breaking news
Himachal Pradesh
-
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
ధర్మశాల/చండీగఢ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. నీట మునిగిన పంట పొలాలు, ధ్వంసమైన ఇళ్లు, రహదారులను స్వయంగా పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. భారీ వర్షాలు, వరదలకు తోడు కొండచరియలు విరిగిపడడంతో తీవ్రంగా నష్టపోయిన హిమాచల్ ప్రదేశ్‌కు తక్షణ సాయం కింద రూ.1,500 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వరదల్లో మృతిచెందినవారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం ఇస్తామని వెల్లడించారు.హిమాచల్ ప్రదేశ్‌లో ఏరియల్ సర్వే అనంతరం కాంగ్రా పట్టణంలో ప్రధాని మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు. సహాయ పునరావాస చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి సుఖ్వీందర్సింగ్ సుఖూ పాల్గొన్నారు. వరద బాధితులు సైతం హాజరై తమ గోడు వినిపించారు. తమను ఆదుకోవాలని ప్రధాని మోదీని వేడుకున్నారు. కచ్చితంగా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. వరదల్లో దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. ధ్వంసమైన ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పునరి్నరి్మంచాలని సూచించారు. రాష్ట్రంలో ఈ ఏడాది జూన్ 20 నుంచి సెపె్టంబర్ 8 దాకా వరదలు, కొండచరియల కారణంగా ఏకంగా 370 మంది మృతిచెందారు. పంజాబ్‌లో సహాయక చర్యలపై ఆరా ప్రధాని మోదీ హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటన అనంతరం పంజాబ్‌కు చేరుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. బాధితులను కలిసి మాట్లాడారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని, ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతోనూ మాట్లాడారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. గురుదాస్‌పూర్‌లో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. పంజాబ్‌కు తక్షణ సాయం కింద రూ.1,600 కోట్లు అందజేస్తామని ప్రకటించారు. భారీ వర్షాలతోపాటు సట్లెజ్, బియాస్, రావి నదులు ఉప్పొంగి ప్రవహించడంతో పంజాబ్‌లో భారీ నష్టం వాటిల్లింది. 51 మంది మరణించారు. 1.84 లక్షల హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. రూ.13,000 కోట్ల నష్టం జరిగినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. రూ.20,000 కోట్ల సహాయ ప్యాకేజీ ప్రకటించాలని ప్రధాని మోదీని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది.చిన్నారి నీతికతో మోదీ హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రాలో సమీక్షా సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ 14 నెలల చిన్నారి నీతికను ఎత్తుకొని బుజ్జగించారు. ప్రకృతి విలయం వల్ల అనాథగా మారిన నీతిక దీనగాథ విని ఆయన చలించిపోయారు. హిమాచల్‌ప్రదేశ్‌లో మండీ జిల్లాలోని తల్వార గ్రామంలో జూన్ 30న రాత్రిపూట హఠాత్తుగా భారీ వర్షం కురిసింది. గ్రామంపై కొండ చరియలు విరుచుకుపడ్డాయి. ఓ ఇంట్లో రమేశ్ కుమార్(31), రాధాదేవి(24) దంపతులు తమ కమార్తె నీతికతోపాటు తల్లి పూనమ్దేవితో కలిసి నిద్రిస్తున్నారు. ఇంట్లోకి బురద చొచ్చుకొచ్చింది.నీతికను వంట గదిలో పడుకోబెట్టి బురదను తొలగించేందుకు ముగ్గురూ ప్రయత్నించారు. ఇంతలో భారీ కొండచరియ ఆ ఇంటిపైకి దూసుకొచ్చింది. వంట గది మినహా ఆ ముగ్గురున్న గది నేలమట్టమైంది. రమేశ్ కుమార్, రాధాదేవి, పూనమ్‌దేవి బురదతోపాటు కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు. వంట గదికి నష్టం జరగకపోవడంతో నీతిక ప్రాణాలతో బయటపడింది. ఆ సమయంలో నీతిక వయసు 11 నెలలే. నీతికను హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం ‘చైల్డ్ ఆఫ్ ద స్టేట్’గా ప్రకటించింది. ఆమె చదువుతోపాటు జీవనానికి అయ్యే ఖర్చులు భరిస్తామని ప్రకటించింది. -
నేడు వరద బాధిత ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు(మంగళవారం) హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో వరదలు, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను సందర్శించనున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలలో ప్రధాని తొలుత ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.నేటి మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రదాని హిమాచల్‌లోని కాంగ్రాకు చేరుకుంటారు. అక్కడ రాష్ట్ర అధికారులను కలుసుకుంటారు. పరిస్థితిని అంచనా వేసేందుకు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. అలాగే వరద బాధితులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), ఆప్దా మిత్ర బృందంతో సంభాషించనున్నారు. మధ్యాహ్నం ప్రధాని మోదీ పంజాబ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏరియల్ సర్వే నిర్వహించాక, గురుదాస్‌పూర్ చేరుకుని, సాయంత్రం 4:15 గంటలకు సీనియర్ అధికారులతో సమావేశం కానున్నారు.హిమాచల్‌లో వరదల కారణంగా 355 మంది మరణించినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. కొండచరియలు విరిగిపడటం, నిర్మాణాలు కూలిపోవడం కారణంగా ప్రాణనష్టం జరిగిందని పేర్కొంది. మరోవైపు బియాస్, సత్లుజ్, రావి, ఘగ్గర్ తదితర నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో పంజాబ్ హై అలర్ట్‌లో ఉంది. 23 జిల్లాల్లోని 1,650 కి పైగా గ్రామాలు నీట మునిగాయి, 1.75 లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయి. -
ఏడేళ్లకే ఆపరేషన్ చేసిన వండర్ కిడ్!
చిన్నపిల్లలు ఆసుపత్రికి వెళ్లాలంటే భయపడతారు. అక్కడ డాక్టర్ తమకు ఇంజెక్షన్ ఇస్తాడేమోనని వణికిపోతారు. మందులు మింగాల్సి వస్తుందని, చేదుగా ఉంటాయని అనుకుంటారు. అయితే ఏడేళ్ల వయసులో డాక్టర్‌గా మారి ఆపరేషన్ చేసిన బాలుడి గురించి మీకు తెలుసా? అతనే అక్రిత్ ప్రాణ్ జస్వాల్.హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని నూర్పూర్ అనే చిన్న పట్టణంలో పుట్టాడు అక్రిత్. చిన్న వయస్సు నుండే అతనిలో అసాధారణ ప్రతిభ ఉందని తల్లిదండ్రులు గుర్తించారు. ఇతర చిన్నారుల కంటే వేగంగా అన్ని అంశాలను నేర్చుకునేవాడు. రెండేళ్ల వయసులోనే పూర్తిగా చదవడం, రాయడం ప్రారంభించాడు. ఐదేళ్ల వయసులో రావాల్సిన సామర్థ్యం రెండేళ్లకే అతనికి సాధ్యమవడం విశేషం. అనంతరం ఆంగ్ల సాహిత్యం, గణితం (Mathematics) వంటి అంశాలను సాధనం చేయడం ప్రారంభించాడు. ఐదేళ్లకే ఇంగ్లీష్ క్లాసిక్ పుస్తకాలను చదివాడు.ఏడేళ్ల వయసులో అక్రిత్ ప్రాణ్ జస్వాల్ (Akrit Pran Jaswal) కీలకమైన విజయం సాధించాడు. అది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. 8 ఏళ్ల బాలిక చేతులపై కాలిన గాయాలతో ఇబ్బంది పడుతుండగా అతను విజయవంతంగా ఆపరేషన్ చేశాడు. అప్పటికే అతను వైద్యరంగానికి సంబంధించిన పుస్తకాలు బాగా చదివి ఉండటం చేత ఆ క్లిష్టమైన శస్త్రచికిత్సను ధైర్యంగా పూర్తి చేశాడు. వైద్యులు అతని ప్రతిభ చూసి ఆశ్చర్యపోయారు.చదవండి: ఏం చేశావ్ పెద్దాయనా.. నీకు సెల్యూట్!ఆ బాలిక గాయాల నుంచి కోలుకోవడంతో అక్రిత్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. విజయవంతమైన ఆపరేషన్ (Surgery) చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. అనేక ఛానెళ్లు అతని ఇంటర్వ్యూ తీసుకున్నాయి. అలా అతని గురించి ప్రపంచానికి తెలిసింది. స్కూల్ చదువు పూర్తి చేసుకున్న తర్వాత ప్రస్తుతం అక్రిత్ ఐఐటీ కాన్పూర్‌లో చేరాడు. అక్కడ కూడా ప్రతిభ చాటుతూ అందరి ప్రశంసలూ పొందుతున్నాడు. -
హిమాచల్, ఉత్తరాఖండ్‌లో వర్ష బీభత్సం
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో సోమవారం భీకర వర్షాలు, కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో ఏడుగురు చనిపోయారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ మార్గంలో సోమవారం ఉదయం కొండచరియలు విరిగి వాహనంపై పడగా ఇద్దరు యాత్రికులు చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సోన్‌ప్రయాగ్–గౌరీకుండ్ మార్గంలోని ముంకాటియా వద్ద కొండప్రాంతం పక్క నుంచి వెళ్తున్న వాహనంపై ఒక్కసారిగా బండరాళ్లు పడ్డాయని అధికారులు తెలిపారు. బాధితులంతా ఉత్తరకాశీ జిల్లాకు చెందిన వారేనన్నారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థి తి విషమంగా ఉందన్నారు. భారీ వర్షాలు కొనసాగుతుండటంతో ఛార్ ధామ్ యాత్ర, సిక్కుల హేమ్‌కుండ్ సాహిబ్‌కు వెళ్లే దారిని ఈ నెల 5వ తేదీ వరకు మూసివేసినట్లు అధికారులు వివరించారు. వాతా వరణం మెరుగయ్యాక, రహదారులు పూర్తి సురక్షితమని భావించిన తర్వాతే తిరిగి రాకపోకలను అనుమతిస్తామన్నారు. సోమవారం ఉదయం 8 గంటల వేళకు చంపావత్ జిల్లా బన్‌బాసాలో 25.64 సెంటీమీటర్లు, ఖతిమాలో 18.1 సెంటీమీటర్లు, తనక్‌పూర్‌లో 17.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వివరించారు. రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశమున్న డెహ్రాడూన్, ఉత్తరకాశీ, తెహ్రీ, పౌడీ, నైనిటాల్ తదితర 9 జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. హిమాచల్‌లో ఐదుగురు.. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లాలో 24 గంటల వ్యవధిలో వేర్వేరు చోట్ల కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఐదుగురు చనిపోయారు. వీరిలో ఒక మహిళ, ఏడేళ్ల ఆమె కుమార్తె ఉన్నారు. జుంగాలోని డబ్లూ ప్రాంతంలో కొండచరియలు విరిగి ఇల్లు కూలడంతో తండ్రి, అతడి పదేళ్ల కుమార్తె మరణించారు. సిమ్లాలోని కోట్‌ఖైలో ఇల్లు కూలి వృద్ధ మహిళ మరణించారు. కొండచరియలు విరిగిపడటంతో సిమ్లా–కల్కా మార్గంలో నడిచే ఆరు రైళ్లను రద్దు చేశారు. దెబ్బతిన్న ఐదు జాతీయ రహదారులు సహా 793 రహదారులను మూసివేశారు. మంగళవారం వరకు ఆరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ విభాగం హెచ్చరించింది. కశ్మీర్లో అమిత్ షా పర్యటన జమ్మూకశ్మీర్‌లోని కత్రాలో భారీ వర్షం కురియడంతో మాతా వైష్ణోదేవి ఆలయాన్ని వరుసగా ఏడో రోజూ మూసి ఉంచారు. జమ్మూకశ్మీర్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారి పునరావాసానికి అన్ని విధాలుగా సాయమందిస్తామని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. సోమవారం జమ్మూలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అనంతరం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లా, సీనియర్ నేతలతో రాజ్‌భవన్‌లో జరిగిన సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు. -
వరద బీభత్సం.. హైవేపై 50 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఉత్తరాదిని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లో వరద బీభత్సం సృష్టిస్తోంది. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రహదారులు ధ్వంసమయ్యాయి. ఛండీగఢ్-కులు-మనాలీ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై 50 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.ప్రధానంగా ఢిల్లీ- ఎన్సీఆర్ ప్రాంతానికి పండ్లు, కూరగాయలు తీసుకెళ్తున్న వందలాది ట్రక్కులు నిలిచిపోయాయి. హైవేపై చిన్న వాహనాలకు అధికారులు అనుమతి ఇచ్చినప్పటికీ.. భారీ ట్రక్కులను నిలిపివేశారు. ఆపిల్, టమాటా, ఇతర కూరగాయల లోడ్లు పాడవుతున్నాయని ట్రక్కు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ట్రక్కు లోడ్ విలువ లక్షల్లో ఉంటుందని డ్రైవర్లు చెబుతున్నారు.మండి-కుల్లు మధ్యలో కొండచరియల విరిగి పడటంతో సహాయక పనులు చేపట్టారు. క్లియరెన్స్ పనులు కారణంగా ట్రాఫిక్‌కు ఆలస్యమవుతోంది. బియాస్ నది ఉధృతంగా ప్రవహించడం వల్ల జాతీయ రహదారిలో పలు ప్రాంతాల్లో నష్టం వాటిల్లింది. మరమ్మతులు కొనసాగుతున్నాయి. కుల్లు ప్రాంతంలోని రామశిల సమీపంలో వరదల ప్రభావంతో ఇళ్లు భారీగా దెబ్బతిన్నాయి. మనాలి ఒక వైపు నుండి ఇతర ప్రాంతాలతో ఉన్న రవాణా సంబంధాలు పూర్తిగా తెగిపొయాయి.50-km Traffic Jam On Chandigarh-Kullu Highway, Hundreds Of Trucks Stuckapples alone estimated at more than Rs 50 crore stuck in transit.#HimachalPradesh pic.twitter.com/6CCgiRIyus— Sidharth Shukla (@sidhshuk) August 28, 2025మంగళవారం సాయంత్రం నుండి హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వందలాది రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జూన్ 20 నుంచి ఇప్పటివరకు, భారీ వర్షాలు, వరదలు కారణంగా సుమారుగా 158 మంది మరణించగా.. 38 మంది గల్లంతయ్యారు.. రూ. 2,623 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. -
ఉత్తరాదిన కుంభవృష్టి
సిమ్లా/జమ్మూ: మేఘ విస్ఫోటం(క్లౌడ్ బరస్ట్) ఘటనల నుంచి తేరుకోకమునుపే మళ్లీ మేఘ విస్ఫోటాలు ఉత్తరాది రాష్ట్రాలపై విరుచుకుపడ్డాయి. హిమాలయాలకు నిలయాలైన హిమాచల్, జమ్మూలు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు, కొండచరియలు పడిన ఘటనలతో వణికిపోయాయి. హిమాచల్‌లో మెరుపు వరదల ధాటికి ఇళ్లు, దుకాణాలు నేలమట్టమయ్యాయి. జమ్మూకశ్మీర్‌లోని రియాస్ జిల్లాలోని ప్రఖ్యాత మాతా వైష్ణోదేవి ఆలయ ట్రెక్కింగ్ మార్గంలో మంగళవారం మధ్యాహ్నం కొండచరియలు విరిగిపడడంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 14 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఖత్రాలోని బేస్‌క్యాంప్‌లో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. త్రికూట పర్వతంపై కొలువైన ఆలయానికి ఖత్రానుంచి 12 కిలోమీటర్ల మార్గముంది. ఇందులో అర్థ్‌కువారీ సమీప ఇంద్రప్రస్థ భోజనాలయం సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో ఈ ఘోరం జరిగింది. ఆలయానికి రెండు మార్గాల్లో ట్రెక్కింగ్ చేస్తూ చేరుకోవచ్చు. మంగళవారం ఉదయం నుంచి హిమ్కోటీ ట్రెక్కింగ్ మార్గం గుండా యాత్రను నిలిపేశారు. పాత రూట్లో మధ్యాహ్నం 1.30దాకా ట్రెక్కింగ్ జరగ్గా కొండచరియలు పడటంతో అది కూడా నిలిపేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టేదాకా వైష్ణోదేవి ఆలయానికి భక్తుల యాత్రను అర్ధా్థంతరంగా ఆపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నదులుగత మూడ్రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జమ్మూ ప్రాంతంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వైష్ణోదేవి ఆలయ ఘటనతో కలిసి జమ్మూవ్యాప్తంగా వర్షసంబంధ ఘటనల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కశ్మీర్లో లోయలోనూ భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల చిన్నపాటి వంతెనలు, మొబైళ్ల టవర్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు సైతం తెగిపోవడంతో టెలికం, ఇంటర్నెట్ సేవలు దాదాపు ఆగిపోవడంతో లక్షలాది మంది ప్రజలు అవస్థలు పడుతున్నారు. రైలుపట్టాలపై రాళ్లు పడటంతో ఖత్రా, ఉధంపూర్, జమ్మూ రైల్వేస్టేషన్ల నుంచి ఇతర ప్రాంతాలకు 18 రైళ్లను రద్దుచేశారు. కొండచరియలు పడటంతో జమ్మూ–శ్రీనగర్, కిష్ఠ్‌వార్–దోడా జాతీయరహదారులపై రాకపోకలను అధికారులు నిలిపేశారు. ఇలా డజన్లకొద్దీ పర్వతసానువుల వెంట రహదారులు మూసేశారు. కిష్ఠివార్, రేసీ, రాజౌరీ, రాంబాన్, ఫూంఛ్ జిల్లాల్లోనూ వర్షబీభత్సం జరిగింది. ఇళ్లు నేలకూలాయి. కిష్్టవార్లోని ముఘల్ మైదాన్ వంతెన ధ్వంసమైంది. జమ్మూలో తక్షణం చేపట్టాల్సిన సహాయక చర్యలపై శ్రీనగర్‌లో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు తగు ఆదేశాలిచ్చారు. మనాలీలో బియాస్ ఉగ్రరూపం హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలో బియాస్ నది ఉగ్రరూపం దాల్చి పరీవాహక ప్రాంతాలపై విరుచుకుపడింది. చాలా చోట్ల మనాలీ–లేహ్ రహదారి నదీప్రవాహం కారణంగా కొట్టుకుపోయింది. మనాలీలోని బహంగ్ ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనం నీటి ఉధృతికి కూలి నదీప్రవాహంలో పడింది. రెండు రెస్టారెంట్లు, కొన్ని దుకాణాలు సైతం కొట్టుకుపోయాయి. 40 షాప్‌లు ధ్వంసమయ్యాయి. రహదారిపై నిలిచి ఉన్న వాహనాలు సైతం నదీప్రవాహంలో కొట్టుకుపోయాయి. సమీప ప్రాంతాల ప్రజలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. రాష్ట్రంలో పర్యటిస్తున్న యాత్రికులు పలు చోట్ల చిక్కుకుపోయారు. పత్లీకుహాల్ ప్రాంతంలో ఇళ్లు నీటమునిగాయి. కులూ ప్రాంతంలోనూ బియాస్ నది ఉధృతంగా ప్రవహించింది. కినౌర్ జిల్లాలోని కన్వీ గ్రామంలోనూ మేఘ విస్ఫోటం సంభవించింది. రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాల కారణంగా కొండచరియలు రహదారులపై పడటంతో రాకపోకలు స్తంభించాయి. దీంతో మంగళవారం ఒక్కరోజే మండీ జిల్లాలో 320, కులూ జిల్లాలో 132 రహదారులను మూసేశారు. కంగ్రా, చంబా, లహౌల్ స్పితి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. -
మొదటి అంతరిక్ష యాత్రికుడు హనుమాన్!
ఉనా (హిమాచల్): మొదటి అంతరిక్ష యాత్రికుడు ఎవరు? యూరీ గగారిన్.. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. కానీ.. హిమాచల్ ప్రదేశ్‌లో పిల్లలు చెప్పిన సమాధానం.. అందుకు మన కేంద్ర మాజీ మంత్రి ఇచ్చిన వివరణ.. మన దేశ విద్యా వ్యవస్థ దుస్థితి ఏంటో తెలియజెప్తోంది. ఇటీవల బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్.. హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ పాఠశాలకు వెళ్లారు. అక్కడ ఆయన విద్యార్థులను ‘అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి వ్యక్తి ఎవరు?’ప్రశ్నించారు. దానికి పిల్లలంతా ముక్త కంఠంతో ‘నీల్ ఆర్మ్‌్రస్టాంగ్’అని చెప్పారు. అందుకు ఎంపీ.. ‘కాదు.. నేను హనుమాన్ అనుకుంటున్నాను. వేల సంవత్సరాల నాటి మన సంప్రదాయం, జ్ఞానం, సంస్కృతి ముఖ్యమైనవని ఇది చూపిస్తుంది. మనం మన స్వంతం గురించి నేర్చుకోకపోతే, బ్రిటిష్ వారు మనకు నేర్పించిన దానికే మనం పరిమితం అవుతాం’అని బదులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఎక్స్‌లో వైరల్ అవుతోంది. ఆ రెండు సమాధానాలు తప్పు. ‘నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కాదు.. యూరీ గగారిన్’అని చెప్పాల్సిన ఒక పార్లమెంటేరియన్.. జాతీయ అంతరిక్ష దినోత్సవం నాడు పిల్లల తప్పును సరిదిద్దకపోగా.. పురాణాలను చరిత్రగా చెప్పడం వివాదాస్పదమైంది. చర్రిత తప్పుదోవ.. అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి మానవుడు సోవియట్ వ్యోమగామి యూరి గగారిన్. అతను 1961లో ఆయన భూమిని చుట్టి వచ్చారు. ఆ తరువాత 1969లో అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్‌్రస్టాంగ్ చంద్రునిపై నడిచిన మొదటి మానవుడిగా చరిత్ర సృష్టించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఏ (హెచ్) శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించాలని చెబుతోంది. ఇప్పుడు ఆ చర్చ పక్కకు పోవడంపై విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘పిల్లల మనసులను వలస ఆలోచనల నుంచి విముక్తి చేసి.. స్వతంత్ర ఆలోచనలను ప్రోత్సహించాలన్న ప్రధాని పిలుపు మేరకే ఠాకూర్ అలా మాట్లాడి ఉండవచ్చు. కానీ.. సొంత సంస్కృతి గురించి గొప్పగా చెప్పుకోవడమంటే... సైన్స్, చరిత్ర పేరుతో పురాణాలను వల్లించడం కాదనే విషయాన్ని మరిచారు. మన చరిత్ర, సంస్కృతిని విద్యార్థులకు చెప్పాలనుకున్నప్పటికీ.. వాస్తవాలు, కల్పనల మధ్య తేడాను గుర్తించడం వారికి నేర్పించాలి. పురాణాలను పురాణాలుగానే చెప్తే తప్పు లేదు. కానీ.. పురాణాలను చరిత్రగా చెప్పడం కొత్త తరాన్ని తప్పుదోవ పట్టించడమే’అంటున్నారు. శాస్త్రీయ రుజువులు లేని పురాణాలు.. చరిత్ర వేరు.. పురాణాలు వేరు. రామాయణం, మహాభారతం వంటివి పురాణ కథలు. ఇవి నమ్మకం మీద నడిచేవి. కవి హోమర్ వర్ణనలను పోలిన నగరం 19వ శతాబ్దపు త్రవ్వకాల్లో బయటపడే వరకు ట్రాయ్ కూడా కల్పితంగానే పరిగణించారు. మన దేశంలో చాలా కథలకు భౌతిక ఆధారాలు లేవు. గుజరాత్ తీరంలో మునిగిపోయిన పురాతన నిర్మాణాలను పురావస్తు శాస్త్రవేత్తలు, శాస్త్రవేత్తలు మహాభారతంలోని ద్వారక నగరానికి లింక్ చేశారు. దానిపై ఇంకా చర్చ కొనసాగుతోంది. శాస్త్రీయ రుజువు లేకుండా, ఈ కథలు శక్తివంతమైన సాంస్కృతిక కథనాలుగా మిగిలిపోతాయే తప్ప, చరిత్రగా కాదు. గట్టి రుజువుతో నిరూపించబడే వరకు, యూరి గగారిన్ అంతరిక్షంలో మొదటి వ్యక్తిగా స్థిరపడతాడు. పిల్లలకు ఈ తేడాను నేర్పించాలి మరియు పార్లమెంటు సభ్యులు విద్య నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలి. -
ప్రాణాలు పణంగా పెట్టి విధులకు..
మండి: తండాల్లో ఉన్న గిరిజనులకు వైద్యం అందించడానికి కొండ, కోనల్లో కిలోమీటర్లు నడిచిన నర్సులను తెలుగు రాష్ట్రాల్లో చూశాం. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఈ నర్సు... విధి నిర్వహణకోసం ఉప్పొంగి ప్రవహిస్తున్న నదిని సైతం లెక్క చేయడం లేదు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను చేరుకోవడానికి గర్జిస్తూ ప్రవహిస్తున్న వాగును దాటి వెళ్తున్నారు. మండి జిల్లాకు చెందిన నర్సు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జిల్లాలోని టిక్కర్ గ్రామానికి చెందిన కమల పక్కనే ఉన్న గ్రామంలో నర్సుగా పనిచేస్తున్నారు. ఆమె విధులకు హాజరు కావడానికి ప్రతిరోజూ దాదాపు నాలుగు కిలోమీటర్లు ప్రయాణిస్తుంటారు. అయితే ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. ఆమె రోజువారీ ప్రయాణం కష్టంగా మారింది. నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఆమె నదిలోని రాళ్లను దాటుతూ వెళ్తున్నారు. ఈక్రమంలో ఒక్క అడుగు తప్పుగా వేసినా.. నదిలో కొట్టుకు పోవాల్సిందే. అయినా.. ఏమాత్రం వెరవకుండా వెళ్తుండటం చూసేవాళ్లకు వణుకు పుట్టిస్తోంది. ఆకస్మిక వరదల కారణంగా వారాల్లో చౌహార్ లోయ విస్తృతంగా నష్టపోయింది. వంతెనలు, రోడ్లు కూలిపోయాయి. హిమాచల్ ప్రదేశ్ అంతటా 313 రోడ్లు వర్షాల కారణంగా దెబ్బతిన్నాయి. వాటిలో 160 మండి జిల్లాలోనే ఉన్నాయి. దీంతో సిల్బుధాని, తర్సా్వన్ వంటి పంచాయతీలు ఇబ్బంది పడుతున్నాయి. కమల వంటి అనేక మంది ఉద్యోగులు, కారి్మకులు, స్థానికులు తమ రోజువారీ కార్యకలాపాలకోసం ఇలాంటి కాలువలు, వాగుల మీద ప్రమాదకర క్రాసింగ్‌లపై ఆధారపడుతున్నారు. -
రాత్రి 8 గంటలకే వీధులన్నీ నిర్మానుష్యం, ఎక్కడో తెలుసా?
ప్రస్తుత బిజీ రోజుల్లో ఏ ఊరి లోనైనా సరే వీధులన్నీ నిర్మానుష్యం అవ్వాలి అంటే కరోనా అన్నా రావాలి కర్ఫ్యూ అన్నా పెట్టాలి. హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే అర్ధరాత్రుళ్లు కూడా పట్టపగల్ని తలపించేంత రద్దీ కనిపిస్తుంది. రాత్రి మొత్తం చేసే ఉద్యోగాలు పెరిగిపోవడంతో నైట్ లైఫ్ కూడా అందరికీ అలవాటై పోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో... కొన్ని గ్రామాలు, పట్టణాలలో మాత్రం రాత్రి 8గంటల నుంచే వీథులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఆ తర్వాత ఉదయం సూర్యోదయం అయే దాకా రోడ్ల మీద జనసంచారం కోసం భూతద్ధం పెట్టి వెదకాల్సిందే. అలాంటి ఊర్లు ఇంకా ఉన్నాయా అంటే ఉన్నాయి మరి. అది కూడా మన దేశంలోనే ఉన్నాయి.తెల్లవారుఝామునే నిద్ర లేవడం, సూర్యుడి వెలుతురులోనే పనులన్నీ చక్కబెట్టుకోవడం, సూర్యాస్తమయం తోనే ఇల్లు చేరడం, చీకటి పడకముందే రాత్రి భోజనం పూర్తి చేసి నిద్రపోవడం...ఇలాంటి ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి వింటే...అబ్బో అదెప్పుడో మన తాత ముత్తాతల కాలం నాటిదిలే అనుకుంటాం కానీ.. ఇప్పటికీ చిత్కుల్, కల్ప, తీర్థన్ స్పితి వంటి గ్రామాలలో అదే జీవనశైలి కనిపిస్తోంది. ఈ గ్రామాల పేర్లు బహుశా మనలో చాలామందికి తెలియక పోవచ్చు కానీ ఆయా గ్రామాల్లో జన జీవితం మన తాత ముత్తాతల కాలం నాటి జీవనశైలినే తలపిస్తుంది. ఇలాంటి గ్రామాలు వందల సంఖ్యలో ఉన్నాయి కాబట్టే... హిమాచల్ ప్రదేశ్‌ను స్లీపింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. అక్కడి ప్రజలు అనుసరించే ప్రశాంతమైన జీవనశైలి తత్ఫలితంగా ఆస్వాదించే నాణ్యమైన నిద్ర నుంచే ఆ రాష్ట్రానికి ఈ పేరు వచ్చింది. ఈ రాష్ట్రం దాని సహజ సౌందర్యం, స్వచ్ఛమైన పర్వత గాలితో పాటు నిశ్చింతగా నడిచే గ్రామ జీవితానికి కూడా ప్రసిద్ధి చెందింది. రద్దీగా ఉండే నగరాల మాదిరిగా కాకుండా, ఇక్కడి జీవితం నిశ్శబ్దంగా విశ్రాంతిగా ఉంటుంది.హిమాచల్ ప్రదేశ్‌లో ప్రజలు చాలా సరళమైన దినచర్యను అనుసరిస్తారు. ఎక్కువ మంది పెందరాళే పడుకుని సూర్యోదయంతో మేల్కొంటారు. పగటిపూట పని చేస్తారు. సూర్యాస్తమయం తర్వాత, దుకాణాలు మూసి వేస్తారు. వీధులన్నీ బోసిపోయి నిశ్శబ్దంగా మారుతాయి, కుటుంబాలు ఇంటి లోపలే ఉంటాయి. చీకటి పడకముందే భోజనం చేస్తారు రాత్రి 8 నుంచి 9గంటల మధ్యలోనే నిద్రపోయే వీరి అలవాటు ‘స్లీపింగ్ స్టేట్‘ గా కిరీటాన్ని అందించింది.హిమాచల్ ప్రదేశ్‌లో, ప్రజలు ప్రకృతికి దగ్గరగా జీవిస్తారు. పర్వత వాతావరణం, పుష్కలమైన సూర్యరశ్మి ప్రశాంతమైన వాతావరణం ప్రజలు విశ్రాంతిగా రోజువారీ దినచర్యను నిర్వహించుకునేలా సహాయ పడతాయి. కొండలలో నదులు గాలుల ప్రవాహంలాగే వారి జీవితాలు నెమ్మదిగా సున్నితంగా కదులుతుంటాయి. పర్యాటకులు తరచుగా బిజీగా ఉన్న నగర జీవితం నుండి విరామం తీసుకొని ప్రశాంతమైన గ్రామ వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఈ ప్రదేశాలను సందర్శిస్తారు. అయితే ‘‘స్లీపింగ్ స్టేట్’’ అంటే ఆ ప్రదేశం అభివృద్ధిలో మందగమనంతో ఉందని కొందరు అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఈ పదం ప్రశాంతమైన జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది తప్ప సోమరితనం లేదా అభివృద్ధి లేకపోవడం కాదు. భారతదేశంలో. హిమాచల్ ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో ఆపిల్లను పండిస్తుంది సిమ్లా కిన్నౌర్ వంటి పట్టణాలు వాటి ఆపిల్ తోటలకు ప్రసిద్ధి చెందాయి. ఈ రాష్ట్రం పర్యావరణ హితంగా పేరుపడింది. భారతదేశంలో మొట్ట మొదటిసారిగా పొగ రహిత రాష్ట్రంగా మారిన రాష్ట్రం ఇదే. పర్యావరణాన్ని కాపాడటానికి, ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇక్కడి ధర్మశాల దలైలామా నివాసం. ఈ పట్టణం ప్రశాంతమైన ప్రదేశం భారతదేశంలో టిబెటన్ సంస్కృతి, బౌద్ధమతానికి ముఖ్యమైన కేంద్రం. దీనితో పాటే మనాలి నుంచి స్పితి వరకు పర్యాటకులు నగర జీవితం నుంచి విశ్రాంతి తీసుకోవడానికి, ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదించడానికి హిమాచల్‌ను ఎంచుకోవడానికి కారణాల్లో...ప్రకృతి అందాలతో పాటు నాణ్యమైన నిద్ర కూడా ఓ కారణం కావచ్చు. -
హిమాచల్‌లో భారీ వరదలు
షిమ్లా: ఉత్తరాఖండ్‌తోపాటు పొరుగున ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌నూ వరదలు ముంచెత్తి యాత్రికులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. తాజాగా హిమాచల్‌లోని కినౌర్ కైలాస్ యాత్రా మార్గంలో కుండపోత వానల కారణంగా ట్రెక్కింగ్ మార్గాల్లో వందలాది మంది యాత్రికులు చిక్కుకుపోయారు. వెంటనే విషయం తెల్సుకున్న ఇండో టిబెటన్ బోర్డర్‌పోలీస్(ఐటీబీపీ), జాతీయ విపత్తు స్పందన(ఎన్డీఆర్ఎఫ్) బలగాలు హుటాహుటిన రంగంలోకి దికి 413 మంది యాత్రికులను కాపాడాయి. పర్వతసానువుల గుండా వర్షపు నీటి ప్రవాహం భీకరంగా దూసుకొస్తోంది. దీంతో ట్రెక్కింగ్ మార్గమధ్యంలోని తాత్కాలిక తాంగ్లిప్పి, కాంగరాంగ్ వంతెనలు ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోవడంతో యాత్రికులు అక్కడ చిక్కుకుపోయారు. ట్రెక్కింగ్ మార్గం యాత్రకు అనువుగా లేకపోవడంతో కినౌర్ కైలాస్‌యాత్రను తాత్కాలికంగా నిలుపుదలచేస్తున్నట్లు కినౌర్ జిల్లా యంత్రాంగం బుధవారం ప్రకటించింది. టెక్కింగ్ చేస్తూ వెళ్లాల్సిన చాలా చోట్ల బురదపేరుకుపోయి జారే ప్రమాదం పెరిగింది. మిల్లింగ్ ఖాటా, గుఫా ప్రాంతాల్లో కొందరు యాత్రికులు సేదతీరుతున్నారు. వాళ్లకు కనీస సదుపాయాలను ఆర్మీ కల్పిస్తోంది. సముద్ర మట్టానికి 19,850 అడుగుల ఎత్తులో ఉండే కినౌర్ కైలాస్ ప్రాంతాన్ని శివునికి శీతాకాల విడిదిగా చెబుతారు. జూలై 15న ప్రారంభమైన ఈ యాత్ర ఈనెల 30వ తేదీన ముగుస్తుంది. కినౌర్ జిల్లాతోపాటు హిమాచల్‌లోని చాలా ప్రాంతాలు బుధవారం భారీ వర్షాలు కురిశాయి. దీంతో నాలుగు జాతీయరహదారులు సహా 617 రోడ్లను మూసేశారు. విద్యాసంస్థలకు ఒకరోజు సెలవు ప్రకటించారు. -
పెళ్లికూతురు పరార్.. డ్రోన్ ఎగరేసిన పెళ్లికొడుకు
-
అన్నదమ్ముల్ని పెళ్లాడిన యవతి.. ఇదెక్కడి ఆచారం!
ఒక వధువు.. ఇద్దరు పెండ్లి కొడుకులు.. పైగా అన్నదమ్ములు.. వివాహంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకకు వందలమంది హాజరై.. ఆ అరుదైన జంటను ఆశీర్వదించారు కూడా. ఈమధ్యకాలంలో జరిగే పరిణామాలతో పెళ్లంటేనే వణికిపోతున్న క్రమంలో.. ‘హవ్వా ఇదెక్కడి ఆచారం అనుకుంటున్నారా?’ అయితే ఈ కథనంలోకి పదండి.. హిమాచల్ ప్రదేశ్ సిరమూర్ జిల్లా షిల్లై గ్రామంలో జులై 12 నుంచి మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుక జరిగింది. హట్టి తెగ జానపద పాటలతో, నృత్యాలతో అన్నదమ్ములైన ప్రదీప్, కపిల్‌లను సునీతా చౌహాన్ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ వేడుకకు హాజరై వాళ్లను ఆశీర్వదించారు కూడా. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రదీప్ స్థానికంగా ప్రభుత్వ ఉద్యోగి కాగా.. అతని సోదరుడు కపిల్ విదేశాల్లో జాబ్ చేస్తున్నాడు. కున్‌హట్ గ్రామానికి చెందిన సునీత పెద్దల మాటకు విలువ ఇచ్చే ఈ వివాహం చేసుకుందట. తమపై ఎవరి ఒత్తిడి లేదని, ఇష్టపూర్వకంగానే చేసుకున్నామని, పైగా ఇలా వివాహం చేసుకోవడం(polyandry) అనాదిగా తమ తెగలో వస్తున్న ఆచారమని చెబుతున్నారు. పైగా ఈ వివాహం తమకెంతో గర్వంగా ఉందని ఫొటో షూట్లో ఉత్సాహంగా పాల్గొంటూ చెప్పారు. Astonishing! Two real brother marry a Same Girl 👇In Shillai area of Sirmaur district, two real brothers have married the same girl. This has become a topic of discussion in the entire region. This tradition is ancient in the Giripar region but in today's modern era, due to the… pic.twitter.com/8fIOaeQtjs— Akashdeep Thind (@thind_akashdeep) July 19, 2025హట్టి తెగ ప్రజలు హిమాచల్ ప్రదేశ్-ఉత్తరాఖండ్ సరిహద్దులో ట్రాన్స్ గిరి రీజియన్‌లో 450 గ్రామాల్లో నివాసం ఉంటున్నారు. మూడేళ్ల కిందటే ఈ తెగకు షెడ్యూల్డ్ ట్రైబ్(గిరిజన తెగ.. ఎస్టీ) గుర్తింపు దక్కింది. అయితే వేల ఏళ్లుగా బహుభర్తృత్వం((polyandry)ను ఈ తెగ పాటిస్తోందట. అందుకు భూవివాదాలే ప్రధాన కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. కుటుంబ ఐక్యత.. తద్వారా భూవివాదాలు లేకుండా ఉండేందుకే హట్టి తెగ ఈ ఆచారం మొదలుపెట్టిందట. సోదరుల మధ్య బంధం బలంగా ఉండి ఉమ్మడి కుటుంబంలో గొడవలు జరగవనేది మరో కారణం. అంతేకాదు.. ఇద్దరు భర్తలు ఉంటే తమ ఆడబిడ్డలకు రక్షణ బలంగా ఉంటుందని ఈ తెగవారు భావిస్తారట. అయితే.. మారుతున్న పరిస్థితులు, మహిళలు చదువుకోవడం, ఆర్థికంగా స్థితిగతులు మెరుగుపడడం.. కారణాలతో ఈ తరహా వివాహాలు అరుదుగా జరుగుతూ వస్తున్నాయి. ఈ తరహా వివాహాలకు అక్కడి రెవెన్యూ చట్టాలు కూడా సమ్మతిని తెలుపుతున్నాయి. జోడిధారా పేరుతో గత ఆరేళ్లలో ఈ తరహా వివాహాలు ఐదు జరిగాయని అధికారులు చెబుతున్నారు. హట్టి తెగలో ‘జాజ్దా’ పేరుతో ఈ వివాహ సంప్రదాయం కొనసాగుతుంది. పెళ్లి కూతురిని ఊరేగింపుగా పెళ్లి కొడుకులు ఉన్న ఊరికి తీసుకొస్తారు. అక్కడ వరుడి ఇంట సీంజ్ అనే పద్దతిలో పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు. వాళ్ల భాషలో పంతులుగారు మంత్రాలు చదువుతూ.. పవిత్ర జలాన్ని వధువు- ఇద్దరు పెళ్లి కొడుకుల మీద జల్లుతాడు. ఆపై ఆ ముగ్గురు ఒకరికొరు బెల్లం తినిపించుకుంటారు. ఆఖర్లో కుల్ దేవతా ఆశీర్వాదంతో ఈ వివాహ తంతు ముగుస్తుంది. హిమాలయ పర్వతాల రీజియన్‌లోని కొన్ని తెగలు ఒకప్పుడు ఈ తరహా వివాహాలకు మక్కువ చూపించేవి. తమిళనాడులో తోడా అనే తెగ ఒకప్పుడు ఈ ఆచారం పాటించేది. అలాగే నేపాల్, కెన్యాలో కొన్ని తెగల్లో ఇప్పటికీ ఈ తరహా వివాహాలు జరుగుతున్నాయి. -
గురుబ్రహ్మ అమ్మ అవుతున్న వేళ...
రాములవారి తలంబ్రాలూ, పట్టువస్త్రాలను తలపై పెట్టుకుంటారు... అది భక్తి. రాయలవారు తనకు తోడుగా కవులను ఏనుగు మీదకు ఎక్కించుకుంటారు. అది గౌరవం. శ్రవణకుమారుడు తన తల్లిదండ్రులను కావడిలో మోస్తాడు... అవి ప్రేమాభిమానాలు. అలాంటి భక్తి, గౌరవం, ప్రేమ ప్రపత్తులను తమ ఉ పాధ్యాయినుల పట్ల చూ పారు కొందరు విద్యార్థులు. హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకుని... లోకమంతటా వైరలైన ఈ సంఘటన వివరాలివి...ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా కుండ పోత వానలు కురుస్తుండటం... దాంతో చండప్రచండంగా నదులు ప్రవహిస్తుండటం... ఫలితంగా ఎంతోమంది కొట్టుకు పోతున్న సంఘటనల వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. కొద్దికాలంలోనే అలాంటి వరస సంఘటనలు అక్కడ చాలానే చోటు చేసుకున్నాయి. అచ్చం అలాగే ఆరోజున కూడా హిమాచల్ ప్రదేశ్‌లోని మాండీ జిల్లా థునాగ్ ప్రాంతమంతా కారుమబ్బులు ఆవరించి నలువైపుల్నుంచీ కమ్ముకొస్తూ పట్టపగటిని చిమ్మచీకటి చేసేశాయి. ఈ వాతావరణ నేపథ్యంలోనే... థునాగ్‌లోని ‘కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్రీ’కి చెందిన ఇద్దరు లెక్చరర్లకు నెలలు నిండాయి. ఏ సమయంలోనైనా వారికి నొప్పులు మొదలయ్యే అవకాశముంది. హిమాచల్ ప్రదేశ్‌లో అందునా పర్వత్ర పాంతమైన మాండీ పరిసరాల్లో ఇలా కురిసే అకస్మాత్ వర్షాలూ, హఠాత్తుగా వచ్చే మెరుపు వరదలు (ఫ్లాష్ ఫ్లడ్స్) చాలా మామూలు. ఒక పక్క నిండు గర్భిణులైన తమ లెక్చరర్లు... మరోపక్క కమ్ముకొస్తున్న వర్షపు ధాటి...ఇంకో పక్క పొంచి ఉన్న వరద ముప్పు! ఏం చేయాలో తోచని అక్కడి విద్యార్థులు... మోసుకెళ్లేందుకు వీలుగా ముందుగా పల్లకి లాంటి ఓ మంచె కట్టారు. అలా కట్టిన ఆ పల్లకిలో లెక్చరర్‌ను కూర్చోబెట్టి ఆ మంచెను మోశారా విద్యార్థులు.అసలే పర్వత ప్రాంతం! అంతా ఎగుళ్లూ దిగుళ్లు. మరోపక్క స్టూడెంట్లకు... ‘వానెప్పుడు ముంచుకొస్తుందో... ప్రసవపు నొప్పులెప్పుడోస్తాయోనని గుండెనిండా దిగులు. నిట్టనిలువుగా ఉండే పర్వత మార్గాలు కూలి కొండదారులు మూసుకు పోతే వాటినెలా దిగాలో తెలియని దిగాలు!! అలాంటి నేపథ్యంలో దాదాపు పదకొండు కిలోమీటర్ల ΄÷డవున అత్యంత కఠినమైన దారుల్లో ముందుకు సాగారు. గోడల్లా నిలువుగా ఉన్న సానువులను దిగారు. అలా కఠిన మార్గాల్ని ఓడిస్తూ ఎట్టకేలకు పర్వత పాదాల వద్దనున్న హాస్పిటల్‌కు చేరారూ... తమ లెక్చరర్లనూ చేర్చారు. ఇటీవల జరిగిన ఈ సంఘటన తాలూకు క్లిప్స్ వైరల్ కావడంతో ఆ స్టూడెంట్ల పట్ల అభినందనలూ, ప్రశంసలు వెల్లువెత్తాయి... అచ్చం అక్కడి క్లౌడ్ బరస్ట్ టైమ్‌లో ఫ్లాష్ఫ్లడ్స్లాగే!!‘ఆ స్టూడెంట్స్ తెగువకూ, ధైర్యానికీ మా సలాం’ అంటూ ఒకరు ప్రశంసిస్తే... ‘గురుపూర్ణిమకు గురుదక్షిణ ఆ గురువులకు చక్కగా దొరికిందం’’టూ మరొకరు కితాబిచ్చారు. ‘‘ఇది కదా ఇండియా ప్రజల సంస్కారమం’’టూ అందరూ ఆ విద్యార్థులకు జేజేలు పలికారు. -
67 మంది ప్రాణాలు కాపాడిన శునకం
మండి: విపత్తులు జంతువులకు ముందే తెలుస్తాయంటారు. అది నిజమని మరోసారి నిరూపించిందో శునకం. హిమాచల్‌లో వరదలను ముందుగా హెచ్చరించి 67 మంది ప్రాణాలను కాపాడింది. హిమాచల్‌ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నది తెలిసిందే. జూన్ 20న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో కనీసం 78 మంది మరణించారు. 50 మంది కొండచరియలు విరిగిపడటంతో మృత్యువాత పడగా.. 28 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు.అయితే.. మండిలోని ధరంపూర్ ప్రాంతంలోని సియాతి గ్రామంలో 67 మంది త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. సియాతి నివాసి నరేంద్ర ఇంట్లో ఓ శునకం ఉంది. ప్రమాదం సంభవించిన జూన్ 30న అది ఇంట్లోని రెండో అంతస్తులో పడుకుంది. బయట బోరున వర్షం. ఉన్నట్టుండి కుక్క మొరగడం ప్రారంభించింది. అది విని.. నరేంద్ర నిద్ర నుంచి లేచాడు. రెండో అంతస్తుకు వెళ్లాడు. అప్పటికే ఇంటి గోడలో పెద్ద పగుళ్లు కనిపించాయి. నీరు లోపలికి రావడం ప్రారంభమైంది. వెంటనే కుక్కతో పాటు కిందకు పరిగెత్తి అందరినీ నిద్రలేపాడు. ఇళ్లనుంచి సురక్షిత ప్రాంతాలకు పారిపోవాలని అందరినీ కోరాడు.వాళ్లు అలా వెళ్లిన కొద్దిసేపటికే, గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. పదికి పైగా ఇళ్ళు నేలమట్టమయ్యాయి. ఆ గ్రామంలో ఇప్పుడు నాలుగైదు ఇళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. మిగిలినవి కొండచరియల శిథిలాల కింద ఉన్నాయి. ప్రాణాలతో బయటపడిన వారు ఏడు రోజులుగా త్రియంబాల గ్రామంలో నిర్మించిన నైనా దేవి ఆలయంలో ఆశ్రయం పొందుతున్నారు. శునకం అప్రమత్తం చేయకుండా ఉంటే.. అంతమంది ప్రాణాలు నిద్రలోనే పోయేవని గ్రామస్తులు చెబుతున్నారు. -
ముంచుకొచ్చిన ఉపద్రవం.. ఊరినే కాపాడిన కుక్క!!
భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు.. హిమాచల్ ప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. వీటికి తోడు కొండచరియలు విరిగిపడుతుండడంతో.. అక్కడి ప్రజల జీవనం కష్టతరంగా ఉంటోంది. మరోవైపు వర్షాలకు ఇప్పటిదాకా 75 మంది మరణించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఊరకుక్క 67 మంది ప్రాణాలను కాపాడింది!!. వివరాల్లోకి వెళ్తే..హిమాచల్‌లో కురుస్తోన్న భారీ వర్షాలతో మండి జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. అక్కడి ధరంపూర్ తాలుకా సియతి గ్రామం జూన్ 30న అర్ధరాత్రి సమయంలో పెద్ద కొండచరియ విరిగిపడడంతో సర్వనాశనమైంది. ఇళ్లు ధ్వంసం కావడంతో గ్రామస్థులంతా తియంబాలా గ్రామంలోని నైనాదేవి ఆలయంలో ఆశ్రయం పొందుతున్నారు. సర్వం కోల్పోయినా.. ఓ ఊరకుక్క కారణంగా ప్రాణాలు దక్కాయని చెబుతున్నారు వాళ్లు. ఆ రాత్రి ఏం జరిగిందో ఓ గ్రామస్తుడి మాటల్లో.. మా ఇంటి రెండోఅంతస్తులో ప్రతిరోజు ఓ శునకం నిద్ర పోయేది. అయితే ఆరోజు అర్ధరాత్రి భారీ వర్షం కురుస్తోంది. ఆ వర్షంలో అది విపరీతంగా అరవడం మొదలుపెట్టింది. భయంతో అరుస్తుందేమోనని ఆ అరుపుల శబ్దానికి నేను లేచి దాని దగ్గరకు వెళ్లాను. పైకి వెళ్లి చూడగా.. ఇంటిగోడకు పగుళ్లు కనిపించాయి. ఇంట్లోకి చిన్నగా నీరు రావడం మొదలైంది. దాంతో వెంటనే కుక్కను కూడా కిందికి పరిగెత్తా. ఇంట్లో వాళ్లను.. చుట్టుపక్కల అందరినీ లేపి సురక్షిత ప్రాంతానికి వెళ్లమని చెప్పాను. అలా దూరంగా వెళ్లామో, లేదో.. మా గ్రామంపై ఓ పెద్ద కొండచరియ విరిగిపడింది. పదుల సంఖ్యలో ఇళ్లు దానికింద నేలమట్టం అయ్యాయి అని చెప్పారాయన. అలా కుక్క అరుపు.. 20 కుటుంబాలకు చెందిన 67 మంది ప్రాణాలను రక్షించిందన్నమాట. -
బ్యాంకులోకి చేరిన వరద.. జనం కాపలా
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తుండటం తెల్సిందే. మండి జిల్లాలోని థునాగ్ పట్టణంలోని రాష్ట్ర సహకార బ్యాంకు కార్యాలయంలోకి వరద నీరు చేరింది. రెండంతస్తుల ఈ భవనం మొదటి అంతస్తు వరద, చెత్తాచెదారంతో నిండిపోయింది. వరద తీవ్రతకు బ్యాంకు షట్టర్ ఒకటి ఊడిపోగా మరో రెండు షట్టర్లు వంకర్లు తిరిగి ఊడిపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. బ్యాంకులో ఖాతాదార్లు తాకట్టు పెట్టిన, లాకర్లలో భద్రంగా ఉంటుందని భావించిన లక్షలాది రూపాయల విలువైన నగలు, విలువైన పత్రాలు, కోట్లాది రూపా యల డబ్బు ఉన్నట్లు సమాచారం. అయితే, నష్టం వివరాలు వెల్లడి కాలేదు. చెత్తాచెదారం, వ్యర్థాలను తొలగించిన తర్వాతే నష్టాన్ని అంచనా వేసేందుకు వీలుంటుందని చెబుతున్నారు. థునాగ్ మార్కెట్ ప్రాంతంలో ఉన్న ఈ బ్యాంకులో నిత్యం 150 మంది వరకు వ్యాపా రులు లావాదేవీలు జరుపుతుంటారు. ఎనిమిదివేల జనాభా కలిగిన థునాగ్ పట్టణంలో బ్యాంకు ఇదొక్కటే. వరదల కారణంగా కొట్టుకువచ్చిన విలువైన వస్తువులను ఎవరైనా ఎత్తుకుపోయే ప్రమాదము ందని భావిస్తున్న స్థానికులు నిత్యం కాపలా కాస్తున్నారు. జూన్ 20–జూలై 6వ తేదీల మధ్య హిమాచల్‌లో భారీ వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. -
‘నిధుల్లేవ్.. నేనేమి మంత్రినీ కాను’.. వరద సాయంపై ఎంపీ కంగనా
నా దగ్గర నిధులు లేవు, నేనేం కేంద్రంలో మంత్రినీ కాను.. అయినా సరే కేంద్రం నుంచి వరద బాధిత ప్రాంతాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నాను’ అంటూ ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్.. తన మండీ నియోజకవర్గంలో వ్యాఖ్యలు చేశారు.హిమాచల్ ప్రదేశ్‌లో కుంభవృష్టి కారణంగా వరదలు సంభవించి 14 మంది మృతిచెందారు. మరో 31 మంది గల్లంతయ్యారు. ఈ నేపధ్యంలో మండీ ఎంపీ కంగనా రనౌత్ ఆ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు క్యాబినెట్ పదవి లేదని, విపత్తు సహాయానికి తన దగ్గర నిధులు లేవని, అయినా కేంద్రం నుండి ఆర్థిక సహాయం అందించేందుకు తాను అన్ని ప్రయత్నాలు చేస్తున్నానని అన్నారు. ఇంతటి వరదలకు బాధ్యులైనవారు తమ ముఖాలను దాచుకుంటున్నారని, వారు అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్‌పై కంగనా విమర్శలు గుప్పించారు. విధాన రూపకల్పనలో తనకు సామర్థ్యం ఉందని, అయితే రాష్ట్ర స్థాయిలో లేదా పంచాయతీ స్థాయిలో అది చాలా తక్కువని కంగనా పేర్కొన్నారు. #WATCH | Himachal Pradesh: BJP MP from Mandi, Kangana Ranaut says, "The central government provided immediate relief operations by sending in the forces. At the local level, we provided relief material to the affected families... Even though the Prime Minister is on a foreign… https://t.co/VoW4I4Uh4X pic.twitter.com/G9BeCHHTjF— ANI (@ANI) July 6, 2025హిమాచల్ ప్రదేశ్‌కు రక్షణ దళాలను పంపడం ద్వారా కేంద్రం తక్షణ సహాయ కార్యకలాపాలను ప్రారంభించిందన్నారు. ఐదు దేశాల పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి ఇక్కడి పరిస్థితి గురించి తెలుసునని ఎంపీ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు తాము సహాయ సామగ్రిని అందించామని, ఒక ఎంపీగా నిధులు తీసుకురావడం, ప్రభుత్వానికి గ్రౌండ్ రియాలిటీని తెలియజేయడం తన పని అని ఆమె స్పష్టం చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో రాబోయే 20 ఏళ్లలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని రనౌత్ వ్యాఖ్యానించారు. కాగా కంగనా.. విపత్తుల సమయంలో మండీ ప్రజలకు అందుబాటులో లేరంటూ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించిన అనంతరం ఆమె ఈ ప్రాంతంలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. ఒక ఎంపీగా ఆమె ఇటువంటి మాటలు మాట్లాడటం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. స్థానికంగా సాయం అందించేందుకు ఒక ఎంపీకి అవకాశమే ఉండదా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.ఇది కూడా చదవండి: భారత్-పాక్‌లను ఒకేలా తూచలేం: ‘బ్రిక్స్’లో ప్రధాని మోదీ -
ఘనంగా దలైలామా జన్మదిన వేడుకలు
ధర్మశాల/వాషింగ్టన్: టిబెటన్ల అత్యున్నత ఆధ్యాత్మిక గురువు, బౌద్ధమతాన్ని విస్తృతంగా ప్రచారంచేస్తున్న 14వ దలైలామా టెంజిన్ గ్యాట్సో 90వ పుట్టినరోజు వేడుకలు హిమాచల్‌ప్రదేశ్‌లో ఆదివారం ఘనంగా జరిగాయి. ప్రపంచదేశాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భౌద్ధ భిక్షువులు, బౌద్ధులు, పలువురు ప్రముఖుల సమక్షంలో ట్సుగ్లాంగ్ఖాంగ్ దలైలామా ఆలయం ప్రాంగణంలో జన్మదిన వేడుకలు జరిగాయి. కంగ్రా జిల్లాలోని మెక్లియోడ్గంజ్ పట్టణంలో జరిగిన ఈ వేడుకలకు పెద్దసంఖ్యలో విద్యార్థులు, నృత్యకారులు, నేపథ్యగాయకులు హాజరయ్యారు. ప్రపంచ శాంతి, మత సామరస్యం కోసం అలుపెరగకుండా పోరాడుతున్న దలైలామాకు తమ మద్దతు ఇకమీదటా కొనసాగుతుందని వేడుకల వేదికపై ఆసీనులైన పలు దేశాల రాజకీయ ప్రముఖులు ప్రకటించారు. ఒక్కో దశాబ్ద జీవితానికి ఒక అంతస్తు గుర్తుగా సిద్ధంచేసిన 9 అంతస్తుల కేక్‌ను కట్‌చేశాక వేలాది మంది బౌద్ధుల సమక్షంలో దలైలామా ప్రసంగించారు. ‘‘ జనులందరికీ సేవచేయాలన్న నా సంకల్పానికి మీ ప్రేమే స్ఫూర్తిగా నిలుస్తోంది. శాంతిదేవుడైన ‘బోధిసత్వాచార్యావతార’ చూపిన మార్గంలోనే నిరంతరం నడుస్తున్నా. ఇంద్రియజ్ఞానమున్న జనులంతా నా సోదరసోదరీమణులు, స్నేహితులే. నా శక్తిమేరకు మీకు సేవ చేస్తా. నా పుట్టినరోజు అని తెల్సుకుని అమితానందంతో ఇంతదూరమొచ్చి వేడుకల్లో భాగస్వాములైన మీకందరికీ మనస్ఫూర్తిగా ధాంక్యూ’’ అని దలైలామా వ్యాఖ్యానించారు. ‘‘ఎక్కువ మంది జనముంటే మరింత ఎక్కువగా హృదయానందం పొంగిపొర్లుతుంది. ఆ ఆనందం నాకెంతో స్ఫూర్తినిస్తుంది. బోధిచిత్తాన్నే నేను ఆచరిస్తా. ప్రజల్ని నా వైపునకు తిప్పుకోవాలనే స్వార్థ లక్ష్యాలు పెట్టుకోవడం కంటే ప్రజలకు సేవ చేయడంపైనే నా దృష్టంతా ఉంటుంది’’ అని దలైలామా అన్నారు. కేంద్ర మంత్రులు కిరెణ్ రిజిజు, రాజీవ్ రంజన్ సింగ్, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ, సిక్కిం మంత్రి సోనమ్ లామా, హాలీవుడ్ సీనియర్ నటుడు రిచర్డ్ గెరె తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు. ‘‘ప్రాచీన జ్ఞానసంపదకు, ఆధునిక ప్రపంచానికి సజీవ వారధి దలైలామా. ఆర్యభూమిలో దలైలామా దశాబ్దాలుగా ఉండిపోవడం మనకెంతో సంతోషకరం’’ అని రిజిజు పొగిడారు. శుభాకాంక్షలు తెలిపిన మోదీ దలైలామాకు ప్రధాని మోదీ బర్త్‌డే విషెస్ చెప్పారు. ఈ మేరకు ‘ఎక్స్’లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘90వ పుట్టినరోజు జరుపుకుంటున్న దలైలామాకు 140 కోట్ల మంది భారతీయులతోపాటు నేను సైతం శుభాకాంక్షలు చెబుతున్నా. ప్రేమ, తపన, సహనం, నైతిక విలువలకు నిలువెత్తు నిదర్శనం దలైలామా. ఆయన ఇచ్చి సందేశం దేశాలకతీతంగా జనులందరికీ శిరోధార్యం. ఆయన ఇలాగే దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నా’’ అని మోదీ అన్నారు. అమెరికా తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో సైతం సందేశం పంపించారు. ‘‘ టిబెటన్ల మానవ హక్కుల పరిరక్షణతోపాటు ప్రాథమిక స్వేచ్ఛకు అమెరికా నిత్యం మద్దతిస్తోంది. ఇతరుల(చైనా) జోక్యంలేకుండా టిబెటన్ల భాష, సంస్కృతి, మత వారసత్వ పరిరక్షణకు అమెరికా పాటుపడుతుంది’’ అని ఆయన అన్నారు. అమెరికా మాజీ అధ్యక్షులు జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా సైతం తమ శుభాకాంక్షల వీడియో సందేశాలు పంపించారు. -
హిమాచల్‌లో 75 మరణాలు.. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ విధింపు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరిపిలేని భారీ వర్షాల కారణంగా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, హిమాచల్‌లోని మండి జిల్లాలో భారీ వర్షాల కారణంగా మరణాల వారి సంఖ్య 75కు చేరుకుంది. మరోవైపు.. పలు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ విధించింది.హిమాచల్ ప్రదేశ్‌లో ఒక్క రోజులో 115-204 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 204 మిల్లీ మీటర్లు అతి తీవ్ర వర్షపాతం కిందకు వస్తుంది. దీంతో, రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రహదారులపై కొండచరియలు విరిగిపడ్డాయి. దాదాపు 240 రహదారులపై రాకపోకలు కష్టంగా మారినట్లు అధికారులు వెల్లడించారు. ఆకస్మిక వరదలు, కుంభవృష్టితో పరిస్థితి దారుణంగా మారింది. ఎడతెరిపిలేని వర్షం కారణంగా చాలా చోట్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. వీటిల్లో ఒక్క మండి జిల్లాలోనే 176 మార్గాలున్నాయి.Chamba, Himachal Pradesh: Heavy rain in Chamba district washed away the Kangela Nala bridge, cutting off a key route and disrupting local life. Authorities dispatched teams, plan alternative routes, and assured quick reconstruction to restore connectivity and ease difficulties… pic.twitter.com/IkQIjsmrMK— IANS (@ians_india) July 6, 2025రెడ్ అలర్ట్ జారీ..హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రా, సిర్మూర్, మండి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రెడ్ అలర్ట్ విధించింది. అలాగే, రానున్న 24 గంటల్లో చంబా, కంగ్రా, మండి, శిమ్లా, సిర్మూర్ జిల్లాల్లో మెరుపు వరదలు రావొచ్చని హెచ్చరించింది. ఉనా, బిలాస్‌పుర్, హమిర్పుర్, చంబా, శిమ్లా, కుల్లు జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. చాలా చోట్ల కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉందన్నారు. బలహీనమైన నిర్మాణాల్లో ప్రజలను ఉండొద్దని హెచ్చరించారు. మరోవైపు.. సహాయక చర్యల్లో ఐటీబీపీ దళాలు పాల్గొంటున్నాయి. Himachal is in destruction again.Lives lost, homes destroyed, bridges collapsed.Pray for Himachal—and repost to urge the government to take immediate action. pic.twitter.com/DT8UAZpkba— Go Himachal (@GoHimachal_) July 4, 2025जिला ऊना के त्यूडी गांव में एक बारिश से पैदा हुए हालात।।खड्ड का रुख गांव की तरफ गांव जलमग्न।मानव निर्मित आपदा।#Una #himachalfloods #HimachalPradesh pic.twitter.com/MUbHPdDKcF— Gems of Himachal (@GemsHimachal) July 6, 2025🚨HEAVY RAINS TRIGGER CLOUD BURSTS AND FLOODING IN HIMACHAL PRADESH, INDIA.Cloud bursts in Karsog area, Mandi, cause 1 death and 7 missing.Vehicles swept away and 16 MW power project destroyed.Beas River floods intensifySchools and colleges closed; statewide alert active pic.twitter.com/ucXSbYhviD— Weather Monitor (@WeatherMonitors) July 1, 2025 -
విపత్తు మిగిల్చిన విషాదం..! పాపం అనాథగా ఆ చిట్టితల్లి..
ప్రకృతి వైపరిత్యాలు ఎవ్వరికి ఎలాంటి విషాదాన్ని ఇస్తుందో చెప్పలేం. అమాంతం ఉప్పెనలా విరుచుకపడే ఆ విలయం మిగిల్చే బాధ మాటలకందనిది. అందుకు సంబంధించి ఎన్నో ఉదంతాలను చూశాం. అలానే ఇటీవల కురిసిన భారీ వర్షాలు హిమచల్ ప్రదేశాన్ని ఎంతలా అతలా కుతలం చేశాయో తెలిసిందే. అయితే దాని కారణంగా అనాథగా మారిన ఓ చిట్టితల్లి ఉదంతం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఆ చిన్నారి ఎలా బతికి బట్టగట్టకలిగిందంటే..అసలేం జరిగిందంటే..ఎడతెరపిలేని వర్షాలకు వరదలు సంభవించి హిమచల్‌ప్రదేశ్ అతలాకుతలమైన సంగతి తెలిసింది. ఈ ప్రకృతి వైరిత్యం కారణంగా భారీగా ఆస్తి, జన నష్టం జరిగింది. అయితే ఈ దుర్ఘటనలో హిమచల్ ప్రదేశ్‌లోని సిరాజ్ అనే ప్రాంతంలో ఓ కుటుంబం మొత్తం ఈ విపత్తుకు బలైపోయింది. ఆ కుటుంబానికి చెందిన 11 నెలల కూతురు ఒక్కత్తే బతికి బట్టగట్టగలిగింది. ఈ విపత్తు కారణంగా ఒరిగిపోయిన చెట్లు, భవనాల శిథిలాలను తొలగిస్తున్న రెస్క్యూ సిబ్బందికి ఆ చిన్నారి లభించడం విశేషం. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వచ్చిన వరదలకు ఆ చిన్నారి ఇల్లు తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఘటనలో ఆమె తల్లి, తండ్రి, నానమ్మ చనిపోగా, ఆ చిన్నారి ఒక్కత్తే అనాథగా మిగిలిపోయింది. ఇవేమి ఆ చిన్నారికి తెలియక అమాయకంగా అందరిని చూస్తున్న తీరు అందరిని కలచివేస్తోంది. శిథిలంగా మారిన ఆ ఇల్లు పర్వాడ గ్రామానికి చెందని రమేష్ ఇల్లుగా గుర్తించారు. ఆ ఇల్లు డ్రెయిన్ సమీపంలో ఉండటంతో, జూన్ 30న కురిసిన వర్షాలకు నీటి ఉద్ధృతి ఎక్కువై కొట్టుకుపోయింది. అయితే దీనిని ముందుగానే గమనించి రమేష్ కూతురిని ఇంటిలోపల పడుకోబెట్టి, తన భార్య తల్లితో కలిసి ఇంటి వెనకకు వెళ్లాడు. అంతే ఆ వరద ప్రవాహంలో ముగ్గురు కొట్టుకుపోయారు. ఐతే చిన్నారి ఇంటిలోనే ఉండటంతో సురక్షితంగా శిథిలాల కింద బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ ఉందని చెబుతున్నారు అధికారులు. ఆ చిన్నారి పేరు నిఖితగా గుర్తించారు. అయితే రెస్క్యూ సిబ్బంది ఆ చిన్నారి తండ్రి మృతదేహాన్ని వెలికితీశారు కానీ తల్లి, భార్య మృతదేహాలు మాత్రం కానరాలేదు. అందుకోసం ముమ్మరంగా గాలించేందుకు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగినట్లు వెల్లడించారు అధికారులు. ప్రస్తుతం ఆ చిన్నారి మేనత్త తారాదేవి సంరక్షణలో ఉన్నట్లు తెలిపారు. ఈ హృదయవిదారక ఘటన గురించి నెట్టింట వైరల్ అవ్వడంతో ఆ చిన్నారిని దత్తత తీసుకుంటామంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున అభ్యర్థనలు రావడం విశేషం. విత్తుల సహాయ నిర్వహాణ అధికారి స్మృతికా నేగి ఆ చిన్నారి నికితా బాధ్యతను తాను తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఆ చిన్నారి తన మేనత్త పర్యవేక్షణలో ఉందని తెలిపారు. కాగా, ఈ హిమచల్‌ప్రదేశ్ వర్ష బీభత్సానికి సుమారు 700 కోట్ల మేర ఆస్తి నష్టం తోపాటు 69 మంది దాక మృత్యువాత పడ్డారు.(చదవండి: Droupadi Murmu: వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పాఠాలు..! రోజు ఎలా మొదలవుతుందంటే...) -
అలా తప్పించుకున్నారు!
టిబెట్ ఆధ్యాత్మిక గురువు, 14వ దలైలామా రేపు 90వ ఏట అడుగుపెట్టనున్నారు. ఆయన 66 ఏళ్లుగా భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. 23 ఏళ్ల వయసులో భారత్‌లో అడుగుపెట్టిన ఆయన మరిక తిరిగి టిబెట్ వెళ్లనే లేదు. టిబెటన్లు బుద్ధుని అంశగా భావించి ఆరాధించే దలైలామా భారత్‌కు ఎందుకు వచ్చారు? బుల్లెట్లను, ద్రోహాన్ని తప్పించుకుని ఒక యువ టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు మనద ఏశానికి ఎలా చేరుకున్నారు? గడ్డకట్టుకుపోయే వాతావరణంలో, కఠినమైన దారుల్లో రెండు వారాలు ఎలా ప్రయాణించారు? ఇది టిబెట్ రాజకీయ కల్లోలాన్ని తెలిపే కథ. అది 1950ల చివరి కాలం. చైనా ఆక్రమణలతో టిబెట్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. 1951లో బలవంతంగా సంతకం చేయించిన పదిహేడు పాయింట్ల ఒప్పందం, చైనా నియంత్రణలో ఉన్న టిబెటన్ ప్రజలకు మతపరమైన స్వయంప్రతిపత్తిని హామీగా ఇచ్చింది. కానీ స్వయంప్రతిపత్తి ఒక భ్రమ అని త్వరలోనే తెలిసొచ్చింది. 13వ దలైలామా ముందే చెప్పినట్టుగా టిబెట్పైనే కాదు, వారి మతంపైనా దాడి జరిగింది. చైనా సైనికులు టిబెట్ రాజధాని లాసాలో స్వేచ్ఛగా తిరుగడం, బౌద్ధ సన్యాసుల భూములను స్వా«దీనం చేసుకోవడంతో దలైలామా అధికారం క్షీణించడం ప్రారంభమైంది. రాజీ కోసం దలైలామా మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయతి్నంచినా లాభం లేకపోయింది. 1959 నాటికి, ప్రతిఘటనలు నిరసనగా మారాయి. తమ ఆధ్యాత్మిక గురువును నిర్బంధిస్తారని, లేదంటే చంపుతారని టిబెట్ ప్రజలు భయపడ్డారు. ఊహించనట్టుగానే లాసాను చైనా సైనిక దళాలు, ట్యాంకులు, ఫిరంగులు చుట్టుముట్టాయి. అదే రోజు, లాసాలో దలైలామాను అంగరక్షకులు లేకుండా వారి సైనిక ప్రధాన కార్యాలయంలో జరిగే నృత్య ప్రదర్శనకు హాజరు కావాలని చైనా జనరల్ కోరాడు. వేలాది మంది టిబెటన్లు వీధుల్లోకి వచ్చి, దలైలామా వేసవి రాజభవనమైన లాసాలోని నార్బులింగకా చుట్టూ మానవహారంంగా ఏర్పడ్డారు. రాజభవనంలో చర్చల తరువాత ఆ రాత్రి దలైలామా లాసాను విడిచి భారత్‌కు వెళ్లాలని నిర్ణయమైంది. మార్చి 17న పొగమంచు కమ్ముకున్న రాత్రి, ఎప్పుడూ మెరూన్ కలర్ దుస్తుల్లో ఉండే దలైలామా తనను ఎవరూ గుర్తు పట్టకుండా సైనికుడి యూనిఫాం ధరించారు. తల్లి, తోబుట్టువులు, ట్యూటరు, కొందరు విశ్వాసపాత్రులైన అధికారులు వెంట రాగా చీకటి నడుమ వెనుకద్వారం నుంచి రాజభవనాన్ని వీడారు. ౖచైనా సైన్యం చెక్‌పోస్టులను తప్పించుకుంటూ వారి బృందం ముందుకు నడిచింది. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ఎక్కువగా రాత్రిపూటే ప్రయాణించింది. చుషుల్, లోకా, కైచు లోయ గుండా, ఖెంజిమనే సమీపంలోని హిమాలయాలను దాటి, నేటి అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌కు చేరుకుంది. గడ్డకట్టుకుపోయే వాతావరణం. ఆహారం లేదు. పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. అయినా కెచు నది దాటి, ఎత్తైన లోయల గుండా, మఠాలు, తిరుగుబాటు శిబిరాల గుండా ముందుకు సాగారు. ఒకసారి చైనీస్ నిఘా విమానం వీరిపైనుంచే వెళ్లింది. కానీ దాన్నుంచి తప్పించుకున్నారు. ఎట్టకేలకు మార్చి 26న భారత సరిహద్దుకు మైళ్ల దూరంలో ఉన్న లుంట్సే జోంగ్కు చేరుకుంది. వెంటనే ప్రధాని నెహ్రూకు సమాచారం అందింది. అప్పటికే చైనా నుంచి హెచ్చరికలున్నప్పటికీ ఖాతరు చేయకుండా నెహ్రూ నిర్ణయాత్మకంగా వ్యవహరించారు. తవాంగ్ సమీపంలోని చుటాంగ్ము సరిహద్దు పోస్టుకు వెళ్లి, దలైలామా, ఇతర టిబెటన్ శరణార్థులకు స్వాగతం పలకాల్సిందిగా అస్సాం రైఫిల్స్‌ను ఆదేశించారు. మార్చి 31 నాటికి, దలైలామా, ఆయన పరివారం ఖెన్జిమనే పాస్ ద్వారా భారత్‌లోకి ప్రవేశించారు. భారత్, చైనాలను విడదీసే అంతర్జాతీయ సరిహద్దు మెక్‌మోహాన్ రేఖ సమీపంలో ఒక చిన్న పోస్ట్ వద్ద అస్సాం రైఫిల్స్‌కు చెందిన భారత జవాను హవల్దార్ నరేన్ చంద్ర దాస్ కంటికి అలసిపోయి, నలిగిన దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తి సమీపించడం కనిపించింది. ఆయనే 14వ దలైలామా అని ఆయనకే కాదు.. చాలామంది భారతీయులకు తెలియదు. అలా దలైలామా భారత్‌లో అడుగు పెట్టారు. ఆ వెంటనే, ‘టిబెటన్ ఆధ్యాత్మిక నాయకునికి భారత్‌లో ఉండేందుకు స్వాగతం’అంటూ నెహ్రూ నుంచి సందేశం వచ్చింది. దాస్‌తో పాటు ఇతర అస్సాం రైఫిల్స్ సిబ్బంది దలైలామా, ఆయన పరివారాన్ని తవాంగ్‌కు తీసుకెళ్లారు. అక్కడ వారికి వైద్యం అందించారు. తరువాత కొన్ని నెలలు ఆయన ముస్సోరీలో ఉన్నారు. అనంతరం హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలకు వెళ్లారు. అప్పటినుంచీ అదే టిబెటన్ల ప్రవాస ప్రభుత్వ కేంద్రంగా మారింది. స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నా దలైలామా సాహసోపేత భారత యాత్రకు ఆరు దశాబ్దాలు నిండాయి. ‘నేను శరణార్థిని. అయినా భారత్‌లో స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నాను’అని దలైలామా అనేక సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు. అంతేకాదు, భారత్‌లో తనకు స్వాగతం పలికిన హవల్దార్ నరేన్ చంద్ర దాస్‌ను 2017లో కలిసి భావోద్వేగానికి లోనయ్యారు కూడా! అప్పటికి దాస్‌కు 79 ఏళ్లు కాగా దలైలామాకు 81 ఏళ్లు. ‘‘నేను కూడా వృద్ధుడిని అయ్యానని మీ ముఖం చూస్తుంటే నాకర్థమైంది. 58 ఏళ్ల కిందట నాకు భారత్‌లో రక్షణగా నిలిచినందుకు ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది’’అంటూ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. దలైలామాను అనుసరించి చాలామంది టిబెట్‌ను విడిచి భారత్‌కు చేరారు. కానీ టిబెట్ సమస్యకు ఇప్పటికీ పరిష్కారం లభించలేదు. 60 ఏళ్లకిందట ౖసైనికుడి వేషంలో దలైలామా భారత్‌లో అడుగుపెట్టినప్పుడు టిబెట్ పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. లక్షలాది మంది టిబెటన్ల రాజకీయ, మత, సాంస్కృతికి జీవితాలపై ఇప్పటికీ కత్తి వేలాడుతూనే ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హిమాచల్‌లో వర్షాలతో నష్టం
న్యూఢిల్లీ: గడిచిన రెండు వారాలుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో హిమాచల్ ప్రదేశ్‌లో తీవ్ర నష్టం సంభవించింది. వర్షాలకు సంబంధించిన ఘటనల్లో 43 మంది మృతి చెందగా 37 మంది కనిపించకుండా పోయారు. ఒక్క మండి జిల్లాలోనే 17 మంది చనిపోగా, 31 మంది గల్లంతయ్యారు. జూన్ 20వ తేదీ నుంచి హిమాచల్‌లో కురుస్తున్న వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల కారణంగా రాష్ట్రంలో రూ.5 వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది. వచ్చే మంగళవారం వరకు వర్షాల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్‌లోని భిమ్‌టల్‌లో గురువారం ఉప్పొంగుతున్న జలాశయంలో మునిగి నేవీకి చెందిన ఇద్దరు సిబ్బంది చనిపోయారు. పఠాన్ కోట్కు చెందిన ప్రిన్స్ యాదవ్(22), బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన సాహిల్ కుమార్(23)గా వీరిని గుర్తించారు. నైనిటాల్ నుంచి సరదాగా గడిపేందుకు వచ్చిన 8 మంది ఐఏఎఫ్ సిబ్బందిలో వీరున్నారు. వర్షాల కారణంగా రాష్ట్రంలోని 100కు పైగా రహదారులను మూసివేశారు. చార్ధామ్ యాత్రకు అంతరాయం కలిగింది. యమునోత్రికి వెళ్లే జాతీయ రహదారిపై ఐదు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియలు విరిగిపడి ఈ రహదారిపైనున్న సిలాయి మలుపు వద్ద 12 మీటర్ల రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో, 9 మంది నిర్మాణ కార్మికులు కొట్టుకుపోయారు. వీరి కోసం గాలింపు కొనసాగుతోంది. మరోవైపు, ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. మండ్లా, సియోని, బాలాఘాట్ జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. జబల్పూర్–మండ్లా జిల్లాలను కలిపే జాతీయ రహదారిపై కొండచరియలు విరిగి పడటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అదేవిధంగా, రాజస్తాన్‌లోని జైసల్మీర్ జిల్లా పొఖ్రాన్‌లో 128 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలోనూ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. -
హిమాచల్‌పై వరుణుడి పంజా.. 63 మరణాలు, 400 కోట్ల నష్టం
సిమ్లా: ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అయ్యింది. కుండపోత వర్షంతో హిమాచల్‌లో ఆకస్మిక వరదలు సంభవించాయి. రాష్ట్రంలోని బియాస్ నది సహా ప్రధాన నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటికి 63 మంది చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. రూ.400 కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. జూలై ఏడో తేదీ వరకు వర్షాలు కొనసాగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ, ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.హిల్‌స్టేట్ హిమాచల్ ప్రదేశ్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. కార్లు కొట్టుకుపోయాయి. ఈ వర్షాలకు మండి జిల్లా తీవ్ర విధ్వంసానికి గురైంది. భారీ వర్షాలు, వరదలకు దాదాపు 400కుపైగా రోడ్లను అధికారులు మూసివేశారు. అనేక మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వర్షాల కారణంగా ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 63కి పెరిగింది. మరో 40 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. అనేక మంది గాయపడ్డారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. రూ.400 కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు.VIDEO | Himachal Pradesh: Flash flood triggered by cloudburst causes severe damage in Thunag tehsil of Mandi district. Several houses damaged.#HimachalCloudburst #HimachalNews(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/XjM8R2jJHA— Press Trust of India (@PTI_News) July 4, 2025 शिमला : ढली के लिंडीधार में भारी लैंडस्लाइड - फोरलेन का डंगा गिरा - सैंकड़ों सेब के पेड़ दबे।घर छोड़ भागे लोग, 5 घरों को खतरा।#Shimla #Dhali #Landslide #HimachalNews #DDNewsHimachal pic.twitter.com/dKaekscobU— DD News Himachal (@DDNewsHimachal) July 3, 2025మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. జూలై 5న సిమ్లా, సోలన్, సిర్మౌర్, జూలై 6న ఉనా, బిలాస్పూర్, హమీర్పూర్, కాంగ్రా, చంబా, మండి జిల్లాలకు వర్ష సూచన చేసింది. ఈ మేరకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఇప్పటికే వర్షప్రభావం ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఐఎండీ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షితం ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.Whoahh, that was close!!A massive landslide hit the Shillai area of Sirmaur district, Himachal Pradesh, India today, along National Highway 707 👀pic.twitter.com/nVvfZWty90— Volcaholic 🌋 (@volcaholic1) May 30, 2025Big houses, rocks all got washed away in the flood but "Pandav Shila" in Himachal Pradesh did not move from the place where it was, this is no less than a miracle. pic.twitter.com/pnhWE9Rp3I— Frontalforce 🇮🇳 (@FrontalForce) July 4, 2025🚨HEAVY RAINS TRIGGER CLOUD BURSTS AND FLOODING IN HIMACHAL PRADESH, INDIA.Cloud bursts in Karsog area, Mandi, cause 1 death and 7 missing.Vehicles swept away and 16 MW power project destroyed.Beas River floods intensifySchools and colleges closed; statewide alert active pic.twitter.com/ucXSbYhviD— Weather Monitor (@WeatherMonitors) July 1, 2025 -
250 రోడ్లు మూసివేత.. 130 చోట్ల కరెంట్ కట్
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. దాదాపు రాష్ట్రమంతటా మంచినీటి సరఫరా నిలిచిపోయింది. కనీసం 130 ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. వరద చేరడం, ధ్వంసం కావడం వంటి కారణాలతో 250 రోడ్లను అధికారులు మూసివేశారు. ఇందులో అత్యధికంగా సిర్మౌర్ జిల్లాలో 57, మండి జిల్లాలో 44 రోడ్లున్నాయి. రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడే అవకాశమున్న 22 ప్రాంతాలకుగాను 18 చోట్ల ప్రమాద హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. కంగ్రా, మండి, సిర్మౌర్, సొలాన్ జిల్లాల్లో సోమవారం స్కూళ్లను మూసివేశారు. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. పర్యాటక ప్రాధాన్యమున్న సిమ్లా–కల్కా రైలు మార్గంపైన చేరిన రాళ్లు, చెట్లను తొలగించే రాకపోకలకు వీలు కల్పించారు. గత 24 గంటల్లో చనిపోయిన ముగ్గురితో కలిపి ఈ సీజన్లో వర్షాల సంబంధిత ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 20కి చేరిందని అధికారులు తెలిపారు. సిమ్లా–కల్కా ఐదో నంబర్ జాతీయ రహదారిపై కోటి సమీపంలో కొండచరియలు విరిగి పడటంతో గంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి. -
హిమాచల్ వరదల్లో నలుగురి మృతి
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో సంభవించిన ఆకస్మిక వరదల్లో నలుగురు చనిపోగా సుమారు 20 మంది గల్లంతయ్యారు. కంగ్రా, కులూ జిల్లాల్లో బుధవారం సాయంత్రం కురిసిన కుంభవృష్టి కారణంగా ఒక్కసారిగా వరదలు వచ్చాయి. ఇందిరా ప్రియదర్శిని జల విద్యుత్ ప్రాజెక్టు పనులు చేస్తున్న కార్మికుల కోసం ఆ సమీపంలోనే తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేశారు. ఆకస్మిక వరదల్లో కార్మికుల శిబిరాలు కొట్టుకుపోయాయి. నలుగురు చనిపోగా మరో 15 మందికిపైగా గల్లంతై ఉంటారని స్థానిక అధికారులు తెలిపారు. గల్లంతైన వారిలో హిమాచల్ ప్రదేశ్‌తోపాటు యూపీకి చెందిన వారున్నారు. కొందరిని రక్షించామని అధికారులు చెబుతున్నప్పటికీ ఎందరనే విషయంలో స్పష్టత లేదు. -
స్కూటీకి రూ. లక్ష... నంబర్‌కు రూ.14 లక్షలు
సిమ్లా: బైక్ లేదా కారు.. వాహనం ఏది కొ న్నా, రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు ఫ్యాన్సీ నెంబర్ కావాలని కోరుకుంటాం. ఏదైతే ఏముందిలే? అని కొందరనుకుంటే.. ఇష్టమైన నంబర్ కోసం ఎంతైనా ఖర్చు చేయాలనుకుంటారు మరికొందరు. ఈ కోవలోకే వస్తాడు హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఈ వ్యక్తి. లక్ష రూపాయలు పెట్టి కొన్న స్కూటీకి వీఐపీ నంబర్ హెచ్‌పీ21సీ–0001 కోసం ఏకంగా రూ.14 లక్షలు చెల్లించాడు. ఆ నంబర్ కోసం వేలంలో ఇద్దరే పాల్గొనడం గమనార్హం. సోలన్ జిల్లాలోని బడ్డీకి చెందిన ఓ వ్యక్తి రూ.13.5 లక్షలు పాడగా.. హమీర్‌పూర్‌కు చెందిన సంజీవ్ కుమార్ అతని కంటే ఎక్కువగా రూ.14 లక్షలకు ఆ నంబర్‌ను కైవసం చేసుకున్నాడు. రాష్ట్రంలో అత్యంత ఖరీదైన బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ కూడా ఇదే. తనకు ప్రత్యేకమైన నంబర్లను సేకరించడం ఇష్టమని చెప్పే సంజీవ్ కుమార్.. ఫ్యాషన్ ముందు డబ్బులు లెక్క కాదంటున్నాడు. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవడం తప్పదని చెబుతున్నాడు. -
Himachal Pradesh: లోయలో పడిన బస్సు
-
Himachal: 200 అడుగుల లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి
మండి: హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో ఈరోజు(మంగళవారం) ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో నిండిన బస్సు అదుపుతప్పి 200 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. బాధితులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్నవారిని వెలికి తీసుకువచ్చి, అంబులెన్స్‌లలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఇద్దరు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. #WATCH | Himachal Pradesh: 17 people injured when their bus fell into a gorge in Patrighat of Mandi district. Rescue and relief operations underway. The injured are being rushed to a hospital. The bus was going from Jahu to Mandi. (Video: District Administration Mandi, Himachal… pic.twitter.com/Gl2SL6cpTi— ANI (@ANI) June 17, 2025తీవ్రంగా గాయపడిన వారిని మండి ఆస్పత్రికి తరలించారు. భారీ వర్షం కారణంగా బస్సు అదుపుతప్పి లోయిలో పడిపోయింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. మండి జిల్లాలో ఒక ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైందని డీఎస్పీ సర్కాఘాట్ సంజీవ్ గౌతమ్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 30 మంది ఉన్నారు. ఇది బస్సు సీటింగ్ సామర్థ్యం కంటే అధికం. డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి కారణంకావచ్చని పోలీసులు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: ఆరు వారాల్లో ఐదు హెలికాప్టర్ ప్రమాదాలు.. ఏం జరుగుతోంది? -
హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం
-
చూపు లేకున్నా.. ఎవరెస్ట్‌పై కాలు మోపింది!
సిమ్లా: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే సంకల్పాన్ని సాకారం చేసుకునేందుకు అంధత్వ సైతం అడ్డంకి కాదని నిరూపించిందీ ధీర. హిమాచల్ ప్రదేశ్‌లోని మారుమూల పల్లెకు చెందిన గిరిజన మహిళ ఛోంజిన్ అంగ్మో త్రివర్ణ పతాకాన్ని ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరంపై రెపరెపలాడించారు. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయ మహిళగా, ప్రపంచంలోనే ఐదో వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. హెలెన్ కెల్లర్నే ఆదర్శంగా తీసుకున్న అంగ్మో..చూపున్నా దార్శనికత లేకపోవడం అంధత్వం కంటే ఘోరమైన విషయమని చెబుతున్నారు..! ఇండో–టిబెటన్ సరిహద్దులకు సమీపంలోని మారుమూల చంగో గ్రామంలో జని్మంచిన అంగ్మో ఎనిమిదేళ్ల వయస్సప్పుడు చూపు పూర్తిగా కోల్పోయారు. అయినప్పటికీ చదువు ఆపలేదు. పట్టుదలతో ఢిల్లీ వర్సిటీ పరిధిలోని మిరాండా హౌస్‌లో డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. ఢిల్లీలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కస్టమర్ సరీ్వస్ అసోసియేట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గర్వించిన పుట్టిన ఊరు అంగ్మో తండ్రి అమర్ చంద్ ఏమంటున్నారంటే..‘నా కుమార్తె సాధించిన ఘనతను చూసి నాకు ఆనందంగాను, గర్వంగాను ఉంది. ఎవరెస్ట్‌పై విజయం సాధించిన ఆమె రాక కోసం ఎదురుచూస్తున్నా’అని తెలిపారు. అంగ్మో సాధించిన రికార్డుతో ఆ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్ననాటి నుంచే అంగ్మో ఎంతో ధైర్యవంతురాలు, పట్టుదల కలిగిన వ్యక్తి అని బంధువు యమ్చిన్ తెలిపారు. జీవితంలో ఎన్ని ఎదురుపోట్లు ఎదురైనా వెరువక ప్రతి సవాల్‌ను ఒక అవకాశంగా మల్చుకున్నారు అంగ్మో. ‘నా కథ ఇప్పుడే మొదలైంది. అంధత్వం నా బలహీనత కాదు, బలం’అని చెప్పారు. ‘ఎత్తయిన శిఖరాలను అధిరోహించడం నా చిన్ననాటి కల. ఈ విషయంలో ఆర్థికపరమైన అవరోధాలను అధిగమించాను. మిగతా శిఖరాలను సైతం అధిరోహించాలని ఇప్పుడు లక్ష్యంగా పెట్టుకున్నాను’అని వివరించారు.కల సాకారమైందిలా.. చిన్ననాటి కలను సాకారం చేసుకునేందుకు 2016లో బేసిక్ మౌంటెయినీరింగ్ కోర్సు పూర్తి చేసి, ఉత్తమ ట్రెయినీగా నిలిచారు అంగ్మో. 2018లో ఈమె 5,486 మీటర్ల ఎత్తులో ప్రపంచంలోనే ఎత్తయిన మనాలి– ఖర్దుంగ్ లా రోడ్డులో అతిశీతల పరిస్థితుల్లో పది రోజులపాటు సైక్లింగ్ చేశారు. 2019లో ఆరు రోజులపాటు మూడు రాష్ట్రాల్లోని నీలగిరి కొండల్లో సైక్లింగ్ చేశారు. గతేడాది జూలైలో మనాలి నుంచి కాల్పా వరకు ఏడు రోజులపాటు సైక్లింగ్ సాగించారు. 2021లో సియాచిన్ గ్లేసియర్‌ను చేరుకున్న దివ్యాంగుల బృందంలో ఏకైక అంధురాలుగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు. సుమారు 5,634 మీటర్ల ఎత్తయిన ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ వరకు అధిరోహించిన మొట్టమొదటి అంధురాలైన భారతీయ మహిళగా అంగ్మో 2024 అక్టోబర్‌లో రికార్డు సాధించారు. అనంతరం, లద్దాఖ్‌లోని 6,250 మీటర్ల ఎత్తయిన కాంగ్ యాట్సే2 శిఖరాన్ని ఎక్కారు. దివ్యాంగ్ అధిరోహణ బృందంలో సభ్యురాలిగా 6 వేల మీటర్ల ఎత్తయిన మరో శిఖరంపై త్రివర్ణ పతాకం ఎగరేశారు. ఆటల్లోనూ ప్రావీణ్యం చూపే అంగ్మో స్విమ్మింగ్‌లో రాష్ట్ర స్థాయిలో బంగారు పతకం, జుడోలో జాతీయ స్థాయి చాంపియన్ షిప్, జాతీయ మారథాన్లలో రెండు రజత పతకాలు సాధించారు. జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో సైతం పాల్గొన్నారు. అంగ్మో సాధించిన విజయాలను ప్రధాని మోదీ ‘మన్‌కీ బాత్’లో కూడా ప్రస్తావించడం విశేషం. గతేడాది రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా సర్వశ్రేష్ఠ దివ్యాంగ్జన్ జాతీయ అవార్డును అందుకున్నారు. -
పట్టుబడ్డ హైటెక్ కాపీయింగ్
సిమ్లా: మోసగాళ్ల అతి తెలివితేటలు మామూలుగా లేవు. హిమాచల్ ప్రదేశ్‌లో జరిగే ఉద్యోగ ఎంపిక పరీక్షలకు 2,600 కిలోమీటర్ల దూరంలోని హరియాణా నుంచి సమాధానాలందించే ముఠా గుట్టు రట్టయింది. పరీక్ష రాసే అభ్యర్థులు గుట్టుచప్పుడు కాకుండా అమర్చుకున్న ఎల్రక్టానిక్ పరికరాలతో హరియాణాలోని జింద్‌లోని ముఠా జవాబులు అందించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ రాకెట్‌ను ఛేదించేందుకు ముమ్మరంగా దర్యాప్తు సాగిస్తున్నారు. ఏం జరిగిందంటే.. అరుణాచల్‌లోని నవోదయ విద్యాలయ సమితిలోని బోధనేతర పోస్టుల భర్తీకి సీబీఎస్ఈ ఈ నెల 18న ఎంపిక పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు ఇటానగర్‌లోని వీకేవీ చింపు, కింగ్‌కప్ పబ్లిక్ స్కూల్ కేంద్రాల్లో ఆ రోజు సాయంత్రం ల్యాబ్ అటెండెంట్ పరీక్ష జరిగింది. కింగ్‌కప్ పబ్లిక్ స్కూల్లో పరీక్ష రాసే ఓ అభ్యర్థి తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు, పోలీసులు సోదాలు చేపట్టారు. తనిఖీల్లో ఆ విద్యార్థి వద్ద ఓ చిన్న ఎల్రక్టానిక్ పరికరం, అతి చిన్న మైక్రోఫోన్ దొరికాయి. ఈ పరీక్ష కేంద్రంలో సరిగ్గా ఇలాంటి ఉపకరణాలనే ధరించిన మొత్తం 23 మంది విద్యార్థులను పట్టుకున్నారు. వివేకానంద కేంద్ర విద్యాలయంలో మరో విద్యార్థి పట్టుబడ్డాడు. ఇలాంటి సోదాల్లో మిగతా వాళ్లు బయటపడ్డారని అధికారులు తెలిపారు. ఆరా తీయగా ఉదయం పరీక్ష రాసిన వారివద్ద కూడా ఇలాంటి ఉపకరణాలున్నట్లు తేలింది. దీంతో, వారిని కూడా పట్టుకున్నామని ఎస్పీ రోహిత్ రాజ్బీర్ సింగ్ తెలిపారు. వీరందరినీ సమీప హోటళ్లు, ఇళ్లలోనే అరెస్ట్ చేశామన్నారు. ‘ఎలక్ట్రానిక్ డివైజెస్‌తో మోసపూరితంగా పరీక్ష రాస్తున్న మొత్తం 53 మందిని అదుపులోకి తీసుకుని, 29 డివైజెస్‌ను స్వాదీనం చేసుకున్నాం వీరిలో చాలా మంది నేరాన్ని అంగీకరించారు’అని ఎస్పీ వివరించారు. ‘పరీక్ష రాసేందుకు సాయం చేస్తామంటూ ఓ ముఠా తమను నమ్మించిందని వీరు చెప్పారు. నిఘా నుంచి తప్పించుకునేందుకు ఎగ్జామ్ హాల్స్‌లో మారుమూల ప్రాంతాల్లో కూర్చోవాలని సూచనలు ఇచ్చారు. ఈ మేరకు ఎల్రక్టానిక్ పరికరాలను ఉపయోగించే తీరుపై వీరందరికీ ముఠా శిక్షణ ఇచ్చింది’అని ఎస్పీ తెలిపారు. దీని ప్రకారం అభ్యర్థులు ఎలక్ట్రానిక్ డివైజ్‌ను అండర్ వేర్లో దాచుకున్నారు. అతిచిన్న ఇయర్ ఫోన్‌ను బయటకు కనిపించని రీతిలో చెవి లోపల అమర్చారు. ముందుగా వీరు తమకందించిన క్వశ్చన్ పేపర్ సెట్ పేరు ఏ, బీ, సీ, డీల్‌లో ఏదో అవతలి వారికి చెప్పాలి. అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే వరకు ఎదురు చూడాలి. దగ్గితే సమాధానం అడిగినట్లు అర్ధం. అప్పుడు అవతలి వ్యక్తి సమాధానం చెప్తాడు’అని ఎస్పీ రాకెట్ వివరాలను వెల్లడించారు. మొత్తమ్మీద పరీక్ష పత్రం కూడా లీకై ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. డెహ్రాడూన్, సిక్కిం, దిమాపూర్‌ల్లోని పరీక్ష కేంద్రాల్లోనూ ఇలాంటి మతలబే జరిగినట్లు గుర్తించామన్నారు. ముమ్మరంగా దర్యాప్తు జరుగుతోందని వివరించారు. పట్టుబడిన 53 మందిపై భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. వీరికి సాయం అందించిన వారిని, ముఠా సూత్రధారిని కనుక్కునేందుకు హరియాణా పోలీసుల సాయం కోరామని వివరించారు. -
సేంద్రియ సాగులో హిమాచల్ నమూనా
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ఒక ట్రెండ్ సెట్టర్. నేను రాజ కీయాల గురించి మాట్లాడటం లేదు. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు గీటు రాయి లాంటి ధరల వ్యవస్థను రూపొందించడంలో ఆయన చేపట్టిన మార్గదర్శక పాత్రను ప్రస్తావిస్తున్నాను. రసాయన వ్యవసాయం నుండి స్థిరమైన, ఆరోగ్యకరమైన పర్యావరణ అనుకూల వ్యవసాయ వ్యవస్థల వైవు పరి వర్తన చెందడానికి ఇది కచ్చితమైన మార్గం.2022 డిసెంబర్లో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్య తలు స్వీకరించినప్పటి నుండి, పర్వత ప్రాంతంలో సేంద్రియ వ్యవ సాయాన్ని ప్రోత్సహించడానికి సుఖు చేసిన ప్రయత్నాలను నేను ఆసక్తితో అనుసరించాను. పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే, సేంద్రియ ఆవు, గేదె పాలకు రూ. 45, రూ. 55 చొప్పున సేకరణ ధర పెట్టారు. ఇది మంచి ప్రారంభం. ఇటీవలి బడ్జెట్లో ఆ ధరలను లీటరుకు మరో ఆరు రూపాయలు రెంటికీ పెంచడం హృద్యం గమం. ఆ తర్వాత ఆయన సేంద్రియ మొక్కజొన్న, గోధుమలను సేకరించడానికి కనీస మద్దతు ధరను వరుసగా కిలోకు రూ. 30, కిలోకు రూ. 40 చొప్పున ప్రకటించారు. మళ్లీ వాటిని రూ. 30 నుండి రూ. 40కి, 40 నుండి రూ. 60కి పెంచారు. అదనంగా, గోధుమలను, మొక్కజొన్నలను కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లడానికి కిలోకు రెండు రూపాయల రవాణా రాయితీని ప్రకటించారు.సేంద్రియ సాగుకు ధరే ఊతంపర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను అవలంబించే రైతులకు అధిక ధరలు ప్రకటించడం వల్ల పంట రాబడిలో గణనీ యమైన పెరుగుదలకు వీలు కలుగుతుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, వ్యవసాయాన్ని ఇంటెన్సివ్ వ్యవసాయ పద్ధతుల నుండి పర్యావరణ అనుకూల వ్యవస్థలకు మార్చాలనే ప్రయత్నాలకు ధర ప్రోత్సాహకాలు మరింత ఊతమిస్తాయి. కొన్ని రోజుల క్రితం, సేంద్రియ పసుపు రైతుల కోసం హిమా చల్ ప్రదేశ్ సీఎం ఒక రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను ప్రారంభించారు. సేంద్రియ పసుపునకు కనీస మద్దతు ధర కిలోకు రూ. 90గా నిర్ణయించారు. మార్కెట్ ధర కిలోకు రూ. 25 నుండి రూ. 30 వరకు మాత్రమే ఉంది. ధరలలో గణనీయమైన పెరుగుదల సేంద్రియ పసుపు ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.కోవిడ్–19 మహమ్మారి తర్వాత, ప్రజలు శరీర రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడంలోని ప్రాముఖ్యతను గ్రహించిన తర్వాత, సేంద్రియ పసుపునకు డిమాండ్ పెరిగింది. ముడి పసుపు ప్రాసెసింగ్‌ను రాష్ట్ర సంస్థలు ‘హిమాచల్ హల్దీ’ పేరుతో విక్రయిస్తాయని సుఖు వెల్లడించారు. గతంలో సేంద్రియ మొక్కజొన్న కోసం ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంట్లో భాగంగా తుది ఉత్పత్తులను ఐదు కిలోలు, 120 కిలోల సంచులలో విక్రయిస్తారు.2025–26 నాటికి లక్ష మంది రైతులను సేంద్రియ వ్యవసాయంలోకి తీసుకురావాలనే లక్ష్యం ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం దూకు డుగా ముందుకు సాగకపోవడం నాకు సంతోషం కలిగిస్తోంది. హామీ ఇచ్చిన ధరలను అందించడం, ప్రత్యేక ప్రాసెసింగ్‌ను, మార్కెటింగ్‌ను నిర్ధారించడం ద్వారా ప్రభుత్వ మద్దతుతో నెమ్మదిగానే కానీ స్థిరమైన ప్రయత్నం చేయడం అవసరం. కాగితంపై మాత్రమే మిగిలే అసాధ్య మైన లక్ష్యాలను ప్రకటించడం కంటే ఇది చాలా మంచిది.రాజకీయాలకు అతీతంగా, పర్యావరణ అనుకూల వ్యవసాయ వ్యవస్థల వైపు మళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. సహజ వ్యవసా యంలో నిమగ్నమైన అనేక వ్యవసాయ సమూహాలు ఇప్పటికే సాను కూల ఫలితాలను చూపిస్తున్నప్పటికీ, తక్కువ మార్కెట్ ధరల కార ణంగా ఈ ప్రయత్నం వీగిపోయింది. ఈ తరుణంలో హిమాచల్ ప్రదేశ్ పాటించవలసిన ధరల చట్రాన్ని అందించింది. సేంద్రియ సాగుదారులకు అధిక ఆదాయం రావడానికి తక్కువ ఉత్పత్తి ఖర్చుపై ఆధారపడటానికి బదులుగా, తక్షణ అవసరం ఏమిటంటే అధిక హామీ ధరను అందించడం. అంతే తప్ప తక్కువ సాగు ఖర్చు అవస రమనే వాదన పనిచేయదు. నీతి ఆయోగ్ కూడా సహజ వ్యవసాయ విస్తరణను అభినంది స్తోంది. కానీ సాగుదారులకు ఆకర్షణీయమైన ధర అవసరాన్ని అది విస్మరించింది. అందుకే హిమాచల్ ప్రదేశ్ సీఎం ప్రారంభించిన కార్యక్రమంలో కొత్తదైన సానుకూల ధోరణిని నేను చూస్తున్నాను. మార్కెట్లు సామర్థ్యాన్ని, నాణ్యతను ప్రోత్సహిస్తాయనే తప్పుడు నమ్మకం ఉన్నప్పటికీ, సేంద్రియ రైతులకు సరైన, హామీ ఇవ్వబడిన ధరలను నిర్ణయించడానికి ప్రభుత్వ జోక్యం అవసరం.దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులుఈ–మెయిల్: hunger55@gmail.com -
మేడమ్ కళ్లు పెద్దవి చేసి చూడండి.. కంగనాకు అదిరిపోయే కౌంటర్
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో రాజకీయం వేడెక్కింది. బాలీవుడ్ స్టార్, మండి ఎంపీ కంగనా రనౌత్ ఇంటికి సంబంధించి వచ్చిన కరెంట్ బిల్లు విషయంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ క్రమంలో మంత్రి, విద్యుత్ శాఖ అధికారులు.. కంగనాకు కౌంటరిచ్చారు. కంగనా ఇంటికి వచ్చిన బిల్లు లక్ష కాదని రూ.55 వేలు మాత్రమేనని.. గతంలో చెల్లించని బిల్లుల కారణంగా రూ.91,100 గా పూర్తి బిల్లు వచ్చిందని క్లారిటీ ఇచ్చారు.మండి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక వివాదం ఉండాల్సిందే. తాజాగా తన ఇంటికి లక్ష రూపాయల బిల్లు వచ్చిందంటూ గోల చేసింది కంగనా. తప్పంతా కాంగ్రెస్ ప్రభుత్వానిదే అంటూ మండిపడ్డారు. మనాలీలో ఉన్న మా ఇంటికి ఈ నెల రూ.లక్ష కరెంట్ బిల్లు వచ్చింది. ఈ మధ్యకాలంలో నేను ఆ ఇంట్లో ఉండటం లేదు. దీంతో ఆ బిల్లు చూసి షాకయ్యా. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఇలాంటి పరిస్థితులు సిగ్గుచేటు. అయినప్పటికీ మనందరికీ ఒక అవకాశం ఉంది. నా సోదరీ సోదరులను నేను కోరేది ఒక్కటే. ఇలాంటి సమస్యలపై మనమంతా క్షేత్రస్థాయిలో పనిచేయాలి. దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ తోడేళ్ల చెర నుంచి మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.#WATCH | Shimla, HP | Sandeep Kumar, Managing Director of the Himachal Pradesh State Electricity Board Limited (HPSEBL), says, "BJP MP Kangana Ranaut raised an issue that the electricity board has asked her to pay the electricity bill of Rs 1 lakh of her house. The bill is almost… pic.twitter.com/oBnZPl9OhU— ANI (@ANI) April 10, 2025 దీంతో, రంగంలోని దిగిన విద్యుత్ శాఖ అధికారులు.. బిల్లుపై ఆరా తీశారు. ఎంపీ కంగనా ఆరోపణలపై హిమాచల్ ప్రదేశ్ HPSEBL మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ కుమార్ స్పందించారు. ఈ క్రమంలో కంగనాకు.. 55 వేల రూపాయలు కేవలం ఈ నెల బిల్లు మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. కానీ, ఆమె గతంలో చెల్లించని బిల్లులు కూడా కలిపి రూ.91,100గా పూర్తి బిల్లు వచ్చిందని చెప్పారు. చెల్లింపులు సకాలంలో చేసి ఉంటే ఇంత మొత్తంలో బిల్లు వచ్చేది కాదని స్పష్టం చేశారు. అంతేకాకుండా 28 రోజుల్లోనే ఎంపీ కంగనా రనౌత్ దాదాపు 9 వేల యూనిట్ల విద్యుత్ వినియోగించారని.. అందుకే ఒక్క నెల బిల్లు కూడా రూ.55 వేలు వచ్చిందని అన్ని లెక్కలతో సహా చూపించారు. ఇదే సమయంలో తాము కంగనాకు రూ.700 సబ్సిడీ కూడా ఇచ్చినట్లు తెలిపారు. దీంతో, కంగనాకు బిగ్ షాక్ తగిలింది.మరోవైపు.. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రి విక్రమాదిత్య సింగ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడమ్ కరెంట్ బిల్లులు చెల్లించరు. అంతటితో ఆగకుండా ప్రభుత్వాన్నే నిందిస్తారు. ప్రజావేదికలపై గోల చేస్తారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇప్పటికైనా కళ్లు పెద్దవి చూసి బిల్లును చూడండి అంటూ చురకలు అంటించారు. Mandi, Himachal Pradesh: BJP MP Kangana Ranaut says, "In Himachal Pradesh, the Congress has created such a miserable situation. This month, I received an electricity bill of ₹1 lakh for my house in Manali, where I don’t even stay! Just imagine the condition here..." pic.twitter.com/6AAzvTekrt— IANS (@ians_india) April 8, 2025 -
హిమాచల్ డిప్యూటీ సీఎంకు త్రుటిలో తప్పిన ప్రమాదం
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ముకేశ్ అగ్నిహోత్రి, ఢిల్లీ డీజీపీ ప్రతుల్ వర్మ సహా 30 మంది ప్రయాణికులున్న విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. వీరు ప్రయాణిస్తున్న విమానం జుబ్బర్హట్టి ఎయిర్‌పోర్టులోని రన్‌వేపై ల్యాండవ్వకుండా ముందుకు దూసుకెళ్లింది. పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంతో చిట్టచివరి అంచున ఉన్న స్టడ్స్‌ను ఢీకొట్టి నిలిచిపోయింది. దాదాపు అరగంట తర్వాత ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందికి దించారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. అన్ని తనిఖీల తర్వాతే ఢిల్లీలో విమానం టేకాఫ్ తీసుకుందని చెప్పారు. సిమ్లాకు 15 కిలోమీటర్ల దూరంలో కొండప్రాంతంలో ఉన్న జుబ్బర్హట్టి ఎయిర్ స్ట్రిప్ పొడవు 1,230 మీటర్లు మాత్రమే. పైపెచ్చు ఏటవాలుగా ఉంటుందని చెబుతున్నారు. కాగా, తాజా ఘటనకు దారితీసిన కారణాలపై పౌర విమానయాన శాఖ దర్యాప్తు చేపట్టింది. విమానంలో సాంకేతిక లోపాలపై ఇంజనీరింగ్ సిబ్బంది తనిఖీ చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. -
BFI: హైకోర్టు అనుమతి.. అనురాగ్ ఠాకూర్‌కు లైన్ క్లియర్
సిమ్లా: భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పోటీ పడేందుకు అనుమతించాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 28న ఎన్నికలు జరగనున్నాయి. ఠాకూర్ నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుగా నామినేషన్ల గడువును పొడిగించాలని కూడా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.బీఎఫ్ఐ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర బాక్సింగ్ సంఘం ప్రతినిధిగా పోటీ పడేందుకు ఠాకూర్ సిద్ధం కాగా... బీఎఫ్ఐ అధ్యక్షుడు అజయ్ సింగ్ ఆయనను అనర్హుడిగా ప్రకటించారు.ఆయా రాష్ట్ర సంఘాల్లో ఎన్నికల ద్వారా గెలిచి ఆఫీస్ బేరర్లుగా కొనసాగుతున్న వారికే ఇక్కడా పోటీ పడే అవకాశం ఉంటుందని... ఈ కారణంగా ఠాకూర్ అనర్హుడంటూ రిటర్నింగ్ అధికారి ఈ నెల 7న ఆదేశాలు జారీ చేశారు. దీనిపై బీజేపీ ఎంపీ కోర్టుకెక్కారు. 2008 నుంచి వేర్వేరు హోదాల్లో తాను రాష్ట్ర సంఘంలో పని చేశానని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాదోపవాదాల అనంతరం... బీఎఫ్ఐ ఉత్తర్వులకు చట్టపరంగా ఎలాంటి విలువ లేదని, ఠాకూర్‌ను ఎన్నికలకు అనుమతించాలంటూ హిమాచల్ హైకోర్టు స్పష్టం చేసింది.భారత్ ఖాతాలోనే ‘ఇండియన్ టూర్’ స్క్వాష్ టైటిల్ ఫైనల్లో అనాహత్‌తో ఆకాంక్ష ‘ఢీ’ చెన్నై: స్క్వాష్ రాకెట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఆర్ఎఫ్ఐ) ఇండియన్ టూర్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ టైటిల్ భారత్‌కు ఖరారైంది. భారత్‌కే చెందిన అనాహత్ సింగ్, ఆకాంక్ష సాలుంఖే ఫైనల్‌కు చేరుకోవడంతో ఇది సాధ్యం కానుంది. గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో అనాహత్ 11–6, 11–3, 11–4తో హీలీ వార్డ్ (దక్షిణాఫ్రికా)పై, టాప్ సీడ్ ఆకాంక్ష 11–5, 11–7, 11–7తో భారత్‌కే చెందిన స్టార్ జోష్నా చినప్పపై విజయం సాధించారు. ఫైనల్ శుక్రవారం జరుగుతుంది.క్వార్టర్ ఫైనల్స్‌లో ఆకాంక్ష 11–8, 10–12, 4–11, 11–8, 11–9తో నాదియా ఎల్‌హమి (ఈజిప్ట్)పై, అనాహత్ 11–3, 11–3, 7–11, 11–1తో క్రిస్టినా గోమెజ్ (స్పెయిన్)పై, జోష్నా చినప్ప 11–7, 11–5, 11–4తో సోఫియా మటియోస్ (స్పెయిన్)పై గెలుపొందారు. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కే చెందిన వీర్ చోత్రాని, మెల్విల్ సియానిమనికో (ఫ్రాన్స్) టైటిల్ పోరుకు సిద్ధమయ్యారు. సెమీఫైనల్స్‌లో వీర్ 11–5, 11–7, 12–10తో రవిందు లక్సిరి (శ్రీలంక)పై, మెల్విల్11–7, 11–2, 11–7తో డీగో గొబ్బి (బ్రెజిల్)పై విజయం సాధించారు. -
'గోచీ పండుగ'..ఎందుకోసం నిర్వహిస్తారో తెలిస్తే షాకవ్వుతారు..!
వినడానికి వింతగా; అనడానికి విడ్డూరంగా ఉన్నా.. కనడానికి కన్నులవిందుగా ఉంటుందా వేడుక. పేరులో ‘గోచీ’ ఉండొచ్చు కాని, పండగలో పాల్గొనేవారు మాత్రం నిండుగా సంప్రదాయ వస్త్రధారణతో మెరిసిపోతారు. సంతానోత్పత్తికి సంకేతంగా నిర్వహించే ఈ పర్వదినంలో ఆబాలగోపాలానికి అవకాశం లేదు. పెళ్లిళ్లయిన, పెళ్లీడుకొచ్చిన స్త్రీ పురుషులు మాత్రమే అర్హులు. ఆశ్చర్యంగా అనిపించే ఆ వేడుక పేరే ‘గోచీ’ పండుగ. ఇంతకీ ఉత్సవం ఎక్కడ జరుగుతుంది? ఏమిటా వేడుక విశేషాలు? తెలుసుకోవాలనుందా, అయితే ఇది చదివేయండి. శిశుజననం.. వారికి పండుగదేవభూమిగా భాసిల్లే హిమాచల్ ప్రదేశ్ దేశంలోని అగ్రగామి పర్యాటక ప్రాంతాల్లో ఒకటనడంలో సందేహం లేదు. రాష్ట్రంలో సింహభాగం మైదాన ప్రాంతం కంటే పర్వత శ్రేణుల్లోనే ఉంటుంది. సముద్ర మట్టానికి సగటున 50 మీటర్ల ఎత్తున ఉండే ఆవాసాలే అధికం. ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంత వాసులే! 2016 నాటికి 99.5 శాతం విద్యుద్దీకరణ జరిగిన రాష్ట్రంగా నమోదైంది. అంతేకాదు 2017 సర్వే ప్రకారం అతి తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రంగా ఖ్యాతికెక్కింది. అయితే సంతానోత్పత్తి విషయంలో మాత్రం వెనుకబడింది. 2014కు ముందు రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.9గా ఉండేది. 2015–16 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ఆ రేటు 1.7కు పడిపోయింది. ఇక 2019–21 జాతీయ నివేదిక ఆధారంగా ఆ రేటు మరింత దిగజారి 1.5గా నమోదైంది. ఇక ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఈ రేటు మరింత క్షీణించింది. బహుశా ఈ పరిణామాలే పర్వత శ్రేణుల్లోని లోయల్లో నివసించే గిరిజనులు గోచీ పండగను మరింత ఘనంగా నిర్వహించేందుకు కారణమయ్యాయి. ముఖ్యంగా ఇక్కడి లాహోల, స్పితి జిల్లాల్లోని చంద్, భాగ్ లోయల్లోని గిరిజనులు సంతానప్రాప్తిని అదృష్టంగా భావిస్తారు. అందుకు ప్రతీకగా శిశువు జన్మించిన సందర్భంలో ఊరంతా ఏకమై ఉత్సవం నిర్వహిస్తారు. ఎవరికైతే బిడ్డ పుట్టాడో ఆయా కుటుంబాలు గోచీ ఉత్సవానికి సంకల్పిస్తాయి. ఏటా మాఘ మాసంలో ఈ పండగ జరుపుకొంటారు. స్థానిక గిరిజన తెగల ప్రజలు చలిమంటల చుట్టూ చేరి, స్త్రీ పురుషులు వేర్వేరుగా నృత్యాలు చేస్తూ పండగను ప్రారంభిస్తారు.లక్ష్యం చేరిన బాణమే సంతానానికి సంకేతంగహర్ లోయలో పదుల సంఖ్యలో గిరిజన గ్రామాలున్నాయి. వేర్వేరు తండాల్లో ఒక్కో రీతిన ఈ ఉత్సవం నిర్వహిస్తారు. మగబిడ్డ పుడితే ఓ గ్రామం, ఆడ బిడ్డ జన్మిస్తే ఇంకో గ్రామం ఇలా ఒక్కొక్కరు గోచీ పండగ నిర్వహిస్తారు. పండగకు ఒకరోజు ముందు గ్రామపూజారి విల్లుబాణం పట్టుకుని ఊరంతా తిరిగి స్థానిక గ్రామదేవతకు ప్రార్థన చేస్తాడు.ఆ తర్వాత బిడ్డ పుట్టిన ఇంటిని సందర్శిస్తాడు. పండగ రోజు ఉదయాన్నే ఊరంతా సమావేశమై ఎలా ముందుకువెళ్లాలో నిర్ణయిస్తారు. పర్వదినం సందర్భంగా సత్తు పిండితో శివలింగాన్ని చేసి, దానికి పూజలు చేస్తారు. ఈ రూపాన్ని స్థానికులు ‘యుల్లా’ దేవత అని పిలుస్తారు. ఊరంతా కలియతిరిగి ఓ కూడలిలో సామూహిక ప్రార్థనల్లో పాల్గొంటారు. దేవతారా«ధన అనంతరం విలువిద్య ఆట ఆడతారు. పెళ్లైన మగవారికి మాత్రమే ఇందులో ప్రవేశం. నిర్ణీత సమయంలో లక్ష్యాన్ని తాకిన బాణాల సంఖ్య ఆధారంగా ఆ గ్రామానికి రానున్న కాలంలో అంతమంది శిశువులు జన్మిస్తారని వీరి నమ్మకం. లక్ష్యం చేరిన బాణాల సంఖ్య పదికి దాటితే చాలు వీరి ఆనందానికి అవధులుండవు. ఈ సందర్భంగా పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తారు. సంప్రదాయ వంటకాలతో అందరూ సహపంక్తి భోజనాలు చేస్తారు. ఆడపిల్లతో అదృష్టమని..ఈసారి భాగ్ లోయలోని పుకార్ గ్రామం ప్రత్యేకతను సంతరించుకుంది. గతంలో ఇక్కడి వారు కేవలం మగబిడ్డలు పుడితేనే గోచీ పండుగ జరిపేవారు. కాని, ఈసారి ఆడ శిశువు పుడితే ఘనంగా వేడుక నిర్వహించడం విశేషం. తమ ఇంట అమ్మాయి పుడితే అదృష్టంగా భావించారు పుకార్ గిరిజనులు. తాజాగా ఫిబ్రవరి 4 నుంచి 8వ తేదీ వరకు ఐదు రోజులు ఉత్సవాన్ని జరిపారు. ‘తంగ్జన్’గా పిలిచే గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక పూజారి బిడ్డ తల్లిదండ్రులను ఆశీర్వదించాడు. అనంతరం బారసాల (తొట్టి పండగ) నిర్వహిస్తారు. అయితే ఈ సందర్భంగా బిడ్డకు సంబంధించి ఫొటోలు, వీడియోలు తీయరు. ఆరునెలలు నిండేంత వరకు ఈ నిబంధనను పాటిస్తారు. అలా చేస్తే కనుదృష్టి తగులుతుందని వీరి భయం. లోహర్ అని పిలిచే డప్పుల దరువులతో పండగ మారుమోగుతుంది. ‘చాంగ్’ అనే సంప్రదాయ మద్యాన్ని అంతా సేవిస్తారు. డప్పుల దరువులకు లయబద్ధంగా నృత్యం చేస్తూ ఒకరిపై ఒకరు మంచుముద్దలను విసరడంతో గోచీ పండుగ ముగుస్తుంది. · -
Himachal: ఎడతెగని హిమపాతం.. స్కూళ్లు, కాలేజీలు మూసివేత
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)ను హిమపాతం ఇంకా వీడటం లేదు. లాహౌల్ స్పితి జిల్లాలో ఎడతెగని రీతిలో భారీగా మంచు కురుస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో గత రెండు రోజుల నుంచి అడపాదడపా ఇదే పరిస్థితి ఏర్పడుతోంది. భారీగా మంచు పడుతున్న నేపధ్యంలో లాహౌల్ స్పితి జిల్లాలోని పాఠశాలలు, విద్యాసంస్థలను మూసివేయాలని రాష్ట్ర విద్యాశాఖ అదేశాలు జారీ చేసింది.Manali Update: Road is blocked near Dhundhi Bridge due to an avalanche Travelers are advised to avoid the route until further notice. Stay updated and travel safely.- Lahaul-Spiti Police#manali #snowfall @HP_SDRF @PoliceKullu @himachalpolice @CMOFFICEHP #HimachalPradesh pic.twitter.com/VwILGzYK7y— Vinod Katwal (@Katwal_Vinod) February 27, 2025గడచిన మూడు రోజులుగా లాహౌల్ స్పితి(Lahaul Spiti)లో హిమపాతం కురుస్తోంది. నేడు (గురువారం) సిమ్లాలో తేలికపాటి వర్షం కుర్తుస్తోంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మనాలి సమీపంలోని ధుండిలో కొండచరియలు విరిగిపడిన కారణంగా, లేహ్ మనాలి హైవేను మూసివేశారు. దీంతో మనాలిలోని సోలాంగ్ వ్యాలీని దాటి ముందుకు వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. అటల్ టన్నెల్ దక్షిణ, ఉత్తర పోర్టల్లలో రెండు అడుగుల ఎత్తున మంచు పేరుకుపోయింది. ఇటువంటి పరిస్థితిలో స్థానికులు తమ ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావద్దని అధికారులు సూచించారు. ధర్మశాలలో భారీ వర్షం కారణంగా పోలీసు నియామక ప్రక్రియను మార్చి 9కి వాయిదా వేశారు. వాతావరణ శాఖ(Meteorological Department) తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రోహ్తాంగ్ పాస్ వద్ద దాదాపు రెండున్నర అడుగుల మేరకు మంచు కురిసింది. ఈ కారణంగా ఫిబ్రవరి 19 నుండి లాహౌల్ స్పితికి హెచ్ఆర్టీసీ బస్సు సర్వీసులను నిరవధికంగా నిలిపివేశారు. ఫిబ్రవరి 26- 28 మధ్య భారీ వర్షాలు/హిమపాతం సంభవించే అవకాశం ఉన్నందున హిమాచల్ ప్రదేశ్‌లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.ఇది కూడా చదవండి: Marathi Language Day: దేశంలో ‘థర్డ్ లాంగ్వేజ్’ -
కంగనా రనౌత్ రెస్టారెంట్.. తొలి కస్టమర్‌గా స్టార్ హీరోయిన్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ వ్యాపారం రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. తన సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌లో తన బిజినెస్‌ను ప్రారంభించనుంది. అందమైన పర్వతాల మధ్యలో సరికొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. మనాలిలో ఏర్పాటు చేయనున్న ఈ రెస్టారెంట్‌కు ది మౌంటైన్ స్టోరీ అనే పేరును కూడా ఖరారు చేసింది. తన కొత్త రెస్టారెంట్‌కు మొదటి కస్టమర్‌గా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణెను ఆహ్వానించింది కంగనా రనౌత్. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో ఏర్పాటు చేసిన ది మౌంటైన్ స్టోరీ రెస్టారెంట్‌ను ఫిబ్రవరి 14న ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కంగనా ఓ వీడియోను పోస్ట్ చేసింది.ఈ సందర్భంగా రెస్టారెంట్‌ను తెరవాలనే తన కోరికను వ్యక్తం చేస్తూ తాను గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియోను షేర్ చేసింది. ప్రపంచస్థాయి మెనూను కలిగి ఉండాలనుకునే రెస్టారెంట్‌ను తెరవాలనుకుంటున్నా అని కంగనా అన్నారు. అదే ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపిక పదుకొణె నీ రెస్టారెంట్‌కు నేనే మీ మొదటి క్లయింట్ అవుతానని చెప్పింది. మరోసారి ఆ వీడియోను షేర్ చేస్తూ దీపికా పదుకొణె నా నా మొదటి కస్టమర్‌గా వస్తానని ప్రామిస్ చేశావ్ అంటూ కంగనా పోస్ట్ చేసింది. అంతేకాకుండా రెస్టారెంట్ ప్రారంభించడం చిన్ననాటి కల అని వెల్లడించింది. కాగా.. సినిమాల విషయానికొస్తే కంగనా రనౌత్ చివరిగా ఎమర్జెన్సీలో కనిపించింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీకి కంగనానే దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by The Mountain Story ( Restaurant ) (@themountainstorytms) -
హిమాలయాల్లో రెస్టారెంట్ ప్రారంభించిన స్టార్ హీరోయిన్
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్(Kangana Ranaut ) హిమాలయాల్లో ఒక రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ది మౌంటెన్ స్టోరీ (The Mountain Story) పేరుతో ఆమె కేఫ్, రెస్టారెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరి 14న హిమాచల్ ప్రదేశ్‌లో ఎంతో పాపులర్ అయిన వంటకాలతో తన రెస్టారెంట్ ప్రారంభం అవుతుందని ఆమె ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోతో పంచుకున్నారు.రెస్టారెంట్ ప్రారంభించడం అనేది తన చిన్ననాటి కల అని కంగనా తెలిపారు. తన అమ్మగారి వంటగదిలో ఉన్నప్పుడే అందుకు తొలి బీజం పడిందని గుర్తుచేసుకున్నారు. ఆధునిక టచ్‌తో పాటుగా సాంప్రదాయ హిమాచల్ ఫుడ్‌ను అందించాలని తాను అనుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇది మీతో నాకున్న రిలేషన్ షిప్ స్టోరీగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. రెస్టారెంట్ వీడియోను కూడా షేర్ చేయడంతో అందులోని ఇంటీరియర్ డిజైన్ గురించి అందరూ మెచ్చుకుంటున్నారు. స్థానిక హిమాచలీ కళాఖండాలతో పాటు సుందరమైన పర్వత దృశ్యంతో బహిరంగ సీటింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయని తెలుస్తోంది.పుట్టిన ఊరు మనాలీలో కేఫ్ అండ్ రెస్టారెంట్ ప్రారంభించిన కంగనా తన ప్రాంతంతో ఉన్న అనుబంధాన్ని ఇలా తెలిపారు. 'పర్వతాలు నా ఎముకలు, నదులు నా సిరలు, అడవులు నా ఆలోచనలు, నక్షత్రాలు నా కలలు" అని రాస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో రెస్టారెంట్ చిత్రాలను కూడా ఆమె పంచుకున్నారు. చుట్టూ పర్వాతల మధ్యలో మంచు పడుతున్న వేళలో అక్కడి ఫుడ్ ఆస్వాదిస్తూ ఉంటే ఆ సంతోషానికి హద్దులు ఉండవని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. త్వరలో తప్పకుండా అక్కడికి వచ్చి రెస్టారెంట్‌లోని అన్ని వంటకాలను రుచి చూస్తామని, కంగనాకు శుభాకాంక్షలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by The Mountain Story ( Restaurant ) (@themountainstorytms) -
తెలంగాణకు ‘హిమాచల్’ విద్యుత్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విద్యుత్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచనలతో రాష్ట్ర అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం బూట్ (బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్) విధానంలో 22 హైడ్రో ఎలక్ట్రికల్ (జలవిద్యుత్) ప్రాజెక్టుల ఏర్పాటుపై ప్రతిపాదనలు ఆహ్వనించగా.. రాష్ట్ర విద్యుత్ శాఖ అధికారుల బృందం హిమాచల్‌ప్రదేశ్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా 100 మెగావాట్లకు పైబడిన సామర్థ్యం గల రెండు ప్రాజెక్టుల ఏర్పాటుపై రాష్ట్రం ఆసక్తిని వ్యక్తం చేసింది.ఇందుకు సంబంధించి హిమాచల్ ప్రభుత్వం ఎంఓయూపై సంతకం చేస్తే త్వరితగతిన తగిన తదుపరి చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, విద్యుత్ శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాతో కలసి ఢిల్లీలో హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్సింగ్తో సమావేశమయ్యారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వం నుంచి సెలి (400 మెగావాట్లు), మియార్ (120 మెగావాట్లు) హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టుల నిర్మాణంపై ఆసక్తిని వ్యక్తం చేస్తూ ఒక లేఖను సమర్పించారు.ఈ సందర్భంగా ఎంఓయూ గురించి చర్చించారు. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయానికి రావాలని హిమాచల్ సీఎం, భట్టి నిర్ణయించారు. ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే జలవిద్యుత్ రాష్ట్రానికి సరఫరా అవుతుంది. ఈ విద్యుత్ వల్ల రాష్ట్ర అవసరాలు, భవిష్యత్ విద్యుత్ డిమాండ్లను తీర్చేందుకు వీలు ఏర్పడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. -
ఈ ఆపిల్ ఎక్కడైనా కాస్తుంది!
హిమవత్పర్వత సానువులకే పరిమితమైన ఆపిల్ సాగును మైదానప్రాంతాలకు తీసుకొచ్చారు ఓ సామాన్య రైతు. ఉష్ణమండలప్రాంతాల్లోనూ సాగయ్యే హెచ్‌ఆర్‌ఎంఎన్–49 ఆపిల్ వంగడాన్ని రైతు శాస్త్రవేత్త హరిమాన్ శర్మ(Hariman Sharma) అభివృద్ధి చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్పూర్ జిల్లాలోని పనియాలా ఆయన స్వగ్రామం. మామిడితో పాటే ఆపిల్ సాగు(Apple Cultivation)... హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, కశ్మీర్ రాష్ట్రాల్లోని కొండలపై మాత్రమే ఆపిల్ వాణిజ్య పంటగా సాగులో ఉంది. చల్లని వాతావరణం ఉన్న ఆ కొండప్రాంతాలు మాత్రమే ఆపిల్ సాగుకు అనుకూలంగా ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనూ కొండప్రాంతాల్లో మాత్రమే వాతావరణం చల్లగా ఉంటుంది. అందుకే, ఆ రాష్ట్ర రాజధాని సిమ్లా ఆపిల్ సాగులో దేశంలోనే పేరెన్నికగన్నది. కానీ ఆ రాష్ట్రంలోనూ కొండ లోయల్లో, మైదానప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికమే.బిలాస్పూర్ జిల్లా సముద్ర మట్టానికి 1800 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక లోయ ప్రాంతం. అక్కడ ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో రైతులు మామిడి తోటలను విస్తారంగా సాగు చేస్తున్నారు. అలాంటి వేడి వాతావరణం ఉన్నప్రాంతంలో తన ఇంటి పెరట్లో ఒక ఆపిల్ మొక్క మొలకెత్తటాన్ని హరిమాన్ శర్మ గమనించారు. పనియాలా లాంటి వేడి వాతావరణంలో ఆపిల్ చెట్టు పెరగటం శర్మను ఆలోచనలో పడేసింది. ఆ మొక్కను అతి జాగ్రత్తగా చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒక ఏడాది గడిచాక ఆ ఆపిల్ చెట్టు నుంచి వచ్చిన కొమ్మలను తీసుకొని రేగు మొక్కతో అంటుకట్టారు. ఆప్రాంతంలో అంటు కట్టటానికి కూడా ఆపిల్ చెట్లు అందుబాటులో లేకపోవటమే దీనిక్కారణం. అతని ప్రయోగం విజయవంతమైంది. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ పంట చేతికొచ్చింది! అంతేకాదు.. ఆపిల్ కాయలు సైజులోను, నాణ్యతలోనూ బావున్నాయి. సిమ్లా నుంచి ఆపిల్ విత్తనాలు తెచ్చి పెంచిన మొక్కలతో అంటుకట్టాడు. రెండేళ్ల తరువాత మంచి పంట చేతికొచ్చింది. తను సాగు చేస్తున్న మామిడి చెట్లతో పాటే ఆ ఆపిల్ చెట్లను పెంచాడు. ఆ విధంగా ఒక చిన్న ఆపిల్ తోటనే అతను సృష్టించాడు! సాధారణంగా ఆపిల్‌లో పూత రావలన్నా పిందెలు రావాలన్నా అతి చల్లని వాతావరణం అవసరం. కానీ హెచ్.ఆర్.ఎం.ఎన్.–99 రకం ఆపిల్‌ను సాధారణ వాతావరణంలోనూ ఉష్ణమండలప్రాంతాల్లోనూ సాగు చేయవచ్చని హరిమాన్ శర్మ చెబుతున్నారు. ఈ మొక్క మూడేళ్లు తిరిగేసరికి కాపుకొస్తుంది. జూన్‌లో కాయటం దీని మరో ప్రత్యేకత. ఆ కాలంలో ఇప్పుడున్న దేశీవాళీ ఆపిల్ కాయలు మార్కెట్లోకి రావు. దీంతో ఈ రకం ఆపిళ్లను సాగు చేసే రైతులు లాభపడుతున్నారు. హెచ్.ఆర్.ఎం.ఎన్.–99 వంగడంపై నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్.ఐ.ఎఫ్.) దృష్టి కేంద్రీకరించింది. దేశంలోని విభిన్న వ్యవసాయక వాతావరణ పరిస్థితులున్నప్రాంతాల్లో 2015–17 మధ్యకాలంలో ప్రయోగాత్మకంగా సాగు చేయించింది. 29 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలితప్రాంతాలకు చెందిన 1,190 మంది రైతులకు 10 వేల ఆపిల్ మొక్కలు ఇచ్చి సాగు చేయించారు. చాలా రాష్ట్రాల్లో సత్ఫలితాలు వచ్చాయని ఎన్.ఐ.ఎఫ్. ప్రకటించింది. పరిశోధనాలయాల్లో సాగులో ఉన్న రకాలతో పోల్చితే హెచ్.ఆర్.ఎం.ఎన్.–99 పండ్లు నాణ్యమైనవని తేలింది. కొన్ని రాష్ట్రాల్లో ఏడాది వయసున్న మొక్కలకే పూత వచ్చింది.దక్షిణాదిన కర్నాటకలోని చిక్మగుళూరు, హర్యానా రైతులు హెచ్‌ఆర్‌ఎంఎన్–99 ఆపిల్ వంగడాన్ని సాగు చేసి ఏడాదికి రెండు పంటలు తీస్తున్నారు. అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ సాగవుతోంది. మంచి దిగుబడులు వస్తున్నాయి. కాయలు రుచిగా ఉండటంతో కొనేందుకు వినియోగదారులు మక్కువ చూపుతున్నారు. బిలాస్పూర్ జిల్లాలోని కొండ దిగువ జిల్లాల్లోనిప్రాంతాల్లోని వేలాది మంది సాధారణ రైతులకు హరిమాన్ శర్మ స్ఫూర్తి ప్రదాతగా మారారు.అంతకు ముందు ఆప్రాంతంలోని రైతులు తాము ఆపిల్‌ను సాగు చేయటమనేది వారు కలనైనా ఊహించ లేదు. ఆయనను ఇప్పుడు బిస్లాపూర్ జిల్లాలో ‘ఆపిల్ మేన్’ అని ఆత్మీయంగా పిలుస్తున్నారు. ఈ ఆవిష్కరణ ఆయనకు ప్రతిష్టాత్మక అవార్డులను సంపాయించి పెట్టింది. రాష్ట్రపతి చేతుల మీదుగా ఎన్.ఐ.ఎఫ్. జాతీయ పురస్కారాన్ని,‘ప్రేరణా శ్రోత్’ పురస్కారాన్ని పొందారు. హరిమాన్ శర్మ, పనియాల గ్రామం, బిలాస్పూర్ జిల్లా, హిమాచల్ ప్రదేశ్ – 174021. ఫోన్: 09418 867209, 09817 284251 , sharmaharimanfarm @gmail.com‘తెలుగు రాష్ట్రాల్లో రైతులకు 15 వేల మొక్కలు అందించాం’మైదానప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతల్లోనూ సాగు చేయదగిన ఆపిల్ వంగడాన్ని హారిమన్ శర్మ రూపొందించారు. ఆయన దగ్గరి నుంచి ఈ మొక్కల్ని పల్లెసృజన తరఫున తెప్పించి, తెలుగు రాష్ట్రాల్లో పలువురు రైతులకు గత ఐదేళ్లుగా నవంబర్–డిసెంబర్ నెలల్లో ఇస్తున్నాం. ఇప్పటికి సుమారు 15 వేల ఆపిల్ మొక్కల్ని రైతులకు అందించాం. ప్రత్యేకంగా ప్యాక్ చేసి స్పీడ్ కొరియర్లో రైతుల ఊళ్లకే పంపుతున్నాం. ఖర్చులన్నీ కలిపి మొక్క ఖరీదు రూ. 220 అవుతోంది. చాలా చోట్ల ఈ ఆపిల్ చెట్లకు ఇప్పటికే పండ్లు కాస్తున్నాయి. sharmaharimanfarm @gmail.com -
తనయ్, అనికేత్ మాయాజాలం
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే నాకౌట్ దశకు అర్హత సాధించే అవకాశం కోల్పోయిన హైదరాబాద్ జట్టు రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో రెండో విజయాన్ని అందుకుంది. హిమాచల్ ప్రదేశ్ జట్టుతో ఆదివారం ఉప్పల్ స్టేడియంలో ముగిసిన గ్రూప్ ‘బి’ ఆరో రౌండ్ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు ఇన్నింగ్స్ 43 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి 7 పాయింట్లు సంపాదించింది. చామా మిలింద్ సారథ్యంలో ఈ మ్యాచ్ ఆడిన హైదరాబాద్ జట్టుకు ఇద్దరు స్పిన్నర్లు తనయ్ త్యాగరాజన్, అనికేత్ రెడ్డి తమ ప్రదర్శనతో విజయాన్ని కట్టబెట్టారు. ఫాలోఆన్ ఆడుతూ ఆఖరి రోజు ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 21/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హిమాచల్ జట్టు వన్డే తరహాలో ఆడి 45.4 ఓవర్లలో 247 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. హైదరాబాద్ ఎడంచేతి వాటం స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ 118 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టగా... నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో ఎడంచేతి వాటం స్పిన్నర్ గంగం అనికేత్ రెడ్డి 46 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. హిమాచల్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో శుభం అరోరా (72 బంతుల్లో 66; 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా... అంకిత్ కాల్సి (39 బంతుల్లో 44; 6 ఫోర్లు), వైభవ్ అరోరా (22 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. మ్యాచ్ మొత్తంలో తొమ్మిది వికెట్ల తీసిన అనికేత్ రెడ్డికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఎనిమిది జట్లున్న గ్రూప్ ‘బి’లో హైదరాబాద్ ఆరు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. రెండు మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్ విజయాలు సాధించి... రెండు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని, రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి 16 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. నాగ్‌పూర్‌లో ఈనెల 30 నుంచి జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో విదర్భ జట్టుతో హైదరాబాద్ ఆడుతుంది. -
అనికేత్ అదుర్స్
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్ అనికేత్ రెడ్డి (5/72) సత్తా చాటాడు. ఫలితంగా ఓవర్‌నైట్ స్కోరు 33/1తో శనివారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హిమాచల్ ప్రదేశ్ జట్టు 92 ఓవర్లలో 275 పరుగులకు ఆలౌటైంది. ఇనేశ్ మహజన్ (79 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ అర్ధశతకం సాధించగా... శుభమ్ అరోరా (53; 7 ఫోర్లు) హాఫ్‌సెంచరీ చేశాడు.అంకిత్ (31), అపూర్వ్ వాలియా (37), ఆకాశ్ వశిష్ట్ (46) తలా కొన్ని పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ రెండు వికెట్లు తీయగా... నిశాంత్, వరుణ్ గౌడ్లకు చెరో వికెట్ దక్కింది. దీంతో హైదరాబాద్‌కు 290 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించడంతో ప్రత్యర్థిని ఫాలోఆన్‌కు ఆహ్వానించింది. శనివారం ఆట ముగిసే సమయానికి హిమాచల్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. శుభమ్ అరోరా (16 బ్యాటింగ్), ప్రశాంత్ చోప్రా (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. నేడు ఆటకు చివరి రోజు కాగా... చేతిలో 10 వికెట్లు ఉన్న హిమాచల్ జట్టు... హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 269 పరుగులు వెనుకబడి ఉంది. స్కోరు వివరాలు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 565; హిమాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్: శుభమ్ అరోరా (ఎల్బీ) (బి) అనికేత్ రెడ్డి 53; ప్రశాంత్ చోప్రా (సి) రాహుల్ రాధేశ్ (బి) నిశాంత్ 1; అంకిత్ (సి) తన్మయ్ అగర్వాల్ (బి) తనయ్ త్యాగరాజన్ 31; అపూర్వ్ వాలియా (స్టంప్డ్) రాహుల్ రాధేశ్ (బి) అనికేత్ రెడ్డి 37; ఆకాశ్ వశిస్ట్ (సి) మిలింద్ (బి) అనికేత్ రెడ్డి 46; రిషి ధవన్ (ఎల్బీ) తనయ్ త్యాగరాజన్ 22; ఇనేశ్ మహజన్ (నాటౌట్) 68; ముకుల్ నేగీ (సి) హిమతేజ (బి) అనికేత్ రెడ్డి 0; మయాంక్ డాగర్ (సి) రక్షణ్ రెడ్డి (బి) వరుణ్ గౌడ్ 0; వైభవ్ అరోరా (సి) రక్షణ్ రెడ్డి (బి) అనికేత్ రెడ్డి 3; దివేశ్ శర్మ (రనౌట్/హిమతేజ) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (92 ఓవర్లలో ఆలౌట్) 275. వికెట్ల పతనం: 1–11, 2–78, 3–111, 4–144, 5–188, 6–217, 7–217, 8–218, 9–267, 10–275, బౌలింగ్: నిశాంత్ 12–3–52–1; చామా మిలింద్ 13–1–32–0; తనయ్ త్యాగరాజన్ 24–4–62–2; అనికేత్ రెడ్డి 25–5–72–5; రక్షణ్ రెడ్డి 13–1–29–0; వరుణ్ గౌడ్ 5–0–16–1. హిమాచల్ ప్రదేశ్ రెండో ఇన్నింగ్స్: శుభమ్ అరోరా (బ్యాటింగ్) 16; ప్రశాంత్ చోప్రా (బ్యాటింగ్) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 21. బౌలింగ్: తనయ్ త్యాగరాజన్ 3–0–13–0; రక్షణ్ రెడ్డి 2–1–4–0. -
డోన్లతో ఉత్తరాల బట్వాడా.. 10 నిముషాల్లో డెలివరీ
ధర్మశాల: ఉత్తరాల బట్వాడాలో పోస్టల్శాఖమరో ముందడుగు వేసింది. హిమాచల్ పోస్టల్ విభాగం డ్రోన్ల సాయంతో మారుమూల, మంచు ప్రాంతాలకు ఉత్తరాలను బట్వాడా చేయనుంది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు పోస్టల్‌శాఖ అప్పర్ సిమ్లాలో డ్రోన్ ద్వారా ఉత్తరాలను డెలివరీ చేసే ట్రయల్‌ను ప్రారంభించింది.డ్రోన్ల సాయంతో సబ్ పోస్టాఫీసు నుండి బ్రాంచ్ పోస్టాఫీసులకు ఐదు నుంచి పది నిమిషాల్లో ఉత్తరాలు డెలివరీ అవుతున్నాయి. గతంలో ఇలా ఉత్తరాలు చేరడానికి ఒక రోజు పట్టేది. ఈ ట్రయల్ విజయవంతం అయిన దరిమిలా కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు పోస్టల్ విభాగం హైటెక్ టెక్నాలజీని ఉపయోగించి ఇతర మారుమూల ప్రాంతాలకు కూడా ఉత్తరాలను బట్వాడా చేసే అవకాశం ఏర్పడనుంది.హిమాచల్ తపాలా శాఖ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్య డ్రోన్ల ద్వారా సబ్ పోస్టాఫీస్ హట్కోటి నుంచి నందపూర్, కథాసు, ఆంటి, జాధగ్ బ్రాంచ్ పోస్టాఫీసులకు ఉత్తరాలను పంపుతోంది. ఒకేసారి ఏడు కిలోగ్రాముల వరకు భారాన్ని మోయగల ఈ డ్రోన్ ఐదు నుండి పది నిమిషాల్లో ఏడు నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు ఉత్తరాలను చేరవేసి, తిరిగివస్తోంది. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ఉత్తరాల డెలివరీకి సంబంధించిన పూర్తి డేటాను ఆన్లైన్లో ఉంచుతున్నారు. డ్రోన్ ట్రయల్స్ కోసం ఒక ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోస్టల్‌శాఖ అధికారి ఒకరు తెలిపారు.ఇది కూడా చదవండి: Republic Day 2025: అందమైన ఈ శకటాలను చూసితీరాల్సిందే -
హిమాచల్ పోలీసుల అకృత్యం
బనీఖేత్(హిమాచల్ ప్రదేశ్): నూతన సంవత్సర వేడుకల వేళ అర్ధరాత్రి దాటాక తాము అడిగిన మద్యం, ఆహారం ఇవ్వలేదన్న అక్కసుతో రిసార్ట్ మేనేజర్‌ను పోలీసులు కొట్టి చంపేసిన ఘటన హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. రిసార్ట్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు, నమోదైన ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రిదాటాక పర్వతమయ పర్యాటక ప్రాంతం డల్హౌసీ దగ్గర్లోని బనీఖేత్లోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌కు ముగ్గురు కానిస్టేబుళ్లు వచ్చారు. రాత్రి రెండు గంటల సమయంలో తాము అడిగిన భోజనం, మద్యం ఏర్పాట్లు చేయాలని రిసార్ట్ సిబ్బందికి ఆదేశాలిచ్చారు. రాత్రి సమయంలో తాము చేయాల్సిన ‘సర్వీస్’సమయం మించిపోయిందని, ఇప్పుడు నిబంధనలు ఒప్పుకోవని, ఈ సమయంలో సర్వీస్ చేయడం కుదరని అక్కడి రిసెప్షనిస్ట్ సచిన్ చెప్పాడు. దీంతో పట్టరాని ఆవేశంతో కానిస్టేబుల్స్ అనూప్, అమిత్‌లు రిసెప్షనిస్ట్‌ను చితకబాదారు. ఇదంతా చూసిన రిసార్ట్ మేనేజర్ రాజీందర్ హుటాహుటిన అక్కడికొచ్చి కానిస్టేబుళ్లను నిలువరించబోయారు. అప్పటికే కోపంతో ఊగిపోతున్న కానిస్టేబుళ్లు రాజీందర్పైనా దాడికి తెగించారు. ఈ దాడిలో రాజీందర్ అక్కడికక్కడే చనిపోయారు. దాడి సమయంలో కానిస్టేబుళ్లు పూటుగా మద్యం తాగి ఉన్నారని వార్తలొచ్చాయి. విషయం తెల్సుకున్న స్థానికులు వెంటనే చంబా–పఠాన్‌కోట్ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. రాజీందర్ మృతికి కారణమైన కానిస్టేబుళ్లను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్‌చేశారు. ఇద్దరినీ విధుల నుంచి తప్పించి దర్యాప్తు మొదలుపెట్టామని చంబా ఎస్పీ గురువారం చెప్పారు. తీవ్రంగా గాయపడిన రిసెప్షనిస్ట్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. -
హిమాచల్‌లో భారీ మంచు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో గత 24 గంటల్లో భారీగా మంచు కురియడంతో నలుగురు మృతి చెందారు. మూడు జాతీయరహదారు లు, మరో 220 దారులను మూసివేశారు. సిమ్లా, కులు, మండి, చంబా, సిర్మౌర్ జిల్లాలతో పాటు కిన్నౌర్, లాహౌల్, స్పితి జిల్లాల్లో భారీగా మంచు కురిసింది. పలు వాహనాలు అదుపుతప్పి బోల్తా పడటంతో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. దీంతో సిమ్లాలో 145, కులులో 25, మండీ జిల్లాల్లో 20 రహదారులను మూసివేశారు. 356 ట్రాన్స్ ఫార్మర్ ఫెయిల్యూర్ కావడంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ లేదు. క్రిస్మస్, న్యూ ఇయర్ కోసం సిమ్లా, మనాలీలకు పర్యాటకులు పోటెత్తారు. స్థానిక నివేదికల ప్రకారం, అట్టారి నుంచి లేహ్, కులు జిల్లా లోని సంజ్ నుంచి ఔత్, కిన్నౌర్ జిల్లాలోని ఖాబ్ సంగం, లాహౌల్, స్పితి జిల్లాలోని గ్రామ్ ఫూ వరకు జాతీయ రహదారులు ట్రాఫిక్ కారణంగా మూసివేశారు. రోడ్లను క్లియర్ చేయడానికి హిమాచల్ ప్రభుత్వం రెండు స్నో బ్లోయర్లతో సహా 268 యంత్రాలను ఏర్పాటు చేసింది. జిల్లా యంత్రాంగం సూచనలను పాటించాలని, స్థానికులు చెప్పేది వినాలని, మంచులో డ్రైవింగ్ చేయవద్దని పర్యాటకులు సూచించింది.తెల్లని వండర్‌ల్యాండ్‌గా హిమాచల్.. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా, మనా లీ వంటి పర్యాటక కేంద్రాలు తెల్లని వండర్‌ల్యాండ్‌గా మారాయి. అలాగే జమ్మూకాశీ్మర్లోని కొన్ని ప్రాంతాల్లో తాజాగా మంచుకురిసింది. ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయి కంటే అనేక డిగ్రీలు పడిపోయా యి. ఇది క్రిస్మస్ సెలవుల కోసం ప్రదేశాలను సందర్శించే పర్యాటకులకు ఉత్సాహాన్ని కలిగిస్తోంది. మరోవైపు వాహనాల రాకపోకలకు కష్టమవుతోంది. సోమవా రం అర్థరాత్రి మనాలీ, డల్హౌసీ శివారు ప్రాంతాల్లో తేలికపాటి హిమపాతం నమోదైంది. ఖద్రాలాలో అత్యధికంగా 24 సెంటీమీటర్లు, సంగ్లాలో 16.5 , షిల్లారోలో 15.3, చోపాల్, జుబ్బల్‌లో 15 సెంటీమీటర్ల చొప్పున, కల్పాలో 14, నిచార్‌లో 10, సిమ్లాలో 7, పూహ్‌లో 6, జోత్‌లో 5 సెంటీమీటర్ల చొప్పున మంచు కురిసింది. ప్రతికూల వాతావరణం, హిల్ స్టేషన్‌కు వెళ్లే మార్గంలో రహదారిపై ప్రాణాంతక పరిస్థితులు ఉన్నా పర్యాటకులు పోటెత్తారు. సిమ్లాలోని హోటల్ గదుల ఆక్యుపెన్సీ 70 శాతం నమోదైంది. గత ఏడాది డిసెంబర్ కంటే ఇది 30 శాతం ఎక్కువ. మంచు దుప్పటితో అందంగా కప్పబడిన సిమ్లా, మనాలీ చిత్రాలతో సోషల్ మీడియా నిండిపోయింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఆదివారం మధ్యా హ్నం వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా సిమ్లాలో భారీ వర్షా లు, మంచు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. -
అంతిమసంస్కారాలైన 25 ఏళ్లకు ఆమె తిరిగొస్తే..
