ధర్మశాలలో ర్యాగింగ్‌ భూతం : పోరాడి ఓడిన 19 ఏళ్ల పల్లవి | Himachal College Student Dies After Assault Professor Among 4 Charged | Sakshi
Sakshi News home page

ధర్మశాలలో ర్యాగింగ్‌ భూతం : పోరాడి ఓడిన 19 ఏళ్ల పల్లవి

Jan 2 2026 7:05 PM | Updated on Jan 2 2026 7:21 PM

Himachal College Student Dies After Assault Professor Among 4 Charged

విద్యా బుద్దులు నేర్పాల్సిన గురువు, అండగా నిలవాల్సిన స్నేహితులే, ఆమె పాలిట యమ కింకరుల య్యారు. వారి వేధింపులు తాళలేక ఒక అమ్మాయి మతిస్థిమితం కోల్పోయింది. చివరికి ప్రాణాలే కోల్పోయింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలోని కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం విద్యార్థి 19 ఏళ్ల యువతి విషాద గాథ ఇది.

ధర్మశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతోంది పల్లవి. పల్లవిపై కాలేజీ లెక్చరర్, ముగ్గురు యువతులు ర్యాగింగ్, లైంగిక వేధింపులకు పాల్పడ్డారు గత ఏడాది సెప్టెంబర్ 18న తన కుమార్తెపై అదే కాలేజీలో పనిచేసే లెక్చరర్‌తో పాటు ముగ్గురు తోటి విద్యార్థులు లైంగిక వేధింపులకు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషాదం వెలుగులోకి వచ్చింది.

ప్రొఫెసర్‌తోపాటు, హర్షిత, అకృతి, కొమోలికా అనే ముగ్గురు విద్యార్థినిలు తన కుమార్తెపై దారుణమైన ర్యాగింగ్‌కు పాల్పడ్డారని, మౌనంగా ఉండమని బెదిరించారని కూడా ఆరోపించారు. కాలేజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అశోక్ కుమార్‌ను కూడా నిందితుల్లో ఒకరిగా పేర్కొన్నారు. అశోక్‌ కుమార్‌  అసభ్య ప్రవర్తన , మానసిక వేధింపుల కారణంగా తన కుమార్తె అధిక ఒత్తిడికి గురైందని మరణించిన విద్యార్థి తండ్రి చెప్పారు.

 

హిమాచల్‌లోని వివిధ ఆసుపత్రులలో చికిత్స అందించినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఆమెను లుధియానాలోని దయానంద్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించామనీ, అక్కడ చికిత్స పొందుతూ పల్లవి డిసెంబర్ 26న  తది శ్వాస విడిచిందని తెలిపారు. అయితే కుమార్తె  అనారోగ్యం, మానసిక వేదన కారణంతా  తాను ఇంతవరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయానని మృతురాలి తండ్రి చెప్పారు. డిసెంబర్ 20న పోలీసులకు, ముఖ్యమంత్రి హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశానని, కానీ వారు స్పందించలేదని తండ్రి వాపోయారు. 

చదవండి: సిద్ధార్థ భయ్యా ఇక లేరు.. ప్రముఖుల దిగ్భ్రాంతి

అలాగే వారు లైంగికంగా వేధించిన తీరును, ర్యాగింగ్ గురించి  చనిపోయే ముందు వీడియోను రికార్డ్ చేసిందని తెలిపారు. ఇందులో ప్రొఫెసర్ తనను ఎలా అనుచితంగా తాకాడనే దానితో పాటు అనేక ఇతర మానసిక మరియు లైంగిక వేధింపుల గురించి ఆమె మాట్లాడింది.ఈ ఫిర్యాదు మేరకు ప్రొఫెసర్‌. ర్యాగింగ్ , లైంగిక వేధింపుల అభియోగాలు మోపినట్లు పోలీసులు తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు హిమాచల్ ప్రదేశ్ విద్యాసంస్థల (ర్యాగింగ్ నిషేధం) చట్టం, 2009 కింద పోలీసులు కేసు నమోదు చేశారని పోలీసు అధికారి అశోక్ రత్తన్ తెలిపారు. ర్యాగింగ్ కోణం, ప్రొఫెసర్‌పై ఆరోపణలు, విద్యార్థిని చనిపోయే ముందు ఆమె చేరిన అన్ని ఆసుపత్రుల దర్యాప్తు చేపడతామని తెలిపారు.

కాలేజీ యాజమాన్యం స్పందన
మరోవైపు పల్లవి కుటుంబానికి కళాశాల యాజమాన్యం సంతాపాన్ని ప్రకటించింది.  పల్లవి మొదటి సంవత్సరంలో విఫలమైందని, అయినప్పటికీ రెండో సంవత్సరంలో అడ్మిషన్ కోరిందని అయితేకాలేజీమార్గదర్శకాల ప్రకారం ఆమెను ప్రమోట్ చేయలేదని  కళాశాల ప్రిన్సిపాల్ రాకేష్ పఠానియా  చెప్పారు. దీంతో అడ్మిషన్‌ను ఉద్దేశపూర్వకంగా నిరాకరిస్తున్నట్లు భావించిందన్నారు.  గత జూలై 29 నుండి తరగతులకు హాజరు కాలేదని కూడా ప్రిన్సిపాల్ చెప్పారు. అలాగే వేధింపులపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని  తెలిపారు.  
 

ఇదీ చదవండి: ఎల్‌ఐసీకి రూ. 11, 500 కోట్లు నష్టం, ఎందుకో తెలుసా?

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement