గాల్లో ఉండగా మంటలు.. 8 మంది దుర్మరణం | Brazil Hot Air Balloon Incident Complete Details | Sakshi
Sakshi News home page

గాల్లో ఉండగా మంటలు.. 8 మంది దుర్మరణం

Jun 21 2025 9:27 PM | Updated on Jun 21 2025 9:26 PM

Brazil Hot Air Balloon Incident Complete Details

బ్రెజిల్‌ గగనతలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హాట్‌ ఎయిర్‌ బెలూన్‌లో మంటలు చెలరేగి ఎనిమిది మంది మృతి చెందారు. మరో 13 మంది గాయపడ్డారు. 

శాంటా కాటరినా రాష్ట్రం ప్రియాగ్రాండే నగరంలో శనివారం వేకువజామున ఈ ప్రమాదం జరిగింది. బెలూన్ గాల్లో ఉన్న సమయంలోనే మంటలు చెలరేగాయి. ఆ తర్వాత అది నేలపై కూలిపోయింది. ఆ సమయంలో బెలూన్‌లో మొత్తం 22 మంది పర్యాటకులు ఉన్నారు. వాళ్లలో 13 మంది ప్రాణాలతో బయటపడగా, వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

వారం కిందట సావో పాలో రాష్ట్రంలో కూడా ఇలాంటి హాట్‌ ఎయిర్‌ బెలూన్ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా.. 11 మంది గాయపడ్డారు. వారం వ్యవధిలో వరుస ఘటనల నేపథ్యంలో హాట్ ఎయిర్ బెలూన్ పర్యటనల భద్రతపై పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement