జంక్‌ఫుడ్‌ ఇంత ప్రమాదకరమా..? పాపం ఆ ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్‌.. | Russian Fitness Influencer Dies After Extreme Junk Food Eating Challenge During Marathon Event, Know More Details | Sakshi
Sakshi News home page

జంక్‌ఫుడ్‌ ఇంత ప్రమాదకరమా..? పాపం ఆ ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్‌..

Nov 27 2025 3:58 PM | Updated on Nov 27 2025 5:10 PM

Russian Fitness Influencers 10,000 Calorie Junk Food Experiment Turns

జంక్‌ఫుడ్‌ ప్రమాదకరమని నిపుణులు హెచ్చిరిస్తుంటే..పెడచెవిన పెట్టిన వాళ్లెందరో. అంతెందుకు చీట్‌మీల్‌ పేరుతో బర్గర్లు, పీజాలు లాగించేసేవాళ్లు కోకొల్లలు. అలాంటి వాళ్లందరికీ ఈ ఘటన ఓ కనువిప్పు. మారథాన్‌ ఛాలెంజ్‌లో భాగంగా తిన్న జంకఫుడ్‌ ఓ ఇన్‌ఫ్లుయెన్సర్‌ ప్రాణాలనే హరించేసింది. ఎవ్వరూ ఇలాంటి ఛాలెంజ్స్‌లో పాల్గొనేందుకు జంకేలా చేసింది కూడా.

అసలేం జరిగిందంటే..రష్యన్‌ ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ 30 ఏళ్ల డిమిత్రి నుయాన్జిన్, బరువు తగ్గించే కార్యక్రమాన్ని ప్రోత్సహించే నిమిత్తం ఈటింగ్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్నాడు. ఆయన సదుద్దేశ్యంతో చేస్తే..ఆ ప్రయోగం అతడి ప్రాణమే పోయింది. అదికూడా నిద్దురలోనే ప్రాణం పోవడం బాధకరం. అధిక బరువు ఎంత పెద్ద సమస్య అని అవగాహన కల్పించే నిమిత్తం డిమిత్రి 25 కిలోలు బరువు పెరగాలన్న లక్ష్యం పెట్టుకున్నాడు. 

ఈ మేరకు మారథాన్‌లొ భాగంగా అతిగా తినే ఛాలెంజ్‌లో పాల్గొన్నాడు. తన క్లయింట్లు తనలా బరువు తగ్గేలా ప్రేరణనివ్వాలని ఈ ఛాలెంజ్‌ పాల్గొన్నాడు. ఆ నేఫథ్యంలోనే రోజుకు దాదాపు 10 వేల కేలరీలకు పైగా జంక్‌ఫుడ్‌ తిన్నాడు. అనుకున్నట్లుగా బరువు పెరిగాడు..తన ఫాలోవర్స్‌కి కూడా తనలోని ఆ ఛేంజ్‌ని బహిర్గతం చేయడమే కాకుండా ఆ అధిక బరువుని తగ్గించుకునేలా కూడా ప్లాన్‌ చేస్తున్నట్లు వెల్లడించాడు కూడా. 

అయితే అనూహ్యంగా చనిపోవడానికి ఒక రోజు ముందు తను చేసే వర్కౌట్ల సెషన్‌ను రద్దు చేసుకున్నాడు కూడా. తాను ఆరోగ్యంగా ఉన్నానని, వైద్యుడుని సంప్రదించాలను చూస్తున్నట్లు నెటిజన్లతో షేర్‌ చేసుకున్నాడు కూడా. అయితే అదే చివరి మాట అవుతుందని అనుకోలేదు  అతడి అభిమానులు, ఫాలోవర్లు. అతడి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం అతడి గుండె నిద్దురలోనే ఆగిపోయిందని, అవే అతడి చివరి మాటలయ్యాయనని బాధగా చెబుతున్నారు. 

అంతేగాదు డిమిత్రి గత నవంబర్‌ 18న చివరి ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో లేస్‌ ప్యాక్‌ తినడం తోపాటు తాను 105 కిలోలు బరువు పెరిగినట్లు కూడా వెల్లడించాడు. అంతేగాదు నెలలో కనీసం 13 కిలోలు పెరిగినట్లు తెలిపాడు. నెటిజన్లు డిమిత్రి మృతికి స్పందిస్తూ..అతడి కుటుంబానికి సంతాపం తెలియజేశారు. అలాగే ఇలాంటి ఈటింగ్‌ ఛాలెంజ్‌ల్లో పాల్గొనేవాళ్లకు ఈ సంఘటన ఓ గొప్ప పాఠం అంటూ పోస్టులు పెట్టారు. కాగా, డిమిత్రీ ఈ ఈటింగ్‌ ఛాలెంజ్‌లో భాగంగా రోజు వారీ ఆహారంలో పేస్ట్రీలు, కేక్‌లు, మయోన్నెస్‌లో ఉడికించిన డంపింగ్స్‌, రాత్రి భోజనంలో రెండు పిజ్జాలు తప్పనిసరిగా తిన్నట్లు తెలిపాడు. 

అధిక బరువుని తగ్గించడం ఎలా అనేదానిపై ప్రేరణ కలిగించేలా బరువు పెరగాలనుకుంటే..అది అతడి ఉసురే తీసేసింది. డిమిత్రీ సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ఓరెన్‌బర్గ్ ఒలింపిక్ రిజర్వ్ స్కూల్ అండ్‌ నేషనల్ ఫిట్‌నెస్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్‌, పైగా ఒక దశాబ్దం పాటు ఉన్నత రష్యన్లకు వ్యక్తిగత కోచ్‌ కూడా ఆయన. అలాంటి వ్యక్తి జంక్‌ ఫుడ్‌ ఎంత ప్రమాదకరం అనేది చూపిద్దామనుకుంటే అతడి ప్రాణాల్లో గాల్లో కలిసిపోయాయి. 

నిజంగానే ఇంత ప్రమాదమా అంటే..
జంక్‌ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదు.ఎందుకంటే ఇందులో చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు, సోడియం ఎక్కువగా ఉంటాయి. ఇందులో మనకు అవసరమైన పోషకాలు తక్కువగా ఉంటాయి. దీనిని తరచుగా తినడం వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.

(చదవండి: ఇంజనీర్‌ కమ్‌ డాక్టర్‌..! విజయవంతమైన స్టార్టప్‌ ఇంజనీర్‌ కానీ..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement