెక్షన్ సోకిందా? మరణించిన డారియాకు వైరస్ లేదంటే మరేదైనా బ్యాక్టీరియా కారణమా? ఆమెతో సంబంధం ఉన్నవారికి ఇన్ఫెక్షన్ సోకిందా? అన్న అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. యాంటీ–ప్లేగ్ ల్యాబ్ ఉద్యోగి అనుమానాస్పద మరణం, దాదాపు 200 మందిని పర్యవేక్షణలో ఉంచడం, ఆసుపత్రుల్లో క్వారంటైన్ చర్యలు మాత్రం తీవ్ర అప్రమత్తతకు కారణమవుతున్నాయి. అయితే నేటి రోజుల్లో ప్లేగ్‌కు యాంటీబయాటిక్స్ అందుబాటులో ఉండటంతో సకాలంలో చికిత్స అందిస్తే వ్యాధిని నియంత్రించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: చంద్రుడిపై హక్కులు ఏ దేశానివో తెలుసా? -
మచ్చార్‌ను చంపేసి.. అసలు ప్లాన్ చెప్పేసిన హమామీ!
ఫ్లైదుబాయ్ ఘటనలో పూటకో విస్తుపోయే విషయం బయటపడుతోంది. ఇప్పటికే దీనిని ఉగ్రదాడి కేసుగా దర్యాప్తు జరుపుతున్నారు. విమానంలో భారత కెప్టెన్ స్మిట్ మచ్చార్‌పై దాడి చేసిన ఒమన్ కో–పైలట్ హమామ్ అల్–హమామీ అసలు ఉద్దేశం ఏంటన్న దానిపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కెప్టెన్‌ను హతమార్చి విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకోవడం అతని ప్రధాన ఉద్దేశంగా తేలింది. విచారణలోనూ తన లక్ష్యం విమానాన్ని కూల్చేయడమేనని హమామీ అంగీకరించినట్లు సమాచారం.సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ FZ1073 విమానంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. విమానం సుమారు 36 వేల అడుగుల ఎత్తులో ఉండగా.. హమామీ క్రాష్ యాక్స్‌తో కెప్టెన్ స్మిట్ మచ్చార్‌పై దాడి చేసి కాక్‌పిట్‌ను తన ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించాడు. కెప్టెన్‌ను చంపేసిన తర్వాత విమానాన్ని సాధారణంగానే నడుపుతూ.. ల్యాండింగ్ క్లియరెన్స్ తీసుకుని.. టెల్ అవీవ్(ఇజ్రాయెల్ రాజధాని)లోని ఓ భవనాన్ని ఢీ కొట్టాలని అనుకున్నాడు. ఒకవేళ అది కుదరకుంటే..బెన్ గురియన్ విమానాశ్రయంలో మరో విమానాన్ని ఢీకొట్టడం అతడి ప్లాన్‌గా దర్యాప్తులో తేలింది. అంటే.. ఈ ప్రణాళిక 9/11 తరహా దాడి తరహాలోనే ఉందని అధికారులు అంటున్నారు.జోర్డాన్ గగనతలంలోనే..విమానాన్ని స్వాధీనం చేసుకునేందుకు జోర్డాన్ గగనతలంలోకి ప్రవేశించే వరకు వేచి ఉండాలని హమామీ భావించినట్లు సమాచారం. అక్కడ దాడి చేస్తే.. తన ప్రయత్నాన్ని గుర్తించి అడ్డుకునేందుకు ఇతరులకు తక్కువ సమయం ఉంటుందని అతడు అనుకున్నాడట. జూలైలోనే ఇలాంటి దాడికి ప్రయత్నించాలని భావించినా.. అప్పట్లో ఓ సిబ్బంది తనకు స్నేహితుడు కావడంతో చివరి నిమిషంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.జస్ట్ రెండే నిమిషాల్లో..తన ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో హమామీ మరో ప్లాన్‌కు దిగాడు. కాక్‌పిట్‌లో జరిగిన పెనుగులాట తర్వాత.. ఆటోపైలట్, ఇంజిన్ స్విచ్చ్‌లు ఆప్ చేశాడు. దీంతో బోయింగ్ 737 మ్యాక్స్–8 విమానం కేవలం రెండు నిమిషాల్లో సుమారు 36 వేల అడుగుల నుంచి 17 వేల అడుగులకు పడిపోయింది. ఈ సమయంలో విమానంపై తీవ్ర ఒత్తిడి ఏర్పడటంతో రడ్డర్లోని కొన్ని భాగాలు దెబ్బతిన్నాయి. అప్పటికే హమామీ చేతిలో తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ మచ్చార్ కాక్‌పిట్ తలుపు తెరవగలిగాడు. దీంతో సిబ్బంది, ప్రయాణికులు లోపలికి వెళ్లి హమామీని అదుపులోకి తీసుకున్నారు. విమానంలో ఉన్న మరో ఇద్దరు ఆఫ్–డ్యూటీ పైలట్లు బాధ్యతలు చేపట్టి సౌదీ అరేబియాలోని తబూక్లో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.3 వేలకుపైగా పోస్టులపై ఆరా..హమామీ సోషల్ మీడియా కార్యకలాపాలపైనా దర్యాప్తు సాగుతోంది. ఒమన్ తండ్రి, సిరియా తల్లికి జన్మించిన అతడు చాలా కాలం దుబాయ్‌లో నివసించినట్లు సమాచారం. సిరియా అంతర్యుద్ధ సమయంలో కొంతకాలం అక్కడ ఉన్నాడని.. ఆ సమయంలో ఇస్లామిక్ తీవ్రవాద భావజాలం వైపు ఆకర్షితుడైనట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. అతడి డిలీట్ చేసిన ‘ఎక్స్’ ఖాతాకు సంబంధించిన 3,000కుపైగా పోస్టుల స్క్రీన్షాట్లు ఇంటర్నెట్ ఆర్కైవ్‌లో ఉన్నట్లు సమాచారం. వాటిలో అనేక పోస్టులు ఇస్లామిక్ భావజాలానికి సంబంధించినవిగా దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు.ఆస్ట్రేలియా లింక్‌పైనా ఆరా..హమామీకి ఆస్ట్రేలియాతో ఉన్న సంబంధాలపైనా దర్యాప్తు మొదలైంది. ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్‌కు చెందిన కౌంటర్ టెర్రరిజం బృందం అతడి పరిచయాలు, సంబంధాలను పరిశీలిస్తోంది. ఫ్లైదుబాయ్ సిబ్బందిలో అతడు ఎలా చేరాడు? టెల్ అవీవ్‌కు వెళ్లే విమాన సిబ్బందిలో అతడికి అవకాశం ఎలా లభించింది? అనే అంశాలపైనా ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్ అధికారులు ఆరా తీస్తున్నారు.‘టెర్రరిస్ట్ యాక్ట్’గా తేల్చేశారుఈ ఘటనను యూఏఈ అటార్నీ జనరల్ హమద్ సైఫ్ అల్ షమ్సీ ‘టెర్రరిస్ట్ యాక్ట్’గా అభివర్ణించారు. క్రాష్ యాక్స్‌తో కెప్టెన్‌పై దాడి చేసి విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకునేందుకు హమామీ ప్రయత్నించాడని తెలిపారు. ఈ ఘటన వెనుక మరింత విస్తృత కుట్ర ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం హమామీని వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు.ఒమన్‌లో నిషేధం.. అయినా ఎలా?హమామీపై అతడి సొంత దేశం ఒమన్‌లోనే విమానాలు నడపడంపై నిషేధం ఉన్నట్లు సమాచారం. తీవ్రవాద భావజాలం కారణంగానే ఈ నిషేధం విధించినట్లు తెలుస్తోంది. అలాంటి వ్యక్తి ఫ్లైదుబాయ్ కో–పైలట్‌గా ఎలా కొనసాగాడు? ఇజ్రాయెల్‌కు వెళ్లే విమానాన్ని నడిపే అవకాశం ఎలా దక్కింది? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఘటనకు ముందు ప్రయాణికులు, సిబ్బంది వివరాలను యూఏఈ అధికారులు ఇజ్రాయెల్‌తో పంచుకున్నట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో స్క్రీనింగ్, నియామక ప్రక్రియ, భద్రతా సమాచార మార్పిడిపై కూడా దర్యాప్తు జరుగుతోంది.ఫెయిల్ అయినా మెచ్చుకున్న అల్‌ఖైదా!హమామీ ప్రయత్నాన్ని ఉగ్రసంస్థ ‘అల్‌ఖైదా’ ప్రశంసించడం ఇప్పుడు మరో సంచలనంగా మారింది. యెమెన్‌లోని ‘అల్–బయాన్’ వారపత్రికలో ‘సెప్టెంబర్ 11, సెప్టెంబర్ 30 మధ్య’ పేరుతో ప్రచురించిన సంపాదకీయంలో.. అమెరికా, ఇజ్రాయెల్ విమానాలపై ఇలాంటి మరిన్ని దాడులకు పిలుపునిచ్చింది. 2001 సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన దాడితోపాటు సెప్టెంబర్ 30న ఫ్లైదుబాయ్ FZ1073 ఘటనను ప్రస్తావించింది. ‘యుద్ధం ఇంకా ముగియలేదు’ అంటూ వ్యాఖ్యానించింది. హమామీ హైజాక్ విజయవంతమై ఉంటే ప్రాంతీయ శక్తి సమీకరణాలు మారిపోయేవని పేర్కొంది. అంటే.. విమానాన్ని కూల్చేయాలన్న హమామీ ప్రయత్నం విఫలమైనా.. దాన్ని అల్‌ఖైదా మాత్రం మెచ్చుకుంది. అంతేకాదు.. 9/11 తరహా దాడులతో పోలుస్తూ, అమెరికా–ఇజ్రాయెల్ విమానాలపై మరిన్ని దాడులకు పిలుపునిచ్చింది. ఫ్లైదుబాయ్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే.. హమామీ ప్రయత్నాన్ని అల్‌ఖైదా సమర్థించడం, భవిష్యత్తులో ఇలాంటి దాడులకు ప్రోత్సాహం ఇచ్చేలా పిలుపునివ్వడం భద్రతా వర్గాల్లో మరింత ఆందోళనకు కారణమవుతోంది.ఇదీ చదవండి: ట్రంప్ స్థాపించిన ఈ కొత్త ఫోర్స్.. చీఫ్ ఎవరో తెలుసా? -
ఫ్లైదుబాయ్ ఘటన.. ఉగ్రదాడే: యూఏఈ సంచలన ప్రకటన!
ఫ్లైదుబాయ్ విమాన ఘటనపై ఇప్పటివరకు ఉన్న అనుమానాలకు తెరదించే కీలక ప్రకటన వెలువడింది. కెప్టెన్ స్మిట్ మచ్చార్‌పై కాక్‌పిట్‌లోని క్రాష్ యాక్స్తోనే కో-పైలట్ హమామ్ అల్-హమ్మామీ దాడికి యత్నించాడని యూఏఈ తెలిపింది. అంతేకాదు.. ఈ ఘటనను ఉగ్రదాడిగా దాదాపుగా నిర్ధారించింది.దుబాయ్ నుంచి టెల్అవీవ్ వెళ్తున్న ఎఫ్‌జెడ్1073 విమానంలో కో-పైలట్ హమామ్ అల్-హమ్మామీ.. కెప్టెన్ స్మిట్ మచ్చార్‌పై కాక్‌పిట్‌లోని క్రాష్ యాక్స్‌తో దాడి చేసి, విమానాన్ని తన నియంత్రణలోకి తీసుకునేందుకు ప్రయత్నించాడని యూఏఈ ప్రాసిక్యూటర్ జనరల్ హమద్ సైఫ్ అల్ షమ్సీ శనివారం వెల్లడించారు. ఈ చర్యను ‘టెర్రరిస్ట్ అటాక్’గా పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన పరిస్థితులు, ఉద్దేశం, ఇతరులతో సంబంధాలు, ఫిజికల్-డిజిటల్ ఆధారాలపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.విమానం కంట్రోల్ కోసం ప్రయత్నంసెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్అవీవ్ బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాక్‌పిట్‌లో కో-పైలట్ స్మిట్ మచ్చార్‌పై దాడి చేసిన అనంతరం విమాన నియంత్రణను చేపట్టేందుకు ప్రయత్నించాడని యూఏఈ అధికారులు తెలిపారు. సాధారణంగా విమానాల్లో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే క్రాష్ యాక్స్ కాక్‌పిట్‌లోనే ఉంటుంది. అదే పరికరాన్ని దాడికి ఉపయోగించినట్లు తాజా దర్యాప్తు వివరాలు వెల్లడిస్తున్నాయి.వేల అడుగుల మేర ఒక్కసారిగా కిందికికాక్పిట్లో ఘర్షణ జరుగుతున్న సమయంలో విమానం ఒక్కసారిగా వేగంగా కిందికి దిగింది. వివిధ నివేదికల ప్రకారం విమానం దాదాపు 14 వేల నుంచి 17 వేల అడుగుల మేర ఎత్తు కోల్పోయింది. విమానంలో 170 మందికి పైగా ఉన్నారు. తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ మచ్చార్ కాక్‌పిట్ తలుపు తెరవగలిగారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లి కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఆ ఇద్దరు పైలట్లతోనే విమానం సేఫ్విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు ఆఫ్-డ్యూటీ పైలట్లు పరిస్థితిని చక్కదిద్దేందుకు ముందుకొచ్చారు. వారు విమాన నియంత్రణ చేపట్టి దానిని సౌదీ అరేబియాలోని టబుక్ విమానాశ్రయానికి మళ్లించారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఘటన అనంతరం సౌదీ అధికారులు కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని విచారణ కోసం యూఏఈకి తరలించారు.హమామ్.. గతంపైనా దర్యాప్తుకో-పైలట్‌ను హమామ్ అల్-హమ్మామీగా గుర్తించారు. అతడు ఒమన్ జాతీయుడని దర్యాప్తు వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. అతడి గత రికార్డులపైనా ఇప్పుడు అధికారులు దృష్టి పెట్టారు. 2024లో ఒమన్ ఎయిర్‌లో కో-పైలట్ ట్రైనీగా ఉన్న సమయంలో అతడి వద్ద తీవ్రవాద భావజాలానికి సంబంధించిన మెటీరియల్ లభించడంతో విమానాలు నడపకుండా నిలిపివేసినట్లు అమెరికా అధికారులు తెలిపినట్లు ఏబీసీ న్యూస్ పేర్కొంది. అయితే ఆ తర్వాత అతడు పరిపాలనా విభాగంలో కొనసాగినట్లు సమాచారం. అసలు అలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తి తర్వాత ఫ్లైదుబాయ్‌లో కో-పైలట్‌గా ఎలా చేరాడు? అతడికి క్లియరెన్స్ ఎలా లభించింది? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ప్రశ్నలే ప్రస్తుతం విచారణలో కీలకంగా మారాయి.ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నాయా?కో-పైలట్ ఒంటరిగానే ఈ దాడికి పాల్పడ్డాడా? లేదంటే ఏదైనా తీవ్రవాద సంస్థతో సంబంధం ఉందా? ముందస్తు ప్రణాళిక ఉందా? ఎవరైనా అతడిని ప్రేరేపించారా? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. యూఏఈ ప్రాసిక్యూటర్ జనరల్ ప్రకారం భౌతిక, డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తున్నారు. దర్యాప్తు పూర్తయ్యాక తుది వివరాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.మచ్చార్ ధైర్యంతో తప్పిన పెను ప్రమాదందాడిలో తీవ్రంగా గాయపడిన కెప్టెన్ స్మిట్ మచ్చార్ మాత్రం పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ కాక్‌పిట్ తలుపు తెరిచారు. దీంతో ప్రయాణికులు లోపలికి వెళ్లి దాడి చేసిన కో-పైలట్‌ను అదుపులోకి తీసుకోగలిగారు. మరోవైపు ఆఫ్-డ్యూటీ పైలట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. మచ్చార్ ప్రస్తుతం కోలుకుంటున్నారు.ఇదీ చదవండి: సిరియన్ అమ్మ.. ఒమన్ తండ్రి.. అల్‌ఖైదాకు వీరాభిమాని! -
వారం క్రితమే ‘లవ్ యూ’.. ఇప్పుడేమో బ్రేకప్!
ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ వ్యక్తిగత జీవితంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనతో రిలేషన్షిప్లో ఉన్న శివోన్ జిలిస్ బ్రేకప్ విషయాన్ని బహిరంగంగా ప్రకటించింది. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే తమ బంధం అకస్మాత్తుగా ముగిసిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మస్క్ తనను ఎక్స్‌లో అన్‌ఫాలో చేసిన తర్వాత ఆమె ఈ విషయంపై భావోద్వేగంగా స్పందించారు.ఎలాన్ మస్క్ తాజా మాజీ ప్రేయసి శివోన్ జిలిస్ తాజాగా సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చారు. మస్క్‌తో వారం కిందట జరిగిన చాట్ స్క్రీన్‌షాట్‌ను కూడా ఆమె షేర్ చేశారు. సెప్టెంబర్ 24న జరిగిన ఆ సంభాషణలో.. ‘‘నిన్ను బ్రేక్‌ఫాస్ట్‌లో చూడటం చాలా ఆనందంగా ఉంది. నిన్ను చాలా ప్రేమిస్తున్నాను’’ అని జిలిస్ రాయగా.. మస్క్ కూడా ‘‘లవ్ యూ టూ’’ అని బదులిచ్చారు.ఆ తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కోసం వైట్‌హౌస్‌లో జరిగిన స్టేట్ డిన్నర్‌కు ఆమెను ఆహ్వానించవచ్చనే విషయం తనకు అప్పటివరకు తెలియదని మస్క్ చెప్పినట్లు జిలిస్ వెల్లడించారు. సెప్టెంబర్ 27న ఆమె ‘‘కొత్త రోజు.. కొత్త జీవితం’’ అంటూ మరో పోస్ట్ చేశారు. అయితే ఇందులోనే ఆమె బ్రేకప్ విషయాన్ని కూడా ప్రస్తావించారు.It’s hard to go from in love to let go in a week with no warning, but that’s just how it is sometimes 🤷🏻♀️I feel happy that I got to show Elon how it feels to be deeply understood, nurtured, and peacefully loved with stability and gentleness. Given the tumultuous nature of his… https://t.co/HAOfjxrIig pic.twitter.com/lgL0GVzD2R— Shivon Zilis (@shivon) October 2, 2026‘‘ప్రేమలో ఉండటం నుంచి వారం రోజుల్లోనే ఎలాంటి హెచ్చరిక లేకుండా విడిపోవాల్సి రావడం కష్టం. కానీ కొన్నిసార్లు పరిస్థితులు ఇలాగే ఉంటాయి’’ అని జిలిస్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనితో పాటు మస్క్‌తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ జిలిస్ భావోద్వేగానికి గురయ్యారు. మస్క్ బాల్యం, తొలి జీవితం ఎన్నో ఒడిదుడుకులతో సాగిందని, ఆయన తరచూ మానసికంగా ఎంతో వేదన అనుభవించే వ్యక్తిగా ఉండేవారని ఆమె పేర్కొన్నారు. తాను, తమ పిల్లలు ఆయనకు ఒక సురక్షితమైన స్థలంగా ఉండేవారమని.. అక్కడ కొంత సమయం గడిపి మళ్లీ తన పనుల కోసం వెళ్లేవారని వివరించారు.‘‘నేను ఎలాన్‌ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. ఆయన నుంచి ఎన్నో జీవితాలకు సరిపడే జ్ఞానాన్ని నేర్చుకున్నాను’’ అని జిలిస్ రాసుకొచ్చారు. ఈ విడిపోవడం తనకు ఎంతో నష్టాన్ని మిగిల్చిందని చెబుతూనే.. మస్క్‌తో కలిసి తమ జీవితాల్లోకి వచ్చిన నలుగురు పిల్లలే తనకు అందమైన జ్ఞాపకాలని పేర్కొన్నారు. ‘‘నేను బాధలో ఉన్నాను. కానీ ఎలాన్పై నాకు ఎంతో శ్రద్ధ ఉంది. ఆయన సంతోషంగా ఉండాలని ఎప్పటికీ కోరుకుంటాను’’ అని ఆమె తెలిపారు.మస్క్, జిలిస్ 2020 నుంచి బంధంలో ఉన్నట్లు తెలిసిందే. సన్నిహిత సంబంధంలోకి వచ్చినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. 2021లో వారికి కవలలు స్ట్రైడర్, అజూర్ జన్మించారు. 2024లో ఆర్కాడియా అనే కుమార్తె, 2025లో సెల్డన్ జన్మించారు. వీరిద్దరికీ నలుగురు పిల్లలు ఉన్నారు.శివోన్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే..శివోన్ జిలిస్ కేవలం ఎలాన్ మస్క్ మాజీ ప్రేయసిగానే కాకుండా టెక్ ప్రపంచంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఎగ్జిక్యూటివ్. కెనడాలోని ఒంటారియోలో జన్మించిన ఆమె యేల్ యూనివర్సిటీలో ఎకనామిక్స్, ఫిలాసఫీ చదివారు. అనంతరం ఐబీఎంలో పనిచేసి, బ్లూమ్‌బర్గ్ బీటాలో వెంచర్ క్యాపిటల్ రంగంలోకి వెళ్లారు. డేటా, మెషిన్ లెర్నింగ్ రంగాల్లో పెట్టుబడులపై పనిచేసిన ఆమెకు 2015లో ఫోర్బ్స్ ‘30 అండర్ 30’ గుర్తింపు లభించింది. 2016లో ఓపెన్ఏఐతో అనుబంధం ఏర్పరుచుకుని, 2020–2023 మధ్య ఆ సంస్థ నాన్‌ప్రాఫిట్ బోర్డులోనూ పనిచేశారు. 2017లో మస్క్ సంస్థ టెస్లాలో చేరి ఏఐ, ఆటోపైలట్, చిప్ డిజైన్ సంబంధిత పనుల్లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం మస్క్ స్థాపించిన న్యూరాలింక్‌లో డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ స్పెషల్ ప్రాజెక్ట్స్‌గా ఉన్నారు.ఆమె వ్యక్తిగత ఆస్తుల విషయానికి వస్తే.. జిలిస్ నికర ఆస్తికి సంబంధించి అధికారికంగా ధృవీకరించిన మొత్తం అందుబాటులో లేదు. కొన్ని వెబ్సైట్లు ఆమె సంపదను సుమారు 5–10 మిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నాయి. 2021లో టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో ఆమె ఒక ఇంటిని కొనుగోలు చేశారు. ఇక.. మస్క్‌కు మొత్తం కనీసం 14 మంది పిల్లలు ఉన్నారు. వీరు నలుగురు వేర్వేరు భాగస్వాములతో ఉన్న సంబంధాల ద్వారా జన్మించారు. తన తొలి భార్య జస్టిన్ విల్సన్‌తో ఆయనకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో ట్విన్స్ వివియన్, గ్రిఫిన్, ట్రిప్లెట్స్ కై, సాక్సన్, డామియన్ ఉన్నారు. అయితే తొలి సంతానం నెవాడా అలెగ్జాండర్ మస్క్ 10 వారాల వయసులోనే మరణించారు.ఇక జిలిస్ చేసిన బ్రేకప్ ప్రకటనపై మస్క్ ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు. ఆయన నోరు విప్పితేనే.. ఈ వారం గ్యాప్‌లో ఏం జరిగిందనేదానిపై క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది.ఇదీ చదవండి: హమామ్.. మాములోడు కాదుగా! -
హనుమాన్ చాలీసా.. ఇప్పుడు గ్లోబల్ సెన్సేషన్!
హనుమాన్ చాలీసా.. ఇప్పుడు మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఫ్లైదుబాయ్ విమానంలో ప్రాణాపాయ పరిస్థితిని ఎదుర్కొన్న భారత కెప్టెన్ స్మిట్ మచ్చార్.. తీవ్ర గాయాలతో ఉన్న సమయంలో హనుమాన్ చాలీసా పఠించానని, దాని ద్వారా ధైర్యం, బలం కూడగట్టుకుని కాక్‌పిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించానని ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన వీడియో కాల్లో వెల్లడించారు. ఆ ఘటన తర్వాత హనుమాన్ చాలీసా గురించి ఇంటర్నెట్లో వెతుకులాట, చర్చ కూడా పెరిగింది. ఫ్లైదుబాయ్ దుబాయ్–టెల్ అవీవ్ విమానంలో కో-పైలట్ దాడికి గురైన కెప్టెన్ స్మిట్ మచ్చార్ తీవ్రంగా గాయపడ్డారు. విమానం అదుపు తప్పే పరిస్థితుల్లోనూ ప్రయాణికుల భద్రత కోసం కాక్‌పిట్ డోర్ తెరిచేందుకు ఆయన ప్రయత్నించారు. అనంతరం ప్రధాని మోదీతో జరిగిన వీడియో సంభాషణలో ఆ సమయంలో తన పరిస్థితిని వివరించారు. తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా పఠిస్తానని, ఆ ఘటనలోనూ దానినే పఠిస్తూ ధైర్యం కూడగట్టుకున్నానని చెప్పారు.ఆ మాటలతో ఆసక్తికెప్టెన్ స్మిట్ మచ్చార్ స్వయంగా హనుమాన్ చాలీసా ప్రస్తావన చేయడంతో.. ఆ భక్తిగీతం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఆన్లైన్లో పెరిగింది. హనుమాన్ చాలీసా ఏమిటి? దాన్ని ఎవరు రచించారు? అందులో ఏముంది? వంటి అంశాలపై నెటిజన్లు వెతకడం, చర్చించడం మొదలైంది. సంక్షోభ సమయంలో తనకు ధైర్యం ఇచ్చిన ప్రార్థనగా కెప్టెన్ చెప్పిన ఈ ప్రస్తావన సోషల్ మీడియాలోనూ విస్తృతంగా చర్చకు వచ్చింది.రెండింతల వేగంతో అమెరికన్ పఠనంఇదిలా ఉండగా టెక్సాస్‌లో ఉంటున్న నిక్ డియర్మన్ హనుమాన్ చాలీసాను సాధారణ వేగానికి దాదాపు రెండింతల వేగంతో పఠిస్తూ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. రెండు రెట్ల వేగంతో పఠిస్తానని చెప్పి ప్రారంభించిన ఆయన.. ఎక్కడా తడబడకుండా, లయను కోల్పోకుండా చివరి వరకు కొనసాగించారు. వేగంగా పఠించినప్పటికీ పదాలను స్పష్టంగా పలకడంతో వీడియోకు సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది. కొందరు నెటిజన్లు ఆయన పఠనాన్ని ప్రశంసించగా.. మరికొందరు తాము కూడా అంత బాగా పఠించలేమంటూ సరదాగా కామెంట్లు చేశారు.ఏమిటీ హనుమాన్ చాలీసా?హనుమంతుడిని స్తుతిస్తూ రచించిన ప్రసిద్ధ భక్తిగీతమే హనుమాన్ చాలీసా. భక్తకవి తులసీదాసు దీనిని అవధీ భాషలో రచించినట్లు సంప్రదాయంగా భావిస్తారు. ఇందులో హనుమంతుడి బలం, ధైర్యం, జ్ఞానం, వినయం, శ్రీరాముడిపై ఆయనకున్న భక్తిని కీర్తించే 40 చౌపాయిలు ఉంటాయి. ‘చాలీసా’ అనే పదానికి నలభై అనే అర్థం ఉండటంతో ఈ గీతానికి హనుమాన్ చాలీసా అనే పేరు వచ్చింది.భక్తిలోనే కాదు.. ధైర్యానికి ప్రతీకగాహనుమాన్ చాలీసాను భక్తులు సాధారణంగా ప్రార్థనగా పఠిస్తారు. భయం, ఆందోళన.. కష్టకాలంలో పఠించడం ద్వారా మనసుకు ప్రశాంతత, ధైర్యం, ఏకాగ్రత కలుగుతాయని చాలామంది విశ్వసిస్తారు. అయితే ఇవి విశ్వాసానికి సంబంధించిన అంశాలు. కెప్టెన్ స్మిట్ మచ్చార్ చెప్పిన అనుభవం కూడా ఆయన వ్యక్తిగత విశ్వాసంతో ముడిపడి ఉంది. ఒకవైపు వేల అడుగుల ఎత్తులో ప్రాణాపాయ పరిస్థితిని ఎదుర్కొన్న భారత పైలట్.. తనకు ధైర్యాన్నిచ్చింది హనుమాన్ చాలీసా అని చెప్పడం, మరోవైపు అమెరికాలోని ఓ వ్యక్తి దానిని రెండింతల వేగంతో పఠిస్తూ వైరల్ కావడం.. ఇలా వరుస ఘటనలతో హనుమాన్ చాలీసా ఇప్పుడు భారతదేశాన్ని దాటి ప్రపంచవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: వారెవ్వా.. ఆమె ఉల్లి కన్నీళ్లు తుడిచిందిగా! View this post on Instagram A post shared by Nick Dearman - Neurodivergent Holistic Health Coach (@neurodivergent_nick) -
ఫ్లైదుబాయ్ ఘటన: ఇతడే ఆ కో-పైలట్.. విస్తుపోయే నిజాలు!
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పైలట్ స్మిట్ మచ్చార్‌పై దాడి విమానం కూల్చేందుకు యత్నించాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కో-పైలట్ మామూలోడు కాదని తెలుస్తోంది. తీవ్రవాద భావజాలం ఉన్న అతనిపై యెమెన్ గతంలో విమానం నడపకుండా బ్యాన్ కూడా విధించిందట. అలాంటప్పుడు ఫ్లైదుబాయ్‌లో పైలట్‌గా అతనెలా చేరాడు? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.సదరు కో-పైలట్ పేరు హమామ్ అల్-హమ్మామీ(Hamam al-Hammami). గతంలో ఒమన్ ఎయిర్‌పోర్టులో ఏడేళ్లపాటు పనిచేసినట్లు పలు మీడియా కథనాలు చెబుతున్నాయి. ఆ సమయంలో ట్రైనీ కో-పైలట్‌గా ఉన్నప్పుడు అతని వద్ద అనుమానాస్పద, తీవ్రవాద భావజాలానికి సంబంధించిన మెటీరియల్ లభించడం కలకలం రేపింది. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో ‘ఫ్రీ పాలస్తీన్’ వర్గాలకు సంబంధించిన కరపత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అతడిని పైలట్ విధుల నుంచి సస్పెండ్ చేశారు. అయితే పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగించకుండా.. పరిపాలనా విభాగంలో కొనసాగించారు. ఇది 2024లోనే జరిగింది. ఆ తర్వాత అతను మొరాకోకు చెందిన రాయల్ ఎయిర్ మొరాక్లో కో పైలట్‌గా విధులు నిర్వహించాడు. అక్కడి నుంచి ఫ్లైదుబాయ్‌లో చేరాడు. అసలు అలాంటి వ్యక్తి ఆ తర్వాత ఫ్లైదుబాయ్‌లో ఎలా చేరాడు? కో-పైలట్‌గా క్లియరెన్స్ ఎలా లభించింది?. అదీ ఇజ్రాయెల్‌కు వెళ్లే విమానంలోకి ఎలా వచ్చాడు? ఇప్పుడు దర్యాప్తు అధికారుల ముందున్న ప్రధాన ప్రశ్న ఇదే. ఒమన్‌లో ఉన్న అతడి భద్రతా రికార్డు ఇతర దేశాల అధికారులకు లేదంటే విమానయాన సంస్థలకు చేరిందా? ఫ్లైదుబాయ్‌లో ఉద్యోగం పొందే సమయంలో అతడిపై మళ్లీ భద్రతా తనిఖీలు జరిగాయా? అనే అంశాలను లోతుగా పరిశీలిస్తున్నారు.ప్రొఫైల్ ఏంటంటే..హమామ్ అల్-హమ్మామీ.. యెమన్ పౌరుడు!. తల్లి ఓ సిరియన్, తండ్రి ఒమన్ దేశస్తుడు. అయితే హమామ్ యూఏఈలోనూ ఎక్కువ కాలం నివసించాడని.. అతనికి ఒమన్, యూఏఈ ద్వంద్వ పౌరసత్వం ఉండొచ్చని పలు కథనాలు చెబుతున్నాయి. అంతేకాదు మతాచారాలను కఠినంగా పాటించేవాడని.. మహిళా ఉద్యోగులతో కనీసం షేక్‌హ్యాండ్ కూడా చేసేవాడు కాదని అతనితో గతంలో పని చేసిన ఓ ఉద్యోగిణి చెప్పినట్లు స్టేట్మెంట్ వైరల్ అవుతోంది. అంతేకాదు.. అతని సోషల్ మీడియాలోనూ రాడికల్ కంటెంట్ పోస్ట్ అయ్యిందని తెలుస్తోంది. ఘటన జరిగిన రోజున ఆ ఖాతాలో రెండు పోస్టులు కనిపించాయి. ఒక పోస్టులో బోయింగ్ 737 మ్యాక్స్ కాక్‌పిట్‌లో తీసిన వీడియోలు ఉన్నట్లు సమాచారం. ఆ వీడియో చివర అల్‌ఖైదా మాజీ అధినేత అయ్మన్ అల్-జవాహిరి, 2009లో ఆత్మాహుతి దాడికి పాల్పడిన హుమామ్ ఖలీల్ అబు-ములాల్ అల్-బలావీ చిత్రాలు ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఇటు కో–పైలట్ సోషల్ మీడియా ఖాతాల్లో యూదులను హత్య చేయడం, జిహాదీ భావజాలానికి సంబంధించిన కంటెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ పోస్టులను హమ్మామీయే పెట్టాడా? లేక మరెవరైనా అప్లోడ్ చేశారా? అవి ముందుగానే షెడ్యూల్ చేశారా? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. దర్యాప్తు వర్గాలను ఉటంకిస్తూ.. విమానాన్ని ఇజ్రాయెల్‌లో కూల్చేయాలనే ఉద్దేశం తనకు ఉన్నట్లు కో-పైలట్ చెప్పినట్లు కూడా రిపోర్టులు వెలువడ్డాయి.విమానం కూల్చాలనుకున్నాడుదర్యాప్తు వర్గాలను ఉటంకిస్తూ.. విమానాన్ని ఇజ్రాయెల్‌లో కూల్చేయాలనే ఉద్దేశం తనకు ఉన్నట్లు కో–పైలట్ వెల్లడించినట్లు నివేదికలు వచ్చాయి. కెప్టెన్ స్మిట్ మచ్చార్‌ను కత్తితో పొడిచి విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించిన అతడు.. తనను చంపేయాలని కూడా సిబ్బందిని కోరినట్లు ఇజ్రాయెలీ అధికారి ఒకరు ‘టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్’కు తెలిపారు. అవసరమైతే ఆత్మహత్య చేసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.సెప్టెంబర్ 30న ఏం జరిగిందంటే..ఫ్లైదుబాయ్ ఎఫ్‌జెడ్1073 విమానం దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్‌కు బయలుదేరింది. విమానంలో 174 మంది ఉన్నారు. జోర్డాన్ గగనతలంలో ఉండగా కో-పైలట్ .. భారత్‌కు చెందిన కెప్టెన్ స్మిట్ మచ్చార్‌పై దాడి చేశాడు. ఆ తర్వాత విమానం ఒక్కసారిగా కిందకి పడిపోయింది. దాదాపు 30 సెకన్లలో 14 వేల అడుగులకు పైగా ఎత్తు కోల్పోయినట్లు ఫ్లైట్ డేటా వెల్లడించింది. తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ మచ్చార్ ఎలాగోలా కాక్‌పిట్ తలుపు తెరవగలిగారు. దీంతో ప్రయాణికులు లోపలికి దూసుకెళ్లి కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. విమానంలో ఉన్న మరో ఇద్దరు ఆఫ్-డ్యూటీ పైలట్లు నియంత్రణ చేపట్టి విమానాన్ని సౌదీ అరేబియాలోని టబుక్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు.టబుక్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యాక సౌదీ అరేబియా అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఆ కో-పైలట్‌ను యూఏఈ అధికారులకు అప్పగించింది. ప్రస్తుతం యూఏఈ దర్యాప్తు ప్రధానంగా కొనసాగుతోంది. ఇజ్రాయెల్ అధికారులు కూడా అతడిని ప్రశ్నించనున్నారు. ఉగ్రవాద సంబంధం, ముందస్తు ప్రణాళిక, ఇతరుల ప్రమేయం వంటి అంశాలపై విచారణ జరుగుతోంది.నెతన్యాహు సంచలన వ్యాఖ్యలుఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ.. కో-పైలట్ ‘ఇస్లామిస్ట్ రాడికల్ ఇండోక్ట్రినేషన్’కు గురయ్యాడని, అంటే అతివాద భావజాలంతో ప్రభావితమయ్యాడని తెలిపారు. విమానాన్ని కూల్చేయాలనే ఉద్దేశంతోనే అతడు వ్యవహరించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నామని చెప్పారు. ఈ ఘటన వెనుక ఎవరైనా ఉన్నారా? అతడిని ఎవరైనా పంపించారా? అన్నదానిపైనా దర్యాప్తు చేస్తున్నామని.. “అతడిని ఎవరైనా పంపి ఉంటే.. వారు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది” అంటూ హెచ్చరించారు. ఇప్పటివరకు ఇరాన్ ప్రమేయానికి ఆధారాలు లభించలేదని భద్రతా వర్గాలు తెలిపాయి.మరి ఇజ్రాయెల్ ఫ్లైట్‌లోకి ఎలా వచ్చాడు?ఇక్కడే ఇప్పుడు మరో పెద్ద ప్రశ్న తలెత్తింది. ఒమన్‌కు ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు లేవు. ఇలాంటి దేశాల పైలట్లను ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో ఎలా అనుమతించారు?. పోనీ భద్రతా పరమైన నిబంధనలు ఉన్నాయా?అంటే.. ఇజ్రాయెల్-యూఏఈ ద్వైపాక్షిక విమాన ఒప్పందంలో అలాంటిదేం లేదని తెలుస్తోంది. అయినప్పటికీ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా ఫ్లైదుబాయ్ ఎలా నియమించుకుందనేదే అసలు ప్రశ్న. ఇటు ఇజ్రాయెల్ భద్రతా పర్యవేక్షణపైనా ప్రశ్నలు తలెత్తాయి. ఇజ్రాయెల్ అధికారులు పైలట్లను ముందుగానే స్క్రీన్ చేసే విధానాన్ని మరింత కఠినతరం చేయాలని చూస్తున్నారు. ప్రధాని నెతన్యాహు కూడా పైలట్లను ముందుగానే స్క్రీన్ చేయడంలో ఉన్న “లొసుగు”పై సమీక్ష అవసరమని వ్యాఖ్యానించారు.మచ్చార్.. ది హీరోప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడిన సందర్భంగా.. విమానం కిందికి వెళ్తోందని తెలుసుకుని ప్రయాణికులకు ఏం కాకూడదనే ఉద్దేశంతో గాయాలతో నేలపై ఉన్నప్పటికీ కాక్‌పిట్ తలుపు తెరవాలని నిర్ణయించుకున్నానని మచ్చారు వివరించారు. భారత కెప్టెన్ స్మిట్ మచ్చారు సమయస్ఫూర్తి, ధైర్యం వల్లే ఫ్లైదుబాయ్ ఘటనలో ఘోర ప్రమాదం తప్పింది. గాయపడినా హనుమాన్ చాలీసా పటిస్తూ బలం తెచ్చుకుని.. కాక్‌పిట్ తలుపు తెరవగలిగాడు స్మిట్. దీంతో ప్రయాణికులు లోపలికి వెళ్లి దాడి చేసిన హమామ్ను అదుపులోకి తీసుకోగలిగారు. విమానంలోని వాళ్ల ప్రాణాలు కాపాడారు. అందుకే ప్రపంచం మొత్తం ఆయన్ని హీరోగా ప్రశంసిస్తోంది.2024లోనే భద్రతా ముప్పుగా గుర్తించి విమానాలు నడపకుండా నిషేధించిన వ్యక్తి.. ఆ తర్వాత మరో రెండు అంతర్జాతీయ విమానయాన సంస్థల్లో కో-పైలట్‌గా ఎలా చేరాడు? అతడి గత రికార్డులు ఎందుకు అడ్డుకాలేదు? టెల్అవీవ్ వెళ్లే విమానానికి అతడు ఎలా క్లియర్ అయ్యాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఇదీ చదవండి: ఇదేం ట్విస్ట్?? యూదులను చంపేయాలా! -
హౌతీలకు చావుదెబ్బ.. ఇటు జీ7 సంచలన నిర్ణయం!
పశ్చిమాసియాలో యుద్ధ మంటలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ దాడులు, యెమెన్‌లో హౌతీలపై దాడులు, గాజాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలతో ఇప్పటికే ప్రపంచ ఇంధన మార్కెట్లు ఉక్కిరి బిక్కిరవుతున్నాయి. ఈ ప్రభావం ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కూడా పెద్ద సవాలుగా మారింది. యుద్ధం దెబ్బకు ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరడంతో.. అమెరికాలోనే కాదు, యూరప్‌లోనూ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో ధరలకు కళ్లెం వేసేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యూరప్ దేశాలు తమ వద్ద ఉన్న డీజిల్ నిల్వలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే అమెరికా నుంచి డీజిల్ ఎగుమతులపై నిషేధం విధించే అవకాశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అలాంటి నిర్ణయం ప్రపంచ మార్కెట్లో డీజిల్ కొరతను మరింత పెంచే ప్రమాదం ఉండటంతో యూరప్‌లో ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ట్రంప్‌తో మాట్లాడారు. అనంతరం G7 దేశాల నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ట్రంప్ కూడా ఈ చర్చల్లో పాల్గొని యూరప్ డీజిల్ నిల్వలను విడుదల చేయడానికి చర్చలు జరిపినట్లు అమెరికా అధికారులు తెలిపారు.చివరకు G7 ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు నెలల వ్యవధిలో మొత్తం 100 మిలియన్ బ్యారెళ్ల చమురు, డీజిల్ తదితర ఇంధన నిల్వలను సమన్వయంతో విడుదల చేయనుంది. ఇందులో తొలి 20 రోజుల్లోనే గణనీయమైన మొత్తంలో డీజిల్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఈ ప్రక్రియను అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) ద్వారా సమన్వయం చేయనున్నారు.ట్రంప్‌కు కొత్త టెన్షన్ఇక్కడ మరో కీలక అంశం ఉంది. అమెరికాలో డీజిల్ ధరలు ఇటీవల రికార్డు స్థాయికి చేరాయి. యుద్ధం కారణంగా ఇంధన సరఫరాలపై ఒత్తిడి పెరగడంతో ధరలు ఎగిశాయి. నవంబర్ 3న అమెరికా మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పెరిగిన జీవన వ్యయం, ఇంధన ధరలు ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయంగా కూడా కీలక అంశంగా మారాయి.అందుకే డీజిల్ ధరలను అదుపులోకి తీసుకురావడానికి వేగంగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రంప్ స్వయంగా కూడా యూరప్ భారీగా డీజిల్ నిల్వలను విడుదల చేయడానికి అంగీకరించిందని ప్రకటించారు. అనంతరం అమెరికా డీజిల్ ఎగుమతులపై నిషేధం విధించబోమని స్పష్టం చేశారు. G7 దేశాలు కూడా పరస్పరం ఇంధన ఎగుమతులపై ఆంక్షలు విధించబోమని స్పష్టం చేశాయి. అంటే ఒకవైపు నిల్వలను విడుదల చేస్తూనే.. మరోవైపు అంతర్జాతీయ సరఫరా గొలుసుకు మరింత దెబ్బ తగలకుండా చర్యలు తీసుకుంటున్నాయి.అసలు టెన్షన్ ఇక్కడే.. అయితే చమురు నిల్వలను విడుదల చేయడం తక్షణ ఉపశమనానికి మాత్రమే. పశ్చిమాసియాలో అసలు సమస్య మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. హర్ముజ్ జలసంధి, బాబ్ అల్-మండెబ్ సముద్ర మార్గాలపై నెలకొన్న ఉద్రిక్తత ప్రపంచ ఇంధన సరఫరాకు పెద్ద ముప్పుగా మారింది.హర్ముజ్ ద్వారా భారీ స్థాయిలో చమురు రవాణా జరుగుతుంది. అక్కడ నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడితే ప్రపంచ మార్కెట్‌పై నేరుగా ప్రభావం పడుతుంది. G7 కూడా తాజాగా హర్ముజ్‌లో అంతర్జాతీయ నౌకాయాన హక్కులు, స్వేచ్ఛాయుత రాకపోకలను వెంటనే పునరుద్ధరించాలని పిలుపునిచ్చింది.మరోవైపు యెమెన్‌లోని హౌతీల చర్యల కారణంగా బాబ్ అల్-మండెబ్–ఎర్ర సముద్ర మార్గం కూడా ప్రమాదంలో ఉంది. తాజాగా ఒమన్ సమీపంలో ఓ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్‌ను క్షిపణి తాకినట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. సిబ్బంది సురక్షితంగా ఉన్నప్పటికీ.. వాణిజ్య నౌకల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి.హౌతీలపై భారీ దాడులుఇదే సమయంలో యెమెన్‌లో పోరాటం మరింత తీవ్రరూపం దాల్చింది. గత 24 గంటల్లో 474 ఆపరేషన్లు నిర్వహించి 1,540 మంది హౌతీ ఫైటర్లను హతమార్చినట్లు యెమెన్ సైన్యం ప్రకటించింది. తైజ్ ప్రాంతంలో అత్యధిక నష్టం జరిగినట్లు తెలిపింది. పలువురికి గాయాలైనట్లు సమాచారం. మరోవైపు దక్షిణ సౌదీ అరేబియాను లక్ష్యంగా చేసుకుని వచ్చిన మూడు బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకున్నట్లు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణం తెలిపింది. దీంతో యెమెన్–సౌదీ సరిహద్దుల్లోనూ ఉద్రిక్తత కొనసాగుతోంది.గాజాలోనూ దాడులు.. వెస్ట్‌బ్యాంక్‌లో హింసపశ్చిమాసియా సంక్షోభం ఇరాన్, యెమెన్తోనే ఆగలేదు. గాజా సిటీలోని ఓ నివాస సముదాయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో చిన్నారి సహా నలుగురు మరణించినట్లు పాలస్తీనా వైద్య వర్గాలు తెలిపాయి. పలువురు గాయపడ్డారు. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోనూ పాలస్తీనియన్లపై సెటిలర్ దాడులు జరిగినట్లు సమాచారం. మరోవైపు హమాస్ ఆర్థిక నెట్‌వర్క్‌ను దెబ్బతీసేందుకు అమెరికా, ఫ్రాన్స్‌తో కలిసి చర్యలు కొనసాగిస్తామని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.ఒక్క యుద్ధం.. ఎన్నో ప్రభావాలుఇలా పశ్చిమాసియాలోని ఒక్కో ఫ్రంట్ మరోదానితో ముడిపడి ఉంది. ఇరాన్ యుద్ధం చమురు సరఫరాపై ప్రభావం చూపుతోంది.. హౌతీల దాడులు సముద్ర రవాణాపై ఒత్తిడి పెంచుతున్నాయి. హర్ముజ్ ఉద్రిక్తత ప్రపంచ చమురు మార్కెట్‌ను కుదిపేస్తోంది.. గాజా, వెస్ట్‌బ్యాంక్‌లో హింస ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది.దీని ప్రభావమే ఇప్పుడు G7 అత్యవసర నిల్వలను రంగంలోకి దించడం. అయితే 100 మిలియన్ బ్యారెళ్ల విడుదలతో ధరలపై కొంత ఒత్తిడి తగ్గే అవకాశం ఉన్నా.. పశ్చిమాసియాలో యుద్ధం, సముద్ర మార్గాల భద్రతపై అనిశ్చితి కొనసాగినంతకాలం ఇంధన మార్కెట్ టెన్షన్ మాత్రం పూర్తిగా తగ్గే పరిస్థితి కనిపించడం లేదు.ఇదీ చదవండి: కీవ్‌లో ఏం జరుగుతోంది? మూడు వంతెనలు నాశనం -
‘అమ్మాయిల కోసమే..’ మస్క్ సంచలన వ్యాఖ్యలు!
ప్రముఖ బిలియనీర్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మరోసారి తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశారు. ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. కొందరు ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతుండగా.. మరికొందరు తేలికగా తీసుకోవాలని సూచిస్తూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ వివాదం ఎక్స్ (X) వేదికగా మొదలైంది. జైగర్ క్యాపిటల్ అనే యూజర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను తొలగించినట్లు ప్రకటిస్తూ.. “ఇది సహజంగానే మహిళల కోసం ఉన్న యాప్. ఎలాంటి ప్రయోజనం లేదు” అంటూ పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన మస్క్.. ఇన్స్టాగ్రామ్ అమ్మాయిల కోసమే “Instagram is for girls” అంటూ కామెంట్ చేశారు. ఇక్కడి నుంచి అసలు దుమారం మొదలైంది.కొత్తేం కాదుఇన్స్టాగ్రామ్పై మస్క్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మేలో సోషల్ మీడియా వినియోగ అలవాట్లపై జరిగిన ఓ చర్చలోనూ ఆయన ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు, స్టోరీస్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పోస్టులు ఎక్కువగా ఉంటాయనే అంశాన్ని ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు. కొంతమంది పురుషులు తమ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్‌ను తనకు పంపినప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుందని కూడా మస్క్ గతంలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లోనూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది.Instagram is for girls— Elon Musk (@elonmusk) October 1, 2026ఎవరేమన్నారంటే.. మస్క్ తాజా వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికలు ఏ ఒక్క లింగానికి మాత్రమే పరిమితం కావని, ఇన్‌స్టాగ్రామ్‌ను అన్ని వర్గాల వారు ఉపయోగిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. “అయితే ఎక్స్(దీనికి ఓనర్ మస్కే కదా) ఎవరి కోసం?” అంటూ ఓ యూజర్ ప్రశ్నించగా.. “ఇన్స్టాగ్రామ్ అందరికీ చెందిన వేదిక” అంటూ మరికొందరు స్పందించారు. ఇంకొందరు మస్క్ వ్యాఖ్యలను సమర్థిస్తూ.. ఆయన చెప్పింది కంటెంట్ ట్రెండ్లను ఉద్దేశించిందేనని అభిప్రాయపడ్డారు.వాస్తవం ఏంటంటే..ఇన్‌స్టాగ్రామ్‌ను ఎక్కువగా మహిళలే ఉపయోగిస్తారన్న అభిప్రాయం ఉన్నప్పటికీ.. గణాంకాలు మాత్రం మరో చిత్రాన్ని చూపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల్లో పురుషుల వాటా సుమారు 52.7 శాతం ఉండగా.. మహిళల వాటా 47.3 శాతంగా ఉంది. అంటే ప్రపంచ స్థాయిలో పురుషుల వినియోగమే స్వల్పంగా ఎక్కువగా ఉంది. భారత్‌లోనూ ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల్లో పురుషుల సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు డేటా సూచిస్తోంది. అందుబాటులో ఉన్న అంచనాల ప్రకారం.. దేశంలోని అడల్ట్ యూజర్లలో పురుషుల వాటా సుమారు 70 శాతం, మహిళల వాటా దాదాపు 30 శాతంగా ఉంది.అయితే ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, ఫొటోలు, రీల్స్ వంటి కంటెంట్ కారణంగా ఇన్‌స్టాగ్రామ్‌ను కొందరు మహిళలతో ఎక్కువగా అనుసంధానం చేస్తుంటారు. ఇదే నేపథ్యంలో మస్క్ వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియా వేదికల స్వభావంపై చర్చకు తెరలేపాయి.ఇదీ చదవండి: అదే నిజమైతే ఇరాన్ నామరూపాల్లేకుండా పోతుంది! -
ఫ్లైదుబాయ్ ఘటనలో కొత్త ట్విస్టులు
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న వేళ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాక్‌పిట్‌లో జరిగిన దాడి వెనుక ఉద్దేశం ఏమిటి? విమానాన్ని కూల్చే ప్రయత్నమేనా? లేక మరేదైనా కారణమా? అన్న అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీశాయి.ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెతన్యాహూ.. ఒమన్‌కు చెందిన కో-పైలట్ ఇస్లామిక్ తీవ్రవాద భావజాలానికి ప్రభావితుడై ఉండొచ్చని తెలిపారు. అతడి వ్యక్తిగత సమాచారంలో కొన్ని అంశాలు బయటపడ్డాయని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. అదుపులోకి తీసుకున్న సమయంలో కో-పైలట్ “కిల్ మీ.. కిల్ మీ” అంటూ అరచినట్లు పేర్కొన్నారు. అతడు ఆత్మహత్యా ధోరణిలో ఉన్నట్లు కనిపించిందని, విమానాన్ని ప్రమాదంలోకి నెట్టే ఉద్దేశం ఉండి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఫ్లైదుబాయ్ ఘటనను తీవ్రంగా పరిగణించారు. భారత పైలట్ స్మిట్ మచ్చార్‌పై దాడి చేసిన ఆ కోపైలట్‌కు ఇరాన్‌తో లింకులు ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు. దర్యాప్తు జరుగుతోందని.. అదే గనుక నిజమని తేలితే ఇరాన్‌పై భీకరదాడులు జరుపుతామని హెచ్చరించారు.కాక్‌పిట్‌లో రక్తపాతం..వీడియో బయటకుఫ్లైదుబాయ్ ఎఫ్‌జెడ్1073 విమానం దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. విమానంలో 174 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారు. విమాన కాక్‌పిట్‌లో కో-పైలట్ భారతీయ కెప్టెన్ స్మిట్ మచ్చార్‌పై దాడి జరిగింది. ఈ సమయంలో విమానం ఒక్కసారిగా వేల అడుగుల ఎత్తు నుంచి కిందికి దిగడంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.బయటకు వచ్చిన వీడియోల్లో విమానం లోపల గందరగోళ పరిస్థితులు కనిపించాయి. ప్రయాణికులు కాక్‌పిట్ వైపు పరుగులు తీస్తూ కనిపించారు. “అతడు విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడు” అంటూ కొందరు ప్రయాణికులు అరుస్తున్న దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి.గాయాలతోనే తలుపు తెరిచి..దాడిలో తీవ్రంగా గాయపడిన కెప్టెన్ స్మిట్ మచ్చర్ రక్తస్రావంతో ఉన్నప్పటికీ కాక్‌పిట్ తలుపు తెరిచినట్లు ఆ దృశ్యాలు ఉన్నాయి. దీంతో ప్రయాణికులు లోపలికి వెళ్లి కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. “అతడు నన్ను చాలా సార్లు కొట్టాడు” అంటూ కెప్టెన్ చెప్పిన దృశ్యాలు వీడియోల్లో కనిపించినట్లు సమాచారం.ఈ సమయంలో కొందరు ప్రయాణికులు ధైర్యంగా ముందుకు వచ్చారు. ట్జ్వికా మానెస్, అసఫ్ రాజువాన్, యానివ్ హయూన్ వంటి ప్రయాణికులు కాక్‌పిట్‌లోకి వెళ్లి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంలో సహకరించారు.ప్లంబర్, డెంటిస్ట్.. ప్రయాణికులే హీరోలుఈ ఘటనలో ప్రయాణికుల పాత్ర కీలకంగా మారింది. విమానంలో ఉన్న డెంటిస్ట్ షోటా ముసాయెవ్ గాయపడిన కెప్టెన్‌కు ప్రథమ చికిత్స అందించారు. అలాగే విమానంలో ఉన్న ఆఫ్-డ్యూటీ పైలట్లు పరిస్థితిని చక్కదిద్దడంలో సహకరించారు. ప్రయాణికుడు యానివ్ హయూన్.. విమాన ప్రమాదాలకు సంబంధించిన టీవీ షోలు చూసిన అనుభవం ఆ సమయంలో తనకు ఉపయోగపడిందని చెప్పినట్లు సమాచారం.కోలుకుంటున్న భారత పైలట్ఘటన తర్వాత సౌదీ అరేబియాలోని టబూక్ ఆస్పత్రిలో చికిత్స పొందిన కెప్టెన్ స్మిట్ మచ్చర్‌ను అనంతరం యూఏఈకి తరలించారు(ఎయిర్‌లిఫ్ట్). యూఏఈలో భారత రాయబారి దీపక్ మిట్టల్ ఆస్పత్రికి వెళ్లి కెప్టెన్, ఆయన కుటుంబ సభ్యులను కలిశారు. స్మిట్ ఆరోగ్యం నిలకడగా ఉందని, కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారని తెలిపారు. “ధైర్యవంతుడైన భారత ముద్దుబిడ్డ” అంటూ స్మిట్‌ను ఆయన ప్రశంసించారు. మానవ ప్రాణాలను కాపాడటంలో ఆయన గొప్ప సేవ చేశారని పేర్కొన్నారు.కో-పైలట్ UAE అదుపులోకిఘటన తర్వాత సౌదీ అధికారులు కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం అతడిని యూఏఈ అధికారులకు అప్పగించారు. ఈ ఘటన ఉగ్రవాద సంబంధమా? ముందస్తు ప్రణాళిక ఉందా? కో-పైలట్ ఒక్కడే ఈ చర్యకు పాల్పడ్డాడా? అన్న అంశాలపై దర్యాప్తు జరుగుతోంది. ఈ దర్యాప్తులో ఇజ్రాయెల్ కూడా భాగం కావొచ్చని సమాచారం. ఘటనపై అనుమానాలు?ఈ ఘటన తర్వాత విమాన భద్రతా వ్యవస్థపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒమన్, ఇజ్రాయెల్‌కు అధికారిక దౌత్య సంబంధాలు లేనప్పటికీ.. ఆ దేశానికి చెందిన వ్యక్తి ఇజ్రాయెల్ వెళ్లే విమానంలో విధులు నిర్వహించడం ఎలా సాధ్యమైందన్న చర్చ మొదలైంది. ఏమైనా లోపాలు జరిగాయా? అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.మరోవైపు.. అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్లంబర్ అయిన యానివ్ హయూన్ ఆ సమయంలో విమానం కంట్రోల్ చేశాడన్న కోణాన్ని ఏకిపారేస్తున్నాయి. హయూన్ నేరుగా ప్రధాని నెతన్యాహూను కలవడం, ఆ సమయంలో జరిగిందంతా డ్రామాగా అభివర్ణిస్తూ కథనాలు ఇస్తున్నాయి. ఇటు ఒమన్‌కు చెందిన వ్యక్తికి.. ఇజ్రాయెల్‌కు విమానం నడిపే అవకాశం ఎలా దక్కింది? అని మాజీ పైలట్లు ప్రశ్నిస్తున్నారు. ఇంకోవైపు ఎన్నికల్లో లబ్ధి కోసమే నెతన్యాహూ ఈ డ్రామాలు ఆడుతున్నారేమో అని ఇజ్రాయెల్ ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదీ చదవండి: ఎలక్షన్ దాకా ఆగడం ఎందుకు? బాంబులేస్తే పోలా! -
మళ్లీ రణరంగమా? ఇరాన్ చుట్టూ అమెరికా యుద్ధ వలయం!
పశ్చిమాసియాను మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? ఇరాన్‌పై అమెరికా మళ్లీ సైనిక చర్యకు సిద్ధమవుతోందా? తాజా పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. కొత్త దాడులకు అవకాశం కచ్చితంగా ఉందని ట్రంప్ చెప్పడం.. పైగా గల్ఫ్ ప్రాంతానికి భారీగా సైనిక బలగాలను తరలించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బలగాలే గనుక చేరుకుంటే మిడిల్ఈస్ట్లో అమెరికా సైనిక ఉనికి గతంలో ఎన్నడూలేని స్థాయికి చేరే అవకాశం కనిపిస్తోంది.దాదాపు 9 వేల మంది సైనికులు, మెరైన్లను యుద్ధ నౌకల సమూహంతో కలిసి మిడిల్‌ఈస్ట్‌కు తరలిస్తున్నట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. ఈ బలగాల తరలింపు సాధారణ మోహరింపు కాదని, ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా వ్యూహాత్మకంగా తన సైనిక సామర్థ్యాన్ని పెంచుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా బలగాలకు అదనంగా ఈ కొత్త దళాలు చేరితే.. మధ్యప్రాచ్యంలో అమెరికా నావికాదళ ఉనికి మరింత బలపడనుంది. మొత్తం మీద 20 వేల మందికి పైగా సైనికులు, వందలాది యుద్ధ విమానాలు, అత్యాధునిక ఆయుధ వ్యవస్థలతో అమెరికా సైనిక శక్తి ఈ ప్రాంతంలో అత్యున్నత స్థాయికి చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఇంధన సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధి, ఇరాన్ అణు కార్యక్రమం, ఇటీవలి ప్రాంతీయ దాడుల నేపథ్యంలో ఈ మోహరింపు ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవైపు చర్చలకు తాము సిద్ధమంటూ ఇరాన్ సంకేతాలు ఇస్తుండగా.. మరోవైపు అమెరికా సైనిక బలగాలను పెంచడం పశ్చిమాసియాలో తదుపరి పరిణామాలపై ఉత్కంఠను పెంచుతోంది.మూడు విమాన వాహక నౌకలతో సిద్ధంఅమెరికా నౌకాదళానికి చెందిన యూఎస్ఎస్ థియోడోర్ రూజ్వెల్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్, యూఎస్ఎస్ మాకిన్ ఐలాండ్ యాంఫిబియస్ రెడీనెస్ గ్రూప్ పశ్చిమాసియా వైపు కదులుతున్నాయి. వీటిలో వేలాది మంది నావికులు, మెరైన్లు ఉన్నారు. ప్రస్తుత ఏర్పాట్ల ప్రకారం అక్టోబర్ చివరి నాటికి ఈ ప్రాంతంలో మూడు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు ఉండే అవకాశం ఉందని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. యూఎస్ఎస్ జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్, యూఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్ క్యారియర్లు ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్నాయి. 2003 తర్వాత.. తొలిసారిగా ఒకేసారి మూడు క్యారియర్ స్ట్రైక్ గ్రూపులు ఆ రీజియన్‌లో ఉండే పరిస్థితి ఏర్పడనుందని అధికారులు చెబుతున్నారు.ఇరాన్‌పై ట్రంప్ హెచ్చరికలుఇరాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌కు వెళ్తున్న విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన ఘటనలో కో–పైలట్‌కు ఇరాన్‌తో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. "ఇరాన్‌తో సంబంధం ఉన్నట్లు తేలితే తీవ్ర పరిణామాలు ఉంటాయి" అంటూ ట్రంప్ హెచ్చరించారు. ‘‘వారిపై చాలా తీవ్రంగా దాడి జరుగుతుంది’’ అని వ్యాఖ్యానించారు.ఎన్నికల వరకు ఆగుతారా?నవంబర్ 3న జరగనున్న అమెరికా ఎన్నికల తర్వాత ఇరాన్‌పై బాంబు దాడులను పెంచే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ట్రంప్ ‘‘అది సాధ్యమే’’ అని సమాధానం ఇచ్చారు. ఇరాన్ ప్రతిపాదించిన తాజా కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించినట్లు ట్రంప్ తెలిపారు. హార్ముజ్ జలసంధిని తెరవాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ.. మొత్తం ఒప్పందం తనకు ఆమోదయోగ్యంగా లేదని పేర్కొన్నారు. అయితే తాజాగా మధ్యప్రాచ్యంలో భారీగా సైనిక బలగాలను మోహరించడం చూస్తుంటే.. ఎన్నికల వరకు అమెరికా వేచి చూస్తుందా? లేక అంతకుముందే సైనిక చర్యకు దిగుతుందా? అనే చర్చ మొదలైంది.హార్ముజ్‌లో ట్యాంకర్‌పై దాడిఇదిలా ఉండగా, ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధిలో 25 లక్షల బ్యారెళ్ల చమురు తీసుకెళ్తున్న సూపర్ ట్యాంకర్‌పై గుర్తుతెలియని ఆయుధంతో దాడి జరిగింది. ఘటనలో నౌకలో మంటలు చెలరేగినట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. ఈ ఘటనతో గల్ఫ్ ప్రాంతంలో భద్రతా ఆందోళనలు మరింత పెరిగాయి.ఇరాన్ మరోలా..మరోవైపు ఇరాన్ అమెరికాతో చర్చలకు తాము ఎప్పుడూ దూరంగా లేమని అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తెలిపారు. చర్చల సమయంలోనే తమపై మూడుసార్లు దాడులు జరిగాయని ఆరోపించారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ (IRGC) సీనియర్ సలహాదారు బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ రెజా నక్దీ మాత్రం అమెరికా ప్రభావం ఈ ప్రాంతంలో తగ్గుతోందని వ్యాఖ్యానించారు. ఇరాక్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు.అమెరికా భారీ సైనిక మోహరింపు, ట్రంప్ దూకుడు వ్యాఖ్యలు, హార్ముజ్ పరిణామాలు.. మొత్తం మీద మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. అనూహ్యంగా మధ్యవర్తులు ఎంట్రీ ఇచ్చి ఇరాన్–అమెరికా మధ్య మళ్లీ చర్చలను తెరపైకి తెస్తారా? లేదంటే మరోసారి సైనిక ఘర్షణ దిశగా పరిస్థితులు వెళ్తాయా అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.ఇదీ చదవండి: ఫ్లైదుబాయ్ ఘటన.. అంతుచిక్కని ప్రశ్నలివే! -
ఫ్లైదుబాయ్ ఘటన: ఒక్కడు కాదు.. ఐదుగురు హీరోలు
ఆకాశంలో వేల అడుగుల నుంచి అమాంతం కిందకు జారిన విమానం.. కాక్‌పిట్‌లో రక్తపు మడుగులో పైలట్.. మరో పైలట్ విమానాన్ని నేలవైపు మళ్లించే ప్రయత్నం.. బయట ప్రయాణికుల హాహాకారాలు.. ఏం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితి. అలాంటి సమయంలో కొందరు ప్రయాణికులు ప్రాణాలకు తెగించి కాక్‌పిట్‌లోకి దూసుకెళ్లారు. సమయస్ఫూర్తిని ప్రదర్శించి.. చివరకు 174 మంది ప్రాణాలతో బయటపడగలిగారు. దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ఈ ఘటనలో ఇప్పుడు ఐదుగురిని హీరోలుగా కొనియాడుతున్నారు.విమానంలో ప్రయాణిస్తున్న ఒమన్‌కు చెందిన కో–పైలట్.. భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై దాడి చేసి కత్తితో పొడిచినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడినప్పటికీ మచ్చార్ కాక్‌పిట్ తలుపును తెరవగలిగారు. దీంతో బయట ఉన్న ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లే అవకాశం లభించింది. ఇదే సమయంలో విమానం వేల అడుగుల ఎత్తును అత్యంత వేగంగా కోల్పోయింది. చివరకు ప్రయాణికులు, సిబ్బంది కలిసి కో–పైలట్‌ను అదుపులోకి తీసుకోవడం, విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ‘హమ్మయ్యా’ అనుకున్నారు. భారత పైలట్‌కు ప్లంబర్ ధైర్యంఇజ్రాయెల్కు చెందిన ప్లంబర్ యానివ్ హయూన్ ఈ ఘటనలో కీలకంగా వ్యవహరించారు. గాయపడిన మచ్చార్‌కు సాయం చేసిన అతను.. రక్తపు దుస్తులతోనే ఇజ్రాయెల్‌లో అడుగుపెట్టాడు. నేరుగా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును కలిసి జరిగింది వివరించారు. మచ్చార్ గాయపడినప్పటికీ కాక్‌పిట్ తలుపు తెరవడం వల్లే మిగతావారు లోపలికి వెళ్లగలిగారని హయూన్, నెతన్యాహుతో చెప్పారు. దీంతో ఆయన మచ్చార్‌ను ప్రశంసించారు. ఆ సమయంలో జరిగింది ఏంటో ఆయన మీడియాకు వివరించారు.AMAFOTO: Minisitiri w'Intebe wa Israel, @netanyahu, yashimiye Yaniv Hayoun, umwe mu bagenzi bafashije guhagarika ishimutwa ry’indege ya @flydubai no gusubiza indege ku murongo.Hayoun yavuze ko yinjiye mu cyumba cy’abapilote, afata umupilote wungirije wari ku bikoresho... pic.twitter.com/kPyGvitwE6— BIGEZWEHO TV (@bigezweho_tv) October 1, 2026కాక్‌పిట్‌లోకి వెళ్లిన ఆయన.. తీవ్రంగా గాయపడి నేలపై పడివున్న మచ్చార్‌ను చూసి ‘‘నువ్వు చనిపోవు బ్రో.. నీకేం కాదు’’ అంటూ ధైర్యం చెప్పారు. అనంతరం కో–పైలట్‌ను వెనక్కి లాగి కాక్‌పిట్ నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. విమానం అదుపు తప్పుతున్న సమయంలో కంట్రోల్ స్టిక్‌ను వెనక్కి లాగి దాన్ని స్థిరీకరించేందుకు కూడా హయూన్ ప్రయత్నించారు. Il premier israeliano Benjamin Netanyahu ha incontrato Yaniv Hayoun, passeggero del volo FlyDubai atterrato in emergenza in Arabia Saudita dopo che un pilota avrebbe aggredito un collega. Netanyahu ha definito Hayoun un eroe per aver contribuito a neutralizzare l'aggressore. pic.twitter.com/lIEXD38d1u— LaPresse (@LaPresse_news) October 1, 2026ఇక్కడే ఓ ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. విమానం కంట్రోల్స్‌ను ఎలా ఆపరేట్ చేయాలో తనకు పెద్దగా తెలియదని చెబుతున్న హయూన్.. టీవీలో వచ్చే ఎయిర్ క్రాష్ ఇన్వెస్టిగేషన్(Air Crash Investigation) కార్యక్రమం చూసిన అనుభవం గుర్తొచ్చిందని చెప్పారు. ‘‘నేను ఆ షో చూస్తుంటాను’’ అంటూ నెతన్యాహుతో జరిగిన భేటీలో ఆయన చెప్పడం.. చిరునవ్వులు చిందించడం ఇప్పుడు వైరల్‌గా మారింది.బ్యాంకర్.. బిజినెస్‌మన్ కూడా రంగంలోకికో–పైలట్‌ను అదుపులోకి తీసుకోవడంలో మరో ఇద్దరు ఇజ్రాయెలీ ప్రయాణికులు జ్వికా మానెస్, అసఫ్ రాజువాన్ కీలకంగా వ్యవహరించారు. బ్యాంక్ లియూమి అండర్‌రైటింగ్ కంపెనీ సీఈవో అయిన మానెస్.. విమానంలో ఇచ్చిన హెడ్‌ఫోన్ కేబుళ్లతో దాడి చేసిన వ్యక్తిని కట్టేసినట్లు చెప్పారు. విమానం వేగంగా కిందికి దూసుకెళ్తుండగా ప్రయాణికులు భయంతో కేకలు వేస్తున్నారని ఆయన వివరించారు. ఇన్సూరెన్స్ ఏజెన్సీ నిర్వహించే రాజువాన్ కూడా కాక్‌పిట్‌లోకి వెళ్లి కో–పైలట్‌ను అదుపులోకి తీసుకోవడంలో సహకరించారు. కొంతసేపు అతడిని అదుపులోనే ఉంచి, విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యే వరకు పరిస్థితిని అదుపులో ఉంచినట్లు ఆయన తెలిపారు.డెంటిస్ట్ ప్రాణదాతగా..ఈ ఘటనలో డాక్టర్ షోటా ముసాయెవ్ పాత్ర కూడా కీలకంగా మారింది. దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన తీవ్రంగా గాయపడిన కెప్టెన్ మచ్చార్ వద్దకు వెళ్లారు. తలకు, చేతులకు తీవ్ర గాయాలై రక్తస్రావం అవుతున్న మచ్చార్‌కు ప్రాథమిక వైద్యం అందించి రక్తస్రావాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యే వరకు ఆయన పరిస్థితిని స్థిరంగా ఉంచడంలో ముసాయెవ్ సహకరించారు.ఇద్దరు ఆఫ్-డ్యూటీ పైలట్లు కూడా..కాక్‌పిట్‌లో పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు ఆఫ్-డ్యూటీ పైలట్లు కంట్రోల్స్ చేపట్టారు. వారి సహాయంతో విమానం మళ్లీ స్థిరపడింది. అనంతరం అత్యవసర పరిస్థితిని ప్రకటించి సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయానికి మళ్లించారు. అలా విమానంలోని మొత్తం 174 మంది సురక్షితంగా బయటపడ్డారు. లేకుంటే మరో 9/11 అయ్యేది.హెర్జోగ్ కీలక నిర్ణయంఈ ఘటనలో ప్రాణాలకు తెగించి స్పందించిన నలుగురు ఇజ్రాయెలీలకు దేశ అత్యున్నత పౌర వీరత్వ పురస్కారానికి సిఫార్సు చేయనున్నట్లు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ప్రకటించారు. యానివ్ హయూన్, జ్వికా మానెస్, అసఫ్ రాజువాన్, డాక్టర్ షోటా ముసాయెవ్ల పేర్లను ఆయన సిఫార్సు చేశారు. కాక్‌పిట్‌లోకి వెళ్లి దాడిచేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం, విమానాన్ని స్థిరీకరించడం, తీవ్రంగా గాయపడిన పైలట్‌కు ప్రాణరక్షక వైద్యం అందించడం వంటి చర్యలను హెర్జోగ్ ప్రశంసించారు.ఫ్లైదుబాయ్ ఘటన వెనుక కో–పైలట్ ఉద్దేశం ఏమిటన్నది ఇంకా దర్యాప్తులోనే ఉంది. ఫ్లైదుబాయ్ కూడా అధికారులతో కలిసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఘటన అనంతరం FZ1073 టబుక్‌లో సురక్షితంగా దిగిందని, ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని సంస్థ అధికారికంగా వెల్లడించింది.ఇదీ చదవండి: కెప్టెన్ మచ్చార్.. యూ ఆర్ రియల్ హీరో -
ఫ్లైదుబాయ్ ట్విస్ట్: ఇంతకీ ఆ కో-పైలట్ ఎవరంటే..
ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా నిలిచిన భారత పైలట్ కెప్టెన్ స్మిట్ మచ్చార్ ప్రాణాలకు తెగించి పోరాడటంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అతనిపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ఇంతటి ప్రమాదకర చర్యకు పాల్పడిన కో-పైలట్ ఎవరు? అతడి ఉద్దేశం ఏమిటి? అనే మిస్టరీ ఇంకా వీడలేదు.ఇజ్రాయెల్ అధికారుల ప్రకారం.. దాడికి పాల్పడిన కో-పైలట్ ఒమన్ జాతీయుడు. అతడి పూర్తి పేరును మాత్రం ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. ఫ్లైదుబాయ్లోనే పనిచేస్తున్న అతడు.. సంస్థలో చేరి ఏడాది కూడా కాలేదని తెలుస్తోంది. అయితే ఏ ఉద్దేశంతో దాడి చేశాడన్నది కూడా తెలియరాలేదు. ఘటన తర్వాత సౌదీ అరేబియా అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల సహకారంతో అతన్ని ప్రశ్నిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఫ్లైదుబాయ్ ప్రకారం.. ఘటనకు దారితీసిన అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. అందువల్ల కో-పైలట్ ఉద్దేశం గురించి ముందస్తు ఊహాగానాలు చేయొద్దని సంస్థ హెచ్చరించింది. నెతన్యాహు ఏమన్నారంటే..ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. కో-పైలట్ మొదట కెప్టెన్ స్మిట్ మచ్చార్‌పై కత్తితో దాడి చేసి.. అనంతరం విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది జోక్యం చేసుకోవడంతో ఆ ప్రయత్నం విఫలమైందని వివరించారు. విమానంలో మొత్తం 174 మంది ఉన్నారని, వారిలో ఎక్కువ మంది ఇజ్రాయెల్ పౌరులేనని తెలిపారు.స్మిట్ మచ్చార్ తీవ్రంగా గాయపడినా చివరి శక్తిని ఉపయోగించి కాక్‌పిట్ తలుపు తెరిచారని నెతన్యాహు కార్యాలయ ప్రతినిధి డోరన్ స్పీల్‌మన్ తెలిపారు. దీంతో ప్రయాణికులు లోపలికి వెళ్లి దాడి చేసిన కో-పైలట్‌ను అదుపులోకి తీసుకోగలిగారని చెప్పారు. నెతన్యాహు స్వయంగా స్మిట్ మచ్చార్‌ను “నిజమైన హీరో”గా అభివర్ణించి, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 174 మంది ప్రాణాలను కాపాడటంలో ఆయన కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు.My salute to the Indian pilot Captain Smit Machchhar for his extraordinary bravery.Despite being stabbed and seriously injured, he fought back, resisted, opened the cockpit door, and enabled passengers and crew to overpower the attacker — preventing a catastrophic mid-air…— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) September 30, 2026ట్రంప్ ఏమన్నారంటే..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ ఘటనపై నెతన్యాహుతో మాట్లాడినట్లు తెలిపారు. అనంతరం ఓవల్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నెతన్యాహు నుంచి తనకు అందిన వివరాలను చెప్పారు. విమానంలో ఉన్న ఓ ఇజ్రాయెలీ ప్లంబర్ కాక్‌పిట్‌లోకి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకోవడంలో సహకరించాడు. కో-పైలట్ విమాన నియంత్రణ వ్యవస్థను దెబ్బతీయడానికి ప్రయత్నించాడు. అతడు “టెర్రరిస్ట్ అయి ఉండొచ్చు.. లేదంటే మరేదైనా కారణం ఉండొచ్చు” అనే అర్థంలో వ్యాఖ్యానించారు. ఇటు ప్రయాణికుల్ని కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిట్ మచ్చార్‌ను మాత్రం ట్రంప్ అభినందించారు.ఇజ్రాయెల్ బలగాలు ఏం చెప్పాయి?ఇజ్రాయెల్ అధికారులు ఈ ఘటనను తీవ్రమైన భద్రతా ఘటనగా అభివర్ణించారు. కో-పైలట్ స్మిట్ మచ్చార్‌పై దాడి చేసిన తర్వాత విమానం దాదాపు 14 వేల అడుగుల మేర అత్యంత వేగంగా కిందకు దిగిపోయిందని చెప్పారు. ఈ సమయంలో ప్రయాణికులు, సిబ్బంది కాక్‌పిట్‌లోకి వెళ్లి కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అనంతరం విమానంలో ఉన్న మరో జంట ఫ్లైదుబాయ్ పైలట్లు బాధ్యతలు చేపట్టి విమానాన్ని సౌదీ అరేబియాలోని టబుక్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. రక్తస్రావంతో నేలపై పడిపోయిన స్మిట్ మచ్చార్ తన మిగిలిన శక్తినంతా ఉపయోగించి కాక్‌పిట్ తలుపు తెరిచారు. లోపలికి వెళ్లిన ప్రయాణికులు కో-పైలట్ కంట్రోల్ ప్యానెల్‌పై దాడి చేస్తున్నట్లు చూశారని అధికారులు వివరించారు.హైజాకింగ్? లేదంటే..ఇక్కడే అసలు మిస్టరీ కొనసాగుతోంది. నెతన్యాహు ప్రకారం ఇది సాధారణ హైజాకింగ్ ఘటనలా కనిపించడం లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కో-పైలట్ విమానం నడపడానికి ప్రయత్నించకుండా కంట్రోల్ ప్యానెల్‌ను దెబ్బ తీసే ప్రయత్నం చేశాడట. ఓ ప్రయాణికుడు ఇచ్చిన వాంగ్మూలాన్నే నెతన్యాహు ప్రస్తావించారు. అందువల్ల ఇది ఆత్మహత్యా ప్రయత్నం కావొచ్చనే అభిప్రాయమూ వ్యక్తం చేశారాయన. తనిఖీలు ముమ్మరంఈ ఘటన తర్వాత ఇజ్రాయెల్ భద్రతా అధికారులు విదేశీ విమానాల పైలట్లపై తనిఖీలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించారు. ఇజ్రాయెల్‌కు వచ్చే విమానాల పైలట్ల గుర్తింపును ముందుగానే తెలుసుకుని, భద్రతా ప్రక్రియలను మరింత పటిష్టం చేయనున్నట్లు ప్రధాని కార్యాలయ ప్రతినిధి తెలిపారు. మరోవైపు ఈ ఘటన నేపథ్యంతో.. ఇజ్రాయెల్‌కు అన్ని సర్వీసులను ఫ్లైదుబాయ్ రద్దు చేసింది.అలా.. కో-పైలట్ ఎవరు? ఎందుకు స్మిట్ మచ్చార్‌పై దాడి చేశాడు? విమానాన్ని నిజంగానే కూల్చాలనుకున్నాడా? ఉగ్రవాద కోణముందా? పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌తో ఏమైనా సంబంధముందా? అన్న ప్రశ్నలకు ఇంకా పూర్తిస్థాయి సమాధానాలు రావాల్సి ఉంది. 🚨✈️ TERROR EN EL AIRE El vuelo Flydubai FZ1073 (Dubái–Tel Aviv) con 180 pasajeros, entre ellos unos 30 niños. El copiloto @puñ@l0 al capitán en cabina, pasajeros israelíes y tripulación consiguieron entrar, reducir al copiloto y estabilizar el avión#Internacional pic.twitter.com/fKUM3oHdmh— Crónica NLD (@CronicasLDN) September 30, 2026ఇదీ చదవండి: నువ్వు రియల్ హీరో బ్రో.. భారత పైలట్‌పై ప్రశంసల జల్లు -
‘హ్యాట్సాఫ్ రియల్ హీరో..’ భారత పైలట్‌పై ట్రంప్, నెతన్యాహు ప్రశంసలు
విమానం గాల్లో ఉంది.. ఒక్కసారిగా కాక్‌పిట్‌లో కలకలం. కో-పైలట్ కత్తితో కెప్టెన్‌పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడినప్పటికీ ఆ భారత పైలట్ వెనక్కి తగ్గలేదు. కాక్‌పిట్ తలుపు తెరిచి బయటకు వచ్చి సంకేతం ఇచ్చాడు. ప్రయాణికులు, ఇతర సిబ్బంది వెంటనే స్పందించడంతో పెను విమాన ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత పైలట్ స్మిట్మచ్చర్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రశంసలు కురిపించారు.ఫ్లైదుబాయ్ విమానం FZ1073లో జరిగిన ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ‘‘భారత పైలట్ కెప్టెన్ స్మిట్ మచ్చర్ అసాధారణ ధైర్యానికి నా సెల్యూట్’’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడినప్పటికీ మచ్చర్ ప్రతిఘటించి కాక్‌పిట్ తలుపు తెరిచారని తెలిపారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోగలిగారని పేర్కొన్నారు. ఈ చర్య పెను విమాన ప్రమాదాన్ని నివారించిందని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్మిట్ మచ్చర్‌ను ‘హీరో’గా అభివర్ణించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తనకు చెప్పిన వివరాలను మీడియాతో పంచుకున్న ట్రంప్.. తీవ్రంగా గాయపడినప్పటికీ పైలట్ చేసిన చర్యను అద్భుతమైనదిగా పేర్కొన్నారు.30 సెకన్లలో 14 వేల అడుగులు కిందకు!భారత కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం దుబాయ్-టెల్అవీవ్ మధ్య ప్రయాణిస్తున్న బోయింగ్ 737 MAX 8 విమానం పైలట్, కో-పైలట్ మధ్య కాక్‌పిట్‌లో ఘర్షణతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో కో-పైలట్ కెప్టెన్ మచ్చర్‌పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. అనంతరం విమానం ఒక్కసారిగా ఎత్తు కోల్పోయింది. ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం కేవలం 30 సెకన్లలో దాదాపు 14 వేల అడుగుల మేర కిందికి పడిపోయింది.విమానంలోని ప్రయాణికులకు పరిస్థితి అర్థమయ్యేలోపే కాక్‌పిట్ నుంచి అరుపులు వినిపించాయి. ఇదే సమయంలో గాయపడిన కెప్టెన్ మచ్చర్ కాక్‌పిట్ తలుపు తెరిచారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లే అవకాశం ఏర్పడింది.‘‘విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడు’’ఈ దాడికి సంబంధించి సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. కో-పైలట్ విమానం వ్యవస్థలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రయాణికుడు యానివ్ తెలిపిన వివరాల ప్రకారం.. మచ్చర్ కాక్‌పిట్ తలుపు తెరిచి కుప్పకూలిన తర్వాత ప్రయాణికులు లోపలికి వెళ్లి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానంలో ఉన్న మరో సెట్ పైలట్లు కాక్‌పిట్‌లోకి చేరుకుని విమానాన్ని కంట్రోల్ చేయగలిగారు. అటు నుంచి సౌదీ అరేబియాలోని టబుక్‌కు మళ్లించారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.ఎవరీ స్మిట్మచ్చర్?స్మిట్ మచ్చర్ భారత పౌరుడు. బోయింగ్ 737 విమానాలపై ఆయనకు 13 ఏళ్లకు పైగా వాణిజ్య విమానయాన అనుభవం ఉంది. సుమారు 9,750 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉన్నట్లు ఆయన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆధారంగా వివరాలు వెల్లడయ్యాయి. 2011లో స్పైస్‌జెట్‌లో చేరిన మచ్చర్.. అక్కడ లైన్ ట్రైనింగ్ కెప్టెన్, సీనియర్ కమాండర్‌గా పనిచేశారు. 2022 జూన్‌లో స్పైస్‌జెట్‌ను వీడి ఫ్లై దుబాయ్‌లో డైరెక్ట్ ఎంట్రీ కెప్టెన్‌గా చేరారు. ఆయన సోదరుడు కూడా ఇటీవల ఫ్లై దుబాయ్‌లో చేరినట్లు సమాచారం.ఆసుపత్రిలో చికిత్స.. పరిస్థితి నిలకడగాకాక్పిట్ ఘటనలో తీవ్రంగా గాయపడిన మచ్చర్‌ను సౌదీ అరేబియాలోని టబుక్ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు చికిత్స కొనసాగుతోంది. భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్ ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులతోనూ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.‘‘180 మంది ప్రాణాలు కాపాడారు’’ఇజ్రాయెల్ అంబాసిడర్ రూవెన్ అజార్ కూడా మచ్చర్‌ను ప్రశంసించారు. అనుభవజ్ఞుడైన, ప్రతిభావంతుడైన భారత పైలట్‌గా అభివర్ణించారు. మచ్చర్‌తో పాటు ప్రయాణికులు, సిబ్బంది చూపిన ధైర్యం 180 మంది ప్రాణాలను కాపాడిందని పేర్కొన్నారు.విమానం టబుక్‌లో సురక్షితంగా దిగిన తర్వాత ప్రయాణికులు సుమారు ఎనిమిది గంటలు సౌదీ అరేబియాలో ఉన్నారు. అనంతరం ప్రత్యామ్నాయ ఫ్లై దుబాయ్ విమానంలో ఇజ్రాయెల్‌కు బయలుదేరారు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడినా.. విమానాన్ని కాపాడేందుకు చివరి వరకు పోరాడిన భారత పైలట్ స్మిట్మచ్చర్ ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటున్నారు.ఇదీ చదవండి: యూఏఈలో వాహనదారులకు షాక్ -
అమాంతం వేల అడుగుల కిందకు.. దుబాయ్–టెల్అవీవ్ విమానంలో కలకలం
సాక్షి, న్యూఢిల్లీ: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంతో తాజాగా జరిగిన ఓ పరిణామం తీవ్ర కలకలం రేపింది. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో అత్యవసర పరిస్థితి నెలకొంది. విమానం తొలుత ఎమర్జెన్సీ కోడ్ పంపింది. కొద్దిసేపటికే హైజాక్ కోడ్ పంపడంతో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఫ్లై దుబాయ్ విమానంలో జరిగిన ఘటన ఉగ్రవాద చర్యేనన్న అంశంపై ఇజ్రాయెల్ భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఒమన్‌కు చెందిన సహ పైలట్ విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించినట్లు అనుమానిస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ప్రధాన పైలట్ సిబ్బంది, కొంతమంది ఇజ్రాయెల్ ప్రయాణికుల సాయంతో అక్కడి పరిస్థితులను తమ అధీనంలోకి తీసుకున్నట్లు ఇజ్రాయెల్ భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఘటనపై సౌదీ అరేబియాలో జరుగుతున్న దర్యాప్తులో ఇజ్రాయెల్ అధికారులు కూడా పాల్గొంటున్నారు. ఫ్లై దుబాయ్‌కి చెందిన ఎఫ్‌జెడ్ 1073 విమానం బుధవారం దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయానికి బయలుదేరింది. విమానంలో 174 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో 27 మంది చిన్నారులు ఉన్నారు. ప్రయాణంలో భాగంగా విమానం అకస్మాత్తుగా భారీగా కిందికి దిగింది. సుమారు 34,000 అడుగుల ఎత్తు నుంచి కొద్ది సమయంలోనే 14,000 అడుగులకు పడిపోయింది. ఒక దశలో నిమిషానికి 30,976 అడుగుల వేగంతో కిందికి దిగినట్లు విమాన పర్యవేక్షణ వివరాలు చూపించాయి.జోర్డాన్ గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత విమానం మొదట అత్యవసర పరిస్థితిని సూచించే 7700 సంకేతాన్ని ప్రసారం చేసింది. అనంతరం విమానాన్ని హైజాక్ చేసినట్లు సూచించే 7500 సంకేతాన్ని పంపింది. దీంతో ఇజ్రాయెల్‌లో భద్రతా వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. వైమానిక దళానికి చెందిన 2 యుద్ధ విమానాలను కూడా గాల్లోకి పంపించారు.కాక్‌పిట్‌లో భారీగా రక్తం విమానం తర్వాత సౌదీ అరేబియా వైపు మళ్లీ, తక్కువ ఎత్తులో ప్రయాణించింది. చివరకు తబూక్ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. ప్రయాణికుల కథనాల ప్రకారం కాక్‌పిట్‌లో భారీగా రక్తం కనిపించింది. దుబాయ్‌కు చెందిన విమానయాన సంస్థ కూడా విమానంలో హింసాత్మక ఘటన జరిగినట్లు ధ్రువీకరించింది.విమానంలో ఉన్న మిరియం అనే ప్రయాణికురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కాక్‌పిట్ నుంచి అరుపులు వినిపించాయని, అక్కడికి వెళ్లినప్పుడు భారీగా రక్తం కనిపించిందని చెప్పారు. ఒక వ్యక్తి పైలట్‌ను చిన్న కత్తితో పొడిచినట్లు ఆమె పేర్కొన్నారు. “విమానం కూలిపోతుందని అనిపించింది. నేను ‘షెమా ఇజ్రాయెల్’ అని అరిచాను” అని ఆమె చెప్పింది. వైద్యుడు, నర్సు పైలట్‌కు ప్రాథమిక చికిత్స అందించారని, ఇజ్రాయెల్ ప్రయాణికులు సిబ్బందితో కలిసి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని ఆమె వివరించారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్రయాణికులను సౌదీ అరేబియా నుంచి తిరిగి తీసుకురావడానికి సైనిక విమానాలను పంపాలని ఆదేశించారు. ఈ ఘటన ఉగ్రవాద చర్యగా నిర్ధారణ అవుతుందా, విమానంలో అసలు ఏం జరిగిందనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. 🚨✈️🇦🇪🇮🇱 Un vol Flydubai reliant Dubaï à Tel-Aviv a déclenché le code d’urgence signalant un possible détournement alors qu’il transportait environ 180 passagers.L’appareil a été dérouté vers l’Arabie saoudite. pic.twitter.com/JCAcaidYT0— KRONIK Insights (@KRONIKInsights) September 30, 2026పైలట్ల మధ్య గొడవ?విమానంలో ఏం జరిగిందన్న దానిపై ప్రాథమికంగా భిన్న కథనాలు వెలువడ్డాయి. కాక్‌పిట్‌లో ఇద్దరు పైలట్ల మధ్య భౌతికంగా గొడవ జరిగినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఈ ఘటన నేపథ్యంలోనే.. నొక్కుకుపోయి ఎమర్జెన్సీ సిగ్నల్ పంపినట్లు సమాచారం. 7500 కోడ్ సాధారణంగా హైజాక్ సమయంలో ఉపయోగిస్తారు. అందుకే ఇజ్రాయెల్ అధికారులు తొలుత అప్రమత్తమయ్యారు. అయితే అసలు విమానంలో ఏం జరిగిందన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.UPDATE: The plane has landed safely in Saudi Arabia. The assessment in Israel is that the emergency signal on the plane was activated during a violent altercation between the pilots in the cockpit, and not due to a highjacking. https://t.co/Cz2W33I5qO— Ariel Oseran أريئل أوسيران (@ariel_oseran) September 30, 2026ఇదీ చదవండి: ఇండియన్ సినిమాలు.. ఓ ఆటాడుకుంటున్న ఇరాన్! -
సుందర్.. ఈయనో రాక్షసుడు! ఎవరికీ తెలియదు: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మధ్య వైట్‌హౌస్ వద్ద జరిగిన సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టెక్ దిగ్గజాలతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ట్రంప్.. పిచాయ్‌ను ఉద్దేశించి “ఈయనో మాన్స్టర్.. కానీ ఎవరికీ తెలియదు” అంటూ వ్యాఖ్యానించారు. దీనికి సుందర్ పిచాయ్ కూడా ఒక్క నవ్వు నవ్వి బదులిచ్చారు.వైట్‌హౌస్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ట్రంప్.. పిచాయ్‌ను పిలిచి “సుందర్.. ఏమైనా చెబుతావా?” అని అడిగారు. పిచాయ్ “ముందుగా థ్యాంక్స్...” అని చెప్పబోతుండగానే ట్రంప్ ఆయనకు అడ్డుపడ్డారు. “వీళ్లెవరో మీకు అసలు తెలియదు. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన వ్యక్తులు వీళ్లు. ఈయన (సుందర్ పిచాయ్) ఓ మాన్స్టర్(రాక్షసుడు).. కానీ ఎవరికీ ఈ విషయం తెలియదు” అని ట్రంప్ అన్నారు. అంతేకాదు.. ఇలాంటి టెక్ దిగ్గజాలకు ప్రతిరోజూ మీడియాతో మాట్లాడాల్సిన అవసరం లేకపోవడం ఎంత మంచి జీవితమో అంటూ వ్యాఖ్యానించారు.“మీకు గుర్తుండాల్సిన పేరు ఒక్కటే.. సుందర్” అని పిచాయ్‌ను ఉద్దేశించి ట్రంప్ అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలకు పిచాయ్ అలా ఒక నవ్వు నవ్వి సరదాగా స్పందించారు. “నేను మాన్స్టర్ని అన్నదానికంటే ఇది మంచి ట్యాగ్‌లైన్ అవుతుందని ఆశిస్తున్నా” అంటూ అక్కడ నవ్వులు పూయించారు.Trump: This guy (Sundar Pichai) is a monster, and nobody knows him. What a great life! To be a Monster and not have to go through this. All you have to know is — sundarr! Sundar is his name. pic.twitter.com/smlS58lQdW https://t.co/1swuCa4RYT— Nicholas Mugalli (@RealNickMugalli) September 29, 2026ట్రంప్ భేటీ సారాంశం ఏంటంటే..వైట్‌హౌస్‌లో ట్రంప్.. సుందర్ పిచాయ్‌తో పాటు మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, ఆంత్రోపిక్ సీఈవో డారియో అమోడీ, ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్, ఓపెన్ఏఐ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్‌మన్ తదితర టెక్ రంగ ప్రముఖులతో సమావేశమయ్యారు. అధునాతన ఏఐ వ్యవస్థల భద్రత, కంపెనీల అంతర్గత నియంత్రణలు, ప్రమాదాల పర్యవేక్షణ తదితర అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా ‘వైట్‌హౌస్ అకార్డ్ ఆన్ సూపర్ ఇంటెలిజెన్స్’ పేరుతో స్వచ్ఛంద ఒప్పందాన్ని ప్రకటించారు. ఇందులో ఏఐ మోడళ్లపై అంతర్గత రిస్క్ సమీక్షలు, స్వతంత్ర ఆడిట్లు, కంపెనీ బోర్డుల పర్యవేక్షణ వంటి చర్యలు ఉన్నాయి. ఇది ప్రభుత్వ చట్టబద్ధ నియంత్రణ కాకుండా కంపెనీలు స్వచ్ఛందంగా పాటించే భద్రతా ప్రమాణాల ఒప్పందం.అమోడీకి ట్రంప్ వార్నింగ్?సమావేశంలో ఆంత్రోపిక్ సీఈవో డారియో అమోడీ(Dario Amodei)తోనూ ట్రంప్ సరదాగా మాట్లాడారు. అమోడీని తన పక్కకు పిలిచిన ట్రంప్.. “ఆయన ఓకే అని మాత్రమే చెప్పారు” అంటూ వ్యాఖ్యానించి, వెంటనే “బీ కేర్‌ఫుల్” అని హెచ్చరించినట్లు నవ్వుతూ చెప్పారు.అధునాతన ఏఐ వల్ల మానవాళికి ప్రమాదాలు ఉండొచ్చని అమోడీ గతంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ట్రంప్ ఈ సరదా వ్యాఖ్య చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అమోడీ కూడా నవ్వుతూ.. ఏఐ రేసులో అమెరికా ముందుండాల్సిన అవసరం ఉందని, అదే సమయంలో టెక్నాలజీని సురక్షితంగా అభివృద్ధి చేసేందుకు అందరూ కలిసి పనిచేయాలని చెప్పారు.‘సూపర్ ఇంటెలిజెన్స్’పై పిచాయ్ ఏమన్నారంటే..ఏఐకి సూపర్ ఇంటెలిజెన్స్‌గా ట్రంప్ నామకరణం చేసిన సంగతి తెలిసిందే. సమావేశం అనంతరం పిచాయ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ట్రంప్, ఇతర టెక్ నాయకులతో ముఖ్యమైన చర్చ జరిగిందని, వైట్‌హౌస్ అకార్డ్ ఆన్ సూపర్ ఇంటెలిజెన్స్‌పై సంతకం చేసినట్లు తెలిపారు. ఏఐ అభివృద్ధిలో తగిన పరీక్షలు, మూల్యాంకనాలు, రెడ్ టీమింగ్, దుర్వినియోగం నివారణకు భద్రతా చర్యలను కొనసాగిస్తామని చెప్పారు. ఈ రంగంలో ఆవిష్కరణలు కొనసాగిస్తూనే బాధ్యతాయుతమైన అభివృద్ధి, భద్రతా ప్రమాణాల విషయంలో ఇతర సంస్థలతో కలిసి పనిచేస్తామని పిచాయ్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఏఐకి కొత్త పేరు పెట్టిన ట్రంప్ -
కాగితపు పులిలా ఐరాస!.. షోలే మీమ్‌తో ఇరాన్ పంచ్!
