సాక్షి నిర్మల్: ఆ గ్రామంలో ప్రజల కష్టాలను తీరుస్తానని ఆ యువ సర్పంచ్ ఎన్నికల్లో వాగ్దానం చేశారు. దీంతో అతని మాట నమ్మిన ప్రజలు తమ కష్టాలను తీరుస్తాడనే ఉద్దేశంతో అతనని సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. ఇచ్చిన మాటను ఏలాగైనా నిలబెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో సర్పంచ్ వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని గ్రహించి దానిని అరికట్టడం కోసం ఏకంగా తానే ఎలుగుబంటి రూపం ధరించి కోతులను తరిమాడు.
సాధారణంగా రాజకీయ నాయకులు ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను వారు గెలవగానే మర్చిపోతుంటారు. మళ్లీ ఐదు సంవత్సరాలకు గానీ వారికి ఆవాగ్దానాలు గుర్తుకురావు. కానీ నిర్మల్‌లో మాత్రం ఇటీవల ఎన్నికైన యువ సర్పంచ్ గ్రామ బాగోగుల చూస్తానని ప్రజలకు మాట ఇచ్చారు. మాట నిలబెట్టుకోవడం కోసం ఏకంగా ఎలుగుబంటి రూపమే ధరించారు.
నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్‌లో కోతుల బెడద ఎక్కువగా ఉంది. గత రెండు, మూడు ఏళ్లుగా గ్రామ్ంలో కోతుల బెడద తీవ్రరూపం దాల్చింది. దీంతో ప్రజలంతా కలిసి చందాలు వేసుకొని వాటిని తరిమికొట్టేందుకు బోన్ల ఏర్పాటు చేశారు. వాటిని తరిమికొట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పెద్దగా ప్రభావం లేకుండా పోయింది.
దీంతో ఏలాగైనా కోతులను గ్రామం నుంచి తరిమికొట్టాలని భావించిన గ్రామ సర్పంచ్ రంజిత్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కోతుల బెడదను నివారించడానికి ఎలుగుబంటి వేశం వేసి గ్రామంలో కలియతిరిగారు. వానరాలను బెదిరిస్తూ వాటిని అక్కడి నుంచి తరిమికొట్టారు. కోతులు సైతం ఆయనను చూసి నిజమైన బల్లూకమోనని భావించి ఆ గ్రామం నుంచి పరారవుతున్నాయి.
Innovative solution to #monkey problem – young #sarpanch dressed as a bear.The new sarpanch dressed as a bear to drive away the monkey menace in the village. When he approached monkeys in bear getup,the monkeys ran away.#Nirmal District, Kadem Mandal – #Telangana pic.twitter.com/ICCs0i6z5P
— Ramana Reddy (@RamanaR69561502) December 19, 2025
దీంతో ప్రస్తుతం ఆ గ్రామంలో కోతుల బెడద కొంతమేర తగ్గిందని ప్రజలు అంటున్నారు. యువ సర్పంచ్ ఆలోచనతో పాటు ప్రజలకు మంచి చేయాలనే తన ఆలోచనను గ్రామస్తులంతా మెచ్చుకుంటున్నారు.