ఆమె తన ఆచూకీని కోల్పోయి 25 ఏళ్లుగా ఆశ్రమంలో కాలం గడుపుతోంది. మరోవైపు ఆమె ఎక్కడి నుంచి ఈ ఆశ్రమానికి వచ్చిందన్న సంగతి ఆ ఆశ్రమ నిర్వాహకులకూ తెలియదు. ఇది హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నగరానికి చెందిన కథనంఏళ్ల తరబడి ఆశ్రమంలో..పాతికేళ్ల తర్వాత అనూహ్య పరిస్థితుల్లో ఆమె తన కుటుంబాన్ని కలుసుకోగలుగుతోంది. మండి పరిపాలన అధికారుల చొరవతో ఇది సాధ్యమయ్యింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు 25 ఏళ్ల క్రితమే ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. కర్ణాటక వాసి సాకమ్మ కథ ఇది. పాతికేళ్ల క్రితం ఆమె కర్ణాటక(Karnataka) నుండి ఉత్తర భారతదేశయాత్రలకు వెళ్లి, అక్కడ తప్పిపోయింది. అప్పటి నుంచి ఆమె మండి జిల్లా సుందర్‌నగర్‌లోని భంగ్రోటు వృద్ధాశ్రమంలో ఉంటోంది.కన్నడలో మాట్లాడటంతో..మండి అడ్మినిస్ట్రేటివ్ అధికారులు ఎప్పటికప్పుడు ఇలాంటి ఆశ్రమాలను సందర్శించి, అక్కడ సౌకర్యాలను పరిశీలిస్తుంటారు. దీనిలో భాగంగా అధికారి రోహిత్ రాథోడ్ ఇటీవల ఈ వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. అక్కడ సాకమ్మను చూసి, ఆమెతో మాట్లాడారు. ఈ సమయంలో ఆమెకు హిందీ రాదని, కన్నడ భాష వచ్చని గుర్తించారు. దీంతో ఆమె కర్నాటకు చెందినదై ఉంటుందని భావించారు. వెంటనే ఆయన కన్నడ తెలిసిన ఒక అధికారిని పిలిపించి, ఆమెతో మాట్లాడించి పలు వివరాలు సేకరించారు.ఉత్తరభారతదేశ యాత్రలకు వెళ్లి..తరువాత ఆ మహిళ చెబుతున్న వివరాలతో కూడిన ఒక వీడియో(Video)ను రూపొందించి కర్ణాటక ప్రభుత్వానికి పంపించారు. ఆ దరిమిలా ఆమె కుటుంబ సభ్యులను మండీ అధికారులు గుర్తించారు. కాగా 25 ఏళ్ల క్రితం ఉత్తరభారతదేశ యాత్రలకు వెళ్లిన సాకమ్మ ఎంతకాలానికీ తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ దరిమిలా పోలీసులు అందించిన సమాచారం మేరకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఒక మహిళను సాకమ్మగా భావించి, ఆమె కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించి, క్రమంగా ఆమెను మరచిపోయారు.చనిపోయిందనుకున్న తల్లి వస్తుండటంతో..అయితే ఇప్పుడు సాకమ్మ బతికే ఉందని తెలియడంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా మండీ అధికారులతో మాట్లాడిన సాకమ్మ తనకు 25 ఏళ్ల క్రితం నాటి విషయాలు మాత్రమే గుర్తున్నాయని, తనకు చిన్న పిల్లలు ఉన్నారని తెలిపింది. ప్రస్తుతం సాకమ్మ మతిస్థిమితం లేని స్థితిలో ఉంది. కాగా సాకమ్మకు నలుగురు పిల్లలు. వారిలో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె బతికే ఉన్నారు. వారిందరికీ వివాహాలు కూడా అయిపోయాయి. సాకమ్మను తీసుకురావడానికి కర్ణాటక ప్రభుత్వం(Government of Karnataka) ముగ్గురు అధికారులను హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీకి పంపింది. వారు సాకమ్మకు తీసుకుని కర్నాటకకు వచ్చి ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇది కూడా చదవండి: ఆవి క్రిస్మస్ పక్షులు.. వాటి కువకువలు సుమధుర సరాగాలు -
రోడ్లపై మంచు గుట్టలు..చిక్కుకుపోయిన టూరిస్టులు
షిమ్లా:హిమాచల్‌ప్రదేశ్‌లో భారీగా మంచు కురుస్తోంది. భారీ మంచు ప్రభావంతో రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. రోడ్లపై మంచు గుట్టలుగుట్టలుగా పేరుకుపోవడంతో రోహ్తక్, సోలాంగ్, అటల్ టన్నెల్ మార్గంలో వెయ్యి వరకు వాహనాలు సోమవారం రాత్రి కొన్ని గంటల పాటు చిక్కుకుపోయాయి.స్థానిక అధికారులు,పోలీసుల సాయంతో ట్రాఫిక్ క్లియర్ చేశారు. మొత్తం 700 మంది టూరిస్టులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. క్రిస్మస్, న్యూఇయర్ కావడంతో టూరిస్టుల తాకిడి ఎక్కువవడం ఇదే సమయంలో మంచు భారీగా కురుస్తుండడంతో సమస్యలు ఎదురవుతున్నాయని పోలీసులు చెప్పారు. ఈ సీజన్లో ఇక్కడుండే మంచు పర్వతాలను చూడడానికి ఎక్కువ మంది టూరిస్టులు వస్తుండడం గమనార్హం. #WATCH | Himachal Pradesh: Heavy snowfall causes a long traffic jam as nearly 1000 vehicles get stuck between Solang and Atal Tunnel, Rohtang. The police team is busy clearing the traffic jam amid snowfall. 700 tourists have been rescued safely. (23.12)Source: Himachal Pradesh… pic.twitter.com/wb9ZfKh6H6— ANI (@ANI) December 23, 2024 -
అహో.. మైమరిపిస్తున్న మంచు అందాలు (ఫొటోలు)
-
స్వర్ణ పతక విజేతను ప్రోత్సహించే తీరిదేనా?: సుప్రీం కోర్టు అసంతృప్తి
‘క్రీడాకారులకు మీరిచ్చే ప్రోత్సాహం ఇదేనా? ముఖ్యమంత్రి ప్రకటనలు, హామీలు కాదు... ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకోవాలి. ఓ చాంపియన్ క్రీడాకారిణి పట్ల మీరు వ్యవహరించిన తీరు గర్హనీయం’.. అని సుప్రీం కోర్టు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. ఆసియా క్రీడల్లో (2014)లో స్వర్ణ పతక విజేత పట్ల వ్యవహరించిన తీరు సరికాదని అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగా పూజ ఠాకూర్ అనే క్రీడాకారిణి ఇంచ్వాన్ (దక్షిణ కొరియా) ఆసియా క్రీడల్లో పసిడి పతకం నెగ్గిన భారత కబడ్డీ జట్టు సభ్యురాలు. అయితే స్పోర్ట్స్ కోటా కింద గ్రేడ్–1 ఉద్యోగానికి అర్హురాలైన ఆమెకు ఎక్సైజ్–టాక్సేషన్ ఆఫీసర్ ఉద్యోగం ఇచ్చినట్లే ఇచ్చిన హిమాచల్ ప్రభుత్వం నియామకం మాత్రం జరపలేదు. దీని కోసం ఏళ్ల తరబడి హిమాచల్ సీఎం కార్యాలయం చుట్టూ పూజా ఠాకూర్ తిరుగుతోంది.స్పందించిన రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జిఈ నేపథ్యంలో.. జూలై 2015 నుంచి పూజ ఠాకూర్ చేస్తున్న పోరాటానికి స్పందించిన రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జి... ఆమెను ఎక్సైజ్–టాక్సేషన్ ఆఫీసర్‌గా నియమించాలని తీర్పు ఇచ్చారు. అయినా సరే నియామకం జరపకుండా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీలు చేసింది. ఈ క్రమంలో.. శుక్రవారం విచారణ సందర్భంగా జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిలతో కూడిన ద్విసభ్య బెంచ్ వెంటనే ఆమెను ప్రభుత్వ ఉద్యోగంలో నియమించాలని ఆదేశించింది.సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తిఈ సందర్భంగా.. హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును యథాతథంగా అమలు చేయాలని... ఇందులో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు తెలిపింది. అదే విధంగా.. ఇన్నేళ్లయినా రాష్ట్ర ప్రభుత్వం పూజ ఠాకూర్ నియామకానికి సంబంధించి ఏ చర్యలు చేపట్టకపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేకాదు.. జూలై 2015 నుంచే సినియారిటీ సహా ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రూల్స్‌కు లోబడి పొందే అన్ని ప్రయోజనాలకు ఆమె అర్హురాలని సుప్రీం బెంచ్ తీర్పులో వెల్లడించింది. -
కాంగ్రెస్ హామీలపై కేటీఆర్ ఛలోక్తులు
-
హిమాచల్ భవన్ జప్తు.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను కాకుండా.. బదులుగా సర్కస్లను నడుపుతోంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. హిమాచల్‌లో రెండేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్.. తన చేతకాని ప్రభుత్వం వల్ల రాష్ట్రం తీసుసుకున్న అప్పును తీర్చలేక ఢిల్లీలో హిమాచల్ భవన్‌ను కోల్పోవాల్సి వస్తుందని విమర్శలు గుప్పించారు. గద్దెనెక్కడం కోసం అడ్డగోలు గారంటీలు ఇవ్వడం, చేతికందినన్ని అప్పులు చెయ్యడం, ఆఖరికి ఉన్న ఆస్తులు జప్తు చెయ్యించుకునే పరిస్థితికి రావడం కాంగ్రెస్ అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు. మొన్న గారంటీలు అమలు చెయ్యలేక, గంజాయి కూడా అమ్మకునే పరిస్థితి హస్తానికి తలెత్తిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. నేడు కాంగ్రెస్ చెల్లించాల్సిన అప్పు తేల్చకపోతే, డిల్లీలో హిమాచల్ భవన్‌ను జప్తు చేస్తాం అని హైకోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. ఇది ఎంత సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. తమ హామీలకు నిధులు సమకూర్చడం కోసం చట్టబద్ధంగా గంజాయిని విక్రయించడానికి కాంగ్రెస్ అనుమతి కోరిందని ప్రస్తావించారు. మరి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను నెరవేర్చడానికి ఏం విక్రయిస్తారంటూ రాహుల్ గాంధీని ప్రశ్నించారు.కాగా ఓ విద్యుత్తు సంస్థకు చెల్లించాల్సిన రూ.150 కోట్లను రికవరీ చేసేందుకు ఢిల్లీలోని హిమాచల్ భవన్ జప్తుకు రాష్ట్ర హైకోర్టు సోమవారం ఆదేశాలు ఇచ్చింది. ఈ భవనాన్ని వేలం వేసి బకాయిలు తీర్చేసుకోవాలని సదరు కంపెనీకి సూచించింది. దీంతో పది గ్యారెంటీల పేరుతో రెండేళ్ల క్రితం హిమాచల్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.గద్దెనెక్కడం కోసం అడ్డగోలు గారంటీలు ఇవ్వడం! చేతికందినన్ని అప్పులు చెయ్యడం! ఆఖరికి ఉన్న ఆస్తులు జప్తు చెయ్యించుకునే పరిస్థితికి రావడం! ఇది ఏ జూదగాని ఇంటి కథ కాదు! సాక్షాత్తు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు! గారంటీలు అమలు చెయ్యలేక, గంజాయి కూడా అమ్మకునే పరిస్థి… pic.twitter.com/1lfvoR1Bu7— KTR (@KTRBRS) November 20, 2024 -
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మోదీ కీలక వ్యాఖ్యలు
-
సీఎం ‘సమోసా’ వివాదం.. దర్యాప్తు ఏం లేదు: సీఐడీ
హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో ‘సమోసా’ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఐడీ కార్యాలయంలో సీఎం సుఖ్వీందర్ సింగ్ హాజరైన ఓ కార్యక్రమంలో ఆయనకు ఇవ్వాల్సిన సమోసాలు మాయం అయినట్లువార్తలు రావడంతో..ఈ అంశంపై వివాదం చెలరేగింది.. దీనిపై సీఐడీ దర్యాప్తు కూడా ప్రారంభించినట్లు ఆరోపణలు రావడంతో.. తాజాగా దర్యాప్తు సంస్థ స్పందించింది. తాము ఎలాంటి విచారణ చేపట్టలేదని స్పష్టం చేసింది.అసలేం జరిగిందంటే.. అక్టోబర్ 21న ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు సీఐడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ జరిగిన కార్యక్రమం కోసం ప్రముఖ హోటల్ నుంచి సమోసాలు తెప్పించారని, అయితే వాటిని సెక్యూరిటీ స్టాఫ్ తినేశారని వార్తలు వచ్చాయి. సీఎం వద్దకు చేరాల్సిన అవి ఎవరి వల్ల మధ్యలో మిస్ అయ్యాయే గుర్తించేందుకు సీఐడీ విచారణకు ఆదేశించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి.ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ సీఐడీ డైరెక్టర్ జనరల్ సంజీవ్ రంజన్ ఓజా మాట్లాడుతూ.. సమోసాలు కనిపించకుండా పోవడంపై ఎలాంటి దర్యాప్తు జరపడం లేదని తెలిపారు. ఇది అంతర్గత విషయమని చెప్పారు. అయితే అధికారుల సమావేశానికి ఆర్డర్ చేసిన స్నాక్స్ బాక్స్‌లు కనిపించకుండా పోవడంపై ఆశ్చర్యం వేయడం చాలా సాధారణమైన విషయమని అన్నారు.దీనిపై విచారణ ఏం లేదని, కేవలం బాక్సుల గురించి తెలుసుకోవడానికి ఒక విజ్ఞప్తి మాత్రమే జరిగిందని చెప్పారు.మరోవైపు ప్రతిపక్ష బీజేపీ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిందిు. ఇదంతా హాస్యాస్పదమైన వ్యవహారమని, సమోసాలను ఎవరు తింటే ఏమవుతుందని ప్రశ్నించింది. ‘సీఎం తినాల్సిన సమోసాలను తీసుకెళ్లిందెవరు..? సీఐడీ తేల్చనుంది..’’ అని బీజేపీ నేత అమిత్ మాలవీయ ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతుండటంతో సీఎం కార్యాలయం కూడా స్పందించింది. ప్రభుత్వం అటువంటి విచారణకు ఆదేశించలేదని, ఈ విషయంతో సంబంధం లేదని చీఫ్ మీడియా అడ్వైజర్ నరేష్ చౌహాన్ వెల్లడించారు. ఇది సీఐడీ అంతర్గత వ్యవహారమని చెప్పారు. -
సీఎం సమోసాలు ఎవరు తిన్నారు? సీఐడీ దర్యాప్తు..
-
హిమాచల్ కాంగ్రెస్ సంచలన నిర్ణయం
షిమ్లా: కాంగ్రెస్ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్‌ను రద్దు చేయాలని నిర్ణయించింది. హిమాచల్‌లో పీసీసీ యూనిట్‌తో పాటు జిల్లా, బ్లాక్ కమిటీలు రద్దు చేస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘హిమాచల్ ప్రదేశ్ పీసీసీ యూనిట్, జిల్లా అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీలను రద్దు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఈ ప్రతిపాదనకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది’ అని ప్రకటనలో తెలిపారు. Congress dissolved the entire state unit of the PCC, District Presidents and Block Congress Committees of Himachal Pradesh Congress Committee, with immediate effect. pic.twitter.com/zfXcnb2S2o— ANI (@ANI) November 6, 2024కాంగ్రెస్ యూనిట్ రద్దు అనంతరం హిమాచల్ మంత్రి అనిరుధ్ సింగ్ మాట్లాడుతూ.. త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్‌ని నియమిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్‌లో ఇది సాధారణ చర్యగా పేర్కొన్నారు. పీసీసీ, డీసీసీ, బ్లాక్ యూనిట్ల పదవీకాలం ముగిసినందున వాటిని రద్దు చేయాలనేది హిమాచల్ కాంగ్రెస్ కార్యకర్తలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.కాగా ప్రస్తుత కార్యవర్గాన్ని రద్దు చేసి, కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతించాలని కోరుతూ ఇటీవల హిమాచల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్ పార్టీ హైకమాండ్‌కు లేఖ రాశారు. దీని ద్వారా కొత్త కమిటీలలో క్రియాశీల సభ్యులకు ప్రాధాన్యత లభిస్తుందని ఆమె తెలిపారు. దీనిపై ఆమె సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖుతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. -
‘ఇంకో నెల తర్వాతే మాకు దీపావళి’
దేశం మొత్తం దీపావళి సంబురాల్లో మునిగిపోయింది. పెద్దలు పిల్లలతో చేరి సరదాగా బాణాసంచాలు కాలుస్తూ అల్లరి చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లకు పని చెప్తూ.. కోట్ల మంది సోషల్ మీడియాలో ‘ఫెస్టివ్ వైబ్’ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాకపోతే ఈ పండుగను మన దేశంలోని ఆ ప్రాంతంలో మాత్రం నెల తర్వాతే.. అదీ కాస్త భిన్నంగా జరుపుకుంటారు.దీపావళి అంటే పూలు.. వాటి మధ్య ప్రమిధలు.. బాణాసంచాల మోత.. స్వీ ట్లు కచ్చితంగా ఉండాలి. కానీ, దీపావళి పండుగ జరిగిన నెలరోజుల తర్వాత హిమాచల్ ప్రదేశ్‌లో బుద్ధి దీపావళి budhi diwali చేస్తారు. ఇది మామూలు దీపావళిలాగా ఉండదు. పెద్ద తాడుతో మానవ హారంగా ఏర్పడి అక్కడి ప్రజలు నృత్యాలు చేస్తారు. వీధుల్లో వాయిద్యాలు వాయిస్తూ.. తిరుగుతారు. రాత్రి కాగానే పెద్ద కాగడాలకు మంటలు అంటించి.. జానపద పాటలతో చిందులేస్తారు. ప్రత్యేక పిండి వంటలను తోటి వాళ్లతో పంచుకుంటారు. అయితే ఈ కోలాహలంలో బయటివాళ్లకు అనుమతి ఉండదు.ఆడామగా అంతా ఈ వేడుకలో పాల్గొంటారు. ఇంతకు ముందు.. జంతు బలి కొన్నేళ్లుగా సంప్రదాయంగా కొనసాగింది. అయితే న్యాయ స్థానాల జోక్యంతో ఆ ఆచారానికి బ్రేకులు పడ్డాయి. గతంలో కొందరు మద్యం సేవించి ఇందులో పాల్గొనేవారు. ఇప్పుడు దానికి దూరంగానే ఉంటున్నారు వాళ్లు. రాముడు వనవాసం ముగిసి అయోధ్యకి వచ్చాక.. ఆ సమాచారం నెలరోజులకు ఇక్కడి ప్రజలకు తెలిసిందట. అప్పటి నుంచి తరతరాలుగా ఆలస్యంగా ఇక్కడి ప్రజలు దీపావళిని జరుపుకుంటున్నారు. నెల తర్వాత.. మార్గశిర అమవాస్య సమయంలో మూడు నుంచి వారం బుద్ధి దీపావళి వేడుక ఘనంగా జరుగుతుంది. అయితే రాక్షస సంహారం వల్లే తాము ఈ సంబురం చేసుకుంటున్నామని.. వ్యవసాయంతో తీరిక లేకుండా దీపావళికి దూరమైన తమ కోసమే బుద్ధి దీపావళి పుట్టుకొచ్చిందని మరికొందరు చెబుతుంటారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కులు, మండి, షిమ్లా, సిర్మౌర్ జిల్లాలో, ఉత్తరాఖండ్ జౌన్సర్ రీజియన్‌లోని కొన్ని చోట్ల బుద్ధి దీపావళి తరతరాలుగా వేడుకగా జరుగుతోంది. కొందరు దీపావళితో పాటు బుద్ధి దీపావళిని జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు దీపావళి. అలాగే బుద్ధి దీపావళి ద్వారా తాము వెలిగించిన కాగడాల వెలుతురులో దుష్ట శక్తుల్ని పారదోలడంతో పాటు.. తమకు మంచి బుద్ధి ప్రసాదించమని దేవుళ్లను అక్కడి ప్రజలు వేడుకుంటారు. -
ఆంధ్ర 344 ఆలౌట్
సాక్షి, విశాఖపట్నం: ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆంధ్ర బౌలర్ శశికాంత్ మూడు వికెట్లతో మెరిశాడు. గ్రూప్ ‘బి’లో భాగంగా విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న పోరులో ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి హిమాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 65 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అంకిత్ (53; 3 ఫోర్లు), ఆకాశ్ వశిష్ట్ (52 బ్యాటింగ్; 5 ఫోర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఓపెనర్లు శుభమ్ అరోరా (16), ప్రశాంత్ చోప్రా (10)తో పాటు... ఏకాంత్ సేన్ (20) విఫలమయ్యారు. ఆంధ్ర బౌలర్లలో శశికాంత్ 3 వికెట్లు పడగొట్టగా... విజయ్ ఒక వికెట్ తీశాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 295/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు 92.4 ఓవర్లలో 344 పరుగులకు ఆలౌటైంది. ఆదివారం 49 పరుగులు చేసి మిగిలిన 4 వికెట్లు కోల్పోయింది. మనీశ్ (42; 4 ఫోర్లు), త్రిపురాణ విజయ్ (33; 2 ఫోర్లు) చివర్లో కీలక పరుగులు చేశారు. హిమాచల్ ప్రదేశ్ బౌలర్లలో దివేశ్ శర్మ 5 వికెట్లు పడగొట్టగా... రిషీ ధావన్ మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో మెరుగైన ప్రదర్శనతో ఆంధ్ర జట్టు దీటుగా బదిలిస్తున్న హిమాచల్ ప్రదేశ్ జట్టు ఇంకా 146 పరుగులు వెనుకబడి ఉంది. చేతిలో ఆరు వికెట్లు ఉండగా... కెపె్టన్ రిషీ ధావన్ (38 బ్యాటింగ్; 4 ఫోర్లు), ఆకాశ్ వశి‹Ù్ట క్రీజులో ఉన్నారు. స్కోరు వివరాలు ఆంధ్ర తొలి ఇన్నింగ్స్: అభిõషేక్ రెడ్డి (ఎల్బీ) (బి) రిషీ ధావన్ 5; మహీప్ కుమార్ (ఎల్బీ) (బి) రిషీ ధావన్ 4; షేక్ రషీద్ (బి) అరి్పత్ 69; హనుమ విహారి (సి) రిషీ ధావన్ (బి) ముకుల్ నేగీ 66; శ్రీకర్ భరత్ (సి) ఆకాశ్ (బి) దివేశ్ శర్మ 65; అశ్విన్ హెబ్బర్ (సి) ఏకాంత్ సేన్ (బి) దివేశ్ శర్మ 15; మనీశ్ (సి) ముకుల్ నేగీ (బి) దివేశ్ శర్మ 42; త్రిపురాణ విజయ్ (సి) ఆకాశ్ వశి‹Ù్ట (బి) రిషీ ధావన్ 33; శశికాంత్ (సి) శుభమ్ అరోరా (బి) దివేశ్ శర్మ 6; లలిత్ మోహన్ (సి) శుభమ్ అరోరా (బి) దివేశ్ శర్మ 14; సత్యనారాయణ రాజు (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (92.4 ఓవర్లలో ఆలౌట్) 344. వికెట్ల పతనం: 1–5, 2–11, 3–136, 4–202, 5–226, 6–245, 7–317, 8–321, 9–341, 10–344. బౌలింగ్: వినయ్ 9–0–41–0; రిషీ ధావన్ 19–3–80–3; అర్పిత్ గులేరియా 11–0–47–1; దివేశ్ శర్మ 20.4–4–60–5; మయాంక్ డాగర్ 18–2–53–0; ముకుల్ నేగీ 15–2–52–1. హిమాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్: శుభమ్ అరోరా (సి) శ్రీకర్ భరత్ (బి) శశికాంత్ 16; ప్రశాంత్ చోప్రా (సి) శ్రీకర్ భరత్ (బి) శశికాంత్ 10; అంకిత్ (బి) విజయ్ 53; ఏకాంత్ సేన్ (బి) శశికాంత్ 20; ఆకాశ్ వశిష్ట్ (బ్యాటింగ్) 52; రిషీ ధావన్ (బ్యాటింగ్) 38; ఎక్స్‌ట్రాలు 9, మొత్తం (65 ఓవర్లలో 4 వికెట్లకు) 198. వికెట్ల పతనం: 1–12, 2–31, 3–59, 4–124. బౌలింగ్: శశికాంత్ 15–6–50–3; సత్యనారాయణ రాజు 14–1–40–0; లలిత్ మోహన్ 11–1–26–0; విజయ్ 13–1–41–1; మహీప్ కుమార్ 4–1–10–0; మనీశ్ 7–0–28–0; రషీద్ 1–0–2–0. -
ఆంధ్ర 295/6
సాక్షి, విశాఖపట్నం: ప్రధాన బ్యాటర్లంతా రాణించడంతో రంజీ ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్‌తో పోరులో ఆంధ్ర జట్టు మంచి స్కోరు దిశగా సాగుతోంది. గ్రూప్ ‘బి’లో భాగంగా శనివారం విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ప్రారంభమైన పోరులో... తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర జట్టు 80 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. కెప్టెన్ షేక్ రషీద్ (69; 9 ఫోర్లు), హనుమ విహారి (66; 12 ఫోర్లు) అర్ధ శతకాలు సాధించగా... వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ (39 బంతుల్లో 65; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) టి20 తరహాల్లో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి హాఫ్ సెంచరీ చేశాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు అభిõÙక్ రెడ్డి (5), మహీప్ కుమార్ (4) విఫలం కావడంతో 11 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును రషీద్, విహారి ఆదుకున్నారు. ప్రత్యర్థి బౌలర్లు చెలరేగిపోతున్న సమయంలో సంయమనం పాటించిన ఈ జోడీ... క్రీజులో కుదురుకున్నాక వేగంగా పరుగులు రాబట్టింది. రెండో వికెట్‌కు 125 పరుగులు జోడించిన తర్వాత హనుమ విహారి వెనురదిగగా... షేక్ రషీద్‌తో కలిసి శ్రీకర్ భరత్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అప్పటి వరకు నిధానంగా సాగిన స్కోరుబోర్డు... భరత్ రాకతో పరుగులు పెట్టింది. బౌలర్‌తో సంబంధం లేకుండా భరత్ ఎడాపెడి బౌండ్రీలతో విజృంభించాడు. ఇక మరింత భారీ స్కోరు చేయడం ఖాయమే అనుకుంటున్న దశలో వీరిద్దరూ వెనుదిరగడంతో పరుగుల వేగం తగ్గింది. అశ్విన్ హెబర్ (15) ఎక్కువసేపు నిలవలేకపోగా... మనీశ్ (31 బ్యాటింగ్; 2 ఫోర్లు), త్రిపురన విజయ్ (20 బ్యాటింగ్; ఒక ఫోర్) క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ ఏడ వికెట్‌కు అజేయంగా 50 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. -
విశాఖలో మ్యాచ్.. క్రికెట్ అభిమానులకు శుభవార్త
సాక్షి, విశాఖపట్నం: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ మ్యాచ్‌కు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది. ఎలైట్ గ్రూప్-బిలో ఉన్న ఆంధ్ర- హిమాచల్ ప్రదేశ్ మ్యాచ్‌కు నగరం వేదిక కానుంది. పీఎం పాలెంలో గల ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శనివారం నుంచి ఈ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ మొదలుకానుంది. ఇందుకు సంబంధించిన నిర్వహణ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.కాగా అక్టోబరు 26- 29 వరకు ఆంధ్ర- హిమాచల్ ప్రదేశ్ మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారు కాగా.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇన్నింగ్స్ సాగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం సెషన్లో సెషన్లో ఆంధ్ర, మధ్యాహ్నం సెషన్లో హిమాచల్‌ప్రదేశ్ జట్లు నెట్స్‌లో ప్రాక్టీసు చేశాయి. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు నిర్వాహకులు క్రికెట్ ప్రేమికులకు గుడ్‌న్యూస్ అందించారు.క్రికెట్ అభిమానులకు శుభవార్తరేపటి నుంచి ఆరంభం కానున్న రంజీ మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. స్టేడియం వద్ద 15వ నంబర్ గేట్ నుంచి ఉచిత ప్రవేశం ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి స్టేడియంలోకి అనుమతిస్తారు. ఇదిలా ఉంటే.. రంజీ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో ఆంధ్ర జట్టు తొలుత విదర్భ చేతిలో 74 పరుగులు, రెండో మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఒక్క వికెట్ తేడాతో ఓడిపోయింది.ఆంధ్రా జట్టు కెప్టెన్‌గా రషీద్ఆంధ్రా జట్టు కెప్టెన్ రికీబుయ్, బ్యాటింగ్ ఆల్‌రౌండర్ నితీష్‌కుమార్ ఆస్ట్రేలియా టూర్లో భాగంగా అనధికార నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్‌లకు ఎంపికవడంతో అందుబాటులో లేరు. ఆంధ్రా జట్టుకు షేక్ రషీద్ నాయకత్వం వహించనుండగా అభిషేక్ రెడ్డి, హానుమ విహారి ఓపెనింగ్ చేయనుండగా అశ్విన్ హెబ్బర్ మిడిలార్డర్లోను, శ్రీకర్ భరత్ కీపింగ్ చేస్తారు. మహీప్‌కుమార్, వంశీకృష్ణ బ్యాట్ ఝళిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో స్టీఫెన్, సత్యనారాయణ, శశికాంత్, స్పిన్ బౌలింగ్ విభాగంలో లలిత్, విజయ్ బంతి, మనీష్ మెరుపులు మెరిపించనున్నారు. రఫీ, కరణ్ షిండే సైతం జట్టుకు ఎంపికయ్యారు.చదవండి: ఇదేం కెప్టెన్సీ రోహిత్?.. మాజీ హెడ్‌కోచ్ ఘాటు విమర్శలు -
వీధుల్లో బిక్షాటన చేసే అమ్మాయి నేడు డాక్టర్‌గా..!
జీవితం అంటేనే కష్టాల మయం అనుకుంటాం. కటిక దారిద్ర్యంలో మగ్గుతున్న వాళ్లకు కూడా జీవితం కొన్ని సువర్ణావకాశాలు అందిస్తుంది. అయితే ఆ అవకాశాలను తెలివిగా అందిపుచ్చుకున్న వారే అద్భుతాలు చేసి చూపిస్తారు. అలాంటి కోవకు చెందిందే పింకీ హర్యాన్. మురికి వాడల్లో తల్లిదండ్రులతో బిక్షాటన చేస్తూ బతికిన అమ్మాయి..నేడు డాక్టర్ అయ్యి అందర్నీ ఆశ్చర్యపరిచడమే గాక ఎందరికో స్ఫూర్తిని కలిగించింది. వివరాల్లోకెళ్తే.. పింకీ హర్యానా హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలోని మెక్లీడ్‌గంజ్‌లో నిరుపేద కుటుంబంలో జన్మించింది. చరణ్ ఖుద్లోని మురికివాడలో నివసించే ఆ కుటుంబం రోడ్డుపై భిక్షాటను చేస్తూ జీవనం సాగిస్తుండేది. చెత్త కుండిల్లో ఆహారాన్ని ఏరుకుని తినే దుర్భర జీవితాన్ని సాగించేది పింకీ కుటుంబం. ప్రారంభ జీవితం అంతా కటిక దారిద్య్రం, కష్టాల మధ్య సాగింది. ఏదో అద్భుతం జరిగినట్లుగా ధర్మశాలలోని టోంగ్ లెన్ ఛారిటబుల్ ట్రస్ట్‌కు నేతృత్వం వహించే బౌద్ధ సన్యాసి లోబ్సాంగ్ జమ్యాంగ్ దృష్టిలో పింకీ పడింది. అదే ఆమె జీవితాన్ని మార్చబోతుందని ఆనాడు ఊహించలేదు. ఆయన పింకీని చూసి చదివించాల్సిందిగా ఆమె తండ్రి కాశ్మీరీ లాల్‌ను కోరాడు. అందుకు మొదట కాశ్మీరీ లాల్ అంగీకరించలేదు. ఐతే జమ్యాంగ్ తన మాటలతో అతడిని ఒప్పించి పింకీని ధర్మశాలలోని దయానంద్ పబ్లిక్ స్కూల్లో చేరిపించాడు. అలా అక్కడ నిరుపేద పిల్లల కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్ హాస్టల్లో నివశించిన తొలి విద్యార్థిగా పింకీ నిలిచింది. తన జీవితాన్ని మంచిగా మార్చుకునేందుకు దేవుడిచ్చిన ఈ సువర్ణావకాశాన్ని పింకీ అస్సలు వదులుకోలేదు. ఆ పాఠశాలలో చేరినప్పటి నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చకోవడమే గాక మంచి మార్కులతో అన్ని తరగతులు పాసయ్యింది. చివరికీ పింకీ 12వ తరగతి పరీక్షలు పూర్తి అయిన వెంటనే రాసిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్‌లో కూడా ఉత్తీర్ణత సాధించింది. కానీ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సంపాదించుకునేలా మంచి ర్యాంకు సాధించలేకపోయింది. అందువల్ల మిగతా పిల్లలు మాదిరిగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అంతంతా ఫీజులు చెల్లించి చదవుకులేని నిస్సహయ స్థితిలో పడింది పింకీ. మళ్లీ తన పరిస్థితి మొదటకొచ్చింది అనుకునేలోపే 2018లో, టోంగ్-లెన్ ఛారిటబుల్ ట్రస్ట్ మరోసారి ఆమెను ఆదుకుంది. చైనాలోని ప్రఖ్యాత మెడికల్ కాలేజ్‌లో అడ్మిషన్ పొందడంలో పింకీకి సహాయం చేసింది. అలా ఆమె ఆరేళ్లలో చైనీస్ కళాశాల నుంచి ఎంబీబీఎస్ పట్టా పొంది డాక్టర్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ ధర్మశాలకు తిరిగి వచ్చేసింది. ప్రస్తుతం ఆమె భారతదేశంలో వైద్యం అందించేందుకు అవసరమైన మెడికల్ లైసెన్స్‌ని పొందేందుకు ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎగ్జామినేషన్(ఎఫ్ఎంజీఈ) కోసం సిద్ధమవుతుంది. ఇంతలా పింకీ జీవితాన్ని మార్చిన బౌద్ధ సన్యాసి లోబ్సాంగ్ జమ్యాంగ్ ఆమెను చూసి గర్వపడుతున్నానని అన్నారు. పిల్లలు మంచి మనుషులుగా మారేలా ప్రోత్సహించబడితే నిస్సందేహంగా అద్భుతాలు చేస్తారని విశ్వసిస్తానని చెప్పారు. ఇక పింకీ తన జీవితాన్ని ఇంతలా గౌరవప్రదంగా మార్చిన జమ్యాంగ్ని తన తండ్రిగా అభివర్ణించింది. అంతేగాదు పింకీలా ఆ ధర్మశాలలో చదివిన వందలాది మంది పిల్లలు జీవితాలు మారడమే గాక వారంతా వైద్యులు, ఇంజనీర్లు, ప్రభుత్వాధికారులుగా స్థిరపడ్డారు. ఈ పింకీ గాథ జీవితంలో లభించే అవకాశాన్ని అందిపుచ్చుకుని కష్టపడితే కష్టాల నుంచి బయటపడటమే గాక అద్భుతాలు చేసి చూపించొచ్చని తెలుస్తోంది కదూ..!.(చదవండి: ఈసారి దీపావళికి చీరను వెరైటీగా కట్టుకోండిలా..!) -
రంజీ ట్రోఫీ చరిత్రలో అరుదైన ఘట్టం
రంజీ ట్రోఫీ చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన టాప్-4 బ్యాటర్లు సెంచరీలు చేశారు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఇలా జరగడం ఇది రెండో సారి మాత్రమే. 2019 ఎడిషన్‌లో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గోవా టాప్-4 ఆటగాళ్లు సెంచరీలు చేశారు. నాడు అమోన్కర్ (160), గోవెకర్ (160), స్మిత్ పటేల్ (137 నాటౌట్), అమిత్ వర్మ (122 నాటౌట్) మూడంకెల స్కోర్‌ను చేశారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హిమాచల్ టాప్-4 బ్యాటర్లు శుభమ్ అరోరా (11), చోప్రా (171), అంకిత్ కల్సి (205 నాటౌట్), ఏకాంత్ సేన్ (101) సెంచరీలు చేశారు. ఓవరాల్‌గా ఫస్టక్లాస్ క్రికెట్ చరిత్రలో ఇలా టాప్-4 బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇది 14వ సారి.మ్యాచ్ విషయానికొస్తే.. టాప్-4 బ్యాటర్లు సెంచరీలతో కదంతొక్కడంతో తొలుత బ్యాటింగ్ చేసిన హిమాచల్ తొలి ఇన్నింగ్స్‌ను 663 పరుగుల వద్ద (3 వికెట్ల నష్టానికి) డిక్లేర్ చేసింది. డబుల్ సెంచరీ చేసిన అంకిత్ కల్సితో పాటు మయాంక్ డాగర్ (56) క్రీజ్‌లో ఉన్నాడు. ఉత్తరాఖండ్ బౌలర్లలో మయాంక్ మిశ్రా, స్వప్నిల్ సింగ్, యువరాజ్ చౌదరీ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఉత్తరాఖండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. కెప్టెన్ రవికుమార్ సమర్థ్ 21 పరుగులు చేసి ఔట్ కాగా.. అవ్నీశ్ సుధా (24), వైభవ్ బట్ (1) క్రీజ్‌లో ఉన్నారు. రవికుమార్ వికెట్ వైభవ్ అరోరాకు దక్కింది. హిమాచల్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఉత్తరాఖండ్ ఇంకా 613 పరుగులు వెనుకపడి ఉంది.చదవండి: మాహారాజు కాబోతున్న టీమిండియా మాజీ క్రికెటర్.. ఎవరంటే? -
ఇండియా-చైనా సరిహద్దుల్లో డ్రోన్ కదలికలు: హిమాచల్ మంత్రి
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో ఉన్న ఇండియా-చైనా సరిహద్దుల్లో డ్రోన్ కదలికలను గుర్తించినట్లు హిమాచల్ ప్రదేశ్ మంత్రి జగత్ సింగ్ నేగి తెలిపారు. సరిహద్దుల్లో పొరుగు దేశం చైనా.. డ్రోన్లను నిఘా, గూఢచర్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నట్లు ఆయన ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం బోర్డర్లో డ్రోన్ల కదలికల విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘కిన్నౌర్ జిల్లాలోని షిప్కి లా , రిషి డోగ్రీ గ్రామాల్లో డ్రోన్ కార్యకలాపాలను గుర్తించాం. సరిహద్దు ప్రాంతానికి సమీపంలో తరచుగా డ్రోన్లు ఎగురుతున్నట్లు గత వారంలో కూడా గుర్తించాం. షిప్కిలా, రిషిడోగ్రి గ్రామాల్లో వాస్తవ నియంత్రణ రేఖ వరకు రహదారి నిర్మాణం పురోగతిలో ఉంది. ..పొరుగుదేశం చైనా ఈ డ్రోన్ల ద్వారా నిఘా, గూఢచర్యానికి పాల్పడే అవకాశాన్ని తోసిపుచ్చలేం. డ్రోన్లను పోలీసులు, ఆర్మీ సిబ్బంది సైతం చూశారు. చైనా డ్రోన్లు భారత గగనతలంలోకి చొరబడటం చట్టాలను ఉల్లంఘించినట్లు అవుతుంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని అవసరమైన ఆదేశాలు జారీ చేయాలి’ అని అన్నారు.ఇక.. హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్, లాహౌల్, స్పితి గిరిజన జిల్లాలు చైనాతో 240 కిలో మీటర్ల సరిహద్దును కలిగి ఉన్నాయి. -
వంకర బుద్ధులు మారవా?
ఏదో వంకన కులమతాల కుంపట్లు రాజేసే పనికి పాల్పడవద్దని సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన హితవు కూడా ప్రభుత్వాల చెవికెక్కడంలేదు. ఇందుకు ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వాల పోకడలు నిదర్శనం. కావడ్ యాత్ర సాగే పొడవునా ఆహారం, ఇతర తినుబండారాలు విక్రయించే వ్యాపారులు తమ పేర్లను తెలిపే బోర్డుల్ని ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగం జారీ చేసిన హుకుంను మొన్న జూలైలో సుప్రీంకోర్టు నిలిపి వేయగా, దాన్ని వమ్ము చేస్తూ వేరే మార్గంలో అమలు చేయటానికి అక్కడి ప్రభుత్వం పూనుకోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. యూపీని చూసి మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్‌లు సైతం వాతలు పెట్టుకున్నాయి. అవి కూడా బీజేపీ ప్రభుత్వాలే. కానీ ఈ మాదిరి ధోరణులకు వ్యతిరేకమని చెప్పే కాంగ్రెస్ నేతృత్వంలోని హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం సైతం ఈ ప్రయత్నమే చేయటం మరింత దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. ఒక మంత్రి తెలిసీ తెలియక ఏదో అన్నారని కాంగ్రెస్ సంజాయిషీ చెబుతున్నా ఆత్మవిమర్శ చేసుకోవటం ఆ పార్టీ బాధ్యత. ఎవరూ కుల మతాలను ఎంచుకుని పుట్టరు. కానీ పుట్టకనుబట్టి వివక్ష ప్రదర్శించే దురాచారం మన దేశంలో రాజ్యాంగం నిషేధించినా కొనసాగుతూనేవుంది. దహనకాండకు దిగే వ్యక్తులను దుస్తుల్ని బట్టి పోల్చుకోవచ్చని అయిదేళ్లక్రితం ప్రధాని నరేంద్ర మోదీ అన్నప్పుడు దుమారం రేగింది. అప్పటికి పౌరసత్వ సవరణ చట్టంపై కొనసాగుతున్న ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. దుస్తులే కాదు... ఇంటిపేర్లూ, పేర్లూ, పేర్లచివరవుండే తోకలు, తినే తిండి కూడా సమ స్యాత్మకం కావటం వర్తమానంలో ఎక్కువైంది. దీన్నంతటినీ గమనించబట్టే యూపీ పోలీసుల ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఇలాంటి ఉత్తర్వులిచ్చే అధికారం పోలీసు విభాగానికిఉండదని చెబుతూనే తోపుడు బండ్లు, ధాబాలు, హోటళ్ల యజమానులు స్వచ్ఛందంగా తమ పేర్లు ప్రదర్శించదల్చుకుంటే అభ్యంతరంలేదని, అయితే బలవంతంగా ఆ పని చేయించరాదని సుప్రీంకోర్టు అప్పట్లో తెలిపింది. ఇప్పుడు ఏకంగా ఆహార భద్రత, ప్రమాణాల చట్టం సవరణ మాటున యూపీ సర్కారు దాన్ని అమలుచేయడానికి పూనుకుంటున్నది. ఆహారంలో కల్తీ జరగకుండా, అపరిశుభ్రత లేకుండా చూడటం తన ఉద్దేశమంటున్నది. హిమాచల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి విక్రమాదిత్య సింగ్ సైతం ఆ బాణీనే వినిపిస్తున్నారు. రాష్ట్రంలో ఇటీవల మతఘర్షణలు చెలరేగటం వెనక ఆహారపదార్థాల విక్రయానికి సంబంధించి బలమైన చట్టం లేకపోవటమే కారణమని ఆయనకు అనిపించిందట!యూపీఏకు ఆవును చేరిస్తే అది ఎన్డీయే అవుతుందని చాన్నాళ్లక్రితం ఎవరో చమత్కరించారు. తమ చాపకిందకు నీళ్లు రాబోతున్నాయని చివరాఖరులో అర్థమయ్యాక హిందూ ఓటు బ్యాంకును కాపాడుకోవటానికి ఆనాటి యూపీఏ సర్కారు వేసిన అనేక పిల్లిమొగ్గలు చూశాకే అలాంటి వ్యాఖ్యా నాలు వినబడ్డాయి. ఆ మన స్తత్వం పార్టీలో ఇంకా సజీవంగా ఉండటంవల్లే విక్రమాదిత్యసింగ్ ఇలా అన్నారా లేక సీఎం రేసులో భంగపడి కేబినెట్ పదవితో సరిపెట్టుకోవటం జీర్ణించుకోలేక వివాదా స్పదంగా మాట్లాడారా అన్నది ఆ పార్టీ తేల్చుకోవాలి. ఆహార విక్రయ దుకాణాల దగ్గర యజ మానుల పేర్లుండాలన్న అంశంలో కమిటీ వేశామని, ఇంతకుమించి ముందుకుపోలేదని కాంగ్రెస్ ప్రతినిధి ఇస్తున్న వివరణ సందేహాలను తగ్గించకపోగా పెంచింది. పార్టీకంటూ ఒక సిద్ధాంతం, విధానం ఉందా లేదా? యూపీ నిర్ణయాన్ని నిర్ణయాన్ని పార్టీ వ్యతిరేకించినప్పుడు వేరే రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభుత్వం సరిగ్గా అదే పనికి పూనుకోవటంలోని మతలబేమిటి? పేర్లు కాదు... వారి వారి గుర్తింపు కార్డులు ప్రదర్శించాలన్న ప్రతిపాదన వచ్చిందని మరో సంజాయిషీ. ఏమైతేనేం... మతంపేరిట విద్వేషాలు సృష్టించటమే అంతరార్థంగా కనబడుతోంది. దుకాణంలో విక్రయించే ఆహార పదార్థాలు పరిశుభ్రమైనవని, ప్రామాణికమైనవని విశ్వసిస్తేనే వాటిని జనం కొనుక్కుతింటారు. కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేయటమే మన దేశంలో కనిపిస్తుంది. ఈ విషయంలో అవసరమైన చట్టాలున్నాయి. ఆ నిబంధనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకునే విభాగాలు ఉంటున్నాయి. కానీ వాటిని పకడ్బందీగా అమలు చేయటానికి సిద్ధపడని ప్రభుత్వాలు ఆ వంకన విభజన రాజకీయాలకు తెరతీస్తున్నాయి. ప్రత్యర్థులను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలవికాని హామీలిచ్చి అధికారంలోకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం అందరూ ఎంతో భక్తివిశ్వాసాలతో స్వీకరించే లడ్డూపై ఎలాంటి దుష్ప్రచారం చేసిందో దేశమంతా చూస్తూనే వుంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ తెలివితక్కువ చర్యను స్ఫూర్తిగా తీసుకున్నట్టు కనబడుతోంది. మనుషుల పేర్లనుబట్టి, వారి ఆహారపుటలవాట్లనుబట్టి వారి మతాలను తెలుసుకోవటం సులభ మవుతుందన్నది వాస్తవమే కావొచ్చు. కానీ వారు విక్రయించే పదార్థాలు సమస్తం కేవలం ఆ కారణంతో మంచివి, ప్రామాణికమైనవి లేదా అపరిశుభ్రమైనవి ఎలా అవుతాయో అనూహ్యం. విపరీత పోకడలున్నవారికి తప్ప ఇటువంటి ఆలోచనలు రావు. సొంతంగా ఎటూ ఉన్నతమైన ఆలోచనలు రావు. కనీసం రాజ్యాంగాన్ని అనుసరించి మాత్రమే పాలించాల్సినవారు సర్వోన్నత న్యాయస్థానం హితవు చెప్పాకైనా మారాలికదా! వ్యక్తులుగా వక్రమార్గాలు వెదుక్కోవటం మానవ స్వభావమని సరిపెట్టుకోవచ్చు. రాజ్యం అటువంటి పనులకు పూనుకుంటే అంతిమంగా అరాచకానికి దారితీస్తుంది. కనుక మతిమాలిన చేష్టలను ఇకనైనా మానుకోవాలి. -
సోనియాగాంధీపై కంగన సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీపై బీజేపీ ఎంపీ కంగనరనౌత్ సంచలన ఆరోపణలు చేశారు. హిమాచల్ ప్రదేశ్ దివాలా తీయడానికి సోనియాగాంధీయే కారణమన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులన్నీ సోనియాగాంధీకే వెళ్లాయని,దీనివల్లే రాష్ట్రం దివాలా తీసిందన్నారు.చివరకు వరద సాయానికిగాను విరాళాలుగా వచ్చిన సొమ్ము కూడా సోనియాకే వెళ్లిందని తీవ్ర ఆరోపణలు చేశారు.‘హిమాచల్‌లో కాంగ్రెస్ అవినీతి ఎంతుందనేది ప్రతి ఒక్కరికి తెలుసు.ఈ అవినీతి వల్లే రాష్ట్రం దశాబ్దాల వెనుకబాటుకు గురైంది. ఇందుకే కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకిలించాలని హిమాచల్ ప్రజలను కోరుతున్నా’అని కంగన పిలుపిచ్చారు.కాగా,ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్ నిధులలేమితో దివాలా అంచున ఉంది. దీంతో సీఎం, మంత్రులు,కార్పొరేషన్ల చైర్మన్లు రెండు నెలల పాటు జీతాలు తీసుకోరని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కంగన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
హిమాచల్ సీఎం సుఖూకు అస్వస్థత
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖూ అస్వస్థతకు గురయ్యారు. ఈ మేరకు ఆయన సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో పరీక్షలు చేయించుకున్నారు. ఆయనను పరీక్షించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ నేపధ్యంలో సీఎం జమ్మూ ఎన్నికల పర్యటన వాయిదా పడింది.మీడియాకు అందిన వివరాల ప్రకారం సీఎం సుఖూ శనివారం ఉదయం ఐజీఎంసీలో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా సీఎంకు అల్ట్రాసౌండ్ పరీక్ష చేయడంతో పాటు వైద్యులు అతని రక్త నమూనాలు కూడా తీసుకున్నారు. సీఎం ఆరోగ్యంపై ఐజీఎంసీ ఎంఎస్ డాక్టర్ రాహుల్ రావు ఓ ప్రకటన విడుదల చేశారు.సీఎం సుఖూ తనకు కడుపు పైభాగంలో నొప్పి వస్తోందని తెలిపారని, ఈ నేపధ్యంలోనే అతనికి అల్ట్రాసౌండ్ చేయించామన్నారు. దీని రిపోర్టు నార్మల్ గా ఉందని, అయితే ముందుజాగ్రత్తగా రక్తపరీక్ష కూడా చేశామన్నారు. ఈ రిపోర్టు ఇంకా రావాల్సి ఉందన్నారు. కాగా గత ఏడాది సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖూ కడుపునొప్పితో బాధపడుతూ వారం రోజుల పాటు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.ఇది కూడా చదవండి: తెరుచుకున్న జార్ఖండ్- బెంగాల్ సరిహద్దు -
గ్యారంటీల అమలుకు గంజాయి సాగు.. కాంగ్రెస్ సర్కార్‌కు బీజేపీ మద్దతు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో గెలుపే లక్క్ష్యంగా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు అంటూ ప్రజలపై పథకాల వర్షం కురిపించింది. తీరా ఎన్నికల్లో గెలిచాక.. ఆర్థిక నష్టాల కారణంగా హామీలను తీర్చడంలో భారంగా మారింది. ఈ నేపథ్యంలో ఆర్థిక భారం తగ్గించుకునేందుకు హిమాచల్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. హిమాచల్‌లో గంజాయి సాగుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా ఏడాదికి రూ.2000 కోట్లు సమకూరుతాయని అంచనా వేసుకుంది.అయితే, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల అమలు కోసం గంజాయి సాగు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం సూచన మేరకు రెవెన్యూ శాఖ మంత్రి జగత్ సింగ్ నేగి నేతృత్వంలో శాస్త్రవేత్తలు, ఉద్యానవన నిపుణులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పీకర్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. తాజాగా కమిటీ నివేదిక శాసనసభలో ప్రవేశపెట్టగా ఏకగ్రీవ ఆమోదం పొందింది. దీనికి ప్రతిపక్ష బీజేపీ సభ్యులు కూడా మద్దతు ఇవ్వడం గమనార్హం.ఇక.. ఔషధ, శాస్త్రీయ, పారిశ్రామిక అవసరాల కోసం నియంత్రిత పద్ధతిలో గంజాయి సాగు చేయాలని నిపుణుల బృందం ప్రతిపాదన చేసినట్టు మంత్రి నేగి తెలిపారు. గంజాయి సాగు సులభం కాబట్టి దీనికి ప్రజల మద్దతు కూడా ఉందని చెప్పారు. ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించినట్టు చెప్పారు. గంజాయి సాగుకు అనుమతించేందుకు నార్కోటిక్ నిబంధనలను(ఎన్డీపీఎస్ చట్టం) సవరించాలని నిపుణుల కమిటీ సూచించినట్టు చెప్పుకొచ్చారు.ఈ కమిటీ హిమాచల్ ప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లోనూ పర్యటించి.. ఔషధ, పారిశ్రామిక అవసరాల కోసం గంజాయి సాగును ఎలా ఉపయోగించవచ్చనే దానిపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంది. అంతేకాకుండా జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గంజాయి సాగు విజయవంతమైన నమూనాలను కూడా అధ్యయనం చేసింది. వాటన్నింటినీ పరిశీలించిన తర్వాతే హిమాచల్ ప్రదేశ్‌లో గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించినట్లు నేగి స్పష్టం చేశారు.వైద్యంలో గంజాయి వాడకం..గంజాయిని కేవలం మాదక ద్రవ్యంగా సేవించడమే కాకుండా పలు ఔషధాల్లో కూడా ఉపయోగిస్తారు. మూర్ఛ, మానసిక అనారోగ్యం, క్యాన్సర్ రోగులకు గంజాయి మొక్కలోని మత్తు లేని భాగాన్ని తీసుకుని చికిత్స చేయవచ్చని పరిశోధనల్లో వెల్లడైంది. గంజాయి మొక్కలో రెండు రకాల రసాయనాలను గుర్తించారు. ఒకటి టెట్రాహైడ్రోకాన్నబినాల్(టీహెచ్‌సీ), మరొకటి కాన్నబిడాల్(సీబీడీ). టీహెచ్‌సీ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో గంజాయి మొక్కను నార్కోటిక్ పంటగా కూడా పిలుస్తారు. కాన్నబిడాల్లో ఎలాంటి మత్తు పదార్థాలు ఉండవు. గంజాయి మొక్కలోని ఈ రసాయనాన్ని వైద్యంలో వాడుతున్నారు. నేషనల్ బొటానికల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా గంజాయి మొక్క నుంచి 25వేలకు పైగా ఉత్పత్తులను తయారు చేస్తున్నారు.చట్టం ఏం చెబుతోంది?మన దేశంలో ఎన్డీపీఎస్ యాక్ట్-1985 ప్రకారం, హెరాయిన్, మార్ఫిన్, గంజాయి, హశిష్, హశిష్ ఆయిల్, కొకైన్, మెఫిడ్రిన్, ఎల్ఎస్డీ, కేటమైన్, అంఫెటమైన్ లాంటి మత్తు పదార్థాల ఉత్పత్తి, రవాణా, అమ్మకం చట్టవిరుద్ధం. ఈ యాక్ట్‌లోని 20వ సెక్షన్ ప్రకారం గంజాయిని అక్రమంగా సాగు చేస్తే 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది.అయితే, గంజాయి సాగుపై దేశమంతటా నిషేధం ఉన్నప్పటికీ, ఈ విషయంలో చట్టాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు ఉంది. దేశంలో ఒక్క ఉత్తరాఖండ్‌లో మాత్రమే గంజాయి సాగుకు షరతులతో కూడా అనుమతులు ఉన్నాయి. యూపీ, జమ్మూకశ్మీర్, మణిపూర్ రాష్ట్రాల్లో పరిశోధనాపరమైన అవసరాల కోసం మాత్రమే గంజాయి సాగుకు అనుమతి ఉంది. గంజాయి పంటను ఏడాదిలో రెండు సార్లు పండించవచ్చు.అమెరికాలో ఇలా.. ప్రపంచంలో చాలా దేశాల్లో గంజాయి వాడకం తప్పేం కాదు. అలాగే గంజాయిని చట్ట బద్ధం చేయాలనే డిమాండ్ అమెరికాలో ఎప్పటి నుంచో ఉంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే ప్రకారం.. 88 శాతం అమెరికన్లు గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేయాలని కోరుతున్నారు. కేవలం 11 శాతం మంది మాత్రమే వద్దని కోరారు. తాజాగా బైడెన్ హయాంలో మాదకద్రవ్యాల చట్టంలో మార్పులు జరిగాయి. గంజాయిని షెడ్యూల్-3 డ్రగ్ నుంచి షెడ్యూల్-1 డ్రగ్ కేటగిరీకి మార్చారు. అంటే ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల జాబితా నుంచి తక్కువ ప్రమాదకరమైన మాదకద్రవ్యాల జాబితాలోకి చేర్చుతున్నారు. -
బోల్తా కొట్టిన బస్సు.. ఒకరు మృతి, 12 మందికి గాయాలు
పఠాన్‌కోట్: పంజాబ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంబా నుంచి అమృత్సర్ వెళ్తున్న హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఆర్టీసీ బస్సు పఠాన్‌కోట్ సమీపంలో శుక్రవారం ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా అదుపుతప్పి బొల్తా కొట్టడంతో బస్సు ముందు అద్దాలు పగిలాయి.ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.. హిమాచల్ ప్రదేశ్- పంజాబ్ సరిహద్దుల్లోని మమూన్ కాంట్‌లో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పఠాన్‌కోట్-చంబా జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడిన సీసీటీవీ ఫుటేజీ వైరల్‌గా మారింది.ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. పఠాన్‌కోట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులుఉండగా.. చంబా నుంచి అమృత్‌సర్‌కు వెళుతోంది. -
ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే.. పెన్షన్ రద్దు
సిమ్లా: పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మరో పార్టీకి చేరకుండా ఉండేందుకు బుధవారం అసెంబ్లీలో ఓ కొత్త బిల్లును తీసుకువచ్చింది. పార్టీ మారితే ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు చేసేలా ఆ బిల్లును రూపొందించింది. ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు హిమాచల్ ప్రదేశ్ శాసనసభలో.. సభ్యుల భత్యాలు ,పెన్షన్ (సవరణ బిల్లు)- 2024 పేరుతో నూతన బిల్లును ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది. ఇక ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు కొత్త బిల్లు ప్రకారం పెన్షన్ రద్దు వర్తిస్తుంది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఏ సమయంలోనైనా ఎమ్మెల్యేలుగా అనర్హతకు గురైతే.. కొత్త బిల్లు ప్రకారం పెన్షన్‌కు అర్హులు కాదు’అని ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఈ బిల్లు ప్రస్తావించింది.ఇక..ఫిబ్రవరి 27న హిమచల్ ప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కాకుండా బీజేపీ అభ్యర్థికి ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటు వేశారు. అనంతరం వారంతా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఇటువంటి పరిస్థితులు ఎదురుకాకుండా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలకమైన బిల్లును ఆమోదించింది. -
మహిళల కనీస వివాహ వయసు 21 ఏళ్లు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో ఇకపై మహిళల కనీస వివాహ వయసు 21 ఏళ్లు. నిర్దేశిత వయసు కంటే తక్కువ వయసున్న మహిళలకు పెళ్లి చేస్తే నేరం అవుతుంది. మహిళ కనీస వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది. ఈ మేరకు బాల్య వివాహాల నిషేధ చట్టం–2006 స్థానంలో బాల్య వివాహాల(హిమాచల్ ప్రదేశ్) నిషేధ సవరణ–2024 చట్టం తీసుకొచ్చారు. 2006 నాటి చట్టం ప్రకారం మహిళల కనీస వివాహ వయసు 18 ఏళ్లు కాగా, పురుషుల కనీస వివాహ వయసు 21 ఏళ్లుగా ఉంది -
హిమాచల్ ప్రదేశ్ లో వరద బీభత్సం..
-
వాగులో కొట్టుకుపోయిన కారు
సిమ్లా: ఎగువన కురుస్తున్న వర్షాలకు ఉనా జిల్లాలోని జైజోన్ చో వాగు ఉప్పొంగడంతో ఎస్యూవీ వాహనం కొట్టుకుపోయి తొమ్మిది మంది మృతి చెందారు. ఇద్దరు గల్లంతయ్యారు. మృతుల్లో 8 మంది ఒకే కుటుంబానికి చెందినవారు కాగా, మరొకరు డ్రైవర్. ఉనా జిల్లాలోని డెహ్రా నుంచి పంజాబ్‌లోని ఎస్బీఎస్ నగర్ జిల్లా మెహ్రోవాల్ గ్రామానికి ఓ వివాహానికి హాజరయ్యేందుకు ఎస్యూవీ వాహనంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది, డ్రైవర్ ప్రయాణిస్తున్నారు. భారీ వర్షం కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తున్న జైజోన్ చో నదిని దాటుతుండగా వారి వాహనం కొట్టుకుపోయింది. స్థానికులు దీపక్ భాటియా అనే వ్యక్తిని రక్షించి జైజోన్ లోని ప్రభుత్వ డిస్పెన్సరీకి తరలించారు. వాహనం వరద నీటిలో ఇరుక్కుపోయింది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందం రంగంలోకి దిగింది. వాగు నుంచి ఐదుగురు మహిళలతో సహా తొమ్మిది మంది మృతదేహాలను వెలికితీసింది. గల్లంతైన ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టింది. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దాటొద్దని స్థానికులు హెచ్చరించినా డ్రైవర్ పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. మృతులను సూర్జిత్ భాటియా, అతని భార్య పరమజీత్ కౌర్, సోదరుడు స్వరూప్ చంద్, మరదలు బిందర్, మెహత్‌పూర్‌లోని భటోలీకి చెందిన షినో, ఆమె కుమార్తెలు భావన, అను, కుమారుడు హర్షిత్, డ్రైవర్ బిందుగా గుర్తించారు. -
Himachal: వరదలతో విలవిల.. 87 రహదారులు మూసివేత
గత కొన్ని రోజులుగా హిమాచల్‌ప్రదేశ్‌ను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో వరదలు సంభవిస్తున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ పరిస్థితులను గమనించిన అధికారులు మనాలి-లేహ్ జాతీయ రహదారితో పాటు 87 ఇతర రహదారులను మూసివేశారు. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తాయని ప్రకటించిన వాతావరణ శాఖ ఆగస్టు 7, 8 తేదీల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా చంద్రభాగ్ నది నీటిమట్టం పెరిగిందని హిమాచల్ ప్రదేశ్ పోలీసులు తెలిపారు. లాహౌల్, స్పితి జిల్లాలో రెండు చోట్ల ఆకస్మిక వరదలు సంభవించాయి. జింగ్ జింగ్బర్ సమీపంలో మనాలి-లేహ్ జాతీయ రహదారి మట్టిపెళ్లలు పేరుకుపోయాయి. దర్చా, సర్చు పోలీసు చెక్‌పోస్టుల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బ్రో) హైవేపై పేరుకుపోయిన చెత్తను తొలగిస్తోంది. కాగా కేదార్నాథ్ నడక మార్గంలో భారీ వర్షం కారణంగా వివిధ ప్రదేశాలలో చిక్కుకుపోయిన యాత్రికులు, స్థానికులను రక్షించే కార్యక్రమం ఐదవ రోజు కూడా కొనసాగింది. సోమవారం 1,401 మందిని రక్షించారు. గుజరాత్‌లోని నవ్సారి, వల్సాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ ప్రాంతాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
ఉత్తరాన వరుణాగ్రహం
డెహ్రాడూన్/సిమ్లా/న్యూఢిల్లీ/జైపూర్: కేరళ కొండల్లో బురద, బండరాళ్లు సృష్టించిన విలయ విషాద ఘటన మరువకముందే ఉత్తరాదిపై వరుణుడు తన ప్రకోపం చూపించాడు. ఉత్తరాఖండ్ మొదలు రాజస్థాన్దాకా ఉత్తరభారత రాష్ట్రాల్లో ఎడతెగని వానలు పడ్డాయి. దీంతో ఏడు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 36 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాఖండ్‌లో 12 మంది, హిమాచల్ ప్రదేశ్‌లో ఐదుగురు, ఢిల్లీలో ఆరుగురు, ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు, హరియాణాలో ముగ్గురు, రాజస్థాన్‌లో ముగ్గురు, బిహార్‌లో ఐదుగురు చనిపోయారు. చాలా మంది జాడ గల్లంతైంది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ సమీప జనావాసాలను తమలో కలిపేసుకున్నాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కొండప్రాంతాల్లోని ఇళ్లు నేలమట్టమయ్యాయి. పలుచోట్ల రోడ్లు తెగిపోయాయి. దీంతో రాకపోకలు స్తంభించాయి. ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర విపత్తు స్పందన దళాలు, పోలీసులు, స్థానికులు ముమ్మర సహాయక చర్యల్లో మునిగిపోయారు. ఉత్తరాఖండ్‌లో ఎక్కువ మరణాలు ఉత్తరాఖండ్‌లో కుంభవృష్టి కారణంగా 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ సమీప ఇళ్లను నేలమట్టంచేశాయి. హరిద్వార్, తెహ్రీ, డెహ్రాడూన్, ఛమోలీ జిల్లాలో వర్షపాత ప్రభావం ఎక్కువగా ఉంది. హరిద్వార్‌లోని రోషనాబాద్‌లో 210 మిల్లీమీటర్లు, డెహ్రాడూన్‌లో 172 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెహ్రీ జిల్లా జఖన్యాలీ గ్రామంలో రోడ్డ పక్కన రెస్టారెంట్‌పై కొండచరియలు పడటంతో ఒకే కుటుంబంలో ముగ్గురు మట్టిపెళ్లల కింద సజీవసమాధి అయ్యారు. గౌరీకుండ్–కేదార్నాథ్ కొండమార్గంలో పాతిక మీటర్ల దారి వర్షాలకు కొట్టుకుపోవడంతో భీమ్బలీ చౌక్ వద్ద చిక్కుకుపోయిన 1,525 మందిలో 425 మందిని సురక్షితంగా తీసుకొచ్చామని సీఎం చెప్పారు. 1,100 మందిని సోనప్రయాగ్కు సురక్షితంగా తీసుకొచ్చామని విపత్తు కార్యదర్శి వినోద్ సుమన్ చెప్పారు. మిగతా వారిని హెలీకాప్టర్లలో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హిమాచల్‌లో 50 మంది జాడ గల్లంతు హిమాచల్ ప్రదేశ్‌నూ వర్షాలు ముంచెత్తాయి. వర్ష సంబంధ ఘటనల్లో ఐదుగురు మరణించారు. వేర్వేరు జిల్లాల్లో మొత్తంగా 50 మంది జాడ గల్లంతైంది. పలు వంతెనలు, రోడ్లు, ఇళ్లు వరదనీటి ఉధృతికి కొట్టుకుపోయాయి. మండీ, రాంపూర్, సిమ్లా జిల్లాల్లో వర్షప్రభావం ఎక్కువగా ఉంది. మనాలీ–చండీగఢ్ జాతీయ రహదారిపై చాలాచోట్ల కొండచరియలు పడటంతో రాకపోకలు స్తంభించాయి. గల్లంతైన వారి జాడ కోసం ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసులు డ్రోన్ల సాయంతో గాలిస్తున్నారు. కూలూలోని మలానా డ్యామ్ పై నుంచి నీరు కిందకు ప్రవహిస్తోంది. దీంతో భారీఎత్తున నీరు దిగువ ప్రాంతాలను ముంచేసింది. దీంతో ఎగువ ప్రాంతాలకు తక్షణం వెళ్లిపోవాలని స్థానికులకు అధికారులు హెచ్చరికలు పంపారు. ఢిల్లీలో 108 మిల్లీమీటర్ల వర్షపాతం గురువారం ఢిల్లీలో వర్ష సంబంధ ఘటనల్లో ఆరుగురు చనిపోయారు. 24 గంటల వ్యవధిలో ఢిల్లీలో 108 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 14 ఏళ్లలో ఢిల్లీలో జూలై నెలలో ఒక్కరోజులో ఇంతటి వర్షం పడటం ఇదే తొలిసారి. ముఖ్యంగా మయూర్‌విహార్ వద్ద 147 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయింది. -
చూస్తుండగానే కుప్పకూలిన భవనం..