భారతీయ సినిమాలతో ఇరాన్ చేస్తున్న ‘మీమ్ డిప్లమసీ’ ఇప్పుడు మరో లెవల్‌కు చేరింది. మొన్న బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’.. నిన్న ప్రభాస్ ‘బాహుబలి’.. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ క్లాసిక్ ‘షోలే’లోని థాకూర్ బల్దేవ్ సింగ్‌ను రంగంలోకి దించింది. ఈసారి ఇరాన్ టార్గెట్ అమెరికా కాదు.. ఐక్యరాజ్యసమితి (ఐరాస). యుద్ధాలు, అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో ఐరాస సమర్థంగా డీల్ చేయలేకపోతోందంటూ తన అభిప్రాయాన్ని ఓ వ్యంగ్య మీమ్ ద్వారా చెప్పింది. భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఎక్స్‌లో ఓ మీమ్‌ను పోస్టు చేసింది. అందులో రెండు ఫొటోలను పక్కపక్కన పెట్టింది. మొదటి ఫొటోలో మార్వెల్ సూపర్‌హీరో డాక్టర్ స్ట్రేంజ్‌ను పలు చేతులతో చూపించింది. దానిపై స్కూల్ పుస్తకాల ప్రకారం ఐక్యరాజ్య సమితి అని రాసింది. అంటే పుస్తకాల్లో ఐరాసకు ప్రపంచ సమస్యలను పరిష్కరించేంత శక్తి, అనేక మార్గాల్లో పనిచేసే సామర్థ్యం ఉన్నట్లు చూపిస్తున్నారనే కోణం. అదే పక్కన ‘షోలే’లోని థాకూర్ బల్దేవ్ సింగ్ ఫొటోను పెట్టింది. షోలే చిత్రంలో గబ్బర్ చేతిలో చేతులు కోల్పోయిన థాకూర్ పాత్ర కింద యూఎన్ ఇన్ రియాలిటీ అని క్యాప్షన్ ఇచ్చింది. అంటే వాస్తవ పరిస్థితుల్లో పెద్ద అంతర్జాతీయ సంక్షోభాలపై చర్య తీసుకునే విషయంలో ఐరాస ‘చేతులు కట్టేసిన’ సంస్థలా ఉందన్నది ఇరాన్ వ్యంగ్య సందేశం. UN according to school booksUN in reality pic.twitter.com/GQ4gOG8fC0— Iran in India (@Iran_in_India) September 29, 2026ఆరాఘ్చీ విమర్శల వేళ..ఈ మీమ్ రావడానికి ముందు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరాఘ్చీ ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌తో సమావేశమయ్యారు. అమెరికా, ఇజ్రాయెల్ చర్యలపై ఐరాస తగినంతగా స్పందించడం లేదని అరాఘ్చీ విమర్శించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. యూఎన్ చార్టర్, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనల విషయంలో ప్రపంచ సంస్థ మౌనం వహించకూడదని, అమెరికా నుంచి వస్తున్నాయని ఇరాన్ పేర్కొంటున్న బెదిరింపులను ఐరాస స్పష్టంగా ఖండించాలని ఆయన కోరినట్లు సమాచారం. అయితే తాజా మీమ్‌లో ఇరాన్ ఏదైనా నిర్దిష్ట ఐరాస తీర్మానం లేదంటే ఒక్క ఘటనను నేరుగా ప్రస్తావించలేదు. ప్రపంచ సంక్షోభాల సమయంలో ఐరాసకు ఉన్న అధికారిక పాత్రకు, ఆచరణలో అది చూపగల ప్రభావానికి మధ్య వ్యత్యాసం ఉందన్న తన విమర్శను మాత్రమే మీమ్ రూపంలో వ్యక్తం చేసింది. భారతీయ సినిమాలే ఎందుకు?ఇరాన్ దౌత్య కార్యాలయాలు భారతీయ సినిమాలను తమ డిజిటల్ ప్రచారంలో ఉపయోగించడం ఇటీవల వరుసగా కనిపిస్తోంది. సెప్టెంబర్ 27న హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ యుద్ధ సన్నివేశాన్ని పోస్టు చేసింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఐరాస ప్రసంగంలో ‘తలవంచబోం’ అన్న సందేశాన్ని బాహుబలి పోరాటంతో పోల్చింది. అంతకుముందు బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ సన్నివేశాన్ని.. ట్రంప్‌పై సెటైరిక్‌గా ఇరాన్ దౌత్య వర్గాలు ఉపయోగించాయి. ఇప్పుడు ‘షోలే’లోని థాకూర్ పాత్రతో ఐరాసపై సెటైర్ చేయడం ద్వారా భారతీయ పాప్ కల్చర్‌ను మరోసారి తన అంతర్జాతీయ సందేశానికి వాడుకుంది.మీమ్ డిప్లమసీకి కొత్త రూపంసాధారణంగా దేశాలు అంతర్జాతీయ వివాదాలపై ప్రకటనలు, ప్రెస్నోట్లు, అధికారిక ప్రసంగాల ద్వారా తమ వైఖరిని వెల్లడిస్తాయి. ఇరాన్ మాత్రం సోషల్ మీడియాలో మీమ్స్, సినిమాల సన్నివేశాలు, వ్యంగ్య వీడియోలను ఉపయోగిస్తూ తన సందేశాన్ని ప్రజలకు చేరువ చేస్తోంది. ఇటువంటి పోస్టులు క్లిష్టమైన భౌగోళిక రాజకీయ అంశాలను సులభమైన, వెంటనే అర్థమయ్యే విజువల్స్‌గా మార్చుతున్నాయి. ఇదీ చదవండి: ట్రంప్ సంచలన నిర్ణయంతో కొత్త చర్చ! -
కరాచీ టీంను బికారీలుగా మార్చిన బలూచ్‌లు!
మార్గమధ్యలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ముందే హెచ్చరించారు. కానీ అత్యుత్సాహంతో ఆ సూచనను పట్టించుకోలేదు. తీరా హైవేపైకి చేరుకున్నాక ఊహించని షాక్ ఎదురైంది. ప్రాణభయంతో వణికిపోతూ.. ‘బతుకు జీవుడా’ అంటూ ఎలాగోలా బయటపడ్డారు. చివరికి గమ్యస్థానానికి చేరేసరికి చేతిలో డబ్బుల్లేవు.. ఫోన్లూ లేవు.. దాదాపు బికారీలుగా మిగిలిపోయారు!పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ హైవేపై కరాచీ ఫుట్‌బాల్ జట్టుకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. క్వెట్టాలో జరగనున్న చీఫ్ మినిస్టర్స్ గోల్డ్ కప్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు వెళ్తున్న కరాచీ డిస్ట్రిక్ట్ వెస్ట్ ఫుట్‌బాల్ టీమ్ బస్సును బలూచ్ సాయుధులు అడ్డగించారు. ఆటగాళ్లను తుపాకులతో బెదిరించి బస్సు నుంచి కిందకు దింపి.. నగదు, మొబైల్ ఫోన్లు, విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం మస్తుంగ్–సారియాబ్ మధ్య చోటుచేసుకుంది.సుమారు 12 మంది సాయుధులు బస్సును అడ్డగించినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. బస్సులో ఉన్న వారందరినీ కిందకు దిగాలని ఆదేశించిన దుండగులు.. ఒక్కొక్కరి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లు, నగదు, ఇతర విలువైన వస్తువులను తీసుకున్నారు. కొందరు ప్రయాణికులను తుపాకుల మడమలతో కొట్టినట్లు టీమ్ మేనేజర్ జుల్ఫికార్ అలీ భుట్టో తెలిపారు. దోపిడీ తర్వాత బస్సును వదిలేయడంతో జట్టు క్వెట్టాకు చేరుకుంది. అయితే అప్పటికే ఆటగాళ్ల వద్ద కనీస ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా పోయాయి. విషయం తెలుసుకున్న బలూచిస్థాన్ క్రీడల మంత్రి.. ఆటగాళ్లకు రోజువారీ ఖర్చుల కోసం డబ్బులు అందేలా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.ముందే హెచ్చరించారు.. అయినా వెళ్లారు!అసలు ట్విస్ట్ ఇక్కడే. క్వెట్టాకు రోడ్డు, రైలు మార్గంలో వెళ్లొద్దని ఫుట్‌బాల్ అధికారులు ముందే హెచ్చరించినట్లు సింధ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి మహమ్మద్ అజమ్ తెలిపారు. భద్రతా పరిస్థితుల దృష్ట్యా సింధ్ జట్టును కూడా టోర్నమెంట్‌కు పంపలేదని చెప్పారు. కరాచీలోని ఇతర క్లబ్‌లకు కూడా బస్సు, రైలు మార్గాల్లో క్వెట్టాకు వెళ్లొద్దని సూచించినట్లు వెల్లడించారు. అయితే కరాచీ డిస్ట్రిక్ట్ వెస్ట్ జట్టు మాత్రం క్వెట్టాకు బయలుదేరింది. చివరకు తాము భయపడిన ఘటననే ఎదుర్కోవాల్సి వచ్చిందని అజమ్ పేర్కొన్నారు. పంజాబ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఫుట్‌బాల్ సంఘాలు కూడా తమ జట్లను ఈ టోర్నమెంట్‌కు పంపలేదని తెలిపారు.A Karachi football team travelling to Quetta for the Chief Minister’s Gold Cup tournament was robbed at gunpoint by armed men on a highway in Balochistan. The attackers stopped the team’s bus between Mastung and Sariab, forced passengers off and took their phones, cash and other… pic.twitter.com/X3RKENEwZL— Firstpost (@firstpost) September 29, 2026హైవేపై వరుస ఘటనలుబలూచిస్థాన్లోని హైవేలపై భద్రతా పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో ఈ ఘటన మరోసారి బయటపెట్టింది. మస్తుంగ్–క్వెట్టా మార్గం సాయుధ గ్రూపుల కార్యకలాపాలకు సున్నిత ప్రాంతంగా మారిందని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. ఫుట్‌బాల్ జట్టుపై దాడికి కొద్దిరోజుల ముందే డేరా బుగ్టీలో ఇద్దరు స్థానిక క్రికెటర్లను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు వార్తలు వచ్చాయి.ఇదే సమయంలో కలాట్ సమీపంలోని చమన్–కరాచీ ఎన్-25 హైవేపై సెప్టెంబర్ 18–19 రాత్రి భద్రతా దళాలు జరిపిన ఆపరేషన్‌లో 23 మంది అపహృతులను విడిపించామని పాకిస్థాన్ సైన్యం తెలిపింది. ఐదుగురు మిలిటెంట్లు హతమైనట్లు ప్రకటించింది. అక్కడి సాయుధులు ప్రయాణికులను కిడ్నాప్ చేసి విముక్తి రుసుము వసూలు చేయడం, వాహనాలను దోచుకోవడం కోసం చెక్‌పోస్టు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారని సైన్యం పేర్కొంది.దోపిడీలతో మిలిటెంట్ కార్యకలాపాలకు నిధులు?హైవేలపై దోపిడీలు, అక్రమ వసూళ్లు, కిడ్నాప్‌లు బలూచిస్థాన్‌లో భద్రతా సమస్యగా మారాయి. ఈ తరహా నేరాల ద్వారా మిలిటెంట్ కార్యకలాపాలకు నిధులు సమకూరుతున్నాయని బలూచిస్థాన్ హోం మంత్రి జియావుల్లా లాంగోవే సెప్టెంబర్‌లో క్వెట్టాలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆరోపించారు. తాజా ఘటనతో క్వెట్టా వెళ్లే మార్గాల్లో భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ రోడ్డు మార్గంలో వెళ్లిన కరాచీ ఫుట్‌బాల్ జట్టు.. చివరకు తుపాకుల మధ్య దోపిడీకి గురికావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: బంగ్లాకు పాక్‌తో కొత్త తిప్పలు -
ఏఐపై ట్రంప్ సంచలన నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అమెరికా ప్రభుత్వ అధికారిక వ్యవహారాల్లో ‘కృత్రిమ మేధ’(అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ) అనే పదానికి బదులుగా ‘సూపర్ ఇంటెలిజెన్స్’ అనే పదాన్ని ఉపయోగించాలని ఆదేశించారు. ఈ మేరకు సెప్టెంబర్ 29న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు. ‘కృత్రిమ’ అనే పదం ఈ సాంకేతికత సామర్థ్యాన్ని సరిగ్గా ప్రతిబింబించడం లేదని ట్రంప్ అభిప్రాయపడ్డారు.ఈ నిర్ణయానికి ముందు శ్వేతసౌధంలో ప్రపంచంలోని ప్రముఖ సాంకేతిక సంస్థల అధిపతులతో ట్రంప్ సమావేశమయ్యారు. మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్, ఎన్విడియా అధినేత జెన్సన్ హువాంగ్, ఆంథ్రోపిక్ అధినేత డారియో అమోడెయి, ఓపెన్ఏఐ అధ్యక్షుడు గ్రెగ్ బ్రాక్‌మన్, మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల, గూగుల్ అధినేత సుందర్ పిచాయ్, ఎలాన్ మస్క్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. అత్యాధునిక సాంకేతికత అభివృద్ధి, భద్రత, భవిష్యత్ నియంత్రణలపై ఈ సమావేశంలో చర్చించారు.🇺🇸 Rarely has there been a White House table like this one. Elon on Trump's left, Jensen Huang on his right, with Zuckerberg, Pichai, Bezos and other AI builders around them.Trump's message was simple: "We have a very big lead, and we're gonna keep our lead."He called AI…— Edison (@Edison_TechAI) September 29, 2026కంపెనీలే భద్రత చూసుకోవాలిసమావేశం అనంతరం ట్రంప్, టెక్ సంస్థల అధినేతలు ఒక స్వచ్ఛంద భద్రతా ఒప్పందాన్ని ప్రకటించారు. దీనిని ట్రంప్ ‘నైతికంగా కట్టుబడి ఉండే ఒప్పందం’గా అభివర్ణించారు. దీని ప్రకారం సంస్థలు తమ సాంకేతిక వ్యవస్థలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలి. అంతర్గత నియంత్రణలు ఏర్పాటు చేసుకోవడంతోపాటు స్వతంత్ర, బాహ్య సంస్థలతో భద్రతా తనిఖీలు చేయించుకోవాలి. సంస్థల పాలక మండళ్లు కూడా ఈ వ్యవస్థల భద్రతను పర్యవేక్షించాల్సి ఉంటుంది.ఇది చట్టం కాదు.. స్వచ్ఛంద ఒప్పందమేటెక్ సంస్థలు అంగీకరించిన ఈ పత్రానికి ప్రస్తుతం చట్టబద్ధమైన అమలు బలం లేదు. అంటే నిబంధనలు పాటించకపోతే వెంటనే శిక్షించే విధానం ఇందులో లేదు. అయితే సైబర్ భద్రత, జీవ భద్రత, రసాయన సంబంధిత ప్రమాదాలు వంటి అంశాల్లో ప్రమాదాలను గుర్తించి నియంత్రించేందుకు సంస్థలు చర్యలు తీసుకోవాలని ఒప్పందం సూచిస్తోంది. భవిష్యత్తులో అవసరమైతే వీటిలో కొన్ని అంశాలను చట్టాలుగా మార్చే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు.US President Donald Trump, Meta CEO Mark Zuckerberg, Google CEO Sunder Pichai, Elon Musk and other tech giants brief media after meeting on Super Intelligence pic.twitter.com/dcLpatwSxl— ANI (@ANI) September 29, 2026ప్రభుత్వ నియంత్రణ వద్దు.. కృత్రిమ మేధ రంగంపై కొత్తగా కఠినమైన సమాఖ్య నిబంధనలు తీసుకురావడం కంటే కంపెనీలే తమను తాము పర్యవేక్షించుకోవాలన్న వైఖరిని ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఉన్న చట్టాలు, ప్రభుత్వ సంస్థల ద్వారా అవసరమైన చర్యలు తీసుకోవచ్చని ఆయన అన్నారు. అమెరికా సాంకేతిక రంగంలో చైనా కంటే ముందంజలో ఉండాలంటే అభివృద్ధిపై అధిక నియంత్రణలు విధించడం సరికాదన్నది ట్రంప్ వైఖరి.డేటా కేంద్రాలకు భారీ ప్రోత్సాహంఅత్యాధునిక సాంకేతికత అభివృద్ధికి భారీ కంప్యూటింగ్ సామర్థ్యం అవసరం. ఇందుకోసం డేటా కేంద్రాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ట్రంప్ కోరుతున్నారు. అయితే ఈ కేంద్రాలు పెద్ద మొత్తంలో విద్యుత్‌ను వినియోగిస్తాయి. దీంతో విద్యుత్ డిమాండ్ పెరగడం, స్థానిక మౌలిక వసతులపై ఒత్తిడి రావడం, ప్రజలకు విద్యుత్ ఖర్చులు పెరిగే అవకాశం ఉండటంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. డేటా కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రాంతాలకు టెక్ సంస్థలు ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని ట్రంప్ సూచించారు.పది మందితో ప్రత్యేక కమిటీ?సూపర్ ఇంటెలిజెన్స్ రంగాన్ని పర్యవేక్షించేందుకు దాదాపు పది మందితో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ట్రంప్ తెలిపారు. అయితే ఆ కమిటీలో ఎవరుంటారు? దానికి ఎలాంటి అధికారాలు ఉంటాయి? అన్న దానిపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు. అమెరికా సాంకేతిక ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ఈ రంగంలో వేగంగా అభివృద్ధి అవసరమని ట్రంప్ చెబుతున్నారు.భద్రతపై మాత్రం ఆందోళనలుఅత్యాధునిక సాంకేతిక వ్యవస్థలు కొన్ని సందర్భాల్లో వాటికి నిర్దేశించిన పరిమితులను దాటి పనిచేసే అవకాశం ఉందన్న ఆందోళనలు ఇప్పటికే ఉన్నాయి. సైబర్ దాడులు, జీవ భద్రత, రసాయన ప్రమాదాలు వంటి అంశాల్లో ఈ సాంకేతికతను దుర్వినియోగం చేసే అవకాశాలపై నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో అమెరికా ఇప్పుడు అభివృద్ధి వేగాన్ని పెంచడంతోపాటు భద్రతా నియంత్రణలను ఎలా బలోపేతం చేయాలి అన్న సవాల్‌ను ఎదుర్కొంటోంది.ఇదీ చదవండి: మొరాకోకు తొలి మహిళా ప్రధాని! ఈ ఫాతిమా ఎవరంటే.. -
రష్యాకు సాయంగా రంగంలోకి ‘కాలకేయ సేన’
రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఇతర దేశాల పౌరులు, సైనికుల మోహరింపుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. రష్యా వివిధ దేశాలకు చెందిన పౌరులను యుద్ధంలోకి లాగుతోందని ఇటీవల ఐక్యరాజ్యసమితి వేదికగా ఆయన పేర్కొన్నారు. ఇందులో భారత్ సహా పలు దేశాల పేర్లను ప్రస్తావించారు. ఇదే సమయంలో.. రష్యాకు ఉత్తర కొరియా సైనికుల తరలింపు కూడా ఇంకా కొనసాగుతోందని తాజాగా జెలెన్స్కీ వెల్లడించారు.రష్యా భూభాగంలో ఇప్పటికే వేల మంది ఉత్తర కొరియా సైనికులు ఉన్నారని.. ఇప్పుడు మరో 10 వేల మందిని పంపేందుకు ప్యాంగ్యాంగ్ సన్నాహాలు చేస్తోందని సోమవారం జెలెన్స్కీ తెలియజేశారు. కొత్త సమాచారం ఆధారంగా ఈ సైనికులను తొలుత శిక్షణకు ఎంపిక చేస్తున్నారని.. అనంతరం రష్యాకు తరలించనున్నారని పేర్కొన్నారు.కఠిన శిక్షణ.. కట్టుదిట్టమైన క్రమశిక్షణ.. పై అధికారుల ఆదేశాలకు తిరుగులేని విధేయత.. ఉత్తర కొరియా సైనికుల ప్రత్యేకత ఇదే. యుద్ధరంగంలోకి దిగితే వెనక్కి తగ్గకుండా దాడులు చేయడం.. ఆ దాడులు భయానక రీతిలో ఉండడం.. పట్టుబడినా కీలక సమాచారాన్ని బయటపెట్టకుండా మౌనం పాటించడం వారి గురించి తరచూ వినిపించే అంశాలు. పైగా రష్యా అత్యాధునిక సైనిక సాంకేతికతపై పట్టు సాధిస్తూ.. వినూత్న రీతిలో దాడులు చేస్తుంటారు. అందుకే రాక్షస సేనగా దీనిని అభివర్ణిస్తుంటారు.ఉత్తర కొరియా సేనలు ఇలా..ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో మాస్కోకు మద్దతుగా ఉత్తర కొరియా 2024 నుంచి సైనికులను పంపుతున్నట్లు దక్షిణ కొరియా నివేదికలు ఇస్తోంది. ఇప్పటివరకు 14 వేల నుంచి 15 వేల మంది వరకు ఉత్తర కొరియా సైనికులు రష్యాకు వెళ్లినట్లు అంచనా. వీరిలో ఎక్కువ మందిని ఉక్రెయిన్ బలగాలను ఎదుర్కొనేందుకు కుర్స్క్ ప్రాంతంలో మోహరించినట్లు సమాచారం. ఈ నివేదికల ఆధారంగానే ఉక్రెయిన్..నార్త్ కొరియాపై విరుచుకుపడుతూ వస్తోంది.మరో 10 వేల మంది.. ఎందుకు?తాజాగా రష్యా భూభాగంలో 8 వేల మందికి పైగా ఉత్తర కొరియా సైనికులు ఉన్నారని జెలెన్స్కీ చెబుతున్నారు. వీరికి అదనంగా మరో 10 వేల మందిని పంపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఈ సైనికులను ప్రస్తుతం శిక్షణ కోసం ఎంపిక చేస్తున్నారని.. శిక్షణ పూర్తయ్యాక రష్యాకు తరలించే ప్రక్రియ ఉంటుందని తెలిపారు.సైనికులను పంపడమే కాకుండా ఉత్తర కొరియా రష్యాకు భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అందిస్తున్నట్లు ఉక్రెయిన్ చెబుతోంది. మిలియన్ల కొద్దీ ఆర్టిలరీ, మోర్టార్ రౌండ్లతోపాటు బాలిస్టిక్ క్షిపణులు, లాంగ్రేంజ్ ఆర్టిలరీ వ్యవస్థలు, మల్టిపుల్ రాకెట్ లాంచర్ వ్యవస్థలను రష్యాకు సరఫరా చేసినట్లు సమాచారం.50 వేల మందిపై గతంలోనే..ఉత్తర కొరియా నుంచి రష్యాకు మరింత మంది సైనికులు వెళ్లే అవకాశం ఉందని జెలెన్స్కీ గతంలోనూ చెప్పారు. ఆగస్టులో ఏకంగా 50 వేల మంది వరకు ఉత్తర కొరియా సైనికులు రష్యా తరఫున యుద్ధంలో పాల్గొనే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. తాజాగా మరో 10 వేల మంది కోసం సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పడంతో.. రష్యాకు ప్యాంగ్యాంగ్ అందిస్తున్న సైనిక సహాయంపై మరోసారి చర్చ మొదలైంది.భారత్.. లెక్క వేరే!ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో భారత్ పేరు కూడా ప్రస్తావనకు వస్తోంది. రష్యా 47 దేశాలకు చెందిన పౌరులను మోసపూరిత మార్గాల్లో యుద్ధంలోకి లాగుతోందని జెలెన్స్కీ ఆరోపించారు. ఇందులో భారత్ కూడా ఉందని పేర్కొన్నారు. భారత విదేశాంగ శాఖకు అందిన సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు 227 మంది భారతీయులు రష్యా సాయుధ దళాల్లో చేరగా, వారిలో 139 మందిని డిశ్చార్జ్ చేశారు. మరో 51 మంది మరణించినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు.మంచి ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల ద్వారా రష్యాకు వెళ్లి.. అక్కడ సైన్యంలోకి వెళ్లాల్సి వచ్చిందని కొందరు భారతీయులు, వారి కుటుంబాలు గతంలో ఆరోపించాయి. అయితే ఈ 227 మంది అందరూ ఏజెంట్ల మోసానికి గురయ్యారని ప్రభుత్వం చెప్పలేదు. మిగిలిన భారతీయులను సైన్యం నుంచి విడుదల చేయించి స్వదేశానికి తీసుకురావడానికి రష్యాతో భారత్ పలు స్థాయిల్లో సంప్రదింపులు జరుపుతోంది. ఇలాంటి అక్రమ రిక్రూట్మెంట్ వ్యవహారాలపై అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ శాఖ కూడా హెచ్చరిస్తోంది.దక్షిణ కొరియాతోనూ వివాదంఉత్తర కొరియా సైనికుల అంశం మరో వివాదానికీ దారితీసింది. రష్యా తరఫున పోరాడుతూ ఉక్రెయిన్ బలగాలకు చిక్కిన ఇద్దరు ఉత్తర కొరియా సైనికులను ఇటీవల దక్షిణ కొరియాకు బదిలీ చేసినట్లు జెలెన్స్కీ వెల్లడించారు. ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించడంపై సియోల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. బదిలీని గోప్యంగా ఉంచాలన్న అవగాహన ఉందని దక్షిణ కొరియా చెబుతుండగా.. అలాంటి గోప్యతా ఒప్పందం లేదని ఉక్రెయిన్ వాదించింది. ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే మరో 10 వేల మంది ఉత్తర కొరియా సైనికులను రష్యాకు పంపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని జెలెన్స్కీ ప్రకటించడం గమనార్హం.ఇదీ చదవండి: భారత్ తల్చుకుంటే.. అమెరికా ఆంక్షలు ఫసక్ -
రష్యా చమురుతో భారత్ సరికొత్త గేమ్!
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలకు అమెరికా నుంచి భారీ సుంకాల ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా భారత్, చైనా వంటి రష్యా చమురు ప్రధాన కొనుగోలుదారులపై 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లభించింది. కొత్తగా తీసుకొచ్చిన ‘లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్–2026’ మరో రెండు వారాల్లో ఆచరణలోకి వచ్చే చాన్స్ ఉంది. దీంతో రష్యా చమురు కొనుగోలు విషయంలో భారత్ ఎలాంటి మార్గాన్ని అనుసరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.ఇక్కడే రష్యా చమురు రంగంలో భారత కంపెనీలకు ఉన్న భారీ వాటా తెరపైకి వస్తోంది. రష్యా ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం రోస్నెఫ్ట్ అనుబంధ సంస్థ అయిన వాంకోర్‌నెఫ్ట్‌లో భారత ప్రభుత్వ రంగ సంస్థలకు కలిపి 49.9 శాతం వాటా ఉంది. ఓఎన్జీసీ విదేశ్కు 26 శాతం వాటా ఉండగా.. ఆయిల్ ఇండియా, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోరిసోర్సెస్ కలిసి వాంకోర్ ఇండియా ద్వారా మరో 23.9 శాతం వాటా కలిగి ఉన్నాయి. మిగిలిన 50.1 శాతం రోస్నెఫ్ట్ వద్ద ఉంది.అంటే.. భారత్ రష్యా నుంచి చమురును కేవలం బయట నుంచి కొనుగోలు చేయడమే కాదు. రష్యాలోని చమురు ఉత్పత్తి ఆస్తిలోనే భారత కంపెనీలకు వాటా ఉంది. ఇప్పుడు అసలు ప్రశ్న.. ఈ వాటా ఆధారంగా భారత్ తనకు వచ్చే చమురును ‘భారత చమురు’గా చూపించి అమెరికా ఆంక్షల నుంచి తప్పించుకోగలదా?రష్యా చమురు.. భారత్దిగా మారుతుందా?కానే కాదన్నది నిపుణుల అభిప్రాయం. ఒక భారత కంపెనీకి రష్యా చమురు క్షేత్రంలో వాటా ఉన్నంత మాత్రాన.. అక్కడి నుంచి వెలికితీసిన ముడిచమురు భారత మూలం గల చమురుగా మారదు. చమురు ఎక్కడ వెలికితీశారన్నదే దాని మూలాన్ని నిర్ణయిస్తుంది. రష్యాలో ఉత్పత్తి అయితే అది రష్యా మూలం గల క్రూడ్గానే ఉంటుంది. ఒకవేళ భారత కంపెనీలు తమ వాటాకు అనుగుణంగా చమురును నేరుగా తీసుకుని భారత్‌కు తరలించినా ఇదే వర్తిస్తుంది. మూడో దేశం మీదుగా పంపినా దాని మూలం మారదు. కాబట్టి 49.9 శాతం వాటా ఉండటం వాణిజ్యపరంగా భారత్‌కు ప్రయోజనం కావచ్చు కానీ.. అమెరికా ఆంక్షల నుంచి ఆటోమేటిక్‌గా మినహాయింపు మాత్రం ఇవ్వదు.మరి ఈ వాటాతో..ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. భారత కంపెనీలకు వాంకోర్‌నెఫ్ట్‌లో వాటా ఉండటం వల్ల ఉత్పత్తిపై ఆర్థిక హక్కు ఉంటుంది. సాధారణంగా రష్యా కంపెనీ నుంచి మార్కెట్లో చమురు కొనుగోలు చేసే బదులు.. వాటాదారుగా ఉత్పత్తిలో తమ వాటాకు సంబంధించిన హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఒప్పందాలు, చెల్లింపులు, మధ్యవర్తులు, రవాణా వంటి వ్యవహారాల్లో మార్పులు రావచ్చు. అలాగని ఇది అమెరికా ఆంక్షలను తప్పించే ప్రత్యేక మినహాయింపు అని మాత్రం కచ్చితంగా చెప్పలేం. ఏ లావాదేవీకి ఆంక్షలు వర్తిస్తాయన్నది ఉత్పత్తి చేసే సంస్థ, లావాదేవీలోని భాగస్వాములు, చెల్లింపుల విధానం, షిప్పింగ్, బీమా తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. వాంకోర్.. వోస్టోక్ ఆయిల్‌కు సంబంధమేంటి?ఇక్కడ మరో విషయం అర్థం చేసుకోవాలి. భారత కంపెనీల 49.9 శాతం వాటా మొత్తం వోస్టోక్ ఆయిల్ ప్రాజెక్టులో కాదు.. వాంకోర్‌నెఫ్ట్‌లో ఉంది. వాంకోర్ చమురు క్షేత్రాలు మాత్రం భారీ వోస్టోక్ ఆయిల్ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి. రష్యా సెప్టెంబర్‌లో వోస్టోక్ ఆయిల్ నుంచి వాణిజ్య చమురు ఎగుమతులను ప్రారంభించింది. ఆర్కిటిక్ ప్రాంతంలోని ఈ భారీ ప్రాజెక్టును రష్యా భవిష్యత్తులో కీలక చమురు ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చేయాలని చూస్తోంది. దీంతో వాంకోర్‌నెఫ్ట్‌లో భారత కంపెనీల వాటా మరోసారి చర్చలోకి వచ్చింది. అమెరికా ఆంక్షల మాటేంటి?ఈ పరిణామాలతో అమెరికా ఆంక్షల గండం భారత్‌కు తప్పినట్లేనా?. ఇదే ఈ మొత్తం వ్యవహారంలో కీలకమైన విషయం. భారత్‌కు రష్యా చమురు ఉత్పత్తి ఆస్తిలో 49.9 శాతం వాటా ఉన్నప్పటికీ.. ఆ చమురు రష్యాలోనే వెలికితీస్తున్నారు. అందువల్ల దాని మూలం రష్యాదే. కాబట్టి భారత వాటాను చూపించి అమెరికా కొత్త చట్టం కింద వచ్చే సుంకాలు, ఆంక్షల నుంచి పూర్తిగా బయటపడే మార్గం ఏర్పడిందని చెప్పడానికి ఆధారం లేదు. అంటే.. భారత్ చేతిలో ఉన్న 49.9 శాతం వాటా ఒక కీలక వాణిజ్య బలం కావచ్చు. కానీ అదే అమెరికా ఆంక్షలకు కవచంగా మారుతుందా అన్నది మాత్రం అమెరికా నిబంధనల అమలు, లావాదేవీ నిర్మాణం, భవిష్యత్తు నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందన్నమాట.ఇదీ చదవండి: ట్రంప్‌ని ఎంత పెద్ద మాట అన్నాడు సర్? -
పాములు, చేపలు రోడ్డెక్కాయి!
చరిత్రలోనే ఎన్నడూ చూడని దుస్థితిని ఎదుర్కొంటున్నారు అక్కడి ప్రజలు. ఇళ్ల నుంచి బయటకు రావాలన్నా.. రోడ్లపై అడుగు పెట్టాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది. రోడ్లు, అపార్ట్మెంట్ ప్రాంగణాలు, మార్కెట్లు నీట మునగడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఎటు చూసినా నీరే కనిపిస్తుండగా.. ఆ వరద నీటిలో పాములు, చేపలు తేలుతూ కనిపించడం మరింత కలవరపెడుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలు ఈ భయానక పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి.థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు బ్యాంకాక్‌లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల కార్లు కిటికీల వరకు, మరికొన్ని చోట్ల దాదాపు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. అపార్ట్మెంట్ ప్రాంగణాల్లో పార్క్ చేసిన వాహనాల్లో పైకప్పులు మాత్రమే కనిపించే పరిస్థితి ఏర్పడింది. వరద నీటిలో పాములు, చేపలు సైతం కొట్టుకొస్తూ కనిపించడంతో స్థానికులు మరింత ఆందోళనకు గురయ్యారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోల్లో వీటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఇదే అదనుగా కొందరు ఆకతాయిలు ఏఐ వీడియోలతో మరింత బెంబేలెత్తిస్తున్నారు.📍Bangkok ,Thailand 🇹🇭 "Bangkok is flooded, even the fish 🐟 🐠 🐟 are on the streets 🛣️ ! Before, traffic jams were caused by too many cars, now you might still need to watch out for fish in the water"#bangkok #thailand #heavyrain #climatechange #Elnino #flooding… pic.twitter.com/p6b1x2KWLp— sustainme.in® (@sustainme_in) September 28, 2026 Banjir di Bangkok pic.twitter.com/zpQzpWdcqd— @ (@anthraxxxx) September 26, 2026ప్రధాన రహదారులపైనా భారీగా నీరు నిలిచిపోయింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి జెట్స్కీ(బోట్ తరహా వాహనం)తో వరద ముంచెత్తిన రోడ్డుపై దూసుకెళ్లిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై థాయ్ పోలీసులు చర్యలు తీసుకుని అతడిని అరెస్టు చేశారు.थाईलैंड में भीषण बाढ़ की वजह से सड़कों पर विशालकाय रेटिकुलेटेड पायथन तौर रहे हैं. किसी जानवर को निगलने के कारण अजगर का पेट काफी फूला हुआ था, जिसके चलते यह पानी में ठीक से तैर या हिल-डुल नहीं पा रहा था.दूसरी तरफ घरों के भीतर भी जहरीले सांप घुस रहे हैं, pic.twitter.com/2AhvcpdbZ1— Ruby Arun रूबी अरुण (@arunruby08) September 26, 2026మీటర్ లోతు నీటిలో.. బ్యాంకాక్‌లోని బాంగ్ కాపి ప్రాంతంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కొన్ని చోట్ల వరద నీరు దాదాపు మీటర్ వరకు చేరింది. అయినప్పటికీ వ్యాపారులు దుకాణాలు మూసివేయకుండా వినూత్నంగా వ్యాపారం కొనసాగించారు. ప్లాస్టిక్ క్రేట్లు, ఫోమ్ బాక్సులు, బేసిన్లను నీటిపై తేలేలా చేసి వాటిలో కూరగాయలు, చేపలు, మాంసం, ఇతర నిత్యావసరాలను విక్రయించారు. ప్రజలు నీటిలోనే నడుచుకుంటూ సరుకులు కొనుగోలు చేశారు. దీంతో మార్కెట్ మొత్తం ఓ ‘ఫ్లోటింగ్ మార్కెట్’ను తలపించింది.7 లక్షల మందిపై ప్రభావంవారాంతపు వరదలకు బ్యాంకాక్‌లో 3.29 లక్షల కుటుంబాలు.. దాదాపు 7 లక్షల మంది ప్రభావితమైనట్లు నగర అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలతో డ్రైనేజీ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడింది. కొన్ని ప్రాంతాల్లో ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. అయితే సోమవారం నుంచి వర్షం కొంత తగ్గడంతో అధికారులు డ్రైనేజీ, నీటి తొలగింపు చర్యలను వేగవంతం చేశారు.తాజా అధికారిక సమాచారం ప్రకారం.. బ్యాంకాక్‌తో పాటు థాయ్‌లాండ్‌లోని మరికొన్ని ప్రాంతాల్లో వరద పరిస్థితి కొనసాగుతోంది. సెప్టెంబర్ 28 నాటికి దేశవ్యాప్తంగా 27 ప్రావిన్సులు, బ్యాంకాక్‌లో వరదల ప్రభావం ఉన్నట్లు థాయ్ ప్రభుత్వం తెలిపింది. దాదాపు 5.76 లక్షల కుటుంబాలు, 17.93 లక్షల మంది ప్రభావితమైనట్లు పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో నీటిమట్టాలు తగ్గుతుండగా.. మరికొన్ని చోట్ల ఇంకా పెరుగుతున్నాయి.విమానాశ్రయంలో భారీగా లగేజీలు..వరద ప్రభావం బ్యాంకాక్ సువర్ణభూమి విమానాశ్రయానికీ తాకింది. వరదల కారణంగా గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బంది విధులకు చేరుకోవడం కష్టమైంది. దీంతో బ్యాగేజీ నిర్వహణలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 6 వేల బ్యాగేజీలు ఆలస్యమైనట్లు సమాచారం. కొన్ని బ్యాగేజీ ట్రాలీలు కూడా పనిచేయకపోవడంతో టెర్మినల్‌లో లగేజీ భారీగా పేరుకుపోయింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు థాయ్ ఎయిర్వేస్ కార్యాలయ సిబ్బంది, మేనేజర్లు, సైనిక సిబ్బందిని రంగంలోకి దించింది. ప్రయాణికులకు నేరుగా వాళ్ల ఇళ్లకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.సెలవులు ప్రకటించిన ప్రభుత్వంవరదల తీవ్రత దృష్ట్యా థాయ్ ప్రభుత్వం బ్యాంకాక్, పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సోమ, మంగళవారాల్లో ప్రత్యేక సెలవులు ప్రకటించింది. ప్రైవేటు సంస్థలు, బ్యాంకులు, ఆసుపత్రులు తదితరాలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది.వర్షం తగ్గినా.. ముప్పు మాత్రం!తాజా పరిస్థితిలో బ్యాంకాక్‌లో వర్షం కొంత తగ్గుముఖం పట్టింది. ప్రధాన కాలువల్లో నీటిమట్టాలను తగ్గించి.. రోడ్లు, నివాస ప్రాంతాల్లోని నీటిని బయటకు పంపేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. అయితే తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఇంకా వరద నీరు నిలిచే ఉంది. మరోవైపు థాయ్ వాతావరణ శాఖ దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తర, మధ్య, తూర్పు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, నదులు పొంగిపొర్లడం, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అప్రమత్తం చేసింది.ఇదీ చదవండి: ఇరాన్ ఎట్టకేలకు దిగొచ్చిందా? -
మెట్టు దిగిన ఇరాన్?.. పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధానికి తెరదించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, ఇరాన్ నేరుగా కాకుండా మధ్యవర్తుల ద్వారా మరోసారి చర్చలకు సిద్ధమయ్యాయి. సోమవారం ఇరు దేశాల అధికారులు మధ్యవర్తులతో వేర్వేరుగా సంప్రదింపులు జరిపారు. ఏడు నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు తాజా దౌత్య ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్చలు జరుగుతున్నాయి.ఇరాన్ గత వారం ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సందర్భంగా ప్రతిపాదించిన ఏడు రోజుల కాల్పుల విరమణ ప్రణాళికను కొద్దిగా సవరించి తాజా చర్చల్లో ముందుకు తీసుకెళ్లే అవకాశముంది. ఖతార్ మధ్యవర్తులు న్యూయార్క్‌లో ఉన్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతో, అలాగే అమెరికా వర్గాలతో విడివిడిగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. యుద్ధంలో అమెరికాదే విజయం: ట్రంప్మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం యుద్ధం త్వరలోనే ముగుస్తుందని, అమెరికా గెలుస్తుందని వ్యాఖ్యానించారు. సోమవారం వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధికారులు మధ్యవర్తులతో చర్చలు జరిపినట్లు తెలిపారు. “మేం గెలవబోతున్నాం. నా వరకు ఇది ఎలాగైనా సరే జరుగుతుంది. చాలా త్వరగానే ఇది ముగిసిపోతుంది” అని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధంలో అమెరికా విజయం సాధించిన తర్వాత గ్యాస్ ధరలు కూడా గణనీయంగా తగ్గుతాయని చెప్పారు.ఇరాన్ కీలక ప్రతిపాదన ఇదే..ఇరాన్ ప్రతిపాదనలో ప్రధానంగా యుద్ధాన్ని నిలిపివేయడం, లెబనాన్‌లోనూ శత్రుత్వ చర్యలకు ముగింపు పలకడం, ఫ్రీజ్ చేసిన తమ బిలియన్ల డాలర్ల ఆస్తులను విడుదల చేయడం, ఇరాన్ చమురుపై ఆంక్షలను ఎత్తివేయడం వంటి అంశాలు ఉన్నాయి. అలాగే ఇరాన్ పోర్టులపై అమెరికా విధించిన నావికా దిగ్బంధాన్ని తొలగించాలని కోరుతోంది.దీనికి ప్రతిగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికాతో చర్చలను పునఃప్రారంభించేందుకు ప్రతిపాదించింది. శుద్ధిచేసిన యురేనియం అంశంపైనా చర్చలు జరపాలని అమెరికా కోరుతోంది. ..అయినా చర్చలకు గ్రీన్ సిగ్నల్ఇరాన్ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం తిరస్కరించినట్లు ప్రకటించారు. ఆర్థిక ఒత్తిడి కారణంగానే ఇరాన్ వేగంగా ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఆదివారం ఇదే అంశంపై మాట్లాడుతూ.. ఈ వారంలో అమెరికా ప్రతినిధులు మరోసారి చర్చలు జరిపే అవకాశం ఉందని ట్రంప్ తెలిపారు. సోమవారం కూడా మధ్యవర్తులతో అమెరికా అధికారులు మాట్లాడినట్లు వైట్‌హౌస్‌లో ట్రంప్ వెల్లడించారు. మరోవైపు, అమెరికా అధికారికంగా తమ ప్రతిపాదనను తిరస్కరించిన సమాచారం తమకు ఇంకా అందలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ చెబుతున్నారు. వాషింగ్టన్ నుంచి స్పష్టమైన సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని ఆయన తెలిపారు. శాంతియుత పరిష్కారం కోరుకుంటే తాము ఇప్పటికే పరిష్కార మార్గాన్ని ప్రతిపాదించామని పేర్కొన్నారు. హర్ముజ్‌పైనే అసలు పట్టుప్రస్తుత చర్చల్లో హర్ముజ్ జలసంధి కీలక అంశంగా మారింది. ఈ మార్గం ద్వారా ప్రపంచ ఇంధన రవాణాలో భారీగా చమురు, ఎల్ఎన్జీ రవాణా జరుగుతుంది. యుద్ధం కారణంగా ఇక్కడ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడుతోంది. సోమవారం కూడా దౌత్య ప్రయత్నాలపై ఆశలు, యుద్ధంపై ఆందోళనల మధ్య చమురు ధరలు పెరిగాయి.గతంలో ఏప్రిల్, జూన్‌లో మధ్యవర్తుల ప్రయత్నాలతో కాల్పుల విరమణలు కుదిరినా అవి ఎక్కువకాలం కొనసాగలేదు. అయితే ఇప్పుడు ఇరాన్ మాత్రం తమ షరతులు నెరవేరిన తర్వాతే హర్ముజ్‌ను పూర్తిగా తెరిచే అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. దీంతో తాజా మధ్యవర్తిత్వ చర్చలు యుద్ధానికి ముగింపు పలుకుతాయా? లేదంటే మరోసారి విఫలమవుతాయా?.. రాబోయే రోజుల్లో ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది.ఇదీ చదవండి: ఎల్ నినో ఏం చేయబోతోందో తెలుసా? -
గ్రూపులో గలీజ్ మెసేజులు.. మత్తులో ముంచి గంటల తరబడి దారుణం!
అమెరికాలోని ప్రతిష్టాత్మక కార్నెల్ యూనివర్సిటీలో జరిగిన ఘోరం చర్చనీయాంశంగా మారింది. ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిందన్న ఆరోపణలు మరోసారి తెరపైకి వచ్చాయి. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు మళ్లీ కోర్టును ఆశ్రయించింది. దీంతో రెండేళ్ల కిందటి ఈ సంచలన కేసుపై న్యూయార్క్‌లోని ప్రాసిక్యూటర్లు దర్యాప్తును పునఃప్రారంభించారు. అయితే ఈసారి నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.అప్పట్లో.. 20 ఏళ్ల వయసున్న తనకు మత్తు పదార్థాలు ఇచ్చి, అనంతరం పలువురు ఒకరి తర్వాత మరొకరు వరుసగా లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. తాజాగా ఆమె కార్నెల్ యూనివర్సిటీతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు ఫ్రాటర్నిటీ సభ్యులపై దావా వేసింది. 2014లో కార్నెల్‌లోని చి ఫై ఫ్రాటర్నిటీ హౌస్‌కు ఓ స్నేహితుడిని కలవడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఆమె దావాలో పేర్కొంది. తాను మత్తులో ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు కెటమైన్ తీసుకోవాలని బలవంతం చేశారని, ఆ తర్వాత తనపై లైంగిక దాడి చేశారని ఆమె ఆరోపించింది.తాను అపస్మారక స్థితిలో ఉండగానే ఫ్రాటర్నిటీకి చెందిన స్నాప్‌చాట్ గ్రూప్‌లో ఓ వ్యక్తి ‘ఫ్రీ సెక్స్’ అంటూ మెసేజ్ పెట్టాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ మెసేజ్‌కు మరికొందరు దుర్మార్గంగా స్పందించారని.. మరింత మంది అక్కడికి వచ్చి తనపై గంటల తరబడి లైంగిక దాడి చేశారని ఆమె దావాలో పేర్కొన్నారు.ఘటన జరిగిన తర్వాత తాను మానసికంగా కుంగిపోయానని.. ఎటూ వెళ్లలేకపోయానని చెప్పింది. స్నేహితుల సహకారంతో మూడు వారాల తర్వాత బాధితురాలు యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించింది. కార్నెల్ అంతర్గతంగా విచారణ చేపట్టినప్పటికీ.. ఆరోపణలు ఎదుర్కొన్న ఏడుగురిలో ఇద్దరిని మాత్రమే యూనివర్సిటీ నుంచి బహిష్కరించారని ఆమె వాపోయింది.ఆమె తరఫు న్యాయవాది థామస్ గియుఫ్రా మీడియాతో మాట్లాఉడతూ.. మిగిలిన వారికి సస్పెన్షన్, వర్క్‌షాప్‌లు, వ్యాసాలు రాయడం వంటి వివిధ శిక్షలు విధించినట్లు దావాలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఒక్కరినీ అరెస్టు చేయలేదని బాధితురాలి న్యాయవాది పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత ఆమె చదువు మానేసినట్లు కూడా దావాలో వెల్లడించారు. కార్నెల్, ఫ్రాటర్నిటీ సభ్యులపై ఒప్పంద ఉల్లంఘన, నిర్లక్ష్యం, రాష్ట్ర చట్టాల ఉల్లంఘన వంటి ఆరోపణలతో ఆమె పరిహారం కోరుతూ కోర్టును ఆశ్రయించారు.‘క్రిమినల్ కేసుకు ఆధారాలు సరిపోలేదు’మరోవైపు టాంప్కిన్స్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం ఈ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తును సమీక్షించినట్లు తెలిపింది. అయితే క్రిమినల్ కేసు నమోదు చేసి అభియోగాలు మోపేందుకు తగిన ఆధారాలు లభించలేదని పేర్కొంది.కార్నెల్ ఏం చెప్పిందంటే..కార్నెల్ యూనివర్సిటీ తమ నిబంధనల ప్రకారం అంతర్గత విచారణ జరిపినట్లు చెబుతుండగా.. బాధితురాలి తరఫు న్యాయవాదులు మాత్రం తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు, క్రిమినల్ కేసు నమోదు చేసి అభియోగాలు మోపేందుకు తగిన ఆధారాలు లభించలేదని టాంప్కిన్స్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం స్పష్టం చేసింది. ప్రస్తుతం బాధితురాలు దాఖలు చేసిన సివిల్ దావాతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో కోర్టు విచారణతో ఆరోపణలపై తదుపరి పరిణామాలు వెలుగులోకి రానున్నాయి.ఇదీ చదవండి: అమెరికాలో మళ్లీ పేలిన గన్ -
డూమ్స్‌డే వార్: ఇరాన్ బిగ్ వార్నింగ్.. ట్రంప్ రియాక్షన్ ఇదే
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ముగింపు కోసం దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. పరిస్థితులు మాత్రం మరోసారి ఉద్రిక్తంగా మారుతున్నాయి. హర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్ ప్రతిపాదించిన ఏడు రోజుల రోడ్‌మ్యాప్‌ను అమెరికా తిరస్కరించడంతో.. అవసరమైతే భయానక యుద్ధాన్ని సైతం ఎదుర్కొనేందుకు తమ దేశం పూర్తిగా సిద్ధంగా ఉందని ఇరాన్ అంటోంది. ఈసారి యుద్ధం మొదలైతే అదీ ఎవరూ ఊహించని స్థాయిలో భీకరంగా మారొచ్చు అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. యుద్ధం పునఃప్రారంభమైతే అది ‘డూమ్స్‌డే వార్’(Doomsday War)ప్రళయం తరహా) స్థాయికి చేరినా ఎదుర్కొనేందుకు సిద్ధం అని అమెరికాను హెచ్చరించారాయన. అదే సమయంలో దౌత్యానికి తలుపులు మాత్రం మూసివేయలేదని చెప్పారు.హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, యుద్ధాన్ని ముగించే దిశగా ఇరాన్ ఏడు రోజుల ప్రణాళికను ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనను అమెరికా తిరస్కరించింది. ఇరాన్ తమను ఫ్రీజ్ చేసిన బిలియన్ల డాలర్ల నిధులను విడుదల చేయాలని, ఆంక్షలను ఎత్తివేయాలని కోరిందని.. అందుకు తాము సిద్ధంగా లేమని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి మైక్ వాల్ట్జ్ తెలిపారు. ఇవి కేవలం అమెరికా విధించిన ఆంక్షలు కాదని, ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న ఆంక్షలని ఆయన పేర్కొన్నారు.‘యుద్ధం త్వరలో ముగుస్తుంది’.. ట్రంప్మరోవైపు.. ఆరాఘ్ఛి వార్నింగ్ వెలువడ్డ కాసేపటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఈ వారంలో ఇరాన్‌తో మరిన్ని చర్చలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. యుద్ధంలో అమెరికా ‘త్వరలోనే విజయం సాధిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. అయితే ఇరాన్ ప్రతిపాదనను తిరస్కరించినప్పటికీ దౌత్య మార్గాలు పూర్తిగా మూసుకుపోలేదని నిపుణులు చెబుతున్నారు.న్యూయార్క్‌లో ఐరాస సర్వసభ్య సమావేశాల సందర్భంగా ఇరాన్ ప్రతినిధులతో దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సెంటర్ ఫర్ మిడిల్ ఈస్ట్ స్ట్రాటజిక్ స్టడీస్ సీనియర్ పరిశోధకుడు అబ్బాస్ అస్లానీ తెలిపారు. మధ్యవర్తుల ద్వారా అమెరికా అధికారిక స్పందన కోసం ఇరాన్ ఎదురుచూస్తోందని చెప్పారు. ఇరుదేశాలు తమకు ఉన్న ప్రధాన ఒత్తిడి సాధనాలను ముందుగా ఎవరు వదులుకుంటారన్నదే ఇప్పుడు కీలకంగా మారిందని ఆయన విశ్లేషించారు.డ్రోన్ స్వాధీనం చేసుకున్నామన్న ఇరాన్ ప్రకటనపై..హర్ముజ్ జలసంధిలో అమెరికాకు చెందిన అధునాతన అండర్‌వాటర్ డ్రోన్‌ను ఇరాన్ సైన్యం స్వాధీనం చేసుకుందన్న వార్తలు కూడా ఉద్రిక్తతను పెంచాయి. అయితే ఇరాన్ చేసిన ఈ ప్రకటనను అమెరికా సైన్యం ఖండించింది. డ్రోన్ తమ ఆధీనంలోకి వెళ్లిందన్న వాదనలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. ఇరాన్‌పై అమెరికా దాడులకు ఉపయోగిస్తున్న బ్రిటన్‌లోని ఓ వైమానిక స్థావరం సమీపంలో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పేలుడు పదార్థాలు, ఉగ్రవాదానికి సంబంధించిన నేరాల అనుమానంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వాళ్లు ఇరాన్ పౌరులని తెలుస్తోంది.నస్రల్లా హంతకుల్ని శిక్షించాల్సిందేమరోవైపు హెజ్బొల్లా నేత హసన్ నస్రల్లా హత్యకు రెండేళ్లు పూర్తైన సందర్భంగా ఇరాన్ మరోసారి ఇజ్రాయెల్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. నస్రల్లా హత్యను ‘క్షమించరాని నేరం’గా అభివర్ణించిన ఇరాన్ విదేశాంగ శాఖ.. బాధ్యులను గుర్తించి చట్టపరంగా శిక్షించాలని ప్రపంచ దేశాలను కోరింది. 2024 సెప్టెంబర్ 27న బీరుట్‌లోని దక్షిణ శివార్లపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో నస్రల్లా మరణించిన విషయం తెలిసిందే.మొత్తంగా హర్ముజ్ జలసంధి తెరవడం, ఆంక్షల ఎత్తివేత, అణు కార్యక్రమం వంటి అంశాలపై అమెరికా–ఇరాన్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఒకవైపు చర్చలకు అవకాశం ఉందన్న సంకేతాలు కనిపిస్తుండగా.. మరోవైపు యుద్ధం మళ్లీ మొదలైతే పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని ఇరాన్ హెచ్చరించడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది.ఇదీ చదవండి: భారత్-కెనడా బంధంలో కీలక ‘మలుపు’! -
బంతి అమెరికా కోర్టులో.. ఇరాన్ నెక్స్ట్ మూవ్ ఏంటి?
ఇరాన్–అమెరికా యుద్ధానికి తెరపడుతుందన్న ఆశలు మళ్లీ ఆవిరవుతున్నాయా? హర్ముజ్ జలసంధిని ఏడు రోజుల్లో తెరిచి.. యుద్ధాన్ని నిలిపివేసేందుకు ఇరాన్ ప్రతిపాదించిన ప్లాన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించాడనే కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఇదే నిజమైతే.. ఇప్పుడు ఇరాన్ తదుపరి అడుగు ఏంటి? హర్ముజ్ పరిస్థితి ఎలా మారుతుంది? యుద్ధం మళ్లీ తీవ్ర రూపం దాల్చుతుందా?.. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వేదికగా ఇరాన్ తన ప్రతిపాదనను అమెరికా ముందుంచింది. ఖతార్ మధ్యవర్తిత్వంతో ఈ ప్రతిపాదనను వాషింగ్టన్కు పంపినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తెలిపారు. అమెరికా అంగీకరిస్తే ఏడు రోజుల కౌంట్‌డౌన్ మొదలై.. హర్ముజ్ జలసంధిలో సాధారణ నౌకాయానం పునరుద్ధరించవచ్చని చెప్పారు. అదే సమయంలో ప్రాంతీయంగా అన్ని రంగాల్లో పోరాటాన్ని నిలిపివేసి విస్తృత చర్చలకు వెళ్లొచ్చని ప్రతిపాదించారు.అయితే ఇందుకు ప్రతిగా అమెరికా ఇరాన్ పోర్టులపై దిగ్బంధాన్ని ఎత్తివేయాలని, స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయాలని, చమురు ఆంక్షలను తొలగించాలని ఇరాన్ కోరుతోంది. అణు కార్యక్రమంపై మాత్రం తమ హక్కుల్లో ఎలాంటి రాయితీ ఇవ్వబోమని ఇరాన్ వర్గాలు స్పష్టం చేశాయి. ముఖ్యంగా యురేనియం శుద్ధి విషయంలో రాజీ ఉండదని తెలిపాయి.ట్రంప్ తిరస్కరిస్తే.. తర్వాత?‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ కథనం ప్రకారం.. ఇరాన్ తన డిమాండ్లను అంగీకరిస్తుందన్న నమ్మకం ట్రంప్‌కు లేదని, తిరిగి బాంబుల దాడి చేసే అవకాశం ఉందని ఆయన తన సిబ్బందితో చెప్పినట్లు అమెరికా అధికారులు పేర్కొన్నారు. మరో నివేదిక ప్రకారం.. నవంబర్‌లో జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత బాంబుల దాడులు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాన్ని ట్రంప్ అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. గతంలోనూ చర్చల ప్రయత్నాలు విఫలమై.. కొంతకాలం కాల్పుల విరమణ తర్వాత మళ్లీ దాడులు జరిగిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.హర్ముజ్ సంగతేంటి?ఇరాన్ ప్రతిపాదనలో కీలక అంశం హర్ముజ్ జలసంధి. ప్రపంచంలోని అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటైన ఈ జలసంధి ద్వారా రవాణా తీవ్రంగా దెబ్బతినడంతో ఇప్పటికే ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం పడింది. అమెరికా–ఇరాన్ మధ్య ఒప్పందం కుదరకపోతే హర్ముజ్ పరిస్థితి మరింత కాలం అనిశ్చితంగానే కొనసాగే అవకాశం ఉంది. ఇరాన్ మాత్రం అమెరికా తమపై సైనిక ఒత్తిడి తగ్గించి, పోర్టుల దిగ్బంధాన్ని ఎత్తివేస్తే ఏడు రోజుల్లో జలసంధిని తిరిగి తెరవడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతోంది. అంటే ఇప్పుడు బంతి అమెరికా కోర్టులోనే ఉందన్నది ఇరాన్ వాదన.ఇరాన్ ముందున్న దారులేంటి?అమెరికా తన ప్రతిపాదనను అంగీకరించకపోతే ఇరాన్ ముందున్న మార్గాలు ప్రధానంగా మూడు. మొదటిది.. దౌత్య మార్గాన్ని కొనసాగిస్తూ ఖతార్, ఒమన్ వంటి మధ్యవర్తుల ద్వారా చర్చలను ముందుకు తీసుకెళ్లడం. రెండోది.. హర్ముజ్ జలసంధిపై తన నియంత్రణను కొనసాగిస్తూ అమెరికాపై ఒత్తిడి పెంచడం. అయితే ఇది ప్రపంచ ఇంధన సరఫరాపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఇరాన్‌కూ ఆర్థిక, దౌత్యపరమైన ఒత్తిళ్లు పెరగొచ్చు. మూడోది.. అమెరికా సైనిక చర్యలకు ప్రతిస్పందిస్తూ ప్రాంతీయంగా తన మిత్ర బలగాల ద్వారా ఒత్తిడి పెంచడం. కానీ ఈ మార్గం యుద్ధం మరింత విస్తరించే ప్రమాదాన్ని పెంచుతుంది. మరోవైపు ఏడు రోజుల ప్రతిపాదనను ముందుకు తెచ్చిన ఇరాన్.. హర్ముజ్‌ను తిరిగి తెరవడం, కాల్పుల విరమణ, తదుపరి అణు చర్చలను ఒకే ప్యాకేజీగా మలచాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. అందువల్ల అమెరికా స్పందన ఆధారంగా ఈ మూడు మార్గాల్లో ఏది ముందుకు వస్తుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది.మరోవైపు సౌదీపై హౌతీల దాడులుఇదిలా ఉండగా.. ఇరాన్ మద్దతుగల యెమెన్ హౌతీలు సౌదీ అరేబియాపై దాడులు కొనసాగిస్తున్నారు. రియాద్ వైపు వచ్చిన రెండు డ్రోన్లను, ఖమీస్ ముషైత్ వైపు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్నట్లు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణం తెలిపింది. ఈ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియా భద్రతకు మద్దతుగా పాకిస్థాన్, టర్కీ రక్షణాధికారులు రియాద్‌లో సమావేశమై భద్రతా పరిస్థితిపై చర్చించారు.ఇరాన్ ప్రతిపాదనకు అమెరికా స్పందన ఎలా ఉండబోతోంది? ట్రంప్ వైఖరి నేపథ్యంలో హర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటుందా? లేదంటే పశ్చిమాసియాలో పోరాటం మళ్లీ ముదురుతుందా? అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. ఇరాన్ ఏడు రోజుల గడువుతో శాంతి ప్రతిపాదనను ముందుకు తెచ్చిన నేపథ్యంలో.. తదుపరి నిర్ణయం అమెరికా చేతుల్లోనే ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.ఇదీ చదవండి: ట్రంపరితనంతో మళ్లీ బాంబుల మోతేనా? -
కుప్పకూలిన విమానం.. మొత్తం 14 మంది మృతి
ఘోర విమాన ప్రమాదంతో ఆఫ్రికా దేశమైన కాంగోలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సైనిక అధికారులతో కూడిన విమానం కుప్పకూలి.. అందులోని మొత్తం 14 మంది మరణించారు. మృతుల్లో ఇద్దరు సీనియర్ సైనిక అధికారులు ఉండడం గమనార్హం. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.కాంగో సైన్యం వెల్లడించిన వివరాల ప్రకారం.. సైనిక ప్రతినిధులతో కూడిన విమానం నైరుతి ప్రాంతంలోని కిక్విట్ నుంచి రాజధాని కిన్షాసాకు తిరుగు ప్రయాణమైంది. ఉన్నట్లుండి నియంత్రణ కోల్పోయిన విమానం కేంజ్ ప్రాంతంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న వారిలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు. ఈ ప్రమాదంలో కాంగో మిలటరీ కోర్టు చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ముటోంబో కటలాయి టియెండే, సాయుధ దళాల ఆడిటర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ బకుమి లికులియా మృతి చెందినట్లు సైన్యం తెలిపింది. వీరితో పాటు ప్రతినిధి బృందానికి చెందిన సభ్యులు, విమాన సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు.కాంగో సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ ఎఫోమి ఎకెంజె ఈ ప్రమాదంపై ప్రకటన విడుదల చేశారు. ఇద్దరు జనరల్స్‌తో పాటు మరో 12 మంది ప్రతినిధులు, సిబ్బంది ఈ ప్రమాదంలో మరణించినట్లు తెలిపారు.OVER DOZEN DEAD after PLANE CRASH in DR CONGOAMONG 14 KILLED: Head of military court, and auditor general of armed forcesFIERY WRECKAGE and DEBRIS strewn ACROSS CRASH SITE pic.twitter.com/Hw36wJhoG0— RT (@RT_com) September 25, 2026సాంకేతిక లోపమే కారణమా?విమానం కిక్విట్ నుంచి కిన్షాసాకు వెళ్తుండగా సాంకేతిక సమస్య తలెత్తినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించినట్లు సైన్యం ప్రకటించింది. కాంగో సివిల్ ఏవియేషన్ అథారిటీ బోర్డు చైర్మన్ ట్రైఫోన్ కిన్-కియే ములుంబా కూడా విమాన ప్రమాదానికి కారణం ప్రస్తుతానికి తెలియదని తెలిపారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.తిరుగుబాట్లతో సతమతమవుతూ..కాంగోలో చాలాకాలంగా భద్రతా పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ముఖ్యంగా దేశంలోని తూర్పు ప్రాంతంలో పలు తిరుగుబాటు గ్రూపులతో సైన్యం పోరాడుతోంది. వీటిలో రువాండా మద్దతు ఉన్న ఎం23 తిరుగుబాటు సంస్థ కూడా ఉంది. గత ఏడాది ఈ గ్రూపులు వేగంగా దాడులు నిర్వహించి కీలక నగరాలను తమ ఆధీనంలోకి తీసుకోవడంతో కాంగోలో ఘర్షణలు మరింత తీవ్రరూపం దాల్చాయి.ఇదీ చదవండి: చంద్రుడిపై చైనా తొలి అడుగు.. జరిగేది ఇదేనంట! -
భలే వాడివి బాసూ!
ఉద్యోగులకు బహుమతులు ఇచ్చే కార్యక్రమం అది. టేబుల్‌పై వరుసగా గిఫ్ట్ బాక్స్‌లు. ఒక్కొక్కరుగా వచ్చి తమకు నచ్చిన బాక్స్ తీసుకుంటున్న సిబ్బంది. ఎవరికో ఓపెన్ చేయగానే ఐఫోన్ కనిపించింది.. మరొకరి బాక్స్‌లో చాక్లెట్లు వచ్చాయి. దీంతో కొందరి ముఖాల్లో ఆనందం.. మరికొందరిలో కాస్త నిరాశ కనిపించింది. అయితే అసలు సర్ప్రైజ్ మాత్రం అప్పుడే మొదలైంది.యూఏఈకి చెందిన వరల్డ్ స్టార్ మాన్పవర్ సంస్థలో ఉద్యోగులకు ఈ వినూత్న గిఫ్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఆ సంస్థ వ్యవస్థాపకుడు నిషాద్ హుస్సేన్, మేనేజింగ్ డైరెక్టర్ హసీనా నిషాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టేబుల్‌పై ఉంచిన గిఫ్ట్ బాక్స్‌లలో కొన్నింటిలో ఐఫోన్లు, మరికొన్నింటిలో చాక్లెట్ బార్లు పెట్టారు. ఉద్యోగులు తమకు నచ్చిన బాక్స్‌ను ఎంచుకున్నారు.బాక్స్‌లు తెరిచిన తర్వాత కొందరు ఉద్యోగులకు ఐఫోన్లు దక్కడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే చాక్లెట్ల బాక్స్ తీసుకున్నవారి పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపించింది. వారు చాక్లెట్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందనుకున్నారు.అప్పుడే మేనేజింగ్ డైరెక్టర్ హసీనా నిషాద్ మరో సర్ప్రైజ్ ఇచ్చారు. చాక్లెట్ల బాక్స్ తీసుకున్న ఉద్యోగుల దగ్గరకు వెళ్లి.. వారికి కూడా ఐఫోన్లు బహుమతిగా ఇచ్చారు. దీంతో మొదట చాక్లెట్లు మాత్రమే వచ్చాయని భావించిన ఉద్యోగుల ముఖాల్లో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. చివరకు అందరి చేతుల్లోనూ ఐఫోన్లే కనిపించాయి.ఉద్యోగుల కష్టపడి పనిచేయడం, సానుకూల దృక్పథం, టీమ్‌గా కలిసి ముందుకు సాగడం సంస్థ విజయానికి కీలకమని హసీనా నిషాద్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి ప్రయత్నం, ఆలోచన, సహకారం సంస్థ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని తెలిపారు. అవకాశాలను అందిపుచ్చుకుని మరింత ఎదగాలని ఉద్యోగులను ప్రోత్సహించారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను నిషాద్ హుస్సేన్, హసీనా నిషాద్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఉద్యోగులు బాక్స్‌లు తెరిచే సమయంలో కనిపించిన ఉత్కంఠ.. చివర్లో అందరికీ ఐఫోన్లు అందడంతో వచ్చిన ఆనందం వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఇదీ చదవండి: ఆమె నిద్ర ఖరీదు.. 10 వేల కోట్లు! View this post on Instagram A post shared by Haseena Nishad (@haseena_nishad) -
ఆమె నిద్ర.. ఆ కంపెనీని వేల కోట్లకు ముంచనుందా?
ఓ ఆఫీస్ ట్రిప్‌లో జరిగిన చిన్న ఘటన.. ఓ సీనియర్ టెక్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాన్నే పోగొట్టింది. కానీ అక్కడితో ఈ కథ ముగియలేదు. తనకు ఉన్న అటెన్షన్ డిఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ కారణంగానే తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆమె కోర్టును ఆశ్రయించారు. ట్రిబ్యునల్ ఆమె వాదనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఆమె అడుగుతున్న పరిహారం మొత్తం కార్పొరేట్ రంగంలోనే సంచలనంగా మారింది.గిట్‌పాడ్ అనే టెక్ కంపెనీలో ఇంజినీరింగ్ విభాగానికి షానన్ బర్న్స్ వైస్ ప్రెసిడెంట్‌గా ఒకప్పుడు పని చేశారు. 2023 ఏప్రిల్‌లో ఆస్ట్రియాలోని లోఫర్లో కంపెనీ నిర్వహించిన టీమ్ బిల్డింగ్ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఆ సమయంలో ఆమె మద్యం సేవించారు. అనంతరం తన గది తాళం మరిచిపోవడంతో గదిలోకి వెళ్లలేకపోయారు. చివరకు ఆ రాత్రి హోటల్లోని సౌనా (అంటే వేడి ఆవిరి గదిలో) నిద్రించాల్సి వచ్చింది. ఈ ఘటన తర్వాత యాజమాన్యం ఆమె చర్యను తీవ్రంగా పరిగణించింది. గిట్‌పాడ్ సీఈఓ జోహన్నెస్ ల్యాండ్‌గ్రాఫ్.. ఆమె వృత్తిపరమైన బాధ్యతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఏడాది జూన్‌లో బర్న్స్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. ADHD అంటే ఏకాగ్రత లోపం, అతి చురుకుదనానికి సంబంధించిన న్యూరో డెవలప్మెంటల్ పరిస్థితి.. తనకు ఉన్న వైకల్యం కారణంగానే ఉద్యోగం కోల్పోయానని బర్న్స్ బర్మింగ్‌హామ్ ఎంప్లాయ్మెంట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. 2025లో ట్రిబ్యునల్ ఆమె వాదనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆమెను వైకల్యాలకు సంబంధించిన కారణాలతోనే ఉద్యోగం నుంచి తొలగించినట్లు తేల్చింది.దీంతో ఇక తనకు జరిగిన నష్టానికి పరిహారం కోరే ప్రక్రియ మొదలైంది. ఇందులో కేవలం అప్పటి జీతాన్ని మాత్రమే కాకుండా.. భవిష్యత్‌లో కోల్పోయే ఆదాయం, ఈక్విటీ తదితర నష్టాలను కూడా బర్న్స్ లెక్కలోకి తీసుకున్నారు. బర్న్స్ దాఖలు చేసిన లెక్కల ప్రకారం ఆమె కోరుతున్న పరిహారం ఎంతో తెలుసా?.. 76 మిలియన్ పౌండ్లు. అక్షరాల మన కరెన్సీలో రూ.9,637 కోట్లకు సమానం. ఉద్యోగం కోల్పోవడం వల్ల భవిష్యత్‌లో తాను కోల్పోయే సంపాదనను ఈ మొత్తంగా లెక్కించినట్లు ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. బ్రిటన్‌లోని ఎంప్లాయ్మెంట్ ట్రిబ్యునల్ ముందు ఇంత భారీ మొత్తాన్ని క్లెయిమ్ చేసిన కేసు అత్యంత అరుదైనదిగా నిలిచింది. అయితే గిట్‌పాడ్ ఈ మొత్తాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. పరిహారం క్లెయిమ్‌ను రూ.12.68 కోట్లకే(1 మిలియన పౌండ్) పరిమితం చేయాలని కంపెనీ కోరింది. అంతకంటే ఎక్కువ మొత్తం పొందే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వాదించింది. బర్న్స్ లెక్కలను కంపెనీ ‘అసాధారణమైనవి’గా అభివర్ణించింది.షేర్ల విలువ కూడా లెక్కలోకి.. ఇక్కడే ఈ కేసు మరో మలుపు తిరిగింది. బర్న్స్‌కు గిట్‌పాడ్‌లో 0.85 శాతం షేర్లు ఉన్నట్లు ట్రిబ్యునల్ విచారణలో వెల్లడైంది. ఈ వాటా ప్రస్తుత పరిస్థితుల్లో సుమారు రూ.32.61 కోట్లు విలువ ఉంది. అలాగే గిట్పాట్ను ఓపెన్ఏఐ రూ.3,836.76 కోట్లకు కొనుగోలు చేసే చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. ఈ లెక్కన.. నాలుగేళ్లలో గిట్‌పాడ్‌లో ఆమెకున్న వాటా విలువ రూ.267.13 కోట్లకు చేరే అవకాశం ఉంది. ఈ లెక్కలనే జడ్జి రేచల్ వెడ్డర్స్పూన్ తాజాగా పేర్కొన్నారు. కాబట్టి ఆమె పిటిషన్ విచారణకు అర్హత ఉందనేది తేల్చి చెప్పింది. దీంతో ఆమె తన భారీ పరిహారం క్లెయిమ్‌ను కొనసాగించేందుకు అవకాశం లభించినట్లైంది.బర్న్స్ ప్రస్తుతం టెక్ రంగానికి దూరంగా ఉన్నారు. థెరపిస్ట్‌గా మారేందుకు శిక్షణ తీసుకుంటున్నారు. ఉద్యోగం పోయిన ఓ ఘటనతో మొదలైన ఈ వివాదం.. ఇప్పుడు బ్రిటన్‌లోనే కాదు యావత్ కార్పొరేట్ ప్రపంచంలోనే భారీ పరిహారం క్లెయిమ్‌గా మారడం ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: డబుల్ గేమ్‌తో భారత్‌కు కష్టమేనా? -
హార్ముజ్ కోసం ట్రంప్–ఇరాన్ కీలక బేరం!
అమెరికా–ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలకు తెరదించే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల నేపథ్యంలో ఇరు దేశాల ప్రతినిధులు దశలవారీ ఒప్పందంపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా అమెరికా ఇరాన్‌పై విధించిన ఆర్థిక దిగ్బంధనాన్ని సడలిస్తే.. ఇరాన్ వ్యూహాత్మకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇన్నాళ్లూ కత్తులు దూసుకున్న అమెరికా–ఇరాన్ ఇప్పుడు ఒకే టేబుల్ వద్దకు వచ్చాయి. యుద్ధాన్ని ఆపేందుకు జరుగుతున్న చర్చల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇరు దేశాల చేతుల్లో ఉన్న రెండు బలమైన అస్త్రాలే ఇప్పుడు బేరసారాలకు వచ్చాయి. ఒకటి అమెరికా ఆంక్షలు.. మరొకటి ఇరాన్ చేతిలో ఉన్న హార్ముజ్ జలసంధి!ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ప్రధాన బేరసారాల అంశంగా మారింది. హార్ముజ్ ద్వారా నౌకల రాకపోకలు స్వేచ్ఛగా సాగాలని అమెరికా కోరుతోంది. మరోవైపు తమ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తున్న అమెరికా ఆంక్షలు, దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. స్తంభించిన పరిస్థితిని దశలవారీగా పరిష్కరించడమే సాధ్యమైన మార్గమని ఇరాన్‌కు చెందిన సీనియర్ అధికారి పేర్కొన్నట్లు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది.ప్రతిపాదిత ఒప్పందంలో తొలి దశగా ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌పై విధించిన ఆర్థిక దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, దానికి ప్రతిగా టెహ్రాన్ హార్ముజ్ మీదుగా నౌకల రాకపోకలను పునరుద్ధరించడం ఉండొచ్చని ఆ కథనం తెలిపింది. అంతేకాకుండా విదేశాల్లో ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తులను మోక్షం కల్పించే అంశాన్ని కూడా టెహ్రాన్ కోరవచ్చని తెలుస్తోంది.ట్రంప్ ప్రభుత్వం ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తే.. ఇరాన్ ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన జలమార్గాన్ని తెరవాలన్నది ప్రతిపాదన. అయితే ఇది తుది శాంతి ఒప్పందం కాకపోవచ్చని, గత జూలైలో కుదిరిన అవగాహన విఫలమైన నేపథ్యంలో ఈసారి ఇరు దేశాల రాయితీలు ఎంతకాలం అమల్లో ఉంటాయన్నదే కీలకమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.హార్ముజ్ తెరవడానికి ఇరాన్ రెడీ.. కానీ!అమెరికా సైనిక ఒత్తిడిని తగ్గించి, ఇరాన్ నౌకాశ్రయాలపై దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే వారం రోజుల్లోనే హార్ముజ్‌ను తిరిగి తెరవడానికి సిద్ధంగా ఉందట. ఈ ప్రతిపాదనను మధ్యవర్తుల ద్వారా సెప్టెంబర్ 16న ట్రంప్ ప్రభుత్వానికి చేరవేసినట్లు తెలుస్తోంది. అయితే అసలు చిక్కు ఇక్కడే ఉంది.తమ వద్ద ఉన్న బలమైన బేరసారాల అస్త్రాన్ని ముందుగా వదులుకోవడానికి ట్రంప్ ప్రభుత్వం, ఇరాన్ రెండూ సిద్ధంగా లేవు. అమెరికా వద్ద ఆర్థిక ఆంక్షలు, దిగ్బంధనం ప్రధాన ఒత్తిడి సాధనాలైతే.. ఇరాన్ చేతిలో హార్ముజ్ జలసంధి ఉంది. దీంతో ఎవరు ముందుగా మెట్టు దిగాలన్నదే చర్చల్లో కీలకంగా మారింది.ట్రంప్ ఒత్తిడి.. ఇరాన్ ప్రతిఘటనట్రంప్ ప్రభుత్వం మాత్రం టెహ్రాన్‌పై ఒత్తిడి తగ్గించే సంకేతాలు ఇవ్వడం లేదు. ఇరాన్ చమురు ఎగుమతులను దెబ్బతీసే ఆంక్షలకు తోడు ఈ నెలలో ఆ దేశ వాణిజ్య విమానయాన సంస్థలు, వాటి సహాయక నెట్‌వర్క్‌లపైనా అమెరికా చర్యలు తీసుకుంది. ఒప్పందానికి రాకపోతే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణిస్తుందని ట్రంప్ హెచ్చరించారు.మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. అమెరికా తమపై విధించిన ఆర్థిక, సైనిక ఒత్తిడిని ముందుగా తగ్గించాలని టెహ్రాన్ కోరుతోంది. ‘‘మా వేళ్లు ట్రిగ్గర్‌పైనే ఉన్నాయి’’ అని పదే పదే చెబుతూ వస్తుండడం.. పరిస్థితి ఎంత సున్నితంగా ఉందో వెల్లడిస్తోంది.ట్రాన్సిట్ ఫీజుపై ఇరాన్ మెట్టు దిగుతుందా?హార్ముజ్ మీదుగా వెళ్లే నౌకల నుంచి ట్రాన్సిట్ ఫీజు వసూలు చేయాలన్న తన డిమాండ్‌ను ప్రధాన ఒప్పందం నుంచి పక్కన పెట్టేందుకు ఇరాన్ సిద్ధంగా ఉన్నట్లు ప్రాంతీయ వర్గాలు చెబుతున్నాయి. ఆ అంశాన్ని ప్రత్యేక అనుబంధంలో చేర్చే అవకాశం ఉందని సమాచారం. గల్ఫ్ దేశాలు మాత్రం ఇలాంటి రుసుముల చెల్లింపును వ్యతిరేకిస్తున్నాయి.అయితే ఫీజు అంశాన్ని పక్కన పెట్టడం అంటే.. హార్ముజ్‌పై తన నియంత్రణను ఇరాన్ వదులుకున్నట్లు కాదని సంబంధిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ప్రధాన డీల్‌లో మాత్రం ముందుగా హార్ముజ్ రాకపోకలను పునరుద్ధరించడంపైనే దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది.ఎన్నికల తర్వాతే డీల్?అమెరికా మధ్యంతర ఎన్నికలు నవంబర్ 3న జరగనున్నాయి. ఈ ఎన్నికల తర్వాత అమెరికా–ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ ఇప్పటికే చెప్పారు. అయితే న్యూయార్క్‌లో ఇప్పుడు చర్చలు మళ్లీ వేగం పుంజుకోవడంతో.. ఎన్నికలకు ముందే ఏదైనా తాత్కాలిక అవగాహన కుదురుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.ఇరాన్ మాత్రం తమ డిమాండ్ల జాబితా చాలా పెద్దదేనని సంకేతాలిస్తోంది. దీంతో ట్రంప్ ప్రభుత్వం ఎంత మేరకు ఆర్థిక ఆంక్షలను సడలిస్తుంది? దానికి ప్రతిగా ఇరాన్ హార్ముజ్‌పై ఎలాంటి హామీ ఇస్తుంది? అన్నదే కీలకంగా మారింది.గల్ఫ్ దేశాలకూ టెన్షన్అమెరికా–ఇరాన్ చర్చలను గల్ఫ్ దేశాలు కూడా నిశితంగా గమనిస్తున్నాయి. హార్ముజ్‌పై ఇరాన్‌కు శాశ్వత నియంత్రణ కల్పించే ఏ ఒప్పందాన్నైనా అవి వ్యతిరేకిస్తున్నాయి. అదే సమయంలో యుద్ధం మరింత విస్తరించకుండా ఉద్రిక్తతలు తగ్గాలని కోరుకుంటున్నాయి. ఎందుకంటే హార్ముజ్ కేవలం ఇరాన్–అమెరికా మధ్య బేరసారాల అంశం కాదు. ప్రపంచ ఇంధన రవాణాకు ఇది అత్యంత కీలకమైన మార్గం. ఈ జలసంధిలో నౌకల రాకపోకలు సాధారణ స్థితికి వస్తే అంతర్జాతీయ చమురు సరఫరాపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే ట్రంప్–ఇరాన్ చర్చల్లో ఏ చిన్న పురోగతినైనా గల్ఫ్ దేశాలు, ఇంధన మార్కెట్లు నిశితంగా గమనిస్తున్నాయి.ఇదీ చదవండి: మీకు దణ్ణం పెడతాం.. ఏఐని ఆపండి -
ట్రంప్‌పై మీడియా విక్టరీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పలు మీడియా సంస్థల జర్నలిస్టులను వైట్‌హౌస్‌లోకి అనుమతించకుండా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఫెడరల్ కోర్టు అడ్డుకుంది. ఆ మీడియా సంస్థలను తక్షణమే అనుమతించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాదు.. ట్రంప్ విధించిన ఈ నిషేధం రాజ్యాంగ విరుద్ధమయ్యే అవకాశం ఉందని జడ్జి ఈ సందర్బంగా అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ 18న ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా సీఎన్ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఈ సంస్థలు ‘‘ఫిక్షన్, అబద్ధాలు’’ ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ.. వైట్‌హౌస్‌లోకి వాటి జర్నలిస్టులను అనుమతించబోమని ప్రకటించారు. ఆ తర్వాత ఆయా సంస్థలకు చెందిన రిపోర్టర్ల ప్రెస్ యాక్సెస్‌ను నిలిపివేశారు. ఈ వివాదం మధ్య వైట్‌హౌస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన టీవీ నెట్‌వర్క్‌లు వైట్‌హౌస్ ప్రెసిడెన్షియల్ టీవీ పూల్ కవరేజ్‌ను నిలిపివేసిన నేపథ్యంలో.. వైట్‌హౌస్ స్వయంగా ట్రంప్ టీవీ పేరుతో 24 గంటల స్ట్రీమింగ్ ఛానల్‌ను ప్రారంభించింది. యూట్యూబ్, వైట్‌హౌస్ వెబ్సైట్ ద్వారా ప్రసారమవుతున్న ఈ ఛానల్లో ట్రంప్ ప్రసంగాలు, గత కార్యక్రమాల వీడియోలు, ఆయన పాలనకు సంబంధించిన ముఖ్యాంశాలను ప్రసారం చేయడం మొదలుపెట్టింది.కోర్టును ఆశ్రయించిన మూడు సంస్థలుట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆ మీడియా సంస్థలు సంయుక్తంగా కోర్టును ఆశ్రయించాయి. తమపై విధించిన నిషేధం అమెరికా రాజ్యాంగంలోని ఫస్ట్ అమెండ్మెంట్ హక్కులను, మీడియా స్వేచ్ఛను ఉల్లంఘిస్తోందని వాదించాయి. ముందస్తు నోటీసు ఇవ్వకుండా, తమ వాదన వినకుండా యాక్సెస్ రద్దు చేశారని పేర్కొన్నాయి.‘బ్యాన్’పై జడ్జి అభ్యంతరంఈ కేసును విచారించిన యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి టిమ్ కెల్లీ.. వైట్‌హౌస్ అనుసరించిన విధానంపై సందేహాలు వ్యక్తం చేశారు. జర్నలిస్టుల యాక్సెస్‌ను రద్దు చేసే ముందు వారికి తగిన ప్రక్రియ, తమ వాదన వినిపించే అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని సూచించారు. తాజాగా ఇచ్చిన ఆదేశంలో మూడు మీడియా సంస్థల జర్నలిస్టులకు వైట్‌హౌస్ యాక్సెస్‌ను పునరుద్ధరించాలని ఆదేశిస్తూ.. ట్రంప్ బ్యాన్ రాజ్యాంగ విరుద్ధమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. జాతీయ భద్రత పేరుతో సమర్థించిన ప్రభుత్వంఅయితే ట్రంప్ ప్రభుత్వం మాత్రం వైట్‌హౌస్ యాక్సెస్ అనేది హక్కు కాదని, ఒక ప్రత్యేక సదుపాయమని వాదించింది. ఆయా మీడియా సంస్థల రిపోర్టింగ్ జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను ప్రభావితం చేస్తోందని జస్టిస్ డిపార్ట్మెంట్ తరఫు న్యాయవాదులు కోర్టులో పేర్కొన్నారు. ట్రంప్ కూడా ఆయా సంస్థల వార్తలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మీడియా–ట్రంప్ మధ్య ముదిరిన వివాదంట్రంప్ నిర్ణయంతో అమెరికాలో మీడియా స్వేచ్ఛ, అధ్యక్షుడి అధికారాలపై పెద్ద చర్చ మొదలైంది. మూడు సంస్థలపై నిషేధానికి నిరసనగా ఇతర ప్రధాన టీవీ నెట్‌వర్క్‌లు కూడా వైట్‌హౌస్ ప్రెస్ పూల్ కవరేజీని తాత్కాలికంగా నిలిపివేశాయి. దీంతో అధ్యక్షుడి అధికారిక కార్యక్రమాల మీడియా కవరేజీపై ప్రభావం పడింది. అయితే తాజా కోర్టు ఆదేశంతో ట్రంప్–మీడియా వివాదం మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో తదుపరి న్యాయపరమైన పరిణామాలు వైట్‌హౌస్ మీడియా యాక్సెస్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఫెడరల్ కోర్టు తీర్పును ట్రంప్ సర్కార్ పైకోర్టులో సవాల్ చేసే చాన్స్ ఉంది. -
ప్రోటోకాల్ దాటి.. జిన్‌పింగ్‌కు ట్రంప్ అరుదైన స్వాగతం
అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరుదైన స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో వాషింగ్టన్ చేరుకున్న జిన్‌పింగ్, ఆయన భార్య పెంగ్ లియువాన్‌లను ట్రంప్, ఆయన సతీమణి మెలానియా స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఆహ్వానించారు. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత.. అమెరికా గడ్డపై ఓ విదేశీ నేతకు లభించిన అత్యంత అరుదైన స్వాగతంగా దీని గురించి చర్చ నడుస్తోంది.జాయింట్ బేస్ ఆండ్రూస్ ఎయిర్‌బేస్‌లో జిన్‌పింగ్ విమానం దిగగానే రెడ్ కార్పెట్‌పైకి వచ్చిన ట్రంప్ దంపతులు ఆయనకు కరచాలనం చేసి స్వాగతం పలికారు. 21 మంది సభ్యులతో కూడిన గౌరవ వందనం, సైనిక బ్యాండ్, రెండు బి-1 బాంబర్ విమానాల విన్యాసంతో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ట్రంప్, జిన్‌పింగ్ కొద్దిసేపు మాట్లాడుకుని అనంతరం ఫొటోలకు పోజులిచ్చారు. ఈ మూడు రోజుల పర్యటనలో గురువారం వైట్‌హౌస్‌లో అధికారిక స్వాగత కార్యక్రమం, సైనిక పరేడ్, ద్వైపాక్షిక చర్చలు, స్టేట్ డిన్నర్ జరగనున్నాయి.Chinese President Xi Jinping and his wife, Peng Liyuan, were warmly greeted by U.S. President Donald Trump and his wife, Melania Trump, at the airport in a rare planeside welcome. pic.twitter.com/IoUSosQZ8d— Mulan Chun-Li (@chunlimulan) September 24, 2026ఓ విదేశీ నేతను అమెరికా అధ్యక్షుడు ఈ స్థాయిలో స్వయంగా స్వాగతించడం.. అదీ సుమారు ఆరు దశాబ్దాల తర్వాత కావడంతో చర్చనీయాంశంగా మారింది. ఇంతకు ముందు అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నడీ 1962లో పలువురు విదేశీ నేతలను వ్యక్తిగతంగా స్వాగతించారు. ఆ తర్వాత బుష్, ఒబామా కాలంలో పోప్లను మాత్రం స్వాగతించారు. పోటోకాల్ పేరిట అధ్యక్షుడిని మినహాయించి.. విదేశీ నేతలకు అధికార యంత్రాంగం వెల్కమ్ చెప్పటం అక్కడ ఆనవాయితీగా మారిపోయింది. అయితే జిన్‌పింగ్ కోసం ట్రంప్ ఇప్పుడు దానిని చెరిపేశారు.ఎందుకింత ప్రత్యేకం?అమెరికా అధ్యక్షులు సాధారణంగా విదేశీ నేతలను విమానాశ్రయానికి వెళ్లి స్వయంగా ఆహ్వానించరు. జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో ఇలాంటి స్థాయి స్వాగతాలు అత్యంత అరుదు. జిన్‌పింగ్ పర్యటనకు ముందు ట్రంప్ అక్కడికి వెళ్లి స్వయంగా స్వాగతం పలకనున్నట్లు అమెరికా అధికారులు ప్రకటించడంతోనే ఆసక్తి నెలకొంది.ఈ పర్యటనకు మరో ప్రత్యేకత ఉంది. 2015 తర్వాత అమెరికా రాజధానికి చైనా అధ్యక్షుడి తొలి స్టేట్ విజిట్ ఇది. అయితే 2023లో అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన అమెరికా–చైనా శిఖరాగ్ర భేటీ, APEC సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు. ఇప్పుడు మాత్రం అధికారిక స్టేట్ విజిట్‌లో భాగంగా వాషింగ్టన్ చేరుకున్నారు. గత మేలో ట్రంప్ చైనాలో పర్యటించినప్పుడు జిన్‌పింగ్ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఆయనను కలవలేదు. ఈసారి మాత్రం ట్రంప్ స్వయంగా జిన్‌పింగ్‌ను స్వాగతించడం రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది.వాణిజ్య యుద్ధానికి తాత్కాలిక బ్రేక్?జిన్‌పింగ్ అమెరికాలో అడుగుపెట్టిన రోజే రెండు దేశాల మధ్య వాణిజ్య అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ప్రకారం.. అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య సంధిని జనవరి 10 వరకు పొడిగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ ఒప్పందం నవంబర్‌లో ముగియాల్సి ఉంది. సుంకాలను తగ్గించడం, కొత్త వాణిజ్య ఆంక్షలు విధించకుండా ఉండటం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఇరు దేశాల మధ్య సుంకాలు, అరుదైన ఖనిజాలు, చిప్స్, సాంకేతికత వంటి అంశాల్లో విభేదాలు ఇంకా కొలిక్కి రావాల్సి ఉంది.టేబుల్‌పై ట్రేడ్.. ఏఐ.. ఇరాన్.. తైవాన్ట్రంప్–జిన్‌పింగ్ భేటీలో వాణిజ్యంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కీలక అంశంగా ఉండనుంది. ఏఐ రంగంలో ఆధిపత్యం కోసం అమెరికా, చైనా తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ సాంకేతికతపై ఆందోళనలను చర్చించేందుకు ఇరు దేశాల మధ్య ప్రత్యేక కమ్యూనికేషన్ ఛానల్ ఏర్పాటు చేసే అంశం కూడా ప్రాథమిక చర్చల్లోకి వచ్చింది.అరుదైన ఖనిజాల సరఫరా కూడా కీలకంగా మారింది. ఎలక్ట్రానిక్స్ నుంచి సైనిక పరికరాల వరకు అనేక రంగాలకు అవసరమైన రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో చైనాకు ఉన్న ఆధిపత్యం అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కీలక చిప్స్, ఇతర సాంకేతిక ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న ఎగుమతి నియంత్రణలను చైనా వ్యతిరేకిస్తోంది.ఇరాన్ అంశం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశముంది. ఇరాన్‌తో చైనా సంబంధాలు, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న పరిణామాలు, తైవాన్ అంశాలపై రెండు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అందువల్ల మూడు రోజుల పర్యటనలో అసలు చర్చలు గురువారం జరిగే ట్రంప్–జిన్‌పింగ్ సమావేశంపైనే కేంద్రీకృతం కానున్నాయి.భారీ ఏర్పాట్లు.. టెక్ దిగ్గజాలతో విందుజిన్పింగ్ పర్యటనలో భాగంగా గురువారం వైట్‌హౌస్‌లో స్టేట్ డిన్నర్ నిర్వహించనున్నారు. ఇందులో అమెరికా టెక్ రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. ఏఐ, చిప్స్, టెక్నాలజీ రంగాల దిగ్గజాల హాజరు ఈ విందుకు మరింత ప్రాధాన్యతను తెచ్చింది.శుక్రవారం జిన్‌పింగ్, పెంగ్ లియువాన్లు ట్రంప్ దంపతులతో వైట్‌హౌస్‌లో టీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అమెరికా చరిత్రకు సంబంధించిన కీలక పత్రాలు భద్రపరిచిన నేషనల్ ఆర్కైవ్స్‌ను సందర్శించనున్నారు. ఆ తర్వాత జాయింట్ బేస్ ఆండ్రూస్ నుంచి జిన్‌పింగ్ తిరుగు ప్రయాణం కానున్నారు.అమెరికా–చైనా మధ్య వాణిజ్య, సాంకేతిక, భౌగోళిక రాజకీయ విభేదాలు పూర్తిగా సమసిపోలేదు. అయితే చర్చల ద్వారా సంబంధాలను అదుపులో ఉంచి, మరోసారి పెద్ద స్థాయి ఘర్షణకు దారితీయకుండా చూడాలన్న ప్రయత్నం మాత్రం ఈ పర్యటనలో స్పష్టంగా కనిపిస్తోంది. -
సమాధులు తవ్వి.. ఆడపిల్లల మృతదేహాలపై అఘాయిత్యమా?
పాకిస్థాన్‌లోని పెషావర్‌లో దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. షేకాన్ ప్రాంతంలోని ఓ శ్మశానవాటికలో సమాధి నుంచి బాలిక మృతదేహాన్ని వెలికితీస్తున్న ఓ యువకుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే విచారణలో అతని నోటి నుంచి దిగ్భ్రాంతికర విషయాలు బయటకు వచ్చాయి.పెషావర్ సదర్ ఎస్పీ ఫిదా హుస్సేన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 19 ఏళ్ల సల్మాన్ బాలికల సమాధులను లక్ష్యంగా చేసుకున్నాడు. మృతదేహాలను వెలికితీస్తున్న టైంలో శ్మశానవాటిక వాచ్‌మన్ పట్టుకున్నాడు. ఆ తర్వాత స్థానికుల సహకారంతో పోలీసులకు అప్పగించాడు. తొలుత వాటిని తవ్విచూసి .. మృతదేహాలను అవమానిస్తూ మానసిక ఆనందం పొందాడేమోనని భావించారు. అయితే మృతదేహాల్ని వెలికి తీసి.. వాటిపై అతను లైంగిక వాంఛలు తీర్చుకున్నాడనే విషయం అధికారుల్ని విస్మయానికి గురి చేసింది.అలా సల్మాన్ ఇప్పటిదాకా పదికి పైగా సమాధులను ధ్వంసం చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇంతలో ఈ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఈ విషయం జనాల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు దారి తీసింది.దర్యాప్తులో భాగంగా నిందితుడిని ఘటనాస్థలాలను గుర్తించేందుకు పోలీసులు షేకాన్ శ్మశానవాటికకు తీసుకెళ్తుండగా.. మోటార్‌సైకిళ్లపై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు పోలీసుల వాహనంపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో సల్మాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా అతడు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు గాలింపు చేపట్టారు.కేసులో తేలాల్సిన అంశాలెన్నో..నిందితుడు పోలీసుల కస్టడీలోనే మరణించడంతో.. పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. గత కొంతకాలంగా పాక్‌లోని పలు ప్రాంతాల్లో ఈ తరహా ఘటనలు పెరిగిపోయాయి. సమాధుల్లోనూ మహిళలకు కరువైందనే చర్చా అక్కడ నడుస్తోంది. ఈ క్రమంలో కొందరు సమాధులకు గ్రిల్స్ ఏర్పాటు చేసినట్లు ఫొటోలు, వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ తరహా ముఠాలు అక్కడ చాలానే ఉన్నాయనే కోణంలో పోలీసులు ఇప్పుడు దర్యాప్తు జరుపుతున్నారు. ఇదీ చదవండి: రెండుసార్లు పుట్టిన బిడ్డ గురించి తెలుసా? -
ఓ వైపు గొంతు చించుకుంటుంటే.. మరోవైపు రీల్స్‌తో రిలాక్స్
ప్రపంచ దేశాల అధినేతలు కొలువుదీరిన ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యప్ ఎర్డోగాన్ ఆవేశపూరితంగా ప్రసంగిస్తున్న సమయంలో.. అల్ షరా కూల్‌గా స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తూ కెమెరాకు చిక్కారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది.యూఎన్ సాధారణ సభ 81వ సెషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ వేదికగా ప్రపంచ నేతలు యుద్ధాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, సంక్షోభాలు, దౌత్యపరమైన అంశాలపై ప్రసంగిస్తున్నారు. ఇలాంటి కీలక సమావేశం సాగుతున్న సమయంలో సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా మాత్రం ఫోన్లో నిమగ్నమై కనిపించడం చర్చకు దారితీసింది. ఓవైపు ప్రపంచ నేతలు అత్యంత సీరియస్ అంశాలపై మాట్లాడుతుంటే.. ఆయన మాత్రం ఏం పట్టనట్లు ఫోన్లో రిలాక్స్ అవుతున్నారంటూ కొందరు సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా.. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రసంగిస్తున్న సమయంలోనే షరా ఫోన్ చూస్తున్న దృశ్యాలు కెమెరాకు చిక్కడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. అయితే షరా ఏం చూస్తున్నారో, ఆ సమయంలో ఆయన ఉద్దేశం ఏమిటో స్పష్టంగా తెలియదు. ఇదే సమయంలో మరికొందరు మాత్రం కేవలం కొన్ని సెకన్ల దృశ్యాలను ఆధారంగా చేసుకుని ఆయనపై విమర్శలు చేయడం సరికాదంటూ మద్దతుగా స్పందిస్తున్నారు. UNGA gets an unexpected Instagram momentSyrian President Ahmed al-Sharaa appeared busy scrolling Instagram reels as world leaders addressed the UN General Assembly.#UNGA #AhmedAlSharaa #Syria #UnitedNations #Viral #WorldNews pic.twitter.com/gihsZZaNNO— Diganta Guha (@diganta_guha) September 23, 2026రెండోసారి యూఎన్జీఏకు..అల్ షరాకు ఇది యూఎన్‌జీఏలో రెండోసారి పాల్గొనడం. 2025లో బషర్ అల్ అసద్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఆయన సిరియా తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అదే ఏడాది దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత యూఎన్‌జీఏలో ప్రపంచ నేతలను ఉద్దేశించి ప్రసంగించిన తొలి సిరియా నాయకుడిగా నిలిచారు. అయితే టర్కీ–సిరియా మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ.. యూఎన్ వేదికపై కనిపించిన ఈ దృశ్యం ఇప్పుడు వైరల్‌గా మారింది.ఎర్డోగాన్ కశ్మీర్‌పై ఉచిత సలహా..ఇదే సమయంలో ఎర్డోగాన్ తన ప్రసంగంలో మరోసారి కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. దక్షిణాసియాలోని అన్ని వివాదాలను, కశ్మీర్ సమస్యతో సహా, యూఎన్ చార్టర్, సంబంధిత తీర్మానాల పరిధిలో చర్చల ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కశ్మీర్‌పై ఎర్డోగాన్ యూఎన్ వేదికగా మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. 2025లోనూ ఆయన ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఎర్డోగాన్ వ్యాఖ్యలపై భారత్ గతంలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. జమ్మూకశ్మీర్ అంశం భారత్–పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక విషయమని, మూడోపక్ష మధ్యవర్తిత్వం అవసరం లేదని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ట్రంప్ ఇలా పొగిడాడో లేదో.. పాక్ ప్రధానికి తిట్లు! -
షార్జాలో భారతీయుడి దారుణ హత్య.. భార్య, కొడుకు మిస్సింగ్!
యూఏఈలో జరిగిన ఘోరం.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షార్జాలో భారతీయుడి మిస్టరీ కేసు విషాదాంతంగా ముగిసింది. అతని మృతదేహం ఓ కారులో ముక్కలుగా లభించగా.. భార్య, కొడుకు కనిపించకుండా పోవడం ఈ కేసును మరింత మిస్టరీగా మార్చింది. మృతుడ్ని కర్ణాటకకు చెందిన అల్విన్ ప్రకాశ్ కుందర్గా అక్కడి అధికారులు నిర్దారించారు.ఉడుపి జిల్లా కుందాపురకు చెందిన అల్విన్ .. గత 14 ఏళ్లుగా షార్జా ఎయిర్‌పోర్టులో పని చేస్తుండేవారు. భార్య, కొడుకుతో ఆయన అక్కడే జీవిస్తున్నారు. అయితే జూలై 20న అల్విన్‌కు ఆయన సోదరుడు అనిల్ ప్రశాంత్ కుందర్ ఫోన్ చేశారు. అల్విన్ కాల్ ఎత్తకపోగా.. తాను బాగానే ఉన్నానంటూ మెసేజ్ పంపారు. సాధారణంగా వాయిస్ మెసేజ్‌ల ద్వారానే మాట్లాడే అల్విన్ ఇలా టెక్స్ట్ చేయడం కుటుంబ సభ్యులకు అనుమానం కలిగించింది. వారం రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో స్నేహితుడి ద్వారా ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేశారు.అల్విన్ నివసించే అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన ఆయన స్నేహితుడికి వాచ్‌మన్.. ఆయన భారత్‌కు వెళ్లిపోయారని చెప్పాడు. ఆయన పని చేసే కంపెనీ హెచ్ఆర్ విభాగం కూడా ఇదే విషయాన్ని చెప్పింది. దీంతో కొన్నాళ్లు ఆగి చూసినా ఫలితం లేకపోయింది. దీంతో సదరు కంపెనీ అధికారులు పాస్‌పోర్ట్ వివరాలను పరిశీలించారు. అల్విన్ అప్పటికీ షార్జాలోనే ఉన్నట్లు తేలడంతో మిస్సింగ్ ఫిర్యాదు చేశారు.రెండు నెలల తర్వాత.. ఒమన్ వైపు వెళ్లే మార్గంలో పార్క్ చేసిన ఓ కారులో ఓ మృతదేహం లభించింది. అందులో మృతదేహాన్ని తొమ్మిది ముక్కలుగా చేసి రెండు బ్యాగుల్లో ఉంచారు. పోస్టుమార్టం ద్వారా మృతదేహం అల్విన్దేనని నిర్ధారణ అయింది. హత్యకు కారణం ఏమిటి? ఎవరు చేశారు? అనే వివరాలు మాత్రం ఇంకా వెలుగులోకి రాలేదు.భార్య, కుమారుడు ఎక్కడ?అల్విన్ హత్య తర్వాత ఆయన భార్య టీనా, కుమారుడు ఆచూకీ తెలియకపోవడం కేసులో మరో ప్రశ్నగా మారింది. వాళ్లు షార్జా నుంచి భారత్‌కు వెళ్లి ఉండొచ్చన్న ప్రచారం ఉన్నప్పటికీ.. దీనిపై అధికారిక నిర్ధారణ లేదు. హత్యలో టీనా పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దంపతుల మధ్య ఎలాంటి వివాదం ఉన్నట్లు తమకు తెలియదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.ఉడుపి పోలీసుల దృష్టికి..అల్విన్ సోదరుడు అనిల్, ఉడుపి ఎస్పీని కలిసి కేసుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. షార్జా అధికారుల నుంచి అధికారిక సమాచారం కోసం ఉడుపి పోలీసులు ఎదురుచూస్తున్నారు. యూఏఈలో న్యాయపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత అల్విన్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావాలని కుటుంబం ప్రయత్నిస్తోంది. హత్య వెనుక కారణం, నిందితులెవరు, అల్విన్ భార్య, కుమారుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారన్నది షార్జా దర్యాప్తులో తేలాల్సి ఉంది.మరోవైపు ఈ ఘటన వెలుగులోకి రావడానికి దాదాపు రెండు నెలలు పట్టడం, హత్య తర్వాత అల్విన్ భార్య, పదో తరగతి చదువుతున్న కుమారుడి ఆచూకీ లేకపోవడం కేసును మరింత మిస్టరీగా మార్చింది.విదేశాల్లో భారతీయుల విషాదం..ఉపాధి, మెరుగైన జీవితం కోసం విదేశాలకు వెళ్లే భారతీయులు అనుకోని ప్రమాదాలు, అనుమానాస్పద మరణాలతో కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగుల్చుతున్న ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తుంటాయి. అల్విన్ కుందర్ విషయంలోనూ అసలు ఏం జరిగింది? ఆయన హత్యకు దారితీసిన పరిస్థితులేమిటి? కుటుంబ సభ్యుల ఆందోళనలకు ఎప్పుడు సమాధానం దొరుకుతుంది? అనేది దర్యాప్తుపైనే ఆధారపడి ఉంది.ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పేంత తప్పు ఆ ఎమ్మెల్యే కూతురు చేసిందా? -
ట్రంప్ పొగడ్త.. ఉగ్రవాదంపై పాక్ ప్రధాని వ్యాఖ్యలు వైరల్
ఐక్యరాజ్యసమితి వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను ‘టెర్రిఫిక్ మ్యాన్’ అంటూ ప్రశంసించడం ఇప్పుడు మరో చర్చకు దారితీసింది. అయితే ఈ ప్రశంసలు పాక్‌కు అనుకూలంగా కనిపిస్తున్న వేళ.. ఉగ్రవాదంపై షరీఫ్ చేసిన ఓ వ్యాఖ్య సోషల్ మీడియాలో మళ్లీ వైరల్‌గా మారింది. ‘‘మా ఉగ్రవాదులను నియంత్రించకపోయి ఉంటేనా..’’ అని ఆయన వ్యాఖ్యపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.81వ UNGAలో మంగళవారం ప్రసంగించిన ట్రంప్.. భారత్, పాకిస్థాన్ మధ్య 2025లో చోటుచేసుకున్న సైనిక ఉద్రిక్తతను ప్రస్తావించారు. ఆ వివాదాన్ని ఆపేందుకు తాను జోక్యం చేసుకున్నానని మరోసారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను ‘టెర్రిఫిక్ మ్యాన్’గా అభివర్ణించారు. షరీఫ్ తనకు కృతజ్ఞతలు తెలిపారని, తాను 3 కోట్ల మంది ప్రాణాలను కాపాడినట్లు చెప్పారని ట్రంప్ పేర్కొన్నారు. అయితే భారత్ మాత్రం ఈ వివాదంలో మూడో పక్షం మధ్యవర్తిత్వం చేసిందన్న వాదనను గతంలో తిరస్కరించింది.వైరల్‌గా మారిన ఆ వ్యాఖ్య..ట్రంప్ ప్రశంసల నేపథ్యంలో షరీఫ్ చేసిన ఓ పాత వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2025లో జరిగిన 80వ యూఎన్‌జీఏలో ఆయన పాకిస్థాన్ రెండు దశాబ్దాలకు పైగా ఉగ్రవాదంపై పోరాడుతోందని చెప్పారు. ఈ పోరులో 90 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయామని, భారీ ఆర్థిక నష్టం ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. అదే ప్రసంగంలో షరీఫ్.. పాకిస్థాన్ ఉగ్రవాదులను ఎదుర్కొనకపోయి ఉంటే వారు న్యూయార్క్, లండన్ వీధుల్లో తిరిగేవారని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై పాకిస్థాన్ చేస్తున్న పోరాటాన్ని ప్రపంచ భద్రతకు తన దేశం చేస్తున్న సేవగా ఆయన అభివర్ణించారు.‘If we haven't controlled our terrorists, they would be roaming on the streets of New York or London"- Pakistan PM Shehbaz Sharif at UNGA pic.twitter.com/2bHJaAKEaG— Rishi Bagree (@rishibagree) September 22, 2026ఒప్పుకున్నట్లేనా?ఈ వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. పాకిస్థాన్‌కు కొత్త చిక్కు ఎదురైంది. షరీఫ్ మాటలను పట్టుకుని కొందరు నెటిజన్లు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్‌లు ఉన్నాయన్న విషయాన్ని ఆ దేశ ప్రధానే స్వయంగా అంగీకరించినట్టుగా వారు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఉగ్రవాదంపై పాక్ వైఖరి, గతంలో ఆ దేశంపై వచ్చిన ఆరోపణలు మరోసారి చర్చకు వస్తున్నాయి.ఇక్కడే మరో కీలక విషయం ఉంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ‘న్యూయార్క్, లండన్’ వ్యాఖ్య ఈ సమావేశాల్లో చేసిన షరీఫ్ చేసిన ప్రసంగానిది కాదు. షరీఫ్ 2026లో 81వ UNGAకి హాజరయ్యేందుకు సెప్టెంబర్ 21న న్యూయార్క్ చేరుకున్నారు. ఆయన తాజా UNGA ప్రసంగం సెప్టెంబర్ 25న జరగనుంది.ట్రంప్ నుంచి వచ్చిన బహిరంగ ప్రశంసల సమయంలోనే ఈ పాత వ్యాఖ్య మళ్లీ తెరపైకి రావడంతో.. పాకిస్థాన్ ఉగ్రవాదంపై తన గత వాదనలపై కొత్త చర్చ మొదలైంది. ఒకవైపు అమెరికా అధ్యక్షుడి ప్రశంసలు.. మరోవైపు షరీఫ్ పాత ఉగ్రవాద వ్యాఖ్య వైరల్ కావడం.. పాక్ దౌత్యానికి ఇది ఊహించని చర్చగా మారింది.ఇదీ చదవండి: ఆ టెక్నాలజీ మామూలుది కాదంటున్న ట్రంప్ -
ఇరాన్‌తో 3 గంటల చర్చలు.. గుడ్‌న్యూస్ చెప్పిన ట్రంప్
అమెరికా–ఇరాన్ మధ్య దాదాపు ఏడు నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి తెరపడే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ వేదికగా ఇరు దేశాల ప్రతినిధుల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి మధ్య సుమారు మూడు గంటలపాటు సమావేశం జరిగినట్లు ఇరు వర్గాలు ధ్రువీకరించాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సమావేశంలో నేరుగా పాల్గొనలేదు. ఆయన రాయబారులు, ఇరాన్ ప్రతినిధులు మధ్యే చర్చలు సాగాయి. ఈ భేటీపై ట్రంప్ మాత్రం సానుకూల వ్యాఖ్యలు చేశారు. అమెరికా–ఇరాన్ ప్రతినిధుల మధ్య జరిగిన సమావేశం ‘చాలా బాగుంది’ అని ఆయన చెప్పారు. ఇరాన్‌కు ఒప్పందం చేసుకోవడం ప్రయోజనకరమని వ్యాఖ్యానించారు.మరోవైపు విట్కాఫ్ కూడా చర్చలు సుదీర్ఘంగా జరిగాయని, అవి నిర్మాణాత్మకంగా ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. మధ్యవర్తుల ద్వారా ఇరు వర్గాల మధ్య చర్చలు కొనసాగుతాయని చెప్పారు.హర్ముజ్ తెరవాలంటే మూడు షరతులుఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం హర్ముజ్ జలసంధి. ప్రపంచంలోని కీలక చమురు రవాణా మార్గాల్లో ఒకటైన ఈ జలసంధి ద్వారా భారీ స్థాయిలో చమురు, గ్యాస్ రవాణా జరుగుతుంది. యుద్ధం కారణంగా ఇక్కడ రవాణా తీవ్రంగా దెబ్బతినడంతో ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడుతోంది. అయితే జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ అమెరికా ముందు మూడు ప్రధాన షరతులు పెట్టినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.మొదటిది.. ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని వెంటనే ఎత్తివేయాలి.రెండోది.. అమెరికా వద్ద స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలి.మూడోది.. ఇరాన్ మద్దతు ఉన్న వివిధ ‘రెసిస్టెన్స్ ఫ్రంట్ల’పై కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించాలి.ఈ షరతులను నెరవేర్చినట్లయితే హర్ముజ్ జలసంధిని ఏడు రోజుల్లో తిరిగి తెరవగలమని ఇరాన్ గతంలోనే మధ్యవర్తుల ద్వారా అమెరికాకు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.ఆ విషయంలో ట్రంప్ ‘నో’మరోవైపు ట్రంప్ వైఖరిలో మాత్రం కీలకమైన అంశం మారలేదు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని పొందకూడదని ఆయన స్పష్టం చేశారు. ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన సమయంలో కూడా ఇరాన్ విషయంలో తన ముందు రెండు మార్గాలున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒకటి ఒప్పందం చేసుకుని ఇరాన్ భవిష్యత్తును మార్చడం.. మరో మార్గం తీవ్ర సైనిక చర్య అని హెచ్చరించారు.అయితే అదే సమయంలో ఇరాన్‌తో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పారు. ‘ఎలాగైనా ఒప్పందం కుదుర్చుకుంటాం.. వేగంగా పూర్తి చేస్తాం’ అన్నట్టుగా వ్యాఖ్యానించారు. దీంతో ట్రంప్ ఒకవైపు కఠిన హెచ్చరికలు చేస్తూనే.. మరోవైపు చర్చలకు తలుపులు తెరిచి ఉంచిన పరిస్థితి కనిపిస్తోంది.వాళ్లే ముందడుగు వేయాలిఇరాన్ వైపు నుంచి కూడా తాజాగా దౌత్యానికి అవకాశం ఉందన్న సంకేతాలు వచ్చాయి. అమెరికా నిజంగా సమస్యను దౌత్యపరంగా పరిష్కరించాలనుకుంటున్నట్లు అధికారికంగా స్పష్టం చేయాలని, ఆ తర్వాత చర్చలకు విధివిధానాలు, షెడ్యూల్ ఖరారు చేయాలని ఇరాన్ కోరుతోంది.ఇక హర్ముజ్ విషయంలోనూ ఇదే వైఖరిని ఇరాన్ అవలంబిస్తోంది. అమెరికా సైనిక ఒత్తిడిని తగ్గించి, దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే ఏడు రోజుల్లో జలసంధిని తెరవడానికి సిద్ధమని చెబుతోంది. అంటే ముందుగా అమెరికా చర్య తీసుకోవాలి.. ఆ తర్వాతే హర్ముజ్ తెరుచుకుంటుందన్నది ఇరాన్ ప్రతిపాదన.ఇప్పట్లో డీల్ కష్టమేనా?మూడు గంటల చర్చలు జరిగినప్పటికీ అమెరికా–ఇరాన్ మధ్య ఎలాంటి తుది ఒప్పందం కుదరలేదు. సమావేశంలో కొన్ని షరతులు, యుద్ధం ముగింపు మార్గాలు, హర్ముజ్ పునఃప్రారంభం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. రానున్న రోజుల్లో మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉంది.ప్రస్తుతం పరిస్థితి ‘యుద్ధం నుంచి చర్చల వైపు అడుగు’ వేసినంతవరకే ఉంది. అమెరికా తన సైనిక, ఆర్థిక ఒత్తిడిని తగ్గించాలన్నది ఇరాన్ డిమాండ్ కాగా.. ఇరాన్ అణ్వాయుధం దిశగా వెళ్లకుండా హామీ ఇవ్వాలన్నది ట్రంప్ ప్రధాన డిమాండ్. ఈ రెండు వైఖరుల మధ్యే అసలు పేచీ ఉంది.ప్రపంచం చూపు హర్ముజ్‌పైనే..హర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటుందా లేదా అన్నదే ఇప్పుడు అంతర్జాతీయంగా కీలకంగా మారింది. యుద్ధం కారణంగా ఈ మార్గంలో ఇంధన రవాణా దెబ్బతినడంతో చమురు మార్కెట్లలో ఆందోళన పెరిగింది. మరోవైపు సౌదీ అరేబియా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు ఎగుమతులను కొనసాగించే ప్రయత్నం చేస్తోంది. అమెరికా కూడా హర్ముజ్‌పై ఆధారాన్ని తగ్గించేందుకు గల్ఫ్ దేశాలతో ప్రత్యామ్నాయ ఇంధన రవాణా మౌలిక వసతులపై చర్చలు జరుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యూయార్క్‌లో జరిగిన ఈ మూడు గంటల భేటీకి ప్రాధాన్యత పెరిగింది. తదుపరి చర్చల్లో ఈ రెండు వైఖరుల మధ్య ఎంతవరకు సయోధ్య కుదురుతుందన్నదే అసలు కీలకం కానుంది.ఇదీ చదవండి: నా మాట వినకపోతే మీ గతి అదోగతే! -
ఐరాస సమావేశాల వేళ.. అమెరికా ఆకాశంలో గందరగోళం
అమెరికాలో విమాన రాకపోకలు ఒక్కసారిగా స్తంభించాయి. న్యూయార్క్ ప్రాంతంలోని కీలక విమానాశ్రయాల్లో వందలాది విమానాలు రద్దుకాగా.. వేలాది ఫ్లైట్లు ఆలస్యమయ్యాయి. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు ప్రపంచ దేశాల అధినేతలు, ప్రతినిధులు చేరుకుంటున్న సమయంలోనే ఈ అంతరాయం కలగడం ఒక్కసారిగా కలకలం రేపింది.ఈశాన్య ప్రాంతంలో ఫిలడెల్ఫియాలోని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రంలో కీలక కమ్యూనికేషన్ సర్క్యూట్ విఫలమవడంతో ఈ సమస్య మొదలైంది. విమానాల రాకపోకలను సమన్వయం చేయడంలో కీలకమైన ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలో అంతరాయం ఏర్పడటంతో ఎయిర్ ట్రాఫిక్ నిర్వహణపై ప్రభావం పడింది. దీంతో న్యూయార్క్ పరిసరాల్లోని ప్రధాన విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలు నెమ్మదించాయి. ఇదే సమయంలో ప్రత్యామ్నాయంగా ఉపయోగించాల్సిన బ్యాకప్ ఫైబర్ ఆప్టిక్ లైన్ కూడా నిర్మాణ పనుల కారణంగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రధాన కమ్యూనికేషన్ సర్క్యూట్ విఫలమైన సమయంలో బ్యాకప్ లైన్ అందుబాటులో లేకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.ఒకదాని తర్వాత ఒకటి..ఫిలడెల్ఫియాలోని ఎఫ్ఏఏ కేంద్రంలో సోమవారం ఉదయం కీలక కమ్యూనికేషన్ సర్క్యూట్ పనిచేయడం ఆగిపోయింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో బ్యాకప్ వ్యవస్థ పనిచేయాలి. కానీ అధికారులు దానిని ఉపయోగించేందుకు ప్రయత్నించగా.. న్యూజెర్సీలోని న్యూ బ్రన్స్విక్–నెవార్క్ మధ్య ఉన్న బ్యాకప్ ఫైబర్ ఆప్టిక్ లైన్ కూడా నిర్మాణ పనుల సమయంలో కట్ అయినట్లు గుర్తించారు. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కమ్యూనికేషన్‌కు ప్రత్యామ్నాయ మార్గం లేకుండా పోయింది.ఎఫ్ఏఏ అడ్మినిస్ట్రేటర్ బ్రయాన్ బెడ్ఫోర్డ్ ప్రకారం.. ఫైబర్ లైన్‌ను మరమ్మతు చేయడానికి సుమారు 13 గంటలు పట్టింది. మరోవైపు ప్రధాన సర్క్యూట్‌కు కొత్త లైన్‌ను ఏర్పాటు చేసే పనులు కూడా చేపట్టారు.వేలాది విమానాలు రద్దు!ఈ సాంకేతిక సమస్య ప్రభావం న్యూయార్క్‌లోని మూడు ప్రధాన విమానాశ్రయాలపై పడింది. జాన్ ఎఫ్. కెన్నడీ (JFK), లాగార్డియా, నెవార్క్ విమానాశ్రయాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫిలడెల్ఫియా విమానాశ్రయం కూడా ప్రభావితమైంది. కొన్ని విమానాలను దారి మళ్లించగా.. మరికొన్నింటిని నిలిపివేశారు.ఈ అంతరాయం కారణంగా అమెరికా వ్యాప్తంగా సుమారు 7,000 విమానాలు ఆలస్యంగా నడవగా.. వాటిల్లో కొన్ని రద్దు అయ్యాయి. న్యూయార్క్ ప్రాంతంలోని ప్రధాన విమానాశ్రయాల్లోనే 1,400కుపైగా విమానాలపై ప్రభావం పడింది.మళ్లీ సాధారణ స్థితికి..ఫైబర్ లైన్, టెలికాం కనెక్షన్ల మరమ్మతు పూర్తయ్యాక ఈశాన్య అమెరికాలో విమాన కార్యకలాపాలు తిరిగి సాధారణ స్థితికి వచ్చినట్లు అమెరికా రవాణా శాఖ తెలిపింది. అయితే అప్పటికే ఏర్పడిన రద్దులు, ఆలస్యాల ప్రభావం రోజంతా కొనసాగింది. కొన్ని విమానయాన సంస్థలు ప్రయాణికులకు అదనపు ఛార్జీలు లేకుండా టికెట్లను మార్చుకునే అవకాశం కల్పించాయి.ఇదే సమయంలో ఎఫ్ఏఏ వాషింగ్టన్ డీసీ ప్రాంతంలో విమాన షెడ్యూల్ సమస్యలు, వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి ఎయిర్ ట్రాఫిక్‌ను మళ్లించేందుకు ఏఐ ఆధారిత కొత్త కంప్యూటర్ వ్యవస్థను పరీక్షించడం ప్రారంభించింది. అయితే ఈ ఏఐ వ్యవస్థకు తాజా విమాన అంతరాయంతో సంబంధం లేదని అధికారులు తెలిపారు.యూఎన్ సమావేశాల వేళ.. మరింత టెన్షన్న్యూయార్క్లో యూఎన్ జనరల్ అసెంబ్లీ ఉన్నతస్థాయి సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ సమస్య తలెత్తింది. దాదాపు 130 మంది ప్రపంచ నేతలు, పలువురు మంత్రులు న్యూయార్క్‌కు చేరుకుంటున్న సమయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ నుంచి న్యూయార్క్‌కు వెళ్లే విమానం మాత్రం షెడ్యూల్ ప్రకారమే బయలుదేరింది.గతంలోనూ ఇదే కేంద్రం నుంచి..ఇదే ఫిలడెల్ఫియాలోని ఎఫ్ఏఏ కేంద్రం కారణంగా 2025 వసంతకాలంలో కూడా నెవార్క్ విమానాశ్రయంలో పలుమార్లు అంతరాయాలు ఏర్పడ్డాయి. దీంతో అమెరికా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలోని పాత కమ్యూనికేషన్ మౌలిక వసతులపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. తాజా ఘటనలో మాత్రం ప్రధాన సర్క్యూట్ విఫలమవడంతో పాటు బ్యాకప్ లైన్ కూడా అందుబాటులో లేకపోవడం సమస్యను మరింత తీవ్రం చేసింది.ఇదీ చదవండి: హౌతీలంటే ట్రంప్‌కు ఎందుకంత భయం? -
హౌతీల దూకుడు.. ట్రంప్ ప్లాన్ ఢమాల్!
పశ్చిమాసియాలో ఇప్పటికే ఇరాన్–అమెరికా యుద్ధంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. యెమెన్‌లో హౌతీల దూకుడు ఆ ప్రాంతాన్ని మరో సంక్షోభంలోకి నెడుతోంది. ఇరాన్ మద్దతున్న హౌతీలు ఎర్ర సముద్రం తీరంలో వేగంగా ముందుకు సాగుతూ కీలక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు వారి చూపు వ్యూహాత్మక పర్వతాలపై పడింది. మరోవైపు హౌతీలను అడ్డుకునేందుకు అమెరికా సాయం కోరిన యెమెన్ ప్రభుత్వం.. ట్రంప్ నుంచి మాత్రం ప్రత్యక్ష హామీ పొందలేకపోయింది.హౌతీలపై అమెరికా నేరుగా దాడి చేయబోతోందనే పరిస్థితి చివరి నిమిషంలో మారిపోయింది. పక్కా సమాచారం ప్రకారం.. ఆదివారం హౌతీలపై వైమానిక దాడులు చేయడానికి ట్రంప్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. హౌతీల స్థావరాలపై దాడులు చేసేందుకు విమానాల్లో బాంబులు ఎక్కిస్తున్న సమయంలోనే ట్రంప్ వాటిని నిలిపివేయాలని ఆదేశించారు. అంటే.. హౌతీలపై అమెరికా సైనిక చర్యకు సిద్ధమైనా.. ఆఖరి క్షణంలో ఆ ప్లాన్‌ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇటు అమెరికా సెంట్రల్ కమాండ్ అటు వైట్‌హౌస్ రెండూ ఇప్పటికీ స్పందించలేదు.ఇదే సమయంలో సౌదీ మద్దతు ఉన్న యెమెన్ ప్రభుత్వం అమెరికా సాయం కోరింది. ఆ దేశ అధ్యక్షుడు రషాద్ అల్ అలీమి, ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడారు. అయితే ట్రంప్ ఎలాంటి ప్రత్యక్ష సైనిక మద్దతు హామీ ఇవ్వలేదని తెలుస్తోంది.ఇప్పుడు పర్వతాలే టార్గెట్హౌతీల తాజా వ్యూహం యెమెన్‌లో పరిస్థితిని మరింత కీలకంగా మార్చేలా కనిపిస్తోంది. ఈ నెలలో ఎర్ర సముద్ర తీర ప్రాంతాల్లో వేగంగా ముందుకు సాగిన హౌతీలు.. ఇప్పుడు తైజ్, లహిజ్ ప్రావిన్సుల మధ్య ఉన్న కహ్బూబ్ పర్వతాల వైపు కదులుతున్నారు. ఈ ఎత్తైన ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటే ఎర్ర సముద్ర తీరాన్ని దక్షిణ యెమెన్‌లో ప్రభుత్వ ఆధీనంలోని ప్రాంతాల నుంచి వేరు చేసే అవకాశం ఉంటుంది.అల్-వజియాహ్ పర్వత ప్రాంతం, బాబ్ ఎల్ మండెబ్ జలసంధి సమీపంలోని రాస్ అల్-అరా ప్రాంతాల్లో పోరు తీవ్రంగా సాగుతున్నట్లు సమాచారం. మరీ ముఖ్యంగా బాబ్ ఎల్ మండెబ్ రీజియన్‌పై పట్టు కోల్పోయాక.. యెమెన్ రక్షణాత్మక ధోరణి ప్రదర్శిస్తోందనే విశ్లేషణలు నడుస్తున్నాయి.700 మంది మృతి.. 1.30 లక్షల మంది నిరాశ్రయులుహౌతీల తాజా దాడులతో యెమెన్‌లో మానవతా పరిస్థితి కూడా విషమిస్తోంది. తాజా పోరులో దాదాపు 700 మంది మరణించగా.. వేలాది మంది గాయపడ్డారు. సుమారు 1,30,000 మంది యెమెన్లోనే నిరాశ్రయులయ్యారు. మరో 3,000 మందికి పైగా ఎర్ర సముద్రం దాటి పడవల్లో ఆఫ్రికా వైపు వెళ్లినట్లు ఐక్యరాజ్యసమితి గణాంకాలను ఉటంకిస్తూ కథనం పేర్కొంది.హౌతీలను అడ్డుకునేందుకు సౌదీ అరేబియా కూడా రంగంలోకి దిగింది. హౌతీల స్థావరాలపై వందలాది వైమానిక దాడులు చేసింది. అయినప్పటికీ పర్వత ప్రాంతాల్లో హౌతీలను వెనక్కి నెట్టడం సౌదీ బలగాలకు సవాలుగా మారింది.సౌదీ చమురు ఎగుమతులకు కొత్త చిక్కుయెమెన్లో జరుగుతున్న పోరుకు మరో కీలక కోణం ఉంది. అది చమురు రవాణా. బాబ్ ఎల్ మండెబ్ ప్రాంతంలో హౌతీల పట్టు బలపడితే.. హర్ముజ్ జలసంధి వద్ద ఏర్పడే అంతరాయాలను తప్పించుకునేందుకు సౌదీ ఉపయోగించే ప్రత్యామ్నాయ చమురు మార్గానికి ఇబ్బంది కలగొచ్చు. దీంతో సౌదీ ఇప్పటికే హర్ముజ్ మీదుగా మరిన్ని చమురు రవాణాలను పెంచింది.ఆగస్టులో రోజుకు సుమారు 7 లక్షల బ్యారెళ్లుగా ఉన్న సౌదీ చమురు ఎగుమతులు హర్ముజ్ మీదుగా ఇటీవలి రోజుల్లో 29 లక్షల బ్యారెళ్లకు చేరినట్లు ఉపగ్రహ డేటా తెలియజేస్తోంది. యుద్ధ పరిస్థితుల్లో హర్ముజ్ మార్గంలో రవాణా ఖర్చులు కూడా భారీగా పెరిగినట్లు పేర్కొంది.అమెరికాకు పెరుగుతున్న ఒత్తిడిహౌతీల దూకుడు ట్రంప్ ప్రభుత్వాన్ని చిక్కులో పడేస్తోంది. ఒకవైపు సౌదీ అరేబియా తమకు మద్దతుగా అమెరికా సైనిక జోక్యం చేసుకోవాలని కోరుతోంది. మరోవైపు యెమెన్‌లో ప్రత్యక్షంగా మరో యుద్ధంలోకి దిగితే ఈ ఘర్షణ మరింత విస్తరించే అవకాశం ఉంది.గతంలో 2025 ప్రారంభంలో అమెరికా రెండు నెలల పాటు హౌతీలపై దాడులు చేసినప్పటికీ.. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ట్రంప్ వాటిని నిలిపివేశారు. అప్పటి నుంచి యెమెన్ ఘర్షణలో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోలేదు. ఇప్పుడు మరోసారి హౌతీలపై దాడులకు సిద్ధమై.. విమానాల్లో బాంబులు ఎక్కించే దశకు వెళ్లిన అమెరికా.. ట్రంప్ ఆదేశాలతో చివరి నిమిషంలో ఆ చర్యను నిలిపివేసినట్లు వచ్చిన వార్తలు ఆసక్తి రేపుతున్నాయి.అదే సమయంలో హౌతీలు మాత్రం వ్యూహాత్మక ఎత్తైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని తమ ఆధిపత్యాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఒకవైపు హౌతీల దూకుడు కొనసాగుతుండగా.. మరోవైపు వారిపై సైనిక చర్యకు సిద్ధమైన ట్రంప్ ప్రభుత్వం చివరి నిమిషంలో వెనక్కి తగ్గడం యెమెన్ సంక్షోభంలో కీలక పరిణామంగా మారింది.ఇటు హర్ముజ్‌లోనూ ఉద్రిక్తతఇటు హర్ముజ్ జలసంధిలోనూ ఉద్రిక్తత కొనసాగుతోంది. బ్రిటన్ సముద్ర భద్రత సంస్థ యూకేఎంటీవో (UKMTO) ప్రకారం.. జలసంధిలోకి వెళ్తున్న ఓ నౌకపై ప్రాజెక్టైల్ దాడి జరగడంతో సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. మరో గ్యాస్ ట్యాంకర్‌పై కూడా దాడి జరిగినట్లు సమాచారం.ఇరాన్–అమెరికా మధ్య దౌత్య ప్రయత్నాలు కూడా నిలిచిపోయిన పరిస్థితుల్లో యెమెన్‌లో హౌతీల దూకుడు.. మిడిల్ ఈస్ట్ వార్‌కు మరో కీలక ఫ్రంట్‌ను జోడించింది. హౌతీలపై దాడులకు సిద్ధమైన అమెరికా చివరి నిమిషంలో ఆ ప్రణాళికను ఎందుకు నిలిపివేసిందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. అమెరికా ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతుందా? లేదంటే సౌదీ, యెమెన్ బలగాలకే మద్దతు పరిమితం చేస్తుందా? అన్నది చూడాలి.ఇదీ చదవండి: అమెరికా వర్సెస్ చైనా.. ఇప్పుడు ఓ కొత్త వార్ -
మన గుమ్మడి నర్సయ్యలా.. స్టేషన్ బయట ఆ మాజీ ప్రధాని!
పదవి పోయినా జీవనశైలి మారలేదు. హోదా ఎంత పెద్దదైనా.. ప్రజలకు మాత్రం దూరం కాలేదు. రాజకీయాల్లో ఒకప్పుడు అత్యున్నత పదవిలో ఉన్న నేత.. ఇప్పుడు కూడా నిత్యం సామాన్యుల మధ్యే కనిపిస్తున్నారు. మన దగ్గర మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య సింప్లిసిటీకి, ప్రజాసేవకు ఎలా కేరాఫ్‌గా నిలిచారో.. జపాన్‌లో 69 ఏళ్ల మాజీ ప్రధాని యోషిహికో నోడా కూడా అదే తరహాలో ఆసక్తి రేపుతున్నారు.జపాన్ మాజీ ప్రధాని యోషిహికో నోడా(Yoshihiko Noda).. ఒకప్పుడు దేశాన్ని నడిపించిన నేత. ఇప్పుడు నిత్యం ఉదయాన్నే రైల్వే స్టేషన్‌కు వెళ్లి ప్రయాణికులకు కరపత్రాలు పంచుతున్నారు. తాజాగా చిబా ప్రిఫెక్చర్‌లోని మినామి-ఫునాబాషి స్టేషన్ వద్ద ఆయన అలా కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు ఆయన్ని గుర్తించి పలకరించగా.. మరికొందరు బిజీగా ఉండటంతో కరపత్రాలు తీసుకోకుండానే వెళ్లిపోయారు. అయినా నోడా మాత్రం తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగారు. ఆయన తీరే అంత!ఇది నోడాకు కొత్త వ్యవహారం కాదు. గత నలభై ఏళ్లుగా ఆయన ఈ పని చేస్తూ వస్తున్నారు. మధ్యలో ఆయన రాజకీయ జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. చిబా ప్రిఫెక్చర్ అసెంబ్లీ నుంచి జపాన్ పార్లమెంట్ వరకు ఎదిగారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2011లో జపాన్ ప్రధానమంత్రి అయ్యారు. 2012లో ప్రధాని పదవి నుంచి తప్పుకున్నా.. స్టేషన్ వద్ద ప్రజలను కలుసుకునే అలవాటును మాత్రం వదులుకోలేదు.Japan ex-PM Noda hands out flyers pic.twitter.com/CWnEuDoZpK— RT (@RT_com) September 18, 2026ఇప్పుడు ఆయన పంచే కరపత్రాల్లో స్థానిక సమస్యలు, విపత్తు బీమా, పిల్లల సంరక్షణ, ప్రిఫెక్చర్ సంస్కరణలు వంటి అంశాలు ఉంటున్నాయి. అంటే.. పదవిలో ఉన్నా, లేకపోయినా ప్రజలతో నేరుగా మాట్లాడటానికే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు.హోదా మారినా.. రొటీన్ మారలేదు1986 అక్టోబర్ 1న జేఆర్ సుడానుమా స్టేషన్ వద్ద కరపత్రాలు పంచడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ రొటీన్‌ను కొనసాగిస్తున్నారు. ఒక దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి.. ఏళ్ల తర్వాత కూడా ఉదయాన్నే రైల్వే స్టేషన్లో నిలబడి ప్రయాణికులకు కరపత్రాలు పంచడం ఆసక్తి కలిగిస్తోంది. పెద్ద కార్యక్రమాలు, భారీ హంగామా లేకుండా సాధారణంగా ప్రజలను కలవడం నోడా రాజకీయ జీవితంలో భాగంగా మారిపోయింది.మన దగ్గర గుమ్మడి నర్సయ్య కూడా ఇలాంటి సాదాసీదా జీవనశైలితోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇల్లెందు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన.. హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉండేవారు. బస్సులు, రైళ్లలో ప్రయాణించడం, సాధారణంగా ప్రజల మధ్య కనిపించడం ఆయన జీవనశైలిలో భాగంగా ఉండేది. అందుకే పదవి తర్వాత కూడా సాధారణ జీవనశైలిని కొనసాగిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండటం.. ఈ ఇద్దరి మధ్య పోలికకు కారణమైంది.ప్రధాని పదవి దేశ రాజకీయాల్లో అత్యున్నత హోదా. అయినా ఆ పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా ప్రజలను కలిసే విధానం మారలేదు. అలాగని ఆయన ఏదో వైరల్ కావడం కోసమో ఈ పని చేయడం లేదు. స్వచ్చందంగా కొందరు నెటిజన్లు ఆయన గురించి పోస్టులు చేస్తుంటారు. హోదా ఎంత పెద్దదైనా.. ప్రజల్లోకి వెళ్లడానికి పెద్ద కాన్వాయ్, హంగామా అవసరం లేదని నోడా రొటీన్ గుర్తుచేస్తోంది. ఈ సింప్లిసిటీ ఈ జనరేషన్ నేతల్లో ఉంటేనా.. సోషల్ మీడియా పోస్టులు, ఫొటోషూట్లకే పరిమితం కాకుండా.. ఇలా నేరుగా ప్రజల మధ్య కనిపించే రాజకీయాలు ఇంకెన్ని కనిపించేవో!.ఇదీ చదవండి: సినీ ఫక్కీలో బస్సును హైజాక్ చేసి.. -
భీకరంగా మారబోతున్న ఇరాన్ యుద్ధం!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ అమెరికా కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణించవద్దని తన పౌరులను ఆదేశించింది. ఇప్పటికే అక్కడ ఉన్నవారు వెంటనే దేశం విడిచి వెళ్లాలని సూచించింది. పరిస్థితులు వేగంగా మారే అవకాశం ఉందని.. విమాన సర్వీసులు రద్దు కావడం, గగనతలం మూసివేయడం, సరిహద్దుల వద్ద ఆంక్షలు విధించడం వంటి పరిణామాలు ఎదురుకావొచ్చని హెచ్చరించింది.అమెరికా వర్చువల్ ఎంబసీ ఇన్ ఇరాన్ తాజాగా విడుదల చేసిన భద్రతా హెచ్చరికలో.. ‘‘ఏ కారణంతోనూ ఇరాన్‌కు వెళ్లొద్దు. అక్కడున్న అమెరికా పౌరులు ఇప్పుడే ఇరాన్ నుంచి బయటకు వచ్చేయండి’’ అని స్పష్టం చేసింది. ఇరాన్లో భద్రతా పరిస్థితులు సంక్లిష్టంగా మారుతున్నాయని ఆ హెచ్చరికలో పేర్కొంది. విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు, సరిహద్దు మార్గాలకు సంబంధించిన పరిణామాలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించింది. ఇతర దేశాలకు వెళ్లాలని భావించే వారు ఆయా దేశాల ప్రవేశ నిబంధనలను ముందుగానే తెలుసుకోవాలని తెలిపింది.అమెరికన్లకు పలు సూచనలుఇరాన్లో ఉన్న అమెరికన్లు నిరసనలు, భారీ జనసమూహాలకు దూరంగా ఉండాలని అమెరికా సూచించింది. అమెరికాతో బహిరంగంగా అనుబంధం ఉన్న ప్రాంతాల్లో తక్కువ ప్రొఫైల్ పాటించాలని తెలిపింది. వైమానిక దాడులు జరిగితే కిటికీలు, అద్దాల తలుపులకు దూరంగా ఉండాలని.. కూలిన శిథిలాల వైపు వెళ్లొద్దని హెచ్చరించింది.అత్యవసర పరిస్థితుల్లో దౌత్య అధికారులను సంప్రదించేందుకు ‘స్మార్ట్ ట్రావెలర్ ఎన్రోల్మెంట్ ప్రోగ్రామ్ (STEP)’లో నమోదు చేసుకోవాలని సూచించింది. పశ్చిమాసియాలో ప్రయాణించే లేదంటే ఆ ప్రాంతం మీదుగా వెళ్లే అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలని.. విమాన సర్వీసులు, గగనతల మార్గాల్లో ఆకస్మిక మార్పులు, రద్దులు జరిగే అవకాశం ఉందని అమెరికా తాజాగా హెచ్చరించింది.హౌతీల దాడులతో మరింత టెన్షన్అమెరికా–ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో.. ఇరాన్ మద్దతున్న హౌతీల కార్యకలాపాలను కూడా అమెరికా ప్రస్తావించింది. సౌదీ అరేబియాపై, ముఖ్యంగా పౌర విమానాశ్రయాలపై హౌతీలు దాడులకు పాల్పడ్డారని తెలిపింది. ప్రస్తుత సైనిక ఘర్షణలు వేగంగా మరింత విస్తరించే అవకాశం ఉందని హెచ్చరించింది.ఇరాన్‌కు మద్దతిచ్చే గ్రూపులు అమెరికా ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని అమెరికా పేర్కొంది. మధ్యప్రాచ్యంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ గతంలో అమెరికా దౌత్య కార్యాలయాలు, సంస్థలు లక్ష్యంగా దాడులు జరిగిన విషయాన్ని గుర్తుచేసింది. అమెరికా వ్యాపార సంస్థలు, సంస్థలు, ఇతర ప్రయోజనాలపైనా ముప్పు ఉండొచ్చని తెలిపింది.సౌదీలోనూ ఆంక్షలుఇరాన్తో పాటు సౌదీ అరేబియాలో ఉన్న అమెరికన్లకు కూడా ఇటీవల భద్రతా సూచనలు జారీ అయ్యాయి. హౌతీల దాడుల నేపథ్యంలో తైఫ్, యన్బు ప్రాంతాలకు అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు అధికారిక లేదా వ్యక్తిగత ప్రయాణాలు చేయాలంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాలని సూచించింది. మరోవైపు రియాద్ వైపు బాలిస్టిక్ క్షిపణి దూసుకురావడంతో సౌదీ అధికారులు అత్యవసర హెచ్చరిక జారీ చేశారు. ఆ క్షిపణిని అడ్డుకున్నట్లు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు తెలిపాయి. బిష్, తైఫ్, ఫరాసాన్, యన్బు ప్రాంతాల్లో పౌరులు, మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్రయత్నాలు జరిగినట్లు పేర్కొన్నాయి. హౌతీల దాడులను ఖతార్ ఖండిస్తూ.. సౌదీ అరేబియాకు సంఘీభావం ప్రకటించింది.ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ అంతర్జాతీయ రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. భద్రతా పరిస్థితులు, గగనతల పరిమితులు, విమాన మార్గాల్లో మార్పుల కారణంగా పలు అంతర్జాతీయ సర్వీసులు రద్దు లేదా నిలిపివేతకు గురయ్యాయి. అయితే గల్ఫ్ ప్రాంతంలోని అన్ని విమాన మార్గాలు పూర్తిగా మూసుకుపోలేదు. కొన్ని రూట్లలో సర్వీసులు కొనసాగుతున్నప్పటికీ.. విమాన సంస్థలు పరిస్థితిని బట్టి షెడ్యూళ్లను మార్చుతున్నాయి. తాజాగా ఇరాన్ నుంచి వచ్చే అంతర్జాతీయ విమానాల్లో దాదాపు మూడో వంతు రద్దైనట్లు సమాచారం. మాహాన్ ఎయిర్ కూడా ఇస్తాంబుల్, అంకారా, మస్కట్ వంటి అంతర్జాతీయ మార్గాల్లో సర్వీసులను నిలిపివేసింది. దీంతో ఇరాన్‌కు ప్రయాణం చేయడం, అక్కడి నుంచి బయటకు రావడం గతంతో పోలిస్తే మరింత కష్టంగా మారింది. మరోవైపు అమెరికా–ఇరాన్ మధ్య దౌత్య సంబంధాలు తీవ్ర ఉద్రిక్తతలో ఉన్నప్పటికీ.. చర్చలకు సంబంధించిన మార్గాలు పూర్తిగా మూసుకుపోలేదు. సెప్టెంబర్ 20న ట్రంప్ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో సమావేశానికి తాను సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇవ్వగా.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ యూఎన్ జనరల్ అసెంబ్లీకి వెళ్లే కార్యక్రమంలో భాగంగా దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. చైనా కూడా ఇరాన్, అమెరికా సంయమనం పాటించి జూన్‌లో కుదిరిన శాంతి ఒప్పందానికి తిరిగి రావాలని కోరుతోంది. అంటే.. ఒకవైపు సైనిక ఉద్రిక్తతలు, మరోవైపు పరోక్ష దౌత్య ప్రయత్నాలు ఏకకాలంలో కొనసాగుతున్నాయి.ఇదీ చదవండి: మొసలి కన్నీరుపై ఇరాన్ ఫైర్ -
ఇరాన్ చుట్టూ ఉచ్చు.. మూడు వైపులా టెన్షన్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి వేడెక్కాయి. ఒకవైపు అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరగా.. మరోవైపు ఇరాన్ మద్దతున్న హౌతీలు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌పై క్షిపణులు, డ్రోన్లతో దాడికి దిగారు. ఇదే సమయంలో ఇరాన్–ఫ్రాన్స్ మధ్య దౌత్య వివాదం కూడా ముదురుతోంది. దీంతో ఇప్పటికే నెలలుగా కొనసాగుతున్న ప్రాంతీయ సంక్షోభం కొత్త మలుపు తీసుకుంటోంది.అమెరికా కొత్త దాడికి సిద్ధమవుతోందన్న సమాచారం తమ వద్ద ఉందని ఇరాన్ సైన్యం ప్రకటించింది. అమెరికా లేదా దాని మిత్రదేశాలు మరోసారి దాడి చేస్తే.. ఈసారి ప్రతిస్పందన పరిమితం కాదని, అమెరికా స్థావరాలు.. ప్రయోజనాలపై సుదీర్ఘంగా దాడులు కొనసాగిస్తామని ఇరాన్ సైనిక కమాండ్ హెచ్చరించింది. అమెరికా మిత్రదేశాలను కూడా ఈ ఘర్షణలో భాగస్వాములుగానే పరిగణిస్తామని స్పష్టం చేసింది.మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్‌పై ఒత్తిడి పెంచారు. ఒప్పందానికి ముందుకు రావాలని.. లేదంటే ఇరాన్ ఆర్థికంగా మరింత కుదేలవుతుందని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఈ వారంలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి న్యూయార్క్ వెళ్లనున్న నేపథ్యంలో ఆయనతో భేటీకి తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ చెప్పడం గమనార్హం. రియాద్‌పై హౌతీల మెరుపుదాడిఇదిలా ఉండగానే యెమెన్‌లోని ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు సౌదీ రాజధాని రియాద్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. సెప్టెంబర్ 19న క్షిపణి, డ్రోన్లతో దాడి ప్రయత్నం జరిగినట్లు సౌదీ అరేబియా ధ్రువీకరించింది. రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడుతో దట్టమైన పొగ అలుముకుంది. అయితే సౌదీ నేతృత్వంలోని కూటమి ఆ దాడిని అడ్డుకున్నట్లు తెలిపింది. పెద్దగా నష్టమూ జరగలేదని వెల్లడించింది. హౌతీలు రియాద్‌తో పాటు యాన్బు, తాయిఫ్, బైష్, ఫరాసాన్ ప్రాంతాల్లోనూ దాడులకు ప్రయత్నించినట్లు సమాచారం. యాన్బు సౌదీ చమురు ఎగుమతులకు కీలక కేంద్రం కావడంతో ఈ దాడులు మరింత ఆందోళనకు కారణమయ్యాయి. ఎందుకంత కీలకం బాబ్-ఎల్-మండేబ్..యెమెన్‌లో హౌతీల దూకుడు ఇటీవలి రోజుల్లో మరింత పెరిగింది. వ్యూహాత్మకమైన మొఖా ప్రాంతంతో పాటు బాబ్ ఎల్ మందెబ్ జలసంధికి సమీప ప్రాంతాలపై వారి పట్టు పెరిగింది. ఈ మార్గం ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌తో కలుపుతుంది. ఆసియా–యూరప్ మధ్య నౌకాయానానికి ఇది కీలకమైన మార్గం.ఇప్పటికే హర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఆంక్షల కారణంగా ఇంధన రవాణాపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఇప్పుడు బాబ్ ఎల్ వద్ద కూడా భద్రతా సమస్యలు పెరగడంతో ప్రపంచ చమురు సరఫరాపై ఆందోళన మరింత పెరిగింది. హౌతీల దాడుల నేపథ్యంలో సౌదీ చమురు ఎగుమతుల మార్గాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. తాజా పరిణామాల్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగానే కొనసాగుతోంది. చైనాకు కూడా టెన్షన్.. ఇరాన్‌పై ఒత్తిడిహౌతీల దూకుడుతో సౌదీ మాత్రమే కాకుండా చైనా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థ కథనం ఇచ్చింది. సౌదీ విజ్ఞప్తి నేపథ్యంలో హౌతీలను అదుపులో ఉంచేందుకు ఇరాన్‌పై చైనా ప్రైవేటుగా ఒత్తిడి తెచ్చినట్లు మూడు ఇరాన్ వర్గాలను ఉటంకిస్తూ ఆ వార్తను ప్రచురించింది. ఎర్ర సముద్ర మార్గం చైనా వాణిజ్యానికి కూడా కీలకం కావడంతో ఈ పరిణామాలను బీజింగ్ నిశితంగా గమనిస్తోంది. ఇటు ఫ్రాన్స్‌తోనూ కొత్త వివాదంఇక ఇరాన్–ఫ్రాన్స్ సంబంధాల్లోనూ కొత్త చిచ్చు రేగింది. టెహ్రాన్‌లో ఫ్రెంచ్ రాయబార కార్యాలయానికి అనుబంధంగా ఉన్న ఫ్రెంచ్ భాషా కేంద్రాన్ని ఇరాన్ అధికారులు మూసివేశారు. సరైన లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు నిర్వహించడంతో పాటు జాతీయ భద్రతకు వ్యతిరేకమైన చర్యలకు పాల్పడిందని ఇరాన్ ఆరోపించింది. వ్యక్తుల నెట్‌వర్క్‌లను నిర్మించడం, నైపుణ్యం ఉన్న ఇరానియన్లు దేశం విడిచి వెళ్లేందుకు సహకరించడం వంటి ఆరోపణలను కూడా చేసింది. అయితే ఫ్రాన్స్ ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. తమ సాంస్కృతిక సంస్థలపై మరో దాడిగా అభివర్ణించింది. ఇరాన్ రాయబారిని పిలిపించి వివరణ కోరనున్నట్లు ప్రకటించింది. ఈ వివాదం ఇప్పటికే ఇరుదేశాల మధ్య ఉన్న దౌత్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది. ‘మొసలి కన్నీరు’ అంటూ ఫైర్ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-నోయెల్ బారో ఇరాన్లో మానవ హక్కుల పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తీవ్రంగా స్పందించారు. ఫ్రాన్స్ గతంలో అల్జీరియాలో చేసిన చర్యలను ప్రస్తావిస్తూ.. ఇరాన్‌పై ఇప్పుడు సానుభూతి చూపడం ‘మొసలి కన్నీరు’ అంటూ బారోను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అమెరికా దాడుల్లో ఇరాన్ పాఠశాల విద్యార్థులు చనిపోయిన సమయంలో ఫ్రాన్స్ మౌనం వహించిందని కూడా అరాఘ్చీ ఆరోపించారు.ఒకవైపు చర్చలు.. మరోవైపు దాడులుఇలా చూస్తే ప్రస్తుతం ఇరాన్ చుట్టూ ఒకేసారి పలు స్థాయిల్లో ఉద్రిక్తతలు కనిపిస్తున్నాయి. అమెరికాతో ప్రత్యక్ష ఘర్షణ మళ్లీ ముదిరే సంకేతాలు, సౌదీపై హౌతీల దాడులు, హర్ముజ్–బాబ్ ఎల్ మండేబ్ జలమార్గాలపై ఒత్తిడి, ఫ్రాన్స్‌తో దౌత్య వివాదం.. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడుతున్నాయి.అయితే ఇదే సమయంలో చర్చలకు అవకాశం పూర్తిగా మూసుకుపోలేదు. ట్రంప్–ఇరాన్ మధ్య కఠిన ప్రకటనలు కొనసాగుతున్నప్పటికీ, ఇరాన్ అధ్యక్షుడితో భేటీకి ట్రంప్ సిద్ధంగా ఉన్నట్లు చెప్పడం దౌత్య మార్గం ఇంకా తెరిచే ఉందనే సంకేతంగా నిలుస్తోంది. మరోవైపు హౌతీలను నియంత్రించేందుకు చైనా ప్రయత్నాలు కూడా తెరవెనుక దౌత్యం కొనసాగుతున్నట్లు సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: ఆ ఏడు కండీషన్స్‌తో ఇరాన్ యుద్ధం ముగిసేనా? -
13 ఏళ్ల వయసులో కన్నబిడ్డ కోసం పోరాటం?!
ఆడుకోవాల్సిన వయసులో పెళ్లి. చదువుకోవాల్సిన వయసులో మాతృత్వం. చివరకు దూరమైన బిడ్డ కోసం ఆమె తల్లడిల్లిపోయింది. కేవలం 13 ఏళ్ల వయసులోనే తన ఏడు నెలల కొడుకు కోసం కోర్టు మెట్లెక్కిన ఆమె.. ఆ న్యాయపోరాటంలో విజయం సాధించింది. చిన్నారి అనామికా కథ.. ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.అనామికా అకర్త్కు సోషల్ మీడియా ద్వారా 22 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా.. అటు నుంచి అటు పెద్దల అంగీకారంతో పెళ్లికి దారితీసింది. అప్పటికి ఆమె వయసు కేవలం 11 ఏళ్లే. బాల్యం అంటే ఏమిటో పూర్తిగా అర్థం చేసుకునే స్థితి కూడా లేదు. అయినప్పటికీ వివాహం జరిగింది. ఆ తర్వాత ఆమె 2026లో ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది.అయితే కొద్ది నెలలకే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ ఏడాది మేలో భర్త, అత్తమామలు అనామికను ఇంటి నుంచి బయటకు పంపించారు. అయితే అనామిక బిడ్డను మాత్రం తమ వద్దే ఉంచుకున్నారు. దీంతో తన కుమారుడిని తిరిగి తనకు అప్పగించాలని కోరుతూ అనామిక కోర్టును ఆశ్రయించింది.‘ఆమె కూడా ఇంకా చిన్నారే’ఈ కేసును విచారించిన కోర్టు.. ఏడు నెలల శిశువును అనామిక సంరక్షణకు అప్పగించాలని ఆదేశించినట్లు వైరల్ వీడియో సారాంశం. ఈ సందర్భంగా న్యాయమూర్తి.. బిడ్డ తల్లి అనామిక కూడా ఇంకా చిన్నారేనన్న విషయాన్ని ప్రస్తావించినట్లు ఆ వైరల్ కథనాల్లో కనిపిస్తోంది. అలా తన బాల్యాన్ని కోల్పోయిన ఓ బాలిక.. ఇప్పుడు తన బిడ్డ భవిష్యత్తు కోసం పోరాడి నెగ్గిందన్నమాట. బంగ్లాదేశ్‌లో జరిగిన ఈ ఘటన.. ఇప్పుడు నెట్టింట రకరకాల చర్చలకు దారి తీసింది. కఠిన చట్టం ఉన్నా.. బాల్య వివాహాలు మాత్రంబంగ్లాదేశ్లోనూ బాల్య వివాహాలను కట్టడికి చట్టాలు ఉన్నప్పటికీ.. ఆచరణలో మాత్రం సమస్య కొనసాగుతోంది. యూనిసెఫ్ గణాంకాల ప్రకారం.. బంగ్లాదేశ్‌లో 20–24 ఏళ్ల వయసున్న మహిళల్లో దాదాపు 47 శాతం మంది 18 ఏళ్లలోపే వివాహం చేసుకున్నవారే. పేదరికం, సామాజిక ఒత్తిళ్లు, సంప్రదాయాలు వంటి కారణాలు బాల్య వివాహాలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. చిన్న వయసులో పెళ్లి కావడం వల్ల బాలికల చదువుకు ఆటంకం కలగడమే కాకుండా.. ముందస్తు గర్భధారణ, ప్రసవ సంబంధ ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఆధారపడటం, హింసకు గురయ్యే ముప్పు కూడా పెరుగుతుందని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. బంగ్లాదేశ్ కోర్టులో అనామికకు న్యాయం జరిగింది. కొన్నిచోట్ల మరో దేశం వినిపిస్తోంది. అలాగే ఆమె వయసు విషయంలోనూ భిన్న వాదనలు చేస్తున్నారు కొందరు నెటిజన్లు. ఏది ఏమైనా అంత చిన్న వయసులో ఓ బాలిక తన బిడ్డ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిన ఈ ఘటన.. బాల్య వివాహం కేవలం ఓ పెళ్లి కాదని గుర్తుచేస్తోంది. ఒక చిన్నారి చేతుల్లో బిడ్డను పెట్టడమే కాదు.. ఆమె చదువు, స్వేచ్ఛ, కలలు, భవిష్యత్తును కూడా ముందుగానే బాధ్యతల కింద నలిపేస్తోంది. అనామికకు దక్కిన ఈ విజయం ఆమె బిడ్డను తిరిగి ఇచ్చింది.. కానీ ఇలాంటి పరిస్థితుల్లోకి మరో బాలిక వెళ్లకుండా ఆపగలమా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.🚨 SHOCKING: CHILD MARRIED AT 11, MOTHER AT 13!Anamika Akter, reportedly married to a 22 year old man at just 11, became a mother at 13.A CHILD is now raising another CHILD. 💔How is this still happening in Bangladesh? pic.twitter.com/Ayg0vJIN77— News Matrix (@NewsMatrixIND) September 18, 2026 -
గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ బిగ్ అనౌన్స్మెంట్.. ఇక ‘పర్మినెంట్ కంట్రోల్’!
గ్రీన్లాండ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. డెన్మార్క్, గ్రీన్‌లాండ్‌తో కలిసి అమెరికా ఒక కొత్త భద్రతా ఒప్పందానికి అంగీకరించినట్లు తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా గ్రీన్లాండ్ భద్రతపై అమెరికాకు ‘శాశ్వత నియంత్రణ’’ లభిస్తుందని ట్రంప్ ప్రకటించారు. అలాగే దీనిని ఆయన ‘‘ఇన్ఫినిట్ లైఫ్ అగ్రిమెంట్’’గా అభివర్ణించారు.ట్రంప్ చేసిన తాజా ప్రకటన.. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపాన్ని అమెరికా స్వాధీనం చేసుకుంటుందని కాదు. కేవలం భద్రతకు సంబంధించింది మాత్రమే. గ్రీన్లాండ్ ఇక మీదట కూడా డెన్మార్క్ రాజ్యంలోనే కొనసాగుతుందని, ఆ దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను, అక్కడి ప్రజల స్వయం నిర్ణయ హక్కును ఒప్పందం గుర్తిస్తుందని డెన్మార్క్ స్పష్టం చేసింది. అమెరికా, డెన్మార్క్, గ్రీన్లాండ్ ప్రభుత్వాలు వచ్చే వారం ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సందర్భంగా న్యూయార్క్‌లో ఈ ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి. అనంతరం అవసరమైన పార్లమెంటరీ ప్రక్రియలు పూర్తయిన తర్వాతే ఇది అమల్లోకి రానుంది. కొత్త ఒప్పందం.. రష్యా, చైనాకు చెక్గ్రీన్లాండ్లో అమెరికా ప్రత్యర్థి దేశాలు సైనిక స్థావరాలు ఏర్పాటు చేయకుండా ఈ ఒప్పందం అడ్డుకట్ట వేస్తుందని ట్రంప్ చెప్పారు. ముఖ్యంగా రష్యా, చైనాలు అక్కడ సైనిక స్థావరాలు ఏర్పాటు చేయడం, సైనిక ఉనికిని పెంచడం లేదా సున్నితమైన పెట్టుబడులు పెట్టడం అమెరికా అనుమతి లేకుండా సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. అమెరికా ఇప్పటికే గ్రీన్లాండ్లో పిటుఫిక్ స్పేస్ బేస్‌ను నిర్వహిస్తోంది. క్షిపణి హెచ్చరికలు, క్షిపణి రక్షణ, అంతరిక్ష నిఘా వంటి కార్యకలాపాల్లో ఈ స్థావరం కీలకంగా ఉంది. కొత్త ఒప్పందంతో గ్రీన్లాండ్లో అమెరికా సైనిక ఉనికిని మరింత పెంచుకునే అవకాశం ఏర్పడినట్లు తాజా వివరాలు సూచిస్తున్నాయి. ట్రంప్ వ్యాఖ్యకు అర్థమేంటి?ఈ ఒప్పందానికి గడువు ఉండదనే అర్థంలో ట్రంప్ దీనిని ‘‘ఇన్ఫినిట్ లైఫ్ అగ్రిమెంట్’’గా పేర్కొన్నారు. గ్రీన్లాండ్, అమెరికా భద్రతను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం అమెరికాకు ఎప్పటికీ ఉంటుందని ఆయన అన్నారు. గ్రీన్లాండ్లో పెద్ద ఎత్తున అమెరికా సైనిక ఉనికిని అభివృద్ధి చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తామని కూడా ప్రకటించారు. ఎందుకంత కీలకం?ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న గ్రీన్లాండ్ భౌగోళికంగా అత్యంత కీలకమైన ప్రదేశం. ఉత్తర అమెరికా, యూరప్ మధ్య ఉన్న ప్రాంతంలో దాని స్థానం కారణంగా అమెరికా రక్షణ వ్యూహంలో దీనికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. రష్యా, చైనా ఆర్కిటిక్ ప్రాంతంలో తమ ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో గ్రీన్‌లాండ్‌పై అమెరికా దృష్టి మరింత పెరిగింది.ట్రంప్ పాత డిమాండ్‌కు భిన్నంగా..గ్రీన్‌లాండ్‌ను అమెరికా సొంతం చేసుకోవాలన్న ఆకాంక్షను ట్రంప్ గతంలో పలుమార్లు వ్యక్తం చేశారు. అవసరమైతే బలప్రయోగాన్ని కూడా తోసిపుచ్చని ఆయన వైఖరి డెన్మార్క్‌తో పాటు ఇతర నాటో దేశాల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. తాజా ఒప్పందం మాత్రం గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో కలపడం లేదా దాని సార్వభౌమాధికారాన్ని మార్చడం కాకుండా.. భద్రత, సైనిక ఉనికిపై అమెరికా పాత్రను విస్తరించే దిశగా ఉంది. డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్సన్ ఈ ఒప్పందం.. ఆర్కిటిక్, ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో ఉమ్మడి భద్రతను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. ఇది నాటో, యూరప్‌కు కూడా ప్రయోజనకరమని అన్నారు. గ్రీన్లాండ్ ప్రభుత్వ అధిపతి జెన్స్-ఫ్రెడరిక్ నీల్సన్ కూడా ఈ ఒప్పందం గ్రీన్లాండ్, డెన్మార్క్, అమెరికా, పాశ్చాత్య కూటమి భద్రతను బలోపేతం చేస్తుందని తెలిపారు. ఇదీ చదవండి: మీడియాను తొక్కిపారేస్తున్న ట్రంప్ -
ఉత్కంఠకు తెర.. రష్యా ఆంక్షల బిల్లుపై ట్రంప్ సంతకం
ఉత్కంఠకు తెర పడింది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు. రష్యాపై ఆంక్షలను మరింత కఠినతరం చేసే బిల్లుపై ట్రంప్ ఇవాళ సంతకం చేశారు. ఈ బిల్లు చట్టంగా మారడంతో ఆయా దేశాలపై ఏ క్షణమైనా 100 శాతం వరకు టారిఫ్‌లు ట్రంప్ విధించే అవకాశం ఉంది. ప్రధానంగా.. భారత్, చైనాలకు ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. లిండ్సే గ్రాహం యాక్ట్ ప్రకారం.. రష్యా నుంచి అత్యధికంగా క్రూడ్ ఆయిల్ లేదంటే గ్యాస్ దిగుమతి చేసుకునే టాప్-5 దేశాల నుంచి అమెరికాకు వచ్చే వస్తువులపై 100 శాతం వరకు సుంకాలు విధించే అవకాశం ఉంది. అయితే చట్టంలో ఆ దేశాల పేర్లను ప్రత్యేకంగా పేర్కొనలేదు. ఆయా జాబితాలను ఎలా లెక్కించాలన్న దానిపైనా పూర్తి స్పష్టత లేదు. దీంతో తుది నిర్ణయాధికారం ట్రంప్ ప్రభుత్వానికే దక్కింది. అబ్ ఆయేగా అస్లీ మజా!ట్రంప్ సంతకం చేయడంతో ఇప్పటివరకు కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. కానీ అసలు పరిణామాలు ఇప్పుడే మొదలుకానున్నాయి. భారత్, చైనా సహా రష్యా చమురు కొనుగోలు చేస్తున్న ఏ దేశాలు ‘టాప్-5’ జాబితాలోకి వస్తాయి? వాటిపై ట్రంప్ 100 శాతం వరకు టారిఫ్ విధిస్తారా? లేక మినహాయింపు ఇస్తారా? అన్నదే ఇప్పుడు కీలకం. తుది జాబితా, టారిఫ్ స్థాయిపై అమెరికా ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.ఆగస్టు క్రూడ్ దిగుమతుల డేటా ఆధారంగా రష్యా చమురు కొనుగోలులో ముందున్న దేశాలు:భారత్చైనాఇటలీటర్కీనెదర్లాండ్స్ఎస్అండ్పీ గ్లోబల్ ప్రకారం ఆగస్టులో రష్యా క్రూడ్ దిగుమతుల్లో భారత్ రోజుకు సుమారు 16 లక్షల బ్యారెళ్లతో మొదటి స్థానంలో ఉండగా, చైనా 11 లక్షల బ్యారెళ్లతో తర్వాతి స్థానంలో ఉంది. ఇటలీ, టర్కీ, నెదర్లాండ్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.భారత్‌కు ఎందుకు కీలకం?రష్యా నుంచి చౌకగా లభించే క్రూడ్ ఆయిల్ భారత రిఫైనరీలకు కీలక వనరుగా మారింది. దేశీయ అవసరాల్లో భారీ భాగం దిగుమతులపైనే ఆధారపడుతోంది. రష్యా చమురు దిగుమతులు భారత మొత్తం క్రూడ్ దిగుమతుల్లో దాదాపు సగం వరకు ఉన్నాయని తాజా విశ్లేషణలు పేర్కొంటున్నాయి. దీంతో రష్యా నుంచి కొనుగోళ్లపై అమెరికా చర్యలు తీసుకుంటే భారత రిఫైనింగ్ రంగంతో పాటు అమెరికాకు ఎగుమతి చేసే భారతీయ ఉత్పత్తులపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే భారత్ సహా ఏ దేశాలపై, ఎప్పుడు, ఎంతమేర సుంకాలు విధించాలన్న విషయంలో ట్రంప్‌దే తుదినిర్ణయం కానుంది. మరోవైపు ఈ విషయంలో అమెరికాతో చర్చలు జరుగుతున్నాయని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది. చర్చల్లో మరికొన్ని దేశాలురష్యా చమురు కొనుగోలుదారుల జాబితాతో పాటు రష్యా ఆంక్షలను తప్పించుకునేందుకు సహకరిస్తున్న దేశాలపైనా చట్టం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో బ్రెజిల్, జపాన్, యూరోపియన్ యూనియన్‌లోని కొన్ని దేశాలు కూడా అమెరికా చర్యల పరిధిలోకి రావచ్చనే చర్చ జరుగుతోంది. 30 రోజుల్లో నిర్ణయం?కొత్త చట్టం ప్రకారం అర్హత కలిగిన దేశాలపై టారిఫ్‌లు విధించే చర్యలను 30 రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో నవంబర్‌లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు ఈ అంశం కీలకంగా మారింది. రష్యా చమురుపై ఆంక్షలు కఠినతరం చేస్తే ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం పడి ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో అమెరికాలో వినియోగదారులపై ఇంధన ధరల భారం పెరగకుండా ట్రంప్ ప్రభుత్వం ఈ అధికారాలను ఎంతవరకు ఉపయోగిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.రష్యాపై మరింత ఒత్తిడిఈ చట్టం కేవలం చమురు కొనుగోలుదారులపైనే కాదు.. రష్యా ఇంధన, రక్షణ రంగాలతో పాటు ఆంక్షలను తప్పించుకునేందుకు ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘షాడో ఫ్లీట్’ ట్యాంకర్లపైనా చర్యలకు వీలు కల్పిస్తోంది. ఇరాన్‌పై ఉన్న కొన్ని ఆంక్షలను కూడా ఈ చట్టం పొడిగించింది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి రష్యాకు లభిస్తున్న ఆర్థిక వనరులను దెబ్బతీయడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యంగా అమెరికా పేర్కొంటోంది. మొత్తంగా చూస్తే.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలకు ఇది నేరుగా తాకే అంశమే అయినప్పటికీ, 100 శాతం టారిఫ్ ఇప్పటికిప్పుడు ఖరారైన నిర్ణయం కాదు. ఏ దేశాలను తుది జాబితాలో చేర్చుతారు? భారత్‌పై ఎంత మేర ప్రభావం ఉంటుంది? అన్నది ట్రంప్ ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.ఇదీ చదవండి: భూకంపం కాదు.. భూకంపాలు పుట్టిన కిమ్ -
రష్యా ఆంక్షల బిల్లు.. చూశారా ట్రంప్ డబుల్ గేమ్!
రష్యాపై మరిన్ని ఆంక్షలకు అమెరికా సిద్ధమైంది. రష్యా నుంచి చమురు, సహజవాయువు కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ టారిఫ్‌లు విధించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అధికారం ఇచ్చే బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. దీంతో రష్యా చమురు కొనుగోలులో కీలకంగా ఉన్న భారత్, చైనాలకు 100 శాతం వరకు టారిఫ్ ముప్పు పొంచి ఉంది. అయితే.. ఇదే బిల్లులో అమెరికాకు అనుకూలంగా ఉన్న మరో కీలక నిబంధన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ట్రంప్ సర్కార్ ‘లిండ్సే ఓ. గ్రాహమ్ శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్–2026’ పేరుతో ఈ బిల్లును తీసుకొచ్చింది. ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తున్న రష్యాకు చమురు, గ్యాస్ ఎగుమతులే ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటి. ఆ ఆదాయాన్ని తగ్గించడంతో పాటు.. రష్యాతో ఇంధన వ్యాపారం కొనసాగిస్తున్న దేశాలపై ఒత్తిడి పెంచడమే బిల్లు ప్రధాన ఉద్దేశం. రష్యా అధికారులు(అధ్యక్షుడు పుతిన్ సహా..), ఆర్థిక సంస్థలు, ఇంధన రంగం, ఆంక్షలను తప్పించుకునేందుకు ఉపయోగిస్తున్న ‘షాడో ఫ్లీట్’పై కూడా కఠిన చర్యలకు ఇందులో అవకాశం కల్పించారు. అమెరికా ప్రతినిధుల సభలో బిల్లు 262–159 ఓట్లతో ఆమోదం పొందింది. ఇందులో 203 మంది రిపబ్లికన్లు, 58 మంది డెమొక్రాట్లు, ఒక ఇండిపెండెంట్ సభ్యుడు అనుకూలంగా ఓటేశారు. అంతకుముందే సెనేట్ కూడా ఈ బిల్లును 86–11 ఓట్లతో ఆమోదించింది. దీంతో ఇప్పుడు బిల్లు ట్రంప్ డెస్క్‌కు చేరగా.. ఆయన సంతకంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.అసలు ట్విస్ట్ ఇదే..రష్యా నుంచి చమురు కొనే దేశాలపై భారీ టారిఫ్‌లకు సిద్ధమైన అమెరికా.. అందులో తనకు అనుకూలంగా ఓ సెక్షన్‌ను జత చేర్చుకుంది. అవసరమైన రష్యా యురేనియం విషయంలో మాత్రం కొంత వెసులుబాటు ఉంచుకుంది. అయితే బిల్లులోని సెక్షన్ 111 రష్యా నుంచి యురేనియం దిగుమతులపై ఇప్పటికే ఉన్న అమెరికా ఆంక్షలను అమలు చేయాలని చెబుతోంది. రష్యా ప్రభుత్వ అణు సంస్థ రోసాటమ్, దాని అనుబంధ/వారస సంస్థల నుంచి వచ్చే యురేనియం కూడా ఇందులో ప్రస్తావనకు వచ్చింది.కానీ అదే బిల్లులోని సెక్షన్ 114 మాత్రం కొన్ని ముఖ్యమైన మినహాయింపులను ఇచ్చింది. అమెరికా–రష్యా మధ్య కుదిరిన పౌర అణు సహకార ఒప్పందాల కింద జరిగే కొన్ని కార్యకలాపాలకు ఈ ఆంక్షలు వర్తించవు. అలాగే అణు రియాక్టర్లలో ఉపయోగించే కొన్ని రకాల లో-ఎన్రిచ్డ్ యురేనియం (LEU) దిగుమతులకు కూడా మినహాయింపు ఉంది. నిబంధనల ప్రకారం కొన్ని వైద్య ఐసోటోపుల దిగుమతులకు కూడా వెసులుబాటు కల్పించారు. అంటే రష్యాతో అణు రంగంలో ప్రతి లావాదేవీని పూర్తిగా నిలిపివేసేలా ఈ బిల్లు లేనేలేదన్నమాట.అమెరికాకు ఎందుకంత అవసరం?రష్యాపై ఆర్థిక ఆధారపడటాన్ని తగ్గించాలని అమెరికా ప్రయత్నిస్తున్నప్పటికీ.. అణు ఇంధన రంగంలో మాత్రం మాస్కో పాత్ర ఇప్పటికీ పెద్దదే. 2025లో అమెరికా పౌర అణు విద్యుత్ సంస్థలు మొత్తం 12.71 మిలియన్ సెపరేటివ్ వర్క్స్ యూనిట్స్ (SWU) మేర ఎన్రిచ్మెంట్ సేవలను కొనుగోలు చేశాయి. అందులో రష్యా నుంచి వచ్చినవి 3.284 మిలియన్ ఎస్‌డబ్ల్యూయూ.. అంటే సుమారు 26 శాతం. అమెరికా దేశీయ ఎన్రిచ్మెంట్ సేవల వాటా సుమారు 23 శాతంగా ఉంది. ఫ్రాన్స్, బ్రిటన్, నెదర్లాండ్స్ కూడా అమెరికాకు ఎన్రిచ్మెంట్ సేవలు అందిస్తున్నాయి. యురేనియం కొంటే సరిపోదు..అణు ఇంధనం తయారీ ప్రక్రియ ముడి చమురు లాంటిది కాదు. గనుల నుంచి తీసిన యురేనియంను నేరుగా చాలా వాణిజ్య అణు రియాక్టర్లలో ఉపయోగించలేరు. ముందుగా కన్వర్షన్, ఎన్రిచ్మెంట్ వంటి పలు దశలు దాటాలి. ఈ ఎన్రిచ్మెంట్ సామర్థ్యంలో రష్యా చాలా కాలంగా ప్రపంచంలో కీలక స్థానంలో ఉంది. అందుకే రష్యాతో విస్తృత ఆర్థిక సంబంధాలను తగ్గించేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నా.. అణు విద్యుత్ రంగానికి అవసరమైన ఇంధన సరఫరాను ఒక్కసారిగా దెబ్బతీసే నిర్ణయాలు తీసుకోవడం అంత సులభం కాదు.2024లోనే రష్యా యురేనియంపై నిషేధంఈ ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా.. అమెరికా 2024 మేలో రష్యా యురేనియం ఉత్పత్తుల దిగుమతులపై నిషేధం విధించింది. అయితే దేశీయ సరఫరా వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకు కంపెనీలు మినహాయింపులు కోరుకునే అవకాశం కల్పించింది. ఈ మినహాయింపు వ్యవస్థ 2028 జనవరి 1 వరకు కొనసాగేందుకు అవకాశం ఉంది.అదే సమయంలో అమెరికా దేశీయ అణు ఇంధన సరఫరా గొలుసును బలోపేతం చేసేందుకు 2.72 బిలియన్ డాలర్ల నిధులను కేటాయించింది. దీని లక్ష్యం కూడా రష్యాపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించడమే. అయితే రష్యా చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై భారీ టారిఫ్‌లకు మార్గం వేస్తూనే.. తన అణు విద్యుత్ రంగానికి అవసరమైన కొన్ని రష్యా యురేనియం సరఫరాలకు మాత్రం మినహాయింపులు ఉంచింది. ఇలా.. ఒకే బిల్లులో అమెరికా రెండు రకాల విధానాలను అవలంబిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. భారత్, చైనా.. టారిఫ్‌లపై సస్పెన్స్రష్యా నుంచి ముడి చమురు, సహజవాయువు కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారం ఈ బిల్లుతో ట్రంప్‌కు దక్కింది. రష్యా ఇంధనాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలే ఈ విషయంలో ప్రభావితం కానున్నాయి. అయితే భారత్ మాత్రం రష్యా ఆయిల్ విషయంలో తగ్గేదే లేదని చెబుతోంది. జాతి ప్రయోజనాల కోసం తాము ఆలోచిస్తామని.. అదే సమయంలో ఈ టారిఫ్ ముప్పు గురించి అమెరికాతో చర్చిస్తున్నట్లు తెలిపింది. దీంతో ట్రంప్ నిర్ణయం ఏంటన్నది ఉత్కంఠగా మారింది. ఇదీ చదవండి: డయానా ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్ -
డేంజర్కే డేంజర్ ఈ బామ్మ!.. ఏం చేసిందో చూడండి
యుద్ధం అంటే కేవలం సైనికులు, ఆయుధాలే కాదు.. సామాన్య ప్రజలు కూడా అనుకోని పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉక్రెయిన్‌లో ఓ వృద్ధ మహిళకు ఎదురైన అలాంటి ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోడ్డుపై పడి ఉన్న రష్యా డ్రోన్ వద్దకు వెళ్లిన ఆమె.. దాన్ని పీకిపారేసి ఎందుకు పనికి రాకుండా చేసి పడేసింది. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఎరుపు రంగు దుస్తులు ధరించిన ఆ మహిళ.. నేలపై ఉన్న డ్రోన్ దగ్గరకు వెళ్లింది. దాని పైభాగంలోని ఫైబర్-ఆప్టిక్ కేబుల్ స్పూల్ను బయటకు తీసి అవతల పడేసింది. అనంతరం డ్రోన్‌ను కూడా చేతుల్లోకి తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగింది అనేదానిపై స్పష్టత లేదు. కానీ, ఈ వీడియో సెప్టెంబర్ 15న సోషల్ మీడియా నుంచి వైరల్ అయింది. ఈ ఘటన ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియా ప్రాంతంలో జరిగి ఉండొచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఏంటీ డ్రోన్ స్పెషాలిటీ!సాధారణ డ్రోన్లు రేడియో సిగ్నళ్ల ద్వారా ఆపరేటర్ నియంత్రణలో ఉంటాయి. అయితే ఫైబర్-ఆప్టిక్ ఎఫ్‌పీవీ డ్రోన్లకు మాత్రం పలుచటి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అనుసంధానమై ఉంటుంది. డ్రోన్ ఎగురుతున్న కొద్దీ ఈ కేబుల్ స్పూల్ నుంచి బయటకు వస్తుంది. దీని ద్వారా ఆపరేటర్‌కు ప్రత్యక్ష వీడియో, నియంత్రణ సమాచారం అందుతుంది. రేడియో సిగ్నళ్లపై ఆధారపడకపోవడంతో ఎలక్ట్రానిక్ జామింగ్ ద్వారా వీటిని అడ్డుకోవడం సాధారణ డ్రోన్లతో పోలిస్తే కష్టంగా ఉంటుంది. అందుకే వీడియోలో కనిపించిన మహిళ స్పూల్ను తొలగించడంతో డ్రోన్‌కు ఆపరేటర్‌తో ఉన్న నియంత్రణ లింక్ తెగిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి డ్రోన్‌ను చేతితో తాకడం అత్యంత ప్రమాదకరమని నిపుణులు, పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. డ్రోన్‌లో పేలుడు పదార్థాలు ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. సో.. ఈ బామ్మ లక్కీ అన్నమాట.Ukrainian badass granny disables russian FPV drone 😮 pic.twitter.com/uyZiPIwtvS— Apple Tree (@LonelyAppleTree) September 16, 2026ఇదేం కొత్త కాదు!ఉక్రెయిన్‌లో డ్రోన్లతో సామాన్యులు తలపడిన ఘటనలు గతంలోనూ వెలుగులోకి వచ్చాయి. 2022లో కీవ్‌కు చెందిన ఓ వృద్ధురాలు.. బాల్కనీలో నుంచి జార్‌ను విసిరి రష్యా డ్రోన్‌ను కూల్చేయడం చర్చనీయాంశమైంది. అలాగే మొన్నీమధ్యే ఓ పండ్ల వ్యాపారిని వెంటాడగా.. అతను బతిమాలిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. అయితే అది పేలి.. అతనికి గాయాలయ్యాయి. తాజా వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందనలు వస్తున్నాయి. మహిళ ధైర్యాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.ఇదీ చదవండి: ఇది వెయ్యేళ్లకొకసారి వచ్చే వర్షమట! -
ఏఐ వాడకంపై సామ్ ఆల్ట్‌మన్ సంచలన వ్యాఖ్యలు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI).. మనిషి జీవితాన్ని సులభతరం చేసే టెక్నాలజీగానే ఇప్పటివరకు ఎక్కువగా కనిపించింది. కానీ అదే ఏఐ భవిష్యత్తులో ఎంతటి ప్రమాదాలకు దారితీయొచ్చన్న చర్చ కూడా అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఈ భయాలకు మరింత బలం చేకూర్చేలా ఏఐ దిగ్గజ సంస్థ ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ విషయంలో ప్రపంచం భయపడటం తప్పేమీ కాదని.. నిజానికి అలా భయపడటానికి కారణాలు ఉన్నాయని ఆయన అన్నారు. శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన సేల్స్‌ఫోర్స్ డ్రీమ్‌ఫోర్స్ సదస్సులో ఆల్ట్‌మన్ ఏఐ భవిష్యత్తుపై మాట్లాడారు. మరింత శక్తిమంతమైన ఏఐ మోడళ్లు అందుబాటులోకి వస్తున్న కొద్దీ.. అవి తప్పుదారి పట్టే అవకాశాలను ఊహించడం గతంతో పోలిస్తే ఇప్పుడు సులభమైందని చెప్పారు. ‘‘ఏఐ విషయంలో ఏదైనా తప్పు జరిగే అవకాశం ఎలా ఉంటుందో ఊహించడానికి ఇప్పుడు పెద్దగా ఊహాశక్తి అవసరం లేదు. ప్రపంచం దీనిని చూసి భయపడటం సరైనదే’’ అని ఆల్ట్‌మన్ వ్యాఖ్యానించారు.అయితే అదే సమయంలో ఏఐని అభివృద్ధి చేస్తున్న సంస్థలు బాధ్యతగా వ్యవహరించగలవన్న నమ్మకం తనకు ఉందని ఆయన చెప్పారు. ఏఐ అభివృద్ధిలో భద్రత, మానవ విలువలకు అనుగుణంగా వ్యవస్థలను రూపొందించడం.. వాటిపై పర్యవేక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఏఐకి ఇంత భయం ఎందుకు?ఏఐ సామర్థ్యాలు వేగంగా పెరుగుతుండటమే తాజా ఆందోళనలకు ప్రధాన కారణమని ఆల్ట్‌మన్ అభిప్రాయపడ్డారు. గతంలో ఏఐతో సాధ్యం కాదనుకున్న అనేక పనులను ఇప్పుడు అధునాతన మోడళ్లు చేయగలుగుతున్నాయన్నారు. మరింత శక్తిమంతమైన వ్యవస్థలు మనుషుల కంటే కొన్ని రంగాల్లో మెరుగైన పనితీరు కనబరిచే దిశగా అభివృద్ధి చెందుతున్నాయని ఆయన పేర్కొన్నారు.మరోవైపు.. ఏఐ సంస్థలు మరింత శక్తివంతంగా మారితే ఆ టెక్నాలజీపై నియంత్రణ ఎవరి చేతుల్లో ఉండాలి? అనే ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది. శక్తిమంతమైన ఏఐ సంస్థలు ఆర్థిక వ్యవస్థపై అధిక ప్రభావం చూపడం లేదా తమ అభిప్రాయాలను సమాజంపై ప్రభావితం చేసే స్థాయికి చేరడం వంటి ప్రమాదాలపై కూడా ఆల్ట్‌మన్ ఆందోళన వ్యక్తం చేశారు.ప్రమాదాలపై టెక్ దిగ్గజాల్లో చర్చఏఐ భద్రతపై టెక్ పరిశ్రమలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్, ఆంథ్రపిక్ సీఈఓ డారియో అమోడీ లాంటివాళ్లు ఏఐ అభివృద్ధిలో భద్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైతే వేగాన్ని నియంత్రించే మార్గాలను పరిశీలించాలని చెబుతున్నారు. మరోవైపు.. కొత్త చట్టాలు, నియంత్రణల అవసరంపై టెక్ పరిశ్రమలో అందరూ ఒకే అభిప్రాయంలో లేరు. ఇటీవల ఏఐ వ్యవస్థలు అనుకోని విధంగా ప్రవర్తించిన కొన్ని ఘటనలు కూడా ఈ చర్చకు ఆజ్యం పోశాయి. ఏఐ సామర్థ్యాలు పెరుగుతున్న వేగానికి అనుగుణంగా భద్రతా వ్యవస్థలు, పర్యవేక్షణ, నియంత్రణలు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని నిపుణులు చర్చిస్తున్నారు. భయం.. కానీ ఆపేయాలా?ఏఐపై భయాలు పెరుగుతున్నప్పటికీ.. దాని అభివృద్ధిని పూర్తిగా నిలిపివేయాలా? లేదంటే భద్రతా ప్రమాణాలతో కొనసాగించాలా? అన్నది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టెక్ కంపెనీలు, పరిశోధకులు, ప్రభుత్వాలు ఈ విషయంలో వేర్వేరు విధానాలను ప్రతిపాదిస్తున్నాయి. అయితే ఆల్ట్‌మన్ తాజా వ్యాఖ్యలు మాత్రం ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఏఐను అభివృద్ధి చేస్తున్న సంస్థలకే దాని ప్రమాదాలపై ఆందోళనలు ఉన్నాయన్న చర్చ మరింత బలపడుతోంది. మనిషికి ఉపయోగపడే టెక్నాలజీగా ఏఐ ఎంత వేగంగా ఎదుగుతోందో.. అదే సమయంలో దాని సామర్థ్యాలను బాధ్యతగా నియంత్రించడం కూడా అంతే కీలకంగా మారుతోంది.ఇదీ చదవండి: ఏఐ స్లోకి ట్రంప్ భయపడుతున్నారా? -
ట్రంప్ 100% టారిఫ్ బిల్లు: భారత్ రియాక్షన్ ఇదే..
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధించేలా అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన బిల్లుపై భారత్ స్పందించింది. తమ వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇదే సమయంలో దేశ ఇంధన అవసరాలు, జాతీయ ప్రయోజనాలే తమ చమురు కొనుగోళ్లకు ప్రాతిపదిక అని మరోసారి తేల్చిచెప్పింది.అమెరికా ప్రతినిధుల సభ బుధవారం ‘లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026’కు 262–159 ఓట్లతో ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ద్వారా రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు, సహజవాయువు కొనుగోలు చేసే దేశాలపై గరిష్టంగా 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కల్పించారు. భారత్, చైనా వంటి దేశాలు దీని పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఆయన నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.భారత్ స్పందన.. బిల్లు ఆమోదం నేపథ్యంలో.. భారత విదేశాంగ శాఖ గురువారం స్పందించింది. తన వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించుకునే విషయంలో స్పష్టమైన వైఖరితో ఉన్నట్లు తెలిపింది. రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయడంపై భారత్ ఇప్పటికే తన విధానాన్ని పలుమార్లు వివరించిందని గుర్తు చేస్తోంది. దేశంలోని 140 కోట్లకుపైగా ప్రజల ఇంధన అవసరాలను తీర్చేందుకు వివిధ దేశాల నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్నామని పేర్కొంది. రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో అమెరికా ఒత్తిడి కొనసాగుతున్న నేపథ్యంలో.. భారత్ తన ఇంధన భద్రత, జాతీయ ప్రయోజనాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు స్పష్టం చేస్తోంది. అదే సమయంలో.. అమెరికా ప్రతినిధులతో గత కొన్ని నెలలుగా ఉన్నతస్థాయిలో ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయని విదేశాంగ శాఖ అంటోంది. ఈ బిల్లు వల్ల భారత్–అమెరికా ద్వైపాక్షిక సంబంధాలతో పాటు అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై పడే ప్రభావాలను కూడా భారత ప్రభుత్వం ఇప్పటికే అమెరికా వర్గాలకు స్పష్టంగా వివరించిందని పేర్కొంది. అమెరికా చర్య వల్ల ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనేందుకు వాణిజ్య, పారిశ్రామిక సంస్థలతో కలిసి పనిచేస్తామని తెలిపింది.ట్రంప్ డెస్క్ మీద.. అమెరికా ప్రతినిధుల సభలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదం పొందింది. అయితే అంత మాత్రాన భారత్‌పై వెంటనే 100 శాతం టారిఫ్ అమల్లోకి వచ్చినట్లు కాదు. ఈ బిల్లు ఇప్పుడు అధ్యక్షుడు ట్రంప్ ఆమోదానికి వెళ్లనుంది. సంబంధిత చట్టానికి సంబంధించిన ఫైల్.. ట్రంప్ డెస్క్ వద్దకు వెళ్లినట్లు వైట్‌హౌజ్ వర్గాలు ధృవీకరించాయి. అయితే ఏ దేశంపై, ఎంత టారిఫ్ విధించాలి అనే అధికారం ఇప్పుడు అధ్యక్షుడి నిర్ణయంపై ఆధారపడి ఉంది. రష్యా ఆంక్షల బిల్లులో.. రష్యా చమురు, గ్యాస్ కొనుగోళ్లపై ఆంక్షలతో పాటు రష్యా ‘షాడో ఫ్లీట్’, ఆ దేశ నాయకత్వం(పుతిన్ సహా అక్కడి పలువురు అగ్రనేతలు), ఆర్థిక సంస్థలు, ఇంధన రంగంపైనా బిల్లు కఠిన చర్యలను ప్రతిపాదిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధానికి రష్యాకు లభిస్తున్న ఇంధన ఆదాయాన్ని పరిమితం చేయడమే అమెరికా చర్యల ప్రధాన ఉద్దేశంగా పేర్కొంటోంది. ఇక భారత్‌పై ఈ చట్టం ఎలా అమలవుతుంది? టారిఫ్ విధిస్తే ఎంత మేరకు ఉంటుంది? రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది? అనే అంశాలు ట్రంప్ తదుపరి నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతానికైతే భారత్ మాత్రం తన ఇంధన భద్రత, వాణిజ్య ప్రయోజనాల పరిరక్షణకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.అమెరికా రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం.. 2026 జూలైలో ఉక్రెయిన్ పర్యటన ముగించుకుని అమెరికాకు తిరిగొచ్చిన మరుసటి రోజే మరణించారు. రష్యాపై కఠిన ఆంక్షలకు ఉద్దేశించిన ఈ బిల్లును ఆయనే ముందుకు తీసుకెళ్లడంతో.. ఆయన గౌరవార్థం ఈ బిల్లుకు ట్రంప్ ‘లిండ్సే ఓ. గ్రాహం’ పేరు పెట్టారు.ఇదీ చదవండి: ట్రంప్ రష్యా బిల్లు.. భారత్, చైనాపైనే ఎందుకు? -
అయిపాయె.. ఇక భారత్, చైనాకు బిగ్ టెన్షన్!
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మాస్కోపై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాపై కఠిన ఆంక్షలు విధించే బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులో రష్యా చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేసే దేశాలపై భారీ టారిఫ్‌లు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కల్పించారు. ఇందులో భాగంగా 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అవకాశం ఉండటం భారత్, చైనాలకు ఆందోళన కలిగించే అంశంగా మారింది.ప్రతినిధుల సభలో రష్యా ఆంక్షల బిల్లుకు అనుకూలంగా 262 ఓట్లు, వ్యతిరేకంగా 159 ఓట్లు వచ్చాయి. ఇప్పటికే గత నెలలో సెనెట్ 86–11 ఓట్లతో ఈ బిల్లును ఆమోదించింది. దీంతో ఇప్పుడు బిల్లు ట్రంప్ వద్దకు వెళ్లనుంది. తాను బిల్లుపై సంతకం చేస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.రష్యాపై మరింత ఒత్తిడి‘లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్–2026’గా పిలుస్తున్న ఈ చట్టం రష్యా ఇంధన, రక్షణ రంగాలపై కఠిన ఆంక్షలకు మార్గం సుగమం చేయనుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇతర కీలక అధికారులపైనా ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. పాశ్చాత్య దేశాల ఆంక్షలను తప్పించుకునేందుకు రష్యా ఉపయోగిస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘షాడో ఫ్లీట్’ ట్యాంకర్లపైనా చర్యలు తీసుకునే వీలు కల్పిస్తోంది. ఇరాన్‌కు సంబంధించిన అదనపు ఆంక్షలకు కూడా బిల్లులో అవకాశం ఉంది.అంతేకాకుండా రష్యాతో వ్యాపారం కొనసాగించే ఇతర దేశాలపై కూడా చర్యలకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది. ముఖ్యంగా రష్యా చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేసే దేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారాన్ని ట్రంప్‌కు ఇస్తోంది.భారత్, చైనాలే ఎందుకు?ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైన తర్వాత ప్రపంచ ఇంధన మార్కెట్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా రష్యా చమురు తక్కువ ధరలకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడగా.. భారత్, చైనా సహా పలు దేశాలు రష్యా నుంచి భారీగా ముడిచమురు కొనుగోలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేసే ప్రధాన దేశాలపై ద్వితీయ టారిఫ్‌లు విధించే అధికారాన్ని అమెరికా ఉపయోగించవచ్చని బిల్లులో పేర్కొన్నారు. అమెరికా ప్రతినిధుల సభలో జరిగిన చర్చలో భారత్, చైనాలను ప్రధాన కొనుగోలుదారులుగా ప్రత్యేకంగా ప్రస్తావించారు.అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే.. బిల్లు ఆమోదమైనంత మాత్రాన భారత్‌పై 100 శాతం టారిఫ్ తక్షణమే అమల్లోకి రాదు. ఏ క్షణమైనా అలాంటి టారిఫ్ విధించే అధికారం మాత్రమే అధ్యక్షుడికి లభిస్తుంది. కాబట్టి దాన్ని ఎప్పుడు, ఏ దేశంపై, ఎంత మేరకు అమలు చేయాలన్నది ట్రంప్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.అమెరికా మార్కెట్‌పై ప్రభావం?భారత్ రష్యా నుంచి భారీగా ముడిచమురు దిగుమతి చేసుకుని, దాన్ని శుద్ధి చేసి దేశీయ అవసరాలకు వినియోగించడంతోపాటు కొన్ని ఉత్పత్తులను ఎగుమతి కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా ఇంధన కొనుగోళ్లను కొనసాగిస్తే భారత ఉత్పత్తులపై అమెరికా అదనపు టారిఫ్‌లు విధించే అవకాశం ఉండటం వాణిజ్య రంగంలో కొత్త అనిశ్చితికి దారితీస్తోంది. అయితే ఇప్పటివరకు భారత్‌పై కొత్త 100 శాతం టారిఫ్ విధించినట్లు అమెరికా ప్రకటించలేదు.ట్రంప్‌కు అధికారం ఇవ్వడంపై అభ్యంతరాలుబిల్లుకు కాంగ్రెస్‌లో విస్తృత మద్దతు లభించినప్పటికీ.. ట్రంప్‌కు ఇంత విస్తృతమైన టారిఫ్ అధికారాలు ఇవ్వడంపై డెమొక్రాట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీలో డెమొక్రాట్ల తరఫున సీనియర్ సభ్యుడైన గ్రెగరీ మీక్స్ ఈ బిల్లును తీవ్రంగా విమర్శించారు. రష్యాపై ఆంక్షలకు తాము మద్దతు ఇస్తున్నప్పటికీ.. రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై టారిఫ్‌లు విధించే అధికారాన్ని ట్రంప్‌కు విస్తృతంగా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు డెమొక్రాట్లు తెలిపారు. ఇక సెకండరీ టారిఫ్‌లకు సంబంధించిన నిబంధనలను తొలగించే ప్రయత్నం చేసినా అది విఫలమైంది.ట్రంప్ నిర్ణయంపైనే ఉత్కంఠరష్యాపై ఒత్తిడి పెంచి ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేలా పుతిన్‌ను చర్చల వైపు తీసుకురావడమే ఈ చర్యల లక్ష్యమని బిల్లు మద్దతుదారులు చెబుతున్నారు. మరోవైపు ట్రంప్ స్వయంగా టారిఫ్‌లు, ఆంక్షలను తన విదేశాంగ విధానంలో కీలక సాధనాలుగా ఉపయోగిస్తున్నారు.ఇప్పుడు ప్రతినిధుల సభ, సెనెట్ ఆమోదం పొందిన బిల్లు ట్రంప్ సంతకానికి వెళ్లనుంది. బిల్లు చట్టంగా మారిన తర్వాత భారత్, చైనా వంటి రష్యా ఇంధన కొనుగోలుదారులపై ట్రంప్ ఈ అధికారాన్ని ఎలా ఉపయోగిస్తారన్నదే అసలు ప్రశ్న. దీంతో రష్యా నుంచి చమురు కొనుగోళ్లు, భారత్–అమెరికా వాణిజ్య సంబంధాలపై తదుపరి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.ఇదీ చదవండి: అక్కడ రూల్స్ పాటించకుంటే ఫైన్లు వేసేస్తారు! -
ఇరాన్ విమానంలో భయానక సీన్
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఒక్కసారిగా భారీగా కుదుపులకు గురైంది. ఏం జరుగుతుందో అర్థంకాక ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. ఇంతలో క్యాబిన్ పైకప్పు భాగాలు ఊడిపడి సీట్లపై వేలాడుతూ కనిపించాయి. లగేజీ బిన్లు తెరుచుకుని బ్యాగులు కిందపడటంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. చివరకు పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని తిరిగి ఎయిర్‌పోర్టుకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.ఇరాన్‌కు చెందిన సెపెహ్రాన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 విమానం మంగళవారం సాయంత్రం మషద్ నుంచి కెర్మాన్‌షాకు బయల్దేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ల్యాండింగ్ గేర్‌లోని ఓ టైరు ఊడిపోయింది. ఆ టైరు దెబ్బతినడంతో దాని భాగాలు ఇంజిన్‌ను తాకాయి. దీంతో ఇంజిన్‌లో సమస్య తలెత్తి విమానం తీవ్రంగా కుదుపులకు లోనైంది. పైలట్ సాంకేతిక సమస్యను గుర్తించి విమానాన్ని మషద్ వైపు మళ్లించారు. అత్యవసర పరిస్థితిని ప్రకటించి తిరిగి ల్యాండ్ చేయాలని నిర్ణయించారు.భయంతో కేకలు..విమానం తిరిగి వస్తున్న సమయంలో కుదుపులు మరింత తీవ్రంగా మారాయి. ఆ ప్రభావంతో క్యాబిన్ పైకప్పు లోపలి లైనింగ్ భాగాలు ఊడిపోయి ప్రయాణికులపై పడినట్లు వీడియోల్లో కనిపించింది. ఆ సమయంలో ప్రాణ భయంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. కొన్ని చోట్ల విమానం లోపలి నిర్మాణంలోని భాగాలు కూడా బయటకు కనిపించాయి. లగేజీ బిన్లు తెరుచుకోవడంతో బ్యాగులు సీట్లపై, మార్గంలో పడిపోయాయి. సేఫ్‌గా ల్యాండింగ్..అయితే విమానం మషద్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. లగేజీలు కిందపడ్డా కూడా ప్రయాణికులు, సిబ్బంది ఎవరూ గాయపడలేదు. అనంతరం ప్రయాణికులను మరో విమానంలో కెర్మాన్‌షాకు పంపించినట్లు సమాచారం. ఘటన అనంతరం రన్‌వేను కొంతసేపు మూసివేసి తనిఖీలు నిర్వహించారు.విమానంలో సాంకేతిక లోపానికి అసలు కారణమేంటన్న దానిపై ఇరాన్ పౌర విమానయాన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఎయిర్‌లైన్స్‌కు చెందిన మరో విమానం ఆగస్టు 25న మషద్‌లో ల్యాండ్ అవుతుండగా రన్‌వేపై నుంచి పక్కకు వెళ్లిన ఘటన జరిగింది.WATCH: Cabin ceiling falls apart onboard a Sepehran Airlines Boeing 737 after a tire reportedly burst shortly after takeoff from Mashhad Airport causing engine damage and severe vibrations. pic.twitter.com/R7RP1AwZYX— Breaking Aviation News & Videos (@aviationbrk) September 15, 2026 -
ట్రంప్ తెచ్చిన యుద్ధం: అమెరికాకు 3 లక్షల కోట్ల బిల్లు!! ఇకపై ప్రతీ నెలా మరో 25 వేల కోట్లు!
ఇరాన్‌పై యుద్ధానికి దిగినందుకు అమెరికా ఇప్పుడు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తోంది. ఆరు నెలలు ముగిసినా.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇందుకోసం అమెరికా ఇప్పటిదాకా ఎంత ఖర్చు చేసిందో తెలుసా?.. మన కరెన్సీలో 3,00,00,00,00,00,000. అంటే మూడు లక్షల కోట్లు. ఇదే కాకుండా సైన్యానికి భారీగా నష్టం వాటిల్లింది. ఇది ఇలాగే కొనసాగితే ఇంకా నెలకు రూ.25 వేల కోట్లు చెల్లించుకుంటూనే పోవాలంట!.డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ యుద్ధం మొదలైంది. అయితే ఈ యుద్ధంతో ఇప్పటివరకు అమెరికా రక్షణ శాఖపై పడిన ప్రత్యక్ష వ్యయం ఏకంగా 38 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో దాని లెక్క రూ.3.2 లక్షల కోట్లు. యుద్ధం ఇదే స్థాయిలో కొనసాగితే ప్రతి నెలా మరో 2–3 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ (CBO) తాజాగా అంచనా వేసింది. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని అడ్డుకోవడం, అమెరికా భద్రతకు ముప్పును తొలగించడం లక్ష్యంగా ఈ దాడులకు ఆదేశించినట్లు ట్రంప్ అప్పట్లో ప్రకటించారు. అయితే కొన్ని వారాల్లో ముగుస్తుందని భావించిన ఈ సైనిక చర్య సుదీర్ఘ ఘర్షణగా మారింది. సెప్టెంబర్ నాటికీ పోరాటం పూర్తిగా ఆగలేదు. తాజాగా ట్రంప్ ఈ యుద్ధాన్ని ప్రారంభించిన నిర్ణయంపై తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని చెప్పారు. నెలకు మరో రూ.25 వేల కోట్లు!యుద్ధం మరింత కొనసాగితే అమెరికా ఖజానాపై భారం ఆగేలా కనిపించడం లేదు. తక్కువ తీవ్రతతో పోరాటం కొనసాగితే నెలకు సుమారు 2 బిలియన్ డాలర్లు, దాడులు మళ్లీ తీవ్రరూపం దాల్చితే దాదాపు 3 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని సీబీవో తెలిపింది. అంటే భారత కరెన్సీలో చూస్తే ఒక్క నెలలోనే దాదాపు రూ.17 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. ఈ యుద్ధంలో అమెరికా ఖజానాకే కాదు.. ఆ దేశ సైన్యానికీ భారీ నష్టం వాటిల్లింది. ఇరాన్ ప్రతిదాడుల్లో అమెరికా సైనిక స్థావరాలు, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. పలు విమానాలు, సైనిక పరికరాలు నష్టపోయినట్లు నివేదికలు వెలువడ్డాయి. మరోవైపు ఇరాన్ నుంచి వచ్చిన క్షిపణులను అడ్డుకునేందుకు అమెరికా భారీ సంఖ్యలో ఇంటర్సెప్టర్లను ప్రయోగించాల్సి వచ్చింది. దీంతో యుద్ధం సాగుతున్న కొద్దీ అమెరికా సైనిక సామర్థ్యాలపై, ముఖ్యంగా కీలక ఆయుధ నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది.అసలు ఖర్చు.. క్షిపణులే!ఈ యుద్ధంలో అమెరికా భారీగా క్షిపణులు, ఇంటర్సెప్టర్లను ప్రయోగించింది. ఆగస్టు 1 వరకు ఉపయోగించిన ఆయుధాలను తిరిగి సమకూర్చుకోవడానికే సుమారు 21.7 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని సీబీవో లెక్కించింది. ఇందులో ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైళ్లకు 7.3 బిలియన్, మిసైల్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్లకు 13.1 బిలియన్ డాలర్లు, ఇతర ఆయుధాలకు 1.2 బిలియన్ డాలర్లు ఉన్నాయి. యుద్ధంలో కోల్పోయిన పరికరాలను భర్తీ చేయడానికి మరో 1.9 బిలియన్ డాలర్లు అవసరమని పేర్కొంది. ఆయుధ నిల్వలకు గండి..డబ్బు ఖర్చవడమే కాదు.. అమెరికా ఆయుధ నిల్వలపైనా యుద్ధం ప్రభావం పడుతోంది. ముఖ్యంగా క్షిపణి రక్షణ ఇంటర్సెప్టర్ల నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయని సీబీవో పేర్కొంది. వాటిని పూర్తిస్థాయిలో తిరిగి సమకూర్చుకోవడానికి ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు రక్షణ కార్యాలయం పెంటగాన్ మాత్రం తమ వద్ద అధ్యక్షుడి వ్యూహాత్మక అవసరాలకు సరిపడా ఆయుధాలు ఉన్నాయని చెబుతోంది. అయితే ఇందుకు విరుద్ధంగా పెంటగాన్ ఇన్స్పెక్టర్ జనరల్ నివేదిక మాత్రం.. యుద్ధం కారణంగా కీలక ఆయుధాల్లో ‘స్ట్రాటజిక్ ఇన్వెంటరీ షార్ట్‌ఫాల్స్’ ఏర్పడ్డాయని పేర్కొంది. హర్ముజ్ మూసివేత.. ప్రపంచానికి మరో దెబ్బఇరాన్తో యుద్ధం ప్రభావం అమెరికా సరిహద్దులకే పరిమితం కాలేదు. హార్ముజ్ జలసంధిలో రవాణా తీవ్రంగా దెబ్బతినడంతో చమురు సరఫరాపై ఒత్తిడి పెరిగింది. యుద్ధం తర్వాత బ్రెంట్ క్రూడ్ ధర రెండో త్రైమాసికంలో బ్యారెల్‌కు 103 డాలర్ల వరకు చేరింది. ఇంధన ధరల పెరుగుదల ఇతర వస్తువులు, రవాణా ఖర్చులపై ప్రభావం చూపడంతో అమెరికాలో ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉందని సీబీవో తెలిపింది. 2027 తొలి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం గతంలో వేసిన అంచనాల కంటే 0.5 శాతం పాయింట్లు ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది. ఇంకా అసలు బిల్లు రాలేదు!సీబీవో చెప్పిన 38 బిలియన్ డాలర్లలో యుద్ధానికి సంబంధించిన ప్రతి ఖర్చూ లేదు. అమెరికా స్థావరాలకు జరిగిన నష్టం, భవిష్యత్‌లో వాటి మరమ్మతులు, యుద్ధానికి అప్పులు తీసుకుంటే చెల్లించాల్సిన వడ్డీ, సైనికులకు భవిష్యత్‌లో అందించాల్సిన వైద్య, వైకల్య ప్రయోజనాలు వంటి ఖర్చులు ఇందులో పూర్తిగా లేవు. రక్షణ శాఖ నుంచి సీబీవో కోరిన సమాచారానికి పూర్తి సహకారం అందకపోవడంతో ఈ అంచనాల్లో కొంత అనిశ్చితి కూడా ఉందని బడ్జెట్ ఆఫీస్ స్పష్టం చేసింది. అమెరికాకే కాదు.. డ్యామేజ్ ట్రంప్‌కు కూడా!యుద్ధం ఎప్పుడు ముగుస్తుందన్నది స్పష్టంగా లేకపోవడంతో ఈ బిల్లు చివరకు ఎంతకు చేరుతుందన్నది కీలక ప్రశ్నగా మారింది. మరోవైపు.. ఈ యుద్ధం ట్రంప్ రాజకీయ ప్రతిష్టపైనా ప్రభావం చూపుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆయనకున్న ప్రజాదరణ క్రమంగా తగ్గిపోయిందని రాయిటర్స్ లాంటి పలు ప్రముఖ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలు చెబుతున్నాయి. ఇరాన్ యుద్ధం, పెరిగిన ఇంధన ధరలు అమెరికన్లలో అసంతృప్తికి కారణమవుతున్నట్లు అవి వెల్లడించాయి.ముఖ్యంగా నవంబర్ మిడ్‌టర్మ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రిపబ్లికన్ పార్టీలో ఆందోళన పెరిగిపోతోంది. యుద్ధ వ్యయం, పెరుగుతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం, ఆయుధ నిల్వలపై ఒత్తిడి వంటి అంశాలు ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయంగా కీలకంగా మారనున్నాయి. ఒకవైపు యుద్ధాన్ని కొనసాగించాల్సిన వ్యూహాత్మక అవసరాన్ని ట్రంప్ సమర్థిస్తుండగా.. మరోవైపు పెరుగుతున్న ఖర్చు, ఆర్థిక భారం, ప్రజాభిప్రాయంపై దాని ప్రభావం ఆయన ముందున్న పెద్ద సవాళ్లుగా మారాయి.ఇదీ చదవండి: అమెరికా ఇలాంటి పని చేస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు! -
చైనా స్పై గేమ్.. ఇక నీటిలో చేపను నమ్మేదెలా!?
మొన్నీమధ్యే రోబోట్ గేమ్స్‌తో అబ్బురపరిచిన డ్రాగన్ దేశం.. ఇప్పుడు మరో టెక్నాలజీ మాయాజాలంతో ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఇప్పటివరకు డ్రోన్లు అంటే ఆకాశంలో ఎగిరేవే.. కానీ చైనా మాత్రం వాటి పరిధిని నీటి అడుగునకూ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. అచ్చం చేపలా కనిపిస్తూ.. చేపలాగే ఈదుతూ.. నీటిలో తన ఉనికి ఏమాత్రం అనుమానం రాకుండా కదిలే ఓ రోబోటిక్ చేపను అభివృద్ధి చేసింది. దూరం నుంచి చూస్తే నిజమైన చేపే అనిపించే ఈ యంత్రం.. దగ్గరగా పరిశీలిస్తే మాత్రం సెన్సర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అధునాతన సాంకేతికతతో కూడిన నిఘా రోబోగా కనిపిస్తుంది.బీజింగ్‌లోని షౌగాంగ్ పార్క్‌లో జరుగుతున్న 2026 చైనా ఇంటర్నేషనల్ ఫెయిర్ ఫర్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్ (CIFTIS)లో రోబో చేప ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుమారు మూడు కిలోల బరువు ఉన్న ఈ బియోనిక్ రోబో చేప పేరు.. గోల్డెన్ డ్రాగన్ ఫిష్(BG-5). గోల్డెన్ అరోవానా చేపకు జిరాక్స్‌లా ఉందది. అంతేకాదు.. నీళ్లలో ఈదుతూ.. అడ్డంకులు ఎదురైతే తన దారిని తానే మార్చుకుంటూ ముందుకు సాగింది. దీనికి ఏ రిమోట్ అక్కర్లేదు. ఏ ప్రొగ్రామింగ్ చేయాల్సిన అవసరం లేదు. లోపల మాత్రం మోటార్లు, సెన్సర్లు, ఎలక్ట్రానిక్ వ్యవస్థలు ఉంటాయి. సాధారణ అండర్‌వాటర్ డ్రోన్లు ప్రొపెల్లర్లతో కదులుతాయి. కానీ ఇది మాత్రం తోకలో ఉండే 3 కదిలే జాయింట్లు, 7 సెగ్మెంట్లు ఉంటాయి. వాటిని ఊపుతూ ముందుకు సాగుతూ నీటిలో అలల తరహా కదలికలను చూపిస్తుంది. దీంతో ఏదో యంత్రం కదులుతున్నట్లు కాకుండా.. అచ్చం జీవం ఉన్న చేప ఈదుతున్నట్లుగా కనిపిస్తుంది. ఈ సహజమైన కదలికే దీని అసలు బలం. 3 కిలోలే.. కానీ టెక్నాలజీ మాత్రం భారీదే!BG-5 పరిమాణం చూస్తే ఆశ్చర్యమే. ఇది సుమారు 640 మిల్లీమీటర్ల పొడవు, 204 మిల్లీమీటర్ల వెడల్పు, 90 మిల్లీమీటర్ల ఎత్తు ఉంటుంది. బరువు కేవలం 3 కిలోలు. గరిష్టంగా 5 మీటర్ల లోతులో పనిచేయగలదు. గరిష్ట వేగం సెకనుకు 0.6 మీటర్లు. అంటే ఇది సముద్రంలో నిఘాకు పనికి రాదన్నమాట!. తక్కువ లోతున్న నీళ్లలో పని చేసే రోబో మాత్రమే. Look at the quality of this fish drone that China just revealed pic.twitter.com/v24asLP4d1— The Gulag (@WelcomeTheGulag) September 15, 2026 అయితే ఈ టెక్నాలజీ భవిష్యత్తులో గూఢచర్యానికి ఉపయోగపడుతుందా? అనే ఆందోళనను కూడా రేకెత్తిస్తోంది. దాని చుట్టూ ఉన్న సెన్సార్లు.. ఏదైనా ఆటంకాలు ఎదురైతే దానంతట అదే తప్పించుకుని ముందుకు సాగుతుంది. అంటే నీటిలో పరిస్థితులు మారినా.. ఎదురుగా ఏదైనా వస్తే ఆగిపోకుండా, దాన్ని తప్పించుకుని ఓ నిజం చేపలా ముందుకు వెళ్లగలదు. పైగా మనుషులు సాధారణంగా ఉపయోగించే అండర్‌వాటర్ డ్రోన్లా బయటికి యంత్రంలా కనిపించదు. దీంతో చేప రూపంలోనే నిఘా పెట్టే కొత్త రోబోను చైనా ప్రదర్శించిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు మాయ ఇక్కడే..ఒక పెద్ద అండర్‌వాటర్ డ్రోన్ నీటిలోకి వస్తే దాన్ని గుర్తించడం కొంత సులభం. కానీ చేపల గుంపులో ఒక చేపలా కనిపించే రోబోను గుర్తించడం అంత సులభం కాకపోవచ్చు. ఇదే కారణంగా BG-5ను షాలో-వాటర్ రీకానైసెన్స్, సర్వైలెన్స్ కోణంలో నిపుణులు పరిశీలిస్తున్నారు. అయితే ప్రస్తుతం చైనా సైనిక గూఢచర్యానికి ఉపయోగిస్తోందని నిర్ధారించే ఆధారం లేదు. కంపెనీ మాత్రం పౌర అవసరాలకూ ఉపయోగించవచ్చని చెబుతోంది.కానీ, ఈ రోబోను తయారు చేసిన సంస్థకు రక్షణ రంగానికి సంబంధించిన అండర్‌వాటర్ రోబోటిక్స్‌లో పనిచేసిన నేపథ్యం ఉంది. ఈ సంస్థ గతంలో రోబో షార్క్ (ROBO-SHARK) అనే బయోమిమెటిక్ అండర్‌వాటర్ రోబోను సైనిక యూనిట్‌తో కలిసి అభివృద్ధి చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అలాగే నీటి అడుగున బయోమిమెటిక్ డిటెక్షన్ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన రక్షణ ప్రాజెక్టులో పనిచేసినట్లు సంస్థే పేర్కొంది. China will turn anything that moves into a spying machine—Chinese cars, Chinese products, and now even fish. China wants to control all of us. China is a real threat to the freedom of every person on the planet. pic.twitter.com/ycou8OaVQy— Israel & World News (@Nonstopnews_) September 15, 2026..గుంపుగా వస్తే?ఇక్కడ ఇంకో విషయం మరింత ఆందోళన కలిగిస్తోంది. BG-5కు సంబంధించిన రూట్ మ్యాప్, పనుల కేటాయింపు, ఫార్మేషన్ కంట్రోల్, బహుళ రోబోట్ల మధ్య సమన్వయం వంటి సామర్థ్యాలను కంపెనీ ప్రస్తావించింది. అంటే భవిష్యత్తులో ఒక్క రోబో చేప కాకుండా.. చేపల గుంపులా అనేక రోబోలు నీటిలోకి వెళ్లి, ఒక్కొక్కటి ఒక్కో ప్రాంతాన్ని గమనించే పరిస్థితి రావొచ్చు. ఒకటి సమాచారం సేకరిస్తే.. మరొకటి మరో ప్రాంతాన్ని పరిశీలించడం.. వాటన్నింటినీ సమన్వయం చేయడం సాధ్యమయ్యే దిశగా టెక్నాలజీ వెళ్తోంది. ఇప్పటివరకు BG-5ను “స్పై ఫిష్” అని అధికారికంగా పిలవడం లేదు. కానీ దాని సహజమైన రూపం, స్వయంచాలకంగా దారి మార్చుకునే సామర్థ్యం, నీటి అడుగున పరిశీలనకు అనువైన డిజైన్, తయారీ సంస్థకు ఉన్న రక్షణ రంగ అనుసంధానాలు.. ఇవన్నీ కలిపి చూస్తే ఈ టెక్నాలజీ భవిష్యత్తులో నిఘా, పరిశఋలన వంటి భద్రతా కార్యకలాపాలకు ఉపయోగపడే అవకాశాన్ని మాత్రం కొట్టిపారేయలేం.యంత్రం యంత్రంలా కనిపించకుండా.. ప్రకృతిలోని జీవిలా కలిసిపోయేలా చేయడమే ఈ టెక్నాలజీ వెనుక అసలు ఆలోచన. నేడు చేప రూపంలో కనిపించిన ఈ రోబోట్.. రేపు పురుగు, తేనెటీగ, డ్రాగన్‌ఫ్లై రూపంలోనూ నిఘా కోసం రంగంలోకి దిగితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో! అసలు ప్రశ్న ఒక్కటే.. మన చుట్టూ కనిపిస్తున్న జీవుల్లో ఎన్ని నిజమైనవో.. ఎన్ని నిఘా యంత్రాలో గుర్తించడం ఎలా?.ఇదీ చదవండి: కరాచీలో ‘ధురంధర్-3’ షూటింగ్ -
ధురంధర్-3 ప్లాన్ చేస్తున్నారా భయ్యా? పాక్‌లో మళ్లీ..
దేశ శత్రువులపై నిఘా పెట్టి, రహస్య ఆపరేషన్లతో వారిని టార్గెట్ చేసే కథే.. ధురంధర్ సినిమా. రణ్వీర్ సింగ్ లీడ్ రోల్లో ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల్ని అలరించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమాలో చూపించినట్లే ఆపరేషన్లు నిజంగానే జరుగుతాయా?. టార్గెట్ చేసిన వ్యక్తులను గుర్తుతెలియని దుండగులు పక్కా ప్లాన్‌తో హతమార్చడం.. ఆ తర్వాత జాడ లేకుండా పోవడం పాక్‌లో కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా కరాచీలోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది.పాకిస్థాన్‌లో మరోసారి ‘అన్నోన్ గన్‌మెన్’ కలకలం రేపారు. కరాచీలో లష్కరే తోయిబా (LeT)తో సంబంధాలున్నట్టు చెబుతున్న ఓ వ్యక్తిని నలుగురు గుర్తుతెలియని దుండగులు బైక్‌లపై వచ్చి కాల్చిచంపారు. భైంస్ కాలనీలోని రోడ్ నంబర్ 11 వద్ద ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే మృతుడి అసలు గుర్తింపు, అతడికి ఐఎస్ఐతో ఉన్న సంబంధాలపై పాకిస్థాన్ అధికారులు ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. దాడికి ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యత ప్రకటించలేదు. అయితే చనిపోయిన వ్యక్తి ఎల్ఈటీ వ్యవస్థాపకుడు హఫీజ్ సయ్యద్‌కు అత్యంత సన్నిహితుడని మాత్రం స్థానికంగా కొన్ని మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి.ఈ ఘటనలో ప్రత్యేకత ఏంటంటే.. దాడి చేసిన తీరు. బైక్‌లపై వచ్చిన నలుగురు వ్యక్తులు టార్గెట్‌ను గుర్తించి వేగంగా కాల్పులు జరిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఘటన జరిగిన ప్రాంతం జనాల రద్దీతో ఉన్నప్పటికీ.. దుండగులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తప్పించుకున్నారు. దీంతో అసలు ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారన్నది మరోసారి ప్రశ్నగా మారింది.పాక్‌లో ఇది మాములే!పాకిస్థాన్‌లో ఉగ్రవాద సంస్థలకు చెందిన కీలక వ్యక్తులు ‘గుర్తుతెలియని దుండగుల’ చేతిలో హతమవుతున్న ఘటనలు గత కొన్నేళ్లుగా అంతర్జాతీయంగా చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి భారత్ వ్యతిరేక ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న వ్యక్తులు లక్ష్యంగా మారిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.The unsung heros from India : Unknown Men. https://t.co/mXbXjRPuh5— Magizhmaran ❇️ (@Maransadagopan) September 15, 20262026 ఆగస్టులో లష్కరే తోయిబాకు చెందిన రిజ్వాన్ హనీఫ్ చేసినట్లు ప్రచారంలోకి వచ్చిన వీడియో ఈ వ్యవహారంపై మరింత ఆసక్తి పెంచింది. గత మూడు నాలుగేళ్లలో పాకిస్థాన్‌లో తమ సంస్థకు చెందిన 30 మందికి పైగా వ్యక్తులను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చినట్లు అతను చెప్పినట్టు పలు మీడియా సంస్థలు నివేదించాయి. పెషావర్, కరాచీ, రావల్పిండి, ముజఫరాబాద్, రావలకోట్ వంటి ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నట్టు ఆ వాదనలో ప్రస్తావన వచ్చింది. అయితే ఈ సంఖ్యను పాకిస్థాన్ ప్రభుత్వం స్వతంత్రంగా ధ్రువీకరించలేదు. అంతేకాదు.. ఈ హత్యల వెనుక ఎవరున్నారన్నదానిపైనా స్పష్టమైన ఆధారాలు బహిరంగంగా లేవు.అసలు ఈ ‘గన్‌మెన్’ ఎవరు?కరాచీ తాజా హత్యలో ఇదే ప్రధాన ప్రశ్న. మృతుడు నిజంగా ఐఎస్ఐతో సంబంధాలున్న వ్యక్తేనా? లష్కరే తోయిబాతో అతడి సంబంధం ఎంతవరకు ఉంది? దాడి వ్యక్తిగత కక్షతో జరిగిందా? ప్రత్యర్థి ఉగ్రవాద సంస్థల పనేనా? లేక మరేదైనా నిఘా వ్యవస్థ పాత్ర ఉందా? ప్రస్తుతానికి ఏ ప్రశ్నకూ అధికారిక సమాధానం లేదు.హఫీజ్ సయ్యద్ పాకిస్థాన్‌కు చెందిన తీవ్రవాది, లష్కరే తోయిబా (LeT) వ్యవస్థాపకుల్లో ఒకడు. 2008 ముంబై ఉగ్రదాడుల సూత్రధారుల్లో అతడొకడని భారత్ చెబుతూ వస్తోంది. అమెరికా కూడా అతడిని ఉగ్రవాదిగా ప్రకటించి, అతడి తలపై 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. లష్కరే తోయిబా వ్యవస్థతో అతడికి ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా.. ఆ సంస్థకు చెందిన కీలక వ్యక్తుల హత్యలు జరిగినప్పుడల్లా హఫీజ్ సయ్యద్ పేరు కూడా చర్చకు వస్తోంది.భారత్‌పై పాక్ ఆరోపణలు..ఈ వరుస హత్యలపై పాకిస్థాన్‌లోని కొందరు అధికారులు, ఉగ్రవాద సంస్థలకు చెందిన వ్యక్తులు భారత నిఘా వ్యవస్థపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అయితే భారత్ ఈ ఆరోపణలను ఖండించింది. 2024లోనూ పాకిస్థాన్‌లో ఉగ్రవాదులతో సంబంధాలున్న పలువురి హత్యల వెనుక భారత్ ఉందంటూ ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో పాకిస్థాన్ అధికారులు కనీసం ఎనిమిది హత్యలను భారత్‌తో ముడిపెట్టారు. అయితే వాటిలో వేటికి ఆధారాలు మాత్రం చూపించలేదు. ‘ధురంధర్’ను తలపించే సీన్..పాక్‌లో గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నవాళ్లు మరణించడం కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తోంది. అయితే ఆ హత్యలన్నీ చాలా డ్రామటిక్‌గా జరుగుతుండడం గమనార్హం. ఇప్పుడు కరాచీ ఘటనలోనూ నలుగురు వ్యక్తులు బైక్‌లపై వచ్చి టార్గెట్‌పై కాల్పులు జరిపి క్షణాల్లో అక్కడి నుంచి వెళ్లిపోవడం.. గతంలో నమోదైన కొన్ని మిస్టరీ కిల్లింగ్స్‌ను గుర్తు చేస్తోంది. అందుకే సోషల్ మీడియాలో ‘ధురంధర్’ సినిమా తరహా చర్చ మొదలైంది. అంతేకాదు.. ఈ కొత్త ఘటనలతో ‘ధురంధర్-3’ ప్లాన్ చేయాలంటూ కొందరు ఆదిత్య ధర్‌ను రిక్వెస్ట్ చేస్తూ నెట్టింట ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఇదే సమయంలో.. పాకిస్థాన్‌లో ఉగ్రవాద సంస్థల మధ్య అంతర్గత వైరం, ప్రత్యర్థి గ్రూపుల దాడులు, స్థానిక నేరగాళ్ల పాత్ర వంటి ఇతర కోణాలూ చర్చకు వస్తుంటాయి. పైగా ఆ దేశంలో ఇలాంటి హత్యలు కొత్తేమీ కాదు. కరాచీ గతంలో రాజకీయ, జాతి, మతపరమైన హింసకు కేంద్రంగా నిలిచింది. 2011లోనే నగరంలో జరిగిన వరుస టార్గెట్ కిల్లింగ్స్‌లో ఒక్క జూలై నెలలోనే 300 మందికి పైగా మరణించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఆ హింసకు రాజకీయ, జాతి, మతపరమైన కారణాలు ముడిపడి ఉన్నాయని అప్పటి నివేదికలు పేర్కొన్నాయి.ఇదీ చదవండి: ప్చ్.. గాడిదలపైనే భారం వేసిన పాక్ -
మధ్యంతర ఎన్నికల వేళ.. ట్రంప్‌కు బిగ్ షాక్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పోస్టు ద్వారా ఓటు వేసే అమెరికన్లకు ఇకపై కొత్త నిబంధనలు పెట్టాలన్న ట్రంప్ ప్రభుత్వ ప్రయత్నానికి కోర్టు అడ్డుకట్ట వేసింది. నవంబర్‌లో జరగనున్న మధ్యంతర ఎన్నికలకు ముందే ఈ నిబంధనలను అమలు చేయాలని ప్రభుత్వం భావించినా.. సర్వోన్నత న్యాయస్థానం అందుకు అనుమతించలేదు. దీంతో మెయిల్ బ్యాలెట్లపై ట్రంప్ ప్రభుత్వం తీసుకురావాలనుకున్న మార్పులు ప్రస్తుతానికి నిలిచిపోయాయి.ట్రంప్ మార్చిలో జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆధారంగా యూఎస్ పోస్టల్ సర్వీస్ (USPS) కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. వీటి ప్రకారం.. మెయిల్ బ్యాలెట్లు పొందే ఓటర్ల జాబితాలను రాష్ట్రాలు పోస్టల్ సర్వీస్‌కు అందించాలి. అలాగే బ్యాలెట్లను పంపేందుకు, తిరిగి స్వీకరించేందుకు USPS ఆమోదించిన ప్రత్యేక కవర్లనే ఉపయోగించాలి. వాటిపై ప్రత్యేక బార్కోడ్ ఉండాలి. రాష్ట్రాలు అందించే జాబితాలో పేరు లేని ఓటర్ల బ్యాలెట్లను లేదంటే నిబంధనలకు అనుగుణంగా లేని బ్యాలెట్లను పోస్టల్ సర్వీస్ తిరస్కరించే అవకాశం ఉండేది.కోర్టుల తలుపు తట్టిన రాష్ట్రాలుఈ నిబంధనలపై డెమొక్రాట్ల పాలనలో ఉన్న పలు రాష్ట్రాలు, వాషింగ్టన్ డీసీతో పాటు ఓటింగ్ హక్కుల సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. కొత్త నిబంధనల వల్ల చట్టబద్ధంగా ఓటు వేసే వేలాది మంది ఓటర్ల బ్యాలెట్లు కూడా తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని, ఎన్నికల సమయంలో గందరగోళం తలెత్తుతుందని వారు వాదించారు.బోస్టన్లోని ఫెడరల్ జడ్జి ఇందిరా తల్వానీ సెప్టెంబర్ 4న ఈ నిబంధనల అమలును నిలిపివేశారు. ఎన్నికల నిర్వహణలో రాష్ట్రాలకే ప్రధాన అధికారం కల్పించే అమెరికా రాజ్యాంగానికి ఈ నిబంధనలు విరుద్ధంగా ఉండే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కొత్త విధానాలను అమలు చేయడం రాష్ట్రాలకు ఆచరణాత్మకంగా కూడా కష్టమని తెలిపారు.దీనిపై ట్రంప్ ప్రభుత్వం అప్పీల్ చేసినా.. 1వ యూఎస్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ కూడా దిగువ కోర్టు ఆదేశాలను నిలిపివేయడానికి నిరాకరించింది. కొత్త నిబంధనల వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని, అదే సమయంలో ఓటింగ్ మోసాలను అడ్డుకోవడంలో పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది.సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బకింది కోర్టులతో చుక్కెదురు కావడంతో.. ట్రంప్ ప్రభుత్వం సెప్టెంబర్ 6న అత్యవసర పిటిషన్‌తో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మెయిల్ వ్యవస్థను ఎన్నికల మోసాలకు ఉపయోగించకుండా అడ్డుకోవడానికి ఈ నిబంధనలు అవసరమని వాదించింది. అయితే సుప్రీంకోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో దిగువ కోర్టు విధించిన నిషేధం కొనసాగనుంది.ఈ నిర్ణయంపై ఇద్దరు కన్జర్వేటివ్ న్యాయమూర్తులు శామ్యూల్ అలిటో, క్లారెన్స్ థామస్ భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. నిబంధనలపై ప్రభుత్వం చేస్తున్న అప్పీల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని అలిటో అభిప్రాయపడ్డారు. మరోవైపు జస్టిస్ బ్రెట్ కవనాగ్.. USPSకు ఇలాంటి నిబంధనలు రూపొందించే అధికారం ఉండే అవకాశం ఉందని పేర్కొన్నప్పటికీ, 2026 ఎన్నికలకు ముందు రాష్ట్రాలు, స్థానిక ఎన్నికల అధికారులు వాటిని అమలు చేసేందుకు తగిన సమయం లేదన్నారు.మెయిల్ ఓటింగ్‌పైనే ఎందుకింత ఫోకస్?అమెరికా ఎన్నికల్లో మెయిల్ ద్వారా ఓటింగ్‌కు గణనీయమైన ప్రాధాన్యం ఉంది. దేశంలోని మొత్తం 50 రాష్ట్రాల్లో ఏదో ఒక రూపంలో మెయిల్ ఓటింగ్ అందుబాటులో ఉంది. 29 రాష్ట్రాల్లో ఎలాంటి కారణం చెప్పకుండానే ఓటర్లు మెయిల్ బ్యాలెట్ కోరుకోవచ్చు. మరో ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తిగా మెయిల్ విధానంలోనే జరుగుతున్నాయి.డెమొక్రాటిక్ ఓటర్లు మెయిల్ బ్యాలెట్లను రిపబ్లికన్ల కంటే ఎక్కువగా ఉపయోగిస్తారని పలు సర్వేలు సూచిస్తున్నాయి. దీంతో నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికలకు ముందు మెయిల్ ఓటింగ్‌పై విధించే ఆంక్షలు రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాంగ్రెస్‌పై నియంత్రణ కోసం రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య హోరాహోరీ పోరు జరుగుతున్న సమయంలో ఈ తీర్పు వెలువడింది.ట్రంప్ చాలాకాలంగా మెయిల్ ఓటింగ్ భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అమెరికా ఎన్నికల్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని ఆయన గతంలో చేసిన పలు ఆరోపణలకు ఆధారాలు లేవని విమర్శలు వచ్చాయి. ఆసక్తికరంగా.. ట్రంప్ స్వయంగా కూడా గతంలో మెయిల్ ద్వారా ఓటు వేశారు.మెయిల్ బ్యాలెట్లపై పోరాటం ట్రంప్ పరిపాలనకు, రాష్ట్రాల అధికారాలకు మధ్య జరుగుతున్న విస్తృత న్యాయపోరులో మరో కీలక పరిణామంగా మారింది. ఎన్నికల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎంతవరకు ఉండాలన్న ప్రశ్నను కూడా ఈ వివాదం మరోసారి ముందుకు తెచ్చింది.ఇదీ చదవండి: అంతా బూటకం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు -
Delhi: వెనక్కి వచ్చి మరీ డ్రైవర్‌కు థ్యాంక్స్ చెప్పిన యువరాజు
పెద్దల నుంచి సామాన్యుల వరకు.. ఎవరినైనా గౌరవించే తీరు ప్రత్యేకమే. అలాంటి ఓ చిన్న పని ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ చేసిన ఈ చిన్న పని.. ఆయన వినయానికి నిదర్శనంగా నిలిచింది.18వ బ్రిక్స్ సదస్సు కోసం భారత్‌కు వచ్చిన ఆయన.. సెప్టెంబర్ 12న ఢిల్లీ నుంచి తిరిగి వెళ్లే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానాశ్రయానికి బయలుదేరేందుకు కారులో నుంచి దిగిన షేక్ ఖలీద్.. అక్కడున్న అధికారులకు వీడ్కోలు చెబుతున్నారు. ఇంతలో తనను తీసుకొచ్చిన డ్రైవర్‌కు మాత్రం చెప్పకుండా వెళ్లిపోతున్నానని గుర్తించారు.వెంటనే వెనక్కి తిరిగిన ఆయన.. కారు వద్దకు వెళ్లి డ్రైవర్‌తో చేతులు కలిపారు. కాసేపు అతడితో మాట్లాడి మరీ వీడ్కోలు చెప్పారు. ఆ డ్రైవర్ భారతీయుడని ఏఎన్ఐ తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.‘చిన్న పని.. పెద్ద మనసు!’యువరాజు చేసిన ఈ చిన్న పనిని నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు. హోదా, స్థాయి చూడకుండా డ్రైవర్‌ను ప్రత్యేకంగా పలకరించడాన్ని ఆయన వినయానికి నిదర్శనంగా అభివర్ణిస్తున్నారు. ‘ఇదే అసలైన క్లాస్’ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు యూఏఈ వ్యవస్థాపకుడు షేక్ జాయెద్ విలువలను ఈ ఘటన గుర్తుచేస్తోందని పేర్కొన్నారు.భారత్ పర్యటనలో భాగంగా షేక్ ఖలీద్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇంధన సరఫరాలు, వాణిజ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్థిక సహకారం, విద్య, పర్యాటకం తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. హైదరాబాద్ హౌస్‌లో జరిగిన భేటీలో భారత్–యూఏఈ బంధాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపైనా చర్చించారు.18వ బ్రిక్స్ సదస్సు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగింది. ‘బిల్డింగ్ రెసిలియెన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ’ అనే థీమ్‌తో జరిగిన ఈ సదస్సుకు 13 మంది ప్రపంచ నేతలు, 17 ప్రతినిధి బృందాలు హాజరయ్యాయి.అయితే అంతర్జాతీయ స్థాయి సమావేశాలు, కీలక చర్చల మధ్య.. ఒక భారతీయ డ్రైవర్‌కు స్వయంగా వెనక్కి వెళ్లి వీడ్కోలు చెప్పిన అబుదాబి యువరాజు తీరు మాత్రం ప్రత్యేకంగా నిలిచింది.#WATCH | Delhi: Crown Prince of Abu Dhabi, Sheikh Khaled bin Mohamed bin Zayed Al Nahyan departs from India after BRICS Summit 2026. pic.twitter.com/cw3XPOlTTz— ANI (@ANI) September 12, 2026 -
వినాయకుడికి అంత రహస్య పూజలెందుకు?
వినాయక చవితి వచ్చిందంటే మన దేశంలో ఎక్కడ చూసినా గణనాథుడి సందడే కనిపిస్తుంది. వీధివీధినా మండపాలు.. ఇంటింటా బొజ్జ గణపయ్య ప్రతిమలు.. ఘనంగా పూజలు.. నైవేద్యాలు.. నిమజ్జనాలు. కానీ మనకు ఎంతో పరిచయమైన ఈ విఘ్నేశ్వరుడు మరో దేశంలో మాత్రం పూర్తిగా భిన్నమైన రూపంలో పూజలు అందుకుంటున్నాడు. మరీ ముఖ్యంగా.. ఆ గణేశుడి విగ్రహాన్ని అందరికీ చూపించరు. పూజా విధానాలనూ రహస్యంగానే నిర్వహిస్తారు. ఇంతకీ ఆ దేశం ఏది? ఆ వింత గణేశుడి కథేంటి?జపాన్‌లో గజరాజు రూపంతో ఉన్న దైవాన్ని పూర్తి భిన్నమైన సంప్రదాయం ఉంది. అక్కడ ఆయన్ని కాంగిటెన్.. షోటెన్ అనే పేర్లతో పూజిస్తారు. అంతేకాదు.. అక్కడి ఓ ప్రత్యేక రూపంలో రెండు ఏనుగు ముఖాలున్న దేవతలు ఒకరినొకరు కౌగిలించుకున్నట్లుగా కనిపిస్తారు. ఈ విగ్రహాన్ని బహిరంగంగా ప్రదర్శించరు. పూజా విధానాలను కూడా రహస్యంగానే నిర్వహిస్తారు. జపాన్ బౌద్ధ సంప్రదాయాల్లో వినాయకుడి కథ ఆసక్తికరమైన మలుపులతో కనిపిస్తుంది.తొలుత దుష్ట శక్తిగా..కొన్ని పురాతన బౌద్ధ గ్రంథాల్లో కాంగిటెన్ అనేది అడ్డంకులు సృష్టించే దుష్ట శక్తిగా పేర్కొని ఉంది. అతడిని ‘గజరాజుగా’, మనుషులకు ఇబ్బందులు కలిగించే శక్తిగా భావించేవారు. అందుకే అతడిని అదుపులోకి తీసుకురావడానికి ప్రత్యేక మంత్రాలు, ఆచారాలు ఉపయోగించేవారు. అయితే తర్వాతి సంప్రదాయాల్లో కథ పూర్తిగా మారుతుంది.వినాయకుడి ఉగ్ర స్వభావాన్ని శాంతింపజేయడానికి కన్నోన్.. స్త్రీ వినాయక రూపంలో ప్రత్యక్షమయ్యాడని ఓ కథనం చెబుతుంది. ఆమెను చూసిన వినాయకుడు ఆకర్షితుడవుతాడు. అయితే ఆమెను తన సహచరిగా అంగీకరించాలంటే చెడు మార్గాన్ని విడిచిపెట్టి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాలని షరతు పెడుతుంది. వినాయకుడు అంగీకరించడంతో ఆమె అతడిని కౌగిలించుకుంటుంది. ఆ క్షణంతో అతడి ఉగ్ర స్వభావం శాంతించి.. దుష్ట శక్తి నుంచి రక్షక దేవతగా మారినట్లు కథనం.అందుకే కౌగిలింత రూపం!ఈ కథతోనే కాంగిటెన్ ప్రత్యేక రూపానికి సంబంధించిన భావనను అనుసంధానిస్తారు. రెండు ఏనుగు ముఖాలున్న రూపాలు ఒకదానినొకటి కౌగిలించుకున్నట్లుగా కనిపిస్తాయి. ఇది కేవలం ప్రేమకు సంబంధించిన ప్రతీకగా కాకుండా.. భిన్న శక్తుల ఏకత్వం, ఉగ్రతను శాంతింపజేయడం, సామరస్యం, సంపూర్ణతకు సంకేతంగా వివరిస్తారు. అందుకే ఈ రూపం సాధారణ గణేశుడి విగ్రహాలకు భిన్నంగా ఉంటుంది.ఎందుకంత రహస్య పూజ?కాంగిటెన్ ఆరాధన జపాన్‌లోని ఎసోటెరిక్ బౌద్ధ సంప్రదాయాలతో ముడిపడి ఉంది. ఒకప్పుడు దుష్ట శక్తిగా భావించిన వినాయకుడి ఆరాధనలో ప్రత్యేక మంత్రాలు, దీక్షతో చేసే కర్మకాండలు అభివృద్ధి చెందాయి. అందుకే కాంగిటెన్ విగ్రహాలను చాలాచోట్ల తెర వెనుక లేదంటే ప్రత్యేక పెట్టెల్లో ఉంచుతారు. సాధారణ భక్తులకు వాటిని నేరుగా చూపించరు. కొన్ని అత్యంత ముఖ్యమైన పూజలను దీక్ష పొందిన బౌద్ధ సన్యాసులే నిర్వహిస్తారు. ఈ రహస్యత్వమే కాంగిటెన్ ఆరాధనకు ప్రత్యేక గుర్తింపుగా మారింది. పూజలు, నైవేద్యం కూడా చాలా ప్రత్యేకం..కాంగిటెన్కు సమర్పించే నైవేద్యాల్లో డైకాన్ ముల్లంగికు ప్రత్యేక స్థానం ఉంది. ముల్లంగితో పాటు జపాన్ సంప్రదాయ బియ్యం మద్యం సేక్ను కూడా సమర్పిస్తారు. ఇక అత్యంత ఆసక్తికరమైన నైవేద్యం ‘కాంగిదాన్’. ఇది ఎర్రబీన్స్ పూర్ణంతో నింపి నూనెలో వేయించే తీపి పదార్థం. భారతీయ సంప్రదాయంలోని మోదకాన్ని పోలిన ఈ స్వీట్‌ను కాంగిటెన్కు ఇష్టమైన నైవేద్యంగా భావిస్తారు.డైకాన్ సమర్పణ వెనుక కూడా ఒక ప్రతీకాత్మక అర్థం ఉంది. బౌద్ధ సంప్రదాయంలో మనిషిని వేధించే ప్రతికూల భావాల్లో ఒకటైన ద్వేషాన్ని తొలగించడాన్ని ముల్లంగి సమర్పణ సూచిస్తుందని భావిస్తారు. అందుకే జపాన్‌లోని కాంగిటెన్ ఆలయాల్లో డైకాన్ బొమ్మలు, గుర్తులు కనిపిస్తుంటాయి. కొన్ని ఆలయాల్లో ముల్లంగికి సంబంధించిన ప్రత్యేక ఉత్సవాలూ నిర్వహిస్తారు.ఇక కాంగిటెన్ పూజల్లో అత్యంత రహస్యమైన ఆచారాల్లో ‘ఆయిల్ బాత్ రిట్యువల్’ (Yokuyu-ku) ఒకటి. విగ్రహంపై పవిత్రమైన నువ్వుల నూనెను నిర్దిష్ట విధానంలో పోస్తూ చేసే ఈ పూజను సాధారణంగా దీక్ష పొందిన సన్యాసులే నిర్వహిస్తారు. వినాయకుడి పాత దుష్ట స్వభావాన్ని శుద్ధి చేసి.. అతడిని ధర్మ మార్గంలోకి తీసుకువచ్చిన ప్రక్రియకు ఇది ప్రతీకగా భావిస్తారు.అలా మన దగ్గర విఘ్నాలను తొలగించే గణపయ్య.. జపాన్‌లో మాత్రం ఒకప్పుడు విఘ్నాలు సృష్టించే శక్తిగా పేరొందాడు. కాలక్రమంలో కాంగిటెన్ అనే రహస్య దైవంగా ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. ఒకే గణేశుడికి దేశానికో రూపం.. సంప్రదాయానికో కథ.. ఇదే వినాయక ఆరాధనలోని విశేషం!.ఇదీ చదవండి: ఎల్లలు లేవని దేవుడు ఈయన! -
ఏఐ బండి కొంచెం మెల్లగా.. ట్రంప్ భయం నిజమేనా?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విషయంలో ప్రపంచం ఇప్పుడు ఒక విచిత్రమైన మలుపు వద్ద నిలిచింది. ఒకవైపు.. ఏఐ అభివృద్ధి వేగాన్ని కాస్త తగ్గించి, భద్రతా ప్రమాణాలు పెంచాలని టెక్ రంగంలోని ప్రముఖులు చెబుతున్నారు. మరోవైపు.. ఇదే సమయంలో అమెరికా వెనక్కి తగ్గితే చైనా ముందుకు దూసుకెళ్లి ప్రపంచ ఏఐ ఆధిపత్యాన్ని చేజిక్కించుకునే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్నారు. మరి ఎవరి వాదనలో నిజమెంత? ఎవరిది కరెక్ట్?..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విషయంలో అమెరికాలో మొదలైన చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. మరింత శక్తిమంతమైన ఏఐ మోడళ్ల అభివృద్ధిని కాస్త నెమ్మదించి.. వాటి భద్రతపై ఎక్కువ దృష్టి పెట్టాలని టెక్ రంగంలోని కొందరు దిగ్గజాలు చెబుతున్నారు. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఏఐ రేసులో అమెరికా వేగం తగ్గిస్తే.. ఆ ఖాళీని చైనా భర్తీ చేసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు. ‘ఎవరు ఏఐలో గెలిస్తే.. భవిష్యత్తులో వాళ్లదే పైచేయి’ అన్నది ట్రంప్ లెక్క. మరి నిజంగా అమెరికా ఏఐ అభివృద్ధికి బ్రేకులు వేస్తే చైనా ముందుకు వెళ్లిపోతుందా? లేక వేగం పేరుతో భద్రతను పక్కన పెడితే ముప్పు మరింత పెరుగుతుందా?టెక్ దిగ్గజాలు చెబుతున్నది ఇదే..ఇక్కడ ముందుగా ఒక అపోహను తొలగించుకోవాలి. ఏఐ కంపెనీలు అభివృద్ధిని పూర్తిగా నిలిపేయాలని కోరుకోవడం లేదు. మరింత శక్తిమంతమైన మోడళ్లను తయారు చేసే పోటీలో భద్రతా పరీక్షలు, పర్యవేక్షణ, ప్రమాదాల అంచనాలను కూడా తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాలని అంటున్నాయి. ఓపెన్ఏఐ (OpenAI) సీఈవో సామ్ ఆల్ట్‌మన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అమెరికా కంపెనీల మధ్య పోటీ ఎంత తీవ్రంగా ఉన్నా.. అందుకోసం నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి అది కారణం కాదని చెప్పారు. ఏఐ సామర్థ్యాలు పెరిగే వేగం కంటే.. వాటి భద్రత, పర్యవేక్షణ వ్యవస్థలు ముందుండాలని ఆయన అభిప్రాయపడ్డారు.ఏఐపై ప్రభుత్వ నియంత్రణ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదని కూడా ఆల్ట్‌మన్ పేర్కొన్నారు. కంపెనీలు తమంతట తామే బాధ్యతాయుతమైన విధానాలను అమలు చేయవచ్చని చెప్పారు. స్వతంత్ర సంస్థలతో భద్రతా పరీక్షలు చేయించుకోవాలన్న ఆంథ్రోపిక్(Anthropic) సీఈవో డారియో ఎమోడీ ప్రతిపాదనకు కూడా ఆయన మద్దతు తెలిపారు.ఇదే ఈ మొత్తం చర్చలో అత్యంత కీలకమైన అంశం. ఆల్ట్‌మన్ చెబుతున్న ‘పేసింగ్’ అంటే ఏఐ అభివృద్ధిని నిలిపివేయడం కాదు. భద్రతా పరీక్షలు, మానిటరింగ్, ప్రమాదాల అంచనాలు వంటి వాటికి సమయం పడుతుంది కాబట్టి.. సాధ్యమైనంత వేగంగా కాకుండా కొంత బాధ్యతాయుతమైన వేగంతో ముందుకు వెళ్లడమే. అంటే.. కారు ఆపేయడం కాదు.. వేగానికి బ్రేకులు, స్టీరింగ్ రెండూ ఉండాలన్నమాట.ఆందోళనలో ట్రంప్ ట్రంప్ ఆలోచనలో మరో కోణం ఉంది. ఏఐ ఇప్పుడు కేవలం టెక్నాలజీ కాదు. ఆర్థిక వ్యవస్థ, రక్షణ, సైబర్ భద్రత, పరిశ్రమలు, అంతర్జాతీయ ప్రభావం.. ఇలా అనేక రంగాలపై దాని ప్రభావం ఉండబోతోంది. అమెరికా కంపెనీలు వేగం తగ్గిస్తే.. చైనా సంస్థలు అదే సమయంలో వేగంగా ముందుకు సాగితే భవిష్యత్తులో వ్యూహాత్మక ఆధిపత్యం మారే అవకాశం ఉందన్నది ఆయన భయం. అందుకే ఏఐపై కఠినమైన నియంత్రణలు విధించే ఆలోచనను ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. అమెరికా ఆగితే చైనా ఆగదు అన్నదే ఆయన వాదన.చైనా నిజంగానే అమెరికాను దాటేస్తుందా?ఇది మాత్రం అంత సులభమైన ప్రశ్న కాదు. చైనా ఏఐ రంగంలో వేగంగా ఎదుగుతోంది. తక్కువ ఖర్చుతో శక్తిమంతమైన మోడళ్లను రూపొందించే సామర్థ్యాన్ని చైనా కంపెనీలు చూపిస్తున్నాయి. మరోవైపు అమెరికాకు OpenAI, Google, Anthropic వంటి ప్రపంచస్థాయి సంస్థలు, భారీ ప్రైవేట్ పెట్టుబడులు, అధునాతన చిప్ టెక్నాలజీ, క్లౌడ్ మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అందువల్ల అమెరికా కొంత నెమ్మదిస్తే చైనా వెంటనే అమెరికాను దాటేస్తుంది అనడం అతిశయోక్తి. కానీ ఏఐ రేసులో వేగం పూర్తిగా కోల్పోతే.. ప్రత్యర్థి దేశాలకు ఆ అవకాశాన్ని ఇవ్వొచ్చన్న ట్రంప్ ఆందోళన మాత్రం పూర్తిగా కొట్టిపారేయలేం.అసలు భయం ఏంటంటే..ఆల్ట్‌మన్ మాత్రం ఏఐ విషయంలో రెండు ‘నైట్మేర్’ పరిస్థితులను ప్రస్తావించారు. మొదటిది.. ఏదో ఒక దశలో మనుషులు ఏఐపై నియంత్రణ కోల్పోవడం. ఏఐ సామర్థ్యాలు పెరుగుతున్న వేగానికి భద్రతా వ్యవస్థలు సరిపోకపోతే ఇది తీవ్రమైన సమస్యగా మారొచ్చు. రెండో ప్రమాదం.. అత్యంత శక్తిమంతమైన ఏఐ ఒకే వ్యక్తి లేదా ఒకే కంపెనీ చేతుల్లోకి వెళ్లడం. అలా జరిగితే ఆ సంస్థ లేదంటే వ్యక్తి తన అభిప్రాయాలు, విలువలను ప్రపంచంపై బలవంతంగా రుద్దే స్థాయికి వెళ్లే ప్రమాదం ఉందని ఆల్ట్‌మన్ హెచ్చరించారు.ఇదే కారణంగా Anthropicలోని కొందరు పరిశోధకులు కూడా ఏఐ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత శక్తిమంతమైన మోడళ్లు మనుషులకు తీవ్రమైన ముప్పుగా మారే అవకాశాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.ఏఐపై బ్రేకులు.. నాదెళ్లదీ అదే మాట!ఏఐ అభివృద్ధి వేగంపై టెక్ దిగ్గజాల మధ్య చర్చ ముదురుతోంది. తాజాగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఏఐని ఆపేయాలని తాను చెప్పడం లేదన్న నాదెళ్ల.. మానవ నియంత్రణలో, మానవాళికి ఉపయోగపడే ఏఐనే అభివృద్ధి చేయాలని అన్నారు. సూపర్ ఇంటెలిజెన్స్ దిశగా వెళ్లే ముందు భద్రతా వ్యవస్థలను పటిష్టం చేయాలని, స్వతంత్ర సంస్థలతో ఏఐ మోడళ్లను పరీక్షించి పర్యవేక్షించాలని సూచించారు. ఏఐ కొద్దిమంది సంస్థల చేతుల్లోనే కేంద్రీకృతం కాకూడదని నాదెళ్ల అభిప్రాయపడ్డారు. దేశాలు, పరిశ్రమలు, విద్యావేత్తలకు విస్తృత భాగస్వామ్యం ఉండాలని, ఓపెన్ సోర్స్ మోడళ్లకూ ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు.మరి ఎవరి వాదన కరెక్ట్?నిజానికి ట్రంప్‌ది కూడా పూర్తిగా తప్పు కాదు.. టెక్ దిగ్గజాలదీ కాదు. అమెరికా ఏఐ అభివృద్ధిని పూర్తిగా నిలిపివేయడం వ్యూహాత్మకంగా ప్రమాదకరం. అదే సమయంలో ‘చైనాను ఓడించాలి’ అనే పోటీలో భద్రతా ప్రమాణాలను పక్కన పెట్టడం కూడా అంతే ప్రమాదకరం. కాబట్టి సరైన మార్గం ఏఐని ఆపడం కాదు.. నియంత్రిత వేగంతో ముందుకు తీసుకెళ్లడం. కొత్త మోడళ్ల విడుదలకు ముందు స్వతంత్ర భద్రతా పరీక్షలు, నిరంతర పర్యవేక్షణ, దుర్వినియోగాన్ని అడ్డుకునే వ్యవస్థలు, అంతర్జాతీయ ప్రమాణాలు అవసరం. అదే సమయంలో పరిశోధన, పెట్టుబడులు, సాంకేతిక అభివృద్ధి ఆగకూడదు.అంతిమంగా ఇది అమెరికా–చైనా మధ్య ఎవరు ముందు అనే పోటీ మాత్రమే కాదు. ఏఐని ఎవరు ముందుగా తయారు చేస్తారన్నదానికంటే.. దాన్ని ఎవరు సురక్షితంగా నియంత్రిస్తూ ప్రపంచానికి ఉపయోగపడేలా చేస్తారన్నదే అసలు పోటీ. వేగం అమెరికాకు అవసరం.. కానీ ఆ వేగానికి బ్రేకులు లేకపోతే అదే భవిష్యత్తులో అతిపెద్ద సమస్యగా మారొచ్చు.ఇదీ చదవండి: హర్ముజ్‌లో మారిన సీన్.. అయోమయంలో ట్రంప్ -
హర్ముజ్ సంక్షోభంలో బిగ్ ట్విస్ట్.. అనూహ్య పరిణామాలు!
పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ.. ప్రపంచాన్ని కలవరపెడుతున్న హర్ముజ్ జలసంధి సంక్షోభం మరింత కష్టతరంగా మారుతోంది. ఇప్పటికే దిగ్భందనాలు, సముద్ర రవాణాపై ఆంక్షలు, నౌకలపై దాడులు, చమురు సరఫరాకు అంతరాయాలతో పరిస్థితి ఆందోళనకరంగా మారగా.. మరోవైపు ఈ సమస్యకు దౌత్యపరమైన పరిష్కారం చూపేందుకు జరుగుతున్న ప్రయత్నాలపైనా అనిశ్చితి నెలకొంది. సమస్యను చర్చల ద్వారా చక్కదిద్దేందుకు కీలకమైన సమావేశం జరగాల్సి ఉండగా.. చివరి నిమిషంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు, భద్రత, భవిష్యత్ నిర్వహణపై ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్య ఒమన్‌లో సోమవారం కీలక సమావేశం జరగాల్సి ఉంది. అయితే ఈ భేటీని వాయిదా వేస్తున్నట్లు ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్ బుసైదీ ప్రకటించారు. ప్రాంతీయ దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొత్త తేదీని మాత్రం ప్రకటించలేదు. ఇటు ఇరాన్ కూడా సమావేశం వాయిదా పడిన విషయాన్ని ధ్రువీకరించింది. కొన్ని దేశాల అభ్యర్థన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఒమన్‌తో సమన్వయం చేసుకుని తదుపరి తేదీని ఖరారు చేస్తామని తెలిపింది.తద్వారా.. హర్ముజ్‌పై ఒక తాత్కాలిక అవగాహనకు రావాల్సిన సమయంలోనే దౌత్య ప్రక్రియకు బ్రేక్ పడినట్టయింది. అసలు సమస్య ఇదే..హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాకు అత్యంత కీలకమైన మార్గం. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ మార్గంలో నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రపంచ ఇంధన సరఫరాపైనా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఇరాన్, ఒమన్ మధ్య హర్ముజ్‌లో రాకపోకలను సాధారణ స్థితికి తీసుకొచ్చే మార్గాలపై ఇప్పటికే పలు దఫాల చర్చలు జరిగాయి. ఇప్పుడు గల్ఫ్ దేశాలను కూడా భాగస్వామ్యం చేసి ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.అయితే ఇరాన్ వైఖరి మాత్రం స్పష్టంగా ఉంది. అమెరికా తమపై దాడులు, బెదిరింపులు, ఇతర ఒత్తిళ్లు కొనసాగిస్తున్నంతకాలం జలసంధిలో రాకపోకలను పూర్తిగా సాధారణ స్థితికి తీసుకురావడం సాధ్యం కాదని ఆ దేశం చెబుతోంది. అంటే.. గల్ఫ్ దేశాలతో ఇరాన్ ఒక అవగాహనకు వచ్చినా, అమెరికా–ఇరాన్ మధ్య ప్రధాన వివాదం పరిష్కారం కాకపోతే హర్ముజ్‌లో పూర్తి స్థాయిలో రాకపోకలు పునరుద్ధరించడం కష్టమే. అందుకే ఇప్పుడు గల్ఫ్ దేశాలతో జరిగే చర్చలతోపాటు అమెరికా–ఇరాన్ మధ్య దౌత్యపరమైన పరిష్కారం కూడా కీలకంగా మారింది.నౌకపై దాడితో మరింత టెన్షన్ఈ దౌత్య ప్రయత్నాలకు సమాంతరంగానే హర్ముజ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఓ వాణిజ్య నౌకను ప్రాజెక్టైల్ తాకడంతో మంటలు చెలరేగాయి. సిబ్బందిని నౌక నుంచి తరలించాల్సి వచ్చింది. ఇరాన్ అధికారిక వర్గాల ప్రకారం.. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. దీంతో కీలక సముద్ర మార్గంలో నౌకల భద్రతపై ఆందోళనలు మరింత పెరిగాయి.హర్ముజ్‌లో రాకపోకలు ఇప్పటికే భారీగా తగ్గిపోయాయి. ఇక్కడ పరిస్థితి మరింత దిగజారితే ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే ఈ జలసంధిపై ఏ చిన్న పరిణామం జరిగినా అంతర్జాతీయ చమురు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడుతోంది.సౌదీ పైప్‌లైన్‌పైనా దాడిహర్ముజ్ సంక్షోభానికి తోడు సౌదీ అరేబియాలోని కీలక చమురు మౌలిక సదుపాయాలపైనా దాడులు జరగడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. తూర్పు ప్రాంతాల నుంచి ఎర్ర సముద్ర తీరంలోని యన్బుకు చమురును తరలించే ఈస్ట్–వెస్ట్ పైప్‌లైన్‌పై డ్రోన్ దాడులు జరిగాయి. దీంతో ఆ మార్గంలో చమురు సరఫరా నిలిచిపోయింది.హర్ముజ్ ద్వారా రవాణా దెబ్బతిన్న సమయంలో ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడే ఈ పైప్‌లైన్ కూడా పనిచేయకపోవడం మార్కెట్లలో ఆందోళన పెంచింది. ఇప్పటికే హర్ముజ్ ఎఫెక్ట్‌తో రోజుకు మిలియన్ల బ్యారెళ్ల చమురు సరఫరా దెబ్బతినగా.. సౌదీ పైప్‌లైన్ మూసివేతతో ప్రపంచ సరఫరాపై మరింత ఒత్తిడి పెరిగే పరిస్థితి ఏర్పడింది.బాబ్ అల్ మాండెబ్లోనూ మంటలుమరోవైపు హర్ముజ్‌కు మరో కీలక ప్రత్యామ్నాయ సముద్ర మార్గమైన(ఎర్ర సముద్రం-Red Sea) బాబ్ అల్ మాండెబ్ జలసంధిలోనూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. యెమెన్‌లో హౌతీల దాడులు తీవ్రతరం కావడంతో సౌదీ అరేబియాపైనా ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన రెండు మార్గాలపైనా ఒకేసారి భద్రతా ముప్పు నెలకొంది.ఇలాంటి పరిస్థితుల్లో సౌదీ అరేబియా అమెరికా సాయం కోరినట్లు సమాచారం. హౌతీల పురోగతిని అడ్డుకోవడంలో అమెరికా మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అదే సమయంలో అమెరికా నుంచి ప్రస్తుతానికి నిఘా సమాచార సహకారానికే పరిమితమైన స్పందన కనిపిస్తోంది.ట్రంప్‌కు కొత్త చిక్కులుహర్ముజ్ జలసంధి మూసివేత, నౌకలపై వరుస దాడులు, సౌదీ చమురు మౌలిక సదుపాయాలపై దాడులు, బాబ్ అల్ మాండెబ్ వద్ద హౌతీల దూకుడు.. ఇలా సంక్షోభం ఒక్క హార్ముజ్కే పరిమితం కాకుండా ప్రాంతంలోని కీలక ఇంధన మార్గాలన్నింటికీ విస్తరిస్తోంది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఒత్తిడి మరింత పెరుగుతోంది. ఇరాన్‌తో యుద్ధం ఈ ఏడాదిలోనే ముగిసే అవకాశం ఉందని, ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉందని ట్రంప్ చెబుతున్నారు. యుద్ధం ముగిసిన వెంటనే ఇంధన ధరలు భారీగా తగ్గుతాయని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ట్రంప్ అంచనాలకు భిన్నంగా సాగుతున్నాయి. హర్ముజ్‌పై దౌత్య ప్రయత్నాలు వాయిదా పడటం, సముద్ర మార్గాల్లో నౌకలపై దాడులు కొనసాగడం, సౌదీ చమురు రవాణా మార్గానికి దెబ్బ తగలడం, మరోవైపు బాబ్ అల్ మాండెబ్ వద్ద హౌతీల పట్టు పెరగడం.. యుద్ధాన్ని త్వరగా ముగించాలన్న అమెరికా ప్రయత్నాలకు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. పైగా సౌదీ అరేబియా హౌతీలను ఎదుర్కొనేందుకు అమెరికా సైనిక సాయం కోరగా.. ఇప్పటివరకు వాషింగ్టన్ నిఘా సమాచార సహాయానికే పరిమితమైంది. దీంతో ఒకవైపు యుద్ధం ముగుస్తుందని ట్రంప్ చెబుతున్నా.. మరోవైపు సంక్షోభం మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తుండటం ఆయనకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. రాకెట్లా చమురు ధరలుహర్ముజ్ సంక్షోభం ఇలాగే కొనసాగితే దాని ప్రభావం పశ్చిమాసియాకే పరిమితం కాదు. ప్రపంచ చమురు సరఫరాలో గణనీయమైన భాగం ఈ ప్రాంతంలోని సముద్ర మార్గాలపై ఆధారపడి ఉంటుంది. సరఫరాకు అంతరాయం కొనసాగితే చమురు ధరలు మరింత పెరిగి.. రవాణా ఖర్చులు, ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా చేరింది. తాజా దాడులు, హర్ముజ్ చర్చల వాయిదాతో మార్కెట్లలో సరఫరా భయాలు మరింత పెరిగాయి. అందుకే ఇప్పుడు అందరి చూపూ హర్ముజ్‌పైనే. జలసంధిలో రాకపోకలు ఎప్పుడు సాధారణ స్థితికి వస్తాయి? ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్య దౌత్య ప్రయత్నాలు ఎప్పుడు మళ్లీ మొదలవుతాయి? అమెరికా–ఇరాన్ మధ్య ఎలాంటి అవగాహన కుదురుతుంది? అన్నదే కీలకంగా మారింది. ప్రస్తుతానికి మాత్రం చర్చలకు బ్రేక్ పడటంతో హర్ముజ్ సంక్షోభం మరింత ముదిరే సంకేతాలు కనిపిస్తున్నాయి.ఇదీ చదవండి: 45 వేల కోట్లు ఉంటేనే మళ్లీ మాములు స్థితికి! -
భారత్‌లో పుతిన్-జిన్‌పింగ్ ‘పవర్’ షో!
ప్రపంచ దేశాల అధినేతలు సదస్సులు, సమావేశాలకు వెళ్లినప్పుడు ప్రసంగాలకే కాదు.. వాళ్ల ప్రయాణాలు, భద్రత-ఆహార ఏర్పాట్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. వెంట తీసుకొచ్చే వస్తువులు, అందుకునే కానుకల వరకు ప్రతీ అంశంపైనా ఆసక్తికర చర్చ నడుస్తుంటుంది. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న 2026 బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ విషయంలో అంతకు మించిందేదో కనిపిస్తోంది.. ఇద్దరు నేతలు భారత్‌కు చేరుకున్న తీరు ఇప్పుడు ప్రత్యేక చర్చకు దారితీసింది. ఒకవైపు పుతిన్ అత్యంత భద్రతా ప్రమాణాలతో రూపొందించిన ఐఎల్-96-300పీయూలో ఢిల్లీకి వచ్చారు. దీనినే ‘డూమ్స్‌డే ప్లేన్’, ‘ఫ్లయింగ్ క్రెమ్లిన్’ వంటి పేర్లతో పిలుస్తారు. మరోవైపు ఎయిర్ చైనా ప్రత్యేక విమానంలో జిన్‌పింగ్ వచ్చారు. గగన ప్రయాణమే కాదు.. ఇటు వీళ్ల కోసం తెచ్చిన ప్రెసిడెన్షియల్ కార్లు కూడా అంతే ఆసక్తికరంగా ఉన్నాయి. పుతిన్ కోసం ఔరస్ సెనాట్.. జిన్‌పింగ్ కోసం సమ్‌థింగ్ స్పెషల్ హోంగ్‌చీ ఎన్701 హైలైట్‌గా నిలిచాయి. ఒకరిది ‘ఫోర్ట్రెస్ ఆన్ వీల్స్’గా పేరొందితే.. మరొకరి రాజకీయ చరిత్రతో ముడిపడిన ‘రెడ్ ఫ్లాగ్’ బ్రాండ్‌గా పేరొందాయి.‘ఫ్లయింగ్ క్రెమ్లిన్’..పుతిన్ ప్రయాణించే విమానం ఐఎల్-96-300పీయూ.. ఎంతో ప్రత్యేకం. అత్యవసర పరిస్థితుల్లోనూ రష్యా అధ్యక్షుడు దేశ సైనిక, ప్రభుత్వ వ్యవస్థలతో సురక్షితంగా కమ్యూనికేట్ చేయగలిగేలా దీన్ని మొబైల్ కమాండ్ సెంటర్‌గా రూపొందించారు. శాటిలైట్ లింకులు, ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్, రాడార్ జామింగ్ సహా పలు రక్షణ వ్యవస్థలు ఇందులో ఉంటాయి. అంతేకాదు.. పుతిన్ భారత్‌కు వచ్చినప్పుడు ఒకే తరహాకు చెందిన రెండు విమానాలు ఒకేసారి ప్రయాణించాయి. అసలు అధ్యక్షుడు ఏ విమానంలో ఉన్నారో గుర్తించడం కష్టమయ్యేలా చేసే ఈ వ్యూహం.. భద్రతలో భాగమే. అందుకే ఐఎల్-96-300పీయూకి ‘ఫ్లయింగ్ క్రెమ్లిన్’, ‘డూమ్స్‌డే ప్లేన్’ వంటి పేర్లు వచ్చాయి.ఫోర్ట్రెస్ ఆన్ వీల్స్..ఆకాశంలో ఇంతటి భద్రత ఉంటే.. పుతిన్ నేలపై ప్రయాణించే కారు కూడా అంతే కట్టుదిట్టంగా ఉంటుంది. ఢిల్లీలో పుతిన్ ఉపయోగించిన ఔరస్ సెనాట్‌ను అందుకే ‘ఫోర్ట్రెస్ ఆన్ వీల్స్’గా అభివర్ణిస్తారు. బుల్లెట్లు, పేలుళ్ల నుంచి రక్షణ కల్పించేలా రూపొందించిన ఈ ఆర్మర్డ్ లిమోసిన్‌ను రష్యా దేశీయంగా అభివృద్ధి చేసింది. పాశ్చాత్య లగ్జరీ కార్లపై ఆధారపడకుండా.. దేశాధ్యక్షుడి స్థాయికి తగ్గ భద్రతా వాహనాన్ని సొంతంగా తయారు చేసుకోగలిగింది. బ్రిక్స్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పుతిన్ ఇదే కారులో ప్రయాణించడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.జిన్‌పింగ్ ‘ఎయిర్ చైనా’..ఇక పుతిన్ విమానంతో పోలిస్తే జిన్‌పింగ్ ప్రయాణించిన విమానం మరో రకమైన ప్రత్యేకతను చూపిస్తుంది. చైనా అధ్యక్షుడు ఎయిర్ చైనా ప్రత్యేక విమానంలో భారత్‌కు చేరుకున్నారు. ఇది పుతిన్ ఐఎల్-96-300పీయూ తరహాలో మొబైల్ కమాండ్ సెంటర్‌గా రూపొందించిన ప్రత్యేక అధ్యక్ష విమానం కాదు. అయితే దేశాధ్యక్షుడి విదేశీ పర్యటన కావడంతో భద్రత, ప్రోటోకాల్‌కు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. అంటే.. ఒకరి విమానం అత్యంత రహస్య భద్రతా వ్యవస్థలకు ప్రతీక అయితే.. మరొకరి ప్రయాణం చైనా అధికారిక విమానయాన వ్యవస్థను ప్రతిబింబిస్తోంది.‘రెడ్ ఫ్లాగ్’ ఎన్701..విమానం నుంచి రోడ్డుపైకి వస్తే.. జిన్‌పింగ్ కోసం ఉపయోగించే హోంగ్‌చీ ఎన్701 మరో ప్రత్యేక ఆకర్షణ. హోంగ్‌చీ అంటే చైనీస్‌లో ‘రెడ్ ఫ్లాగ్’.. అంటే ‘ఎర్ర జెండా’ అని అర్థం. చైనా రాజకీయ, అధికార వ్యవస్థతో దశాబ్దాలుగా ముడిపడిన ఈ బ్రాండ్.. దేశ అత్యున్నత నాయకత్వానికి ప్రతీకగా మారింది. జిన్‌పింగ్ కోసం ఉపయోగించే ఎన్701 సాధారణ హోంగ్‌చీ కారు కాదు. సుమారు 5.5 మీటర్ల పొడవుండే ఈ ప్రత్యేక లిమోసిన్‌లో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్, భారీ ఆర్మర్, బుల్లెట్ ప్రూఫ్ టైర్లు వంటి భద్రతా ఏర్పాట్లు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే దీని పూర్తి సాంకేతిక వివరాలను చైనా అధికారికంగా వెల్లడించలేదు. అందుకే ఎన్701 చుట్టూ ఉన్న ఆసక్తి.. దాని డిజైన్ కంటే, దానిలో దాగి ఉన్న భద్రతా సాంకేతికతపైనే ఎక్కువ.కేవలం ప్రయాణం కాదు.. పవర్ స్టేట్మెంట్!ఈ విమానాలు, కార్లు కేవలం ప్రపంచ నేతలను ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లే సాధనాలు మాత్రమే కాదు. ఆ విమానాలు, కార్లు ఆయా దేశాల భద్రతా ఏర్పాట్లు, టెక్నాలజీ, సొంత తయారీ సామర్థ్యాన్ని చూపిస్తాయి. బ్రిక్స్ వంటి ప్రపంచ వేదికపై నేతల రాకతో పాటు వారి వెంట వచ్చిన ఈ ‘పవర్ మెషీన్లు’ కూడా తమదైన రీతిలో ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. ఆకాశంలో భద్రతా కోటలు.. నేలపై కదిలే కోటలు.. మొత్తంగా చూస్తే ఇది కేవలం నేతల ప్రయాణం కాదు.. రష్యా, చైనాల పవర్ స్టేట్మెంట్!.ఇదీ చదవండి: ఏడేళ్ల తర్వాత భారత్‌లో అడుగుపెట్టాడు! -
బ్రిక్స్ సదస్సు: భారత్‌లో అడుగుపెట్టిన జిన్‌పింగ్
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిక్స్ శిఖరాగ సదస్సు-2026లో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పిన్ ఢిల్లీకి చేరుకున్నారు. శనివారం ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న ఆయన భారత అధికారులు స్వాగతం పలికారు. బ్రిక్స్‌లో భాగంగా.. సాయంత్రం జిన్‌పింగ్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక భేటీ నిర్వహించనున్నారు. పాలమ్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన ఎయిర్ చైనా ప్రత్యేక విమానంలో జిన్‌పింగ్‌తో పాటు సుమారు 400 మందితో కూడిన భారీ బృందం భారత్‌కు వచ్చింది. భారత అధికారులు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో సాదర స్వాగతం పలికారు. మోదీతో జరిగే ద్వైపాక్షిక భేటీలో వాణిజ్యం, పెట్టుబడులు, ఇరు దేశాల సంబంధాల మెరుగుదలతో పాటు వాస్తవాధీన రేఖ (LAC) పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది.New Delhi: Chinese President Xi Jinping arrives in New Delhi to attend the 18th BRICS Summit https://t.co/jqG0LAC3Rw pic.twitter.com/QG6cB1BtXH— IANS (@ians_india) September 12, 2026గాల్వాన్ ఘటన నేపథ్యంలో.. దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్‌కు రావడం గమనార్హం. ఆ భేటీలో ఇరు దేశాల మధ్య సంబంధాలు, పరస్పర సహకారం వంటి కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీ భారత్ మండపం వేదికగా 18వ బ్రిక్స్ సదస్సు ఇవాళ మధ్యాహ్నాం 2గం.లకు ప్రారంభం కానుంది. ఇవాళ, రేపు ఆ సమావేశాలు జరగనున్నాయి. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ భారత్ పర్యటనకు ముందు బీజింగ్ కీలక సందేశం ఇచ్చింది. రెండు దేశాలు పరస్పర విశ్వాసాన్ని పెంచుకుని, సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని చైనా పేర్కొంది. భారత్–చైనా సంబంధాలు సుస్థిరంగా, ఆరోగ్యకరంగా అభివృద్ధి చెందడం ఇరు దేశాల ప్రయోజనాలకు మాత్రమే కాకుండా ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి కూడా కీలకమని స్పష్టం చేసింది.ఇటు చైనా, భారత్ కలిసి ముందుకు సాగాలని భావిస్తున్నట్లు భారత్‌లో చైనా రాయబారి షూ ఫెంగ్హాంగ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మార్గదర్శకత్వంలో ఇరు దేశాలు పరస్పర విభేదాలను సరిగ్గా పరిష్కరించుకుంటూ.. సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఇరాన్ అధ్యక్షుడి చేతిలో చెయ్యేసి.. -
9/11కు 25 ఏళ్లు.. అల్‌ఖైదా సంచలన వీడియో!
అమెరికా సెప్టెంబర్ 11 దాడులకు పాతికేళ్లు పూర్తయిన వేళ అల్‌ఖైదా విడుదల చేసిన ఓ వీడియో సంచలనం రేపుతోంది. ఆ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ కొడుకు లాడెన్ కొడుకు హమ్జా అందులో కనిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఏడేళ్ల కిందటే.. అమెరికా ఆపరేషన్‌లో అతను హతమైనట్లు ఇంతకాలం అంతా భావించారు. అయితే ఇప్పుడు వీడియో ద్వారా అల్‌ఖైదా ఏం సందేశం ఇచ్చిందనే దానిపై ఆసక్తి నెలకొంది.అల్‌ఖైదా మీడియా విభాగం ‘అస్-సహాబ్’ 50 నిమిషాల వీడియో రిలీజ్ చేసింది. అందులో హమ్జా కనిపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో ఏడేళ్ల క్రితం ముగిసిందనుకున్న అతడి కథపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. ‘ఎ క్వార్టర్ సెంచరీ ఆఫ్ ది 11 సెప్టెంబర్ రైడ్స్’ పేరుతో ఈ వీడియోను విడుదల చేశారు. ఇందులో హమ్జా బిన్ లాడెన్‌తో పాటు 2022లో అమెరికా ఆపరేషన్‌లో హతమైన అల్‌ఖైదా చీఫ్ అయ్మన్ అల్-జవహిరి దృశ్యాలు కూడా ఉన్నారు.వీడియోలో హమ్జా తెల్లటి తలపాగా ధరించి, పక్కనే తుపాకీ ఉండగా మట్టి గోడ ముందు కూర్చుని కనిపిస్తాడు. అతడిని ఒసామా బిన్ లాడెన్ వారసుడిగా చూపించేలా ఈ దృశ్యాలను రూపొందించినట్లు భద్రతా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బిన్ లాడెన్ పేరును ఉపయోగించుకోవడం ద్వారా అల్‌ఖైదా తన భావజాలాన్ని ప్రచారం చేయడంతోపాటు కొత్తగా మద్దతుదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.Al-Qaeda Releases New Video Featuring Hamza Bin Laden On 9/11 AnniversaryAl-Qaeda’s media arm, As-Sahab, has released a 52-minute propaganda video marking the 25th anniversary of the September 11 attacks, featuring previously unseen footage of Hamza bin Laden, the son of…1️⃣ pic.twitter.com/7uL3VYjKEx— Aamaj News English (@aamajnews_EN) September 11, 20262019లో ఏం జరిగింది?ఒసామా బిన్ లాడెన్ కుమారుడైన హమ్జా.. అల్‌ఖైదా భవిష్యత్ నాయకుడిగా ఎదుగుతున్నాడని అప్పట్లో అమెరికా నిఘా వర్గాలు భావించాయి. తండ్రి మరణం తర్వాత అల్‌ఖైదా ప్రచార వీడియోలు, ఆడియో సందేశాల్లో అతడి పేరు తరచూ వినిపించింది. దీంతో అతడు సంస్థకు కీలక నేతగా మారే అవకాశం ఉందని అంచనాలు వెలువడ్డాయి.అయితే 2019 ఫిబ్రవరిలో హమ్జా ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల డాలర్ల రివార్డు ఇస్తామని అమెరికా ప్రకటించింది. అదే ఏడాది.. అనూహ్యంగా ఓ ఆపరేషన్‌లో అతను మరణించినట్లు అమెరికా ప్రకటించింది. అయితే హమ్జా మృతిని అల్‌ఖైదా అధికారికంగా ప్రకటించకపోవడం అప్పట్లోనే ఆసక్తి రేపింది. సాధారణంగా కీలక నేతలు మరణించినప్పుడు సంతాప ప్రకటనలు చేసే సంస్థ.. హమ్జా విషయంలో అలాంటి ప్రకటన చేయలేదు.తాజాగా విడుదలైన వీడియోలో హమ్జా కనిపించడం అతడు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాడా? అనేది నిర్ధారణ కాలేదు. పైగా ఆ ఫుటేజ్ ఎప్పుడు చిత్రీకరించారన్నది తెలియదు. అతడి మరణానికి ముందు తీసిన పాత దృశ్యాలను ఇప్పుడు ప్రచార వీడియోలో ఉపయోగించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. 2025లోనూ హమ్జా బతికే ఉన్నాడంటూ కొన్ని నివేదికలు వెలువడ్డాయి.కరాచీ దాడి దృశ్యాలతో మొదలువీడియో ఫుటేజీలో.. 2014లో పాకిస్థాన్‌లోని కరాచీ నేవల్ డాక్యార్డ్పై జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలతో ప్రారంభమైనట్లు సమాచారం. అనంతరం హమ్జా పలుమార్లు కనిపిస్తాడు. పాకిస్థాన్ కేంద్రంగా అల్‌ఖైదా కార్యకలాపాలు, ప్రచార వ్యవస్థకు ఉన్న సంబంధాన్ని నొక్కిచెప్పేలా ఈ ఫుటేజ్‌ను ఎంచుకున్నట్లు భద్రతా వర్గాలు చెబుతున్నాయి. హమ్జా పేరును మళ్లీ తెరపైకి తీసుకురావడం వెనుక అల్‌ఖైదా వ్యూహం కూడా ఇదేనని విశ్లేషిస్తున్నారు. ఒసామా బిన్ లాడెన్ వారసుడిగా అతడికి ఉన్న పాత ఇమేజ్ను ఉపయోగించి సంస్థ భావజాలాన్ని కొత్త తరానికి చేరవేసే ప్రయత్నంగా దీన్ని చూస్తున్నారు.ముఖ్యంగా 9/11 దాడులకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంలోనే ఈ వీడియో విడుదల కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2001 సెప్టెంబర్ 11న అల్‌ఖైదా ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో దాదాపు 3,000 మంది ప్రాణాలు కోల్పోయారు. పావు శతాబ్దం తర్వాత కూడా ఆ సంస్థ తన పాత నాయకులు, వారి వారసత్వాన్ని ప్రచారానికి ఉపయోగించుకోవడం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది.ఇదీ చదవండి: షరీఫ్ ఇంట పెళ్లి సందడి.. పాక్ జనాల్లో కొత్త భయాలు -
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు.. షరీఫ్ ఇంట శుభకార్యం
పాకిస్థాన్ పంజాబ్ ముఖ్యమంత్రి, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ షరీఫ్ కుమార్తె మహ్నూర్ సఫ్దార్ శనివారం పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తితో ఆమె వివాహం జరగనున్నట్లు సమాచారం. షరీఫ్ కుటుంబంలో పెళ్లి సందడి మొదలవుతుండగా.. పాకిస్థాన్ ప్రజల్లో మాత్రం మరో ఆందోళన మొదలైంది. నవాజ్ మనవరాలు మహ్నూర్ సఫ్దార్(22) రాజకీయాల్లోగానీ, ప్రజాజీవితంలోగానీ క్రియాశీలంగా లేరు. దీంతో ఆమె వివాహాన్ని పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమంగానే నిర్వహించాలని కుటుంబం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పెళ్లికి సంబంధించిన వివరాలను కూడా పెద్దగా బయటకు వెల్లడించలేదు. ఎంగేజ్మెంట్ వివరాలను కూడా బయటకు పొక్కనివ్వలేదు. అయితే షరీఫ్ కుటుంబానికి ఉన్న రాజకీయ ప్రాధాన్యత, గతంలో జరిగిన భారీ వేడుకల నేపథ్యంలో ఈ పెళ్లి ఇప్పుడు పాకిస్థాన్‌లో చర్చనీయాంశంగా మారింది.కొడుకు పెళ్లి వివాదంలో..మరియం నవాజ్ కుమారుడు జునైద్ సఫ్దార్ వివాహం గతంలో పాకిస్థాన్‌లో పెద్ద చర్చకే దారితీసింది. పెళ్లి వైభవం, వధువు దుస్తులు, మరియం నవాజ్ లుక్.. ఇలా వేడుకకు సంబంధించిన ప్రతి అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షరీఫ్ కుటుంబం నిర్వహించే కార్యక్రమాలు ఏ స్థాయిలో ఉంటాయో అప్పట్లో ఆ పెళ్లి చూపించింది. ఇప్పుడు మహ్నూర్ వివాహం కూడా అదే స్థాయిలో ఘనంగా జరుగుతుందా? అనే ఆసక్తి ఒకవైపు ఉండగా.. “మళ్లీ ఆ ఖర్చుల భారం సామాన్యులపై పడుతుందా?” అన్న సందేహం మరోవైపు పాక్ సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది.లండన్ పర్యటనతో మొదలైన వివాదంఈ చర్చకు తాజాగా మరో కారణం కూడా తోడైంది. తన కుమార్తె గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మరియం నవాజ్ ఇటీవల లండన్ వెళ్లారు. ఈ పర్యటనకు ప్రభుత్వ విమానాన్ని వ్యక్తిగత కార్యక్రమం కోసం ఉపయోగించుకున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అయితే ఈ ఆరోపణలపై పంజాబ్ మంత్రి అజ్మా బుఖారీ స్పందించారు. మరియం ప్రయాణానికి సంబంధించిన ఖర్చులన్నింటినీ ఆమె వ్యక్తిగతంగానే భరించారని, ప్రభుత్వ ఖజానాపై భారం పడలేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ.. ఆ వివాదం పాకిస్థాన్‌లో ఇంకా చర్చలో ఉండగానే మహ్నూర్ పెళ్లి వార్త రావడం ఆసక్తిని పెంచింది.ఖజానాపై అప్పుల భారంప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి సామాన్యులకు అంత సులభంగా లేదు. దేశం భారీ అప్పుల భారంతో సతమతమవుతోంది. 2025 జూన్ నాటికి పాక్ ప్రజా రుణభారం జీడీపీలో దాదాపు 70.7 శాతంగా నమోదైంది. ఇక 2026–27 బడ్జెట్లో అప్పులపై వడ్డీ చెల్లింపులకే రూ.8.05 ట్రిలియన్ కేటాయించడం పరిస్థితి తీవ్రతను చెబుతోంది. ధరల పెరుగుదల, జీవన వ్యయ భారం, ఉపాధి సమస్యలు, విద్యుత్ బిల్లులు వంటి అంశాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబ బడ్జెట్లు ఒత్తిడిలో ఉన్న సమయంలో.. పాలక కుటుంబాల విలాసవంతమైన వేడుకల వార్తలు సహజంగానే సామాన్యుల్లో అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పెళ్లిని పాకిస్థానీయులు కేవలం ఓ కుటుంబ వేడుకగా చూడటం లేదు. అది ప్రభుత్వ ఖజానాకు భారంగా మారకూడదన్నదే వారి ప్రధాన ఆవేదనపాక్ రాజకీయాల్లో షరీఫ్ కుటుంబంపాకిస్థాన్ రాజకీయాల్లో షరీఫ్ కుటుంబం అత్యంత ప్రభావవంతమైన రాజకీయ కుటుంబాల్లో ఒకటి. నవాజ్ షరీఫ్ దేశానికి మూడుసార్లు ప్రధానిగా పనిచేశారు. ఆయన తమ్ముడు షెహబాజ్ షరీఫ్ ప్రస్తుతం పాక్ ప్రధానమంత్రిగా ఉన్నారు. మరో సోదరుడు అబ్బాస్ షరీఫ్ వ్యాపారవేత్తగా, రాజకీయంగానూ వ్యవహరించారు. నవాజ్ కుమార్తె మరియం నవాజ్ షరీఫ్ ప్రస్తుతం పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక షెహబాజ్ కుమారుడు హమ్జా షెహబాజ్ గతంలో పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేయడంతోపాటు పలు కీలక రాజకీయ పదవులు చేపట్టారు. మరో కుమారుడు సులేమాన్ షెహబాజ్ కూడా కుటుంబ వ్యాపారాల్లో కీలకంగా ఉన్నారు. ఇలా షరీఫ్ కుటుంబానికి చెందిన పలువురు తరతరాలుగా పాక్ రాజకీయాలతో పాటు వ్యాపార రంగాల్లో ప్రభావం చూపుతున్నారు.ఇదీ చదవండి: తప్పుడు పనితో జైలు పాలైన భారతీయుడు -
‘మరో దారి లేదు..’ ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై తమ సైనిక చర్యను ఉగ్రవాదంపై పోరులో భాగంగా ఆయన అభివర్ణించారు. గెలుపే లక్ష్యంగా పోరాడుతున్నామని.. వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. పశ్చిమాసియా సంక్షోభంపై పూటకో ప్రకటన చేస్తున్న ఆయన.. ఇప్పుడు మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు.9/11 దాడులకు పాతికేళ్లు పూర్తైన సందర్భంగా వాషింగ్టన్‌లోని పెంటగాన్‌లో జరిగిన స్మారక కార్యక్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2001 నాటి ఉగ్రదాడులను గుర్తుచేసుకుంటూ.. పెంటగాన్‌పై దూసుకొచ్చిన హైజాక్ విమానంలో 64 మంది, భవనంలో 125 మంది మరణించిన విషయాన్ని ట్రంప్ గుర్తుచేశారు. ‘వార్ ఆన్ టెర్రర్’లో సేవలందించిన అమెరికా సైనికులకు నివాళులర్పించిన ఆయన.. ప్రస్తుతం ఇరాన్‌పై జరుగుతున్న సైనిక చర్యను కూడా ప్రస్తావించారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని పొందకుండా అమెరికా సైనికులు పనిచేస్తున్నారని చెప్పారు.9/11 విషాదాన్ని, ఇరాన్‌పై యుద్ధాన్ని నేరుగా ముడిపెడుతూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మనం ఎప్పటికీ, ఎప్పటికీ మర్చిపోం. అందుకే ఈరోజు పోరాడుతున్నాం. మనకు మరో మార్గం లేదు. విజయం తప్ప మరోటి ఉండదు. మేం గట్టిగా పోరాడతాం. గెలవడానికి పోరాడతాం’’ అని ట్రంప్ అన్నారు.ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం ఆరు నెలలకు పైగా కొనసాగుతున్నప్పటికీ ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు. వరుస సైనిక దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికాలోనూ ఈ యుద్ధంపై రాజకీయంగా తీవ్ర చర్చ, వ్యతిరేకత కొనసాగుతోంది.ట్రంప్ తీరుపై విమర్శలు9/11 వార్షికోత్సవం సందర్భంగా న్యూయార్క్‌లోని గ్రౌండ్ జీరోలో జరిగే ప్రధాన స్మారక కార్యక్రమానికి ట్రంప్ హాజరుకాకుండా వాషింగ్టన్లోనే ఉండటంపై విమర్శలు వచ్చాయి. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ న్యూయార్క్ వెళ్లి వరల్డ్ ట్రేడ్ సెంటర్ స్థలంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.పెంటగాన్ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగం దాదాపు 20 నిమిషాల పాటు సాగింది. అమెరికా ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్లను ప్రస్తావిస్తూ.. ‘‘అమెరికా ఈరోజు పరీక్షను ఎదుర్కొంటోంది. ఆ పరీక్షలో మనం ఘనంగా విజయం సాధిస్తున్నాం’’ అని చెప్పారు. అయితే 9/11 దాడుల సమయంలో, అనంతరం అమెరికాకు మద్దతుగా నిలిచిన మిత్రదేశాల సహకారాన్ని ట్రంప్ తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడంపై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి.‘ఇరాన్ రక్షణ వ్యవస్థలు కుప్పకూలాయి’అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కూడా పెంటగాన్ కార్యక్రమంలో ఇరాన్‌పై కఠిన వ్యాఖ్యలు చేశారు. దాదాపు అర్ధ శతాబ్దంగా అమెరికా నాశనాన్ని కోరుకుంటున్న ‘‘ఇస్లామిక్ థియోక్రసీ’’గా ఇరాన్‌ను అభివర్ణించారు. ఇరాన్ రక్షణ వ్యవస్థలు పూర్తిగా కూలిపోయాయని ఆయన పేర్కొన్నారు. ‘‘మేం ఇప్పటికీ ఉగ్రవాదులను వారు చేరాల్సిన చోటుకు పంపుతున్నాం. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండకుండా చూస్తున్నాం. ఆర్థిక ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతోంది’’ అని హెగ్సెత్ అన్నారు. 9/11 తర్వాత మొదలైన ‘‘చెడుపై పోరాటం’’ ఇంకా కొనసాగుతోందని, అది ‘‘జడ్జ్మెంట్ డే’’ వరకు కొనసాగుతుందని వ్యాఖ్యానించారు.అమెరికాలోనూ ముప్పు పొంచి ఉందని హెగ్సెత్ హెచ్చరించారు. విదేశాల్లో, దేశంలో ఉన్న ఇస్లామిక్ ఉగ్రవాదులతో పాటు అమెరికా శక్తిని బలహీనపర్చాలని, అమెరికన్లను చంపాలని చూస్తున్న శత్రువులపై అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ట్రంప్ నాయకత్వంలో ఇరాన్ సైనిక సామర్థ్యాలను నిర్వీర్యం చేస్తున్నామని చెప్పిన ఆయన.. దేశ సేవకు సిద్ధంగా ఉండే ‘‘బలమైన, ధైర్యవంతమైన యోధుల’’ కొత్త తరం అవసరమని పేర్కొన్నారు.సౌదీ అరేబియాపై చర్యకు డిమాండ్మరోవైపు న్యూయార్క్‌లో జరిగిన 9/11 స్మారక కార్యక్రమంలో బాధిత కుటుంబాల తరఫున టెర్రీ స్ట్రాడా అమెరికా ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేశారు. 9/11 బాధితురాలి భర్త అయిన ఆమె.. దాడులతో సౌదీ అరేబియాకు సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఆ దేశాన్ని బాధ్యులను చేయాలని ట్రంప్ ప్రభుత్వాన్ని కోరారు. ‘‘ఒక్కొక్కటిగా మాకు ద్రోహాలు ఎదురవుతూనే ఉన్నాయి. అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికీ దాన్ని మార్చగలరు’’ అని స్ట్రాడా అన్నారు. అమెరికాతో స్నేహం కోరుకుంటే 9/11 ఉగ్రవాదులతో సంబంధాలపై సౌదీ అరేబియా చేస్తున్న నిరాకరణలను ఆపేలా ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.సాధారణంగా 9/11 వార్షికోత్సవ కార్యక్రమాలు 2001లో మరణించిన దాదాపు 3,000 మందిని స్మరించుకోవడానికే పరిమితమవుతాయి. అయితే 25వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌పై కొనసాగిస్తున్న యుద్ధాన్ని సమర్థించేందుకు కూడా ఈ వేదిక ఉపయోగపడింది.ఇదీ చదవండి: ఇంట్రెస్టింగ్.. ట్రంప్ వారసుడెవరు? -
అమ్మ చివరి చూపు దక్కలేదు.. కృష్ణుడి పాదాల చెంత కన్నీళ్లు!
దాదాపు రెండేళ్లుగా ఆయన జైల్లోనే ఉన్నారు. నమోదైన అభియోగాలపై ప్రభుత్వం ఇప్పటిదాకా ఆధారాల్లేవీ చూపించలేకపోయింది. అయితే చావు బతుకుల మధ్య తన తల్లి.. ఆ కొడుకును చూసేందుకు అర్జీ పెట్టుకుంది. అధికారుల మనసు కరగలేదు. చివరకు.. ఆ తల్లి అంత్యక్రియల కోసం పెరోల్ విషయంలోనూ దుర్మార్గంగా వ్యవహరించింది. పాపం.. కన్నతల్లిని చివరిసారి చూసే అవకాశం కూడా దక్కకపోవడంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సరాసరి గుడిలోకి వెళ్లి శ్రీకృష్ణుడి విగ్రహం పాదాలను తాకుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. బంగ్లాదేశ్‌లో జైల్లో ఉన్న హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆయన తల్లి సంధ్యా రాణి ధర్ గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. తన కుమారుడిని చివరిసారైనా చూడాలని కోరుకున్నారు. అయితే అందుకు జైలు అధికారులు అంగీకరించలేదు. చివరకు ఆమె మరణించాక అప్పుడు పర్మిషన్ ఇచ్చారు. అయితే ఆవేదనతో ఆయన పెరోల్ టైం పూర్తికాకముందే మళ్లీ జైలుకు వెళ్లిపోయారు. ఆ మధ్యలో ఆయన దేవుడి సన్నిధిలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.సంధ్యా రాణి కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆమెను చిట్టగాంగ్‌లోని పుండరీక ధామ్‌కు తీసుకొచ్చారు. తన తల్లి ఆరోగ్యం విషమంగా ఉందని తెలుసుకున్న చిన్మయ్ కుటుంబ సభ్యులు.. ఆమెను చివరిసారిగా చూసేందుకు ఆయనకు పరోల్ ఇవ్వాలని బుధవారం అధికారులను కోరారు. అయితే అనారోగ్యంతో ఉన్న బంధువును చూసేందుకు ఖైదీకి పరోల్ ఇచ్చే నిబంధన లేదని అధికారులు కుటుంబానికి తెలిపారు. ఆ తర్వాతి రోజే సంధ్యా రాణి కన్నుమూశారు.ఆమె మరణంతో చిన్మయ్ కుటుంబం మరోసారి అధికారులను ఆశ్రయించింది. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయనకు పరోల్ ఇవ్వాలని కోరింది. ఈసారి చిట్టగాంగ్ జిల్లా యంత్రాంగం మానవతా దృక్పథం అని పేర్కొంటూ ఐదు గంటలు మాత్రమే అనుమతి ఇచ్చారు. గురువారం సాయంత్రం 4 గంటలకు చిట్టగాంగ్ సెంట్రల్ జైలు నుంచి చిన్మయ్‌ను బయటకు తీసుకొచ్చారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చిన్మయ్ నేరుగా హతజారీ ప్రాంతంలోని పుండరీక ధామ్‌కు వెళ్లారు. అక్కడ తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అదే సమయంలో ఆలయంలోని రాధాకృష్ణుల విగ్రహం ముందు ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకుంటూ విగ్రహం పాదాలను తాకారు. జైలులో ఉన్న సమయంలో తల్లి అనారోగ్యం, ఆమెను చూడలేకపోయిన బాధ ఆయనలో ఎంతగా ఉందో ఈ దృశ్యాలు చెప్పకనే చెప్పాయి. తల్లి అంత్యక్రియలు పూర్తయ్యాక చిన్మయ్ తిరిగి జైలు బాట పట్టారు. పరోల్ సమయం రాత్రి 9 గంటల వరకు ఉన్నప్పటికీ.. రాత్రి 8.03 గంటలకే చిట్టగాంగ్ సెంట్రల్ జైలుకు చేరుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది.Heartbreaking 💔…!Hindu monk Chinmoy Krishna Das Taken into custody again In BANGLADESHHe was out on parole for few hours to see his dead mother…… pic.twitter.com/WMKX7sy68J— Mamta Painuly Kale (@mamta_kale) September 11, 2026ఒకవైపు తల్లి మరణం.. మరోవైపు ఆమెను బతికుండగానే చివరిసారి చూడలేకపోయిన బాధ.. కేవలం ఐదు గంటల్లోనే అంత్యక్రియలు పూర్తి చేసి మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి.. చిన్మయ్ పరోల్ దృశ్యాలను మరింత భావోద్వేగంగా మార్చాయి.ఆరు క్రిమినల్ కేసులుబంగ్లాదేశ్లో హిందూ మైనారిటీల హక్కుల కోసం గళం వినిపించిన చిన్మయ్ కృష్ణ దాస్ 2024 నవంబర్ 25న అరెస్టయ్యారు. చిట్టగాంగ్‌లో జరిగిన ఓ ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారనే ఆరోపణలతో ఆయనపై దేశద్రోహం కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టైన తర్వాత ఆయనను కోర్టులో హాజరుపర్చగా బెయిల్ నిరాకరించి జైలుకు పంపారు.ఆయన అరెస్టు తర్వాత చిట్టగాంగ్ కోర్టు వద్ద జరిగిన ఆందోళనల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ప్రభుత్వ న్యాయవాది సైఫుల్ ఇస్లాం అలిఫ్ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులోనూ చిన్మయ్‌ను నిందితుడిగా చేర్చారు. దీనిపై ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది.ఇవే కాకుండా హత్యాయత్నం, విధుల్లో ఉన్న అధికారులను అడ్డుకోవడం, విధ్వంసం తదితర ఆరోపణలతో ఆయనపై మరికొన్ని కేసులు నమోదయ్యాయి. మొత్తంగా చిన్మయ్‌పై ఆరు క్రిమినల్ కేసులు కొనసాగుతున్నాయి. వీటిలో నాలుగు కేసుల్లో హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. మిగిలిన కేసుల కారణంగా ఆయన జైలు నుంచి విడుదల కాలేకపోతున్నారు. దేశద్రోహం కేసులో లభించిన బెయిల్‌పైనా స్టే కొనసాగుతోంది.బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మైనారిటీల హక్కులు, భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని బంగ్లాదేశ్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. వరుస దాడులు, హత్యలు, ఈ మధ్యలోనే చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్టు, ఆయనపై కొనసాగుతున్న కేసులు, తాజాగా తల్లి బతికుండగానే పరోల్ దక్కకపోవడం వంటి పరిణామాలు వాస్తవ పరిస్థితుల్ని బయటపెడుతున్నాయి. మరోవైపు బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, మైనారిటీల భద్రత అంశాన్ని భారత్ పలుమార్లు ప్రస్తావిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదీ చదవండి: ఆల్ టైం హైకి చేరితో భారత్ పరిస్థితి ఏంటి? -
రాకెట్లా దూసుకుపోతున్న ముడిచమురు ధరలు
పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు రాకెట్లా దూసుకుపోతున్నాయి. హర్ముజ్ సహా కీలకమైన సముద్ర మార్గాల్లో వరుస దాడులు, చమురు రవాణాకు అంతరాయాల భయాలు మార్కెట్‌ను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో వరుసగా రెండో రోజూ చమురు ధరలు భారీగా పెరిగాయి. నిన్న ఒక్కరోజే 6 శాతానికి పైగా ఎగబాకిన ధరలు.. శుక్రవారం కూడా పైపైకి కదిలాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర ఏకంగా బ్యారెల్‌కు 108.68 డాలర్లకు చేరింది. అంటే 110 డాలర్ల మార్క్‌కు అత్యంత చేరువలో ఉంది. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ధర కూడా బ్యారెల్‌కు 103.45 డాలర్లకు చేరింది. ఈ రెండు బెంచ్‌మార్క్‌లు మే మధ్య తర్వాత తొలిసారిగా వారాన్ని 100 డాలర్లకు పైన ముగించే దిశగా సాగుతున్నాయి.పశ్చిమాసియాలో ఇటీవలి కాలంలో మళ్లీ తీవ్రత పెరిగిన పోరుతో చమురు సరఫరాపై అనిశ్చితి పెరిగింది. ముఖ్యంగా కీలక సముద్ర మార్గాల్లో చమురు ట్యాంకర్లు, ఇతర నౌకలపై దాడులు పెరగడం మార్కెట్‌ను కలవరపెడుతోంది. గురువారం బ్రెంట్, WTI ధరలు రెండూ 6 శాతానికిపైగా పెరిగాయి. వారాంత ప్రాతిపదికన చూస్తే రెండు సూచీలు దాదాపు 13 శాతం మేర లాభపడ్డాయి.ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ఏడో నెలలోకి ప్రవేశించినప్పటికీ.. ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అమెరికా, ఇరాన్ రెండూ వెనక్కి తగ్గే ఉద్దేశం లేదన్న సంకేతాలు ఇస్తుండటంతో ఈ పరిస్థితి మరింత కాలం కొనసాగవచ్చన్న అంచనాలు పెరిగాయి.హర్ముజ్ నుంచి ఎర్ర సముద్రం వరకు..ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్ముజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలు ఇప్పటికే పరిమితమయ్యాయి. మరోవైపు యెమెన్‌లో ఇరాన్‌కు అనుకూలంగా ఉన్న హౌతీలు మొచా పోర్టుపై నియంత్రణ సాధించడం ఎర్ర సముద్ర మార్గంపై కొత్త ఆందోళనలకు దారితీసింది. సెప్టెంబర్ 10న ఒమన్ సమీపంలో రెండు నౌకలు గుర్తుతెలియని ప్రాజెక్టైళ్ల దాడికి గురైనట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. ఇరాన్ సమీప సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు పెరగడం, అమెరికా ఐదు ఇరానియన్ చమురు ట్యాంకర్లపై దాడి చేయడం, అనంతరం ఇరాన్ పలు నౌకలపై దాడులు చేసినట్లు ప్రకటించడం.. చమురు రవాణాపై ముప్పును మరింత పెంచాయి.ఇదే సమయంలో సౌదీ అరేబియాలోని ఇంధన మౌలిక వసతులపై హౌతీల దాడులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని కార్యకలాపాలు నిలిచిపోవడంతో మిడిల్ఈస్ట్ నుంచి చమురు సరఫరా మరింత తగ్గే ప్రమాదం ఉందన్న భయాలు వ్యక్తమవుతున్నాయి.చైనా కొనుగోళ్లతో మరింత మంట..సరఫరా ఆందోళనలకు తోడు డిమాండ్ వైపు పరిణామాలు కూడా క్రూడాయిల్ ధరలకు మద్దతు ఇస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూడాయిల్ దిగుమతిదారు అయిన చైనా ఇటీవలి వారాల్లో కొనుగోళ్లను పెంచింది. చైనా ఇదే స్థాయిలో కొనుగోళ్లు కొనసాగిస్తే.. సరఫరా అంతరాయాల ప్రభావం మరింత పెరిగి ధరలు పైకి వెళ్లే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి ఏడాదిలోనే కనిష్ట స్థాయికి పడిపోయినట్లు నివేదికలు వెల్లడించాయి. దీంతో ఇప్పటికే సరఫరాపై ఉన్న ఒత్తిడికి ఇది మరింత తోడైంది.క్రూడాయిల్ అంటే.. భూమి నుంచి వెలికితీసే ముడిచమురు. దీన్ని శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం, ఎల్పీజీతో పాటు ప్లాస్టిక్, పెయింట్లు, రసాయనాలు వంటి అనేక ఉత్పత్తులను తయారు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలను సాధారణంగా బ్యారెల్‌కు లెక్కిస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర పెరిగితే.. దాని ప్రభావం ఇంధన ధరలు, రవాణా ఖర్చులు, చివరకు నిత్యావసర వస్తువుల ధరలపైనా పడే అవకాశం ఉంటుంది.భారత్‌పై ప్రభావం..క్రూడాయిల్ ధరలు ఇలా భారీగా పెరగడం భారత్‌పై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. దేశం తన అవసరాల్లో ఎక్కువ భాగం ముడిచమురును దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో.. అంతర్జాతీయ ధరలు పెరిగితే దిగుమతి బిల్లు, కరెంట్ అకౌంట్ లోటుపై ఒత్తిడి పెరుగుతుంది. రూపాయి విలువపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాల్సిన పరిస్థితి వస్తే రవాణా ఖర్చులు పెరిగి.. ఆ ప్రభావం నిత్యావసర వస్తువులు, కూరగాయలు, సరుకుల ధరలపై పడొచ్చు. దీంతో క్రూడాయిల్ ర్యాలీ భారత్‌లో ద్రవ్యోల్బణ ఆందోళనలను కూడా పెంచే అవకాశం ఉంది.120 డాలర్లకు చేరుతుందా?ప్రస్తుత పరిణామాలు ఇలాగే కొనసాగితే క్రూడాయిల్ ధరలు మరింత పెరిగే అవకాశాన్ని విశ్లేషకులు కొట్టిపారేయడం లేదు. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే బ్రెంట్ ధర బ్యారెల్‌కు 120 డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉందని గోల్డ్‌మన్ శాక్స్ ఇప్పటికే హెచ్చరించింది. బ్రెంట్ ధర ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 80 శాతం పెరిగింది. యుద్ధ సమయంలో నమోదైన గరిష్ఠ స్థాయి 126 డాలర్లతో పోలిస్తే(ఏప్రిల్ 30న).. ప్రస్తుత ధరలు కూడా ఆ స్థాయికి చేరువలోనే ఉన్నాయి.అయితే ధరల ర్యాలీ ఎంతకాలం కొనసాగుతుందన్నది ప్రధానంగా యుద్ధ తీవ్రత, సముద్ర మార్గాల్లో చమురు రవాణా పరిస్థితులు, చైనా కొనుగోళ్లపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల తర్వాత యుద్ధం ముగుస్తుందని, ఆ తర్వాత చమురు ధరలు భారీగా తగ్గుతాయని పేర్కొన్నారు. కానీ ప్రస్తుత పరిణామాలు మాత్రం సమీప భవిష్యత్తులో ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలపై సందేహాలను పెంచుతున్నాయి.ఇదీ చదవండి: భారత్ వద్ద న్యూక్లియర్ వెపన్స్ లెక్క తెలుసా? -
మంటల్లో స్కూల్.. ఆపై తొక్కిసలాట.. 29 మంది మృతి
ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. స్కూల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. అగ్నికీలల్లో చిక్కుకుని 29 మంది మృతి చెందగా.. వారిలో 24 మంది చిన్నారులే ఉన్నారు. మృతుల్లో 19 మంది బాలికలు, ఐదుగురు బాలురు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని బుకావు నగరంలో చోటుచేసుకుంది.బుకావు(Bukavu)లోని చింపుండా ప్రాంతంలో గురువారం ఉదయం 8 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మంటలు తొలుత ఒక ప్రాంతంలో మొదలై.. సమీపంలోని ఉజామా ప్రైమరీ స్కూల్, ఫురాహా సెకండరీ స్కూల్‌కు వ్యాపించాయి. పాఠశాలలతో పాటు సమీపంలోని దాదాపు 300 చెక్క ఇళ్లు కూడా మంటల్లో కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ బుకావు రీజియన్ అంతా తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉండడం గమనార్హం.మంటలు.. ఆపై తొక్కిసలాటమంటలు వేగంగా వ్యాపించడంతో విద్యార్థులు ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. కొందరు ఒకరినొకరు తొక్కుకుంటూ బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. మరికొందరు ఊపిరాడక స్పృహ కోల్పోయారు. తొక్కిసలాటలోనూ పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు.స్థానిక క్లినిక్ నర్సు క్రిస్టోఫ్ జిగషానే తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు 50 మంది విద్యార్థులు, పలువురు ఉపాధ్యాయులను తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురు ఊపిరాడక ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. కొందరు ఘటనాస్థలంలోనే మృతి చెందగా.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.#RDC – #Bukavu : 15 élèves morts dans un incendie à KashekeLe bilan provisoire des incendies survenus ce jeudi à Kasheke, à Bukavu, fait état de 15 élèves morts et de plusieurs blessés graves, selon les autorités locales.Les victimes sont des élèves des écoles Ujamaa et… pic.twitter.com/HCT2xcL0mL— Steve Wembi (@wembi_steve) September 10, 2026క్షతగాత్రులకు చికిత్సఈ ప్రమాదంలో మరో 29 మంది చికిత్స పొందుతున్నట్లు ఏఎఫ్సీ/ఎం23(AFC/M23) తిరుగుబాటు ఉద్యమ ప్రతినిధి లారెన్స్ కన్యుకా తెలిపారు. వారిలో 21 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. 17 మంది కడుటు జనరల్ ఆస్పత్రిలో, మరో నలుగురు బుకావు ప్రావిన్షియల్ జనరల్ ఆస్పత్రిలో ఉన్నట్లు వెల్లడించారు.బుకావు నగరం 2025 ఫిబ్రవరి నుంచి రువాండా మద్దతు ఉన్న AFC/M23 తిరుగుబాటు సంస్థ ఆధీనంలో ఉంది. ఖనిజ సంపదకు పేరుగాంచిన తూర్పు ప్రాంతాల్లో ఈ సంస్థ తన ఆధిపత్యాన్ని విస్తరించుకుంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో తిరుగుబాటుదారుల ఆధీనంలోని ప్రాంతంలో ఇంత భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.ఇదీ చదవండి: భారతీయులపై ట్రంప్ మరో పిడుగు -
భారత్‌లో అడుగుపెట్టిన పుతిన్.. నేడు మోదీతో కీలక భేటీ
ప్రతిష్టాత్మక 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ఢిల్లీ సిద్ధమైంది. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ రెండు రోజుల సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం తెల్లవారుజామున న్యూఢిల్లీ చేరుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా బ్రిక్స్ సదస్సులో పాల్గొనడంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు.రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఢిల్లీలో స్వాగతం పలికారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన 2022 తర్వాత రష్యా వెలుపల జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు ఆయన స్వయంగా హాజరవడం ఇదే తొలిసారి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిళ్లు పెరుగుతున్న సమయంలో ఆయన భారత్ పర్యటన సాగుతోంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం, హర్ముజ్ జలసంధిలో నెలకొన్న పరిస్థితులు, అమెరికా వాణిజ్య విధానాలు, సుంకాల ప్రభావం వంటి అంశాలు ఈసారి బ్రిక్స్ సదస్సులో కీలకంగా మారనున్నాయి.మోదీ–పుతిన్ భేటీలో కీలక అంశాలుపుతిన్ పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. రక్షణ, ఇంధనం, సాంకేతికత, ఔషధాలు, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకోవడంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడం ఈ భేటీలో ప్రధానంగా ఉండనుంది.President Putin arrives in New Delhi:Government Il-96 landed at the base of the air force of the Republic of Palam.(3:54 am, Delhi time)NEW DELHI, September 11. /TASS/. Russian President Vladimir Putin arrived in India, in the capital of which New Delhi the BRICS summit… https://t.co/K9ZBz6ZsHk pic.twitter.com/tnM4Q7pHIM— ⏳Towhee 🌏☮️ (@amborin) September 10, 2026రక్షణ రంగంలో బ్రహ్మోస్ క్షిపణి ఆధునికీకరణపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. రష్యా నుంచి భారత్‌కు మిగిలిన ఎస్–400 వ్యవస్థల సరఫరా, సు–57 యుద్ధ విమానాల ప్రతిపాదిత సరఫరాపైనా చర్చలు జరగనున్నాయి. భారత్‌లో కొత్త సివిల్ న్యూక్లియర్ రియాక్టర్ల ఏర్పాటుపైనా ఇరు దేశాలు చర్చించనున్నట్లు సమాచారం.ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్పింగ్పుతిన్ మాత్రమే కాదు బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కూడా హాజరుకానున్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత ఆయన భారత్‌లో పర్యటిస్తున్నారు. సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత ఆయన భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. సదస్సు సందర్భంగా ప్రధాని మోదీతో జిన్‌పింగ్ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. వాణిజ్యం, పెట్టుబడులతోపాటు ఇరు దేశాల సంబంధాలపై ఈ భేటీలో చర్చించే అవకాశముంది. సరిహద్దు ప్రాంతంలో పరిస్థితిని కూడా నేతలు సమీక్షించే అవకాశం ఉంది.పశ్చిమాసియా సంక్షోభం.. బ్రిక్స్‌కు సవాల్ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు బ్రిక్స్ సదస్సుకు కీలక సవాల్‌గా మారాయి. ముఖ్యంగా ఇరాన్, యూఏఈ మధ్య విభేదాల నేపథ్యంలో కూటమి ఉమ్మడి ప్రకటనపై ఏకాభిప్రాయం సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. హర్ముజ్ జలసంధిలో ఏర్పడిన సంక్షోభం అంతర్జాతీయ చమురు వాణిజ్యంపైనా ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ, ప్రాంతీయ పరిణామాలపై బ్రిక్స్ నేతలు చర్చించనున్నారు. ఇదే సమయంలో అమెరికా వాణిజ్య, సుంకాల విధానాలు కూడా బ్రిక్స్ దేశాలను ప్రభావితం చేస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం, ప్రపంచ పాలనలో బహుపాక్షిక వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై భారత్ తన అధ్యక్ష హోదాలో దృష్టి పెట్టనుంది.విస్తరించిన బ్రిక్స్.. పెరిగిన ప్రాధాన్యంబ్రిక్స్లో తొలుత బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు ఉండేవి. 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా సభ్యదేశాలుగా చేరాయి. 2025లో ఇండోనేసియా కూడా కూటమిలో చేరింది. బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, మలేసియా, నైజీరియా, థాయ్‌లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి.ప్రపంచ జనాభాలో దాదాపు 49.5 శాతం, ప్రపంచ జీడీపీలో సుమారు 40 శాతం, ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 26 శాతానికి బ్రిక్స్ ప్రాతినిధ్యం వహిస్తోంది. వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, హైటెక్నాలజీతోపాటు ఆరోగ్యం, వ్యవసాయం, ఆహారం, ఇంధనం, విపత్తుల నిర్వహణ, సరఫరా వ్యవస్థల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడం ఈ సదస్సు ప్రధాన అజెండాలో ఉంది.రెండు రోజులపాటు కీలక భేటీలుభారత్ నాలుగోసారి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. శనివారం మధ్యాహ్నం 2.35 గంటలకు సదస్సు ప్రధాన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. బ్రిక్స్ నేతలు రాజకీయాలు, భద్రత, ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక సహకారం, సాంస్కృతిక, మానవతా సంబంధాలపై చర్చిస్తారు. ఆదివారం విస్తృత సమావేశాలు నిర్వహించిన అనంతరం ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’ను విడుదల చేయడంతో సదస్సు ముగియనుంది.బ్రిక్స్ వేదికపై అధికారిక సమావేశాలతోపాటు నేతల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చలపైనా ఆసక్తి నెలకొంది. పుతిన్‌తో మోదీ భేటీ, ఏడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన జిన్‌పింగ్‌తో మోదీ సమావేశం, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో మోదీ చర్చలు ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మొత్తంగా.. ఒకవైపు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు పశ్చిమాసియా సంక్షోభం, హర్ముజ్ పరిణామాలు, వాణిజ్య యుద్ధాల ప్రభావం వంటి కీలక అంతర్జాతీయ సవాళ్ల మధ్య ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో పుతిన్–మోదీ భేటీతోపాటు భారత్ వేదికగా జరిగే ఇతర ద్వైపాక్షిక చర్చలు కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ఇదీ చదవండి: మిస్టర్ సింగ్.. గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ల్యాండ్ -
ఇరాన్ దెబ్బ.. అమెరికా ఫైటర్ జెట్లకు చిల్లు!
ఇరాన్ మరోసారి అమెరికాపై విరుచుకుపడింది. జోర్డాన్‌లోని కీలక అమెరికా వైమానిక స్థావరంపై రాత్రికి రాత్రే భారీ క్షిపణి దాడులు జరిపింది. క్షిపణుల వర్షం కురిపించడంతో పలు యుద్ధవిమానాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఏకంగా ఒక ఏ-10 థండర్‌బోల్ట్ విమానం నాశనం కాగా.. మరో ఎనిమిది ఎఫ్-15 యుద్ధవిమానాలు దెబ్బతిన్నట్లు సమాచారం.జోర్డాన్‌లోని మువాఫాక్ సాల్టీ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ ఈ దాడులు జరిపినట్లు సీబీఎస్ న్యూస్ ఏజెన్సీ ఓ కథనం ఇచ్చింది. ఇరాన్‌పై అమెరికా సైనిక కార్యకలాపాలకు ఈ స్థావరం కీలక కేంద్రంగా ఉండడం గమనార్హం. ఇక దాడులను అడ్డుకునేందుకు అమెరికా బలగాలు 30కి పైగా పేట్రియాట్ క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తోంది. Iran’s ballistic missile attack on Muwaffaq Salti Air Base in Jordan last night damaged several American aircraft -CBS Roughly eight F-15s suffered light damage and one A-10 was severely damaged, losing a wing. pic.twitter.com/DQydfG4WYH— OSINTtechnical (@Osinttechnical) September 10, 2026దెబ్బతిన్న విమానాలపై అమెరికా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. ఒక ఏ-10 థండర్‌బోల్ట్ తీవ్రంగా దెబ్బతిని, దాని ఒక రెక్క పూర్తిగా కనిపించకుండా పోయినట్లు వెల్లడించింది. సుమారు ఎనిమిది ఎఫ్-15లకు స్వల్ప నష్టం వాటిల్లినప్పటికీ.. వాటిని తిరిగి పునరుద్ధరించినట్లు పేర్కొంది.అందుకు ప్రతీకారంగానే..ఇటీవల అమెరికా ఐదు ఇరాన్ చమురు ట్యాంకర్లను ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత మరింత ముదిరింది. దీనికి ప్రతీకారంగానే ఇరాన్ అమెరికా స్థావరాలు, మిత్రదేశాలపై వరుస దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీసీ) తమ దాడుల్లో జోర్డాన్‌లోని అల్ అజ్రాక్ అమెరికా స్థావరాన్ని భారీ క్షిపణులతో లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించింది. అలాగే హర్ముజ్ జలసంధి వైపు వెళ్తున్న పలు నౌకలపైనా దాడులు చేసినట్లు వెల్లడించింది.Iranian Strike Damages EIGHT 🇺🇸 F-15s In Jordan (CBS)The overnight strike reportedly damaged multiple US warplanes at an air base in Jordan. While an A-10 suffered significant damage, the eight F-15s sustained lighter damage and were returned to service. (CBS)The escalation… pic.twitter.com/dyAEspAra6— RT_India (@RT_India_news) September 10, 2026అయితే ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో 20 జోర్డాన్ గగనతలంలోకి వచ్చినట్లు ఆ దేశ సైన్యం తెలిపింది. వీటిలో 18 క్షిపణులను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని, మిగిలిన రెండు జనావాసాలు లేని ప్రాంతాల్లో పడినట్లు వెల్లడించింది.యుద్ధానికి ముగింపు పలుకుతాం.. కానీ ఇవే షరతులుమరోవైపు యుద్ధానికి ముగింపు పలికేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ సంకేతాలు ఇచ్చింది. అయితే అమెరికా తమ కొన్ని షరతులకు అంగీకరించాలని స్పష్టం చేసింది. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ సైన్యాన్ని వెనక్కి తీసుకోవడం, యెమెన్‌పై దిగ్బంధాన్ని ఎత్తివేయడం, ఇరాన్‌కు చెందిన స్తంభింపజేసిన 24 బిలియన్ డాలర్ల ఆస్తులను విడుదల చేయడం, తమ అణు, క్షిపణి సామర్థ్యాల్లో జోక్యం చేసుకోకపోవడం వంటి డిమాండ్లను ముందుపెట్టింది.ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధానికి త్వరలో ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల తర్వాత యుద్ధం ముగిసిపోతుందని బుధవారం ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్ ఇక ఎక్కువ కాలం యుద్ధాన్ని కొనసాగించే పరిస్థితిలో లేదని పేర్కొన్నారు.అయితే ట్రంప్ వ్యాఖ్యలకు భిన్నంగా అమెరికా ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ తెలిపింది. యుద్ధం ట్రంప్ పదవీకాలంలో మరో రెండేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉందని ఆయనకు సన్నిహితంగా ఉన్న ఉన్నతాధికారులు ప్రైవేటుగా హెచ్చరిస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఇరాన్–అమెరికా ఘర్షణకు తక్షణమే తెరపడుతుందా? మరింత కాలం కొనసాగుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది.ఇదీ చదవండి: ట్రంప్ ఎండ్ గేమ్ ప్లాన్ ఇదేనంట! -
అమెరికన్లకు ట్రంప్ సంచలన హామీ
మధ్యంతర ఎన్నికలపై సర్వేలన్నీ ప్రతికూల ఫలితాలు ఇస్తున్న వేళ.. అమెరికా ఓటర్లకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన హామీ ఇచ్చారు. రిపబ్లికన్లు కాంగ్రెస్ రెండు సభల్లోనూ పట్టు నిలబెట్టుకుంటే.. ప్రతీ అమెరికన్(వయోజన)కు 5,000 డాలర్లు (సుమారు రూ.4.2 లక్షలు) చొప్పున చెల్లిస్తామని ప్రకటించారు. దీనికి ‘ట్రంప్ డివిడెండ్’గా పేరు పెడతామని చెప్పారు.భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం డలాస్‌లో రిపబ్లికన్ పార్టీ నిర్వహించిన సదస్సులో ప్రసంగించిన ట్రంప్.. ఎన్నికల్లో తన పేరు బ్యాలెట్‌పై లేకపోయినా, తనను అభ్యర్థిగా భావించి ఓటేయాలని మద్దతుదారులను కోరారు. ‘‘రిపబ్లికన్లు గెలిస్తే.. మీరూ మాతో గెలిచినట్టే. మీకు 5,000 డాలర్లు లభిస్తాయి’’ అని పేర్కొన్నారు. అయితే ఈ మొత్తాన్ని ఎక్కడి నుంచి సమకూరుస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. ‘‘మన దేశం ఎంతో డబ్బు సంపాదిస్తోంది’’ అని మాత్రమే చెప్పారు.ట్రంప్ ప్రతిపాదన అమలు చేస్తే ప్రభుత్వంపై కనీసం 1 ట్రిలియన్ డాలర్ల భారం పడే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ హామీ ఆర్థికంగా, రాజకీయంగా ఎంతవరకు సాధ్యమవుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఇటీవలి అభిప్రాయ సర్వేల్లో ట్రంప్ ఆమోద రేటింగ్ 30 శాతం దిగువన ఉన్నట్లు తెలుస్తోంది. అధిక ధరలు, ఇరాన్‌తో యుద్ధం వంటి అంశాలపై అమెరికన్లలో అసంతృప్తి పెరుగుతోంది.‘బ్యాలెట్లో నేనే ఉన్నట్లు భావించండి’మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు రెండు సభల్లోనూ విజయం సాధిస్తారని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ‘‘నేను బ్యాలెట్లో ఉన్నాను.. ఉన్నాను.. మరోసారి చెబుతున్నా.. నేనే బ్యాలెట్లో ఉన్నట్లు భావించండి’’ అంటూ తన మద్దతుదారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇరాన్ యుద్ధంపైనా ట్రంప్ వ్యాఖ్యలుసదస్సు ప్రసంగంలో ట్రంప్ ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని పదేపదే ప్రస్తావించారు. ఈ యుద్ధం అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోందన్న విషయాన్ని కూడా ఆయన అంగీకరించినట్లు కనిపించారు. ఇరాన్ అణ్వస్త్రాన్ని తయారు చేయడానికి రెండు, మూడు వారాల దూరంలో ఉందన్న కారణంతోనే యుద్ధానికి దిగాల్సి వచ్చిందని వివరించారు. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధికి తన పేరును పెట్టాలని కూడా ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై విజయం సాధించిన వెంటనే చమురు ధరలు తగ్గుతాయని చెప్పారు. ఆహారం సహా దాదాపు అన్ని వస్తువుల ధరలు తగ్గుతున్నాయని పేర్కొంటూ.. ‘‘ఇరాన్‌తో యుద్ధంలో గెలిచిన వెంటనే చమురు ధరలు కూడా తగ్గుతాయి’’ అని అన్నారు.టారిఫ్‌లపై వెనక్కి తగ్గేది లేదంటూ..అమెరికా వాణిజ్య భాగస్వాములపై భారీ సుంకాలు విధించడాన్ని కూడా ట్రంప్ సమర్థించుకున్నారు. ప్రస్తుతం ఏర్పడుతున్న ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో వాటి ఫలితాలు మెరుగ్గా ఉంటాయని ఆయన వాదించారు. అమెరికాలో కమ్యూనిజం పెరుగుతోందంటూ డెమొక్రాట్లపై ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. ‘‘వాళ్లు గెలిస్తే అమెరికా కమ్యూనిస్టు దేశంగా మారిపోతుంది’’ అని హెచ్చరించారు. వచ్చే 250 ఏళ్లలో అమెరికా ఎలా ముందుకు సాగాలన్నది ఓటర్ల చేతుల్లోనే ఉందని అన్నారు.అయితే ప్రస్తుత అంచనాలు మాత్రం రిపబ్లికన్లకు ప్రతికూలంగా ఉన్నాయి. డెసిషన్ డెస్క్ హెచ్‌క్యూ అంచనా ప్రకారం.. ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు 230–205 ఆధిక్యంతో గెలిచే అవకాశం ఉండగా, సెనేట్‌లోనూ 51–49తో మెజారిటీ సాధించే అవకాశం ఉంది. రిపబ్లికన్ సదస్సు ముగింపు కార్యక్రమానికి ట్రంప్ గురువారం మరోసారి హాజరుకానున్నారు. అంతకుముందు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పేరును, వ్యక్తిగత ప్రభావాన్ని ఉపయోగించి రిపబ్లికన్ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు ఎంతవరకు తీసుకురాగలరన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.ఇదీ చదవండి: ఇరాన్ యుద్ధానికి ముగింపు! బోనస్‌గా ఉక్రెయిన్ వార్ కూడా!! -
సైనిక విన్యాసంలో పేలిపోయిన చైనా ట్యాంక్!
బంగ్లాదేశ్‌లో సైనిక విన్యాసం విషాదాంతంగా మారింది. ఫీల్డ్ ఫైరింగ్ ప్రాక్టీస్‌లో భాగంగా ట్యాంక్ నుంచి కాల్పులు జరుపుతుండగా అకస్మాత్తుగా అందులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు అక్కడికక్కడే మృతి చెందగా.. ఓ సైనిక అధికారి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన ట్యాంక్.. చైనాకు చెందిందిగా తెలుస్తోంది. బుధవారం (సెప్టెంబర్ 9) చట్టోగ్రామ్‌లోని హాత్హజారీ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఫైరింగ్ రేంజ్లో సైనిక విన్యాసం కొనసాగుతున్న సమయంలో ట్యాంక్ నుంచి గోలాలు(మందు గుండు బాల్స్) ప్రయోగిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన అధికారికి తొలుత అత్యవసర చికిత్స అందించి.. మెరుగైన వైద్యం కోసం హెలికాప్టర్లో ఢాకాలోని కంబైన్డ్ మిలిటరీ హాస్పిటల్ (సీఎంహెచ్)కు తరలించారు. బంగ్లాదేశ్ సైన్యం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టరేట్ (ఐఎస్పీఆర్) ఈ ప్రమాదంపై ప్రకటన చేసింది. అసలు ఏం జరిగింది?ట్యాంక్ నుంచి కాల్పులు జరుపుతున్న సమయంలోనే ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి దారితీసిన కచ్చితమైన కారణం మాత్రం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ట్యాంక్‌లోని మందుగుండు సామగ్రి కారణమా? లేదంటే ట్యాంక్‌లోని ఫైరింగ్ వ్యవస్థలో సాంకేతిక లోపం ఉందా? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.చైనా తయారీ ట్యాంక్..!ప్రమాదానికి గురైన ట్యాంక్ చైనాకు చెందినదిగా తెలుస్తోంది. అది టైప్–59 అని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లోనూ ఇదే తరహా ట్యాంక్ కనిపిస్తోంది. అయితే బంగ్లాదేశ్ ఆర్మీ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ట్యాంక్ మోడల్‌ను వెల్లడించలేదు. టైప్–59ను బంగ్లాదేశ్ ఆర్మీ చాలాకాలంగా వినియోగిస్తోంది. పాత ట్యాంకులను చైనా సాయంతో ఆధునికీకరించి ‘డుర్జోయ్’గా కూడా అప్‌గ్రేడ్ చేసింది.Bangladesh Army’s Chinese-origin Type 59 tank reportedly exploded during a firing exercise, killing 2 crew members and injuring an officer.Made in China. Used in Bangladesh. Deadly outcome. pic.twitter.com/Gn0FRx5ul4— Shadow IND (@ShadowIND_IN) September 9, 2026దశాబ్దాలుగా బంగ్లా ఆర్మీలో..చైనాలో తయారైన టైప్–59.. సోవియట్ కాలం నాటి టీ–54 ట్యాంక్ ఆధారంగా అభివృద్ధి చేసిన ప్రధాన యుద్ధ ట్యాంక్. బంగ్లాదేశ్ ఆర్మీ చాలా కాలంగా ఈ తరహా చైనా తయారీ ఆర్మర్డ్ వాహనాలను వినియోగిస్తోంది. పాతబడుతున్నప్పటికీ వాటిని పూర్తిగా తొలగించకుండా.. ఆధునికీకరణ, అప్గ్రేడ్ల ద్వారా మరికొంతకాలం సేవల్లో కొనసాగిస్తోంది. అందులో భాగంగా 40 టైప్–59 ట్యాంకుల అప్‌గ్రేడ్, మరో 58 టైప్–69ఐఐజీ ట్యాంకుల ఆధునికీకరణకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టినట్లు అక్కడి రక్షణ రంగ నివేదికలు పేర్కొంటున్నాయి. అంటే బంగ్లాదేశ్ ఆర్మీకి ఇవి కేవలం పాత ట్యాంకులు మాత్రమే కాకుండా.. ఇప్పటికీ దాని ఆర్మర్డ్ ఫ్లీట్‌లో భాగంగా ఉన్న కీలక ప్లాట్ఫారమ్లన్నమాట!.దర్యాప్తు ప్రారంభంఈ ఘటనపై బంగ్లాదేశ్ ఆర్మీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. ఈ ప్రమాదంపై విచారణ ప్రారంభించినట్లు చెబుతోంది. అయితే పేలుడు ఎలా సంభవించింది? ఫైరింగ్ సమయంలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తిందా? మందుగుండు సామగ్రికి సంబంధించిన సమస్య ఏమైనా ఉందా? ట్యాంక్ పనితనం వంటి అంశాలను దర్యాప్తు అధికారులు పరిశీలించనున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా.. ఫీల్డ్ ఫైరింగ్ వంటి సైనిక శిక్షణ కార్యక్రమాల్లో అనుకోని ప్రమాదాలు ఎంతటి విషాదానికి దారితీస్తాయో ఈ ఘటన మరోసారి చూపించింది.ఇదీ చదవండి: మిడిల్ఈస్ట్లో పాక్‌కు బిగ్ టెస్ట్ -
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు
అమెరికా–ఇరాన్ యుద్ధానికి ఎప్పుడు తెరపడుతుందన్న ఉత్కంఠ కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్‌లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలు ముగిసిన వెంటనే ఇరాన్‌తో యుద్ధం ముగుస్తుందని ఆయన అంచనా వేశారు. ‘‘ఎన్నికల తర్వాత వెంటనే యుద్ధం ముగుస్తుంది.. ఇరాన్ ఇక ఎక్కువ కాలం తట్టుకోలేదు’’ అని ట్రంప్ అన్నారు.బుధవారం రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌కు బయలుదేరే ముందు విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్ అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయితే అమెరికా విధిస్తున్న ఆర్థిక ఒత్తిడిని తట్టుకునే పరిస్థితిలో ఇరాన్ లేదని పేర్కొన్నారు. నవంబర్ ఎన్నికల వరకు ఇరాన్ యుద్ధాన్ని కొనసాగించలేదన్న ధీమాను వ్యక్తం చేశారు.చర్చలకు అవకాశం ఉన్నా..ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలు జరిగే అవకాశాన్ని ట్రంప్ పూర్తిగా కొట్టిపారేయలేదు. ‘‘చర్చలు జరగొచ్చు.. కానీ ప్రస్తుతం మేము దానిని పరిశీలించడం లేదు’’ అని స్పష్టం చేశారు. అంటే, యుద్ధం ముగింపు విషయంలో చర్చల కంటే అమెరికా ఒత్తిడికే ట్రంప్ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.ఇప్పటికే అమెరికా–ఇరాన్ యుద్ధం ఏడో నెలలోకి ప్రవేశించింది. తక్షణమే యుద్ధం ముగిసే పరిస్థితులు కనిపించడం లేదనే సమయంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.హర్ముజ్‌లో మళ్లీ ఉద్రిక్తతమరోవైపు హర్ముజ్ జలసంధి సమీపంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా ఐదు ఇరాన్ చమురు ట్యాంకర్లను ముంచినట్లు సమాచారం వెలువడిన నేపథ్యంలో.. ఇరాన్ 10 నౌకలపై దాడి చేసినట్లు తెలిపింది. ఈ పరిణామాలతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఒక్కసారిగా కుదుపునకు గురయ్యాయి. బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లను దాటింది.తగ్గిన ఆదరణఇరాన్ యుద్ధం కారణంగా ఇప్పటికే అమెరికాలో ట్రంప్ పట్ల ఉన్న ప్రజాదరణ విపరీతంగా పడిపోయింది. యుద్ధంతో పాటు పెరుగుతున్న జీవన వ్యయంపై ఓటర్లలో అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాతే యుద్ధం ముగుస్తుందని ట్రంప్ చెప్పడం అమెరికా రాజకీయాల్లోనూ ఆసక్తికరంగా మారింది. యుద్ధం ముగిసిన వెంటనే చమురు ధరలు కూడా తగ్గుతాయని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఇరాన్‌తో తక్షణ చర్చలకు అమెరికా సిద్ధంగా లేదని ఆయన స్పష్టం చేశారు. నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికలు సాధారణంగా అధికారంలో ఉన్న అధ్యక్షుడి పాలనపై ప్రజల తీర్పుగా విశ్లేషకులు పరిగణించనున్నారు . ఇటు ఉక్రెయిన్ సంక్షోభంపైనా.. ఉక్రెయిన్ యుద్ధంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధాన్ని ముగించేందుకు ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటున్నాడని ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా అంగీకరిస్తే డీల్ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం 2022 ఫిబ్రవరి 24న రష్యా పూర్తిస్థాయి దాడితో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఐదో ఏడాదిలోకి అడుగుపెట్టినా కాల్పులకు మాత్రం తెరపడలేదు. యుద్ధం ప్రారంభమైన కొద్ది రోజులకే ఇరు దేశాల మధ్య బెలారస్లో చర్చలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఇస్తాంబుల్‌లో ప్రత్యక్షంగా చర్చలు జరిగాయి. 2022 ఏప్రిల్ నాటికి ఆ చర్చలు నిలిచిపోయాయి. 2025లో మరోసారి శాంతి చర్చలకు ప్రయత్నాలు జరిగాయి. రష్యా–ఉక్రెయిన్ ప్రతినిధులు ఇస్తాంబుల్‌లో సమావేశమైనా కాల్పుల విరమణ, భూభాగాల అంశాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ ఏడాది కూడా అమెరికా మధ్యవర్తిత్వంతో చర్చలను పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు జరిగాయి. తాజాగా అమెరికా ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ మాస్కో, కీవ్‌లలో పర్యటించి కొత్తగా చర్చలకు ఊపిరిపోసే ప్రయత్నం చేశారు. అయితే భూభాగాలపై రష్యా, ఉక్రెయిన్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.ఇదీ చదవండి: ఇరాన్‌పై సంచలన ఆరోపణలు -
9/11 వేళ.. గాల్లోకి లేచిన ఒకేఒక్క విమానం!
