డ్రెస్సుల్నీ, లిప్‌స్టిక్‌నీ నిందించకండి, తలెత్తుకుని గౌరవంగా నిలబడండి : ఐశ్వర్యారాయ్
మహిళలపై వేధింపులపై మాజీ విశ్వ బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ Aishwarya Rai Bachchan కీలక వ్యాఖ్యలు చేశారు. వీధి వేధింపులు, బాధితులను నిందించడంపై ఐశ్వర్య రాయ్ ఆమె స్పందిస్తే, ఇందులో మహిళలు, లేదా అమ్మాయిల తప్పు ఎప్పుడూ లేదన్నారు. లోరియల్ పారిస్ స్టాండ్ అప్ శిక్షణా కార్యక్రమంలో ఆమె ఐశ్వర్య రాయ్ వీధి వేధింపుల (Street harassment )పై మాట్లాడారు. బాధితులనే నిందించే వైఖరిని కూడా ఆమె తప్పు బట్టారు.
గతరెండు దశాబ్దాలుగా గ్లోబల్ బ్యూటీ బ్రాండ్ లోరియల్ పారిస్‌కి అంబాసిడర్‌గా ఉన్న ఐష్ వీధి వేధింపులకు వ్యతిరేకంగా బ్రాండ్ ప్రచారంలో పాల్గొన్నారు. ధైర్యంగా తలపైకెత్తుకుని నిలబడండి.. గౌరవం విజయంలో రాజీపడకండి, వీధి వేధింపులకు వ్యతిరేకంగా పోరాటంలో చేరండి. స్టాండ్ అప్ శిక్షణా కార్యక్రమంలో చేరండి అని లోరియల్ పిలుపునిచ్చింది.
ఈ ప్రచారంలో భాగంగా ఐశ్వర్యారాయ్ వీధి వేధింపుల గురించి మహిళలకు ఇలా సందేశమిచ్చారు "మీ దుస్తులను లేదా లిప్‌స్టిక్‌ను నిందించవద్దు.. వీధి వేధింపులు, మీరు దానిని ఎలా ఎదుర్కొంటారు?" అంటే ఒక వీడియోలో సూచనలు చేశారు. అవేంటంటే.. వారి కళ్లలోకి చూడకుండా ఉండాలి.. కానే కాదు కాదు, "సమస్యను నేరుగా కళ్ళలోకి చూడండి.తల ఎత్తి ధైర్యంగా ఉండాలి. స్త్రీగా స్త్రీవాదిగా ఉండాలి. నా శరీరం. నా విలువ," అనే సందేశాన్నిచ్చారు. మిమ్మల్ని మీరు అనుమానించకోకండి. మీకోసం మీ విలువ విషయంలో ఎప్పుడూ రాజీ పడకండి. వాల్యూకోసం నిలబడండి. అంతేకాదు మీ దుస్తులను లేదా మీ లిప్‌స్టిక్‌ను నిందించవద్దు. వీధి వేధింపులు ఎప్పుడూ మీ తప్పు కాదుఅంటూ ఆమె ముగించారు.
చదవండి: డీకేకి చాన్స్ ఇస్తే.. సిద్ధరామయ్య ప్లాన్ ఏంటి?
ఐశ్వర్య రాయ్ తో పాటు పలువురు ప్రముఖ సెలబ్రిటీలు అమెరికన్ నటి అరియానా గ్రీన్‌బ్లాట్, ఇంగ్లీష్ నటుడు సిమోన్ ఆష్లే, ఇటాలియన్ హై జంపర్ జియాన్మార్కో టాంబేరి , ఫార్ములా 1 డ్రైవర్ కార్లోస్ సైన్జ్ ఈ ప్రచారంలో భాగస్వాములు కావడం విశేషం.
కాగా 2012 గాలప్ నివేదిక ప్రకారం, 143 దేశాలలో పురుషులతో పోలిసతే, మహిళలు రాత్రిపూట ఒంటరిగా నడవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. 2011లో నిర్వహించిన సర్వేల నుండి ఈ డేటాను తీసుకున్నారు. స్టాప్ స్ట్రీట్ హరాస్‌మెంట్ నివేదిక ప్రకారం, భారతదేశంలో నివసిస్తున్న 79శాతం మంది మహిళలు బహిరంగంగా హింస లేదా వేధింపులకు గురవు తున్నారు. ఈ డేటా బ్రెజిల్‌లో 89శాతం, యూకేలోని లండన్‌లో 75శాతం గా ఉంది.