-
Himachal: కుంభవృష్టితో 50 మంది గల్లంతు
ఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌లోని షిమ్లా జిల్లా రాంపూర్ ప్రాంతంలోని సమేజ్ ఖాడ్ వద్ద కుంభవృష్టి కారణంగా మెరుపు వరదలు పోటెత్తాయి. ఈ ఘటనలో 50 మంది గల్లంతై ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నలుగురి మృతదేహాల్ని హిమాచల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీంలు వెలికి తీశాయి. మిగతా వాళ్ల కోసం గాలింపు కొనసాగుతోంది.గురువారం వేకువజామున ఈ ఘటన జరిగినట్లు డిప్యూటీ కమిషనర్ అనురాగ్ కశ్యప్ వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు సహా ఇతర సహాయక సిబ్బంది సైతం అక్కడికి చేరుకున్నట్లు ఆయన తెలిపారు. #WATCH | Himachal Pradesh | The SDRF team at the spot in Shimla for the search and rescue operation where 36 people are missing and 2 bodies have been recovered so far after a cloudburst in the Samej Khad of Rampur area in Shimla district. (Visual source - CMO) pic.twitter.com/WqF6vDk4Tx— ANI (@ANI) August 1, 2024 -
హిమాచల్ ఉప ఎన్నికల్లో సీఎం భార్య విజయం
దేశంలోని ఏడు రాష్టాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జూలై 10న ఎన్నికలు జరగగా, నేడు(శనివారం) ఓట్ల లెక్కింపు జరుగుతోంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లోని డెహ్రా ఉపఎన్నికకు సంబంధించిన ఫలితం వెలువడింది.ఇక్కడి నుంచి పోటీచేసిన బీజేపీ అభ్యర్థి హోషియార్ సింగ్ ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ భార్య, కాంగ్రెస్ అభ్యర్థి కమలేష్ ఠాకూర్ విజయం సాధించారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ స్థానానికి సంబంధించిన 11 రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసింది. హిమాచల్ ప్రదేశ్‌లో ఉప ఎన్నికలు జరిగిన మూడు స్థానాల్లో డెహ్రా స్థానం ఫలితం మొదట వెలువడింది. -
మరో వివాదంలో చిక్కుకున్న కంగనా రనౌత్
ధర్మశాల : బీజేపీ ఎంపీ,బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ‘ఆధార్ కార్డ్’ వివాదంలో చిక్కుకున్నారు.ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో మండీ లోక్‌సభ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించిన ఆమె తన నియోజకవర్గ ప్రజలతో భేటీ అవుతున్నారు. ఈ తరుణంలో సమస్యల్ని పరిష్కరించమని తన వద్దకు వచ్చే వారు తప్పని సరిగా ఆధార్ కార్డ్ తెచ్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలపై కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది.కంగనా రౌనత్‌పై పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నేత విక్రమాధిత్య సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు నియోజక వర్గ ప్రజలకు ఏదైనా సమస్యలుంటే తనని కలవవచ్చు. ఇందుకోసం ఆధార్ కార్డ్ అవసరం లేదు. మనం ప్రజలకు ప్రతినిధులం.రాష్ట్ర ప్రజల సమస్యల్ని పరిష్కరించాలి.అది పెద్దదవ్వొచ్చు. చిన్నదవ్వొచ్చు. లేదంటే వారి వ్యక్తిగత పనులు కావొచ్చు.గుర్తింపు కార్డ్ అవసరం లేదుని స్పష్టం చేశారు.ప్రజలు ఐడెంటిటి కార్డ్‌లు తీసుకొని రావాలని చెప్పడం సరైన పద్దతి కాదని ధ్వజమెత్తారుప్రజల్ని ఆధార్ కార్డ్ అడగడంపై వస్తున్న విమర్శలకు కంగనా రౌనత్ స్పందించారు. హిమాచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గం టూరిస్ట్‌లకు హాట్‌స్పాట్.ఇక్కడికి అనేక మంది వస్తుంటారు.అందుకే నియోజక వర్గ ప్రజల్ని ఆధార్ కార్డ్ అడిగాను. ప్రతి ఒక్కరి సమస్యల్ని పరిష్కరించడమే నా లక్ష్యం. ఎవరూ ఇబ్బంది పడకూడదు’అని వ్యాఖ్యానించారు. నెటిజన్లు సైతం కంగనా రనౌత్‌ను విమర్శిస్తున్నారు. ఓట్లు అడిగే సమయంలో ఆధార్ కార్డ్ అడగలేదు. ఎన్నికల ముందు ఆధార్ కార్డ్ అవసరం లేదు. మరి ఇప్పుడు ఆధార్ కార్డ్ ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నిస్తున్నారు. -
ఢిల్లీలో దాహం.. దాహం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తీవ్ర జల సంక్షోభం నెలకొంది. పొరుగు రాష్ట్రాల నుంచి నీటి సరఫరా తగ్గడంతో ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి దారుణంగా పెరిగింది. యమునా నదీ జలాల సరఫరా విషయంలో ఢిల్లీ, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్ మధ్య వివాదాలు తారాస్థాయికి చేరడంతో నీటి కష్టాలు తీవ్రమయ్యే ప్రమాదకర పరిస్థితి దాపురించింది. మండుతున్న ఎండలకు తోడు నీటి కొరతతో ప్రజలు అల్లాడుతుంటే ట్యాంకర్ మాఫియా, రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం ఈ సమస్యను మరింత జఠిలం చేస్తున్నాయి. ఆగిన సరఫరా.. తగ్గిన నిల్వలుఢిల్లీ తాగునీటి అవసరాల్లో 90 శాతం యమునా నదీ మునాక్ కాలువ ద్వారా తీరుతోంది. మరికొంత ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఎగువ గంగ కాల్వల ద్వారా వచ్చే నీటితో ఢిల్లీ నీటి కష్టాలు తీరుతున్నాయి. యమునా నదిపై ఉన్న చంద్రవాల్, వజీరాబాద్, ఓక్లా నీటి శుద్ధి కర్మాగారాలుసహా మరో నాలుగు ప్లాంట్ల ద్వారా ఢిల్లీకి అవసరమైన నీటి సరఫరా జరుగుతోంది. ఢిల్లీకి ప్రతి రోజూ 1,200 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం ఉండగా ఢిల్లీ జల్ బోర్డు 950 మిలియన్ గ్యాలన్ల నీటినే సరఫరా చేస్తోంది. హరియాణా ప్రభుత్వం మునాక్ ఉప కాల్వల ద్వారా 683 క్యూసెక్కులు, ఢిల్లీ చిన్న కాల్వల ద్వారా మరో 330 క్యూసెక్కుల నీటిని వజీరాబాద్ నీటి శుద్ధి రిజర్వాయర్‌కు సరఫరా చేయాల్సి ఉంది. మొత్తంగా రోజుకి 1,013 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉన్నా హరియాణా ప్రభుత్వం కేవలం 840 క్యూసెక్కుల నీటినే విడుదల చేస్తోందని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. హరియాణా నీటి సరఫరాను తగ్గించడంతో ఉత్తర, పశ్చిమ ఢిల్లీకి నీటిని సరఫరా చేసే వజీరాబాద్ రిజర్వాయర్‌లో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. రిజర్వాయర్‌లో సగటు నీటి మట్టం 674.5 అడుగులు కాగా ప్రస్తుతం 669 అడుగులకు పడిపోయింది. దీంతో రిజర్వాయర్ నుంచి రోజుకు 70 మిలియన్ గ్యాలన్ల నీరు మాత్రమే విడుదల అవుతోందని ఢిల్లీ జల వనరుల మంత్రి అతిశి ఆరోపించారు. దీంతో చాలా ప్రాంతాల్లో నీటి సరఫరా తగ్గి ట్యాంకర్లపై జనం ఆధారపడుతున్నారు. ఇదే అదునుగా ట్యాంకర్ మాఫియా రెచ్చిపోయింది. ఇష్టారీతిగా డబ్బులు వసూలు చేస్తోంది. నీటి ఎద్దడి అంశంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా హరియాణా ముఖ్యమంత్రి నయాబ్‌సింగ్ షైనీతో మాట్లాడి, నీటి సరఫరా పెంచే విషయమై చర్చలు జరుపుతున్నారు. మునాక్ కాలువ, ఇతర కాల్వల నుంచి ట్యాంకర్ మాఫియా నీటి దోపిడీపై ప్రత్యేక దర్యాప్తు బృందంచే విచారణ చేపట్టాలని బుధవారం బీజేపీ రాష్ట్ర శాఖ డీజీపీకి విజ్ఞప్తి చేసింది. నీటి ఎద్దడికి రాజధానిలా మారుతున్న ఢిల్లీలో చాలా కాలనీల్లో ఎటు చూసినా మహిళలు, చిన్నారులు బిందెలు, బకెట్లు పట్టుకుని పెద్దపెద్ద క్యూ లైన్లలో నిల్చున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. మాట మార్చిన హిమాచల్ప్రదేశ్ఇన్నాళ్లూ నీటిని సరఫరా చేసిన హిమాచల్ ప్రదేశ్ మాట మార్చింది. తమ వద్ద 135 క్యుసెక్కుల మిగులు జలాలు లేవని, కావాలంటే యమునా బోర్డును ఆశ్రయించాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. హిమాచల్ నుంచి హరియాణాకు వచ్చిన మిగులు జలాలను ఢిల్లీ కోసం విడుదల చేయాలంటూ కేజ్రీవాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేసిన నేపథ్యంలో ప్రతిగా హిమాచల్ సర్కార్ కోర్టులో అఫిడవిట్ సమర్పించింది. ఈ కేసును గురువారం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ప్రసన్న బి.వరాలేల సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ‘‘ నీటి నిర్వహణలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైంది. కాల్వల ద్వారా నీటి పంపిణీ నష్టాలను తగ్గించడంలో, నీటి చౌర్యాన్ని నియంత్రించడం, తలసరి నీటి వినియోగాన్ని నియంత్రించడంలో ఢిల్లీ వైఫల్యం చెందింది. అభివృధ్ధి చెందుతున్న దేశాల్లో పంపిణీ నష్టాలు 10శాతం ఉంటే ఢిల్లీలో ఏకంగా 52.35 శాతం నష్టాలు ఉన్నాయి. కేంద్ర పట్టణాభివృధ్ధి శాఖ నిర్దేశకాల ప్రకారం పట్టణ నీటి తలసరి సరఫరా 135 లీటర్లుగా ఉంటే ఢిల్లీలో అతిగా 172 లీటర్లు సరఫరాచేస్తున్నారు. హిమాచల్ వద్ద వాస్తవానికి మిగులు జలాలు లేవు. ఉన్నాయంటూ గతంలో ఇచ్చిన ప్రకటనను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వండి’ అని హిమాచల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు విన్నవించుకున్నారు. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘ ఇదెంత తీవ్రమైన అంశమో మీకు తెలియట్లేదు. మీపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలో వద్దో తర్వాత తేలుస్తాం’ అని ఆగ్రహం వ్యక్తంచేసింది. దీంతో గత ప్రకటన ఉపసంహరణకు పద్దతి ప్రకారం అఫిడవిట్ సమర్పిస్తానని అడ్వకేట్ జనరల్ చెప్పారు.మాకంత నైపుణ్యం లేదుహిమాచల్ వాదనలు విన్నాక మానవతా దృక్పథంతో నీటిని సరఫరా చేయాలని సాయంత్రంకల్లా ఎగువ యమునా జలబోర్డ్ వద్ద దరఖాస్తు పెట్టుకోవాలని ఢిల్లీ సర్కార్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘‘ యమునా నదీ జలాల పంపకం అనేది సంక్లిష్టమైన వ్యవహారం. ఇప్పటికిప్పుడు మధ్యేమార్గంగా నదీజలాల పంపకం సమస్యను తీర్చేంత స్థాయిలో మాకు సాంకేతిక నైపుణ్యం లేదు. 1994 అవగాహనా ఒప్పందం ద్వారా రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్న యమునా బోర్డే ఈ సమస్యకు పరిష్కారం చూపగలదు. అదనంగా 150 క్యూసెక్కుల కోసం ఢిల్లీ గతంలోనే దరఖాస్తు చేసుకుంది. దానిపై జలబోర్డ్ త్వరగా నిర్ణయం వెలువర్చాలి. లేదంటే శుక్రవారం నుంచి రోజువారీగా బోర్డ్ సమావేశమై సమస్యను పరిష్కరించాలి’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.ఢిల్లీ ప్రభుత్వ వాదనేంటి?నీటి ట్యాంకర్ల మాఫియాపై ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు బుధవారం తలంటిన నేపథ్యంలో గురువారం కేజ్రీవాల్ సర్కార్ అఫిడవిట్ సమర్పించింది. ‘‘ ట్యాంకర్ల మాఫియా హరియాణా వైపు ఉన్న యమునా నది వెంట రెచ్చిపోతోంది. ఆ ప్రాంతం ఢిల్లీ జలబోర్డ్ పరిధిలోకి రాదు. అసలు అక్కడ చర్యలు తీసుకునే అధికారం ఎవరికి ఉందో తేల్చాలని ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం. స్పందన శూన్యం. హరియాణా నుంచి ఢిల్లీకి నీటి సరఫరా వృథాను 30 శాతం ఉంచి ఐదు శాతానికి తగ్గించాం’’ అని అఫిడవిట్లో పేర్కొంది. గురువారం ఢిల్లీ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ కోర్టులో వాదించారు. ‘‘ జలబోర్డులు ప్రభుత్వ అనుకూల అధికారులతో నిండిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో కమిటీ వేసి సుప్రీంకోర్టే సమస్యను పరిష్కరించాలి’ అని అన్నారు. ఈ వాదనతో హరియాణా విభేధించింది. ‘‘ ఢిల్లీకి నీటిని సరఫరా చేసే వజీరాబాద్ బ్యారేజీలో కనీస నీట నిల్వలు ఉండాల్సిందే. అతి సరఫరా కుదరదు. ఈ అంశాన్ని యమునా బోర్డ్‌కు వదిలేస్తే మంచిది’ అని హరియాణా తరఫున లాయర్ శ్యామ్ దివాన్ వాదించారు. ఈ అంశాన్ని ఇకపై జలబోర్డే చూసుకుంటుందని అదననపు సొలిసిటర్ జనరల్ విక్రమ్‌జీత్ బెనర్జీ చెప్పారు. దీంతో జలబోర్డులో తేల్చుకోండంటూ ఢిల్లీ సర్కార్ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. మరోవైపు రోజుకు 5 కోట్ల గ్యాలెన్ల నీటి సరఫరా తగ్గడంతో నీటిని వృథా చేయకండని ఢిల్లీవాసులకు ప్రభుత్వం సూచనలు చేసింది. -
ఎంపీని కానిస్టేబుల్ కొట్టడం దేనికి సంకేతం?
హిమాచల్ ప్రదేశ్ మండీ లోక్ సభ స్థానం నుండి నూతనంగా ఎన్నికైన ప్రముఖ సినీ తార కంగనా రనౌత్‌ను చండీగఢ్ విమానాశ్రయంలో సెక్యూరిటీ విధులను నిర్వహిస్తున్న కుల్విందర్ కౌర్ అనే సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చెంప మీద కొట్టడం దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఎందుకు కొట్టావు అని సదరు ఎంపీ అడిగినప్పుడు రైతు చట్టాల వ్యతిరేక ఉద్యమానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు ఈ చెంప దెబ్బ అని దురుసుగా సమాధానం చెప్పడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. ఆ కానిస్టేబుల్ సోదరుడు కిసాన్ మజ్దూర్ సంఘ్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉండడం, ఆమ్ ఆద్మీ సపోర్టుగా ఉండడం బట్టి చూస్తే– కంగనా రనౌత్‌పై దాడి యాదృచ్చికంగా జరిగింది కాదనీ, ఇది ఒక ప్రణాళికా బద్ధంగానే జరిగిందనే భావన కలుగక మానదు. నూతనంగా ఎన్నికైన కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై సమగ్రమైన విచారణ జరిపి, దేశ ప్రజలకు వాస్తవ విషయాలు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. రైతు వ్యతిరేక చట్టాల ఉద్యమం పేరుతో రైతుల ముసుగులో ఖలిస్థాన్ వేర్పాటు వాదుల మద్దతుదారులు రిపబ్లిక్ డే రోజున ఎర్రకోటపై ఖలిస్థాన్ జెండాను ఎగరవేయడం, శాంతి భద్రతలను పరిరక్షించడానికి వచ్చిన అనేకమంది పోలీసుల తలలు పగలగొట్టడం వంటి దృశ్యాలు దేశ ప్రజల స్మృతి పథంలో ఇప్పటికీ స్థిరంగానే ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ప్రతిపక్షాలు తమ రాజకీయ స్వార్థం కోసం రైతు చట్టాల వ్యతిరేక ఉద్యమకారులను రెచ్చగొడుతున్నాయనీ, పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంలో అనేక చోట్ల హింస చెలరేగి శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందనీ నిఘా వర్గాలు హెచ్చరించడంతో పోలీసులు సందర్భోచితంగా సంయమనం పాటించారు. దీంతో దేశానికి పెద్ద ముప్పే తప్పింది.ప్రభుత్వ విధానాలపైనా, దేశంలో జరుగుతున్న అనేక సంఘటనలూ, ఉద్యమాలపైనా అనేకమంది వ్యతిరేకంగా, అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తుంటారు. అలాగే ఒక పౌరురాలిగా కంగనా కూడా రైతు ఉద్యమంపై వ్యాఖ్య చేశారు. ఈ చెంప దెబ్బ ఆ వ్యాఖ్యలు చేసినందుకే కొట్టానని కౌర్ చెప్పిన సమాధానం నమ్మశక్యంగా లేదు. సిక్కు తీవ్రవాద భావాలు కుల్విందర్ కౌర్ మనసులో ఎవరైనా నాటి ఉండవచ్చునేమో! ఈ కోణంలో ఎందుకు ఆలోచించకూడదు? 1984 అక్టోబర్ 31న భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని కాల్చి చంపిన ఆమె అంగరక్షకులైన సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్‌లు సిక్కులు అనే విషయం మరవకూడదు. నాడు వారు ‘ఖలిస్థాన్’ వేర్పాటు వాద భావజాలాన్ని తలకెక్కించుకుని ఆ ఘాతుకానికి ఒడిగట్టారు.సిక్కు వేర్పాటు వాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ 2023 జూన్ 18న కెనడాలో హత్యకు గురైన తర్వాత, కెనడా, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇటలీ వంటి దేశాలలో ఖలిస్థాన్ వేర్పాటు వాదుల మద్దతుదారులు భారతదేశానికి వ్యతిరేకంగా, హిందువులకు వ్యతిరేకంగా ప్రకటనలు గుప్పించారు. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో... నిజర్ హత్య వెనుక భారత ప్రభుత్వ నిఘా వర్గాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీనికి మద్దతుగా అమెరికా దౌత్యవేత్తలు మాట్లాడడం, భారత ప్రభుత్వం ఇందుకు ఆధారాలు చూపించాలని కౌంటర్ వేయడం వంటి వాటి నేపథ్యంలో ఈ సంఘటనను పరిశీలించాలి. ఉల్లి బాల రంగయ్య వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు -
లోక్ సభ ఫలితాలపై ఖర్గే అసంతృప్తి..
-
ఢిల్లీ నీటి సంక్షోభం: నీటిని విడుదల చేయాలని హిమాచల్‌కు సుప్రీం ఆదేశం
ఢిల్లీ: గత కొన్ని రోజులుగా ఢిల్లీలో నీటి సంక్షోభం తీవ్రంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీకి సాయంగా మిగులు నీటిని విడుదల చేయాలని తాజాగా సుప్రీంకోర్టు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ఆదేశాలు జారీ చేసింది. రేపు(శుక్రవారం) 137 క్యూసెక్కుల నీటిని ఢిల్లీకి విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నీటి విడుదలకు హిమాచల్ ప్రదేశ్ అంగీకారం తెలిపిందని కోర్టు తెలిపింది. అదేవింధంగా వాజీరాబాద్ బ్యారేజ్ ద్వారా నీటి విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని హర్యానాను సుప్రీం కోర్టు ఆదేశించింది. నీటి విడుదల చేసే సమయంలో హర్యానాకు ముందుస్తు సమాచారం అందించాలని హిమాచల్ ప్రదేశ్‌కు కోర్టు సూచించింది.సంక్షోభ సమయంలో నీటిని ఎట్టిపరిస్థితుల్లో వృథా చేయవద్దని ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఢిల్లీలో తీవ్రమైన నీటి సంక్షోభం నెలకొనడంతో తమ రాష్ట్రానికి సరిహద్దు రాష్ట్రాలు ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా నుంచి నీటిని అందించాలని ఆప్ ప్రభుత్వం గతవారం సుప్రీకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.దేశ రాజధాని ఢిల్లీ వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రత కారణంగా నీటి సంక్షోభం ఏర్పడింది. ఇలాంటి సమయంలో నీటిని వృథా చేస్తే రూ. 2 వేలు జరిమానా వేస్తామని ఆప్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటక చేసిన విషయం తెలిసిందే. -
హిమాచల్ ప్రదేశ్ లో 4 చోట్ల బీజేపీ ఆధిక్యం
-
హిమాచల్‌లో సుఖు సర్కార్ సేఫ్!
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో రాజకీయ అస్థిరతకు తాత్కాలికంగా తెరపడింది. ముఖ్యమంత్రి సుఖి్వందర్ సింగ్ సుఖు ప్రభుత్వం ఊపిరిపీల్చుకుంది. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కే.ఎల్.ఠాకూర్, హోషియార్ సింగ్, ఆశిష్ శర్మలు మార్చి 22న రాజీనామా చేయగా, స్పీకర్ కుల్దీప్సింగ్ పథానియా సోమవారం వాటిని ఆమోదించారు. తొలుత కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన ఈ ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు.. ఫిబ్రవరిలో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారు. బీజేపీ అభ్యర్థి హర్‡్ష మహజన్ గెలుపునకు దోహదపడ్డారు. మెజారిటీ ఉండి కూడా కాంగ్రెస్ తమ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్విని గెలిపించుకోలేకపోయింది. అప్పటి నుంచి బీజేపీ హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి పావులు కదుపుతోంది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడగా.. వారు బీజేపీలో చేరి ఆ పార్టీ గుర్తుపై ఉప ఎన్నికల్లో పోటీచేశారు. మంగళవారం ఫలితాలు వెలువడనున్నాయి. హిమాచల్ అసెంబ్లీ బలం 68 కాగా... తొమ్మిది మంది పోను ప్రస్తుతం 59గా ఉంది. కాంగ్రెస్‌కు 34 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీకి 25 మంది సభ్యులున్నారు. మంగళవారం వెలువడే ఉప ఎన్నికల ఫలితాల్లో ఆరింటికి ఆరు స్థానాలు బీజేపీ నెగ్గినా వారి బలం 31 మాత్రమే అవుతుంది. ఈ పరిస్థితుల్లో గనక ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల బలం కూడా తోడైతే బీజేపి 34కు చేరుకునే అవకాశాలుండేవి. అలా కాకుండా సరిగ్గా ఫలితాలకు ముందు రోజు ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించడంతో మళ్లీ ఉప ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చేదాకా సుఖు ప్రభుత్వం కొంతకాలం ఊపిరిపీల్చుకున్నట్లే. అదీ మళ్లీ తాజాగా ఫిరాయింపులేవీ జరగకుండా ఉంటే! -
Lok Sabha Election 2024: హిమాచల్‌ప్రదేశ్‌లో.. బీజేపీకి పరీక్ష!
హిమాచల్‌ప్రదేశ్‌లోని 4 లోక్‌సభ స్థానాలనూ గత రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది. కానీ ఈసారి హ్యాట్రిక్ కొట్టాలన్న కమలనాథుల యత్నాలకు కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఉత్తరాదిన కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం ఇదే. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కచి్చతంగా ఖాతా తెరవాలని ఆ పార్టీ పట్టుదలతో ఉంది. కాంగ్రా, మండి, సిమ్లా, హమీర్పూర్ స్థానాలకు శనివారం తుది విడతలో పోలింగ్ జరగనుంది. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే అయినా బీఎస్పీ కూడా అన్నిచోట్లా బరిలో ఉంది. ప్రముఖ అభ్యర్థుల్లో కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, మాజీ మంత్రి ఆనంద్ శర్మ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తదితరులున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు ఫలితంగా 6 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. వాటి ఫలితాలు సుఖి్వందర్ సింగ్ సుఖు సర్కారు భవితవ్యాన్ని నిర్దేశించనున్నాయి... కాంగ్రా ఇక్కడ అభ్యరి్థని మార్చే ఆనవాయితీని బీజేపీ ఈసారి కూడా కొనసాగించింది. సీనియర్ నేత, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు రాజీవ్ భరద్వాజ్‌కు టికెటిచి్చంది. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత ఆనంద్ శర్మ బరిలో ఉన్నారు. ఈ లోక్‌సభ పరిధిలోని 17 అసెంబ్లీ స్థానాల్లో 11 కాంగ్రెస్ చేతిలోనే ఉన్నాయి. తన ఏడాదిన్నర పాలన చూసి శర్మను గెలిపించాలని ఓటర్లను సీఎం సుఖు కోరుతున్నారు. ఇక్కడ 10 మంది పోటీలో ఉన్నారు.సిమ్లా 2009 నుంచీ బీజేపీయే గెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీ సురేశ్ కుమార్ కాశ్యప్‌కే టికెటిచ్చింది. 15 ఏళ్ల క్రితం చేజారిన ఈ స్థానాన్ని సొంతం చేసుకోవాలనికాంగ్రెస్ పట్టుదలతో ఉంది. కసౌలి ఎమ్మెల్యే వినోద్ సుల్తాన్‌పురికి టికెటిచ్చింది. ఈ లోక్‌సభ పరిధిలోని 17 అసెంబ్లీ స్థానాల్లో 13 కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. ఇక్కడ యాపిల్ రైతులు కీలకం. హట్టి సామాజికవర్గానికి కేంద్రం ఎస్టీ హోదా కలి్పంచడాన్ని బీజేపీ ప్రముఖంగా ప్రచారం చేసుకుంది.మండి 2021 ఉప ఎన్నికలో నెగ్గిన పీసీసీ చీఫ్ ప్రతిభాసింగ్ ఈసారి పోటీకి అనాసక్తి చూపారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ను బీజేపీ పోటీకి పెట్టింది. దాంతో ప్రతిభాసింగ్ కుమారుడు, మంత్రి విక్రమాదిత్య సింగ్‌కు కాంగ్రెస్ టికెటిచి్చంది. అభ్యర్థులిద్దరూ హోరాహోరీ ప్రచారం చేశారు. మండిలో విజయం బీజేపీ, కాంగ్రెస్ మధ్య చేతులు మారుతూ ఉంటుంది. మొత్తమ్మీద కాంగ్రెస్‌దే పై చేయి.హమీర్పూర్ కేంద్ర మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ మళ్లీ బీజేపీ నుంచి బరిలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే సత్పాల్ సింగ్ రజ్దా పోటీ చేస్తున్నారు. ఇది బీజేపీ కంచుకోట. ఎనిమిదిసార్లుగా గెలుస్తూ వస్తోంది. ఈసారి బీజేపీ ఫోర్, సిక్స్ కొడుతుందని అనురాగ్ ఠాకూర్ ప్రచారం చేశారు. అంటే మొత్తం 4 లోక్‌సభ, 6 అసెంబ్లీ స్థానాలనూ కైవసం చేసుకుంటుందన్నది ఆయన ధీమా. ఉప ఎన్నికలు జరుగుతున్న 6 అసెంబ్లీ స్థానాల్లో 4 ఈ లోక్‌సభ సీటు పరిధిలోనే ఉన్నాయి.ప్రధానాంశాలు→ అయోధ్య రామమందిర నిర్మాణాన్ని, జమ్మూ కశీ్మర్లో ఆరి్టకల్ 370 రద్దును బీజేపీ ప్రముఖంగా ప్రచారం చేసింది. → పాత పింఛను విధానం పునరుద్ధరణ, 2023 భారీ వరదల అనంతరం చేపట్టిన సహాయక చర్యలను కాంగ్రెస్ గుర్తు చేసింది. → బీజేపీ వస్తే రిజర్వేషన్లు రద్దేనంటూ ప్రచారం చేసింది. కేంద్రంలో అధికారంలోకొస్తే అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. → కాంగ్రా, హమీర్పూర్ వాసులు ఆర్మీలో ఎక్కువగా చేరుతుంటారు. అగి్నపథ్ పథకాన్ని రద్దు చేస్తామన్న కాంగ్రెస్ హామీ వారిపై ప్రభావం చూపొచ్చు. → వరదలు ఇక్కడి ప్రజల ప్రధాన సమస్యల్లో ఒకటి. → రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయడమే గాక అసెంబ్లీలో బడ్జెట్‌పై ఓటింగ్‌కు హాజరు కాకుండా విప్‌ను ధిక్కరించినందుకు ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. ఉప ఎన్నికల్లో ఆ ఆరుగురికి బీజేపీ టికెటిచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok shabha Elections 2024: ఎవరిని ఎన్నుకుందాం?!
400కు పైగా అని ఒక కూటమి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని మరో కూటమి. హోరాహోరీగా సాగిన సార్వత్రిక ఎన్నికల పోరు తుది అంకానికి చేరుతోంది. జూన్ 1న చివరిదైన ఏడో విడతతో దేశవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. చివరి విడతలో పోలింగ్ జరుగుతున్న రాష్ట్రాల్లో హిమాచల్‌ప్రదేశ్ ఒకటి. అక్కడి తొలి ఓటర్లు పలు అంశాలపై చురుగ్గా స్పందిస్తున్నారు. నాణ్యమైన విద్య, ఉద్యోగావకాశాలు, మహిళా భద్రత తదితరాలకే తమ ప్రాధాన్యత అని చెబుతున్నారు. అయితే అధికార ఎన్డీఏ, విపక్ష ఇండియా కూటముల్లో ఎవరికి ఓటేయాలో తేల్చుకోలేని డైలమాలో ఉన్నామని ఈ యంగ్ ఓటర్స్‌లో పలువురు అంటున్నారు. నోటాకే తమ ఓటని పలువురు చెబుతుండటం విశేషం. రాష్ట్రంలో 4 లోక్‌సభ సీట్లతో పాటు ఉప ఎన్నికలు జరుగుతున్న 6 అసెంబ్లీ స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది.ఉచితాలు అనుచితాలే...! కొన్నేళ్లుగా పారీ్టలన్నీ పోటాపోటీగా ప్రకటిస్తున్న పలు ఉచిత హామీలపై, అమలు చేస్తున్న ఉచిత పథకాలపై యువ ఓటర్లలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతుండటం విశేషం. ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాల భారమంతా అంతిమంగా పన్నులు చెల్లిస్తున్న మధ్యతరగతి ప్రజానీకంపైనే పడుతోందని వారంటున్నారు. అధికారంలోకి వచ్చే పార్టీ ఏదైనా హిమాచల్‌లో ఉచితాలను నిలిపివేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ‘‘అభివృద్ధి పనులకు ఉపయోగించాల్సిన నిధులు ఉచితాల కారణంగా పక్కదారి పడుతున్నాయన్నది నిస్సందేహం’’ అంటున్నారు సోలన్‌కు చెందిన రియా. ఆమె ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటేస్తున్నారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపైనా యువత నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. పదేళ్ల బీజేపీ పాలనను కొందరు విమర్శిస్తుంటే మరికొందరు ప్రశంసిస్తున్నారు. ‘‘బీజేపీ సారథ్యంలోని నియంతృత్వమా? విపక్ష ఇండియా కూటమి సంకీర్ణమా? కేంద్రంలో ఎవరికి మద్దతివ్వాలో తేల్చుకోలేకపోతున్నా. ఏమైనా రాజకీయాల్లో సానుకూల మార్పు మాత్రం కోరుకుంటున్నా’’ అంటున్నాడు మరో ఓటరు నితీశ్. బీజేపీ సర్కారు అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని, రాజ్యాంగ సంస్థలన్నింటినీ దురి్వనియోగం చేస్తోందని డిగ్రీ ఫస్టియర్ విద్యార్థి రోహిత్ విమర్శిస్తున్నారు. ‘‘మోదీకి ఓటేయడమంటే నియంతృత్వాన్ని సమర్థించడమే. అయితే సంకీర్ణ ప్రభుత్వాలు కూడా దేశానికి మంచివి కావు. కనుక ఇండియా కూటమికి ఓటేయడం కూడా సరికాదు’’ అంటున్నాడతను! ఔత్సాహిక జర్నలిస్టు...సంజౌలీ ప్రభుత్వ పీజీ కాలేజీలో జర్నలిజం చదువుతున్న అన్షుల్ ఠాకూర్ ఈసారి ఓటేయాలని ఉత్సాహంతో ఉన్నాడు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు కలి్పంచి, మహిళలకు భద్రతను పెంచేవారికే తన ఓటని స్పష్టంగా చెబుతున్నాడు. పారిశ్రామికవేత్త కావాలన్నది తన కల అని మరో పీజీ విద్యార్థి పరీక్షిత్ అంటున్నాడు. ఆధునిక సాంకేతికతను, స్టార్టప్ సంస్కృతిని, యువతను ప్రోత్సహించే వారికే తన ఓటని చెబుతున్నాడు. ‘‘ఏ పార్టీ అధికారంలోకి వచి్చనా ఉమ్మడి పౌరస్మృతి, నూతన విద్యా విధానాలను సమర్థంగా అమలు చేయాలి. ఈశాన్య ప్రాంతాలతోపాటు లద్దాఖ్ వంటి ప్రదేశాలపై దృష్టి పెట్టాలి. భారత సంస్కృతిని పరిరక్షించాలి. తొలిసారి ఓటరుగా ఇది నా ఆకాంక్ష’’ అని సంజౌలీ పీజీ కాలేజీకి చెందిన మరో విద్యార్థి వశి‹Ù్ట శర్మ చెప్పాడు. అభ్యర్థులెవరూ నా అంచనాలకు తగ్గట్టుగా లేరు. అందుకే నా తొలి ఓటు నోటాకే’’ అని మంచీకి చెందిన అదితి ఠాకూర్ చెప్పుకొచి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha election 2024: కింగ్ వర్సెస్ క్వీన్
హిమాచల్‌ప్రదేశ్‌లో రాజవంశీయుల కంచుకోట అయిన మండి లోక్‌సభ స్థానంలో ‘కింగ్’, ‘క్వీన్’ మధ్య ఆసక్తికర పోరు సాగుతోంది. క్వీన్ తదితర సినిమాలతో అలరించిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బీజేపీ తరఫున ఎన్నికల అరంగేట్రం చేస్తున్నారు. రాంపూర్ బుషహర్ రాజ సంస్థాన వారసుడు విక్రమాదిత్యసింగ్ కాంగ్రెస్ అభ్యరి్థగా ఆమెతో తలపడుతున్నారు. దాంతో ఇక్కడ విజయం రెండు పారీ్టలకు ప్రతిష్టాత్మకంగా మారింది...తొలి నుంచీ రాజులే... పారీ్టలేవైనా మండిలో రాజకుటుంబీకుల హవాయే కొనసాగుతూ వస్తోంది. రెండు ఉప ఎన్నికలతో సహా 19సార్లు లోక్‌సభ ఎన్నికలు జరిగితే 13సార్లు రాజ కుటుంబీకులే గెలిచారు. కాంగ్రెస్‌కు ఇక్కడ బలమైన ఓటు బ్యాంకు ఉంది. పీసీసీ చీఫ్, సిట్టింగ్ ఎంపీ ప్రతిభా సింగ్ ఈసారి పోటీ చేయబోనని ప్రకటించారు. బీజేపీ నుంచి కంగనా బరిలో దిగడంతో తనయుడు విక్రమాదిత్య సింగ్‌ను బరిలో దించారు. ఆయన సిమ్లా (రూరల్) నుంచి రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఆయన తండ్రి వీరభద్రసింగ్ ఏకంగా ఆరుసార్లు రాష్ట్ర సీఎంగా చేశారు. తల్లిదండ్రులిద్దరూ మండి లోక్‌సభ స్థానం నుంచి మూడేసిసార్లు నెగ్గారు. 2021 మండి ఉపఎన్నికలో తల్లి కోసం విక్రమాదిత్య విస్తృతంగా ప్రచారం చేశారు.కంగనాకు ఆదరణ... కంగనాకు ఊహించని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు జైరాం ఠాకూర్ మద్దతుతో పాటు మండి లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లన్నీ బీజేపీ చేతిలోనే ఉండటం ఆమెకు కలిసొచ్చే అంశాలు. తొలుత ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన సీనియర్ నేత మహేశ్వర్ సింగ్ తర్వాత మనసు మార్చుకున్నారు. కార్గిల్ యుద్ధ వీరునిగా స్థానికంగా బాగా ఆదరణ ఉన్న బ్రిగేడియర్ (రిటైర్డ్) ఖుషాల్ ఠాకూర్, కేంద్ర మాజీ మంత్రి సుఖ్రామ్ మనవడు ఆశ్రయ్ శర్మ తదితరులు కంగనాకు మొదటినుంచి మద్దతిస్తున్నారు.పరస్పర విమర్శలు... పరస్పర విమర్శల్లో కంగనా, విక్రమాదిత్య ఇద్దరూ హద్దులు దాటిపోయారు. ఎన్నడూ లేనంతగా వ్యక్తిగత దాడులకు దిగుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై కంగనాకు ఎలాంటి విజన్ లేదని, ఆమె కేవలం పొలిటికల్ టూరిజం చేస్తున్నారని విక్రమాదిత్య ఎద్దేవా చేస్తుంటే, ఆయనను ‘చోటా పప్పు’ అంటూ కంగనా ఎగతాళి చేస్తున్నారు. రైతులపై కంగనా అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో సంయుక్త కిసాన్ మంచ్ విక్రమాదిత్యకు మద్దతిస్తోంది. హిమాచల్‌లో విపత్తు వేళ బాధితుల పట్ల కంగనా సానుభూతి చూపలేదని, మండిని కనీసం సందర్శించలేదని విమర్శలున్నాయి. ఒక్కసారి చాన్సిస్తే నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తానని కంగనా అంటున్నారు. గిరిజన ప్రాంతాలకు కనెక్టివిటీ మెరుగుపరచడం, ఆగిన ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు స్థానిక సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ పర్యాటకాన్నీ ప్రోత్సహిస్తానని హామీ ఇస్తున్నారు. మండీని స్మార్ట్ సిటీగా మారుస్తానని విక్రమాదిత్య వాగ్దానం చేస్తున్నారు.‘మండి’ ప్రస్థానం.. మండిని ఒకప్పుడు మండి మహాసు నియోజకవర్గంగా పిలిచేవారు. ఆరు జిల్లాల్లో విస్తరించిన ఈ నియోజకవర్గంలో 13,77,173 మంది ఓటర్లున్నారు. దీని పరిధిలో ఏకంగా 17 అసెంబ్లీ సెగ్మెంట్లుండటం విశేషం. వీరభద్రసింగ్ 1971లో తొలిసారి ఇక్కడి నుంచి గెలిచారు. 1977లో ఎమర్జెన్సీ వ్యతిరేక వెల్లువలో ఓటమి చవిచూసినా 1980లో మళ్లీ విజయం సాధించారు. 1989లో బీజేపీ, 1991, 1996ల్లో కాంగ్రెస్, 1998, 1999 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాయి. 2004లో ప్రతిభా సింగ్ తొలిసారి గెలిచారు. 2009లో మళ్లీ వీరభద్రసింగ్ విజయం సాధించారు. ఆయన సీఎంగా కావడంతో 2013లో జరిగిన ఉప ఎన్నికలో ప్రతిభాసింగ్ నెగ్గారు. 2014, 2019ల్లో బీజేపీకి చెందిన రామ్ స్వరూప్ శర్మ గెలుపొందారు. 2021లో ఆయన మరణంతో జరిగిన ఉప ఎన్నికలో మళ్లీ ప్రతిభా సింగ్ గెలిచారు. -
ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి?.. ఖర్గే చమత్కారం
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఆరు విడతల్లో పోలింగ్ పూర్తి అయింది. అయితే.. విపక్షాల ఇండియా కూటమి ప్రభుత్వం కొలువుదీరితే.. ప్రధానమంత్రి ఎవరూ అని అడిగిన మీడియా ప్రశ్నకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున చమత్కారంగా స్పందించారు. ఈ ప్రశ్న ‘కౌన్ బనేగా క్రోర్‌పతి?’లా ఉందని అన్నారు. ఆయన శనివారం సిమ్లాలో మీడియాతో మాట్లాడారు. ‘‘ ఇండియా కూటమి గెలిచి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మా ప్రధాని మంత్రి ఎవరూ అనేవిషయంపై నాయకులమంతా కలిసి నిర్ణయం తీసుకుంటాం. 2004 నుంచి 2014 వరకు యూపీఏ కూటమి పదేళ్లు పాలన చేసింది. ప్రధాని అభ్యర్థి ప్రకటన లేకుండా ఎన్నికల బరిలోకి దిగారు. అయితే 2004లో కాంగ్రెస్‌లో కొంతమంది నాయకులకు సోనియా గాంధీ ప్రధాని కావాలని ఉండేది. కానీ ఆమె తిరస్కంచారు. అప్పుడు మాకు మేజార్టీ(140 సీట్లు) లేదు. 2009లో మేము 209 సీట్లను గెలిచాం. అలా యూపీఏ కూటమిగా పదేళ్లు పాలన అందించాం. కొన్నిసార్లు తెలివైనవాళ్లు కూడా చరిత్ర మర్చిపోతారు( బీజేపీ నేతలను ఉద్దేశించి). 2014లో బీజేపీ ఇచ్చిన రెండు కోట్ల ఉద్యోగాల కల్పన, ద్రవ్యోల్బణం తగ్గింపు ఏమి జరగలేదు. ప్రధాని మోదీ, 2014, 2019లో ఇచ్చిన పెద్దపెద్ద హామీలను పక్కన పడేశారు. ప్రకృతి విపత్తులతో తల్లిడిల్లిన హిమాచల్ ప్రదేశ్ ప్రధాని మోదీ చిన్న సాయం కూడా చేయలేదు. దేశంలో బీజేపీ ప్రభుత్వాలను కూలగొట్టింది. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్‌లో ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి కుట్రలు పన్నింది’’ అని ఖర్గే తీవ్రంగా మండిపడ్డారు. ఫిబ్రవరి 27 జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా ఆరుగురు కాంగ్రెస్ ఎమ్యెల్యేలు బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా క్రాస్ ఓటు వేశారు. అనంతరం వారు బీజేపీలో చేరారు. ఇక.. హిమాచల్ ప్రదేశ్‌లో ఏడో విడతలో జూన్ 1 నాలుగు పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఫలితాలు జూన్ 4న విడదల కానున్నాయి. -
దేశాభివృద్ధి కోసమే మూడోసారి
సిమ్లా: బీజేపీని వరుసగా మూడోసారి గెలిపించాలని, దేశ అభివృద్ధి కోసమే తప్ప ఈ గెలుపు తన కోసం, తన కుటుంబం కోసం కాదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. దేశ అభివృద్ధి కోసం అన్ని గ్రామాల్లో దేవాలయాలకు వెళ్లి, దేవుళ్లను ప్రారి్థంచి ఆశీస్సులు పొందాలని కోరారు. కాంగ్రెస్ పారీ్టకి అధికారం అప్పగిస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు బలవంతంగా లాక్కొని ఓటు బ్యాంక్‌కు కట్టబెడతారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అయోధ్య రామమందిరానికి తాళం పడుతుందని అన్నారు. శుక్రవారం హిమాచల్ ప్రదేశ్‌లోని నాహన్, మండీ, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్, జలంధర్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించిందని ఆరోపించారు. మందిర నిర్మాణానికి తాము పూనుకుంటే తేదీ చెప్పండి అంటూ ఎగతాళి చేశారని అన్నారు. తేదీ ప్రకటించడమే కాకుండా ఆలయ నిర్మాణం పూర్తిచేసి ప్రాణప్రతిష్ట సైతం జరిపించామని గుర్తుచేశారు. ఓటు బ్యాంక్‌ను బుజ్జగించడానికి కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని బహిష్కరించిందని మండిపడ్డారు. హిమాచల్ ప్రదేశ్‌లో 2.50 లక్షల జనాభా ఉన్న హట్టీ సామాజికవర్గానికి ఎస్టీ హోదా కలి్పస్తామని హామీ ఇచ్చారు. ఓడిపోయే కాంగ్రెస్‌కు ఓటు వేసి ఓటు వృథా చేసుకోవద్దని ప్రజలకు సూచించారు. -
హిమాచల్ అడవుల్లోనూ కార్చిచ్చు
ఉత్తరాఖండ్‌లో మాదిరిగానే హిమాచల్ ప్రదేశ్‌లోని అడవుల్లోనూ కార్చిర్చు కనిపిస్తోంది. సోలన్, మండి, కాంగ్రాలో కోట్లాది రూపాయల విలువైన అటవీ సంపద బూడిదగా మారింది. తాజాగా హిమాచల్‌లోని మండీ జిల్లా ధరంపూర్ మండప్ గ్రామ అడవుల్లోకి మంటలు వ్యాపించాయి. సోలన్ సమీపంలోని అడవిని కూడా మంటలు చుట్టుముట్టాయి. ఈ మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం ఉండటం లేదు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం సోలన్ సమీపంలోని కాలాఘాట్లో తాజాగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అటవీ శాఖ ఉద్యోగులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయినా మంటలు అదుపులోకి రాలేదు. అడవుల్లో దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర మంటలు వ్యాపించాయి. దీంతో అటవీ శాఖ ఉద్యోగులు స్థానికులను సహాయం కోసం అభ్యర్థించారు. ఎనిమిది గంటలపాటు ఎదురు చూసినా అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకోలేదు.అటవీ శాఖ డిప్యూటీ రేంజర్ నీలం ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ చాలాసేపటి నుంచి తాము మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నామని, స్థానికుల సహాయం కూడా అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఉద్యోగులు ప్రాణాలను పణంగా పెట్టి మంటలను ఆర్పుతున్నారన్నారు. -
నల్లత్రాచు నుంచి ‘అప్సరస’ వరకు..