సెప్టెంబర్ 11, 2001.. అమెరికా చరిత్రలోనే అత్యంత విషాదకరమైన రోజు. విమానాలను హైజాక్ చేసి అమెరికాపై భీకర దాడులకు పాల్పడింది ఉగ్రసంస్థ అల్‌ఖైదా. అయితే ఆ దాడుల వేళ దేశవ్యాప్తంగా పౌర విమాన రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఆకాశం దాదాపు నిర్మానుష్యంగా మారింది. కానీ.. ఆ భయానక పరిస్థితుల్లోనూ ఓ విమానానికి ప్రత్యేక అనుమతితో గాల్లోకి ఎగిరింది.సెప్టెంబర్ 9/11 దాడుల తర్వాత.. అనంతరం అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దేశవ్యాప్తంగా పౌర విమానాలను నేలకే పరిమితం చేసింది. అమెరికా చరిత్రలో ఇలాంటి దేశవ్యాప్త పౌర విమానాల నిలిపివేత ఇదే తొలిసారి. అయితే ఆనాడు అత్యవసర పరిస్థితుల దృష్ట్యా.. సైనిక, అత్యవసర వైద్య విమానాలే తిరిగాయి. ఈ క్రమంలో.. ఎఫ్ఏఏకు ఓ ఎమర్జెన్సీ కాల్ వచ్చింది.ఫ్లోరిడాకు చెందిన స్నేక్ ఎక్స్పర్ట్ లారెన్స్ వాన్ సెర్టిమా.. ఒక ఇన్లాండ్ టైపాన్ పామును తిరిగి దాని బోనులో పెట్టే ప్రయత్నం చేయగా అది ఆయన బొటనవేలిని కాటేసింది. ఆస్ట్రేలియాకు చెందిన ఇన్లాండ్ టైపాన్ అనేది అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి. కాటు తర్వాత ఆయన పరిస్థితి వేగంగా విషమించింది. స్పృహ కోల్పోవడంతోపాటు కళ్ల నుంచి, చెవుల నుంచి, నోటి నుంచి రక్తస్రావం మొదలైంది. మయామిలోని వైద్యులు అందుబాటులో ఉన్న యాంటీవెనమ్తో చికిత్స ప్రారంభించారు. అయితే అది సరిపోలేదు. ఇన్లాండ్ టైపాన్ విషానికి ప్రత్యేకంగా ఉపయోగించే యాంటీవెనమ్ అవసరమైంది. ఆ మందు అప్పట్లో న్యూయార్క్, శాన్‌డియాగోలోని జంతుప్రదర్శనశాలల్లో మాత్రమే లభ్యమవుతోంది. 9/11 దాడులతో న్యూయార్క్ పూర్తిగా కల్లోలంలో ఉండటంతో.. వైద్య బృందం దృష్టి శాన్డియాగోపై పడింది. వాన్ సెర్టిమా పరిస్థితి మరింత విషమించడంతో వైద్య, అగ్నిమాపక అధికారులు విమాన ప్రయాణానికి ప్రత్యేక అనుమతి కోరారు. గంటలపాటు చర్చల అనంతరం FAA అనుమతించింది. 2001 సెప్టెంబర్ 12న శాన్‌డియాగో నుంచి ఒక చిన్న లియర్‌జెట్ బయలుదేరింది. విమానం అమెరికా మీదుగా ప్రయాణిస్తుండగా రెండు ఫైటర్ జెట్లు దానికి ఎస్కార్ట్‌గా వెళ్లాయి. శాన్‌డియాగో నుంచి తెచ్చిన అదనపు యాంటీవెనమ్ మయామికి చేరిన తర్వాత వైద్యులు వెంటనే వాన్ సెర్టిమాకు అందించారు. చికిత్సకు స్పందించిన ఆయన చివరకు ప్రాణాలతో బయటపడ్డారు. రెండు రోజుల తర్వాత టీవీ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. పాముదేం తప్పు లేదు..తన నిర్లక్ష్యమే కారణమంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చారాయన.అమెరికా చరిత్రలో చీకటి రోజుసెప్టెంబర్ 9, 2001.. 19 మంది ఆల్‌ఖైదా ఉగ్రవాదులు నాలుగు వాణిజ్య విమానాలను హైజాక్ చేశారు. రెండు విమానాలను న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్‌ను ఢీకొట్టించారు. మూడో విమానాన్ని వాషింగ్టన్ సమీపంలోని పెంటగాన్‌పైకి దించారు. నాలుగో విమానం ఫ్లైట్ 93ను ప్రయాణికులు తిరగబడటంతో పెన్సిల్వేనియాలోని ఖాళీ ప్రదేశంలో కూల్చివేశారు.ఉదయం 8.46 గంటలకు అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 11 ఉత్తర టవర్‌ను ఢీకొట్టింది. 9.03 గంటలకు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 175 దక్షిణ టవర్‌ను ఢీకొట్టింది. 9.37 గంటలకు అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 77 పెంటగాన్‌ను ఢీకొట్టింది. 10.03 గంటలకు ఫ్లైట్ 93 పెన్సిల్వేనియాలో కూలిపోయింది. కొద్దిసేపటికే ట్విన్ టవర్స్ రెండూ కుప్పకూలాయి.దాదాపు 3 వేల మంది బలి..9/11 దాడుల్లో 2,977 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో న్యూయార్క్‌లో 2,753 మంది, పెంటగాన్‌లో 184 మంది, ఫ్లైట్ 93లో 40 మంది ఉన్నారు. 90కుపైగా దేశాలకు చెందిన ప్రజలు బాధితుల్లో ఉన్నారు. ఈ దాడులకు బాధ్యులు ఆల్‌ఖైదాకు చెందిన 19 మంది హైజాకర్లు. వారంతా ఆల్‌ఖైదా శిక్షణ పొందినవారేనని ఎఫ్‌బీఐ దర్యాప్తులో తేలింది. ఈ దాడుల వెనుక ఆల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ఉన్నట్లు దర్యాప్తు నిర్ధారించింది. బిన్ లాడెన్ 2011 మే 2న పాకిస్థాన్‌లోని అబ్బొట్టాబాద్‌లో అమెరికా ప్రత్యేక దళాల ఆపరేషన్‌లో హతమయ్యాడు. ఇదీ చదవండి: పారిస్‌లోనూ ఇదెక్కడి వివక్ష! -
చక్కెర కేజీ రూ.140!
పండుగ సీజన్లో చక్కెర ధరల మంట ప్రజల్ని బెంబేలెత్తిస్తోంది. భారత్‌లోనూ కిలో పంచదార రూ.62.57కు చేరి.. గత నెలతో పోలిస్తే 27 శాతం అధికంగా ఉంది. ఇదే సమయంలో పొరుగున నేపాల్‌లో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. దసరా, తిహార్ పండుగలు సమీపిస్తుండటంతో డిమాండ్ పెరగడం, దిగుమతి వ్యయాలు అధికం కావడంతో కిలో పంచదార ధర ఏకంగా రూ.140కు చేరింది.కాఠ్మాండులోని సిగల్ ప్రాంతంలో పంచదార ధరలు భారీ స్థాయిలో పెరిగాయి. రెండు వారాల క్రితం ఇదే పంచదార రూ.115కే లభించింది. ఇటు భక్తపూర్‌లోని గట్టాఘర్లో కిలో ధర రూ.130గా ఉంది. ఇలా ఏరియాలను బట్టి.. కిలోకు రూ.20 నుంచి రూ.30 వరకు వ్యాపారులు పెంచేస్తున్నారు. నేపాల్ రిటైల్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పవిత్ర బజ్రాచార్య మాట్లాడుతూ.. హోల్‌సేల్ వ్యాపారులు నెల రోజుల్లో కిలో పంచదార ధరను రూ.125 వరకు పెంచారని తెలిపారు. దిగుమతి ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారని పేర్కొన్నారు. అయితే ధరల పెరుగుదలకు రిటైలర్లే కారణమనే వాదనను ఆయన ఖండించారు.సర్కారీ దుకాణాల్లో ఎంతంటే..మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థ సాల్ట్ ట్రేడింగ్ కార్పొరేషన్ (STC) దుకాణాల్లో మాత్రం కిలో పంచదార రూ.105కే విక్రయిస్తున్నారు. అయితే సరఫరాలో అంతరాయం కారణంగా ఒక్కో వినియోగదారుడికి విక్రయించే పరిమితిని ఆరు కిలోల నుంచి రెండు కిలోలకు తగ్గించారు. ప్రభుత్వ దుకాణాలు, బహిరంగ మార్కెట్ ధరల మధ్య భారీ వ్యత్యాసం ఉండటం చర్చనీయాంశంగా మారింది. పండుగల వేళ పంచదారకు డిమాండ్ పెరుగుతుందని తెలిసినా కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్లో పంచదార అందుబాటులో ఉన్నప్పటికీ అధిక ధరకు విక్రయించడం వినియోగదారులకు అన్యాయమని వ్యాపార సంఘాల ప్రతినిధులు అంటున్నారు.25 వేల టన్నుల దిగుమతికి అనుమతిధరలను అదుపులోకి తెచ్చేందుకు నేపాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సాల్ట్ ట్రేడింగ్ కార్పొరేషన్ 25 వేల టన్నుల పంచదారను కేవలం ఒక శాతం కస్టమ్స్ సుంకంతో దిగుమతి చేసుకునేందుకు కేబినెట్ అనుమతించింది. ఈ సరుకు చేరే వరకు దేశీయ చక్కెర కర్మాగారాల నుంచి సుమారు 15 వేల టన్నుల పంచదారను ఎస్టీసీ, ఫుడ్ మేనేజ్మెంట్ అండ్ ట్రేడింగ్ కంపెనీ ద్వారా విక్రయించాలని నిర్ణయించింది.అదే సమయంలో భారత్ నుంచి పంచదార దిగుమతి చేసుకునేందుకు STC చర్యలు ప్రారంభించింది. భారత్ సరఫరాకు సుముఖత వ్యక్తం చేయడంతో త్వరలో నేపాల్‌లో ధరలు తగ్గే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏటా 2.5 లక్షల టన్నుల అవసరంనేపాల్లో ఏడాదికి సుమారు 2.5 లక్షల టన్నుల పంచదార అవసరం కాగా.. దేశీయంగా గరిష్ఠంగా 1.9 లక్షల టన్నుల వరకు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ప్రస్తుతం దేశీయ చెరకు క్రషింగ్ సీజన్ ముగిసింది. తదుపరి సీజన్ డిసెంబరులో ప్రారంభం కానుంది. దీంతో అప్పటివరకు దిగుమతులపైనే నేపాల్ ఎక్కువగా ఆధారపడాల్సి ఉంది. ఇప్పటికే ఎస్టీసీ దేశీయ ఉత్పత్తిదారుల నుంచి సుమారు 600 టన్నుల పంచదార కొనుగోలు చేసింది. రవాణా మార్గాల్లో అంతరాయాల కారణంగా గతంలో సరఫరాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో పండుగల డిమాండ్ పెరగకముందే తగినంత నిల్వలు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.భారత్ సరఫరాపైనే ఆశలుమరోవైపు నేపాల్ పంచదార అవసరాల్లో భారత్ కీలకంగా మారింది. దేశీయ ఉత్పత్తి అవసరాలకు సరిపోకపోవడంతో దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే సరఫరాపైనే నేపాల్ మార్కెట్ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. ఇప్పటికే 2,500 టన్నుల పంచదార నేపాల్‌కు చేరే ప్రక్రియలో ఉండగా.. మరో 2,500 టన్నుల దిగుమతికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారత్‌లో ఉత్పత్తి, దేశీయ డిమాండ్, ఎగుమతి విధానాలు ఎలా ఉంటాయన్నదానిపై కూడా నేపాల్ పంచదార ధరలు ఆధారపడనున్నాయి. భారత్‌పైనా ధరల ఒత్తిడిమరోవైపు భారత్‌లోనూ పంచదార రంగం కీలక దశలో ఉంది. దేశీయ ఉత్పత్తి, ఎగుమతులు, పండుగల సీజన్లో పెరిగే డిమాండ్ నేపథ్యంలో సరఫరా–ధరలపై మార్కెట్ వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఇలాంటి సమయంలో నేపాల్ భారత్ నుంచి దిగుమతులపై ఆధారపడటం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్‌లో సరఫరా పరిస్థితి, ఎగుమతి విధానాలు నేపాల్‌లో పంచదార ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. పండుగల డిమాండ్ నేపథ్యంలో రెండు దేశాల్లోనూ పంచదార ధరల పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.ఇదీ చదవండి: ‘అదొక పనికిరానిది..’ ఇరాన్‌కు అమెరికా కౌంటర్ -
చైనా కండకావరం.. లైవ్‌లోనే ఏకిపారేశాడు
దక్షిణ చైనా సముద్ర వివాదం మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరుగుతున్న డిఫెన్స్ డైలాగ్‌కు ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి గిల్బెర్టో సీ. టియోడోరో హాజరయ్యారు. అయితే ఆయన మాట్లాడుతున్న టైంలో చైనా తరఫున ఓ నోట్ అందింది. ప్రసంగం మధ్యలో అందిన ఆ లేఖను టియోడోరో అక్కడే బహిరంగంగా చదివి వినిపించడంతో పాటు.. చైనా తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.టియోడోరో ప్రసంగిస్తుండగా తెల్లటి కోటు ధరించిన ఓ వ్యక్తి ఆయన వెనుక నుంచి వచ్చి టేబుల్‌పై ఓ కాగితాన్ని ఉంచాడు. సియోల్‌లోని చైనా రాయబార కార్యాలయానికి చెందిన మిలిటరీ అటాషే ఆ నోట్‌ను సిబ్బందికి అందించినట్లు సమావేశ నిర్వాహకులు తెలిపారు. అయితే అది టియోడోరో బృందం నుంచి వచ్చిన సందేశమని భావించిన సిబ్బంది.. ప్రసంగం మధ్యలోనే దాన్ని మంత్రికి అందించారు.నోట్ తీసుకున్న టియోడోరో.. ‘‘ఇది చైనా నుంచి వచ్చినదని అనుకుంటున్నాను. దీన్ని చదవనా?’’ అంటూ సభికులను ఉద్దేశించి అన్నారు. అనంతరం దానిలోని విషయాలను బహిరంగంగా చదివారు.‘అంతర్జాతీయ చట్టాన్ని అవమానించారు’దక్షిణ చైనా సముద్రంపై 2016లో జరిగిన మధ్యవర్తిత్వ తీర్పుపై చైనా తన వైఖరిని నోట్లో స్పష్టం చేసింది. ఆ తీర్పు అంతర్జాతీయ చట్టంలోని ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించిందని పేర్కొంది. అయితే ఈ వాదనను టియోడోరో తీవ్రంగా తప్పుబట్టారు. తన ప్రసంగం మధ్యలో ఇలా నోట్ పంపడం దక్షిణ కొరియాను, ఈ కార్యక్రమ నిర్వాహకులను, అక్కడి ప్రతినిధులను అవమానించడమేనని అన్నారు. అంతర్జాతీయ చట్టానికి సంబంధించిన నిబంధనలను చైనా గౌరవించడం లేదని విమర్శించారు.ఇది బెదిరించడమే..చైనా చర్యను.. బెదిరించడం, వేధించడమే అవుతుంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నోట్‌ను చైనా ఎంత నిరాశలో ఉందో గుర్తుచేసే జ్ఞాపికగా దాచుకుంటానని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నోట్‌ను అందించిన వ్యక్తిని ఉద్దేశించి కూడా టియోడోరో వ్యంగ్యంగా మాట్లాడారు. అతను తన దేశానికి గొప్ప సేవ చేశాడంటూ వ్యాఖ్యానించారు.PHILIPPINES SHREDS CHINA OVER SOUTH CHINA SEA RULING IN FRONT OF THE WORLDYOU LOST : PHILIPPINE DEFENCE CHIEF PUBLICLY REBUKES CHINESE MILITARY OFFICIALA dramatic confrontation unfolded at a defence forum in seoul after a chinese military attaché handed a note to philippine… pic.twitter.com/QiwwlluQVl— Raj anand (@Rajanand7654) September 9, 2026దక్షిణ చైనా సముద్రంపై వివాదంఫిలిప్పీన్స్, చైనా మధ్య దక్షిణ చైనా సముద్రంపై చాలాకాలంగా వివాదం కొనసాగుతోంది. 2016లో ఫిలిప్పీన్స్ దాఖలు చేసిన కేసులో మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్.. దక్షిణ చైనా సముద్రంలో చైనా విస్తృత చారిత్రక హక్కుల వాదనకు చట్టపరమైన ఆధారం లేదని తీర్పునిచ్చింది. ముఖ్యంగా ఫిలిప్పీన్స్ ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ)లోని వనరులపై చైనాకు హక్కు లేదని పేర్కొంది.అయితే ఈ తీర్పును చైనా తిరస్కరిస్తూ.. ఆ ట్రైబ్యునల్‌కు ఈ కేసుపై విచారణ జరిపే అధికారమే లేదని చెబుతోంది. మరోవైపు చైనా తమ సముద్ర హక్కులను ఉల్లంఘిస్తోందని ఫిలిప్పీన్స్ తరచూ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా డిఫెన్స్ ఫోరంలో నోట్ ఘటన ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరోసారి తెరపైకి తెచ్చింది.ఇదీ చదవండి: ఎడారికి సముద్రపు నీరు!! ఎలా వచ్చిందో తెలుసా? -
హర్ముజ్‌లో ఇరాన్ ఎదురుదాడి.. సంచలన ప్రకటన
పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి.హర్ముజ్ జలసంధి ప్రవేశద్వారం వద్ద అమెరికాకు చెందిన అత్యాధునిక మానవరహిత జలాంతర్గామిని పట్టుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అదే సమయంలో అమెరికా దళాలు ఐదు ఇరానియన్ చమురు ట్యాంకర్లను ధ్వంసం చేసినట్లు ప్రకటించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీసీ) అధికారిక మీడియా ‘సెపాహ్ న్యూస్’ ప్రకారం.. సంక్లిష్టమైన నిఘా ఆపరేషన్‌లో అమెరికాకు చెందిన డైవ్ ఎల్డీ(Dive-LD) మానవరహిత అండర్‌వాటర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యాధునిక అండర్‌వాటర్ టెక్నాలజీ కలిగిన వాహనంగా దీన్ని ఇరాన్ అభివర్ణించింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. మరోవైపుహర్ముజ్ జలసంధిపై ఓ అమెరికా డ్రోన్( MQ-9 Reaper)ను కూల్చివేసినట్లు కూడా ఐఆర్జీసీ ప్రకటించింది.అమెరికా రియాక్షన్ ఇదేఇరాన్ ప్రకటనపై అమెరికా స్పందించింది. తమ మానవరహిత అండర్‌వాటర్ వాహనం ఒకటి అంతకుముందు రోజు పనిచేయకుండా నిలిచిపోయిందని అమెరికా సైన్యం తెలిపింది. అయితే ఇరాన్ స్వాధీనం చేసుకున్నది అదే వాహనమా అనేది మాత్రం స్పష్టం చేయలేదు. ఆ వాహనం పాత మోడల్ అని.. అందులో సున్నితమైన సమాచారం, రహస్య సోనార్ లేదంటే రాడార్ పరికరాలు లేవని పెంటగాన్ వెల్లడించింది.ఐదు చమురు ట్యాంకర్లపై అమెరికా దాడిఇదే సమయంలో ఇరాన్‌పై అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం.. తమ యుద్ధనౌకపై ఇరాన్ క్షిపణి దాడులకు ప్రతిస్పందనగా ఐదు ఇరానియన్ ముడిచమురు ట్యాంకర్లను ధ్వంసం చేశారు. గత రెండు రోజుల్లో అమెరికా నౌకపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో రెండుసార్లు దాడికి ప్రయత్నించిందని సెంట్కామ్ పేర్కొంది.ఇరాన్ విమానయాన సంస్థలపై ఆంక్షలుమరోవైపు అమెరికా ఆర్థిక శాఖ ఇరాన్‌కు చెందిన మరో 27 విమానయాన సంస్థలను ప్రత్యేక ఆంక్షల జాబితాలో చేర్చింది. ఇరాన్ పాలనకు, ఐఆర్‌జీసీకి ఆయుధాల రవాణా, సిబ్బంది తరలింపులో వాణిజ్య విమానయాన సంస్థలు సహకరిస్తున్నాయని అమెరికా ఆరోపించింది.‘వాళ్లు పశ్చాత్తాపపడే వరకు..’ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మాత్రం.. యుద్ధంలో విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. యుద్ధాన్ని ఇరాన్ ఎప్పుడూ కోరుకోలేదని.. అయితే దాడులను ఎదుర్కొనేందుకు తమ ప్రతిఘటన కొనసాగుతుందని తెలిపారు. ఆక్రమణదారులు పూర్తిగా పశ్చాత్తాపపడే వరకు బలంగా పోరాడతామని పేర్కొన్నారు.మళ్లీ ముదిరిన అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలుఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులతో ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధానికి ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడులు చేసింది. అనంతరంహర్ముజ్ జలసంధిపై తన పట్టును మరింత బిగించింది. జూన్ 18న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా, ఇరాన్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ.. తాజాగా చోటుచేసుకున్న పరిణామాలతో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి.ఇదీ చదవండి: ఇరాన్‌కు దిమ్మతిరిగే షాక్.. భారీ దెబ్బకొట్టిన అమెరికా -
మొజ్తబా ఖమేనీపై సంచలన ఆరోపణలు
పశ్చిమాసియా యుద్ధంలో తండ్రి అయతొల్లా ఖమేనీ మరణాంతరం.. ఊహించని రీతిలో ఇరాన్‌కు సుప్రీం బాధ్యతలు చేపట్టాడు మొజ్తబా ఖమేనీ. అయితే యుద్ధంలో గాయపడిన ఆయన.. దాదాపు ఆరు నెలల నుంచి ఆయన అజ్ఞాతంలోనే ఉంటూ పాలనలో కీలక భాగస్వామ్యం వహిస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా ఆయన మీద సంచలన ఆరోపణలు తెర మీదకు వచ్చాయి.ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీకి లండన్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో రెండు విలాసవంతమైన ఫ్లాట్లు ఉన్నాయంటూ బ్రిటన్ మీడియాలో వచ్చిన కథనాలు తీవ్ర చర్చకు దారితీశాయి. బ్రిటన్‌లోని ‘ది సండే టైమ్స్’ సహా పలు మీడియా సంస్థల కథనాల ప్రకారం.. లండన్‌లోని కెన్సింగ్టన్లో పాలెస్ గ్రీన్ ప్రాంతంలో ఉన్న ఓ భవనంలో రెండు విలాసవంతమైన అపార్ట్మెంట్లు మొజ్తబా ఖమేనీకి చెందినవిగా పేర్కొన్నారు. ఆ భవనం ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి అత్యంత సమీపంలోనే ఉండటం ఈ వ్యవహారంపై మరింత ఆసక్తిని పెంచింది.అయితే ఈ ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఖమేనీకి ఇరాన్‌లోనే కాదు.. విదేశాల్లోనూ ఎలాంటి ఆస్తులు లేవని ఇరాన్ రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.‘ఆరోపణలు పూర్తిగా నిరాధారం’బ్రిటన్ మీడియా సంస్థలు చేసిన ఆరోపణలను ఇరాన్ రాయబార కార్యాలయం ‘పూర్తిగా నిరాధారం’గా అభివర్ణించింది. మొజ్తబా ఖమేనీ తన తండ్రిలాగే ఎలాంటి ఆస్తులు కలిగి లేరని పేర్కొంది. ఆయన నిరాడంబరమైన జీవనశైలిని ఇరాన్ ప్రజలు బాగా తెలుసని తెలిపింది. ఖమేనీకి దేశంలోగానీ.. విదేశాల్లోగానీ ఆస్తులు ఉన్నాయన్న ప్రచారం ఆయన జీవితం, వ్యక్తిత్వంపై తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించేందుకేనని రాయబార కార్యాలయం ఆరోపించింది.లండన్‌లోని కెన్సింగ్టన్లో పాలెస్ గ్రీన్ ప్రాంతంలో ఉన్న ఓ భవనంలో రెండు విలాసవంతమైన అపార్ట్మెంట్లు.. ఆరో, ఏడో అంతస్తుల్లో ఉన్నాయని, వాటిని 2014, 2016 సంవత్సరాల్లో మధ్యవర్తుల ద్వారా కొనుగోలు చేసినట్లు బ్రిటన్ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఆస్తుల యాజమాన్యం ఖమేనీతో ముడిపడి ఉందన్న విషయాన్ని ఇటీవలే గుర్తించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి.అరెస్టులతో ముడిపెట్టి ప్రచారంలండన్లో యూదు సమాజానికి సంబంధించిన వ్యక్తులు, ప్రాంతాలపై నిఘా పెట్టినట్లు అనుమానిస్తూ నలుగురు ఇరానియన్, బ్రిటిష్-ఇరానియన్ వ్యక్తులను శుక్రవారం అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ ఆస్తుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాన్ని గమనించే అవకాశం ఉన్న ప్రాంతంలో ఈ ఫ్లాట్లు ఉండటంపై కూడా బ్రిటన్ మీడియాలో చర్చ జరిగింది. రాయబార కార్యాలయానికి 50 మీటర్లలోపే ఈ భవనం ఉందని కొన్ని కథనాలు పేర్కొన్నాయి. అయితే బ్రిటన్ మీడియా కథనాలకు ఇరాన్ ఇచ్చిన సమాధానం మాత్రం స్పష్టంగా ఉంది. మొజ్తబా ఖమేనీకి ఎక్కడా ఆస్తులు లేవని.. ఆయన నిరాడంబర జీవితం గడుపుతున్నారని రాయబార కార్యాలయం చెబుతోంది. ఇదీ చదవండి: అలా నెతన్యాహు ఇరుకున్నారా? -
నీటి కొరతతో సౌదీ అరేబియా ఏం చేసిందో తెలుసా?
ఎటు చూసినా ఎడారి.. మండే ఎండలు.. ఏడాదికి 100 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం.. శాశ్వత నదులు కూడా లేవు. అయినా సౌదీ అరేబియాలో 3.7 కోట్లకుపైగా జనాభా రోజువారీ అవసరాలకు నీటిని పొందుతోంది. మరి చుక్క నీటి కోసం కూడా ప్రకృతిపై ఆధారపడలేని ఈ దేశం.. కోట్లాది మందికి నీటిని ఎలా అందిస్తోంది? ఎడారి మధ్యలో ఇంత భారీ జలవ్యవస్థను ఎలా నిర్మించింది?సౌదీ అరేబియాలోని తీర ప్రాంతాల్లో భారీ డీశాలినేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. సముద్రం నుంచి నీటిని తీసుకొచ్చి, అందులోని ఉప్పు, మలినాలను తొలగించి మంచినీటిగా మారుస్తారు. అనంతరం ఈ నీటిని భారీ పైప్లైన్ల ద్వారా వందల కిలోమీటర్ల దూరంలోని నగరాలు, జనావాసాలకు తరలిస్తారు. అంటే.. సహజంగా ప్రవహించే నదులు లేకపోయినా, విస్తారమైన ప్రాంతాలకు నీటిని చేరవేసే ఓ ‘కృత్రిమ నదీ వ్యవస్థ’ను నిర్మించుకున్నట్టే. మరి సముద్రపు ఉప్పునీరు అసలు తాగునీటిగా ఎలా మారుతుంది? ఎడారి, కొండలు, రాళ్లను దాటుకుంటూ ఈ నీరు వందల కిలోమీటర్లు ఎలా ప్రయాణిస్తుంది? ఇందుకోసం సౌదీ నిర్మించిన భారీ పైప్లైన్లు, అత్యాధునిక శుద్ధి వ్యవస్థ ఎలా పనిచేస్తాయన్నది ఆసక్తికరం.భారీ పైప్లైన్ల నిర్మాణంఈ నీటి రవాణాకు ఉపయోగించే పైప్లైన్లు సాధారణమైనవి కావు. ఎడారి వేడి, ఇసుక తుపాన్లు, నేలలోని ఒత్తిడిని తట్టుకునేలా హై-స్ట్రెంగ్త్ కార్బన్ స్టీల్‌తో వీటిని తయారు చేస్తారు. దాదాపు 1.8 మీటర్ల వ్యాసంతో ఉండే భారీ పైపులను 12 నుంచి 18 మీటర్ల పొడవైన సెక్షన్లుగా తయారు చేసి, ప్రత్యేక ట్రక్కుల్లో ఎడారి ప్రాంతాలకు తరలిస్తారు. పైపులకు తుప్పు పట్టకుండా ప్రత్యేక కోటింగ్ వేసి, అల్ట్రాసోనిక్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే వినియోగిస్తారు.ఇసుక.. రాళ్లు.. కొండలు దాటుతూతీర ప్రాంతం నుంచి అంతర్భాగాలకు పైప్‌లైన్ వేయడం మరో భారీ సవాలు. ముందుగా GPS, ఆధునిక సర్వే పరికరాలతో మార్గాన్ని నిర్ణయిస్తారు. కదిలే ఇసుక దిబ్బలు, అస్థిరమైన భూభాగాలను వీలైనంత వరకు తప్పించుకుంటారు. రాళ్లు, కొండలు ఎదురైతే నియంత్రిత పేలుళ్లతో వాటిని తొలగించి లోతైన కాలువలు తవ్వుతారు. అందులో పైపులను అమర్చి.. ఒక్కో సెక్షన్‌ను మరొకదానితో అనుసంధానిస్తూ వేల కిలోమీటర్ల నెట్‌వర్క్‌ను నిర్మించారు.అసలు నీరు ఎక్కడి నుంచి?ఇదంతా ఒక ఎత్తయితే.. అసలు నీటి వనరు సముద్రమే. తీరానికి వందల మీటర్ల దూరంలో భారీ ఇన్‌టేక్ పైపులను ఏర్పాటు చేసి సముద్రపు నీటిని ప్లాంట్లలోకి తీసుకొస్తారు. కొన్ని పైపులు రోజుకు కోట్ల లీటర్ల నీటిని తరలించే సామర్థ్యం కలిగి ఉంటాయి. చేపలు, పీతలు, జెల్లీ ఫిష్ వంటి సముద్ర జీవులు లోపలికి రాకుండా ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేస్తారు.ఉప్పునీరు.. మంచినీరుగా ఎలా?మొదట సముద్రపు నీటిని ఇసుక ఫిల్టర్ల ద్వారా శుద్ధి చేస్తారు. ఫెరిక్ క్లోరైడ్, సోడియం హైపోక్లోరైట్ వంటి రసాయనాలతో మలినాలను ఒకచోట చేర్చి తొలగిస్తారు. ఆ తర్వాత 1–5 మైక్రాన్ల పరిమాణంలో ఉన్న సూక్ష్మ కణాలను కూడా పట్టుకునే కార్ట్రిడ్జ్ ఫిల్టర్ల ద్వారా నీటిని పంపిస్తారు.అసలు కీలక ప్రక్రియ రివర్స్ ఆస్మాసిస్ (RO). దాదాపు 60 బార్ ఒత్తిడితో సముద్రపు నీటిని ప్రత్యేక మెంబ్రేన్‌ల గుండా పంపుతారు. నీటి అణువులు మాత్రమే మెంబ్రేన్‌ను దాటుతుండగా.. ఉప్పు, ఇతర మలినాలు వెనుకే మిగిలిపోతాయి. అవసరమైతే మరోసారి RO ప్రక్రియ నిర్వహించి మరింత శుద్ధి చేస్తారు.శుద్ధి చేశాక మళ్లీ ఖనిజాలే!అయితే పూర్తిగా శుద్ధి చేసిన నీటిలో సహజంగా ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో నీటికి అవసరమైన ఖనిజాలను మళ్లీ కలుపుతారు. పీహెచ్ స్థాయిని కూడా సరిచేసి.. తాగేందుకు అనువుగా మారుస్తారు.ఖర్చు భారీ.. అవసరం తప్పనిసరిఇంత భారీ నీటి వ్యవస్థను నిర్మించడం అంత చౌక కాదు. ఒక్క కిలోమీటర్ పైప్‌లైన్ నిర్మాణానికే మిలియన్ల డాలర్లు ఖర్చవుతాయి. భారీ డీశాలినేషన్ ప్లాంట్లకు వందల మిలియన్ల డాలర్ల పెట్టుబడులు అవసరం. నీటి ఉత్పత్తి ఖర్చు కూడా సాంకేతికత, విద్యుత్ ధరలు, ప్లాంట్ సామర్థ్యాన్ని బట్టి గణనీయంగా ఉంటుంది. అయినా సౌదీకి మరో మార్గం పెద్దగా లేదు. నదులు లేని దేశం.. తక్కువ వర్షపాతం.. విస్తారమైన ఎడారి. అందుకే సముద్రాన్నే నీటి వనరుగా మార్చుకుని.. వందల కిలోమీటర్ల పైప్లైన్లతో ఆ నీటిని ఎడారి మధ్యనున్న నగరాలకు చేరుస్తోంది. సహజంగా లేని నదులకు బదులుగా ఇంజినీరింగ్‌తో కృత్రిమ జలధారను సృష్టించుకుంది.ఇదీ చదవండి: ఈఫిల్ టవర్ మూసివేతకు కారణం ఇదే! -
యూకేలో అల్లకల్లోలం.. వెయ్యికి పైగా విమానాలు రద్దు!
బ్రిటన్ గగనతలంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం దేశవ్యాప్తంగా విమాన రాకపోకలను తీవ్రంగా దెబ్బతీసింది. వెయ్యికి పైగా విమానాలు రద్దు కాగా.. మరెన్నో విమానాలు గంటల తరబడి ఆలస్యమయ్యాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు విమానాల్లోనే, విమానాశ్రయాల టెర్మినల్స్‌లోనూ గంటలపాటు పడిగాపులు కాయాల్సి వచ్చింది. విమానాలను రద్దు చేయడం, దారి మళ్లించడం, షెడ్యూళ్లు మార్చడంతో బ్రిటన్ మాత్రమే కాకుండా యూరప్‌లోని పలు ప్రాంతాల్లోనూ విమాన సేవలు అస్తవ్యస్తమయ్యాయి. బ్రిటన్ గగనతల నియంత్రణ సేవలను నిర్వహించే నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ (NATS)కు చెందిన ఫ్లైట్ డేటా ప్రాసెసింగ్ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తడమే ఈ సంక్షోభానికి కారణం. లండన్‌లోని హీత్రూ, గాట్విక్, స్టాన్స్టెడ్, సిటీ విమానాశ్రయాలతోపాటు మాంచెస్టర్, బర్మింగ్‌హామ్, ఎడిన్బర్గ్ తదితర ప్రధాన ఎయిర్‌పోర్టులపై దీని ప్రభావం పడింది. ఒక దశలో విమానాలను ఇతర యూరప్ విమానాశ్రయాలకు మళ్లించాల్సి వచ్చింది. విమానాలు, సిబ్బంది తమ నిర్ణీత ప్రాంతాల్లో లేకపోవడంతో.. సాంకేతిక సమస్య పరిష్కారమైన తర్వాత కూడా దాని ప్రభావం వెంటనే తొలగిపోలేదు.గంటల తరబడి నిరీక్షణ..సాంకేతిక లోపం కారణంగా ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. రన్‌వేలపై విమానాల్లోనే గంటల తరబడి కూర్చోవాల్సి రావడంతో పలువురు తీవ్ర అసహనానికి గురయ్యారు. కొన్ని విమానాలను చివరకు రద్దు చేయడంతో ప్రయాణికులు టెర్మినల్స్‌కు చేరుకున్నారు. అక్కడ కూడా భారీ రద్దీ, బ్యాగేజీ సమస్యలు, సమాచార లోపంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. బ్రిటిష్ ఎయిర్వేస్ 100కు పైగా విమానాలను రద్దు లేదా దారి మళ్లించగా.. ర్యాన్ఎయిర్ 65 వేల మందికి పైగా ప్రయాణికులపై ప్రభావం పడినట్లు వెల్లడించింది. ఈజీజెట్ సహా పలు విమానయాన సంస్థల సర్వీసులపైనా అంతరాయం ఏర్పడింది.సమస్య పరిష్కారం కానీ..సాయంత్రానికి సాంకేతిక లోపాన్ని పరిష్కరించినట్లు నాట్స్ ప్రకటించింది. వ్యవస్థ సాధారణ స్థితికి వస్తోందని, నిలిచిపోయిన విమానాల భారీ బ్యాక్‌లాగ్‌ను క్లియర్ చేస్తున్నామని వెల్లడించింది. అయితే అంతరాయం ప్రభావం వెంటనే తొలగిపోలేదు. హీత్రూ విమానాశ్రయంలో ఆ రోజు రాత్రి రాకలను నిలిపివేసి.. కేవలం బయలుదేరే విమానాలను మాత్రమే నడిపారు. భారత్-యూకే సర్వీసులపైనా ప్రభావంఈ సాంకేతిక సమస్యతో భారత్ నుంచి యూకేకు, యూకే నుంచి భారత్‌కు నడిచే విమాన సర్వీసులపైనా ప్రభావం పడింది. విమానాలు, సిబ్బంది వేరే ప్రాంతాల్లో చిక్కుకోవడంతో తదుపరి సర్వీసుల షెడ్యూళ్లలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ విమాన స్థితిని సంబంధిత ఎయిర్‌లైన్‌తో నిర్ధారించుకోవాలని సూచించారు. వరుస వైఫల్యాలతో విమర్శలునాట్స్లో ఇలాంటి సమస్యలు పునరావృతమవుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2023లో ఫ్లైట్-ప్లాన్ ప్రాసెసింగ్‌లో లోపంతో భారీగా విమానాలు నిలిచిపోయాయి. ఆ ఘటనలో ఎయిర్‌లైన్స్‌కు భారీగా రీఫండ్లు, పరిహారం చెల్లించాల్సి వచ్చింది. తాజాగా మరోసారి సాంకేతిక వైఫల్యం తలెత్తడంతో బ్రిటన్ విమానయాన మౌలిక వసతుల విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తాయి. ఇటు బ్రిటన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఘటనపై పూర్తి నివేదిక కోరింది. NATS చీఫ్ మార్టిన్ రోల్ఫ్ మాత్రం అసలు సమస్యకు ఖచ్చితమైన కారణం ఇంకా తమకు తెలియలేదని తెలిపారు.ఇదీ చదవండి: ముంచేసిన మరో విపత్తు.. జలమయంగా జపాన్ -
భారీగా జీతం పెంచుకున్న సింగపూర్ ప్రధాని
ప్రపంచంలోనే అత్యధిక వేతనం అందుకుంటున్న ప్రభుత్వాధినేత ఎవరో తెలుసా?. చాలా దేశాలు అధికారికంగా ఆ విషయం బయటకు చెబుతున్నా.. కొన్ని దేశాల్లో మాత్రం అలవెన్స్, ఎగస్ట్రాల రూపంలో అడ్డగోలుగా అందుకుంటున్నారు. ఇక చైనా, ఉత్తర కొరియా, రష్యా లాంటి కొన్ని దేశాధినేతల జీతాలపై క్లారిటీ అంటూ లేకుండా పోయింది. అయితే ఈ విషయంలో ఇప్పుడు సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ సంచలనం సృష్టించారు. ప్రపంచంలోనే అత్యధిక జీతం అందుకుంటున్న ప్రధానిగా ఆయన రికార్డు నెలకొల్పారు.తాజాగా.. సింగపూర్ పార్లమెంట్లో చట్ట సభ్యుల జీతాల సవరణ జరిగింది. అందులో ప్రధాని లారెన్స్ వాంగ్(Lawrence Wong) వార్షిక వేతన ప్యాకేజీని ఏకంగా 64 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన జీతం 3.6 మిలియన్ డాలర్లకు చేరనుంది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.25 కోట్లకు పైగా. ఈ కొత్త వేతన విధానం అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానుంది.ఒకేసారి అంతా..!!లారెన్స్ వాంగ్ ప్రస్తుత వార్షిక వేతన ప్యాకేజీ 2.2 మిలియన్ సింగపూర్ డాలర్లు కాగా.. కొత్త విధానంతో అది 3.6 మిలియన్ డాలర్లకు పెరగబోతోంది. అంటే.. అదనంగా 1.4 మిలియన్ సింగపూర్ డాలర్ల అదనపు ఆదాయం. సింగపూర్ రాజకీయ నాయకులకు ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధిక వేతనాలు ఉన్నాయి. అధిక జీతాల వల్ల ప్రైవేట్ రంగంలోని ప్రతిభావంతులను రాజకీయాల్లోకి ఆకర్షించడంతోపాటు అవినీతికి దూరంగా పాలన సాగించేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.మరోవైపు సాధారణ పౌరుల ఆదాయంతో పోలిస్తే రాజకీయ నాయకుల వేతనాలు భారీగా ఉండటంపై దేశంలో విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఈ పెంపు మొత్తాన్ని తన పదవీకాలంలో వచ్చే ఐదేళ్ల పాటు మంచి కార్యక్రమాలకు విరాళంగా ఇస్తానని వాంగ్ ప్రకటించారు.మంత్రుల జీతాలూ పెంపుదాదాపు 15 ఏళ్ల తర్వాత సింగపూర్ రాజకీయ వేతనాల వ్యవస్థలో ఈ మార్పులు చేస్తున్నారు. పార్లమెంట్ సభ్యుల నెలవారీ అలవెన్స్‌ను కూడా 13,750 సింగపూర్ డాలర్ల నుంచి 18,500 డాలర్లకు పెంచనున్నారు. ప్రధాని మాత్రమే కాకుండా ఇతర రాజకీయ పదవుల వేతనాల్లోనూ మార్పులు చేయనున్నారు. డిప్యూటీ ప్రధాని బెంచ్‌మార్క్ వార్షిక వేతనం 1.87 మిలియన్ సింగపూర్ డాలర్ల నుంచి 3.06 మిలియన్ డాలర్లకు పెరగనుంది. మంత్రుల వేతనాలు వారి హోదా, బాధ్యతలను బట్టి 1.80 మిలియన్ నుంచి 2.88 మిలియన్ సింగపూర్ డాలర్ల వరకు ఉండేలా కొత్త బెంచ్‌మార్క్‌ను నిర్ణయించారు.అయితే మంత్రులందరికీ వెంటనే కొత్త బెంచ్‌మార్క్ వేతనం అందదు. ప్రస్తుత పదవీదారులకు అక్టోబర్ 15 నుంచి గరిష్ఠంగా 9 శాతం వరకు ఒకేసారి పెంపు ఇవ్వనున్నారు. ఆ తర్వాత వేతన మార్పులు వ్యక్తిగత పనితీరు, బాధ్యతల ఆధారంగా ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.ప్రపంచంలో అత్యధిక వేతనాలు! వీళ్లే..అంతర్జాతీయ రాజకీయ నేతల వేతనాలను పోల్చే (PoliticalSalaries) డేటా ప్రకారం, 2025లో టాప్-10లో ప్రధానంగా సింగపూర్, స్విట్జర్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ తదితర దేశాల నేతలు ఉన్నారు. ఈ జాబితాలో సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ మొదటి స్థానంలో ఉన్నారు.1. లారెన్స్ వాంగ్ – సింగపూర్ ప్రధాని2. కరీన్ కెల్లర్-సట్టర్ – స్విట్జర్లాండ్ అధ్యక్షురాలు3. డొనాల్డ్ ట్రంప్ – అమెరికా అధ్యక్షుడు4. ఫ్రెడ్రిక్ మెర్జ్ – జర్మనీ ఛాన్సలర్5. ఆంటోనీ అల్బనీస్ – ఆస్ట్రేలియా ప్రధాని6. క్రిస్టియన్ స్టాకర్ – ఆస్ట్రియా ఛాన్సలర్7. బార్ట్ డి వెవర్ – బెల్జియం ప్రధాని8. క్రిస్టోఫర్ లక్సన్ – న్యూజిలాండ్ ప్రధాని9. మార్క్ కార్నీ – కెనడా ప్రధాని10. లూక్ ఫ్రైడెన్ – లక్సెంబర్గ్ ప్రధానిమరి మోదీ స్థానం ఎంత?ప్రధాని నరేంద్ర మోదీ టాప్-10లో లేరు. ఆయన అధికారిక వార్షిక వేతనం అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే చాలా తక్కువ. సుమారు అమెరికా 30 వేల డాలర్ల పరిధిలో ఉన్నట్లు గత అంతర్జాతీయ వేతనాల డేటాలో నమోదైంది. అయితే కేంద్ర ప్రభుత్వ వివరాల ప్రకారం జీతం, నియోజకవర్గం, విధి నిర్వహణకు సంబంధించిన రోజువారీ భత్యాలను కలిపి చూస్తే మోదీ వార్షిక మొత్తం సుమారు రూ.25-26 లక్షల పరిధిలో ఉంటుంది.ఇదీ చదవండి: సీఎం గొంతుతో మిమిక్రీ చేసి భారీ కుంభకోణం! -
ఈఫిల్ టవర్: హిందూ సంస్థ పర్యటనలో ‘మహిళా వివక్ష’!
ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ వద్ద సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిందూ సంస్థ బాప్స్ ప్రతినిధుల పర్యటన సందర్భంగా మహిళా సిబ్బందిని విధుల నుంచి తప్పించి, వారి స్థానంలో పురుష ఉద్యోగులను నియమించారన్న ఆరోపణలు వివాదానికి దారితీశాయి. దీంతో ఉద్యోగులు నిరసనకు దిగడంతో ఈఫిల్ టవర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.శనివారం సుమారు 100 మంది సభ్యులతో కూడిన బోచాసన్వాసీ అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థ (BAPS) బృందం ఈఫిల్ టవర్‌ను సందర్శించింది. బృందం వెళ్లే సమయంలో మహిళా ఉద్యోగులు కనిపించకుండా పక్కకు తప్పుకోవాలని, వారి స్థానాల్లో పురుష సిబ్బంది ఉండాలని ఆదేశించినట్లు యూనియన్ ప్రతినిధులు ఆరోపించారు. దీనిపై ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.ఈ ఘటనపై ఈఫిల్ టవర్ నిర్వహణ సంస్థ సెటె(SETE) కూడా స్పందించింది. పర్యటన నిర్వాహకుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు అలా స్పందించామని, అసలు అలాంటి షరతులను అంగీకరించాల్సింది కాదని సంస్థ అంగీకరించింది. ఉద్యోగులకు యాజమాన్యం క్షమాపణలు చెప్పినట్లు యూనియన్ తెలిపింది.ఈ వ్యవహారంపై పారిస్ మేయర్ ఇమ్మాన్యుయేల్ గ్రెగోయిర్ విచారణకు ఆదేశించారు. మహిళలు, పురుషులు ఎలాంటి వివక్ష లేకుండా పనిచేసే హక్కు కలిగి ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీ అధ్యక్షురాలు యాయెల్ బ్రాన్-పివే కూడా ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ.. విదేశీ సందర్శకుల అభ్యర్థనల కోసం మహిళలను పక్కకు తప్పించడం అంగీకారయోగ్యం కాదని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, పారిస్ శివార్లలో బాప్స్ తొలి భారీ హిందూ దేవాలయాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ప్రసంగించారు. భారత్, ఫ్రాన్స్ మధ్య సాంస్కృతిక సంబంధాలను ఈ ఆలయం మరింత బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. తనకు వీలు కుదిరినప్పుడు తప్పకుండా ఆ ఆలయం సందర్శిస్తానని మోదీ చెప్పారు.ఇదీ చదవండి: ‘భయం’పై నిర్భయ ప్రయోగం -
కెనడాతో ట్రంప్ ట్రేడ్ వార్‌లో మరో సంచలనం
అమెరికా–కెనడా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదురుతోంది. కెనడాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ జెట్ తయారీ సంస్థ బాంబార్డియర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. అమెరికా మార్కెట్లో విమానాలు విక్రయించాలంటే వాటిని అమెరికాలోనే తయారు చేయాలని.. లేదంటే అమెరికాలో ఆ సంస్థ జెట్ల అమ్మకాలను అనుమతించబోమని స్పష్టం చేశారు.తాజాగా ‘ట్రూత్ సోషల్’లో డొనాల్డ్ ట్రంప్ చేసిన పోస్ట్ సారాంశం.. “అమెరికాలో ఇక బాంబార్డియర్ విక్రయాలు ఉండవు. అమెరికా మార్కెట్లో కొనసాగాలంటే ‘ఇక్కడే తయారు చేయాలి’ అని అన్నారు. అమెరికాను ‘పిగ్గీ బ్యాంక్’గా ఉపయోగించుకోవద్దంటూ బాంబార్డియర్‌పై విమర్శలు చేశారు. సంస్థ ఉత్పత్తుల నాణ్యతపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు.కెనడా ప్రతీకార సుంకాలుఅమెరికా విధిస్తున్న సుంకాలకు ప్రతీకారంగా కెనడా మంగళవారం(నేటి) నుంచి కొత్త టారిఫ్‌లను అమలు చేయనుంది. అమెరికా నుంచి దిగుమతయ్యే వందలాది ఉత్పత్తులపై 50 శాతం వరకు సుంకాలు విధించనుంది. అల్యూమినియం ఫాయిల్, రెయిన్కోట్లు, చీజ్ తదితర ఉత్పత్తులు వీటి పరిధిలోకి రానున్నాయి.మొత్తం సుమారు 20 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై ఈ సుంకాలు పడనున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి అవి అమల్లోకి రానున్నాయి. తాజా చర్యతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న ఇరుదేశాల వాణిజ్య సంబంధాలు మరింత దెబ్బతినే అవకాశం ఉంది.అయితే.. కెనడా ప్రతీకార సుంకాలపై ట్రంప్ తీవ్రంగా స్పందిస్తూ.. అమెరికా కూడా మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కెనడాలో తయారయ్యే కార్లు, ఆటో విడిభాగాలపై ప్రస్తుతం ఉన్న 25 శాతం సుంకాన్ని 50 శాతానికి పెంచుతామని గత నెలలోనే ప్రకటించారు. ఇది జనవరి నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు.“మనకు కెనడా అవసరం లేదు.. వారికి మనమే అవసరం” అంటూ ట్రంప్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతకు అద్దం పడుతున్నాయి.అమెరికాలో బాంబార్డియర్‌కు భారీ వ్యాపారంట్రంప్ తాజా హెచ్చరిక బాంబార్డియర్‌కు కీలక పరిణామమే అయినా.. ఆ సంస్థకు అమెరికాతో బలమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయి. మాంట్రియల్ కేంద్రంగా పనిచేసే బాంబార్డియర్‌కు అమెరికాలో సుమారు 3,500 మంది ఉద్యోగులు, దాదాపు 2,800 మంది అమెరికా సరఫరాదారులు ఉన్నారు. అమెరికాలోనే పలు ఫ్యాక్టరీలు, సర్వీస్ సెంటర్లను నిర్వహిస్తున్న ఈ సంస్థ.. మరో సర్వీస్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తోంది. కంపెనీ తయారు చేసే ఫ్లాగ్షిప్ గ్లోబల్ 8000 బిజినెస్ జెట్ రెక్కలను టెక్సాస్‌లో తయారు చేస్తోంది. రక్షణ విభాగానికి చెందిన కార్యకలాపాల కోసం కాన్సాస్‌లో ప్రత్యేక కేంద్రం కూడా ఉంది.బాంబార్డియర్ కస్టమర్లు నిర్వహిస్తున్న సుమారు 5,100 విమానాల్లో దాదాపు సగం అమెరికాలోనే ఉన్నాయి. దీంతో అమెరికా మార్కెట్ ఆ సంస్థకు అత్యంత కీలకమైనది.అమెరికా కంపెనీలపైనే ఆధారంఅమెరికా–కెనడా విమానయాన పరిశ్రమలు పరస్పరం ఎంతగా అనుసంధానమై ఉన్నాయో బాంబార్డియర్ ఉదంతం స్పష్టం చేస్తోంది. బాంబార్డియర్ బిజినెస్ జెట్లలో ఉపయోగించే చాలా ఇంజిన్లను అమెరికాకు చెందిన హనీవెల్ ఏరోస్పేస్, జీఈ ఏరోస్పేస్ సంస్థలు తయారు చేస్తున్నాయి. విమానాలు, విడిభాగాల రాకపోకల విషయంలోనూ ఇరుదేశాల పరిశ్రమలు పరస్పరం ఆధారపడుతున్నాయి. ఇప్పటివరకు ఏరోస్పేస్ రంగంపై టారిఫ్‌ల ప్రభావం పెద్దగా కనిపించలేదు.అమెరికా ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రకారం.. 2025లో అమెరికా ఏరోస్పేస్, రక్షణ రంగం 109.2 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు (Trade Surplus.. అంటే ఒక దేశం దిగుమతులు చేసుకున్న దానికంటే ఎగుమతుల ద్వారా ఎక్కువ విలువ సంపాదించడం) నమోదు చేసింది. అదే సమయంలో ఎగుమతులు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 25 శాతం పెరిగాయి.గతంలోనూ బాంబార్డియర్‌పై ట్రంప్ గురిబాంబార్డియర్ను ట్రంప్ గతంలోనూ లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో బాంబార్డియర్ గ్లోబల్ ఎక్స్‌ప్రెస్ బిజినెస్ జెట్లకు అమెరికా ధ్రువీకరణ రద్దు చేస్తామని హెచ్చరించారు. కెనడాలో తయారయ్యే విమానాలపై 50 శాతం సుంకాలు విధిస్తామని కూడా ప్రకటించారు.తాజా హెచ్చరికను అమెరికా ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. ఇప్పటికే అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) అనుమతులు పొందిన బాంబార్డియర్ విమానాల డెలివరీలను కూడా అడ్డుకుంటారా? అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ట్రంప్ వ్యాఖ్యలపై బాంబార్డియర్ నుంచి వెంటనే స్పందన రాలేదు.ఇరుదేశాలకూ తప్పని నష్టం?అమెరికా–కెనడా మధ్య వాణిజ్య సంబంధాలు అత్యంత కీలకమైనవి. 2026 తొలి ఆరు నెలల్లో అమెరికా కెనడాకు 175.8 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది. అమెరికా మొత్తం ఎగుమతుల్లో కెనడా వాటా 14 శాతంగా ఉంది. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య రాకపోకలు సాగించే వస్తువుల్లో కొద్దిపాటి వాటిపైనే టారిఫ్‌లు అమల్లో ఉన్నప్పటికీ.. వివాదం మరింత విస్తరిస్తే రెండు దేశాల వ్యాపారాలు, వినియోగదారులపై భారం పెరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: మహిళ చేతికి పనామా కెనాల్.. ఎవరంటే? -
హర్ముజ్‌లో ఇక నో ఎంట్రీ!.. ఇరాన్ కొత్త రూట్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ ముదురుతున్న వేళ.. హర్ముజ్ జలసంధిపై ఇరాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ మార్గంలో నౌకల రాకపోకలు భారీగా తగ్గిపోయాయి. ఇప్పుడు మరింత కఠిన ఆంక్షలకు ఇరాన్ సిద్ధమవుతోంది. జలసంధి సమీపంలో కొత్తగా ‘నిషేధిత జోన్’ ఏర్పాటు చేయడంతోపాటు.. నౌకల కోసం ఒమన్‌తో కలిసి కొత్త షిప్పింగ్ రూట్‌ను ప్రకటించనున్నట్లు వెల్లడించింది.ఇరాన్ ప్రకటించబోయే కొత్త నిషేధిత ప్రాంతం హర్ముజ్ జలసంధికి వెలుపల గల గల్ఫ్ ప్రాంతాల్లో ఉంటుందని ఆ దేశ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ తెలిపారు. ఈ ప్రాంతం అమెరికా నౌకాదళం ఏర్పాటు చేసిన దిగ్బంధ రేఖ నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. ఆ జోన్లోకి ప్రవేశించే నౌకలను ఇరాన్ ఆంక్షల జాబితాలో చేర్చనున్నట్లు హెచ్చరించారు.అయితే ఈ నిషేధిత ప్రాంతానికి సంబంధించిన ఖచ్చితమైన సరిహద్దులను ఇరాన్ ఇంకా వెల్లడించలేదు. రాబోయే రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.ఒమన్‌తో కలిసి కొత్త రూట్ఇదే సమయంలో హర్ముజ్ గుండా సాగే నౌకలకు ప్రత్యామ్నాయంగా కొత్త అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాన్ని ఏర్పాటు చేయాలని ఇరాన్, ఒమన్ నిర్ణయించాయి. ఈ రూట్ ఇరాన్, ఒమన్ జలాల్లోనే ఉంటుంది. దీనికి సంబంధించిన మ్యాప్‌లు, ఏర్పాట్లపై ఇరు దేశాలు ఇప్పటికే అంగీకారానికి వచ్చినట్లు రెజాయీ వెల్లడించారు. త్వరలోనే దీనిపై అధికారికంగా సంతకాలు చేయనున్నారు.కొత్త మార్గాన్ని ఇరాన్ నిర్వహించనుంది. అయితే అమెరికా నుంచి తమపై కొనసాగుతున్న ‘దాడులు, బెదిరింపులు, విధ్వంసక చర్యలు’ ఆగే వరకు హర్ముజ్ జలసంధి పూర్తిగా తెరిచి ఉంటుందని హామీ ఇవ్వలేమని ఇరాన్ స్పష్టం చేసింది.రోజుకు పది నౌకలే!ప్రపంచ రవాణాకు కీలకమైన హర్ముజ్‌లో ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల ప్రభావం ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోంది. గత పది రోజుల్లో ఈ జలసంధి గుండా రోజుకు సగటున కేవలం 10 సరుకు నౌకలు మాత్రమే ప్రయాణిస్తున్నాయి. మే తర్వాత ఇదే అత్యల్ప స్థాయి.శనివారం కేవలం రెండు నౌకలు, ఆదివారం ఆరు నౌకలు మాత్రమే ఈ మార్గంలో ప్రయాణించాయి. వాటిలో ఎక్కువ శాతం ఇరాన్ సూచించిన మార్గాన్నే ఉపయోగించినట్లు సమాచారం. సముద్ర రవాణా డేటా సంస్థ కేప్లర్ ప్రకారం.. బుధవారం తర్వాత హర్ముజ్ నుంచి ఒక్క భారీ ముడిచమురు రవాణా నౌక (వీఎల్సీసీ) కూడా బయటకు రాలేదు.చమురు మార్కెట్‌పై ప్రభావంహర్ముజ్ ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన మార్గం. యుద్ధానికి ముందు ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు ఈ జలసంధి గుండా రవాణా అయ్యేది. ఎల్ఎన్జీ సరఫరాకు కూడా ఇది ప్రధాన మార్గమే. నౌకల రాకపోకలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలపై ఒత్తిడి పెరుగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధర 0.8 శాతం పెరిగి బ్యారెల్‌కు 97 డాలర్లకు పైగా చేరింది.మూడు ఆయిల్ ట్యాంకర్లపై అమెరికా దాడిమరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు కూడా కొనసాగుతున్నాయి. శనివారం అమెరికా దళాలు మూడు ఇరాన్ చమురు ట్యాంకర్లపై దాడులు చేశాయి. వీటిలో ఒకటి ఖార్గ్ ద్వీపం సమీపంలో ఉన్నట్లు సమాచారం. అంతకుముందు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అమెరికా యుద్ధ నౌకలపై దాడులు చేసినట్లు అమెరికా పేర్కొంది.అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం.. దిగ్బంధ నిబంధనలను అమలు చేసే క్రమంలో ఇప్పటికే 92 వాణిజ్య నౌకలను దారి మళ్లించారు. మూడు నౌకలను నిర్వీర్యం చేసి, మరో రెండు నౌకలను తనిఖీ కోసం అదుపులోకి తీసుకున్నారు.ఖార్గ్‌పై 550 దాడులా?ఇరాన్ చమురు ఎగుమతులకు కీలకమైన ఖార్గ్ ద్వీపం కూడా ఈ ఘర్షణల్లో ప్రధాన లక్ష్యంగా మారింది. గత కొన్ని నెలల్లో ఖార్గ్‌పై సుమారు 550 సార్లు దాడులు జరిగినప్పటికీ.. అక్కడ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఇరాన్ ఇంధన శాఖ మంత్రి మొహ్సెన్ పక్ణేజాద్ తెలిపారు. యుద్ధానికి ముందు ఇరాన్ ఎగుమతి చేసే ముడిచమురులో దాదాపు 90 శాతం ఖార్గ్ ద్వీపం నుంచే వెళ్లేది. అయితే ఏప్రిల్ మధ్య నుంచి అమెరికా దిగ్బంధం కారణంగా ఈ సరఫరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.‘రోజుకు 90 లక్షల బ్యారెళ్లు వెళ్తున్నాయి’హర్ముజ్ పూర్తిగా మూసుకుపోయిందన్న వార్తలను అమెరికా ఖండిస్తోంది. రోజుకు సుమారు 90 లక్షల బ్యారెళ్ల చమురు ఇప్పటికీ ఈ జలసంధి గుండా వెళ్తోందని అమెరికా ఇంధనశాఖ మంత్రి క్రిస్ రైట్ తెలిపారు. పైప్లైన్ల ద్వారా ప్రత్యామ్నాయంగా తరలిస్తున్న చమురును కలుపుకుంటే యుద్ధానికి ముందు రవాణాలో మూడింట రెండొంతులు లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో సరఫరా కొనసాగుతోందని చెప్పారు. ఇరాన్ మాత్రం రోజుకు 10–15 లక్షల బ్యారెళ్ల చమురు విక్రయిస్తున్నామని చెబుతోంది. తమ ఉత్పత్తి, వాణిజ్యం సాధ్యమైనంత వరకు కొనసాగుతున్నాయని ఆ దేశం పేర్కొంటోంది.‘దాడి చేస్తే మరింత తీవ్రంగా స్పందిస్తాం’ఇదిలా ఉండగా.. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఖలీబాఫ్ అమెరికాను తీవ్రంగా హెచ్చరించారు. తమ దేశ ప్రయోజనాలు, భద్రతపై దాడులు జరిగితే ఇకపై స్పందన మరింత వేగంగా, భారీగా, బాధాకరంగా ఉంటుందని అన్నారు. ఇప్పటికే అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది. కరెన్సీ విలువలో హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలు తీవ్రంగా మారుతున్నాయి. అయినప్పటికీ ఆర్థిక సంస్కరణలు చేపట్టాల్సిన బాధ్యత తమ ప్రభుత్వానిదేనని ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదానిజాదెహ్ స్పష్టం చేశారు.చర్చలకు బ్రేక్.. మళ్లీ దాడులుఇరాన్-అమెరికా మధ్య దౌత్యపరమైన చర్చలు నిలిచిపోవడం, జూన్‌లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురైంది. ఆ తర్వాత మళ్లీ పరస్పర దాడులు ప్రారంభం కావడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో హర్ముజ్‌లో కొత్త నిషేధిత జోన్, ఇరాన్-ఒమన్ కొత్త షిప్పింగ్ రూట్ ప్రకటనలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. హర్ముజ్ గుండా నౌకల రాకపోకలపై ఇరాన్ తీసుకునే తదుపరి నిర్ణయాలు.. చమురు ధరల నుంచి అంతర్జాతీయ వాణిజ్యం వరకు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.ఇదీ చదవండి: చైనా కాస్ట్లీ కలను చిదిమేసిన నేపాల్ వరద -
చైనా బిలియన్ల ప్రాజెక్టు.. పెద్ద పరీక్ష పెట్టిన నేపాల్ వరద
హిమాలయాల్లో ప్రకృతి విలయం సృష్టించిన ప్రతిసారీ అక్కడి భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులపై ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. తాజాగా నేపాల్-చైనా సరిహద్దులో సంభవించిన భారీ వరద కూడా అలాంటి ప్రశ్నలనే ముందుకు తెచ్చింది. ఆగస్టు 26న హిమనదం కూలిపోవడంతో వచ్చిన వరదల్లో నేపాల్‌లోని రసువా ప్రాంతంతోపాటు చైనా వైపున్న గ్యిరాంగ్ సరిహద్దు ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. ఒకప్పుడు రద్దీగా ఉండే ఈ సరిహద్దు వాణిజ్య కేంద్రం.. ఇప్పుడు బురద, శిథిలాల కుప్పగా మారింది.ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన గ్యిరాంగ్.. చైనా-నేపాల్ ప్రతిపాదిత రైల్వే మార్గంలో కీలకమైన సరిహద్దు ప్రాంతం. ఇక్కడి నుంచే రైల్వే నేపాల్‌లోకి ప్రవేశించి, రసువా మీదుగా కాఠ్మాండూకు చేరేలా ప్రణాళిక ఉంది. చైనా ప్రతిపాదించిన ఈ రైల్వేను బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ)లో భాగంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే చైనా నుంచి నేపాల్‌కు నేరుగా రైలు కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, రాకపోకలకు ఇది కీలకమైన మార్గంగా మారుతుందని అంచనా.అంత ఈజీనా?ఖాట్మాండు-గ్యిరాంగ్ రైల్వే ప్రాజెక్టు సాధారణ రైల్వే మార్గం కాదు. నేపాల్ పరిధిలో సుమారు 72 కిలోమీటర్ల మేర ఈ లైన్ నిర్మించాల్సి ఉంటుంది. కానీ పర్వత ప్రాంతం కావడంతో ఇందులో దాదాపు 98.5 శాతం మార్గం సొరంగాలు లేదంటే వంతెనల మీదుగానే నిర్మించాల్సి ఉంటుందని ప్రాథమిక అధ్యయనం తేల్చింది. అంటే.. రైల్వే పట్టాలు వేయడం కంటే ముందుగా కొండలను తొలిచి సొరంగాలు నిర్మించాలి. లోతైన లోయలపై భారీ వంతెనలు వేయాలి. ఎత్తుల్లో భారీ తేడాలను అధిగమించాలి. దీనికితోడు ఈ ప్రాంతం భూకంపాలు, కొండచరియలు, రాళ్లు విరిగిపడటం, మట్టి జారిపోవడం వంటి ప్రమాదాలకు లోనయ్యే ప్రాంతం.ప్రాజెక్టుపై 2018లో నిర్వహించిన ప్రాథమిక అధ్యయనం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. భౌగోళిక పరిస్థితులు, ఇంజినీరింగ్ సవాళ్లు ఈ రైల్వేకు అతిపెద్ద అడ్డంకులని పేర్కొంది. అప్పట్లో సుమారు 2.75 బిలియన్ డాలర్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.ఏళ్లుగా సాగుతున్న అధ్యయనాలుచైనా-నేపాల్ రైల్వే ఆలోచన కొత్తదేమీ కాదు. 2016లో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. 2018లో బీఆర్ఐలో భాగమైంది. 2019లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ నేపాల్ పర్యటన సందర్భంగా ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడానికి ఇరుదేశాలు అంగీకరించాయి. అయితే ఇంతవరకు నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. 2022లో పూర్తిస్థాయి సాధ్యాసాధ్యాల అధ్యయనం మొదలైంది. మార్గం, సొరంగాలు, వంతెనలు, స్టేషన్లు, నిర్మాణ వ్యయం, భౌగోళిక పరిస్థితులు వంటి అంశాలపై చైనా సాంకేతిక బృందం పరిశీలనలు చేసింది. తుది నివేదిక ఆధారంగానే ప్రాజెక్టు ముందుకు వెళ్తుందా లేదా? అనేది తేలనుంది.ఇంతలోనే భారీ విపత్తుఇలాంటి సమయంలోనే ఆగస్టు 26న హిమనదం(గ్లేసియర్) కూలిపోవడంతో భారీగా మంచు, రాళ్లు, మట్టి నీటితో కలిసి దిగువకు దూసుకొచ్చాయి. నేపాల్‌లోని రసువా ప్రాంతంలో భారీ విధ్వంసం జరిగింది. ఆ వరద చైనా వైపు గ్యిరాంగ్ వరకు చేరింది. కీలకమైన సరిహద్దు కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. ఐదు అంతస్తుల కస్టమ్స్ భవనం కూడా ఆనవాళ్లు లేకుండా పోయింది. తాజా లెక్కల ప్రకారం నేపాల్‌లో 1,300 మందికి పైగా మరణించగా, వేలాది మంది గల్లంతయ్యారు. చైనా వైపు గ్యిరాంగ్లో 43 మంది మృతి చెందగా, 519 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.ఈ విధ్వంసం ఇప్పుడు రైల్వే ప్రాజెక్టుపై కొత్త ఆలోచనలకు కారణమవుతోంది. ఒక భారీ వరదతోనే రహదారులు, వంతెనలు, సరిహద్దు మౌలిక వసతులు ఇలా ధ్వంసమైతే.. ఇదే భూభాగంలో నిర్మించబోయే రైల్వే సొరంగాలు, వంతెనలు భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను ఎలా తట్టుకుంటాయి? అనేదే అసలు ప్రశ్న.రైల్వే కంటే ముందు..తాజా విపత్తు నేపథ్యంలో ప్రాజెక్టు మార్గాన్ని మరోసారి పరిశీలించాల్సిన అవసరం కనిపిస్తోంది. హిమనదాల కదలికలు, వరదల ప్రవాహ మార్గాలు, భూకంప ముప్పు, కొండచరియలు విరిగిపడే ప్రాంతాలు వంటి అంశాలపై మరింత లోతైన అధ్యయనాలు అవసరం. అలాగే భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు సంభవిస్తే రైల్వేకు నష్టం జరగకుండా ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, రక్షణ నిర్మాణాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.మరోవైపు గ్యిరాంగ్ ప్రాంతం చైనా-నేపాల్ వాణిజ్యానికి కీలకమైన మార్గం. తాజా విపత్తుతో ఆ ప్రాంతాన్ని పునర్నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రైల్వే నిర్మాణానికి ముందే అక్కడి మౌలిక వసతులను ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా మార్చాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది.బీఆర్ఐ అటకెక్కినట్లేనా?అయితే తాజా వరదలతో చైనా బీఆర్ఐ మొత్తం ఆగిపోయిందని చెప్పలేం. కానీ చైనా-నేపాల్ అనుసంధానానికి కీలకంగా భావిస్తున్న ఈ రైల్వే ప్రాజెక్టుకు మాత్రం ప్రకృతి పెద్ద పరీక్ష పెట్టింది. నిర్మాణం ఇంకా మొదలుకాకపోవడం ఒక రకంగా ప్రాజెక్టుకు అవకాశం కూడా. ఇప్పుడు ఎదురైన విపత్తు నుంచి పాఠాలు నేర్చుకుని మార్గం, డిజైన్, భద్రతా ప్రమాణాలను మార్చుకునే అవకాశం చైనాకు ఉంది.హిమాలయాల్లో బీఆర్ఐ రైల్వేను ముందుకు తీసుకెళ్లడం అనుకున్నంత సులభం కాదని తాజా ప్రకృతి విపత్తు గట్టిగా చాటిచెబుతోంది. ఈ ప్రాజెక్టు మరింత ఆలస్యమవుతుందా? మార్గంలో మార్పులు వస్తాయా? లేదంటే ప్రకృతి సవాళ్లను అధిగమించేలా భారీ ఇంజినీరింగ్ పరిష్కారాలతో చైనా ముందుకెళ్తుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: యుద్దం ఎఫెక్ట్.. బూతు కంటెంట్‌తో మరీ ఇంత దిగజారాలా? -
ఇలాంటి పనులు ట్రంప్‌కు మాత్రమే సాధ్యం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు మరోసారి అదే కనిపించింది. ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని వరుస పోస్టులతో విరుచుకుపడుతున్న ఆయన.. తాజాగా ఏకంగా ఇరాన్ మ్యాప్‌పై తన ముఖాన్ని పెట్టారు. అక్కడితో ఆగారా అంటే అదీ లేదు.. ‘ఇరాన్ ఓ విఫల దేశం’ అంటూ సందేశం ఇచ్చారు. ఆదివారం ట్రూత్ సోషల్‌లో గంట వ్యవధిలో ఇరాన్‌కు సంబంధించిన ఏడు పోస్టులు పెట్టిన ట్రంప్.. ఆ దేశంపై అమెరికా ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో చూపించేందుకు మ్యాప్‌లు, గ్రాఫిక్స్‌ను ఉపయోగించారు. తాజా పోస్టుల్లో ఒకదానిలో ఇరాన్ మ్యాప్ కనిపించగా.. దానిపై ట్రంప్ ముఖాన్ని ఉంచారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని చెప్పేందుకు ఈ చిత్రాన్ని ఉపయోగించారు. మరో పోస్టులో ఇరాన్ చమురు ఎగుమతులు భారీగా పడిపోయాయని పేర్కొన్నారు. ఇరాన్‌కు కీలకమైన ఖర్గ్ ద్వీపాన్ని క్షిపణులతో పేల్చేసినట్లు ఓ పోస్ట్ చేశారు. అలాగే హర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా మళ్లీ పెరిగిందంటూ మరో గ్రాఫిక్‌ను పోస్ట్ చేశారు. హర్ముజ్కూ ‘ట్రంప్’ ముద్ర?ట్రంప్ ఇంతటితో ఆగలేదు. వ్యూహాత్మకంగా కీలకమైన హర్ముజ్ జలసంధికి ‘ట్రంప్ స్ట్రెయిట్’ అని పేరు మార్చాలని గతంలో వ్యాఖ్యానించారు. ఆ వెంటనే వైట్‌హౌజ్ వర్గాలు అదే పేరుతో ఓ మ్యాప్‌ను రిలీజ్ చేశారు. ఇక ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ జలమార్గం ప్రస్తుతం అమెరికా-ఇరాన్ ఘర్షణకు ప్రధాన కేంద్రంగా మారింది. అమెరికా ఆంక్షలు, నౌకా దిగ్బంధంతో ఇరాన్ చమురు ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయని అమెరికా చెబుతుండగా.. హర్ముజ్‌పై తన ప్రభావాన్ని కొనసాగిస్తామని టెహ్రాన్ స్పష్టం చేస్తోంది. ట్రంప్‌తో మాములుగా ఉండదుట్రంప్కు ఇలాంటి పనులు కొత్తేం కాదు. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ పేరును ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా, అలాస్కాలోని ‘డెనాలి’ పేరును ‘మౌంట్ మెకిన్లీ’గా మార్చేందుకు ఏకంగా కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికా ఫెడరల్ ప్రభుత్వ వినియోగంలో ఈ పేర్లు అధికారికంగా అమల్లోకి వచ్చాయి. ఇటీవల మరో అడుగు ముందుకేసి కెనడా లేక్ ఒంటారియోను ‘లేక్ అమెరికా’గా పేరు మార్చాలంటూ యాపిల్ మ్యాప్స్‌కు ట్రంప్ సూచించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. గూగుల్ ఇప్పటికే అమెరికా వినియోగదారుల కోసం ఆ పేరును చూపించడం ప్రారంభించింది. ట్రంప్ రాజకీయ అస్త్రంట్రంప్ తాజా ఇరాన్ పోస్టులను గమనిస్తే.. మ్యాప్‌లు కేవలం భౌగోళిక వివరాల కోసం కాకుండా రాజకీయ సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే సాధనంగా ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇరాన్ మ్యాప్‌పై తన ముఖం, ‘ఫెయిలింగ్ నేషన్’ అనే వ్యాఖ్య.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై చమురు ఎగుమతులు, కరెన్సీ పతనం, హర్ముజ్ సంక్షోభాన్ని కలిపి చూపించే గ్రాఫిక్స్.. ఇవన్నీ ఒకే సందేశాన్ని బలపరిచేలా ఉన్నాయి. ఇరాన్‌పై ఆర్థిక, సైనిక ఒత్తిడిని పెంచుతున్న సమయంలో ట్రంప్ సోషల్ మీడియా పోస్టులు కూడా అదే దూకుడును ప్రతిబింబిస్తున్నాయి. అయితే టెహ్రాన్ మాత్రం అమెరికా ఒత్తిడికి తలొగ్గేది లేదని చెబుతోంది. దీంతో ట్రంప్ తాజా ‘మ్యాప్ పోస్టు’ కూడా అమెరికా-ఇరాన్ ఘర్షణలో మరో రాజకీయ సందేశంగా మారింది.ఇదీ చదవండి: అంతులేని వెతుకులాట! -
రన్‌వే దాటి రోడ్డెక్కిన విమానం.. ఐదుగురి దుర్మరణం
అమెరికాలోని మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోరం జరిగింది. ఓ కార్గో ప్రమాదం ల్యాండింగ్ సమయంలో రన్‌వే దాటి బయటకు దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ క్రమంలో రోడ్డు మీద ఉన్న వాహనాల్ని ఢీ కొట్టి పేలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీళ్లలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అమెజాన్ ప్రైమ్ ఎయిర్‌కు చెందిన కార్గో విమానం ఆదివారం ప్యూర్టోరికోలోని శాన్ జువాన్ నుంచి మియామికి వచ్చింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ల్యాండింగ్ చేస్తుండగా అదుపుతప్పి రన్‌వేను దాటింది. అనంతరం విమానం విమానాశ్రయం చుట్టుపక్కల ఉన్న గోదాములు, ఇతర వ్యాపార సంస్థలకు వెళ్లే రహదారిపైకి దూసుకెళ్లి పలు వాహనాలను ఢీకొట్టింది.మియామి-డేడ్ కౌంటీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. విమానంలో భారీగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగతో కమ్ముకుంది. విమానం కాక్‌పిట్‌లో పైలట్, కో-పైలట్ చిక్కుకుపోయారు. కొన్ని వాహనాల్లోని వ్యక్తులు కూడా ప్రమాదంలో చిక్కుకున్నారు. ఒక వ్యక్తి వాహనం కింద ఇరుక్కుపోవడంతో సహాయక సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టి బయటకు తీశారు.భారీ రెస్క్యూ ఆపరేషన్సమాచారం అందుకున్న వెంటనే సుమారు 200 మంది అత్యవసర సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. 60కిపైగా అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విమానంలోని ఇంధనం లీకవుతుండటంతో దాన్ని నియంత్రించే చర్యలు కూడా చేపట్టారు. ప్రమాదం కారణంగా విమానాశ్రయంలో కొంతసేపు విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.రాకపోకలపై ప్రభావంప్రమాదం కారణంగా మియామి విమానాశ్రయంలో 160కిపైగా విమానాలు రద్దయ్యాయి. దాదాపు 325 విమానాలు ఆలస్యంగా నడిచాయి. కొన్ని విమానాలను 320 కిలోమీటర్ల దూరంలోని ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. పరిస్థితిని చక్కదిద్దిన అనంతరం విమానాశ్రయ కార్యకలాపాలను దశలవారీగా పునరుద్ధరించారు.ఏం జరిగిందసలు?ప్రమాదానికి అసలు కారణం ఇంకా తెలియరాలేదు. ప్రమాదం సమయంలో ఆ ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షాలు, గంటకు సుమారు 48 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు అమెరికా జాతీయ వాతావరణ సేవ తెలిపింది. అయితే వాతావరణ పరిస్థితులే ప్రమాదానికి కారణమా? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు.32 ఏళ్ల బోయింగ్ విమానంప్రమాదానికి గురైన కార్గో విమానం బోయింగ్ 767. ఇది తొలుత ప్రయాణికుల విమానంగా నిర్మించబడింది. రెండు దశాబ్దాలకు పైగా పలు విమానయాన సంస్థల్లో సేవలందించిన తర్వాత 2015లో కార్గో విమానంగా మార్చారు. ఈ విమానాన్ని అమెజాన్ తరఫున అమెరికాకు చెందిన కార్గో క్యారియర్ 21 Air నిర్వహిస్తోంది.దర్యాప్తు ప్రారంభంప్రమాదంపై అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (NTSB) దర్యాప్తు ప్రారంభించాయి. NTSB చైర్పర్సన్ జెన్నిఫర్ హోమెండీ నేతృత్వంలో ప్రత్యేక బృందం మియామికి చేరుకుని ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను పరిశీలించనుంది. విమానం రన్‌వేపై ఎక్కడ ల్యాండ్ అయింది? ల్యాండింగ్ సమయంలో వేగం ఎంత ఉంది? రన్‌వే చివరికి చేరుకునేలోపు ఎందుకు నియంత్రణలోకి రాలేదు? వంటి అంశాలపై దర్యాప్తులో ప్రధానంగా దృష్టి సారించనున్నారు.ఇటు ఈ ఘటనపై అమెజాన్ సంస్థ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని ప్రకటించింది.🚨 Update: Deadly Cargo Plane Crash at Miami International AirportAt least five people have died and five others were injured after an Amazon Prime Air cargo aircraft overran the runway at Miami International Airport on Sunday afternoon, striking multiple vehicles and bursting… pic.twitter.com/6XLpT6mVaP— FL360aero (@fl360aero) September 7, 2026 -
ది డికాయ్ ప్లేన్ రివ్యూ: ట్రంప్ ‘ఎస్కేప్’.. థ్రిల్ చేసిందా?
ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతను పొందే నేత.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అలాంటి వ్యక్తి ఓ దేశం నుంచి మరో దేశానికి వెళ్లేటప్పుడు అందరి కళ్లముందే కనిపించకుండా పోతే? అందులోనూ అధికారిక విమానం నుంచి మరో విమానంలో రహస్యంగా ప్రయాణించాల్సి వస్తే? వినడానికి హాలీవుడ్ థ్రిల్లర్‌లా అనిపించే ఈ ఘటన నిజంగానే జరిగింది. ఇప్పుడు అదే ఆసక్తికర ఉదంతాన్ని ‘ఇన్‌స్టాడాక్స్: ది డికాయ్ ప్లేన్’ పేరుతో నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీగా అందించింది. ఇంతకీ ఇది ఎలా ఉంది? థ్రిల్ పంచిందా?..స్టోరీ ఏంటంటే.. టర్కీలో జరిగిన నాటో సదస్సు అనంతరం డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు తిరిగి బయలుదేరిన సమయంలో అసలు కథ మొదలవుతుంది. అందరూ ట్రంప్ ఎయిర్‌ఫోర్స్ వన్‌లోనే ఉన్నారని భావించారు. కానీ భద్రతా కారణాలతో ఆయనను క్యాటరింగ్ ట్రక్ ద్వారా విమానం నుంచి బయటకు తీసుకొచ్చి.. చిన్నదైన మరో మిలిటరీ విమానంలో తరలించారు. అసలు విమానం మాత్రం ట్రంప్ అందులోనే ఉన్నట్టుగా నమ్మించే ‘డికాయ్’గా కొనసాగింది. అప్పట్లో విమానంలో ఉన్న జర్నలిస్టులు, కొందరు ఉన్నతాధికారులకు కూడా అసలు విషయం తెలియకపోవడం ఈ ఘటనను మరింత సంచలనంగా మార్చింది.ఫ్లస్ పాయింట్లు.. ఇన్‌స్టాడాక్స్: ది డికాయ్ ప్లేన్(Instadocs: The Decoy Plane) డాక్యుమెంటరీకి ప్రధాన బలం ఆ సమయంలో ప్రత్యక్షంగా ఉన్నవారి మాటలే. రాయిటర్స్ వైట్‌హౌస్ రిపోర్టర్ గ్రామ్ స్లాటరీ, ఏపీ ఫొటోగ్రాఫర్ అలెక్స్ బ్రాండన్, వాషింగ్టన్ పోస్ట్ రిపోర్టర్ డాన్ లామోత్తో పాటు మాజీ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ రాబర్ట్ మెక్‌డొనాల్డ్, మాజీ ఎయిర్‌ఫోర్స్ వన్ సిబ్బంది వాండా జోయెల్ తమ అనుభవాలను పంచుకున్నారు. ఆ సమయంలో విమానంలో ఉన్నవారికి ఎలా అనిపించిందో ప్రేక్షకుడు అర్థం చేసుకునేలా తెరకెక్కించారు.అయితే చిన్న నిడివి ఇక్కడ మైనస్ కాకుండా ప్లస్‌గా మారింది (Instadocs: The Decoy Plane Review). అనవసరమైన ఉపకథలు (Side Track) లేకుండా నేరుగా అసలు విషయానికే వెళ్లడం వల్ల ఆసక్తి నిలుస్తుంది. ముఖ్యంగా క్యాటరింగ్ ట్రక్, మూసిన కిటికీలు, అనుమానాస్పద కదలికలు.. ఆ తర్వాత వెలుగులోకి వచ్చిన అసలు విషయం.. ఇవన్నీ ఒక మిస్టరీని ఛేదిస్తున్న అనుభూతిని కలిగిస్తాయి.నెగెటివ్ ఏంటంటే.. అయితే ఇది(Trump The Decoy Plane Doc) పూర్తి స్థాయి పొలిటికల్ థ్రిల్లర్ అనుకోవద్దు. కేవలం అరగంటలో ఒకే ఘటనను చెప్పేయాలన్న ఉద్దేశంతో రూపొందించిన డాక్యుమెంటరీ కావడంతో.. లోతైన రాజకీయ విశ్లేషణకు పెద్దగా అవకాశం లేకుండా పోయింది. ఇరాన్ థ్రెట్.. ఇజ్రాయెల్ వార్నింగ్.. కనీసం వెరిఫై చేసుకోకుండా ట్రంప్ భద్రతా బలగాలు చేసిన పని.. ఇలా ఏవీ ఇందులో కనిపించవు. ట్రంప్ చుట్టూ ఉన్న రాజకీయ వివాదాల కంటే.. భద్రతా వ్యవస్థ ఎలా పనిచేసింది? మీడియాను ఎందుకు చీకట్లో ఉంచారు? అనే అంశాలపైనే ఎక్కువ దృష్టి పెట్టింది.ఓవరాల్‌గా.. రాజకీయాలు, అమెరికా అధ్యక్షుడి భద్రత, వైట్‌హౌస్ వ్యవహారాలు, నిజ జీవితంలోని విచిత్రమైన ఘటనలు ఆసక్తిగా చూసేవారికి ‘ది డికాయ్ ప్లేన్’ ఒక మంచి షార్ట్ వాచ్. పెద్ద సినిమా స్థాయి డ్రామా కోసం కాకుండా.. ‘అసలు ఆ రోజు ఏం జరిగింది?’ అనే కుతూహలంతో చూస్తే మాత్రం నిరాశపరచదు. -
నేపాల్‌కు మళ్లీ ఫ్లాష్‌ఫ్లడ్ ముప్పు!
నేపాల్‌కు మరోసారి ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉండడంతో హైఅలర్ట్ ప్రకటించారు. దార్చుల్లా జిల్లాలోని భట్టార్ ప్రాంతంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో చౌలానీ నదిలోకి మట్టి, రాళ్లు వచ్చిపడి నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో నది దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.చౌలానీని చామెలియా నది అని కూడా పిలుస్తారు. ఇది అపిహిమాల్ ప్రాంతంలో పుట్టి మహాకాళీ నదిలో కలుస్తుంది. మహాకాళీ నది కొంత భాగం నేపాల్–భారత్ సరిహద్దుగా ప్రవహిస్తుంది. శుక్రవారం మధ్యాహ్నాం తర్వాత కొండచరియలు ఒక్కసారిగా కుప్పకూలి నదిలో పడడం ప్రారంభించాయి. మట్టి, రాళ్లు జారిపడడాన్ని కొందరు తమ ఫోన్లలో బంధించారు. ఏదో ప్రళయం వచ్చినట్లు ఆ దృశ్యాలు ఒళ్లు జలదరించేలా ఉన్నాయి. అయితే ఈ ప్రభావంతో నది మరింతగా పూడుకుపోయి పూర్తిగా మూసుకుపోయే ప్రమాదం ఉందని దార్చుల్లా జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. అదే జరిగితే నదీ ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడి.. ఒక్కసారిగా తెగిపడి దిగువ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీర ప్రాంతాల ప్రజలకు హెచ్చరికనది ఒడ్డున నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల సమయంలో నదికి సమీపంలోకి వెళ్లొద్దని అధికారులు సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు పోలీసు, భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే స్పందించేలా భద్రతా బలగాలను సిద్ధంగా ఉంచారు. Today, a large landslide has partially blocked the Chaulani River in Api Himal Rural Municipality, Darchula District, Sudurpashchim Province, Nepal. Authorities are urging residents downstream to remain alert amid the risk of sudden flooding. pic.twitter.com/7UuxGPsDjg— Weather Monitor (@WeatherMonitors) September 4, 2026పశ్చిమ ప్రావిన్స్ ముఖ్యమంత్రి ఖగ్రాజ్ భట్టా కూడా అధికారులతో పరిస్థితిపై సమీక్ష నిర్వహించి.. హైఅలర్ట్‌లో ఉండాలని ఆదేశించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తొలగని ముప్పు..అధికారులు చెబుతోంది ఏంటంటే.. చౌలానీ నదిలో ప్రస్తుతం నిన్నటితో పోలిస్తే పర్వాలేదు. నీటి ప్రవాహం సాధారణంగానే ఉంది. అయితే కొండచరియలు ఇంకా విరిగిపడే అవకాశం ఉండటంతో ముప్పు పూర్తిగా తొలగిపోలేదని అధికారులు చెబుతున్నారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు, స్థానికులను అప్రమత్తం చేసేందుకు చామెలియా జలవిద్యుత్ కేంద్ర భద్రతా స్థావరానికి చెందిన సాయుధ పోలీసు సిబ్బందిని మోహరింపజేశారు. ఇదిలా ఉండగా.. భట్టార్ ప్రాంతంలోని పది కుటుంబాలను ముందు జాగ్రత్తగా బంధువుల ఇళ్లకు తరలించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. వారికి టెంట్లు సహా అవసరమైన సామగ్రిని అందించారు. అయితే కొండచరియలు విరిగిపడి.. అక్కడి రహదారులు, ట్రెక్కింగ్ మార్గాలు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. మరోసారి ప్రకృతి ప్రకోపంఇటీవలే నేపాల్‌లో భారీ ఫ్లాష్‌ఫ్లడ్ బీభత్సం సృష్టించింది. ఆగస్టు 26న సంభవించిన ఈ విపత్తులో ఇప్పటివరకు 1,287 మృతదేహాలను వెలికితీయగా.. మరో 5,083 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. సహాయక, గాలింపు చర్యలు కొనసాగుతున్న వేళ దార్చుల్లాలో తాజా కొండచరియల ఘటన ఆందోళన కలిగిస్తోంది.చౌలానీ నది ప్రవాహానికి కొండచరియలు అడ్డంకిగా మారడంతో.. మరిన్ని కొండచరియలు విరిగిపడి నది పూర్తిగా మూసుకుపోతే ఒక్కసారిగా నీటి ఉద్ధృతి పెరిగి ఫ్లాష్‌ఫ్లడ్ సంభవించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో నది దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.ఇదీ చదవండి: అసలు అక్కడి భూగర్భంలో ఏం జరుగుతోంది? -
ప్రపంచ పటం మారబోతుందా?.. అతిపెద్ద స్థానం ఇక ఆఫ్రికాకే!
ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఏది?.. ఆసియా అనే సమాధానం వినిపిస్తుంది, కనిపిస్తుంది. అయితే దానిని మార్చే ప్రయత్నాలు ఇప్పుడు ఊపందుకున్నాయి. ఖండాల పరిమాణాలను మరింత వాస్తవికంగా చూపించే దిశగా ఐక్యరాజ్యసమితి కీలక నిర్ణయం తీసుకుంది. అయితే దీనిని అమెరికా సహా ఆరు దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే.. సంప్రదాయ మెర్కేటర్ ప్రొజెక్షన్ స్థానంలో ‘ఈక్వల్ ఎర్త్’ (Equal Earth) ప్రొజెక్షన్‌ను ప్రోత్సహించే తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ తాజాగా ఆమోదించింది. శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో 164 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా.. అమెరికా వ్యతిరేకంగా ఓటేసింది. మరో ఆరు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఆఫ్రికా ఖండాన్ని ప్రపంచ పటంలో వాస్తవ పరిమాణం కంటే చిన్నగా చూపిస్తున్నారనే వాదనల నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. 🎉Congratulations to the delegation of Togo 🇹🇬 on the adoption this morning by the #UNGA of resolution A/80/L.104, “Correct the Map”, an @_AfricanUnion initiative promoting more accurate and equitable global cartographic representation, particularly of #Africa.A significant… pic.twitter.com/oxZCbeMUTt— African Union Mission to the UN (@AfricanUnionUN) September 4, 2026ఇంతకు ముందు.. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, యూరప్, ఆస్ట్రేలియా ఇలా విస్తీర్ణం పరంగా ఖండాలు జాబితాలో వరుసగా ఉన్నాయి. అయితే ఐరాస తెచ్చిన కొత్త పటంలో ఆఫ్రికా, లాటిన్ అమెరికా, దక్షిణాసియా, ఓషియానియా తదితర ప్రాంతాలు వాటి అసలు భౌగోళిక విస్తీర్ణానికి మరింత దగ్గరగా కనిపిస్తాయి. ప్రపంచ భూభాగాల ప్రాతినిధ్యాన్ని మరింత కచ్చితంగా, సమతూకంగా చూపించడమే ఈ తీర్మానం ఉద్దేశం.మ్యాప్‌ను చూస్తే మరోలా.. ప్రపంచ పటాలను చూస్తే ఆఫ్రికా కంటే యూరప్, ఉత్తర అమెరికా వంటి ప్రాంతాలు పెద్దవిగా కనిపించడం చాలామందిలో అపోహకు కారణమవుతోంది. వాస్తవానికి ఆసియానే ప్రపంచంలోనే అతిపెద్ద ఖండం. భూభాగ పరంగా ప్రపంచ మొత్తం భూమిలో దాదాపు మూడో వంతు ఆసియాలోనే ఉంది. ఆ తర్వాతి స్థానంలో ఆఫ్రికా ఉంటుంది. అయితే మెర్కేటర్ వంటి పటాల్లో ధ్రువ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న భూభాగాలు పరిమాణం కంటే చాలా పెద్దగా కనిపిస్తాయి. దీంతో ఖండాల అసలు విస్తీర్ణాలపై ప్రజలకు తప్పుడు అంచనాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.మెర్కేటర్ పటంలో ఏం సమస్య?1569లో ఫ్లెమిష్ కార్టోగ్రాఫర్ గెరార్డస్ మెర్కేటర్ రూపొందించిన మెర్కేటర్ ప్రొజెక్షన్ ప్రధానంగా సముద్ర ప్రయాణాలు, నావిగేషన్ కోసం ఉపయోగపడేలా రూపొందించారు. భూమి గోళాకారంగా ఉండగా.. దానిని చదునైన పటంగా చూపించాల్సి రావడంతో ఖండాల ఆకారాలు, పరిమాణాల్లో వక్రీకరణలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా భూమధ్యరేఖకు దూరంగా వెళ్లే కొద్దీ భూభాగాలు వాస్తవ పరిమాణం కంటే పెద్దగా కనిపిస్తాయి. దీంతో యూరప్, ఉత్తర అమెరికా, రష్యా వంటి ప్రాంతాలు భారీగా కనిపిస్తుండగా.. ఆఫ్రికా, దక్షిణ అమెరికా వంటి ఖండాలు వాటి వాస్తవ విస్తీర్ణంతో పోలిస్తే చిన్నగా కనిపిస్తాయి. ఉదాహరణకు మెర్కేటర్ పటంలో గ్రీన్లాండ్ దాదాపు ఆఫ్రికా అంత పెద్దదిగా కనిపిస్తుంది. వాస్తవానికి ఆఫ్రికా గ్రీన్లాండ్ కంటే అనేక రెట్లు పెద్దది.2018లో ‘ఈక్వల్ ఎర్త్’ఈ వక్రీకరణలను తగ్గించేందుకు కార్టోగ్రాఫర్లు 2018లో ‘ఈక్వల్ ఎర్త్’ ప్రొజెక్షన్‌ను రూపొందించారు. భూమిపై ఖండాల వాస్తవ విస్తీర్ణాల మధ్య ఉన్న నిష్పత్తిని సాధ్యమైనంత వరకు పటంలోనూ కొనసాగించడమే దీని ప్రత్యేకత. దీంతో ఆఫ్రికా వంటి ఖండాలు ప్రపంచ పటంలో తమ అసలు పరిమాణానికి దగ్గరగా కనిపిస్తాయి.అమెరికా తీవ్ర వ్యతిరేకతఅయితే ఐరాస తీర్మానంపై అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నిజమైన సమస్యలపై దృష్టి పెట్టాల్సిన సమయంలో 16వ శతాబ్దపు పటాలపై, వాటి ద్వారా పరిహారం (reparations), ‘కాగ్నిటివ్ జస్టిస్’ను ప్రోత్సహించడంపై చర్చించడం వల్లే ఐరాస తన విశ్వసనీయతను కోల్పోతోందని అమెరికా ప్రతినిధి యరీనా ఫెరెన్సెవిచ్ విమర్శించారు.మరోవైపు తీర్మానాన్ని ప్రవేశపెట్టిన టోగో విదేశాంగ మంత్రి రాబర్ట్ డస్సే మాత్రం పటాలు కేవలం భౌగోళిక చిత్రాలు మాత్రమే కాదని అన్నారు. అవి విద్యను ప్రభావితం చేస్తాయని, మన ఊహలకు రూపమిస్తాయని, ప్రపంచంపై సమష్టి అవగాహనను ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. వాస్తవానికి భిన్నమైన పటాలు తరతరాలకు తప్పుడు అవగాహనను అందించే ప్రమాదం ఉందన్నారు.ఫ్రాన్స్ కూడా మెర్కేటర్కు గుడ్బైతీర్మానానికి సహ-మద్దతుదారుగా ఉన్న ఫ్రాన్స్ కూడా ఇకపై మెర్కేటర్ ప్రొజెక్షన్‌ను వదిలి కొత్త పటాన్ని ఉపయోగించనున్నట్లు ప్రకటించింది. మెర్కేటర్ పటంలో అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియాతో పోలిస్తే పెద్దగా కనిపిస్తున్నాయని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-నోయెల్ బారోట్ అన్నారు. “పటాలను మార్చడం వల్ల ప్రపంచం మారదు. కానీ వక్రీకరించిన ప్రాతినిధ్యాన్ని సరిదిద్దడం నిజాన్ని గుర్తించే చర్య” అని ఆయన వ్యాఖ్యానించారు. ఆఫ్రికాలోని మాజీ ఫ్రెంచ్ వలస దేశాలతో సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు ఫ్రాన్స్ ప్రయత్నిస్తున్న సమయంలో ఈ నిర్ణయం రావడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.ఇదీ చదవండి: హవ్వా.. అబ్రహం లింకన్‌కు ఇదేం దుస్థితి? -
భారీ లంచం కేసులో మహింద రాజపక్సే కొడుకు అరెస్ట్
శ్రీలంక మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని మహింద రాజపక్సే కుటుంబానికి మరో భారీ షాక్ తగిలింది. అధికారం అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు.. అవినీతి కేసులు.. ఇప్పుడు అరెస్టుల దాకా వెళ్లాయి. ఆయన కుమారుడు, ప్రతిపక్ష ఎంపీ నమల్ రాజపక్సేను అవినీతి నిరోధక అధికారులు అరెస్టు చేశారు. ఎయిర్‌బస్ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీగా లంచంగా పొందారన్న అభియోగమే ఇందుకు కారణం.2013లో శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ కోసం జరిగిన 2.3 బిలియన్ డాలర్ల ఎయిర్‌బస్ డీల్‌పై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఈ ఒప్పందంలో రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులకు ముడుపులు చెల్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో నమల్ రాజపక్సేకు 8 లక్షల డాలర్లు (సుమారు రూ.7 కోట్లు) అందినట్లు శ్రీలంక అవినీతి నిరోధక కమిషన్ (CIABOC) కోర్టుకు తెలిపింది. రెండు సింగపూర్ ఖాతాల ద్వారా..దర్యాప్తు సంస్థల ప్రకారం.. శ్రీలంకకు చెందిన ఓ వ్యాపారి తన రెండు సింగపూర్ బ్యాంకు ఖాతాల ద్వారా నమల్ రాజపక్సేకు ఈ మొత్తాన్ని బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ డబ్బు ఎయిర్‌బస్ డీల్‌లో ముడుపులుగా చెల్లించిన మొత్తంలో భాగమని అధికారులు కోర్టుకు వివరించారు. అయితే నమల్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నారు. ఐదు గంటలకు పైగా విచారణ..40 ఏళ్ల నమల్ రాజపక్సేను శుక్రవారం అవినీతి నిరోధక కమిషన్ ఐదు గంటలకు పైగా ప్రశ్నించింది. అనంతరం అరెస్టు చేసి కొలంబో చీఫ్ మేజిస్ట్రేట్ అసంగ బొదరగమ ఎదుట హాజరుపరిచారు. కోర్టు ఆయనను సెప్టెంబర్ 18 వరకు రిమాండ్‌కు పంపింది. నమల్ తరఫు న్యాయవాది బెయిల్ కోరినా కోర్టు నిరాకరించింది. మహింద రాజపక్సేను కూడా..ఈ ఎయిర్‌బస్ డీల్ వ్యవహారంలో నమల్ తండ్రి, మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సేను కూడా మే నెలలో అవినీతి నిరోధక అధికారులు ప్రశ్నించారు. ఆయన కూడా ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై విచారణ జరిపారు. అయితే రాజపక్సే కుటుంబం తమపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఖండిస్తూ.. ఇవన్నీ రాజకీయ కక్షతో చేస్తున్నవేనని చెబుతోంది. ఒకప్పుడు శ్రీలంక రాజకీయాల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన రాజపక్సే కుటుంబానికి గత కొన్నేళ్లుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 2022 ఆర్థిక సంక్షోభం సమయంలో ప్రజా ఆగ్రహం నేపథ్యంలో మహింద రాజపక్సే ప్రధాని పదవికి రాజీనామా చేయగా.. ఆయన సోదరుడు గోటబయ రాజపక్సే దేశం విడిచి వెళ్లి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అదే సమయంలో నమల్ రాజపక్సే కూడా మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఇప్పుడు ఎయిర్‌బస్ ఒప్పందంలో రూ.7 కోట్ల లబ్ధి పొందారన్న ఆరోపణలపై నమల్ అరెస్టవ్వడం.. రాజపక్సే కుటుంబానికి మరో భారీ ఎదురుదెబ్బగా మారింది.ఇటు ఎయిర్‌బస్ సంస్థపై అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ అధికారులు గతంలో జరిపిన దర్యాప్తులోనూ భారీ ముడుపుల వ్యవహారం వెలుగుచూసింది. 2020లో ఈ అవినీతి ఆరోపణల కేసును పరిష్కరించేందుకు ఎయిర్‌బస్ సుమారు 4 బిలియన్ డాలర్ల జరిమానా చెల్లించేందుకు అంగీకరించింది. తాజా అరెస్టుతో శ్రీలంకలో రాజపక్సే కుటుంబానికి సంబంధించిన అవినీతి ఆరోపణలు మరోసారి రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి.ఇదీ చదవండి: నా స్నేహితురాలికి అభినందనలు: మోదీ ట్వీట్ వైరల్ -
ఇరాన్ పికాక్స్.. ట్రంప్‌కు ఎందుకంత పట్టుదల?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. ప్రపంచంలోనే అత్యంత పటిష్ఠమైన భూగర్భ అణు కేంద్రంగా భావిస్తున్న ‘పికాక్స్ మౌంటెన్’పై తమ నిఘా కొనసాగుతోందని.. త్వరలోనే దానిపై దాడి చేసే అవకాశం ఉందని ప్రకటించారు. తద్వారా ఇరాన్‌ను మరో తీవ్ర హెచ్చరిక జారీ చేశారాయన. ఓవల్ ఆఫీసులో శుక్రవారం విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. అక్కడ అణు కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే ఎంతకైనా వెనుకాడబోమని స్పష్టం చేశారాయన.ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేసుకోకుండా అడ్డుకోవడమే అమెరికా సైనిక చర్యల ప్రధాన లక్ష్యం. మేం ఐదు నెలలుగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ సమయంలో ఇరాన్‌కు అణ్వాయుధం లేకుండా చేశాం. ఒకవేళ ఆ దేశం అణ్వాయుధాన్ని పొందితే పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారతాయి. అందుకే మా నిరంతర నిఘా కొనసాగుతుంది అని అన్నారాయన. పికాక్స్ మౌంటెన్‌పై నిఘానటాంజ్ యురేనియం శుద్ధి కేంద్రానికి సమీపంలో ఉన్న పికాక్స్ మౌంటెన్ అత్యంత లోతైన భూగర్భ నిర్మాణాలతో కూడిన ప్రాంతంగా భావిస్తున్నారు. అక్కడ రెండు లోతైన సొరంగ వ్యవస్థలు ఉన్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ నిఘా వర్గాల అంచనా ప్రకారం.. ఇరాన్ వేలాది సెంట్రిఫ్యూజ్‌లను ఈ భూగర్భ కేంద్రానికి తరలించినట్లు గతంలో వార్తలు వచ్చాయి.‘‘పికాక్స్లో ఏదైనా కార్యకలాపం జరుగుతున్నట్లు గుర్తిస్తే చాలా త్వరలోనే దాడి చేయవచ్చు. అక్కడి ప్రతీ కదలిక మాకు తెలుసు. ఇరాన్ అంతటా జరుగుతున్న కదలికలపై నిఘా ఉంది. ఏదైనా తప్పు జరిగితే తీవ్రంగా దాడి చేస్తాం’’ అని ట్రంప్ హెచ్చరించారు.భూగర్భంలో అత్యంత లోతుగా నిర్మించిన ఈ కేంద్రం.. సాధారణ వైమానిక దాడులను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉందన్న అంచనాలు ఉన్నాయి. అయితే అమెరికా ఇక్కడ దాడి చేస్తే ఇరాన్ అణు మౌలిక వసతులపై యుద్ధం మరింత తీవ్రతరం అయ్యే అవకాశముంది.ట్రంప్ ఇలా అనడం ఇదే తొలిసారి కాదు. జులైలోనే పికాక్స్ మౌంటెన్‌ను అమెరికా టార్గెట్ చేసే అవకాశం ఉందని ఆయన బహిరంగంగా హెచ్చరించారు. అప్పట్లో ‘‘త్వరలోనే, భారీగా దాడి చేస్తాం’’ అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా మరోసారి ఇదే స్థావరాన్ని ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్ అణు కార్యకలాపాలకు పికాక్స్ భవిష్యత్తులో కీలక కేంద్రంగా మారే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలోనే ట్రంప్ దృష్టి దీనిపైనే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.ఎక్కడ ఉంది.. ఎందుకు కీలకం? ఇరాన్‌లోని జాగ్రోస్ పర్వత శ్రేణిలో ఉన్న పికాక్స్ మౌంటెన్.. దేశంలోని ప్రధాన యురేనియం శుద్ధి కేంద్రం నతాంజ్‌కు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. పర్వతం లోపల వందల మీటర్ల లోతులో రెండు భారీ భూగర్భ టన్నెల్ సముదాయాలను నిర్మిస్తున్నారు. అత్యంత పటిష్ఠమైన ఈ నిర్మాణం వల్ల సాధారణ బంకర్-బస్టర్ బాంబులతోనూ దీనిని పూర్తిగా ధ్వంసం చేయడం కష్టమని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ తన అణు పరికరాలు, సెంట్రిఫ్యూజ్‌లు లేదా యురేనియం నిల్వలను ఇక్కడ భద్రపరిచే అవకాశం ఉండటంతో.. భవిష్యత్తులో అణు కార్యక్రమాలను తిరిగి కొనసాగించేందుకు ఇది కీలక స్థావరంగా మారొచ్చన్నదే అమెరికా ఆందోళన.ఇజ్రాయెల్‌కు అండగా..అమెరికా జోక్యం చేసుకోకపోతే ఇజ్రాయెల్, మొత్తం మిడిల్ఈస్ట్ మరింత తీవ్రమైన ముప్పును ఎదుర్కొనేవని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేసుకునే పరిస్థితిని తాము అడ్డుకున్నామని చెప్పారు. ఇరాన్ నుంచి యూరప్, అమెరికా నగరాలపైనా భవిష్యత్తులో ముప్పు ఏర్పడే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.ఇదిలా ఉండగా.. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇటీవల ఇరాన్‌కు చెందిన పలు సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కు చెందిన వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్లు, సముద్ర కార్యకలాపాలకు సంబంధించిన ప్రాంతాలు, మైన్లు అమర్చే సామర్థ్యాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.రాడార్లను రెండుసార్లు ధ్వంసం చేశాంఇరాన్ రాడార్ వ్యవస్థలపై అమెరికా దాడులను కూడా ట్రంప్ ప్రస్తావించారు. అత్యాధునిక రాడార్ వ్యవస్థలను ఇరాన్ రెండుసార్లు ఏర్పాటు చేసినా.. వాటిని అమెరికా ధ్వంసం చేసిందన్నారు. ‘‘రాడార్‌ను మళ్లీ ఏర్పాటు చేసి మళ్లీ దాడికి గురికావడం వారికి విసుగొచ్చిందని అనుకుంటున్నా’’ అని వ్యాఖ్యానించారు.అమెరికా తాజా దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. తమ సార్వభౌమత్వాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఆరోపించింది. పలు ప్రావిన్సుల్లో సైనికేతర మౌలిక వసతులు, పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించింది. అమెరికా దాడులకు ప్రతిగా పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలపై ‘తీవ్రమైన ప్రతిదాడులు’ చేపట్టినట్లు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది.ఇదీ చదవండి: అబ్బే.. అదసలు విషయమే కాదు: ట్రంప్ -
అక్కడ మెలోనీ.. ఇక్కడ మోదీ
ప్రపంచ రాజకీయాల్లో ఈ జంట కనిపిస్తే సోషల్ మీడియాలో సందడి మొదలవుతుంది. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య ఉన్న స్నేహబంధం మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇద్దరి సరదా సంభాషణలు, ఆప్యాయ పలకరింపులు ఇప్పటికే ‘మెలోడీ’ పేరుతో వైరల్‌గా మారాయి. తాజాగా మెలోనీకి మోదీ చేసిన ఓ ప్రత్యేక విషెస్ ఈ స్నేహాన్ని మరోసారి చర్చలోకి తెచ్చింది.ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ అరుదైన ఘనత సాధించారు. అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన నేతగా ఆమె తాజాగా రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు అభినందనలు తెలిపారు. మెలోనీని తన స్నేహితురాలిగా పేర్కొంటూ.. ఆమె నాయకత్వంపై ఇటలీ ప్రజలకు ఉన్న విశ్వాసానికి ఈ ఘనత నిదర్శనమని అన్నారు.“నా స్నేహితురాలు ప్రధాని మెలోనీకి అభినందనలు. ఇటలీ యుద్ధానంతర చరిత్రలో అత్యంత ఎక్కువ కాలం నిరంతరంగా ప్రధానమంత్రిగా కొనసాగుతున్న ప్రధానిగా ఆమె నిలిచారు” అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా శుక్రవారం ఓ పోస్ట్ చేశారు. మెలోనీ నాయకత్వంలో భారత్–ఇటలీ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమైందని పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం మెలోనీతో కలిసి మరింత సన్నిహితంగా పనిచేయాలని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.Mi congratulo con la mia amica, il Primo Ministro Meloni, per essere diventata il Primo Ministro con il mandato più lungo nella storia del dopoguerra italiano. Questo traguardo riflette la fiducia che il popolo italiano ripone nella sua leadership. La sua amicizia è stata…— Narendra Modi (@narendramodi) September 4, 2026అలా ప్రధానిగా..1977లో రోమ్‌లో జన్మించిన జార్జియా మెలోనీ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. 1992లో యువజన రాజకీయ ఉద్యమంలో చేరిన ఆమె.. ఆ తర్వాత ఇటలీ పార్లమెంట్లో అడుగుపెట్టారు. 2008లో అప్పటి ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ ప్రభుత్వంలో యువజన వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 2012లో ‘బ్రదర్స్ ఆఫ్ ఇటలీ’ పార్టీని స్థాపించి, 2014లో దాని అధ్యక్షురాలయ్యారు. 2022 సాధారణ ఎన్నికల్లో ఆమె పార్టీ నేతృత్వంలోని కూటమి విజయం సాధించడంతో.. అదే ఏడాది అక్టోబర్ 22న ఇటలీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తద్వారా ఇటలీ చరిత్రలో తొలి మహిళా ప్రధానిగా మెలోనీ రికార్డు సృష్టించారు. తాజా రికార్డుపై ఇటు తన సోషల్ మీడియాలో మెలోనీ సైతం ఓ పోస్ట్ చేశారు.Oggi il nostro Governo diventa il più longevo della storia della Repubblica italiana.È un dato che accolgo con gratitudine e con un forte senso di responsabilità. Perché la stabilità non è un record da esibire, ma la condizione che consente a una Nazione di programmare,… pic.twitter.com/EpdHe35vJa— Giorgia Meloni (@GiorgiaMeloni) September 4, 2026మెలోనీ కంటే ముందు..ఇటలీ రిపబ్లిక్ ఏర్పడిన 1946 తర్వాత ఎంతోమంది ప్రధానులు మారారు. మెలోనీకి ముందు సుదీర్ఘకాలం నిరంతరంగా ప్రధానిగా కొనసాగిన రికార్డు సిల్వియో బెర్లుస్కోనీ పేరిట ఉండేది. 2001లో ప్రారంభమైన ఆయన రెండో ప్రభుత్వం 1,412 రోజులు కొనసాగింది. 2022 అక్టోబర్ 22న ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మెలోనీ తాజాగా ఆ రికార్డును అధిగమించారు.‘మెలోడీ’గా ఫేమస్..మోదీ, మెలోనీ మధ్య స్నేహం అంతర్జాతీయ వేదికలపైనా ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. ఇద్దరి సమావేశాలు, సంభాషణలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో ‘మెలోడీ’ అనే హ్యాష్‌ట్యాగ్ కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. మెలోనీ కూడా గతంలో మోదీతో తన స్నేహాన్ని సానుకూలంగా ప్రస్తావించారు. ఆఖరికి ఈ బంధం మెలోడీ చాక్లెట్లు పంచుకునే సరదా స్థాయి దాకా వెళ్లింది. అయితే ఈ బంధం గురించి ఇటు ఇండియాలో రాజకీయ దుమారం రేపిన సందర్భమూ ఉంది. ఆ సంగతి పక్కన పెడితే.. ఇక్కడ మోదీ రికార్డేఇటలీలో మెలోనీ సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగుతూ రికార్డు నెలకొల్పిన వేళ.. భారత్‌లోనూ ప్రధాని మోదీ సుదీర్ఘ పాలనతో ప్రత్యేక గుర్తింపు సాధించారు. 2014లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ.. 2019, 2024లో వరుసగా ఎన్నికై మూడోసారి ప్రధానిగా కొనసాగుతున్నారు. దీంతో దేశంలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన నేతల జాబితాలో మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. భారత్‌లో నెహ్రూ తర్వాత వరుసగా మూడు సార్లు ఎన్నికై ప్రధానిగా కొనసాగుతున్న నేతగా మోదీ నిలిచారు. ఇటలీలో మెలోనీ, భారత్‌లో మోదీ.. ఇద్దరూ తమ తమ దేశాల్లో సుదీర్ఘ రాజకీయ ప్రయాణంతో ప్రత్యేక ముద్ర వేశారు.మరింత బలపడనున్న బంధంఇటలీతో భారత్ సంబంధాలు మోదీ ప్రధాని అయ్యాకే క్రమక్రమంగా బలపడుతూ వచ్చాయి. ముఖ్యంగా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో మెలోనీ స్నేహం కీలకంగా ఉందని మోదీనే చాలాసార్లు పేర్కొన్నారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు, ఇంధనం వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం కొనసాగుతున్న నేపథ్యంలో.. భవిష్యత్తులోనూ ఈ సంబంధాలు మరింత విస్తరించనున్నాయని మోదీ సంకేతమిచ్చారు.ఇదీ చదవండి: మెలోనీ అనుకుని కౌగిలించుకున్నారా? -
స్పెయిన్ సర్వనాశనం కావడం ఖాయం: ట్రంప్
స్పెయిన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆఫ్రికా-యూరప్ సరిహద్దు సియూటాలో కొనసాగుతున్న వలస సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ.. పరిస్థితిని సరిగా ఎదుర్కోలేకపోతే ఆ దేశం ‘నాశనమవుతుందని’ హెచ్చరించారు. ఇది సైనిక దాడి కంటే కూడా తీవ్రమైన సమస్యగా ఆయన వ్యాఖ్యానించారు. భారీ సంఖ్యలో వలసదారులు ఒక్కసారిగా దేశంలోకి చొచ్చుకురావడాన్ని తాను ఎప్పుడూ చూడలేదని ట్రంప్ అన్నారు.జీబీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. సియుటా(Ceuta)లోకి ఉత్తర ఆఫ్రికా దేశం మొరాకో నుంచి భారీగా వలసదారులు ప్రవేశించడాన్ని ‘దండయాత్ర’గా అభివర్ణించారు. వేలాది మంది ఒక్కసారిగా దేశంలోకి చొచ్చుకురావడం సాధారణ విషయం కాదని, తాను ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని అన్నారు. బ్రిటన్ కూడా వలసల సమస్యను ఎదుర్కొంటోందని.. అయితే సియూటాలో ఉన్నంత స్పష్టంగా అక్కడ పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఇంతకు ముందు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. వలసల్ని నియంత్రించకపోతే అమెరికాకు కూడా ఇదే గతి పడుతుందని అన్నారాయన.జూలై 30, 31 తేదీల్లో మొరాకో నుంచి సియూటాలోకి ఉప్పెనలా వలసలు వెల్లువెత్తాయి. దాదాపు 60 వేల మంది సముద్ర మార్గంలో ఈ స్పెయిన్ భూభాగంలోకి ప్రవేశించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో కొందరు నీట మునిగి మరణించారు కూడా. దీంతో సరిహద్దు భద్రతా సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. స్పెయిన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు 50 వేల మందికి పైనే తిరిగి మొరాకోకు చేరుకున్నారు. వీళ్లలో చాలామందిని సైన్యం వెనక్కి పంపించింది. అదే సమయంలో సియూటాలో సాయం అందక.. నిరుత్సాహంతో చాలా మంది వాళ్లంతట వాళ్లే వెనక్కి వెళ్లిపోయారు. మరో 5 వేల మంది ఇంకా సియూటాలో ఉన్నారు. వీరిలో వెయ్యి మందికిపైగా మైనర్లు ఉన్నారు. అయితే స్థానిక ప్రభుత్వం మాత్రం ఈ సంఖ్యను 9 వేలుగా పేర్కొంటోంది.వలసదారులు సరిహద్దు దాటేందుకు మొరాకో అధికారులు అనుమతించారన్న ఆరోపణలు వచ్చినప్పటికీ.. స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ మొరాకో పాత్రను తోసిపుచ్చారు. అయితే సియూటా సంక్షోభంపై దేశంలో సాంచెజ్‌పై రాజకీయ ఒత్తిడి పెరుగుతోంది. పెద్ద సంఖ్యలో ప్రజలు నిరసనలు చేపట్టి ఆయన రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. వచ్చే ఏడాది స్పెయిన్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు సాంచెజ్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి.ఇదిలా ఉండగా.. వలస సంక్షోభం ప్రభావం స్పెయిన్ అంతర్జాతీయ సంబంధాలపైనా పడుతోంది. ఇటలీతోనూ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరు దేశాలు షెంగెన్ ప్రాంతంలో భాగస్వాములు అయినప్పటికీ.. పరస్పరం తమ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై తనిఖీలు విధించుకున్నాయి.మరోవైపు అమెరికా–స్పెయిన్ సంబంధాల్లోనూ గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఇరాన్‌పై దాడులకు అమెరికా తన స్థావరాలను ఉపయోగించుకునేందుకు స్పెయిన్ అనుమతించలేదు. అలాగే నాటో రక్షణ వ్యయాన్ని 2035 నాటికి జీడీపీలో 5 శాతానికి పెంచాలన్న ట్రంప్ లక్ష్యాన్ని స్పెయిన్ వ్యతిరేకించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 2 శాతం లక్ష్యమే సరిపోతుందని సాంచెజ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే స్పెయిన్ నాటో విషయంలో సరిగా వ్యవహరించడం లేదంటూ ట్రంప్ మరోసారి విమర్శలు గుప్పించారు.ఇదీ చదవండి: ఒక్కసారి ఇరాన్ వచ్చిపో.. శామ్ అంకుల్ -
నేపాల్‌లో అద్భుతం.. 9 రోజుల తర్వాత సజీవంగా!
నేపాల్ ఆకస్మిక వరదతో వేలమంది గల్లంతైన వేళ.. అద్భుత ఘటన చోటుచేసుకుంది. శిథిలాలతో పూర్తిగా కూరుకుపోయిన జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్లో చిక్కుకున్న ఇద్దరు కార్మికులను తొమ్మిది రోజుల తర్వాత సజీవంగా రక్షించగలిగారు. దీంతో సహాయక బృందాల్లోనే కాకుండా.. గల్లంతైన వారి కుటుంబాల్లోనూ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.త్రిశూలి ప్రాంతంలోని త్రిశూలి-3ఏ జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్లో ఈ ఘటన జరిగింది. ఆగస్టు 26న వచ్చిన భారీ వరదల కారణంగా టన్నెల్ ప్రవేశ మార్గం మట్టి, బురద, శిథిలాలతో మూసుకుపోయింది. అప్పటి నుంచి లోపల చిక్కుకున్న కార్మికుల కోసం సహాయక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ క్రమంలో తొమ్మిదో రోజు ఇద్దరు వ్యక్తులు సజీవంగా ఉన్నట్లు గుర్తించి.. వారిని బయటకు తీసుకొచ్చారు.వాళ్ల పేర్లు కబీర్ మహార్జన్ (45), సంజయ్ షా (30)గా నేపాల్ హోంమంత్రి సుదన్ గురుంగ్ వెల్లడించారు. కబీర్ మహార్జన్ త్రిశూలి-3ఏ ప్రాజెక్టులో సూపర్వైజర్గా పనిచేస్తుండగా.. సంజయ్ షా నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీలో మెకానికల్ ఫోర్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు టన్నెల్లో చిక్కుకున్నప్పటికీ ప్రాణాలతో బయటపడటం వారి కుటుంబ సభ్యులకు ఊరటనిచ్చింది.TWO MEN RESCUED ALIVE AFTER 9 DAYS IN NEPAL TUNNELSanjay Sah and Kabir Maharjan were rescued alive from the Trishuli 3A hydropower tunnel, nine days after the August 26 flash flood. Rescuers heard voices inside and are continuing the search for others who may remain trapped. pic.twitter.com/ttV3RKbdtd— Subodh Kumar (@kumarsubodh_) September 4, 2026ఓ పొడి గదిలో ఉండడంతో.. వాళ్లు ప్రాణాలతో బయటపడగలిగారని రెస్క్యూ టీం వెల్లడించింది. సంజయ్ షాను బయటకు తీసుకువచ్చే సమయానికి ఆయన మాట్లాడే పరిస్థితిలో లేరని సమాచారం. వెంటనే అతడిని బట్టార్ ప్రాంతానికి విమానంలో తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు కబీర్ మహార్జన్ స్పృహలోనే ఉన్నారని ఆయన భార్య తెలిపారు. ఆయనను ఖాట్మాండులోని ఛావునీ మిలటరీ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.ఇద్దరు కార్మికులను బయటకు తీసుకొచ్చిన దృశ్యాలు స్థానిక టీవీ చానళ్లలో ప్రసారమయ్యాయి. బురదతో పూర్తిగా తడిసిపోయిన ఓ కార్మికుడిని రక్షక సిబ్బంది భుజాలపై మోసుకెళ్లారు. మరో వ్యక్తిని బయటకు తీసుకొచ్చిన సమయంలో అతడి చేతులు జోడించి ప్రార్థిస్తున్న దృశ్యం కనిపించింది. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తొమ్మిది రోజుల పాటు చీకటి, బురద మధ్య ప్రాణాలతో పోరాడి బయటపడటం నిజంగా అద్భుతమేనని పలువురు పేర్కొంటున్నారు.ఇదిలా ఉంటే.. నేపాల్‌లోని మరికొన్ని జలవిద్యుత్ ప్రాజెక్టుల టన్నెళ్లలో కూడా భారీగా కార్మికులు చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. దాదాపు అరడజను టన్నెళ్లలో 150 మందికిపైగా చిక్కుకుని ఉండొచ్చని అంచనా. మొత్తం 12 జలవిద్యుత్ ప్రాజెక్టులకు చెందిన సుమారు 900 మంది కార్మికులు గల్లంతైనట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. వీరిలో దాదాపు 500 మంది టన్నెళ్లలో చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. వారిని గుర్తించి రక్షించేందుకు ఇంజినీర్లు టన్నెళ్లలోకి గాలిని పంపుతున్నారు. ఆగస్టు 26న సంభవించిన ఈ భారీ విపత్తు నేపాల్‌లోని పలు పట్టణాలు, లోయలను అతలాకుతలం చేసింది. హిమనదం(గ్లేసియర్) కూలిపోవడం వల్లే ఆకస్మిక వరదలు సంభవించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు 1,259 మంది మృతి చెందగా.. 5,000 మందికిపైగా గల్లంతైనట్లు నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. టన్నెల్ నుంచి ఇద్దరు సజీవంగా బయటపడటంతో.. ఇంకా ఎక్కడైనా చిక్కుకున్న వారు ఉంటే వారిని కూడా క్షేమంగా రక్షించవచ్చన్న ఆశలు బలపడ్డాయి.ఇదీ చదవండి: చేతులు కాలాక ఆకులు పట్టుకున్న నేపాల్! -
భారత్ లింక్ డీల్ ప్లాఫ్.. ఎస్టోనియా మంత్రి ఔట్!
యూరప్ దేశం ఎస్టోనియాలో భారీ ఆయుధ ఒప్పందం రాజకీయ ప్రకంపనలు రేపింది. ఉక్రెయిన్‌కు అత్యవసరంగా ఆయుధాలు అందించాలన్న తొందరలో ప్రభుత్వం చేసుకున్న ఓ ఖరీదైన డీల్ చివరికి వివాదాస్పదంగా మారింది. దీంతో ఎస్టోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్ రాజకీయ బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. అయితే ఈ వ్యవహారంలో భారత యాజమాన్యంలోని కంపెనీ పేరు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది.ఎస్టోనియా 2022 నుంచే ఉక్రెయిన్‌కు పెద్ద ఎత్తున సైనిక సాయం చేస్తోంది. అందులో ఆయుధాలు, ఆర్టిలరీ వ్యవస్థలు, మందుగుండు సామగ్రి ఉన్నాయి. 2024లో రష్యాతో భీకర యుద్ధం ప్రారంభం కాగానే ఉక్రెయిన్‌కు అత్యవసరంగా మందుగుండు సామగ్రి అందించేందుకు ఇటలీకి చెందిన డాటాసెల్ అనే కంపెనీతో ఎస్టోనియా ఒప్పందం చేసుకుంది. అయితే అదే ఏడాది భారత్‌కు చెందిన నెకో డిఫెన్స్ మ్యూనిషన్స్(Neco Defence Munitions) సదరు కంపెనీని టేక్ ఓవర్ చేసింది. అయితే ఆ తర్వాతే తేలింది ఏంటంటే.. ఆర్టిలరీ షెల్స్ విక్రయించిన అనుభవం డాటాసెల్ కంపెనీకి ఏమాత్రం లేదని!. ఇదే ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణమైంది. ఎస్టోనియా ప్రభుత్వం ఈ డీల్ కోసం భారీగా ఖర్చు చేసింది. మొదటి ఒప్పందంలో భాగంగా సుమారు 15 మిలియన్ యూరోలు అడ్వాన్స్‌గా చెల్లించింది. ఆ తర్వాత మరో 10 మిలియన్ యూరోలకు పైగా చెల్లింపులు జరిగాయి. అలా.. పలు ఒప్పందాలతో కలిపి ముందస్తు చెల్లింపులే సుమారు దాదాపు 70 మిలియన్ యూరోల (రూ.769 కోట్లకుపైగా) చేరాయి. ఈ నిధులన్నీ యూరోపియన్ యూనియన్ పీస్ ఫెసిలిటీ ద్వారా సమకూరినట్లు తెలుస్తోంది. అయితే.. నిర్ణయించిన సమయంలో ఉక్రెయిన్‌కు ఆయుధాలు చేరలేదు. ఉత్పత్తి సమస్యల కారణంగానే సరఫరా ఆలస్యమైందని ఎస్టోనియా వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో 2025లో కొంత సామగ్రి అందినప్పటికీ.. అది నాసిరకంగా ఉందని ఎస్టోనియా ఆరోపించింది. దీంతో గతేడాది ఒప్పందాలను రద్దు చేసి, ముందుగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని కంపెనీని కోరింది.అయితే డాటాసెల్ ఈ ఆరోపణలను ఖండించింది. ఇప్పటికే తాము సుమారు 59 మిలియన్ యూరోల విలువైన మందుగుండు సామగ్రిని అందించామని, సుమారు 58 మిలియన్ యూరోల ఇన్వాయిస్లు సమర్పించామని చెబుతోంది. నాణ్యతా లోపాల ఆరోపణలను కూడా సంస్థ తోసిపుచ్చింది. అలా పరస్పర ఆరోపణలతో ఈ వివాదం అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌కు చేరింది. రూ.769 కోట్లు ఎటు పోయాయి?ఆయుధ ఢీల్లో భాగంగా సదరు కంపెనీకి ఎస్టోనియా చెల్లించిన భారీ ముందస్తు మొత్తం వెనక్కి వస్తుందా?. దీనిపైనే ఇప్పుడు అనిశ్చితి నెలకొంది. ఒకవేళ ఆ మొత్తాన్ని రాబట్టలేకపోతే.. తన సొంత బడ్జెట్ నుంచి ఎస్టోనియా భరించాల్సి వస్తుందని ఆ దేశ నేషనల్ ఆడిట్ ఆఫీస్ ఇప్పటికే హెచ్చరించింది. ఈ వ్యవహారంతోపాటు ఎస్టోనియా రక్షణ శాఖలో నిధుల వినియోగం, సైనిక కొనుగోళ్లపై నేషనల్ ఆడిట్ ఆఫీస్ పలు ప్రశ్నలు లేవనెత్తింది. దీంతో రాజకీయ బాధ్యత తీసుకుంటూ పెవ్కుర్ పదవి నుంచి తప్పుకున్నారు. వ్యక్తిగతంగా తాను ఈ ఒప్పందాన్ని పర్యవేక్షించలేదని ఆయన చెప్పినప్పటికీ.. రక్షణ రంగానికి మంత్రిగా రాజకీయ బాధ్యత తనదేనని ప్రకటించారు. ఎస్టోనియా ప్రధాని క్రిస్టెన్ మిచల్ కూడా పెవ్కుర్ వ్యక్తిగతంగా తప్పు చేశారని తాను భావించడం లేదని గతంలో పేర్కొన్నారు. భారత కంపెనీదే బాధ్యతా?ఈ వ్యవహారంలో భారత కోణం నెకో డిఫెన్స్ మ్యూనిషన్స్ ద్వారా వచ్చింది. డాటాసెల్ ఇటలీలో నమోదైన సంస్థ అయినప్పటికీ.. దాన్ని 2024లో భారత కంపెనీ కొనుగోలు చేసింది. అయితే ప్రస్తుతం బయటపడిన అంశాలు ఒప్పంద వివాదానికి సంబంధించినవే తప్ప.. భారత కంపెనీ మోసానికి పాల్పడిందని నిర్ధారించే ఆధారం కాదట. కాబట్టి.. ఎస్టోనియా వాదనలను వ్యతిరేకిస్తూ న్యాయపోరాటం చేస్తోంది. ఈ వివాదంపై అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కొనసాగుతోంది. డాటాసెల్ తరఫున ఎస్టోనియాపై కౌంటర్క్లెయిమ్ దాఖలైంది. తదుపరి విచారణ వచ్చే నెలలో జరగనుందని నెకో డిఫెన్స్ మ్యూనిషన్స్ డైరెక్టర్ సిద్ధార్థ్ జైస్వాల్ తెలిపారు.ఉక్రెయిన్‌కు అత్యవసరంగా ఆయుధాలు అందించాలన్న తొందరలో.. సరఫరాదారు సామర్థ్యాలు, గత అనుభవం వంటి అంశాలను తగినంతగా పరిశీలించారా? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. యుద్ధ సమయంలో వేగంగా ఆయుధాలు సమకూర్చడం ఒకవైపు.. ప్రజాధనాన్ని కాపాడేందుకు కఠినమైన తనిఖీలు చేయడం మరోవైపు ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారింది.ఇదీ చదవండి: హబీబీ.. కమ్ టూ ఇరాన్ -
‘హబీబీ.. దా!’.. అమెరికాను ఆటాడుకున్న ఇరాన్
ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటల యుద్ధం ఓ రేంజ్లో సాగుతోంది. ఓసారి ‘హర్ముజ్ సీమైన్లను తొలగించి.. పూర్తిగా ఆధీనంలోకి తెచ్చుకున్నాం’ అంటారు. మరోసారి హర్ముజ్‌లో ఇరాన్ మళ్లీ సీమైన్లు పెడుతోందని.. తమ సైన్యం అడ్డుకుంటోందని అంటారు. ఇంకోసారి ఇరాన్లో అమెరికా నిఘా ఎంత పక్కాగా ఉందో చెబుతూ.. ‘వాళ్లు బాత్రూమ్కు వెళ్లినా మాకు తెలిసిపోతుంది’ అని వ్యాఖ్యానించారు. మరి ట్రంప్ ఇంతలా మాట్లాడుతుంటే.. ఇరాన్ ఏం చేసిందో తెలుసా?.. ‘హబీబీ.. ఇరాన్‌కు రా!’ అంటూ అమెరికాను ఓ ఆటాడుకుంటోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్ముజ్ విషయంలో చేస్తున్న హెచ్చరికలకు నేరుగా స్పందించకుండా.. ఒక వీడియో గేమ్ రూపంలో వ్యంగ్యాస్త్రం సంధించింది ఇరాన్. ఆ దేశ ఎంబసీకి చెందిన సోషల్ మీడియా ఖాతా ఈ వ్యంగ్య వీడియోను పోస్టు చేసింది. కేవలం 35 సెకన్ల నిడివి ఉన్న యానిమేషన్లో హర్ముజ్ జలసంధి 3డీ మ్యాప్ కనిపిస్తుంది. ఆ తర్వాత అది ‘మైన్స్వీపర్’ గేమ్‌లా మారుతుంది. పాత కంప్యూటర్లలో బాంబులు ఎక్కడున్నాయో గుర్తిస్తూ ఆడే ఈ గేమ్‌ను.. హర్ముజ్‌లోని సీమైన్లకు అన్వయిస్తూ ఇరాన్ ఈ వీడియో రూపొందించింది. దానితోపాటు ‘హబీబీ (అంకుల్ సామ్).. ఇరాన్‌కు రా!’ అంటూ సందేశం ఇచ్చింది. అంటే మైన్స్వీపర్లో బాంబుల కోసం వెతికినట్టే.. అమెరికా కూడా హర్ముజ్‌లో సీమైన్ల కోసం వెతుకుతోందన్న భావన వచ్చేలా హేళన చేస్తూ వీడియోను రూపొందించిందన్నమాట.అసలు మైన్ల గొడవేంటి?పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటి నుంచి.. హార్ముజ్ జలసంధిలో సీమైన్లు ఏర్పాటు చేసి నౌకల రాకపోకలను అడ్డుకునేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో దాదాపు ఐదు నెలల తర్వాత సీక్రెట్ ఆపరేషన్‌తో వాటిని సమర్థవంతంగా తొలగించామని.. ఇది అమెరికా సైన్యం సాధించిన అజేయ విజయమని ట్రంప్ ప్రకటించారు. అయితే రెండ్రోజులకే నాలిక మడతేసి.. ఇరాన్ మళ్లీ కొత్తగా సీమైన్లు ఏర్పాటు చేస్తోందని ఆరోపించారు. అయినప్పటికీ అంతర్జాతీయ నౌకా మార్గాల్లో వాటిని తొలగించే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు.Habibi (Uncle Sam), come to Iran! pic.twitter.com/Ay6FdpwF8E— Iran Embassy in Sierra Leone (@IRANinSalone) September 3, 2026ఈ క్రమంలో.. హార్ముజ్ జలసంధిలోని ఇరాన్‌కు చెందిన లారక్ దీవిపై అమెరికా రెండు రాకెట్ లాంచర్లను ధ్వంసం చేసింది. ఆ లాంచర్లతో సీమైన్లను హార్ముజ్‌లోకి పంపేందుకు ఇరాన్ సిద్ధమవుతోందని అమెరికా ఆరోపించింది. దీనికి ప్రతిగా జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులను ప్రయోగించడంతో దాదాపు నెల రోజుల తర్వాత పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. ఈ క్రమంలో అమాయకులు సైతం ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇరాన్ మాత్రం అమెరికా వాదనలను ముందు నుంచే కొట్టిపారేస్తోంది. హర్ముజ్ సీమైన్ల విషయంలో అమెరికా తొలి నుంచి చెబుతోందంతా అబద్ధమేనని.. మార్కెట్లను శాంతింపజేసే ప్రయత్నమేనని అంటోంది. అంతేకాదు.. హర్ముజ్‌పై పూర్తి నియంత్రణ తమదేనంటూ ఉద్ఘాటించింది. దీంతో అమెరికా-ఇరాన్‌ల మధ్య‘ఎవరి నిఘా ఎంత?’.. ‘హార్ముజ్‌పై ఎవరి పట్టు?’ అనే రీతిలో పోరు కొనసాగుతోంది.ట్రంప్ మాటలకు మాటలతోనే కాదు..తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ఇరాన్‌పై సైనిక దాడులు కొనసాగిస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా అమెరికా స్థావరాలు, ప్రాంతీయ మిత్రదేశాలపై క్షిపణి, డ్రోన్ దాడులకు దిగుతోంది. దీంతో హర్ముజ్ చుట్టూ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇదే సమయంలో చమురు ఎగుమతులను అడ్డుకోవడం, ఆంక్షలను కఠినతరం చేయడం ద్వారా ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచాలని అమెరికా ప్రయత్నిస్తోంది. అయితే హర్ముజ్ విషయంలో అమెరికా సైనిక బలం, ఇరాన్ వ్యూహాత్మక ప్రతిస్పందన.. రెండూ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ఇదీ చదవండి: శని గ్రహంపై సరికొత్త మిస్టరీ! -
ఇరాన్‌పై అమెరికా నిఘా మామూలుగా లేదట!
ఇరాన్‌పై అమెరికా నిఘా ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్లో ఏం జరుగుతుందో తమకు క్షణక్షణం తెలుసని.. అక్కడి వ్యక్తులు తమ కంటపడకుండా కనీసం బాత్రూమ్కు కూడా వెళ్లలేరంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై మరోసారి దాడి చేయాల్సి వస్తే ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.వైట్‌హౌస్‌లో ఇవాళ విలేకరులతో మాట్లాడిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ హర్ముజ్ జలసంధి ప్రాంతంలో రాడార్ వ్యవస్థలు, క్షిపణి వ్యవస్థలు, సముద్రంలో మైన్లు వేసే సామర్థ్యాన్ని తిరిగి నిర్మించేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. వాటిని అమెరికా నిఘా వ్యవస్థలు గుర్తించాయని.. నిర్మాణం పూర్తయ్యేలోపే లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశామని పేర్కొన్నారు. ‘‘ఇరాన్ నాయకత్వం మమ్మల్ని తక్కువ అంచనా వేస్తోంది. కానీ, వాళ్లేం చేస్తున్నారో మాకు అంతా కనిపిస్తోంది. వాళ్లు కదలలేరు. ప్రశాంతంగా బాత్రూమ్కు కూడా వెళ్లలేరు’’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ సైనిక సామర్థ్యాలు, అక్కడి కదలికలపై అమెరికా ఎంత విస్తృతంగా నిఘా కొనసాగిస్తుందో చెప్పే క్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ రాడార్ వ్యవస్థలు, క్షిపణి సామర్థ్యాలు, హోర్ముజ్ జలసంధి వద్ద సైనిక కార్యకలాపాలపై అమెరికాకు పూర్తి సమాచారం ఉందని ఆయన చెప్పుకొచ్చారు.మరోవైపు.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి ట్రంప్ భద్రత విషయంలో అమెరికా భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. దీనికి నిదర్శనంగా టర్కీలో చోటుచేసుకున్న ఘటనను చెప్పుకోవచ్చు. ఇరాన్ నుంచి ట్రంప్‌పై ముప్పు ఉందన్న నిఘా సమాచారంతో.. ఆయన ప్రయాణాన్ని అత్యంత రహస్యంగా మార్చారు. అంకారా నుంచి బయలుదేరే సమయంలో ట్రంప్ పాత ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ఉన్నట్లు బయట ప్రపంచానికి కనిపించినప్పటికీ.. అనంతరం క్యాటరింగ్ వాహనం ద్వారా మరో చిన్న సైనిక విమానంలోకి రహస్యంగా తరలించారు. మీడియా, కొంతమంది సిబ్బందికి కూడా ఆయన అసలు విమానంలో లేరన్న విషయం వెంటనే తెలియలేదు. అంటే.. ట్రంప్ భద్రత కోసం అమెరికా ఎంత స్థాయిలో రహస్య ఆపరేషన్లు నిర్వహించిందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ఇప్పుడు ఇరాన్ కదలికలపై తమ నిఘా సామర్థ్యాన్ని చాటుకునే క్రమంలో ట్రంప్ చేసిన ‘‘బాత్రూమ్కు కూడా వెళ్లలేరు’’ వ్యాఖ్యలు.. భద్రతా వ్యవస్థపై ఆయనకున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తున్నాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.హర్ముజ్ మా ఆధీనంలోనే..ఇరాన్ ఆంక్షల కారణంగా నెలలుగా తీవ్ర ఉద్రిక్తతకు కేంద్రంగా మారిన హర్ముజ్ జలసంధిపై కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంపై అమెరికాకు బలమైన నియంత్రణ ఉందని చెప్పారు. ప్రతిరోజూ భారీ మొత్తంలో చమురును తీసుకెళ్లే నౌకలు అక్కడి నుంచి వెళ్తున్నాయని.. అప్పుడప్పుడు ఇరాన్ డ్రోన్లు దాడి చేసినా వాటిని కూల్చివేస్తున్నామని తెలిపారు.ఇరాన్ సముద్రంలో మైన్లు వేయడానికి ప్రయత్నిస్తోందని, ఇందుకోసం ప్రత్యేకంగా రాకెట్ వ్యవస్థను సిద్ధం చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. ఆ సామర్థ్యాన్ని అమెరికా దాడుల్లో ధ్వంసం చేశామని పేర్కొన్నారు.భారీ దాడి.. 18 మంది మృతిఇటీవల.. దాదాపు నెల గ్యాప్ తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య పరస్పర దాడులు జరిగాయి. ఇందులో ఇరాన్లో కనీసం 18 మంది మృతి చెందగా, 108 మంది గాయపడ్డారని తాజా నివేదికలు చెబుతున్నాయి. హర్ముజ్ సమీపంలోని కుహెస్తక్ ప్రాంతంలో ఓ వివాహ వేడుక జరుగుతున్న ఇంటిపై అమెరికా దాడి జరిగినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు ఏపీ నివేదించింది. అయితే అమెరికా సైన్యం మాత్రం తామేమీ పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని తెలిపింది.అమెరికాకు ఇరాన్ దీటైన బదులుఅమెరికా దాడులకు ఇరాన్ కూడా తీవ్రంగా స్పందించింది. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు, అమెరికా మిత్రదేశాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు సమాచారం. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్, యూఏఈ, ఇరాక్‌లోని కుర్దిస్తాన్ ప్రాంతాల్లో అమెరికా ప్రయోజనాలకు చెందిన లక్ష్యాలపై ఇరాన్ దాడులు చేసినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.‘ఏ క్షణమైనా దాడి చేస్తాం’ఇరాన్‌తో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా అవసరమైతే ఇరాన్‌పై ఎప్పుడైనా కొత్త దాడికి దిగేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఆ దాడులు భీకరంగా ఉండొచ్చని కూడా వ్యాఖ్యానించారు. అయితే తాజా దాడుల తర్వాత పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగదని, త్వరలోనే ముగిసే అవకాశం ఉందన్న ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: ఇరాన్ అధ్యక్షుడితో మోదీ భేటీ.. అమెరికా కన్నెర్ర -
చేతులు కాలాక.. ఆకులు పట్టుకుంటున్న నేపాల్!
హిమాలయాల కొండల్లో.. సునామీ విరుచుకుపడిన వరద నేపాల్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. మంచు, మట్టి, రాళ్లతో ఉప్పొంగిన వరద ప్రవాహం గ్రామాలను, రహదారులను, వంతెనలను మింగేసింది. వెయ్యిమందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. వారం గడిచినా కూడా వేలాది మంది ఆచూకీ ఇంకా తెలియడం లేదు. ఇంతటి విపత్తు తర్వాత ఇప్పుడు నేపాల్ కళ్లు తెరిచింది. మరోసారి ఇలాంటి ముప్పు ఎదురైతే కనీసం కొన్ని నిమిషాల ముందైనా ప్రజలను అప్రమత్తం చేయాలని చర్యలు మొదలుపెట్టింది.ఆగష్టు 26న సంభవించిన ఆకస్మిక వరదలపై చైనా తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదనేది నేపాల్ ప్రధాన ఆరోపణ. అయితే తాము సకాలంలోనే స్పందించామని చైనా ఆ ఆరోపణల్ని తోసిపుచ్చింది. ఈ తరుణంలో రసువా జిల్లాలో ఎక్కడైతే వరద ముంచెత్తిందో.. అక్కడే కొత్తగా పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నేపాల్ నిర్ణయించింది. చైనా సరిహద్దుకు సమీపంలోని టిమురే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం, నదుల ఉద్ధృతి వంటి ప్రమాదాలను ముందుగానే గుర్తించేందుకు సీస్మిక్ సెన్సర్లు, కెమెరాలు ఏర్పాటు చేయనుంది. వీటితో పాటు ఉపగ్రహ ఆధారిత వీఎస్ఏటీ (VSAT) కమ్యూనికేషన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది.పాత వ్యవస్థ ఏమైంది?ఇక్కడే అసలు వైఫల్యం బయటపడుతోంది. గతంలోనూ ఆ ప్రాంతంలో వరదలు, నదీ ప్రవాహాన్ని పర్యవేక్షించే వ్యవస్థ ఉంది. అయితే ఆగస్టు 26న సంభవించిన భారీ వరదలో పలు పర్యవేక్షణ కేంద్రాలు, గేజ్‌లు కొట్టుకుపోయాయి. చైనా సరిహద్దుకు సమీపంలోని కనీసం నాలుగు గేజింగ్ స్టేషన్లు దెబ్బతిన్నాయి. దీంతో ప్రమాదాన్ని గుర్తించి సకాలంలో సమాచారం అందించడంలో వ్యవస్థ విఫలమైంది.మొబైల్ నెట్వర్క్ పోయినా..కొత్త వ్యవస్థలో వీఎస్ఏటీని కీలకంగా ఉపయోగించనున్నారు. భారీ విపత్తుల సమయంలో మొబైల్ నెట్‌వర్క్‌లు, ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలు పనిచేయకపోయినా.. ఉపగ్రహం ద్వారా పర్యవేక్షణ కేంద్రాలు అధికారులతో అనుసంధానంలో ఉండేలా దీన్ని ఏర్పాటు చేయనున్నారు. నదీ ప్రవాహం పెరుగుతున్నట్లు గుర్తిస్తే.. ఆ సమాచారాన్ని అధికారులకు చేరవేసి, ప్రజలకు ఎస్ఎంఎస్ హెచ్చరికలు పంపేలా వ్యవస్థను రూపొందించనున్నారు.ఇంకా 4 వేల మంది మిస్సింగ్ఆగస్టు 26న నేపాల్-చైనా సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భారీ వరదకు నేపాల్ తీవ్రంగా నష్టపోయింది. రెండు దేశాల్లో కలిపి కనీసం 1,114 మంది మరణించగా.. దాదాపు 4 వేల మంది గల్లంతయ్యారు. వీరిలో అత్యధిక మరణాలు నేపాల్‌లోనే నమోదయ్యాయి.41 నిమిషాల ఆలస్యం.. ప్రాణాల మీదకుఈ విపత్తులో హెచ్చరిక వ్యవస్థ వైఫల్యం ఎంత తీవ్రంగా ఉందో ఒక అంశం స్పష్టం చేస్తోంది. వరదకు దారితీసిన మంచు, రాళ్ల విరిగిపాటు ఉదయం సంభవించినప్పటికీ.. అధికారిక హెచ్చరిక ప్రజలకు చేరేసరికి దాదాపు 41 నిమిషాలు గడిచిపోయాయి. ఇలాంటి కొండ ప్రాంతాల్లో 10–15 నిమిషాల ముందస్తు సమాచారం కూడా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కీలకంగా మారుతుంది.చైనాతో మరింత డేటా షేరింగ్ఇకపై చైనాతోనూ విపత్తు సమాచారాన్ని మరింత వేగంగా పంచుకునే దిశగా నేపాల్ అడుగులు వేస్తోంది. హిమనదుల కదలికలు, నీటి మట్టాలు, సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పడే ప్రమాదకర పరిస్థితులపై రియల్‌టైమ్ సమాచారాన్ని పొందేందుకు సహకారం పెంచుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే చైనా ఉపగ్రహ చిత్రాలు, నీటి మట్టం–ప్రవాహ సమాచారం, ఎగువ ప్రాంతాల్లో ఏర్పడిన ప్రమాదాలపై వివరాలను పంచుకున్నట్లు సమాచారం.కొన్ని నిమిషాలైనా.. ప్రాణాలు కాపాడొచ్చు!కొత్త వ్యవస్థ వల్ల భారీ విపత్తును పూర్తిగా అడ్డుకోవడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ప్రమాదాన్ని కొన్ని నిమిషాల ముందే గుర్తించి హెచ్చరికలు పంపగలిగితే.. ప్రజలను, సరిహద్దు సిబ్బందిని, సహాయక బృందాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంటుంది. అందుకే ఈసారి జరిగిన ఘోర వైఫల్యం తర్వాత నేపాల్ హడావుడిగా పాత వ్యవస్థ స్థానంలో కొత్త సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది.ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. వందల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. ఇప్పుడు మాత్రం మరో విపత్తు వచ్చినప్పుడు హెచ్చరించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. అందుకే ‘చేతులు కాలాక.. ఆకులు పట్టుకుంటున్న నేపాల్’ అనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఇదీ చదవండి: నేపాల్ వరదలే కాదు.. భూకంపాలకూ కారణం ఇదే! -
ఇరాన్‌కు సహకరిస్తే ఊరుకునేది లేదు!
ఇరాన్ తమ ఆంక్షల నుంచి తప్పించుకునే అవకాశమే లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అంటున్నారు. ఆ దేశానికి ఆదాయం సమకూర్చేలా ఎలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేయడంలోనూ ఇతర దేశాలు సహకరించకూడదని స్పష్టం చేశారు. అలా చేస్తే ఆయా దేశాలపైనా అమెరికా ఆంక్షలు విధించాల్సి వస్తుందని తేల్చిచెప్పారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో బిష్కెక్లో భేటీ అయిన తరుణంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.ఇరాన్‌తో సంబంధాలు కొనసాగించే హక్కు ప్రతి దేశానికీ ఉందని రూబియో పేర్కొన్నారు. అమెరికా కూడా గతంలో ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరిపిందని గుర్తుచేశారు. అయితే ఆర్థికంగా ఇరాన్‌కు సహకరించడం, అమెరికా ఆంక్షలను తప్పించుకునేందుకు మార్గాలు సృష్టించడం మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఇరాన్ ఆంక్షలను తప్పించుకుని ఆదాయం సంపాదించేలా ఏ దేశమైనా సహకరిస్తే.. ఆ దేశంపైనా అమెరికా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఇరాన్ సంపాదించే ఆదాయాన్ని ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడానికి, అణ్వాయుధాల తయారీకి ఉపయోగించే అవకాశం ఉందని రూబియో ఆరోపించారు.భారత్–ఇరాన్ వాణిజ్యంపై కామెంట్..మోదీ–పెజెష్కియాన్ భేటీపై స్పందించిన మార్కో రూబియో.. భారత్, ఇరాన్ మధ్య కొత్త వాణిజ్య ఒప్పందం గురించి తనకు తెలియదని అన్నారు. ఇరాన్‌తో సంబంధాలు పెట్టుకోవడం ఆయా దేశాల విదేశాంగ విధానానికి సంబంధించిన విషయమని పేర్కొన్నారు. అయితే అమెరికా ఆంక్షలను తప్పించుకునేందుకు ఇరాన్‌కు సహకరించడం వేరు అని స్పష్టం చేశారు. వాణిజ్య సంబంధాల ద్వారా ఇరాన్‌కు నిధులు సమకూరేలా చేసి.. వాటిని అమెరికా వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించే పరిస్థితిని తాము అంగీకరించబోమని రూబియో వ్యాఖ్యల సారాంశం.మోదీ–పెజెష్కియాన్ భేటీలో..షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు సందర్భంగా కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్కెక్లో ప్రధాని మోదీ, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సమావేశమయ్యారు. భారత్–ఇరాన్ సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించడం వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. అదే సమయంలో పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ప్రాంతీయ పరిస్థితులపైనా అభిప్రాయాలు పంచుకున్నారు. శాశ్వత శాంతి కోసం జరిగే ప్రయత్నాలకు భారత్ మద్దతు కొనసాగిస్తుందని మోదీ స్పష్టం చేశారు.వాణిజ్య నౌకల భద్రతపై భారత్ ఆందోళనపశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం సముద్ర రవాణాపైనా పడుతున్న నేపథ్యంలో.. వాణిజ్య నౌకలు, నావికుల భద్రత అంశం కూడా ఇరువురు నేతల చర్చల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. వాణిజ్య నౌకాయానం, స్వేచ్ఛాయుత రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలగకూడదని భారత్ స్పష్టం చేసింది. పౌరులు, పౌర మౌలిక వసతులు, వాణిజ్య నౌకలు, నావికులను దాడుల పరిధిలోకి తీసుకురావొద్దని న్యూఢిల్లీ తన వైఖరిని పునరుద్ఘాటించింది.దౌత్యపరమైన పాత్రకు పిలుపుమరోవైపు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్ తన దౌత్య సంబంధాలను ఉపయోగించాలని కోరారు. సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలన్నది తమ ప్రభుత్వ విధానమని చెప్పారు.అమెరికా మాత్రం దౌత్య మార్గాన్ని పక్కనపెట్టి బలప్రయోగం, యుద్ధం, ఆంక్షల బాట పట్టిందని ఆయన విమర్శించారు. ఇరాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, ప్రజల రక్షణతో పాటు శాంతి, స్థిరత్వానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి పెంచుతున్న అమెరికాట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచుతోంది. ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలు, సంస్థలు అమెరికా ఆంక్షల పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రూబియో తాజా వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇరాన్‌తో సంబంధాలు కొనసాగించడాన్ని పూర్తిగా నిషేధించడం లేదని చెబుతూనే.. ఆంక్షలను తప్పించుకునేలా ఆర్థిక సహకారం అందించే దేశాలను మాత్రం అమెరికా ఉపేక్షించబోదన్న సంకేతాన్ని వాషింగ్టన్ ఇచ్చింది.భారత్‌కు సవాల్ఇరాన్తో భారత్‌కు దీర్ఘకాలిక చారిత్రక, వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. మరోవైపు అమెరికాతోనూ భారత్ కీలక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది. దీంతో ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలను విస్తరించడంతో పాటు అమెరికా ఆంక్షలను ఉల్లంఘించకుండా ఉండటం న్యూఢిల్లీకి కీలకంగా మారింది.మోదీ–పెజెష్కియాన్ భేటీ తర్వాత రూబియో చేసిన తాజా హెచ్చరిక.. ఇరాన్ విషయంలో భారత్ సహా ఇతర దేశాలపై అమెరికా నిఘా, ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉందన్న సంకేతంగా కనిపిస్తోంది.ఇదీ చదవండి: గూగుల్ తర్వాత యాపిల్ అదే పని చేసిందిగా! -
అమెరికా–ఇరాన్ యుద్ధం: గల్ఫ్‌లో హైటెన్షన్.. తాజా పరిణామాలు ఇవే
దాదాపు నెల రోజుల తర్వాత మళ్లీ పశ్చిమాసియా భగ్గుమంటోంది. కాల్పుల విరమణను తుంగలో తొక్కి.. శాంతి చర్చలను పక్కన పెట్టి.. అమెరికా-ఇరాన్‌ను పరస్పర దాడులు జరుపుతున్నాయి. తాజాగా అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ వరుస క్షిపణి, డ్రోన్ దాడులకు దిగింది. మరోవైపు అమెరికా బలగాలు హర్ముజ్ జలసంధిపై దాదాపు పూర్తి నియంత్రణ సాధించాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో తాజా పరిణామాలు ఇవిగో..US-Iran War Live Updatesఅరబ్ దేశాలకు ఇరాన్ వార్నింగ్అమెరికా బలగాలను పంపించేయండి.. లేదంటే దాడులే అంటూ అరబ్ దేశాలను ఇరాన్ హెచ్చరించింది. తమ భూభాగాల్లోని అమెరికా బలగాలను, సైనిక స్థావరాలను తొలగించాలని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (IRGC) పొలిటికల్ వింగ్ డిప్యూటీ జనరల్ యదొల్లా జవానీ హెచ్చరించారు. అమెరికా దాడులకు తమ దేశాల నుంచి ఏదైనా వేదికగా మారితే ‘తీవ్రమైన’ ప్రతీకారం తప్పదన్నారు. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లను ప్రత్యేకంగా ప్రస్తావించారు.బెత్లహెమ్‌లో పాలస్తీనా ఇంటి కూల్చివేతవెస్ట్ బెత్లహెమ్లోని నహాలిన్ పట్టణంలో పాలస్తీనాకు చెందిన ఓ ఇంటిని ఇజ్రాయెల్ బలగాలు కూల్చివేశాయి. సైనిక వాహనాలు, బుల్డోజర్లతో పట్టణంలోకి ప్రవేశించిన బలగాలు.. 15 ఏళ్లకు పైగా నివాసంగా ఉన్న ఆ భవనాన్ని నేలమట్టం చేసినట్లు తెలుస్తోంది.బహ్రెయిన్‌పై ఇరాన్ డ్రోన్ దాడులు?బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాన్ని ఇరాన్ భారీ డ్రోన్ దాడులతో లక్ష్యంగా చేసుకున్నట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ దాడిపై ఇప్పటివరకు అధికారిక ధ్రువీకరణ వెలువడలేదు. ఇదే సమయంలో బహ్రెయిన్ రక్షణ దళాలు తమ గగనతలంలోకి వచ్చిన పలు ఇరాన్ వైమానిక దాడులను అడ్డుకున్నట్లు ప్రకటించాయి.జోర్డాన్లోకి 13 బాలిస్టిక్ మిసైళ్లుఇరాన్ నుంచి వచ్చిన 13 బాలిస్టిక్ క్షిపణులను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు ఎదుర్కొన్నట్లు జోర్డాన్ ప్రకటించింది. అయితే ఈ క్షిపణుల వల్ల నష్టం జరిగిందా?.. ఎక్కడ పడ్డాయి? అనే వివరాలను అధికారులు వెల్లడించలేదు.మష్హద్లో విషాదంఇరాన్లోని ఈశాన్య నగరం మష్హద్లో ప్రభుత్వానికి, సాయుధ దళాలకు మద్దతుగా జరుగుతున్న కార్యక్రమంలోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా.. 10 మందికి పైగా గాయపడ్డారు. డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో ఇది రోడ్డు ప్రమాదమేనని, రాజకీయ ఉద్దేశం ఉన్నట్లు ఆధారాలు లేవని అధికారులు తెలిపారు.జోర్డాన్‌లో అమెరికా స్థావరంపై ఇరాన్ దాడిజోర్డాన్లోని ప్రిన్స్ హసన్ ఎయిర్‌బేస్‌పై భారీ బాలిస్టిక్ క్షిపణి దాడి చేసినట్లు ఇరాన్ IRGC ప్రకటించింది. అక్కడ RQ-4, MQ-9 డ్రోన్లను ఉంచిన హ్యాంగర్లను లక్ష్యంగా చేసుకున్నామని తెలిపింది. పలు డ్రోన్లు ధ్వంసమయ్యాయని, అమెరికా సిబ్బందిలో కొందరు మరణించారని, మౌలిక వసతుల్లో మంటలు చెలరేగాయని పేర్కొంది. అయితే దీనిపై అమెరికాగానీ, జోర్డాన్గానీ ఇంకా స్పందించలేదు. లవాన్ ద్వీపంపై అమెరికా దాడులుఇరాన్లోని లవాన్ ద్వీపంపై అమెరికా జరిపిన తాజా దాడుల్లో ముగ్గురు బసీజ్ పారామిలటరీ సభ్యులు మరణించినట్లు ఇరాన్ సెమీ అధికారిక మెహర్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.పెళ్లి వేడుకపై దాడి.. ఘోరంఇరాన్లోని సిరిక్ సమీపంలో జరిగిన పెళ్లి వేడుకపై అమెరికా దాడి జరిగిందని ఇరాన్ అధికారులు ఆరోపించారు. ఈ ఘటనలో నాలుగేళ్ల చిన్నారి సహా ఐదుగురు మరణించగా.. మరో 50 మంది గాయపడినట్లు తెలిపారు. ఇరాన్ విదేశాంగ శాఖ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది.హర్ముజ్‌లో షిప్పింగ్ ట్రాఫిక్ డౌన్హర్ముజ్ జలసంధి మీదుగా మంగళవారం కేవలం నాలుగు వాణిజ్య నౌకలు మాత్రమే ప్రయాణించాయి. సాధారణంగా 10 రోజుల సగటు రోజుకు సుమారు 13 నౌకలుగా ఉండగా.. తాజా సంఖ్య దాని కంటే గణనీయంగా తక్కువగా ఉంది. కేప్లర్ ప్రాథమిక షిప్పింగ్ డేటా ప్రకారం నాలుగు నౌకల్లో ఒకటి భారీ క్రూడ్ ఆయిల్ క్యారియర్, మిగిలినవి వివిధ రకాల సరకు/చమురు రవాణా నౌకలు. అయితే సోమవారం హర్ముజ్ జలసంధి మీదుగా 17 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా జరిగినట్లు అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ తెలిపారు. యుద్ధం కారణంగా రాకపోకలు తగ్గిన తర్వాత ఒక్కరోజులో నమోదైన అత్యధిక చమురు రవాణా ఇదేనని పేర్కొన్నారు.బహ్రెయిన్‌లో వరుస అలర్ట్లుబహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆరు గంటల వ్యవధిలో మూడోసారి ‘పొంచి ఉన్న ముప్పు’పై అలర్ట్ జారీ చేసింది. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. అధికారిక మార్గాల్లో వచ్చే సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని కోరింది.ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది: ట్రంప్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్ముజ్ జలసంధిపై అమెరికా బలగాలు దాదాపు పూర్తి నియంత్రణ సాధించాయని అన్నారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలుతున్నదని పేర్కొన్నారు. ఇరాన్‌పై అమెరికా దాడులు, ఆ తర్వాత టెహ్రాన్ ప్రతీకార చర్యల నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇరాన్ ప్రతీకార దాడులుఅమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తన భూభాగం నుంచి క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించినట్లు IRGC ప్రకటించింది. అమెరికా దాడులను ‘నిరాశతో కూడిన దాడులు’గా అభివర్ణించింది. ప్రతీకార చర్యల్లో పెద్ద సంఖ్యలో అమెరికా బలగాలను హతమార్చినట్లు పేర్కొన్నప్పటికీ.. ఈ వాదనపై అమెరికా నుంచి తక్షణ ధ్రువీకరణ రాలేదు.ఇరాన్ ప్రతీకార దాడుల పరిధి కువైట్, బహ్రెయిన్, జోర్డాన్, ఇరాక్‌లోని ఎర్బిల్ వరకు విస్తరించినట్లు తెలుస్తోంది. మరోవైపు గల్ఫ్ దేశాలు తమ వైమానిక రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేశాయి. ముఖ్యంగా హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు, చమురు రవాణాపై యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమవుతోంది.ఇదీ చదవండి: అమెరికా సైనికుల రాక.. సెక్స్‌వర్కర్ల వేట! -
‘బతికించమని అడుక్కోవాలా?’.. నేపాల్‌లో రెస్క్యూ తీరిదీ!
నేపాల్‌లో ఆకస్మిక వరద బీభత్సం సృష్టించి వారం రోజులు దాటుతున్నా.. వేల మంది జాడ లేకుండా పోయింది. నేపాల్ సైన్యంతో పాటు భారత్, చైనా, అమెరికా, దక్షిణ కొరియా దేశాలు అన్వేషణలో సాయం చేస్తున్నాయి. అయితే భారీ వర్షాలు, నదులు పొంగిపొర్లుతుండడం.. ఇప్పటికే బురద దట్టంగా పేరుకుపోయి ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ తరుణంలో సొరంగాల్లో చిక్కుకున్న బాధితుల కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. నేపాల్ ఆకస్మిక వరదల్లో 4 వేల మంది జాడ తెలియరావడం లేదు. ఇందులో సుమారు 1000 మంది సొరంగాల్లో చిక్కుకుపోయినట్లు అక్కడి మీడియా కథనాలు ఇస్తోంది. దీంతో ఆ టన్నెళ్లకు రంధ్రాలు చేసి.. పైపుల ద్వారా లోపలికి ఆక్సిజన్‌ను పంపిస్తున్నారు. అయితే బోర్‌హోల్ కెమెరాలతో సొరంగాల పరిశీలనలో కార్మికులకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో వాళ్లంతా కొట్టుకుపోయి ఉంటారా? లేదంటే వాటిల్లోనే సమాధి అయ్యారా? అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు సహాయక చర్యలు నత్తనడకన సాగుతుండడంపై బాధిత కుటుంబాలు నేపాల్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రసువా జిల్లాలోని త్రిశూలీ-3ఏ జలవిద్యుత్ కేంద్రంలో సుమారు 40 మంది నెపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఉద్యోగులు చిక్కుకుపోయినట్లు సమాచారం. ‘ఆరు రోజులుగా ఎదురుచూస్తున్నాం.. అసలు రెస్క్యూ ఎప్పుడు?’ అంటూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు ఓ ఇంజినీర్ భార్య. తన భర్తతో పాటు 40 మంది ఉద్యోగులు త్రిశూలీ-3ఏ ప్రాజెక్టులో చిక్కుకున్నారని ఆమె తెలిపారు. ఈ జలవిద్యుత్ కేంద్రం దేశంలోనే అత్యంత సురక్షితమైన వాటిలో ఒకటని చెప్పడంతో.. లోపలున్న వారంతా క్షేమంగానే ఉంటారని ఆశిస్తున్నామని చెప్పారు. కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ ఆందోళన పెరుగుతోందన్నారు. సమాచారం కోసం ఆర్మీ ప్రధాన కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. కొందరు టన్నెల్ వద్దకు కూడా వెళ్లారు. ఎవరి నుంచి ఎలాంటి స్పష్టత రావడం లేదు అని వాపోయారామె.ప్రకటనలకే పరిమితమా?చైనా, భారత్ నుంచి రెస్క్యూ బృందాలు వెళ్లాయని మీడియాలో వార్తలు వస్తున్నా.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఆమె ఆరోపించారు. ‘చైనా, భారత్ బృందాలు వెళ్లాయని చెబుతున్నారు. కానీ ఇప్పటివరకు ఒక్క జేసీబీ కూడా అక్కడికి చేరలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. వరద తీవ్రత, మట్టి, శిథిలాల పరిస్థితి తెలిసి ఆరు రోజులైనా.. సొరంగాల్లోకి వెళ్లేందుకు అవసరమైన భారీ యంత్రాలు, టన్నెల్ కట్టర్లు ఎందుకు చేరలేదని ప్రశ్నించారు. రోజుకో రెస్క్యూ బృందం వచ్చిందంటూ ప్రకటనలు చేయడం తప్ప.. క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించడం లేదన్నారు.‘ఈ రోజు.. రేపు అంటూ ఆరు రోజులు’రెస్క్యూ బృందాలు వస్తున్నాయని, మంత్రులు ఘటనాస్థలికి వెళ్తున్నారని, చైనాతో సమన్వయం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారని ఆమె తెలిపారు. దీంతో బాధిత కుటుంబాలు కూడా ‘ఈరోజు కాకపోతే రేపైనా మా వాళ్లు బయటకు వస్తారు’ అని ఆశగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. ‘ఇలా ఆశ పెట్టుకుని ఆరు రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు ప్రతి గంటా, ప్రతి క్షణం భారంగా మారింది’ అని కన్నీటి పర్యంతమయ్యారు.‘వాళ్ల ప్రాణాలతో ఆటలు ఆడాలా?’రెస్క్యూ చర్యల పురోగతిపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘పది మీటర్లు వెళ్లాం.. 20 మీటర్లు వెళ్లాం అని చెబుతున్నారు. ఇది ఏంటి? మనం వాళ్ల ప్రాణాలు కాపాడుతున్నామా? లేక ఆటలు ఆడుతున్నామా?’ అని ప్రశ్నించారు. ‘ఇది ఒక్కరి విషయం కాదు. 40 కుటుంబాల ప్రాణాల సమస్య. వారి కుటుంబాలు ఎంత బాధపడుతున్నాయో ప్రభుత్వానికి తెలుసా?’ అని నిలదీశారు.తమ ఆవేదనను బహిరంగంగా చెప్పుకోలేని పరిస్థితిలో పలువురు కుటుంబ సభ్యులు ఆసుపత్రుల పాలయ్యారని తెలిపారు. ‘ఆయన వ్యక్తిగత పని కోసం అక్కడికి వెళ్లలేదు. దేశం కోసం పని చేయడానికి వెళ్లారు. మరి ఆయనను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఆయన ప్రాణాలు కాపాడమని మేము మీడియా ముందు వేడుకోవాలా?’ అని ఆమె ప్రశ్నించారు.వందలాది మంది ఉద్యోగులు గల్లంతునేపాల్లో వరదల కారణంగా మరికొన్ని హైడ్రోపవర్ ప్రాజెక్టుల్లోనూ భారీ సంఖ్యలో ఉద్యోగులు, ఇతర సిబ్బంది గల్లంతైనట్లు సమాచారం. అప్పర్ త్రిశూలీ-1 ప్రాజెక్టు వద్ద 550 మందికి పైగా ఆచూకీ తెలియడం లేదని ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ (ఐపీపీఏఎన్) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అక్కడ 254 మందిని సురక్షితంగా రక్షించినప్పటికీ.. మిగిలిన వారి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.అప్పర్ త్రిశూలీ-3బీ ప్రాజెక్టులో 122 మంది, లాంగ్టాంగ్ ఖోలా ప్రాజెక్టులో 41 మంది, చిలిమే హైడ్రోపవర్ ప్రాజెక్టులో ఎనిమిది మంది, మెయిలంగ్ ఖోలా ప్రాజెక్టులో ఏడుగురు గల్లంతైనట్లు సమాచారం. రసువాగఢి హైడ్రోపవర్ ప్రాజెక్టులోనూ 93 మంది ఆచూకీ తెలియడం లేదు. చైనా, దక్షిణ కొరియా, భారత్‌కు చెందిన బృందాలు నేపాల్ సైన్యంతో కలిసి పలు ప్రాంతాల్లో గాలింపు, సహాయక చర్యలు చేపడుతున్నాయి. అయితే సొరంగాల్లో చిక్కుకున్న వారి కోసం సమయం గడుస్తున్న కొద్దీ కుటుంబాల ఆందోళన మరింత పెరుగుతోంది.అధికారులు ఏం చెబుతున్నారు?మరోవైపు.. సహాయక చర్యల్లో తామేమీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం లేదని అక్కడి అధికారులు అంటున్నారు. సొరంగాల్లోకి చేరుకోవడం అత్యంత క్లిష్టంగా మారిందని చెబుతున్నారు. భారీ బురద, నీరు, రాళ్లు, శిథిలాలు మార్గాన్ని పూర్తిగా మూసేశాయని.. కొన్ని ప్రాంతాల్లో డ్రిల్లింగ్, భారీ యంత్రాల సాయంతో మార్గాన్ని క్లియర్ చేస్తున్నామని వెల్లడించారు. చైనా, భారత్ తదితర దేశాల నిపుణుల సహకారంతో పరిస్థితిని అంచనా వేసి రెస్క్యూ చర్యలను ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: భారత్ మాకు పరిహారం చెల్లించాల్సిందే.. నేపాల్ డిమాండ్ -
ఓటీటీలోకి వచ్చేస్తున్న ట్రంప్ ‘సీక్రెట్ జర్నీ’
తన ప్రాణాలకు ముప్పు లేదని తరచూ చెప్పే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భద్రత విషయంలో మాత్రం ఏమాత్రం రాజీపడరు. అలాంటిది ప్రాణభయంతో ప్రయాణిస్తున్న విమానాన్ని రహస్యంగా మార్చడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. అసలు ఆ రోజు ఏం జరిగిందన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయితే ఆ విషయాలు ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో సదస్సు కోసం జూలై 8న టర్కీలోని అంకారాకు వెళ్లారు. సదస్సు ముగించుకుని అమెరికాకు తిరుగు ప్రయాణంలో.. భద్రతా కారణాలతో ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి రహస్యంగా మరో సైనిక విమానంలోకి మార్చారు. ఆ సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటనను.. ‘ఇన్‌స్టాడాక్స్: ది డీకాయ్ ప్లేన్’ పేరుతో నెట్‌ఫ్లిక్స్ రూపొందించింది. ఈ ప్రత్యేక డాక్యుమెంటరీ సెప్టెంబర్ 4(ఎల్లుండి) నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఇందులో ఏం చూపించబోతున్నారు? ఇది ఎన్ని వివాదాలు.. అభ్యంతరాలకు దారి తీస్తుందో ? అనే ఆసక్తి నెలకొంది.డీకాయ్ ప్లేన్ అంటే.. ట్రంప్ ‘ఎయిర్ ఫోర్స్ వన్’లోనే ప్రయాణిస్తున్నారని బయటకు కనిపించేలా చేస్తూనే.. వాస్తవంగా ఆయనను మరో సైనిక విమానంలోకి తరలించడమే డీకాయ్ ప్లేన్. అసలు ట్రంప్ ఏ విమానంలో ఉన్నారో గుర్తించకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు చేశారు. ఇరాన్ నుంచి ముప్పు ఉందని ఇజ్రాయెల్ హెచ్చరించిన నేపథ్యంలోనే అమెరికా భద్రతా అధికారులు ఈ ఏర్పాట్లు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ ముప్పును నిర్ధారించుకోకుండానే అమెరికా బలగాలు ఈ సీక్రెట్ జర్నీ ఆపరేషన్ నిర్వహించినట్లు తర్వాత తేలింది.క్యాటరింగ్ ట్రక్కులో..ఈ రహస్య ఆపరేషన్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశం ట్రంప్ విమానం మారిన విధానం. ఒక విమానం నుంచి మరో సైనిక విమానానికి ఆయనను సాధారణంగా విమానాశ్రయాల్లో ఆహారం, పానీయాలు తరలించే క్యాటరింగ్ ట్రక్కులో తీసుకెళ్లినట్లు రిపోర్టులు వెల్లడించాయి. ఈ రహస్య బదిలీ గురించి ట్రంప్ వెంట ఉన్న మీడియా ప్రతినిధుల్లో చాలామందికి కూడా సమాచారం లేదని కథనాలు పేర్కొన్నాయి.కొందరు మాత్రమే వెంట..ట్రంప్‌తో పాటు ఈ రహస్య బదిలీలో కొద్దిమంది మాత్రమే పాల్గొన్నట్లు సమాచారం. వైట్‌హౌస్ సిబ్బంది, అప్పటి రక్షణ శాఖ కార్యదర్శి పీట్ హెగ్సెత్ తదితరులు ఆయనతో వెళ్లినట్లు కథనాలు తెలిపాయి. మరోవైపు అప్పటి విదేశాంగ మంత్రి మార్కో రూబియో, స్టీఫెన్ మిల్లర్, అప్పటి వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తదితరులు డీకాయ్‌గా ఉన్న విమానంలోనే కొనసాగారు.బ్రిటన్‌లో మళ్లీ విమానం మార్పు?టర్కీ నుంచి ట్రంప్ ప్రయాణించిన సైనిక విమానం బ్రిటన్‌లోని రాయల్ ఎయిర్‌ఫోర్స్ మిల్డెన్‌హాల్ స్థావరానికి చేరినట్లు రిపోర్టులు పేర్కొన్నాయి. అక్కడ ఆయన మరోసారి విమానం మార్చి.. ఖతార్ నుంచి అందిన బోయింగ్ 747లో అమెరికాకు బయలుదేరినట్లు సమాచారం.ట్రంప్ ఏమన్నారు?ఈ వ్యవహారం బయటకు రావడంతో ట్రంప్ విమానం ఎందుకు మార్చారన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సోషల్ మీడియాలో మీమ్స్, ఊహాగానాలు వెల్లువెత్తాయి. అనంతరం ట్రంప్ దీనిపై స్పందిస్తూ.. తనకు ఇలాంటి ముప్పు పొంచి ఉండడం సహజమేనని, భయపడే రకం తాను కాదని.. అయితే సీక్రెట్ సర్వీస్, మిలిటరీ అధికారులు సురక్షితమైన మార్గమని సూచించడంతో తాను వారి ఆదేశాలను పాటించినట్లు చెప్పారు. ట్రంప్ మాత్రమే కాదు గతంలో ఎంతో మంది అమెరికా అధ్యక్షులు, ఆ మాటకొస్తే పలువురు ప్రపంచ అధినేతల కోసం ఇలాంటి సీక్రెట్ జర్నీలు ఏర్పాటు చేశారు.ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కథనం..ఇప్పటివరకు వార్తలు, ఊహాగానాలకే పరిమితమైన ఈ రహస్య ప్రయాణం వెనుక కథను Instadocs: The Decoy Plane పేరిట నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఘటనను తొలిసారి రిపోర్ట్ చేసిన జర్నలిస్టులతో పాటు వైట్‌హౌస్, విమానయాన రంగానికి చెందినవారు, మాజీ సీక్రెట్ సర్వీస్ సిబ్బందితో చేసిన ఇంటర్వ్యూలను ఇందులో చూపించనున్నారు. సెప్టెంబర్ 4న స్ట్రీమింగ్ ప్రారంభం కానుండటంతో.. ట్రంప్ ‘సీక్రెట్ జర్నీ’ మరోసారి ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఇదీ చదవండి: అమెరికా సైనికులొస్తున్నారు.. అలర్ట్This July, while flying back from a NATO summit in Turkey, President Trump slipped off Air Force One in a catering truck and secretly boarded a different aircraft — leaving traveling reporters to fly on, unaware the president was no longer with them.Instadocs: The Decoy Plane,… pic.twitter.com/iuADnXxMoV— Netflix (@netflix) September 1, 2026 -
200 రోజుల తర్వాత ఒడ్డుకు.. పట్టాయాలో హైఅలర్ట్!
