సాక్షి, ముంబై: షేర్ మార్కెట్‌లో ట్రేడింగ్ పేరుతో ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్త భారీగా మోసపోయిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ.35 కోట్లు మోసపోయిన దిగ్భ్రాంతికర వార్త కలకలం రేపుతోంది
తన భార్య పేరుతో ఉన్న డీమ్యాట్ ఖాతాను ఒక బ్రోకరేజ్ సంస్థ అన్యాయంగా వాడి మోసం చేసిందని 72 ఏళ్ల వ్యాపారవేత్త వాపోతున్నారు. గత నాలుగేళ్లుగా ఈ మోసానికి తెగబడిందని మతుంగా వెస్ట్ నివాసి భరత్ హరక్‌చంద్ షా అనే బ్రోకరేజ్ సంస్థ గ్లోబ్ క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్‌పై ఆరోపణలు గుప్పించారు.
అసలేమైంది అంటే.
పరేల్‌లో క్యాన్సర్ రోగుల కోసం తక్కువ అద్దెకు గెస్ట్ హౌస్ నడుపుతున్న షా, తన భార్యతో పాటు, 1984లో తన తండ్రి మరణించిన తర్వాత ఆయన షేర్ పోర్ట్‌ఫోలియోను వారసత్వంగా పొందారు. కానీ ఆ జంటకు స్టాక్ మార్కెట్‌పై ఎలాంటి పరి జ్ఞానం లేదు. ఎపుడూ ట్రేడింగ్ చేసిన అనుభవమూ లేదు. దీంతో స్నేహితుడి సలహా మేరకు షా తనకు , తన భార్యకు గ్లోబ్ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌లో డీమ్యాట్ , ట్రేడింగ్ ఖాతాను తెరిచి, వారి వారసత్వంగా వచ్చిన షేర్లను కంపెనీకి బదిలీ చేశాడు. అక్షయ్ బరియా ,కరణ్ సిరోయా అనే ఇద్దరు ఉద్యోగులకు వీరి పోర్ట్‌ఫోలియోను "నిర్వహించే" బాధ్యతను అప్పగించారు. ఇక అక్కడినుంచి వీరి మోసానికి తెరలేచింది. వారి ఖాతాలకు పూర్తిగా నియంత్రణలోకి తీసుకొన్నారు. మొదట్లో కొద్దో గొప్పో సమాచారం ఇచ్చినప్పటికీ, ఆ తరువాత అసలు వీళ్లని సంప్రదించేవారు కాదు. అయితే మార్చి 2020 -జూన్ 2024 మధ్య, లాభాలు, క్లీన్ స్టేట్‌మెంట్ రావడంతో ఎలాంటి అనుమానం రాలేదు. తన ఖాతాల ద్వారా విస్తృతమైన వాణిజ్య కార్యకలాపాలు జరుగుతున్నాయని షాకు తెలియదు.
ఇదీ చదవండి: డీకేకి చాన్స్ ఇస్తే.. సిద్ధరామయ్య ప్లాన్ ఏంటి?
మోసం ఎలా బైట పడింది?
జూలై 2024లో షాకు గ్లోబ్ క్యాపిటల్ రిస్క్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ నుండి అకస్మాత్తుగా కాల్ వచ్చింది. దాని సారాంశం ఏమిటయ్యా అంటే.. మీ భార్యాభర్తలఖాతాల్లో రూ. 35 కోట్ల డెబిట్ ఉంది. వెంటనే దాన్ని చెల్లించాలి, లేకపోతే మీ షేర్లన్నీ అమ్మేస్తాం’’ అని చెప్పడంతో నిర్ఘాంత పోవడం షా వంతైంది. కంపెనీని సందర్శించినప్పుడు, భారీ, అనధికార వ్యాపారం జరిగిందని అతనికి సమాచారం అందింది.జరిగిన మోసాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: వేధింపులపై మహిళలకు కీలక సందేశం : ఐశ్వర్యారాయ్ వీడియో వైరల్


