వీడియో: అగ్నిపర్వతం బద్ధలు.. వేల అడుగుల ఎత్తుకు ఎగసిపడుతున్న బూడిద | Guatemala Volcan de Fuego News Updates | Sakshi
Sakshi News home page

వీడియో: అగ్నిపర్వతం బద్ధలు.. వేల అడుగుల ఎత్తుకు ఎగసిపడుతున్న బూడిద

Feb 2 2026 3:57 PM | Updated on Feb 2 2026 4:05 PM

Guatemala Volcan de Fuego News Updates

మధ్య అమెరికా దేశం గ్వాటెమాలాలో ఫ్యుగో అగ్నిపర్వతం మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. చిన్నచిన్న విస్ఫోటనాలు కాస్త ఒక్కసారిగా తీవ్రతరం అయ్యాయి. ఈ ప్రభావంతో వేల అడుగుల ఎత్తు దాకా బూడిద ఎగసిపడుతోంది. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ వోల్కానిక్ యాష్ అడ్వైజరీ సెంటర్ హెచ్చరికలు జారీ చేసింది. 

3,763 మీటర్ల ఎత్తులో ఉన్న ఫ్యుగో అగ్నిపర్వతం తరచుగా చిన్న, మధ్యస్థాయి విస్ఫోటనాలతో(స్ట్రోంబోలియన్ శైలి) క్రియాశీలకంగా(Active Volcano) ఉంటుంది. అయితే ఈసారి విస్ఫోటనాలు సాధారణం కంటే తీవ్రంగా కనిపించాయి. జనవరి చివరి వారంలో ప్రారంభమైన విస్ఫోటనాలు, ఫిబ్రవరి ప్రారంభంలో మరింత తీవ్రతతో కొనసాగాయి.

ప్రస్తుతానికి బూడిద మేఘాలు 14,000 నుండి 16,000 అడుగుల ఎత్తుకు ఎగసిపడుతున్నాయి. రాత్రి వేళల్లో ఆకాశం మెరిసేపోయేలా.. ప్రవహిస్తున్న లావా దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అదే సమయంలో.. 15 లక్షల మంది ఉన్న ఈ రీజియన్‌లో ఆందోళనలను రేకెత్తించాయి. అయితే ప్రస్తుతానికి ప్రజలను సరక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు మొదలుకాకపోయినా.. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు మాత్రం జారీ అయ్యాయి. అదే సమయంలో విమాన ప్రయాణాలకు ఆటంకాలు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

సాకటేపెక్వెజ్, చిమాల్టెనాంగో, పనిమాచె, మోరెలియా.. ఇలా చుట్టుపక్కల ప్రాంతా ప్రజలు లావా ఉద్గారాలు, బూడిద వర్షం, అగ్నిపర్వతం బద్ధలయ్యేప్పుడు గర్జనల శబ్దాలతో ఆందోళనకు గురవుతున్నారు. 2018లో జరిగిన ఆకస్మిక విస్ఫోటనం దాదాపు 200 మంది ప్రాణాలు తీసుకుంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement