
‘దీర్ఘకాల రోగాలతో రోగులు నా తలుపు తట్టని రోజునే నేను వైద్యుడిగా విజయం సాధించినట్టు’ అంటున్నారు నగరంలోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి చెందిన న్యూరాలజిస్ట్ డా.సుదీర్‌కుమార్. రోగులు రావాలని కాకుండా.. రోగాలు రాకూడదని కోరుకునే మంచి వైద్యుడిగా మాత్రమే కాదు రోగాల బారిన పడకుండా ఏం చేయాలి? అనే దానికి కూడా ఆయన స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఒకప్పుడు అధిక బరువుతో, దీర్ఘకాలిక వ్యాధితో పోరాడిన ఆయన వాటిని మందులతో కాకుండా జీవనశైలి మార్పులతో జయించవచ్చని నిరూపించారు.
వైద్యుడిగా బిజీ అయిపోయాక ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గింది. వేళాపాళా లేని నిద్ర, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి.. నాకు 49 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి దాదాపు 100 కిలోల బరువుకు చేరుకున్నా. అలాగే ఆంకైలోజింగ్ స్పాండిలైటిస్ అనే వ్యాధి కూడా ఇబ్బంది పెట్టేంది అంటూ గుర్తు చేసుకున్నారు జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌లో సీనియర్ న్యూరాలజిస్ట్‌గా సేవలు అందిస్తున్న డాక్టర్ సుదీర్ కుమార్. ఆ పరిస్థితిని తాను అధిగమించిన తీరు, స్ఫూర్తిదాయక ట్రాన్స్‌ఫార్మేషన్ విశేషాలను సాక్షితో పంచుకున్నారు ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
లాస్ గుర్తు చేసిన లాక్‌డౌన్
కోవిడ్–19 లాక్‌డౌన్ అందించిన ఖాళీ సమయం నా గురించి నేను ఆలోచించుకునే అవకాశం అందించింది. అప్పుడే బరువు తగ్గాలని నిర్ణయించుకుని జాగింగ్ ప్రారంభించాను. రోడ్లు ఖాళీగా ఉండటం కాలుష్యం లేకపోవడం.. నా ప్రయత్నాలకు ఊతమిచ్చింది. అయితే మొదటిసారి 400 మీటర్లు మించి పరుగెత్తడానికి ప్రయత్నించినప్పుడు, నాకు ఊపిరి ఆడలేదు. కానీ ఆపడానికి బదులుగా దాన్ని నడకగా మార్చి కొనసాగించాను.
పట్టు విడవకుండా ప్రయచి రోజూ 5–10 కి.మీ నడక, అలా పరుగుకు చేరుకున్నా. ‘ఎటువంటి శిక్షణ లేకుండా మారథాన్‌ల సమయంలో ఏడాదికి ఒకసారి మాత్రమే పరిగెత్తేవాడిని కాలక్రమేణా నగరంతో పాటు లడఖ్ తదితర చోట్ల మారథాన్‌లలో పాల్గొని మొత్తం 14,000 కిలోమీటర్లకు పైగా రన్ చేశా. వాటిలో 10కి.మీ పరుగులు 822, హాఫ్ మారథాన్‌లు 133 ఉన్నాయి.
వెయిట్ లాస్.. మజిల్ మిస్..
నిర్విరామ నడక, పరుగు, డైట్‌లతో రెండేళ్ల స్వల్ప వ్యవధిలోనే 30 కిలోల బరువు తగ్గి 69 కిలోలకు చేరాను. అయితే, మజిల్ లాస్ (కండరాల నష్టాన్ని) కూడా గమనించా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌లో చేరి 4.5 కిలోల కండర(మజిల్ మాస్) సముదాయాన్ని తిరిగి పొందాను. శారీరక శ్రమ, ప్రొటీన్ రిచ్ ఫుడ్ పెంచడం వంటి మెరుగైన ఆహారపు అలవాట్లు, తగినంత నిద్ర వంటివి ఈ సక్సెస్‌లో ఇమిడి ఉన్నాయి. అత్యంత క్రమశిక్షణతో కూడిన దినచర్య కూడా అనారోగ్యకరమైన ఆహారం వలన కలిగే నష్టాన్ని భర్తీ చేయలేదని గుర్తుంచుకోవాలి.
అందుకే ప్రాసెస్డ్ ఫుడ్, చక్కెర, శీతల పానీయాలను పూర్తిగా మానేశా.. పని గంటలు తగ్గించుకుని 7–8 గంటలకు నిద్ర సమయాన్ని పెంచుకున్నా అంటూ వివరించారు డా.సు«దీర్‌కుమార్. రోగాలకు చికిత్స చేయడం కాదు చికిత్స చేసే అవసరం రాకుండా చేయడం కూడా వైద్యుల బాధ్యతే అంటున్న ఆయన అందుకు తనను తానే నిదర్శనంగా మలుచుకున్న తీరు స్ఫూర్తిదాయకం.
How an extremely busy Hyderabad doctor lost 30 kg weight. He started his fitness journey at 50 then completed 133 half marathons
"For Dr. Sudhir Kumar, a senior neurologist at Apollo Hospital, Jubilee Hills, Hyderabad, fitness wasn’t a priority—until it became one. In 2020, at… https://t.co/q1sqombu5P— Dr Sudhir Kumar MD DM (@hyderabaddoctor) July 23, 2025
(చదవండి: Punita Arora: ఎవరీ పునీతా అరోరా..? సైన్యం, నేవీలలో అత్యున్నత హోదాలు..)