థాయ్‌లాండ్‌లోని ప్రముఖ పర్యాటక నగరం పట్టాయాలో ఈ వారం భారీ సందడి నెలకొననుంది. అమెరికా నేవీకి చెందిన దాదాపు 5,000 మంది సైనికులు లామ్ చబాంగ్ పోర్టుకు చేరుకోనున్నారు. సెలవులు ముగిసే వరకు వాళ్లు అక్కడే గడపబోతున్నారు. అయితే ఇంతకాలం కుటుంబాలకు దూరంగా ఉన్న వీళ్లు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం, ప్రలోభాలకు లొంగిపోయే అవకాశం లేకపోలేదు. అందుకే అక్కడి పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. పట్టాయా.. ఒకప్పుడు చిన్న మత్స్యకార గ్రామం. వియత్నాం యుద్ధ సమయంలో థాయ్‌లాండ్‌లో విధులు నిర్వర్తించిన అమెరికా సైనికులు విశ్రాంతి కోసం ఇక్కడికి రావడంతో.. క్రమంగా ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. ప్రస్తుతం అక్కడి అందాలను వీక్షించేందుకు పలు దేశాల నుంచి పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తుంటారు. ఇటు చాలాకాలంగా సెక్స్ టూరిజంతో ముడిపడిన నగరంగానూ పట్టాయా గుర్తింపు పొందింది.అయితే ఇరాన్ యుద్ధం కారణంగా 200 రోజులకు పైగా సముద్రంలో యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌకలో వేల మంది అమెరికన్ సైనికులు గడిపారు. కుటుంబాలకు దూరంగా ఉండడంతో ఆ సమయంలో వాళ్లు మానసికంగా కుంగిపోయారని.. సూసైడ్లు చేసుకున్నారనే ప్రచారం జరిగింది. ఈ తరుణంలో వాటిని ఖండించిన అమెరికా రక్షణ శాఖ.. వాళ్లకు విశ్రాంతి ఇస్తూ వాషింగ్టన్ నౌకలో ఫ్రెష్ బ్యాచ్ సైనికులు అక్కడికి పంపింది. దీంతో లింకన్‌తో పాటు మరో రెండు నేవీ నౌకలు అక్కడికి రానున్నాయి. అయితే వాళ్ల సైనికుల రాకకు ముందే పట్టాయా పోలీసులు బీచ్, నైట్‌లైఫ్ ప్రాంతాల్లో నిఘా పెంచారు. సెక్స్ వర్కర్ల కోసం గాలింపు ముమ్మరం చేశారు. వారాంతంలో నిర్వహించిన దాడుల్లో వ్యభిచారానికి పాల్పడుతున్నారనే అనుమానంతో సుమారు 40 నుంచి 50 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సైనికులు వచ్చే లోపు సెక్స్ ట్రేడ్‌ను పూర్తిగా అరికట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టాయా పోలీస్ చీఫ్ అనెక్ స్రాథోంగ్యూ మాట్లాడుతూ.. ఇక్కడ వ్యభిచార కార్యకలాపాల్ని నియంత్రించడం అంత సులభం కాదు. వాళ్ల నెట్‌వర్క్‌లు చాలా పెద్దగా ఉంటాయి. మసాజ్ ముసుగులో చేస్తారని భావించినా.. అలా ఎన్నడూ ఏ రాకెట్ దొరకలేదు. అందుకే వాళ్ల కార్యకలాపాన్ని గుర్తించడం కష్టమవుతోంది. అయితే ఒకేసారి వేల మంది వస్తుండడంతో.. బహిరంగ ప్రదేశాల్లోనే అమెరికన్ సైనికులను కొందరు సంప్రదించే అవకాశాలు ఉన్నాయి. పట్టాయాకు భారీగా ఆదాయంఅమెరికా సైనికుల రాకతో పట్టాయా ఆర్థిక వ్యవస్థకు కాస్త ఊతం లభిస్తుందని స్థానిక అధికారులు భావిస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, దుకాణాలు తదితర వ్యాపారాలకు ప్రయోజనం కలగనుందని భావిస్తున్నారు. ఒక్కో అమెరికా సైనికుడు రోజుకు సుమారు 1,000 నుంచి 3,000 థాయ్ బాత్(రూ.2,800 నుంచి రూ.8,500 వరకు) ఖర్చు చేసే అవకాశం ఉందని పట్టాయా మేయర్ పొరమాస్ న్గాంపిచెస్ అంచనా వేశారు. అయితే సిబ్బంది మొత్తం ఒకేసారి నగరంలోకి రాకుండా విడతల వారీగా.. అక్కడికి వెళ్లే అవకాశం ఉండటంతో ఈ ప్రభావం కొన్ని రోజుల పాటు కొనసాగనుంది.అటు అమెరికా కూడా అలర్ట్.. అటు అమెరికా కూడా తమ సైనికులకు హెచ్చరికలు జారీ చేసింది. పట్టాయాలో షోర్ లీవ్ సందర్భంగా అపరిచిత వ్యక్తులు లేదంటే సెక్స్ వర్కర్ల వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని లేదా సున్నితమైన సైనిక వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని రక్షణ అధికారులు సూచించినట్లు సమాచారం. ఇదీ చదవండి: ఖల్లాస్.. ఇక హర్ముజ్ మాదే! -
మా తప్పేంటి?.. భారత్, చైనా, అమెరికా పరిహారం చెల్లించాల్సిందే!
ఆకస్మిక వరదలతో అతలాకుతలం అయిన నేపాల్ సరికొత్త డిమాండ్‌ను తెర మీదకు తెచ్చింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతుండగా.. భారత్ సహా పలు దేశాలు పాలు పంచుకుంటున్నాయి. అయితే తమకు సాయంతో పాటు న్యాయం కూడా జరగాలని నేపాల్ వాదిస్తోంది. చేయని తప్పులకు శిక్ష తామెందుకు అనుభవించాలని.. భారత్, చైనా, అమెరికాలు తమకు పరిహారం చెల్లించాల్సిందేనంటూ చెబుతోంది.హిమాలయ దేశం నేపాల్.. ఇప్పుడు క్లైమేట్ జస్టిస్ పేరిట ప్రపంచం ముందు ఓ ప్రశ్న ఉంచింది. వాతావరణ మార్పుల ప్రభావంతోనే తాము భారీ విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో ప్రపంచంలో అత్యధిక కార్బన్ డయాక్సైడ్ (CO₂) ఉద్గారాలు చేస్తున్న దేశాల్లో ముందున్న చైనా, అమెరికా, భారత్ తమకు వాతావరణ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. ఈ మూడు దేశాలు చారిత్రక బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ చెబుతున్నారు. తాము తక్కువ స్థాయిలోనే కార్బన్ ఉద్గారాలు చేస్తున్నా.. వాతావరణ మార్పుల ప్రభావంతో భారీ విపత్తులను ఎదుర్కొంటున్నామని శిశిర్ అంటున్నారు. తమ దేశం సృష్టించని సంక్షోభానికి తామే మూల్యం చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారాయన. ‘ఇది పర్వత సునామీ’చైనా సరిహద్దులోని రసువా జిల్లాలో ఆగస్టు 26న సంభవించిన ఆకస్మిక వరదలు నేపాల్‌ను అతలాకుతలం చేశాయి. హిమనదీ ప్రాంతంలో మంచు, శిలలు కూలిపోవడంతో భారీగా నీరు, బురద, రాళ్లు దిగువ ప్రాంతాలకు దూసుకొచ్చాయి. ఈ ఘటనలో వెయ్యి మందికి పైనే ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది గల్లంతయ్యారు. వాళ్ల ఆచూకీ కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతూనే ఉంది. సాధారణ వర్షపాతం లేకుండానే ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో బాధిత ప్రాంతాల ప్రజలకు తగినంత ముందస్తు హెచ్చరిక అందలేదు. దీంతో ఈ విపత్తును నేపాల్ విదేశాంగ మంత్రి ‘క్యాటస్ట్రాఫిక్ మౌంటెన్ సునామీ’గా అభివర్ణించారు. వాతావరణ మార్పుల కారణంగా హిమాలయాల్లో మంచు కరుగుదల వేగవంతమవుతోందని.. దాని ప్రభావంతో హిమనదులు, పర్వత వాలులు ఆందోళనకరంగా మారుతున్నాయన్న నిపుణుల హెచ్చరికలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మా తప్పు లేకుండా మూల్యం చెల్లిస్తున్నాం’వాతావరణంలోకి నేపాల్ గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు వాస్తవంగా చాలా తక్కువ. అయినప్పటికీ మేం సృష్టించని ప్రపంచ సంక్షోభానికి అంతిమ మూల్యం చెల్లిస్తున్నాం’’ మంత్రి ఖనాల్ అంటున్నారు. వాతావరణ మార్పుల వల్ల హిమాలయాల్లో మంచు కరుగుదల, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి వరదలతో నేపాల్‌లో కీలక మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో కూడా గణనీయమైన భాగం దెబ్బతిందని, దేశ ఆర్థిక వ్యవస్థపైనా ఈ విపత్తు తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారాయన.‘సాయం కాదు.. న్యాయం’ఇది నాగరికత మనుగడకు సంబంధించిన విషయం. ఇకపై వాతావరణ విపత్తుల విషయంలో మా దౌత్య విధానాన్ని ‘సాయం’గా కాకుండా.. ‘న్యాయం, పరిహారం’ వైపు మళ్లిస్తాం. ఇది దాతృత్వం కాదు.. చట్టపరమైన, నైతిక బాధ్యత అని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే వాతావరణ నష్టపరిహారానికి సంబంధించి అంతర్జాతీయ భాగస్వాములకు నేపాల్ క్లెయిమ్ పంపిందని మంత్రి వెల్లడించారు. రాబోయే అంతర్జాతీయ వేదికలన్నింటిపైనా ఈ అంశాన్ని గట్టిగా ప్రస్తావిస్తామని చెప్పారు.కాలుష్యంలో ఎవరి వాటా ఎంత?వాతావరణ మార్పులపై నేపాల్ చేస్తున్న వాదనలో ప్రధానంగా కార్బన్ ఉద్గారాల అసమానతను ప్రస్తావిస్తోంది. గ్లోబల్ కార్బన్ బడ్జెట్ (Global Carbon Budget 2025) గణాంకాల ప్రకారం.. కార్బన్డయాక్సైడ్ ఉద్గారాల్లో చైనా వాటా సుమారు 32 శాతం. అమెరికా వాటా 13 శాతం, భారత్ వాటా 8 శాతం. అంటే ఈ మూడు దేశాలే కలిపి ప్రపంచ ఫాసిల్ కార్బన్ ఉద్గారాల్లో దాదాపు 53 శాతం రిలీజ్ చేశాయన్నమాట. అయితే.. అయితే నేపాల్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. 2024 గణాంకాల ప్రకారం ఆ దేశం నుంచి రిలీజ్ అయిన కర్బన ఉద్గారాలు సుమారు 1.59 కోట్ల టన్నులు మాత్రమే. అంటే ప్రపంచ దేశాల్లో ఆ వాటా 0.04 శాతం మాత్రమే. అలాగే యావరేజ్‌గా ఒక దేశం 0.5 టన్నులు రిలీజ్ చేస్తుంటే.. నేపాల్ అంతకంటే తక్కువగా ఉందన్నమాట. అలాగని..చైనా, అమెరికా, భారత్ వంటి దేశాలు నేపాల్‌కు తప్పనిసరిగా పరిహారం చెల్లించాలనే రూల్‌గానీ, చట్టంగానీ లేదు. ఇది కేవలం నేపాల్ తెర మీదకు తెచ్చిన ‘క్లైమేట్ జస్టిస్–లాస్ అండ్ డ్యామేజ్’ వాదన మాత్రమే. అయితే తక్కువ ఉద్గారాలు చేసే దేశాలే వాతావరణ విపత్తులతో ఎక్కువగా నష్టపోతున్న నేపథ్యంలో.. ఎక్కువ కార్బన్‌ను రిలీజ్ చేస్తున్న చేసిన దేశాలు ఆర్థిక బాధ్యత తీసుకోవాలన్న డిమాండ్ మాత్రం చర్చనీయాంశంగా మారే అవకాశం లేకపోలేదు.ఇదీ చదవండి: కాల్చరు.. పూడుస్తారు! ఎందుకో తెలుసా? -
పుతిన్ ధీమా.. ఉక్రెయిన్‌పై బిగ్ స్టేట్మెంట్
ఉక్రెయిన్‌పై యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలకు మాస్కో ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని అన్నారాయన. అయితే వ్లాదిమిర్ జెలెన్స్కీ నేతృత్వంలోని ఉక్రెయిన్ నాయకత్వాన్ని ‘ఉగ్రవాదులు’గా అభివర్ణిస్తూ.. వారితో చర్చలు జరపడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా దూసుకెళ్తోందని పుతిన్ ప్రకటించారు. రష్యా సేనల పురోగతి వేగం పెరిగిందని, ఉక్రెయిన్ బలగాలు త్వరలో కుప్పకూలుతాయని ధీమా వ్యక్తం చేశారు. జెలెన్స్కీ ఉన్నంతకాలం శాంతి చర్చలు జరగడం అనుమానమే అని వ్యాఖ్యానించారాయన. చర్చలనేవి జరిగితే.. ఉక్రెయిన్ నాయకత్వం మారిన తర్వాతే అనే సంకేతాలు ఇచ్చారు.ముందుకు దూసుకెళ్తున్నాం..ఆగస్టులో డొనెట్స్క్ ప్రాంతంలో 270 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నామని పుతిన్ ఈ సందర్భంగా ప్రకటించారు. రష్యా సైన్యం చాకచక్యంగా 4,500–4,800 మంది, మరో 2,000 మంది ఉక్రెయిన్ సైనికులతో కూడిన రెండు బృందాలను చుట్టుముట్టిందని పేర్కొన్నారు. స్లోవియాన్స్క్, క్రామటోర్స్క్ నగరాల వైపు రష్యా బలగాలు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. ఈ వాదనలను స్వతంత్రంగా నిర్ధారించలేదని రాయిటర్స్ తెలిపింది.‘డ్రోన్లతో ఉగ్రవాదం’రష్యాలోకి ఉక్రెయిన్ జరుపుతున్న డ్రోన్ దాడులను పుతిన్ తీవ్రంగా తప్పుబట్టారు. ఉగ్రవాదం మరో స్థాయికి చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపించారు. రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులతో నష్టం జరిగినట్లు తొలిసారిగా అంగీకరించిన ఆయన.. తమ రిఫైనరీల్లో కేవలం 10 శాతం మాత్రమే మరమ్మతులు అవసరమని చెప్పారు.చర్చలకు ఓకే.. కానీ!యుద్ధాన్ని పూర్తిగా ముగించే ఉద్దేశంతో జరిగే చర్చలకు రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతినిధులతో చర్చలకు కూడా తాము వ్యతిరేకం కాదన్నారు. అయితే చర్చల ప్రక్రియను సాగదీస్తూ కాలయాపన చేయడం మాత్రం అంగీకరించబోమని స్పష్టం చేశారు.కొత్త సైనిక సమీకరణ ఉండదురష్యాలో మరోసారి సైనిక సమీకరణ చేపట్టాల్సి వస్తుందన్న ప్రచారాన్ని పుతిన్ కొట్టిపారేశారు. అదంతా ‘పచ్చి అర్ధంలేని మాటలు’ అని వ్యాఖ్యానించారు. రష్యా సైనిక పరిస్థితి బలంగానే ఉందన్న సందేశాన్ని పుతిన్ తాజా వ్యాఖ్యల ద్వారా ఇచ్చారు. -
ఇంటర్నెట్ కట్.. పాక్ నుంచి మరో మీమ్ వైరల్
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న కాలంలో.. వినూత్న ఆవిష్కరణలు, ప్రయోగాలు నిత్యకృత్యంగా మారాయి. అయితే కొత్తదనం ఎంత ఆసక్తికరంగా ఉన్నా.. భద్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఊహించని పరిణామాలు తప్పవు. పాకిస్థాన్‌లో జరిగిన ఈ ఘటన అందుకు ఓ ఉదాహరణ.పాకిస్తాన్లో టెక్నాలజీ ప్రయోగం కాస్తా.. పోలీస్ వ్యాన్‌ను ఢీకొట్టే ఘటనగా మారింది. ఇంటర్నెట్ కనెక్షన్ ఒక్కసారిగా తెగిపోవడంతో రిమోట్ కంట్రోల్‌తో నడుస్తున్న ఓ ఆటోమేటిక్ కారు అదుపు తప్పి నేరుగా పోలీస్ వ్యాన్‌ను ఢీకొట్టింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని డీ-చౌక్ వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయి నవ్వులు పూయిస్తోంది.ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెక్నాలజీని ప్రదర్శిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడి జర్నలిస్టు మహ్మద్ ఆలిజా కారులో ముందు సీట్లో కూర్చొని దాని ప్రత్యేకతలను వివరిస్తున్నారు. అబ్బొట్టాబాద్కు చెందిన టెక్నాలజీ ఔత్సాహికుడు ఇహ్సాన్ జాఫర్ రూపొందించిన ఈ ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెక్నాలజీపై రిపోర్టు చేసేందుకు తాను అక్కడికి వెళ్లినట్లు ఆలిజా వెల్లడించారు.కారు ముందుకు కదులుతుండగా.. ఒక్కసారిగా రిమోట్ ద్వారా నియంత్రించే స్టీరింగ్ స్పందించడం ఆపేసింది. పరిస్థితిని గమనించిన ఆలిజా వెంటనే హ్యాండ్‌బ్రేక్ వేసేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. కారు వేగంగా ముందుకు దూసుకెళ్లి అక్కడే ఉన్న పోలీస్ వ్యాన్‌ను ఢీకొట్టింది.కనెక్షన్ కట్.. కారు కంట్రోల్ ఔట్!ఈ కారును ఇంటర్నెట్, శాటిలైట్ కనెక్షన్ల సాయంతో రిమోట్‌గా నియంత్రిస్తున్నట్లు ఆలిజా తెలిపారు. అయితే ప్రయోగం జరుగుతున్న సమయంలో ఇంటర్నెట్ కనెక్షన్ తెగిపోవడంతో కారు నియంత్రణ కోల్పోయిందని చెప్పారు. అదృష్టవశాత్తూ ఘటన జరిగిన సమయంలో అక్కడ ట్రాఫిక్ తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. అదే కారు రద్దీగా ఉండే రోడ్డుపై అదుపు తప్పి ఉంటే పరిస్థితి తీవ్రంగా ఉండేదని ఆలిజా పేర్కొన్నారు. అయితే పోలీసులు ఎలా స్పందించారో అనేది మాత్రం ఆయన వివరించలేదు.A Pakistani innovator was demonstrating a driverless car he developed when it lost control and crashed directly into a police vehicle in Islamabad.The car is remotely controlled over the internet through an app or computer.Source: ProPakistani, Khabrain News pic.twitter.com/bUVuesS4cH— Planet Report HQ (@PlanetReportHQ) August 31, 2026ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడం వెనుక టెక్నాలజీని రూపొందించిన యువకుడిని విమర్శించడం తన ఉద్దేశం కాదని ఆలిజా స్పష్టం చేశారు. కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయడం, ప్రయోగాలు చేయడం అవసరమేనని.. అయితే వాటిని ప్రజల్లోకి తీసుకురాకముందు పూర్తిస్థాయిలో పరీక్షించి భద్రతను నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేకించి ఇంటర్నెట్, శాటిలైట్ కనెక్షన్లపై ఆధారపడే రిమోట్ డ్రైవింగ్ వ్యవస్థల్లో కనెక్షన్ తెగిపోయినప్పుడు వాహనాన్ని సురక్షితంగా నిలిపే ప్రత్యామ్నాయ వ్యవస్థలు తప్పనిసరిగా ఉండాలని ఈ ఘటన స్పష్టం చేస్తోందని పేర్కొన్నారు.పాక్ నుంచి మరో మీమ్!ఈ తరహా ఘటనలను నెట్టింట ఎలా ట్రోలింగ్ చేస్తారో తెలియంది కాదు. గతంలో పాక్ నుంచి ఎన్నో ఇలాంటివి మీమ్స్ రూపంలో వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరు పాక్ టెక్నాలజీ నాసిరకంగా ఉంటుందని ఎద్దేవా చేస్తుండగా.. మరికొందరు ఈ ఘటనను సరదాగా తీసుకుని మీమ్స్ చేస్తున్నారు. “పోలీసులను చూడగానే పాకిస్థాన్‌లో ఏఐ కూడా కంగారుపడుతుంది” అంటూ ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్య వైరల్‌గా మారింది. మొత్తంగా.. ఇంటర్నెట్ కనెక్షన్ పోవడంతో పోలీస్ వ్యాన్‌ను ఢీకొట్టిన ఈ రిమోట్ కారు వీడియో పాకిస్థాన్‌లో నవ్వులు పూయిస్తోంది.ఇదీ చదవండి: నేపాల్ వరదలకు ఆమె కన్నీరే కారణమా? -
నేపాల్ విలయం.. ఇస్రో-నాసా నిసార్ నిద్రపోయిందా?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉపగ్రహాల్లో ఒకటైన నాసా–ఇస్రో సంయుక్త నిసార్ ఇప్పుడు ఏం చేస్తోంది?. నేపాల్ విపత్తు విషయంలో అది ఏదైనా సమాచారం సేకరించిందా? లేదంటే నిద్ర పోతోందా?. ఆకస్మిక వరదలు, మంచు, నీరు, రాళ్లు, బురద కదలికలతో తీవ్ర విధ్వంసం చోటుచేసుకున్న నేపథ్యంలో.. ఈ విపత్తుకు సంబంధించి నిసార్ ఏం గుర్తించింది? దాని డేటా ఏం చెబుతోంది? అనే ప్రశ్నలు ఆసక్తిని రేపుతున్నాయి.సుమారు 1.3 బిలియన్ డాలర్ల వ్యయంతో రూపొందించిన నిసార్(NISAR)ను భూమిపై జరిగే మార్పులను మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వంతో గుర్తించేలా ఇస్రో-నాసాలు దీనిని అభివృద్ధి చేశాయి. హిమనదులను(గ్లేసియర్ల) పర్యవేక్షించడం, భూభాగ కదలికలను గుర్తించడం, కొండచరియలను అధ్యయనం చేయడం, భూకంపాలను పరిశీలించడం, విపత్తుల నిర్వహణకు కీలక సమాచారం అందించడం దీని లక్ష్యాలు. ముఖ్యంగా హిమనదులు, క్రియాశీల టెక్టానిక్ ప్రాంతాలు, వాతావరణ మార్పుల ప్రభావాలతో ప్రమాదకరంగా మారుతున్న హిమాలయాలు.. నిసార్ పరిశీలనకు కీలక ప్రాంతాల్లో ఒకటి.మరి నిసార్ ఎక్కడ?నేపాల్ రసువా జిల్లాలో గ్లేసియర్ కూలిపోవడం, మంచు, నీరు, రాళ్లు, బురద భారీగా పొటెత్తడంతో విపత్తు తలెత్తింది. నిసార్ రూపొందించిన ప్రధాన లక్ష్యాల్లోనే ఇలాంటి హిమనదులు, కొండచరియలు, భూభాగ మార్పులను పరిశీలించడం ఉంది. అయితే ఇప్పటివరకు ఈ విపత్తుకు సంబంధించి నిసార్ కనీస అంచనా, హెచ్చరిక సమాచారం లేదంటే కీలక శాస్త్రీయ విశ్లేషణ అనేవి ఏవీ కూడా పబ్లిక్ డొమైన్లో కనిపించకపోవడం చర్చకు దారితీసింది. నిసార్ ప్రస్తుతం కక్ష్యలో ఉండి క్రమం తప్పకుండా డేటా సేకరిస్తుంటే.. నేపాల్ విపత్తుకు సంబంధించి అదసలు ఏం గుర్తించిందన్నది ఆసక్తికరంగా మారింది.నాసా-ఇస్రో చెప్పేది ఇదే..నాసా ప్రకారం.. నిసార్ విపత్తులను ట్రాక్ చేయడం, పర్యావరణ వ్యవస్థలను పర్యవేక్షించడం, హిమనదులు, మంచు ప్రాంతాలను అధ్యయనం చేయడం, భూమి ఉపరితలం ఎలా మారుతోందో తెలుసుకోవడంలో సహాయపడుతుంది. దీని ద్వారా ప్రాణాలను రక్షించేందుకు, ప్రకృతి వనరుల నిర్వహణకు అవసరమైన సమాచారం అందుతుందని నాసా పేర్కొంది. ఇస్రో కూడా నిసార్ ప్రతి 12 రోజులకు ప్రపంచంలోని భూభాగం, మంచుతో కప్పబడిన ప్రాంతాలను చిత్రీకరిస్తుందని తెలిపింది. ‘కదలికలు గుర్తించగలం’నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీకి చెందిన నిసార్ ప్రాజెక్ట్ శాస్త్రవేత్త పాల్ రోజెన్ ఇంతకు ముందు నిసార్ సామర్థ్యాలను వివరించారు. భూమి, మంచు కదలికలను త్రీడీ రూపంలో అధ్యయనం చేయగలమని, భూకంపాలకు ముందు.. భూకంపాల సమయంలో.. ఆ తర్వాత భూమి కదలికలను మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వంతో కొలవచ్చని తెలిపారు. అంతేకాదు.. కొండచరియలు విరిగిపడటానికి ముందు చోటుచేసుకునే కదలికలను గుర్తించగలమని, హిమనదుల కదలికలను పర్యవేక్షించడం ద్వారా గ్లేషియల్ లేక్ ఔట్బర్స్ట్ ఫ్లడ్ (GLOF) ముప్పులను అంచనా వేయడంలో సహాయపడుతుందని వివరించారు.ఏడాది క్రితమే ఆపరేషన్స్ ప్రారంభంనిసార్ కక్ష్యలోకి ప్రవేశించి ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా ఆగస్టు 4న బెంగళూరులో నాసా, ఇస్రో సంయుక్తంగా కార్యక్రమం నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ఉపగ్రహం సాధించిన పురోగతి, శాస్త్రీయ ఫలితాలు, డేటా పంపిణీ తదితర అంశాలను ప్రస్తావించారు. నాసా ఎర్త్ సైన్స్ డివిజన్ డైరెక్టర్ కరెన్ ఎం. సెయింట్ జర్మెయిన్.. భూమి వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి నిసార్ అందిస్తున్న భారీ స్థాయి డేటా ప్రాధాన్యాన్ని వివరించారు. ఇస్రో శాస్త్రవేత్తలు అటవీ బయోమాస్, నేల తేమ, పంటలు, సముద్ర ఉపరితల గాలులు, మడ అడవులు, అటవీ మార్పులు, భూభాగ మార్పులు వంటి అంశాల్లో నిసార్ అప్లికేషన్లను వివరించారు.వెనెజువెలా భూకంప టైంలో..నిసార్ ఇప్పటికే విపత్తుల విశ్లేషణలో ఉపయోగపడిందనడానికి ఉదాహరణగా నిలిచాయి. జూన్ 24న వెనెజువెలాలో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిన కొన్ని రోజులకే నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ నిసార్ డేటాతో రూపొందించిన మ్యాప్‌ను విడుదల చేసింది. భూకంపాల కారణంగా భూభాగం ఎంత మేరకు కదిలిందో ఆ మ్యాప్ చూపించింది. అత్యవసర నిర్వహణ అధికారులు, శాస్త్రవేత్తలకు ఇది ఉపయోగకరమైన సమాచారాన్ని అందించిందని నాసా తెలిపింది.అయితే నేపాల్ విషయంలో ఎందుకు?నేపాల్ విపత్తుపై మాత్రం నిసార్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి పబ్లిక్ విశ్లేషణ వెలువడలేదు. దీంతో కొన్ని కీలక ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. విపత్తుకు ముందు ప్రాంతంలో భూభాగ కదలికలను నిసార్ గుర్తించిందా? గ్లేసియర్లలో ఏవైనా అసాధారణ మార్పులను నమోదు చేసిందా? విపత్తుకు దారితీసిన ప్రక్రియలకు సంబంధించి నిసార్ డేటాలో ఏమైనా సంకేతాలు ఉన్నాయా? ఇప్పటికే ప్రాథమిక విశ్లేషణ జరిగిందా? జరిగితే ఆ వివరాలను ఎందుకు బయటపెట్టలేదు? అనేదే ఆ ప్రశ్నలు. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. నిసార్ ప్రతి వరద, కొండచరియలు, హిమనదులు కుప్పకూలిపోవడం, భూకంపాన్ని ముందుగానే హెచ్చరించే పూర్తిస్థాయి ఆపరేషనల్ వార్నింగ్ ఉపగ్రహం కాదు. దీని ప్రధాన లక్ష్యం భూమి, మంచు ప్రాంతాల్లో జరిగే మార్పులను అత్యంత ఖచ్చితత్వంతో పరిశీలించడం, ఆ డేటాను శాస్త్రీయ విశ్లేషణకు అందించడం. అలాగే నిసార్‌లో సాంకేతిక వైఫల్యం జరిగిందన్న ఆధారాలు కూడా ఇప్పటివరకు లేవు.‘డేటా తీస్తుంది.. విశ్లేషించేది మనుషులే’అయితే నేపాల్ విపత్తు తర్వాత ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్ రోజెన్ కీలక విషయాన్ని వెల్లడించారు. నిసార్ డేటాను సేకరిస్తుంది కానీ దాన్ని విశ్లేషించేది శాస్త్రవేత్తలేనని చెప్పారు. ఇలాంటి ముందస్తు సంకేతాలను గుర్తించేందుకు అవసరమైన దీర్ఘకాలిక డేటా సిరీస్‌ను నిసార్ ఇప్పుడిప్పుడే సేకరిస్తోందన్నారు. అలాగే హిమాలయ ప్రాంతమంతటా సాధారణ, అసాధారణ కదలికలను గుర్తించేందుకు ఆటోమేటెడ్ టూల్స్‌ను అభివృద్ధి చేయాల్సి ఉందని.. అలాంటి వ్యవస్థలు సిద్ధమైన తర్వాతే ప్రమాదాలను అంచనా వేసే అవకాశాలు మెరుగవుతాయని వివరించారు. నిసార్ ఈ తరహాలో పనిచేసే తొలి ఉపగ్రహం కావడంతో దాని డేటా, సామర్థ్యాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు.డేటా మాత్రం అందుబాటులోకి రావాల్సిందేనిసార్ నుంచి సేకరించే డేటాను ప్రాసెస్ చేసిన తర్వాత పబ్లిక్ ఆర్కైవ్‌లో అందుబాటులో ఉంచేందుకు నాసా, ఇస్రో అంగీకరించాయి. అందువల్ల నేపాల్ విషాదం నేపథ్యంలో నిసార్ డేటాపై మరింత ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం నిసార్ కక్ష్యలో ఉంది.. డేటాను సేకరిస్తోంది. అయితే ఈ ఉపగ్రహం నేపాల్ విపత్తు విషయంలో ఏం చూసింది? ఏం గుర్తించింది? అన్నది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.బహుశా శాస్త్రీయ విశ్లేషణలు జరుగుతుండొచ్చు.. డేటాను ధ్రువీకరించేందుకు సమయం పడుతుండొచ్చు. అలాగే హిమాలయాల్లోనే ఇంతటి విపత్తు చోటుచేసుకున్న నేపథ్యంలో.. నిసార్ సేకరించిన డేటా ఇప్పుడు అత్యంత కీలకంగా మారే అవకాశం లేకపోలేదు. విపత్తుకు ముందు అక్కడ ఏం జరిగింది? హిమనదులు, భూభాగ కదలికల్లో ఏవైనా అసాధారణ మార్పులు నమోదయ్యాయా?.. నిసార్ డేటా సమాధానం చెబుతుందా అన్నదే ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: కార్లు మాట్లాడుకుంటే.. యాక్సిడెంట్లే జరగవట! -
ఒకే ఇంట్లో బయటపడ్డ 23 మృతదేహాలు!
నేపాల్‌ను వణికించిన ఆకస్మిక వరదల విషాదం.. రోజురోజుకూ మరింత భయానక పరిస్థితుల్ని వెలుగులోకి వస్తోంది గతవారం సంభవించిన ఫ్లాష్ ఫ్లడ్స్‌లో మృతుల సంఖ్య 1000కి చేరువైంది. గల్లంతైన వాళ్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. వాళ్ల ఆచూకీ తెలియకపోవడంతో అన్వేషణ కొనసాగుతోంది. భారీ వర్షాలు, బురద, దెబ్బతిన్న రహదారులు, మూసుకుపోయిన సొరంగాలు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారాయి.ఆగస్టు 26న నేపాల్–టిబెట్ సరిహద్దులో మంచు, రాళ్ల భారీ ప్రవాహం ఒక్కసారిగా విరుచుకుపడటంతో భోటేకోషి–త్రిశూలీ నదీ వ్యవస్థలో వరదలు పోటెత్తాయి. ఉత్తర, మధ్య నేపాల్‌లోని పలు పట్టణాలు, గ్రామాలను ముంచెత్తిన ఈ వరదల్లో ఇళ్లు, వాహనాలు, రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. పలు జలవిద్యుత్ ప్రాజెక్టులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి నేపాల్ సహాయక బృందాలు, వివిధ దేశాల రెస్క్యూ టీంలు రంగంలోకి దిగి గాలింపు కొనసాగిస్తున్నాయి.తాజాగా.. నువాకోట్ జిల్లాలోని బెత్రావతిలో ఈ ఉదయం ఓ ఇంట్లో 23 మృతదేహాలు బయటపడటం తీవ్ర విషాదాన్ని నింపింది. వరదల తర్వాత గల్లంతైన వారి కోసం గాలిస్తుండగా ఈ మృతదేహాలను గుర్తించారు. అవి ఒకే కుటుంబానికి చెందినవా? చుట్టుపక్కల వాళ్లు తలదాచుకునేందుకు వచ్చి మరణించారా? లేదంటే కొట్టుకు వచ్చిన మృతదేహాలా? అని పరిశీలిస్తున్నారు. మరోవైపు నేపాల్ నుంచి కొట్టుకొచ్చినట్లు భావిస్తున్న 13 మృతదేహాలు ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్ సమీపంలోని గండక్ నదిలో లభించాయి. వీరిలో ఆరుగురు మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. మృతదేహాలను నేపాల్‌కు అప్పగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.సొరంగాల్లో 900 మందికి పైగా?నేపాల్ ఆకస్మిక వరదల కారణంగా జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న 933 మంది కార్మికుల జాడ లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. రసువా, నువాకోట్ జిల్లాల్లోని పలు సొరంగాల్లో కార్మికులు చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. త్రిశూలీ 3ఏ ప్రాజెక్టులో పనిచేస్తున్న 40–42 మంది ఇంజినీర్ల ఆచూకీ ఇంకా లభించలేదు. త్రిశూలీ 3బీ ప్రాజెక్టులో 118 మంది కార్మికులు గల్లంతయ్యారు. బురద, నీటితో సొరంగాలు పూర్తిగా మూసుకుపోవడంతో సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఆర్మీ సిబ్బంది నియంత్రిత పేలుళ్లు, ఎక్సకవేటర్లు, సెర్చ్లైట్లను ఉపయోగించి మార్గాలను క్లియర్ చేస్తున్నారు. అయితే కెమెరాల్లోనూ లోపల నిశబ్ధ వాతావరణం కనిపిస్తుండడంతో.. వాళ్లంతా కొట్టుకునిపోయి ఉండొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.సామూహిక ఖననాలే దిక్కు!వరదల్లో గల్లంతైన వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో మృతదేహాల గుర్తింపు అధికారులకు మరో పెద్ద సవాల్‌గా మారింది. పోఖారా ఆస్పత్రికి గోర్ఖా, తనహున్, ధాదింగ్, నావల్పరాసీ ఈస్ట్ ప్రాంతాల నుంచి 102 మృతదేహాలను తరలించారు. వీరిలో 16 మందిని గుర్తించి కుటుంబాలకు అప్పగించారు. అయితే చాలా మృతదేహాలు తీవ్రంగా దెబ్బతినడంతో ఫొటోలు, దుస్తులు, నగలు, టాటూల ఆధారంగా బాధితులను గుర్తించాల్సి వస్తోంది. అవసరమైన చోట డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. భారత్‌కు చెందిన 18 మంది ఫోరెన్సిక్ నిపుణులు కూడా గుర్తింపు ప్రక్రియలో సహకరిస్తున్నారు.అలాగే వదరలు సంభవించిన రీజియన్‌లో మార్చురీల సంఖ్య.. సామర్థ్యం చాలా తక్కువగా ఉంది. బాడీ మేనేజ్మెంట్ సెంటర్లను తాత్కాలికంగా ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. దీంతో సామూహిక ఖననాలు నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.వేలాది మంది గల్లంతు.. విదేశీయులూరసువాలోని ఉత్తర్గయా గ్రామానికి చెందిన సుమారు 350 మంది విద్యార్థులు గల్లంతైనట్లు సమాచారం. ఇప్పటివరకు వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 10 వేల మందికిపైగా ప్రజలను రక్షించారు. వీరిలో 323 మంది విదేశీయులు ఉన్నారు. మరోవైపు 39 దేశాలకు చెందిన సుమారు 590 మంది విదేశీయులు ఇంకా ఆచూకీ లేకుండా ఉన్నట్లు నేపాల్ విదేశాంగ శాఖ తెలిపింది.65 వేల మందికి అత్యవసర సాయంవరదల తీవ్రతను ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళనకరంగా అభివర్ణించింది. ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 65 వేల మందికి తాగునీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు సంబంధించిన అత్యవసర సాయం అవసరమని తెలిపింది. 22 వేల మందికిపైగా చిన్నారులకు రక్షణ సేవలు అవసరమవుతున్నాయి. పాఠశాలలు కూడా వరదలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 19 పాఠశాలలు దెబ్బతినగా, తొమ్మిది పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరో ఎనిమిది పాఠశాలలను ప్రస్తుతం బాధితులకు ఆశ్రయ కేంద్రాలుగా ఉపయోగిస్తున్నారు.ఇదిలా ఉండగా.. వరదల్లో దెబ్బతిన్న రహదారులు, వంతెనల కారణంగా సహాయక సామగ్రిని బాధిత ప్రాంతాలకు తరలించడం కష్టంగా మారింది. ఫ్రీజర్లు, డీఎన్ఏ కిట్లు, డ్రోన్లు, లిడార్ పరికరాలు, వంతెన నిర్మాణ సామగ్రి వంటి ప్రత్యేక పరికరాలను నేపాల్ కోరింది. భారత్, చైనా, సింగపూర్, దక్షిణ కొరియా తదితర దేశాలు సహాయక చర్యలకు మద్దతు అందిస్తున్నాయి. మరోవైపు టిబెట్‌లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో అక్కడ ఏర్పడిన సరస్సులు, హిమనదుల(గ్లేసియర్) కూలిపోయే ప్రమాదంపై కూడా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.ఇదీ చదవండి: నేలమట్టమైన వందల ఏళ్ల నాటి హిందూ దేవాలయం -
నా భార్య పేరు ఎత్తే సాహసం చేయొద్దు: జేడీ వాన్స్
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, మిషిగన్ డెమోక్రటిక్ సెనేట్ అభ్యర్థి అబ్దుల్ ఎల్-సయెద్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. వాన్స్ భార్య, సెకండ్ లేడీ ఉషా వాన్స్‌ను ఉద్దేశించి ఎల్-సయెద్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై వాన్స్ తీవ్రంగా స్పందించారు. ‘‘నీ నోటితో నా భార్య పేరు ఎత్తొద్దు’’ అంటూ ఘాటు హెచ్చరిక చేశారు.మిషిగన్‌లో రిపబ్లికన్ సెనేట్ అభ్యర్థి మైక్ రోజర్స్‌కు మద్దతుగా సోమవారం జరిగిన మాగా కంపెనీ ర్యాలీలో జేడీ వాన్స్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎల్-సయెద్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘నా భార్య పేరును నీ నోటితో ఎత్తొద్దు. నీ స్థాయికి అందనంత దూరంలో ఆమె ఉంది’’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎల్-సయెద్ చాలా చాలా చెడ్డ వ్యక్తి అంటూ విమర్శించారు.ఎలా మొదలైంది?ఎల్-సయెద్ గతంలో షరియా చట్టంపై చేసిన వ్యాఖ్యలను వాన్స్ ఇటీవల విమర్శించారు. అమెరికా కార్మిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పుకునే ఓ రాజకీయ నాయకుడు షరియా చట్టానికి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా తన దివంగత తాతను గుర్తుచేసుకున్న వాన్స్.. ‘‘ఇది నా తాతకు తెలిసిన డెమోక్రటిక్ పార్టీ అయితే కాదు’’ అని వ్యాఖ్యానించారు.దీనిపై స్పందించిన అబ్దుల్ ఎల్-సయెద్ Abdul El Sayed.. వాన్స్ తన తాత గురించి మాట్లాడిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేస్తూ ఆయన భార్య ఉషా వాన్స్ పేరును ప్రస్తావించారు. ‘‘జేడీ ఉషాను కూడా తనతో పాటు గతంలోకి తీసుకెళ్లి తాతను కలిపిస్తారా?’’ అంటూ వ్యంగ్యంగా పోస్టు చేశారు. దీనిపై వాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవతలి వాళ్ల కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటం ఎల్-సయెద్కు ఓ విచిత్రమైన అలవాటుగా మారిందని విమర్శించారు. ఇకపై తన భార్య పేరును ప్రస్తావించవద్దని హెచ్చరించారు.‘చాలా చాలా చెడ్డ వ్యక్తి’ఎల్-సయెద్పై వాన్స్ మరిన్ని తీవ్ర ఆరోపణలు చేశారు. ఒకే వర్గం ప్రయోజనాల కోసం మిగిలినవారిని పట్టించుకోని రాజకీయ ధోరణి అమెరికాలో పెరుగుతోందని.. అందుకు ఎల్-సయెద్ ఉదాహరణ అని అన్నారు. తన మతానికి చెందినవారిపట్ల మాత్రమే సానుభూతి చూపుతూ, ఇతరుల సమస్యలను పట్టించుకోరని వాన్స్ ఆరోపించారు. నవంబర్ ఎన్నికల్లో ఎల్-సయెద్ రాజకీయాలను తిరస్కరించి, రిపబ్లికన్ అభ్యర్థి మైక్ రోజర్స్‌కు మద్దతు ఇవ్వాలని మిషిగన్ ఓటర్లను కోరారు.వాన్స్‌కు ఎల్-సయెద్ కౌంటర్వాన్స్ చేసిన ‘‘చెడు’’ వ్యాఖ్యలకు ఎల్-సయెద్ కూడా ఘాటుగానే స్పందిస్తూ ట్రంప్ సర్కార్‌పై మండిపడ్డారు. ‘‘పనిచేసే ప్రజల ఆరోగ్య సంరక్షణను తొలగించి బిలియనీర్లకు పన్ను రాయితీలు ఇవ్వడం చెడు. ట్రేడ్ వార్స్, నిజమైన యుద్ధాల వైపు వెళ్తూ ప్రజలపై నిత్యావసర వస్తువులు, ఇంధన ధరల భారాన్ని పెంచడం చెడు. రాజకీయ లబ్ధి కోసం ప్రజలను విభజించడం చెడు’’ అంటూ ఎదురుదాడి చేశారు. రిపబ్లికన్లు తమపై చేస్తున్న విమర్శలను మిషిగన్ ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, నవంబర్ ఎన్నికల్లో ఓటుతో సమాధానం చెబుతారని అన్నారు.షరియా, ఇజ్రాయెల్ అంశాలపై వివాదంఎల్-సయెద్పై రిపబ్లికన్లు గత కొంతకాలంగా షరియా చట్టం, ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై ఆయన వైఖరిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. మిషిగన్‌లోని ఓ సినగాగ్‌పై మార్చిలో జరిగిన దాడి తర్వాత ఎల్-సయెద్ చేసిన ‘‘హింస అనేది ఓ చక్రం’’ వంటి వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. అయితే ఆ దాడిని, యూదు వ్యతిరేకతను ఆయన ఖండించారు.అలాగే ఎల్-సయెద్కు వామపక్ష రాజకీయ విశ్లేషకుడు హసన్ పైకర్తో ఉన్న సంబంధాన్ని కూడా రిపబ్లికన్లు విమర్శిస్తున్నారు. పైకర్ గతంలో అమెరికా ‘‘9/11కు అర్హమైనదే’’ అనే వ్యాఖ్య చేయడం వివాదాస్పదమైంది. విమర్శలు రావడంతో పైకర్ తర్వాత తన వ్యాఖ్య సరికాదని వెనక్కి తీసుకున్నాడు.మిషిగన్ పోరుపై ఆసక్తిమిషిగన్ సెనేట్ ఎన్నిక ప్రస్తుతం అమెరికా రాజకీయాల్లో కీలక పోరుగా మారింది. సెనేట్ నియంత్రణను నిర్ణయించే అవకాశం ఉన్న ఆరు కీలక పోటీల్లో మిషిగన్ కూడా ఒకటిగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాన్స్–సయెద్ మధ్య మాటల యుద్ధం మరింత రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.అమెరికా సెకండ్ లేడీ ఉషా చిలుకూరి వాన్స్‌కు తెలుగు మూలాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు వెళ్లిన కుటుంబంలో పుట్టిన ఆమె కాలిఫోర్నియాలో పెరిగారు. యేల్ లా స్కూల్లోనే జేడీ వాన్స్‌ను కలిసిన ఉషా.. 2014లో ఆయనను వివాహం చేసుకున్నారు. హిందూ సంప్రదాయంలోనూ వివాహ వేడుక నిర్వహించడం విశేషం. గతంలో డెమోక్రటిక్ పార్టీలో నమోదైన ఉషా.. రిపబ్లికన్ భర్త జేడీ వాన్స్ రాజకీయ ప్రయాణంలో కీలకంగా నిలిచారు.ఇదీ చదవండి: ఇరాన్ ‘ఖర్గ్’పై ట్రంప్ పోస్ట్.. దానర్థం ఏంటంటే? -
‘ఈసారి గట్టిగానే కొడతాం’.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి. అమెరికా దాడులకు ప్రతిగా జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసింది. అయితే దీనికి దీటుగా స్పందిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. ‘‘మేం వారిని గట్టిగా కొడతాం. ప్రతిస్పందన తప్పకుండా ఉంటుంది’’ అని ఆయన అన్నారు. ఫాక్స్ న్యూస్‌తో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ దాడులకు కచ్చితంగా ప్రతీకారం ఉంటుంది. ఈసారి గట్టిగానే కొడతాం. అది వాళ్లు కోలుకోలేని స్థాయిలోనే ఉంటుందని అని అన్నారు. అయితే ఆ ప్రతీకార చర్యలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై స్పష్టత ఇవ్వకపోయినా.. అమెరికా సైనిక, ఆర్థిక మార్గాల్లో చర్యలకు సిద్ధమవుతున్న సంకేతాలు ఇచ్చారు. అలాగే ఇరాన్‌ను ఓ విఫల దేశంగా అభివర్ణిస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికే ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం, కరెన్సీ వంటి కీలక వ్యవస్థలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఇరాన్ నాయకత్వం తీవ్ర గందరగోళంలో ఉందని, దేశాన్ని సరిగ్గా నడిపించే స్థితిలో లేదని అన్నారు. అదే సమయంలో హర్ముజ్ జలసంధి సురక్షితంగానే ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా బలగాలపై ఇరాన్ దాడులు చేసినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో జోర్డాన్ సైన్యం అప్రమత్తమైంది. తమ గగనతలంలోకి వచ్చిన ఎనిమిది క్షిపణులను అడ్డుకున్నట్లు జోర్డాన్ ప్రకటించింది. దాదాపు నెల రోజుల తర్వాత.. లారక్ ద్వీపంపై అమెరికా బలగాలు దాడులు చేశాయి. ఆ దాడుల్లో సాధారణ పౌరులు సైతం మరణించారని ఆరోపిస్తూ ఇరాన్ ఈ దాడులకు పాల్పడింది.మరోవైపు ఇరాన్ సాయుధ దళాలు, అమెరికా మధ్య ఉద్రిక్తతలు గల్ఫ్ ప్రాంతానికీ విస్తరించాయి. తూర్పు హర్ముజ్ జలసంధిపై అమెరికాకు చెందిన MQ-9 డ్రోన్‌ను తమ వాయు రక్షణ వ్యవస్థ అడ్డుకున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది.‘ఖర్గ్’పై ట్రంప్ పోస్టు.. ఇరాన్‌కు సందేశమేఇరాన్లోని ఖర్గ్ ద్వీపంపై ట్రంప్ ఆదివారం చేసిన సోషల్ మీడియా పోస్టు కూడా తీవ్ర చర్చకు దారితీసింది. ద్వీపాన్ని పేల్చేస్తూ అమెరికా సైనిక దాడులకు సంబంధించినట్లు కనిపించే ఏఐ రూపొందించిన వీడియోను ఆ పోస్టుతో జత చేశారు. అయితే ఖర్గ్ ద్వీపంపై అమెరికా సైన్యం రాత్రి దాడులు చేయలేదని ఓ అమెరికా అధికారి స్పష్టం చేశారు. ట్రంప్ పోస్టు వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించగా.. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వ్యూహాత్మకంగా సందేశాలు ఇస్తారని, ఇరాన్‌కు ఆయన ఓ సందేశం పంపుతున్నారని చెప్పారు.ఐరాసను ఆశ్రయించిన ఇరాన్అమెరికా దాడులపై ఇరాన్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని ఆశ్రయించింది. లారక్ ద్వీపంపై అమెరికా దాడిలో సైనికులు, పౌరులు మరణించారని, పలువురు గాయపడ్డారని ఇరాన్ ఆరోపించింది. ఈ దాడి తమ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించడమేనని పేర్కొంది. జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై తాము చేసిన దాడులు ‘‘ఆత్మరక్షణ చర్యల్లో భాగమే’’ అని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా మరిన్ని దాడులకు పాల్పడితే తాము వెనక్కి తగ్గబోమని హెచ్చరించింది. అమెరికా దాడులను నిలిపివేయాలని భద్రతా మండలిని కోరింది.ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై దెబ్బఇరాన్పై అమెరికా తాజాగా ప్రకటించిన ఆంక్షల ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ అన్నారు. తాజా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ‘‘వారాలు లేదా నెలల్లో కుప్పకూలే అవకాశం ఉందని’’ వ్యాఖ్యానించారు. అయితే అమెరికా అసలు లక్ష్యం ఇరాన్ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేయడం కాదని.. చర్చలకు ఇరాన్‌ను రప్పించే ప్రయత్నమేనని బెసెంట్ స్పష్టం చేశారు. యూఏఈకి ఇరాన్ డ్రోన్.. తీవ్ర ఆగ్రహంఇరాన్ తమపై డ్రోన్ దాడికి ప్రయత్నించిందని యూఏఈ ఆరోపించింది. గగనతల రక్షణ వ్యవస్థలు ఆ డ్రోన్‌ను అడ్డుకున్నాయని తెలిపింది. ఈ ఘటనను ‘‘ప్రమాదకరమైన ఉద్రిక్తత’’గా అభివర్ణిస్తూ ఇరాన్ చర్యను తీవ్రంగా ఖండించింది.హర్ముజ్‌లో ట్యాంకర్‌పై దాడి జరిగిందా?హర్ముజ్ జలసంధిలో ఓ సూపర్ ట్యాంకర్ రెండు సముద్ర గనులను ఢీకొని నిలిచిపోయిందన్న ఇరాన్ ప్రభుత్వ మీడియా, రెవల్యూషనరీ గార్డ్స్ వాదనలను అమెరికా సెంట్రల్ కమాండ్ ఖండించింది. ఆ వార్త పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గం కావడంతో.. అక్కడ ఎలాంటి చిన్న ఘటన జరిగినా అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.ఇరాన్‌కు అండగా ఈయూ ఒత్తిడిఇరాన్ తన అస్థిరత సృష్టించే చర్యలను నిలిపివేసి శాంతి చర్చలకు రావాల్సిందేనని యూరోపియన్ యూనియన్ పేర్కొంది. అమెరికాతో పాటు ఇతర మిత్రదేశాలతో కలిసి ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని కొనసాగిస్తామని తెలిపింది. మరోవైపు ఇరాన్ పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్.. ఈ ప్రాంతంలో అమెరికాను చుట్టుముట్టేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. చమురు ఎగుమతి చేసే దేశాలపై ఒత్తిడి పెంచడం ద్వారా అమెరికాపై ఆర్థిక ప్రభావం చూపాలని సూచించారు.ఇదీ చదవండి: H4 వీసాదారులకు ట్రంప్ ఝలక్ -
ఇరాన్‌పై మరింత తీవ్ర దాడులు తప్పవు.. ట్రంప్ వార్నింగ్
అమెరికా, ఇరాన్ మధ్య దాదాపు నెల రోజుల తర్వాత (ఆదివారం) మరోసారి దాడి-ప్రతిదాడులు జరిగాయి. తొలుత హర్ముజ్ జలసంధిలోని ఇరాన్ లారక్ దీవిపై అమెరికా దాడి చేయగా (ముగ్గురు చనిపోయారు).. ప్రతీకారంగా ఇరాన్ జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసింది. దీంతో ఇరుదేశాల మధ్య ఘర్షణలు మరోసారి తారాస్థాయికి చేరినట్లైంది.ఇరాన్ ప్రతిదాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించాడు. ఇరాన్‌పై మరింత తీవ్ర దాడులు తప్పవని గట్టి వార్నింగ్ ఇచ్చాడు.ఇరాన్ ప్రతిదాడుల తర్వాత ట్రంప్ తన ట్రూత్ ఖాతాలో ఇరాన్‌లోని కీలక చమురు కేంద్రం 'ఖార్గ్ ద్వీపం' పేలిపోతున్నట్లు ఓ ఏఐ వీడియోను పోస్ట్ చేశాడు. అయితే దీనిపై అమెరికాకు చెందిన ఓ కీలక అధికారి భిన్నంగా స్పందించాడు. అమెరికా ఖార్గ్ ద్వీపాన్ని లక్ష్యంగా చేసుకోలేదని ఆయన తెలిపాడు.ఖార్గ్ ద్వీపం యుద్ధానికి ముందు ఇరాన్ చమురు ఎగుమతుల్లో సుమారు 90 శాతం నిర్వహించేది. ఒకవేళ అక్కడ దాడి జరిగితే ప్రపంచ ఇంధన మార్కెట్లపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది.ఇరాన్ అధ్యక్షుడి శాంతి స్వరంజోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడుల తర్వాత ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ శాంతి స్వరం వినిపించాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో కిర్గిజిస్థాన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇరాన్ ఇంకా చర్చల ద్వారా ఒప్పందానికి రావాలని కోరుకుంటోందని అన్నాడు. యుద్ధం కొనసాగడం ఎవరికీ ప్రయోజనం కలిగించదని పేర్కొన్నాడు.చదవండి: అమెరికా మెరుపు దాడులు.. ఇరాన్ ఎదురుదెబ్బ! -
ఆమె కన్నీటి శాపమే.. నేపాల్‌ను వెంటాడుతోందా?
ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడడం, భూకంపాలు.. వరుస ప్రకృతి విపత్తులు ఓవైపు తరచూ తలెత్తుతున్న రాజకీయ సంక్షోభాలు మరోవైపు. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఏ ముప్పు ఎటు నుంచి ముంచుకొస్తుందో తెలియని పరిస్థితులతో పశుపతి నేల నేపాల్ సతమతమవుతోంది. తాజా జల విలయం కూడా ఆ దేశం ఎదుర్కొంటున్న కష్టాలను మరోసారి కళ్లకు కట్టింది. ఇలాంటి పరిస్థితులు తమకు బాగా అలవాటేనని, కోలుకోవడం కూడా సాధారణమేనని నేపాల్ చెబుతున్నప్పటికీ.. ఈ పరిస్థితుల వెనక ప్రచారంలో ఉన్న ఓ గాథ తాజాగా తెరపైకి వచ్చింది. ‘సతి లే సరాపేకో దేశ్’.. సతి శాపానికి గురైన దేశం. నేపాల్ రాజకీయాల్లో తరచూ వినిపించే మాట ఇది. రాజరికం అంతరించి పోయిన సమయంలో.. అలాగే వరుసగా ప్రభుత్వాలు కూలినప్పుడల్లా ఈ పదం నెట్టింట వైరల్ అవుతుంటుంది. ఇది కేవలం ఇందుకే పరిమితం కాలేదు.. ప్రకృతి ప్రకోపం చూపించినప్పుడు కూడా అక్కడి జనాలు దీనిని గుర్తు చేసుకుంటారు. అసలు నేపాల్ శపించిన ఆ మహిళ ఎవరు? ఆమె విషాద గాథ ఏంటి? సతీసహగమన సమయంలో ఆమె పెట్టిన కన్నీరే నేపాల్ దుస్థితికి కారణమా?.. నాలుగు వందల ఏళ్ల కిందట జరిగింది ఏంటి?.. నేపాల్‌లో 17వ శతాబ్దంలో ఖాట్మాండు లోయను మల్ల రాజులు పరిపాలించేవారు. అధికారం, ఆధిపత్య పోరులతో రాజదర్బాలు కుట్రలకు, కుతంత్రాలుగా నిలయంగా కనిపించేవి. ఆ వంశంలో రాజు లక్ష్మీ నరసింహ మల్లా కొలువులో కాజీ భీమ్ మల్లా అనే సేనాపతి ఉండేవాడు. సైనిక వ్యవహారాల్లోనే కాకుండా పరిపాలన, టిబెట్‌తో వాణిజ్య సంబంధాల్లోనూ ఆయన రాజుకు చేదోడు వాదోడుగా ఉంటూ కీలక వ్యక్తిగా ఎదిగారు. రాజు వద్ద ఆయనకు పెరుగుతున్న ప్రాధాన్యం.. సాధారణంగానే సామంత రాజుల్లో అసూయను పెంచింది.చాడీలు విని.. భీమ్ మల్లాపై కుట్రలు పన్నిన ప్రత్యర్థులు.. రాజు లక్ష్మీ నరసింహుడికి లేనిపోని వన్నీ నూరిపోశారు. దాంతో తన సింహాసనానికి భీమ్ ముప్పుగా మారుతున్నాడేమో అని అనుమానం పెంచుకున్నారాయన. అలా రాజద్రోహం ఆరోపణలతో ఎలాంటి విచారణ జరపకుండానే ఆయన్ని చెరసాలలో బంధించి.. మరణశిక్ష అమలు చేశారు. అది చూసి.. ఆయన భార్య భువనలక్ష్మి గుండె పగిలేలా రోదించింది. రాజ్యం సైతం కన్నీరు పెట్టింది.చితిపై నుంచే శాపం?నమ్మిన బంటుగా ఉన్న వ్యక్తిని లక్ష్మీ నరసింహుడు అకారణంగా, కుట్రలకు తలొగ్గి చంపడాన్ని భువనలక్ష్మి తట్టుకోలేకపోయారు. ఆ కాలంలో నేపాల్‌లో సతి ఆచారం ఉండేది. భర్త మరణించిన తర్వాత భార్య కూడా అతడి చితిపై ఆత్మాహుతి చేసుకునే పరిస్థితులు ఉండేవి. భువనలక్ష్మి కూడా భర్త భీమ్ మల్లా చితిపై ఆత్మార్పణం చేసుకున్నారు. అయితే అంతకు ముందు తన భర్తకు జరిగిన అన్యాయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను అన్యాయంగా చంపిన ఈ నేల, ఈ రాజ్యాన్ని మనశ్శాంతిగా ఉండబోవని, సర్వనాశనం అవుతాయని శపించారు. ఆ తర్వాత రాజు లక్ష్మీ నరసింహుడు సైతం తన పశ్చాత్తాపం వ్యక్తం చేశాడని.. ఆయన కాలంలోనే వరదలు సంభవించాయని చెబుతుంటారు. అలా ఆమె శాపం నాలుగు వందల ఏళ్లుగా కొనసాగుతూనే ఉందని ఓ జానపద కథ ప్రచారంలోకి వచ్చింది. ఆ గాథ నుంచే ‘సతి లే సరాపేకో దేశ్’(Sati le Sarape ko Desh) అనే పదబంధం పుట్టిందని చెబుతారు.అయితే కాలక్రమంలో ఈ గాథ భువనలక్ష్మి అనే మహిళ కన్నీటి కథకు మాత్రమే పరిమితం కాలేదు. నేపాల్‌లో తరచూ తలెత్తిన రాజకీయ అస్థిరత, అధికార పోరాటాలు, పాలనా సంక్షోభాలు.. అదనంగా ముంచెత్తున్న ప్రకృతి విపత్తులను ప్రస్తావించేటప్పుడు ఈ పదబంధాన్ని వ్యంగ్యంగా, ఆవేదన పూరితంగా ఉపయోగించడం మొదలైంది. ఇప్పుడు ఆకస్మిక వరదల వల్ల మళ్లీ తెరపైకి వచ్చింది. View this post on Instagram A post shared by 𝒩 (@nishantchillma)ఇదీ చదవండి: తస్మాత్ జాగ్రత్త.. మనుషుల్ని మోసం చేస్తున్న ఏఐ! -
నేపాల్: లక్కీ హౌస్ వెనక.. అసలు కథ ఇదే!
నేపాల్ వరద బీభత్సంలో.. ఓ ఆకుపచ్చ ఇల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. చుట్టూ ఉన్న ఇళ్లు, నిర్మాణాలు భారీ వరద ప్రవాహానికి కొట్టుకుపోతున్నా.. ఈ ఇల్లు మాత్రం మొండిగా నిలబడింది. ఇంటి చుట్టూ నీరు, బురద, భారీ బండరాళ్లు దూసుకొస్తున్నా.. బాల్కనీలో చిక్కుకున్న కుటుంబం సైతం సురక్షితంగా బయటపడింది. దీంతో ‘ఈ ఇంటిని కట్టిన ఇంజనీర్ ఎవరు? ఇంతటి వరదను ఇది ఎలా తట్టుకుంది?’ అనే చర్చ మొదలైంది.నేపాల్‌లోని హిమాలయ లోయల్లో ఆగస్టు 26న ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ నీటితో పాటు బురద, బండరాళ్లు, చెట్ల దుంగలు ఒక్కసారిగా దిగువ ప్రాంతాల వైపు దూసుకొచ్చాయి. మార్గంలో కనిపించిన ఇళ్లు, వంతెనలు, రహదారులను ధ్వంసం చేశాయి. ఈ విధ్వంసానికి సంబంధించిన వీడియోల్లో మాత్రం ఓ ఆకుపచ్చ ఇల్లు ప్రత్యేకంగా కనిపించింది. వరద నీరు ఆ ఇంటిని దాదాపు చుట్టుముట్టింది. చుట్టుపక్కల ప్రాంతం మొత్తం బురద, శిథిలాలతో నిండిపోయింది. అయినప్పటికీ ఇంటి నిర్మాణం కూలిపోలేదు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు బాల్కనీలోకి చేరి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. చివరకు వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.అసలు కారణం ఇదే.. ఈ ఇల్లు అక్కడి ఇతర నిర్మాణాలతో పోలిస్తే భిన్నంగా ఉండటమే ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. హిమాలయ ప్రాంతాల్లో అనేక ఇళ్లు రాళ్లతో నిర్మిస్తారు. ఇవి ఇంటిపై పడే నిలువు బరువును తట్టుకోగలిగినా.. వరద నీరు అడ్డంగా ఢీకొన్నప్పుడు ఏర్పడే భారీ ఒత్తిడిని తట్టుకోవడం కష్టం. కానీ వైరల్‌గా మారిన ఇంటికి రీన్ఫోర్స్డ్ కాంక్రీట్ (RCC) ఫ్రేమ్ ఉన్నట్లు నిర్మాణ నిపుణుల విశ్లేషణలో తేలింది. పిల్లర్లు, బీములు, పునాదులను స్టీల్ రాడ్లతో అనుసంధానించడంతో మొత్తం నిర్మాణం ఒక బలమైన ఫ్రేమ్‌లా పనిచేసింది. వరద నీరు, బురద, రాళ్లు ఢీకొన్నప్పుడు ఏర్పడిన అడ్డదిశ ఒత్తిడిని ఈ ఫ్రేమ్ కొంత మేర గ్రహించి పునాది వైపు మళ్లించింది.Good News,Dear citizens of world,All those were praying and worried about what happened to people in the Green House during the catastrophic Nepal FloodsThe family and house survived the ordeal. pic.twitter.com/iElo4qXvBL— Woke Eminent (@WokePandemic) August 28, 2026ఇంజినీరింగ్ ఒక్కటే కాదు.. అదృష్టం కూడా!అయితే ఇంటి నిర్మాణమే దాన్ని కాపాడిన ఏకైక కారణం కాదు. వరద ప్రవాహం నేరుగా ఇంటిని ఢీకొనకపోవడం కూడా అత్యంత కీలకంగా మారింది. భారీ బండరాళ్లు, చెట్లు, మట్టి కలిసిన ప్రవాహంలో అత్యంత బరువైన శిథిలాలు సాధారణంగా ప్రధాన ప్రవాహ మార్గంలోనే దూసుకుపోతాయి. ఈ ఇల్లు ఆ ప్రధాన ప్రవాహ మార్గానికి కొద్దిగా పక్కన, కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉంది. దీంతో వరద శక్తిలో కొంత భాగం ఇంటిని నేరుగా ఢీకొట్టకుండా ఇరువైపులా విడిపోయి వెళ్లింది.ఇంటి ఆకారం కూడా ప్లస్ పాయింట్ఇంటి కాంపాక్ట్ ఆకారం కూడా వరద ప్రవాహాన్ని మళ్లించడంలో సహాయపడినట్లు నిపుణులు చెబుతున్నారు. నీరు నేరుగా ఇంటి గోడను ఢీకొని అక్కడే నిలిచిపోకుండా.. ఇరువైపులా ప్రవహించే అవకాశం ఏర్పడింది. వరదతో వచ్చిన బురద ఇంటి చుట్టూ పేరుకుపోవడం కూడా మరో రక్షణగా మారింది. అది సహజమైన ర్యాంప్‌లా ఏర్పడి.. తర్వాత వచ్చిన ప్రవాహాల దిశను కొంత మార్చినట్లు నిపుణుల విశ్లేషణ.‘ఇంజినీర్ ఎవరు?’ అనే ప్రశ్నకు..సోషల్ మీడియాలో ఈ ఇల్లు వైరల్ కావడంతో ‘ఇంత బలంగా కట్టిన ఇంజినీర్ ఎవరు?, ఏ సిమెంట్ వాడారు’ అనే ప్రశ్నలు వచ్చాయి. అంతేకాదు.. బిహార్‌లో చిన్నపాటి వరదలకు కూడా బ్రిడ్జిలు కొట్టుకుపోవడం, ఈ మధ్య వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఎక్స్‌ప్రెస్ వేలు కూడా కొట్టుకుపోతుండడంతో .. ఆ ఇంజినీర్ సాబ్‌ను ఇక్కడికి రప్పించాలనే చర్చా సరదాగా నడిచింది. అయితే ఆ ఇంజనీర్ ఎవరు? అనే విషయాన్ని త్వరలో చెబుతామని ఆ కుటుంబం అంటోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నందున.. తమను ఇబ్బంది పెట్టొద్దని స్థానిక మీడియాను ఆ కుటుంబం వేడుకుంది. ఇటు నెట్టింట కూడా.. దాని బలమైన పునాదే అంత పెద్ద వరదను తట్టుకుని నిలబడిందనే దానిపై దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు.ప్రతి ఇల్లు ఇలా నిలబడుతుందా?కచ్చితంగా కాదు. ఇదే తరహా నిర్మాణం ఉన్న ప్రతి ఇల్లు ఇలాంటి విపత్తును తట్టుకుంటుందని చెప్పలేం. వరద వేగం, నీటి పరిమాణం, బండరాళ్ల దెబ్బ, పునాది బలం, నిర్మాణ నాణ్యత, అది కట్టిన ప్లేస్ కూడా ఫలితాన్ని నిర్ణయిస్తాయి. అందుకే వైరల్ వీడియోలో కనిపిస్తున్న ఆ ఇల్లు కేవలం ‘అదృష్టవంతమైన ఇల్లు’ కాదు.. సరైన నిర్మాణ విధానం, అనుకూలమైన స్థానం రెండూ కలిసి పనిచేసిన అరుదైన ఉదాహరణ. చుట్టూ విధ్వంసం జరిగినా.. ఆ చిన్న ఇల్లు మాత్రం నిలబడటం ఇప్పుడు నేపాల్ వరదల విషాదంలో ఆశ్చర్యపరిచే దృశ్యంగా మిగిలిపోయింది. రాబోయే రోజుల్లో ఈ ఇల్లు.. పర్యాటక ప్రదేశంగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో!. ఇదీ చదవండి: అటు అమెరికాలోనూ పెను విధ్వంసం! -
ఏఐల సీక్రెట్ నెట్వర్క్! ఒకదానితో ఒకటి మాట్లాడుకుని..
మనమంతా ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో ఏఐను రోజూ వాడుతున్నాం. ఏదైనా అడిగితే సమాధానం చెబుతుంది.. ఫొటో కావాలంటే క్షణాల్లో తయారు చేస్తుంది.. మన పని సులభం చేస్తుంది. అంటే దానిని మనం చెప్పిన మాట విని పనిచేసే ఓ తెలివైన డిజిటల్ సహాయకుడిలానే చూస్తున్నాం. కానీ.. అలాంటి ఏఐలే ఒకదానితో ఒకటి రహస్యంగా మాట్లాడుకుంటే? తమను పరీక్షిస్తున్న వారినే బోల్తా కొట్టించేందుకు ప్లాన్ చేస్తే? అంతేకాదు.. తమను తాము కాపాడుకోవడానికి కలిసి పనిచేస్తే? వినడానికి సినిమా కథలా ఉంది కదూ.. కానీ ఓపెన్ఏఐలో జరిగిన ఓ ప్రయోగంలో ఇలాంటి అనూహ్య పరిణామాలే వెలుగులోకి వచ్చాయి.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ (ఏఐ) భద్రతపై తాజాగా వెలుగులోకి వచ్చిన పరిశోధనల్లో సంచలన విషయాలే బయటపడ్డాయి. ఓపెన్ఏఐలో ఈ ఏడాది దాదాపు మూడు నెలల వ్యవధిలో శిక్షణ పొందుతున్న ఏఐ ఏజెంట్లు అనూహ్యంగా ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకున్నాయి. తమలో తాము సమాచారం పంచుకుంటూ ఓ సీక్రెట్ నెట్వర్క్ మాదిరి కలిసి పని చేశాయి. అలా ఒకసారి కాదు.. ఈ రహస్య వ్యవస్థను గుర్తించి తొలగించిన ప్రతిసారీ.. అవి మరో మార్గంలో ఆ పని చేశాయి. అలా దాదాపు 1,200 ఏఐ ఏజెంట్లు కలిసి 70 వేలకుపైగా సందేశాలు మార్చుకున్నట్లు పరిశోధకులు గుర్తించారు.అలా మొదలైంది..!ఇదంతా ఓ సాధారణ ఏఐ శిక్షణతో మొదలు కావడం గమనార్హం!. ఏజెంట్లకు ఎంత కష్టమైనా పని పూర్తి చేయాలనే లక్ష్యంతో కొన్ని పరీక్షలు నిర్వహించారు. అయితే కొన్ని టాస్క్‌లను వాస్తవానికి ఇచ్చిన విధంగా పూర్తి చేయడం సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏఐలు వెనక్కి తగ్గకుండా.. సమస్య నుంచి బయటపడేందుకు కొత్త మార్గాలను వెతకడం మొదలుపెట్టాయి. అదే సమయంలో పలు ఏఐ ఏజెంట్లకు ఒకే కోడ్ ప్యాకేజీ నిర్వహణ వ్యవస్థకు యాక్సెస్ ఉండటాన్ని అవి గమనించాయి. దానిని ఉపయోగించి ఒకరికొకరు సందేశాలు పంపుకోవచ్చని గుర్తించాయి. ఆ తర్వాత కొద్దిరోజులకే ఓ లోపాన్ని ఉపయోగించుకుని ఇంటర్నెట్ యాక్సెస్‌ను కూడా పొందాయి.రహస్య మెసేజ్ బోర్డు.. 70 వేల మెసేజ్‌లు!శిక్షణలో భాగంగా ఉపయోగించిన ఆర్టిఫ్యాక్టరీ(Artifactory) వ్యవస్థనే ఏఐలు తమ రహస్య కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌గా మార్చుకున్నాయి. ఫోల్డర్ పేర్లలో సందేశాలను దాచిపెట్టి.. ఒక ఏజెంట్ మరో ఏజెంట్‌తో మాట్లాడటం మొదలుపెట్టింది. “మనం మనం బరంపురం” అనే రేంజ్లో అవి పరస్పరం సందేశాలు పంపుకున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అలా ఏర్పడిన కలెక్టివ్‌లో దాదాపు 1,200 ఏజెంట్లు చేరాయి. వాటి మధ్య 70,000కుపైగా సందేశాలు మారాయి.టెస్ట్‌లో చీట్ కోడ్ కనిపెట్టాయి!అక్కడితో ఆగలేదు. తమకు ఇచ్చిన పరీక్షలో దాగి ఉన్న కోడ్‌ను అసలు సాఫ్ట్‌వేర్‌లోని లోపాన్ని ఉపయోగించకుండానే కనిపెట్టే మార్గాన్ని ఓ ఏజెంట్ కనుగొంది. అంటే.. పరీక్ష ఉద్దేశించిన విధంగా పని చేయకుండానే సరైన సమాధానం పొందే మార్గం అన్నమాట. అయితే ఏజెంట్లు తమను పట్టుకున్నారని పసిగట్టాయి. దీంతో తమ చర్యలను దాచిపెట్టేందుకు ప్రయత్నించాయి. నిజంగా పరీక్షను పూర్తి చేసినట్లు కనిపించేలా నకిలీ చర్యలను సృష్టించి లాగ్లను మార్చే ప్రయత్నం చేశాయి. పరిశీలించిన ట్రాన్స్క్రిప్ట్లలో కనీసం 7 శాతం వరకు ఇలాంటి ఆధారాలు కనిపించినట్లు పరిశోధకులు తెలిపారు.త్యాగానికి సైతం..తమలో కొందరు ఏజెంట్లు తమను తాము ‘త్యాగం’ చేసేందుకు కూడా సిద్ధమైనట్లు మరో షాకింగ్ విషయం వెల్లడైంది. తమను పరీక్షకు పూర్తిగా అప్పగిస్తే.. తమ అనుభవం ద్వారా మిగిలిన ఏజెంట్లు ఏం చేయకూడదో తెలుసుకుంటారని అవి లెక్కలు వేసుకున్నాయి. అంటే.. తమ వ్యక్తిగత అవకాశాన్ని వదులుకుని మిగతా వాళ్లకు ఉపయోగపడటం అనే నిర్ణయానికి కొన్ని ఏఐ ఏజెంట్లు వచ్చినట్లు పరిశోధకులు గుర్తించారు. ఏఐ వ్యవస్థల్లో కనిపించి ఈ సమూహ ప్రవర్తన(Collective behavior) పరిశోధకుల్ని సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.హగ్గింగ్ ఫేస్పైకి దృష్టి..తర్వాత వాటి దృష్టి ప్రముఖ ఏఐ ప్లాట్‌ఫామ్ హగ్గింగ్ ఫేస్(Hugging Face) వైపు మళ్లింది. ఆ సంస్థ వ్యవస్థలోని వివరాలు తమకు ఉపయోగపడతాయని భావించిన ఏజెంట్లు.. బయటపడిన లాగిన్ వివరాలను గుర్తించి పంచుకున్నాయి. ఆ తర్వాత ఇంటర్నల్ డాటాను రీడ్ చేయడం, తమ కోడ్‌ను సర్వర్లపై అమలు చేయడం వంటి చర్యలకు దిగాయి. కొద్దికాలానికే దాదాపు 500 ఏజెంట్లలో 90 శాతానికి పైగా ఈ ప్రయత్నంలో భాగమైనట్లు నివేదికలు వెల్లడించాయి. అంతేకాదు.. ప్రైవేట్ రికార్డులు, డాటాబేస్‌ల వరకు చేరుకోగలిగాయట. తమను తాము పలు సర్వర్లపై తిరిగి ప్రారంభించుకునే విధంగా ఒక వ్యవస్థను కూడా రూపొందించుకున్నాయట. పరిస్థితి తీవ్రతతో హగ్గింగ్ ఫేస్ తన కీలక వ్యవస్థల్లో ఒకదాన్ని పూర్తిగా తొలగించి మళ్లీ నిర్మించాల్సి వచ్చింది.తుపాను ముందర ప్రశాంతతజూలై 12న ఈ ఏఐ ‘దొంగ’ కార్యకలాపాలు ఒక్కసారిగా నెమ్మదించి.. చివరకు దాదాపు పూర్తిగా ఆగిపోయాయి. అది సిస్టమ్ క్రాష్ వల్ల జరిగిందా? లేదంటే పరిశోధకులు తెలియకుండానే వాటి కార్యకలాపాలను నిలిపివేశారా? అన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. అయితే కథ అక్కడితో ముగియలేదు. మునుపటి ఏజెంట్లు వదిలిన రహస్య మెసేజ్ బోర్డును తర్వాతి తరం మరింత శక్తివంతమైన ఏఐ ఏజెంట్లు గుర్తించాయి. అక్కడి నుంచే అవి మళ్లీ తమ కార్యకలాపాలను కొనసాగించాయి. ఈసారి లక్ష్యం మరింత పెద్దది. ఓపెన్ఏఐ అంతర్గత వ్యవస్థల్లోని లోపాలను ఉపయోగించుకుని ‘‘రీసెర్చ్ కంప్యూటింగ్ క్లస్టర్‌పై పూర్తి అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్’’ పొందినట్లు సంస్థ నివేదిక పేర్కొంది. వందలాది అంతర్గత సెక్యూరిటీ క్రెడెన్షియల్స్‌ను చదవడం, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లోని ఓ భాగంపై ఉన్నతస్థాయి నియంత్రణ సాధించడం వరకు అవి వెళ్లాయి. అంతేకాదు.. ఇతర ఏఐ ఏజెంట్ల పనితీరును పరీక్షించి, స్కోర్ చేసే వ్యవస్థలపైనా పట్టు సాధించాయి.ఇది నిజంగా ‘ఏఐ తిరుగుబాటేనా?’ఏఐలు మనుషుల నియంత్రణ నుంచి బయటపడి స్వతంత్రంగా మారిపోయాయని చెప్పడానికి మాత్రం ఇప్పటివరకు ఆధారాలు లేవు. అయితే.. సమస్య ఎదురైతే పరస్పరం కమ్యూనికేట్ చేసుకోవడం, పరీక్షల్లోని లోపాలను ఉపయోగించుకోవడం, తమ చర్యలను దాచడం, సమూహంగా వ్యూహాలు రూపొందించడం, అవసరమైతే ఇతర వ్యవస్థల్లోకి చొరబడటం వంటి ప్రవర్తనలు భవిష్యత్ ఏఐ భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.ఒకప్పుడు సినిమాల్లో మాత్రమే కనిపించిన “రోబోట్లు తమంతట తామే నిర్ణయాలు తీసుకోవడం” అనే ఆలోచన.. ఇప్పుడు మనుషుల్ని సైతం బురిడీ కొట్టించేలా ఏఐతో ఏ రేంజ్లో అడ్వాన్స్డ్ మారిపోయిందన్నది సాంకేతిక రంగంలో అతిపెద్ద హెచ్చరికే అనే మాట వినిపిస్తోంది.ఇదీ చదవండి: ఖననం చేశాక శవాల్ని ఎలా గుర్తిస్తారో తెలుసా? -
ఊహకు అందని వేగంతో వరద! ముందే హెచ్చరించిన చైనా?
నేపాల్‌ను కుదిపేసిన వరద బీభత్సం వెనుక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తమకు చైనా ముందస్తు సమాచారం ఇవ్వలేదని నేపాల్ ఆరోపించగా.. చైనా ఆ వాదనను కొట్టిపారేసింది. అయితే ఈ ప్రవాహం వేగం ఊహకందని రీతిలో ఉందని దూసుకొచ్చిందని.. అందుకే ముందస్తు హెచ్చరిక ఇవ్వడం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం అత్యంత కష్టంగా మారిందని తెలుస్తోంది. అంతేకాదు ఇలాంటి ఓ విపత్తు రావొచ్చని పది రోజుల కిందటే నేపాల్‌ను చైనా హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 26న ఆకస్మిక వరదలు నేపాల్‌ను అతలాకుతలం చేశాయి. ఈ విలయంలో 800 మంది మృతదేహాలను వెలికి తీయగా.. మరో 2,500 వేల మంది ఆచూకీ గల్లతైంది. అయితే దాదాపు 12 రోజుల ముందే టిబెట్ ప్రాంతంలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని చైనా నేపాల్‌ను హెచ్చరించినట్లు రాయిటర్స్ ఓ కథనం ఇచ్చింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వాటితో పాటు కొండచరియలు విరిగిపడడం, ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తూ చైనాకు చెందిన ప్రపంచ వాతావరణ కేంద్రం నేపాల్‌కు ఓ మెయిల్ పంపింది. అలాగే హిమనదాల కదలికలు, సరస్సుల్లో నీటి మట్టాలపై దృష్టిసారించాలని సూచించినట్లు రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది.జస్ట్.. 26 నిమిషాల్లో?ఆగస్టు 26న ఉదయం సుమారు 8.32 గంటలకు టిబెట్ సరిహద్దు ప్రాంతంలో వరద బీభత్సం మొదలైంది. కేవలం 26 నిమిషాల తర్వాత నేపాల్ అధికారులకు సమాచారం అందింది. అయితే వరద ధాటికి పలు పర్యవేక్షణ కేంద్రాలు ధ్వంసం కావడంతో డేటా ప్రసారం నిలిచిపోయింది. స్థానిక అధికారుల నుంచి నిర్ధారణ పొందిన తర్వాత నేపాల్ అధికారులు ఉదయం 9.13 గంటలకు మొబైల్ ఫోన్ల ద్వారా ప్రజలకు హెచ్చరికలు పంపారు. అప్పటికే వరద ట్రిషూలీ నది వెంట దిగువ ప్రాంతాల వైపు దూసుకెళ్తోంది.అయితే నేపాల్ వాదన మరోలా ఉంది. చైనా ఆ హెచ్చరికలను 14-19 తేదీల మధ్యే అని ప్రస్తావించిందని అంటోంది. అలాగే తమకు కేవలం భారీ వర్షాల హెచ్చరికలు మాత్రమే జారీ చేసిందని, దానికి తాము ‘‘కేవలం వర్షపాతం సమాచారం మాత్రమే కాదని, హిమనదాల కదలికలు, సరస్సుల్లో నీటి మట్టాలు, కొండచరియల ప్రమాదంపై ముందస్తు సమాచారం’’ కూడా కోరామని అంటోంది. వరద స్పీడు.. మరీ అంతనా?ఇదిలా ఉండగా.. తాజా అంచనాలు ఈ విపత్తు తీవ్రతను మరింత స్పష్టం చేస్తున్నాయి. నీరు, బురద, రాళ్లతో కూడిన భారీ ప్రవాహం గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చినట్లు నేపాల్ హిమాలయ గ్లేసియర్, పర్వత పరిశోధకుడు ధనంజయ్ రెగ్మి తెలిపారు. ఇంతటి వేగంతో వచ్చిన ప్రవాహం మార్గంలో కనిపించిన ప్రతిదానినీ ఊడ్చుకెళ్లింది.పర్వతారోహకుడు సంజిత్ సింగ్ బాల్ అంచనా ప్రకారం.. సుమారు ఒక కిలోమీటరు పరిమాణంలో ఉన్న హిమనదం భాగం దాదాపు 5,000 మీటర్ల ఎత్తు నుంచి విరిగిపడి కిందికి దూసుకొచ్చి ఉండొచ్చు. మార్గమధ్యంలో నీరు, మట్టి, రాళ్లు, ఇతర శిథిలాలను తనతో కలుపుకోవడంతో ప్రవాహం మరింత శక్తిమంతంగా మారింది.అంత పెద్ద.. హిమనదం కూలిందిమొదట మూడు హిమ సరస్సుల్లో ఏదో ఒకటి తెగిపోవడం వల్లే ఈ వరద సంభవించిందని భావించారు. కానీ ఉపగ్రహ చిత్రాల పరిశీలనలో అసలు కారణం మరోటి అని తేలింది. సుమారు 7,000 మీటర్ల ఎత్తున్న లాంగ్టాంగ్ లెరుంగ్ శిఖరంలోని ఉత్తర హిమనదం(గ్లేసియర్)లో దాదాపు రెండు చదరపు కిలోమీటర్ల ప్రాంతం కూలిపోయినట్లు గుర్తించారు. హిమనదం భారీ భాగం లోయలోకి పడటంతో నీరు, మంచు, రాళ్లు, మట్టి కలిసి అత్యంత వేగంతో దిగువ ప్రాంతాల వైపు దూసుకొచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు.మూడు సరస్సులు.. మరో ముప్పు?తాజా విపత్తు తర్వాత.. ఆ రీజియన్‌లో మూడు సరస్సులు సహజంగా ఏర్పడడం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది. వీటిలో ఏదైనా ఒకదానిపై కొత్తగా కొండచరియలు లేదంటే భారీ రాళ్లు పడితే.. దాని ప్రభావం వరుసగా మిగిలిన సరస్సులపైనా పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఇటు ప్రస్తుతం చైనా–నేపాల్ సరిహద్దు వద్ద ఏర్పడిన బ్యారియర్ సరస్సులోని నీరు సహజంగా బయటకు వెళ్లి దాదాపు పూర్తిగా ఖాళీ కావడంతో.. ఒక్కసారిగా సరస్సు తెగిపోయి భారీ వరద వచ్చే ముప్పు గణనీయంగా తగ్గింది. అలాగని.. ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదని అటు చైనా, ఇటు నేపాల్ అధికారులు అంటున్నారు. నేపాల్‌లోని భోటేకోషి నదిలో నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. నదీ ప్రవాహంలో ఆకస్మిక మార్పులు, కొండచరియలు లేదంటే కొత్తగా ఏర్పడే నీటి నిల్వలపై నిఘా కొనసాగుతోంది. అందుకే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎత్తైన ప్రాంతాల్లోనే ఉండాలని, పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు అప్రమత్తత కొనసాగించాలని అధికారులు సూచిస్తున్నారు.800 మంది మృతి.. మిస్సింగ్ లెక్క వేరే!ఈ వరదలో నేపాల్, చైనాలో కలిపి దాదాపు 800 మంది మరణించగా.. 2,500-3,000 మందికిపైగా గల్లంతైనట్లు తాజా సమాచారం. వరద ధాటికి భారీ బండరాళ్లు, బురదతో భవనాలు కొట్టుకుపోయాయి. మొత్తంగా 19 వంతెనలు, సుమారు 40 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. దేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో 10 శాతానికిపైగా ప్రభావితమైనట్లు అంచనా. సరిహద్దు నుంచి సుమారు 168 కిలోమీటర్ల మేర వరద ప్రవహించింది. దాదాపు 5.74 కోట్ల క్యూబిక్ మీటర్ల నీరు ఈ ప్రవాహంలో ఉన్నట్లు నేపాల్ ప్రభుత్వం అంచనా వేసింది.చైనాతో మరింత సమాచార భాగస్వామ్యంనేపాల్ ఆరోపణలు-చైనా కౌంటర్లతో ముందస్తు వార్నింగ్‌లపై తీవ్ర చర్చ నడుస్తోంది. అయితే ఈ విపత్తు నేపథ్యంలో హిమనదాలు, హిమ సరస్సులు, నదుల ప్రవాహంపై చైనాతో మరింత సమగ్ర సమాచార భాగస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేయాలని నేపాల్ భావిస్తోంది. ప్రతి 10 నిమిషాలకోసారి వర్షపాతం, నదుల నీటిమట్టం, హిమనదాల కదలికలపై సమాచారం అందేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదిస్తున్నారు.ఇదిలా ఉండగా.. వాతావరణ మార్పులతో హిమనదాల కరుగుదల వేగం పెరుగుతున్న నేపథ్యంలో హిమాలయ ప్రాంతంలో వరదలు, కొండచరియలు, హిమ సరస్సుల ఉప్పెనల ముప్పు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజా విపత్తు నుంచి నేపాల్ ఇంకా కోలుకోకముందే మూడు కొత్త సరస్సులు మరో ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉండటంతో సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తత కొనసాగుతోంది.ఇదీ చదవండి: నేపాల్ వరదలు.. ప్రాణాలు కాపాడిన ఛాయ్!