సిమ్లా: ఎన్నికలన్నాక పరస్పర విమర్శలు సహజమే. కానీ హిమాచల్‌ప్రదేశ్ ప్రచారంలో అభ్యర్థులు విమర్శలు దాటి.. వ్యక్తిగత తిట్ల వరకూ వచ్చేశారు. ఈ దండకంలో కాంగ్రెస్ నుంచి బీజేపీ వరకూ అందరూ ఆ తాను ముక్కలే. ఒకరు ‘కాలే నాగ్’ అంటే.. మరొకరు ‘బిగ్డా షెహజాదా’ అంటూ ప్రచార పదజాలంలో కొత్త తిట్లను చేరుస్తున్నారు.ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేసిన విషయం తెలిసింది. వారిపై అనర్హత వేటు పడి ఆ ఆరుస్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు.. పార్టీ తిరుగుబాటుదారులను ‘కాలే నాగ్’(నల్లత్రాచు)లు, బికావు (అమ్ముడుపోయినవాళ్లు) అంటూ విమర్శించారు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి దేవేందర్ కుమార్ భుట్టో నియోజకవర్గమైన కుట్లేహార్లో సీఎం మాట్లాడుతూ.. ‘భుట్టో కో కూటో’ (భుట్టోను కొట్టండి) అంటూ పిలుపునిచ్చారు. సుఖూ వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయంటూ బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. ఇక ‘మండీ మే భావ్ క్యా చల్ రహా హై’ అంటూ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతే చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. నేను రెండాకులు ఎక్కువే చదివానంటూ రనౌత్ చెలరేగిపోయారు. రాహుల్‌గాం«దీ, విక్రమాదిత్య పేర్లు చెప్పకుండా.. ‘బడా పప్పు’, ‘ఛోటా పప్పు’ అని పదేపదే వాడారు. గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పారీ్ట.. ఈ దేశానికి బ్రిటిష్ వాళ్లు వదిలి వెళ్లిన ‘రోగం’ అంటూ వ్యాఖ్యానించారు. 2014 వరకు చెద పురుగుల్లా దేశాన్ని తినేశారన్నారు. విక్రమాదిత్యను.. ‘బిగ్డా షెహజాదా’ (చెడిపోయిన యువరాజు) అంటూ సంబోధించారు. ఇక కంగనాను ‘ఆమె హుస్న్ కి పరి’ (అప్సరస) అని, ప్రజలు ఆమెను చూడటానికి మాత్రమే వస్తారు.. ఓట్లేయరని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్ వ్యాఖ్యానించారు. దీనిపై కంగనా తల్లి ఆశా రనౌత్ స్పందించారు. తన కూతురును ‘అప్సరస’, ‘క్యా చీజ్ హై’ అంటున్నవాళ్లు తమ ఇళ్లలో ఆడపిల్లలున్నారన్న విషయం మరుస్తున్నారని మండిపడ్డారు. -
గైటీ థియేటర్ ప్రత్యేకత ఏమిటి? బ్రిటీషర్లు ఎందుకు నిర్మించారు?
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు, రేపు హిమాచల్‌లో పర్యటించనున్నారు. ఈరోజు (మంగళవారం) సాయంత్రం గైటీ థియేటర్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాన్ని ఆమె వీక్షించనున్నారు. గైటీ థియేటర్‌ను సందర్శించిన తొలి రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డుకెక్కనున్నారు.గైటీ థియేటర్ చారిత్రాత్మక భవనం. దీనిని బ్రిటిష్ వారు నిర్మించారు. బ్రిటిష్ పాలనలో 1884లో సిమ్లా వేసవి రాజధానిగా ఉండేది. ఆ కాలంలో బ్రిటిష్ పాలకులు వినోదం కోసం ఇంగ్లండ్ నుండి కళాకారులను సిమ్లాకు పిలిపించేవారు. అయితే ఆ సమయంలో సిమ్లాలో థియేటర్ లేదు. ఫలితంగా కళాకారుల ప్రదర్శనలు బ్రిటిష్ పాలకుల ఇళ్లలో లేదా అన్నాడేల్ గ్రౌండ్లో జరిగేవి.గైటీ థియేటర్‌ను 1887లో హెన్రీ ఇర్విన్ నిర్మించారు. ఈ థియేటర్ నియో-విక్టోరియన్ గోతిక్ శైలిలో నిర్మించారు. బ్రిటిష్ పాలకులు సిమ్లాను సాంస్కృతిక కేంద్రంగా మార్చాలనుకున్నారు. గైటీ థియేటర్‌కు 137 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ థియేటర్లో పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలు జరిగాయి. ప్రపంచ స్థాయి కళాకారులు ఇక్కడ ప్రదర్శనలు నిర్వహించారు.గైటీ థియేటర్ నిర్మాణం యూ ఆకారంలో ఉంటుంది.ఈ థియేటర్ ప్రత్యేకత ఏమిటంటే స్టేజ్‌పై వినిపించే చిన్నపాటి శబ్దం కూడా చివరి వరుసలో కూర్చున్న ప్రేక్షకులకు వినిపిస్తుంది. ఇక్కడ ప్రదర్శన సమయంలో ఎలాంటి మైక్ ఉపయోగించరు. ప్రపంచంలో కేవలం ఆరు గైటీ థియేటర్లు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటే సిమ్లాలోని ఈ థియేటర్. దీనిని ప్రారంభించిన సమయంలో లాంతర్లను ఉపయోగించేవారు. దీనిలో ఉపయోగించే బ్యాటరీని ఇంగ్లండ్ నుంచి దిగుమతి చేసుకునేవారు.అనుపమ్ ఖేర్, నసీరుద్దీన్ షా తదితర ప్రముఖ బాలీవుడ్ నటులు ఇక్కడ ప్రదర్శనలు ఇచ్చారు. వీరితోపాటు కేఎల్ సెహగల్, టామ్ ఆల్టర్, పృథ్వీరాజ్ కపూర్ తదితరులు కూడా ఇక్కడ తమ ప్రతిభను చాటారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు శశికపూర్ తన భార్య జెన్నిఫర్‌కు ఇక్కడే పెళ్లికి ప్రపోజ్ చేశారు. -
కంగనా ముంబైకి ముల్లె సర్దుకోవాల్సిందే: మంత్రి విక్రమాధిత్య
సిమ్లా: సినీ నటి, బీజేపీ మండి అభ్యర్థిని కంగనా రనౌత్ దిగుమతి చేసుకున్న నాయకురాలని హిమాచల్ కాంగ్రెస్ మంత్రి విక్రమాధిత్య సింగ్ విమర్శలు చేశారు. ఆమెను మండి ఓటమిపాలైతే.. ముంబైకి సాగనంపే ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాసౌలీలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని విక్రమాధిత్య మాట్లాడారు.‘‘హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ నాలుగు పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధిస్తుంది. మండిలో అయితే రాష్ట్రానికి దిగిమంతి చేయబడిన కంగనా రనౌత్‌ను ముంబైకి సాగనంపడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈ ఎన్నికల పోటీలో మేము ముందడుగు వేశాం. మండిలో ప్రతిరోజు రాత్రిపగలు పనిచేస్తున్నాం. హిమాచల్‌లో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని హామీ ఇవ్వగలను’’అని విక్రమాధిత్య అన్నారు.గత నెలలో కూడా విక్రమాధిత్య కంగనా రనౌత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కంగనా రనౌత్ వర్షం కాలంలో వచ్చే కప్ప లాంటి వారని ఎద్దేవా చేశారు. ‘‘ఎన్నికల ప్రచారం అనంతరం మండి నుంచి ఆమె వెళ్లిపోతుంది. కంగనా హిమాచల్ ప్రదేశ్‌కు కేవలం టూర్ కోసమే వస్తారు. కంగనా ఈ రోజు ఇక్కడ ఉంటారు.. రేపు మళ్లీ వెళ్లిపోతారు. వర్ష కాలంలో కప్ప మాదిరి కంగనా హిమాచల్‌కు వస్తూ.. వెళ్తూ ఉంటారు’’ అని విమర్శలు చేశారు. నాలుగు లోక్‌సభ స్థానాలు.. మండి, సిమ్లా, కాంగ్రా, మహీర్‌పూర్‌లలో చివరి విడత జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఫతితాలు జూన్ 4న వెలువడనున్నాయ. -
మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
హిమాచల్ ప్రదేశ్‌లో ఓ ఆసక్తికర ఉదంతం వెలుగు చూసింది. గడ్డం, మీసాలతో డ్యూటీకి వచ్చారంటూ ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ 80 మంది ఉద్యోగులను తొలగించింది. సంస్థలోని ఉద్యోగులంతా క్లీన్ షేవ్‌తో రావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో బాధిత ఉద్యోగులంతా లేబర్ కమిషనర్‌ను ఆశ్రయించారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇది సోలన్‌లోని పారిశ్రామిక ప్రాంతమైన పర్వానూలో చోటుచేసుకుంది. గడ్డం, మీసాలు ఉన్నందుకు ఓ కంపెనీ 80 మంది కార్మికులను విధుల నుంచి తొలగించింది. అయితే తర్వాత ఆ కార్మికులు క్లీన్ షేవ్‌తో కంపెనీకి వచ్చారు. అయినా సదరు కంపెనీ వారిని తిరిగి నియమించుకునేందుకు నిరాకరించింది. వారు పరిశ్రమలోకి రాకుండా అడ్డుకుంది.దీంతో కార్మికులంతా నిరసన చేపట్టి లేబర్ కమిషనర్‌తో పాటు ముఖ్యమంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం లేబర్ ఇన్స్పెక్టర్ లలిత్ ఠాకూర్ కంపెనీని సందర్శించి ఇరువర్గాల వాదనలు విన్నారు. దీనిని డీసీ సోలన్ మన్మోహన్ శర్మ దృష్టికి తీసుకెళ్లారు. పరిశ్రమలో ఇలాంటి సంఘటనలు జరిగితే నిబంధనల ప్రకారం పరిశ్రమపై చర్యలు తీసుకుంటామని మన్మోహన్ శర్మ హెచ్చరించారు. ఈ కేసుపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
Lok sabha elections 2024: హిమజ్వాల!
పేరులో మంచు ఉన్నా హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయాలు మాత్రం ఎప్పుడూ సెగలు కక్కుతుంటాయి. రాష్ట్రంలో అధికార పార్టీ ఓడిపోయే ఆనవాయితీ 1985 నుంచీ కొనసాగుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ సర్కారుపై ఎమ్మెల్యేల తిరుగుబాటు తాజాగా రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్, బీజేపీ మధ్య మారుతున్నా లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం 2009 నుంచీ బీజేపీదే పై చేయి. గత రెండు ఎన్నికల్లో 4 సీట్లూ ఆ పార్టీయే క్లీన్‌స్వీప్ చేసింది. ఈసారి హ్యాట్రిక్‌పై కన్నేసింది. పదేళ్లుగా ఒక్క ఎంపీ సీటూ గెలవలేని పేలవమైన రికార్డును ఎలాగైనా మెరుగు పరుచుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది... ఆపరేషన్ కమలం... సుఖ్విందర్ సింగ్ సుఖు సీఎంగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచే రాష్ట్ర కాంగ్రెస్‌లో అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. బీజేపీ దీన్ని యథాశక్తి ఎగదోస్తూ ఆపరేషన్ కమలానికి తెర తీసింది. ఇటీవలి రాజ్యసభ ఎన్నికలు దీనికి మరింత ఆజ్యం పోశాయి. కాంగ్రెస్ నుంచి జంప్ చేసిన హర్‡్ష మహాజన్‌ను బలం లేకపోయినా బీజేపీ రాజ్యసభ పోటీలో నిలిపింది. ముగ్గురు స్వతంత్రులతో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలూ అనూహ్యంగా బీజేపీకి ఓటేయడంతో హర్‡్షకు, కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వికి 34 ఓట్లు వచ్చాయి. లాటరీలో హర్‡్షనే విజయం వరించింది. స్వతంత్ర ఎమ్మెల్యేలు ముగ్గురూ ఇప్పటికే బీజీపీలో చేరారు. ఆరుగురు కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు కూడా తాజాగా కాషాయ కండువా కప్పుకున్నారు. దాంతో ప్రస్తుతం కాంగ్రెస్ బలం 34కు పడిపోయి సర్కారు సంక్షోభంలో పడింది. బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రభుత్వం కూలిపోయేలా ఉంది. ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తామని ప్రకటించారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటేసిన ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. దాంతో ఆ ఆరు అసెంబ్లీ స్థానాల్లోనూ లోక్‌సభతో పాటే జూన్ 1న ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌కు ప్రాణసంకటం...! తాజా రాజకీయ సంక్షోభం నేపథ్యంలో లోక్‌సభ, 6 అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికలు కాంగ్రెస్‌కు విషమపరీక్షగా మారాయి. ఎమ్మెల్యే సీట్లు బీజేపీ పరమైతే రాష్ట్రంలో ప్రభుత్వం కమలనాథుల పరమవుతుంది. రామ మందిరం, హిందుత్వ, అభివృద్ధి నినాదాలతో బీజేపీ హోరెత్తిస్తోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, కార్పొరేట్లతో మోదీ కుమ్మక్కు, సామాజిక న్యాయం, సంక్షేమం తదితరాలను కాంగ్రెస్ నమ్ముకుంది. హమీర్పూర్ నుంచి రాజ్‌పుత్ సామాజిక వర్గానికి చెందిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఐదోసారి ఎంపీగా విన్నింగ్ షాట్ కొట్టేందుకు బరిలోకి దిగుతున్నారు. ఆయన హిమాచల్‌కు రెండుసార్లు సీఎంగా చేసిన ప్రేమ్‌కుమార్ ధుమాల్ తనయుడు. మండి స్థానంలో బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్, ‘క్వీన్’ కంగనా రనౌత్ బీజేపీ తరఫున రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి రాజ వంశీయుడు, మాజీ సీఎం వీరభద్రసింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ పోటీలో ఉన్నారు. బీజేపీ ఎంపీ రామ్ స్వరూప్ శర్మ ఆత్మహత్య చేసుకోవడంతో 2021లో మండికి ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ తరఫున విక్రమాదిత్య సింగ్ తల్లి ప్రతిభా సింగ్ విజయం సాధించడంతో బీజేపీ బలం మూడుకు తగ్గింది.సర్వేల మాటేంటి? దాదాపు అన్ని సర్వేలూ బీజేపీ హ్యాట్రిక్ క్లీన్‌స్వీప్ ఖాయమని అంచనా వేస్తున్నాయి.పర్యాటక స్వర్గధామమైన హిమాచల్‌లో ఓటర్ల మూడ్ ఒక్కో ఎన్నికల్లో ఒక్కోలా మారుతుంటుంది. కాంగ్రెస్, బీజేపీలే ఇక్కడ నువ్వా నేనా అంటూ తలపడుతున్నాయి. 2014లో లోక్‌సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పూర్తి మెజారిటీతో అధికారాన్ని దక్కించుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ మరోసారి క్లీన్‌స్వీప్ చేసింది. కానీ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. 68 అసెంబ్లీ స్థానాల్లో 40 చోట్ల నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని 4 లోక్‌సభ స్థానాల్లో సిమ్లాను ఎస్సీలకు కేటాయించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బాలీవుడ్ నటి కంగనపై హిమాచల్ మంత్రి పోటీ
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా మంత్రి విక్రమాదిత్య సింగ్ పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన తల్లి రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ వెల్లడించారు. కాగా మండి నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కంగనాకు పోటీగా మంత్రి విక్రమాదిత్య సింగ్‌ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. ఇక్కడ నుంచి ప్రస్తుతం ప్రతిభా సింగ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. గత మూడు పర్యాయాలు ఆమె గెలిచారు. ఈ సందర్భంగా ప్రతిభా సింగ్ మాట్లాడుతూ. మండి ప్రజలు ఎల్లప్పుడూ తమతోనే ఉన్నారని పేర్కొన్నారు. విక్రమాదిత్యపై కంగనా రనౌత్ చేస్తున్న వ్యాఖ్యలను తాను పట్టించుకోనని అన్నారు. గతంలో క్లిష్ట పరిస్థితుల్లోనూ తాను గెలిచాను అని అన్నారు. హిమాచల్ ప్రజల గురించి కంగనాకు ఏం తెలియదని, ఈ ఎన్నికల్లో ఆమె గెలవదని అన్నారు. ‘దేవ్ భూమి’ హిమాచల్ నుంచి బాలీవుడ్‌కు స్వచ్చంగా తిరిగి వెళ్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. కాగా జూన్ 1న హిమాచల్‌లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి, చదవండి: కేజ్రీవాల్ పిటిషన్‌పై ఏప్రిల్ 15న సుప్రీంకోర్టు విచారణ -
కాంగ్రెస్ వెనకడుగేస్తే మొత్తం మేమే పోటీ చేస్తాం: ఆప్
సిమ్లా (హిమాచల్ ప్రదేశ్): ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సంబంధించి హిమాచల్ ప్రదేశ్ ఆప్ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. పోటీకి కాంగ్రెస్ వెనకడుగు వేస్తే హిమాచల్ ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాల్లోనూ పోటీ చేసేందుకు తమ పార్టీ సుముఖంగా ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత ఒకరు తెలిపారు. ఆప్ నేత అనుజ్ నాథూరామ్ చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ నేతలు పోటీ చేసేందుకు సంకోచిస్తే నాలుగు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ విషయమై పార్టీ హైకమాండ్‌తో మాట్లాడుతాం’ అన్నారు. రాబోయే ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యంపై కాంగ్రెస్ విమర్శలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ‘ఇండియా’ కూటమి మిత్ర పక్షమైన ఆప్ నుంచి ఇలాంటి ప్రకటన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ మొదట పోటీ చేయడానికి నిరాకరించారు. అయితే మండి పార్లమెంటరీ సెగ్మెంట్ నుండి భారతీయ జనతా పార్టీ (BJP) నటి కంగనా రనౌత్‌ను పోటీకి దింపుతుండటంతో ఆమె తన నిర్ణయంపై పునరాలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పోటీ చేయాలనుకుంటే ఆప్ మద్దతునిస్తుందని చౌహాన్ తెలిపారు. అయితే, కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తే ఆప్ తన అభ్యర్థులను నిలబెట్టేందుకు సిద్ధంగా ఉందని ఆయన ఉద్ఘాటించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాలు, ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఉప ఎన్నికలతో పాటు జూన్ 1న చివరి దశలో ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
Lok Sabha Elections 2024: మండిలో కంగన రోడ్ షో
సిమ్లా: బాలీవుడ్ నటి, బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కంగనా రనౌత్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తాను తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న హిమాచల్‌ప్రదేశ్‌లోని మండిలో శుక్రవారం రోడ్ షో చేశారు. కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్ ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా తీవ్రంగా దుయ్యబట్టారు. ‘‘మీ అక్కాచెల్లెళ్లకు, కూతుళ్లకు వెల కట్టేవాళ్లు ఎప్పటికీ మీవాళ్లు కాలేరు. ఇక్కడ తపస్సు చేసిన మాండవ రుషి నుంచి ఈ పట్టణానికి మండి అని పేరొచి్చంది. అలాంటి పేరును కూడా కించపరుస్తున్నారు’ అని రోడ్ షోకు పోటెత్తిన జనాన్ని ఉద్దేశించి అన్నారు. ‘మండిలో ఇప్పుడు ఏ రేటు పలుకుతోంది’ అని కంగనాపై సుప్రియ ఇన్‌స్ట్రాగాంలో పెట్టిన పోస్టు దుమారం రేపడం తెలిసిందే. -
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలను బరిలోకి దింపిన బీజేపీ
ఢిల్లీ:లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఐదు జాబితాను విడుదల బీజేపీ ప్రచారంలో దూసుకుపోతోంది. తాజాగా లోక్‌సభ ఎన్నికలతో పాటు హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్‌లో రాజ్యసభ ఎంపీ ఎన్నికల సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థికి ఆరుగురు రెబల్ ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటు వేసిన విషయం తెలిసిందే. దీంతో ముగ్గురు కాంగ్రెస్, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. అనంతరం హిమాచల్ కాంగ్రెస్ అనర్హత ఎమ్మెల్యేలు శనివారం బీజేపీలో చేరారు. తాజాగా ప్రకటించిన బీజేపీ అభ్యర్థుల జాబితాలో వారు చోటు సంపాధించుకున్నారు. సుధీర్‌శర్మ- ధర్మశాల, రవి ఠాకుర్- లాహౌల్ అండ్ స్పితి, రాజిందర్ రానా- సుజన్పూర్, ఇందర్ దత్ లకాన్ పాల్- బర్సార్, చైతన్య శర్మ- గాగ్రేట్, దేవిందర్ కుమార్ భుట్టో- కుట్లేహర్ స్థానాల్లో బరిలోకి దిగనున్నారు. ఈ ఆరు స్థానాలకు ఏడు విడతలో భాగంగా జూన్ 1న పోలింగ్ జరగనుంది. అదే రోజు హిమాచల్‌ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాకుల కూడా పోలింగ్ జరగనుంది. అదే విధంగా గుజరాత్లో ఐదు స్థానాలు, కర్ణాటకలో ఒక స్థానం, పశ్చిమ బెంగాల్లో రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ప్రకటించింది. BJP releases a list of candidates for upcoming by-elections in Gujarat, Himachal Pradesh, Karnataka and West Bengal pic.twitter.com/xiZsleW91d — ANI (@ANI) March 26, 2024 -
కంగనా రనౌత్‌పై హిమాచల్ మంత్రి కీలక వ్యాఖ్యలు
సిమ్లా: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ ఐదో జాబితాలో భాగంగా 111 మంది అభ్యర్థులను ఆదివారం విడుదల చేసింది. ఈ జాబితా హిమాచల్ ప్రదేశ్‌లోని మండి సెగ్మెంట్ బాలీవుడ్ నటీ కంగనా రనౌత్‌కు బీజేపీ టికెట్ కేటాయింది. కంగనా రనౌత్‌కు బీజేపీ టికెట్ ప్రకటించటంపై హిమాచల్‌ప్రదేశ్ మంత్రి విక్రమాధిత్య సింగ్ స్పందించారు. కంగనా రనౌత్ మూడింట ఒక వంతు సమయం కూడా తాను పోటీచేసే నియోజకవర్గంలో అందుబాటులో ఉండరని అన్నారు. ‘అభ్యర్థుల ఎంపిక బీజేపీ పార్టీ అంతర్గత విషయం. నేను వారు ఎంపిక విధానంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయను. ఎంపిక విధానం ఆ పార్టీ స్వేచ్చ. మేము మా బలంలో లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతాం. మేము కంగనా రౌనత్‌ను గౌరవిస్తాం. సినిమాల్లో నటించి పలు అవార్డులు అందుకొని.. హిమాచల్ ప్రదేశ్‌కు పేరు తెచ్చారు. కానీ ఇది రాజకీయ రంగం. అతిపెద్ద సందేహం ఏమిటంటే.. ఒక నటిగా ఆమెకు సినిమాల్లో నటించటం, నిర్మించటమే తొలి ప్రాధాన్యం. ఆమె కనీసం మూడింట ఒకవంతు సమయమైనా హిమాచల్ ప్రదేశ్‌కు కేటాయించగలరా?’ అని ప్రశ్నించారు. ‘స్టార్డమ్తో రాజకీయాలు చేయటం అంత సులభం కాదు. బీజేపీ కంగనా స్టార్డమ్ మీద మత్రమే ఆధారపడుతోంది. కేవలం స్టారడమ్ ఆధారంగా ఆమె అభ్యర్థిగా బరిలో దింపటం సరికాదు. ఆమె ప్రాధాన్యం ఎప్పుడూ బాలివుడ్ సినిమా పరిశ్రమే. గెలిచినా లేదా ఓడినా రాజకీయాలు ఆమెకు తొలి ప్రాధాన్యం కాదు. అందుకే మండి నియోజకవర్గం ప్రజలు పూర్తిగా మీకు అందుబాటులో ఉండే నేత కావాలా? లేదా స్టార్డమ్ ఉన్న వాళ్లకు ఓటు వేస్తారో నిర్ణయించుకోవాలి’ అని మంత్రి విక్రమాధిత్య అన్నారు. ఇక.. ప్రస్తుతం మండి నియోజకవర్గం ఎంపీగా వ్యవహిరిస్తున్న హిమాచల్ ప్రదేశ్ పీసీసీ చీఫ్ ప్రతిభా సింగ్ ఇటీవల తాను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. కంగనాకు బీజేపీ టికెట్ ప్రకటించటంపై ప్రతిభా సింగ్ కూడా స్పందించారు. ‘ఆమెకు ఎంపీగా పోటీ చేసే అవకాశం లభించినందుకు సంతోషం. కానీ ఆమె ఒక సినిమా సెలబ్రిటీ. ఆమె ఇంత సడన్‌గా రాజకీయాల్లోకి వచ్చి ఎలాంటి పాత్ర పొషిస్తారో చూస్తాం’ అని ప్రతిభా సింగ్ అన్నారు. -
విరిగిపడిన కొండచరియలు.. ఇద్దరు మృతి!
హోలీ పర్వదినాన హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హోలీ వేడుకలు జరుగుతున్న ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ఉనా జిల్లా అంబ్ సబ్ డివిజన్లోని మేడిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే హోలీ వేడుకల్లో భాగంగా భక్తులు గంగా నదిలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇంతలో అకస్మాత్తుగా కొండపై నుంచి రాళ్లు పడటం మొదలైంది. దీంతో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ నేపధ్యంలో తొమ్మిది మంది భక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సివిల్ ఆస్పత్రికి తరలించగా, ఇద్దరు భక్తులు మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఉనా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. -
ఎన్నికల బరిలో మరో స్టార్ హీరోయిన్.. పోటీ ఎక్కడంటే?
లోక్‌సభ ఎన్నికల బరిలో మరో స్టార్ హీరోయిన్ నిలిచారు. ఇవాళ ప్రకటించిన బీజేపీ జాబితాలో బాలీవుడ్ క్విన్ కంగనా రనౌత్ సీటును కేటాయించారు. ఆమె సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌లోనే ఆమె పోటీ చేయనున్నారు. మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కంగనా అభ్యర్థిత్వాన్ని బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ విషయాన్ని కంగనా ట్విటర్ ద్వారా పంచుకున్నారు. కంగనా తన ట్వీట్లో రాస్తూ..'నా ప్రియమైన భారత్, భారతీయ జనతా సొంత పార్టీ, బీజేపీకి ఎల్లప్పుడూ నా మద్దతు ఉంటుంది. ఈ రోజు బీజేపీ జాతీయ నాయకత్వం నా జన్మస్థలం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రమైన మండి నియోజకవర్గం నుంచి లోక్‌సభ అభ్యర్థిగా నన్ను ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడమనేది హైకమాండ్ నిర్ణయం. పార్టీలో అధికారికంగా చేరడం గౌరవంగా, ఆనందంగా భావిస్తున్నా. నేను ఒక కార్యకర్తగా, నమ్మకమైన ప్రజా సేవ కోసం ఎదురుచూస్తున్నా' అంటూ పోస్ట్ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే గతేడాది చంద్రముఖి-2, తేజస్ సినిమాలతో మెప్పించింది. ఈ ఏడాదిలో ఎమర్జన్సీ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవలే లోక్‌సభ బరిలో మరో సీనియర్ హీరోయిన్ రాధిక శరత్‌కుమార్ సైతం తమిళనాడులోని విరుధునగర్ నుంచి పోటీలో నిలిచారు. My beloved Bharat and Bhartiya Janta’s own party, Bharatiya Janta party ( BJP) has always had my unconditional support, today the national leadership of BJP has announced me as their Loksabha candidate from my birth place Himachal Pradesh, Mandi (constituency) I abide by the high… — Kangana Ranaut (@KanganaTeam) March 24, 2024 -
ఒళ్లో పేలిన ఫోను.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్పూర్ జిల్లాలో మొబైల్ ఫోన్ పేలిన ఉదంతం వెలుగు చూసింది. స్థానిక కోచింగ్ సెంటర్లో క్లాసులు జరుగుతుండగా ఒక విద్యార్థిని ఒళ్లోవున్న మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో తరగతిలో కలకలం చెలరేగింది. అయితే వెంటనే అప్రమత్తమైన ఆ విద్యార్థిని మొబైల్ ఫోనును బయటకు విసిరేసింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం హమీర్పూర్ ప్రధాన మార్కెట్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ విద్యాసంస్థ ఉంది. ఇక్కడ దాదాపు 40 మంది చదువుకుంటున్నారు. క్లాసులో తరగతి జరుగుతుండగా ఓ విద్యార్థిని దగ్గరున్న ఫోనులో నుంచి మంటలు చెలరేగాయి దీంతో ఆమె భయంతో ఆ మొబైల్ ఫోనును మెయిన్ రోడ్డు వైపునకు విసిరేసింది. ఆ ఫోను అక్కడున్న సైన్ బోర్డుకు తగిలి పేలిపోయింది. దీంతో సైన్ బోర్డుకు మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత మొబైల్ ఫోను పూర్తిగా కాలిపోయింది. అనంతరం స్థానికులు అప్రమత్తమై ఆ మంటలపై బకెట్లతో నీళ్లు పోసి, ఆర్పివేశారు. భవనం మొదటి అంతస్థులో ఈ ఘటన జరిగింది. అక్కడికి సమీపంలోనే దుస్తుల దుకాణాలు ఉన్నాయి. రోడ్డుపైనో, తరగతి గదిలోనో ఆ మొబైల్ ఫోన్ పేలి ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని స్థానికులు అంటున్నారు. -
హిమాచల్‌లో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు రాజీనామా
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు చెందిన సీఎం సుఖూ ప్రభుత్వాన్ని కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురితోపాటు సుఖూ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేయడం సంచలనం రేపింది. బీజేపీకి ఓటేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరుగురు అనర్హత వేటుకు గురికాగా, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తాజాగా పదవులకు రాజీనామా చేశారు. బీజేపీలో చేరి, ఆ పార్టీ టిక్కెట్‌పై మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని వీరు తెలిపారు. శుక్రవారం బీజేపీ నేతలతో కలిసి వెళ్లి అసెంబ్లీ లో రాజీనామా పత్రాలను అందజేశారు. -
సగం టార్గెట్ ఇవే.. నిలిచేదెవరు.. గెలిచేదెవరు?
దేశవ్యాప్తంగా లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల కాక మొదలైంది. వరుసగా రెండుసార్లు అధికారం దక్కించుకుని హాట్రిక్ కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఉత్సాహంతో ఉరకలు వేస్తుంటే ఈసారి ఎలాగైనా ఎన్డీఏ కూటమి దూకుడుకు అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ నాయకత్వంలోని ‘ఇండియా’ కూటమి గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అత్యధిక స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశ్ సహా ఈ తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కువ లోక్‌సభ సీట్లు ఏ కూటమి గెలుచుకుంటే ఆ కూటమికే అధికారం ఖాయమని చెప్పవచ్చు. ఉత్తర ప్రదేశ్ ఉత్తర ప్రదేశ్‌లో 80 లోక్‌సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ 1, బీజేపీ 62, ఎస్పీ 5, ఇతరులు 12 సీట్లు గెలుచుకున్నారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో 403 స్థానాలు ఉండగా ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్, అఖిలేశ్, మాయావతి కీలక నేతలు. వారణాసీ, రాయ్‌బరేలి, మైన్‌పురీ కీలక నియోజకవర్గాలు. అయోధ్య రామాలయం, కుల సమీకరణాలు, నిరుద్యోగం ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. బిహార్ బిహార్‌లో 40 లోక్‌సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ ఎన్డీఏ కూటమి 39 స్థానాలను, యూపీఏ 1 సీటు గెలుచుకున్నాయి. బిహార్ అసెంబ్లీలో 243 స్థానాలు ఉండగా ప్రస్తుతం ఎన్డీఏ అధికారంలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, సుశీల్ మోదీ, తేజస్వీ యాదవ్ కీలక నేతలు. హాజీపూర్, పట్నా సాహిబ్, పాటలీపుత్ర కీలక నియోజకవర్గాలు. కుల సమీకరణాలు, హిందూత్వ వాదం, నిరుద్యోగం ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. రాజస్థాన్ రాజస్థాన్‌లో 25 లోక్‌సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 25 స్థానాలనూ ఎన్డీఏ కూటమి గెలుచుకుంది. రాజస్థాన్ అసెంబ్లీలో 200 స్థానాలు ఉండగా ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. భజన్‌లాల్ శర్మ, అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ కీలక నేతలు. జోధ్‌పూర్, కోటా-బూందీ కీలక నియోజకవర్గాలు. కుల సమీకరణాలు, రైతుల సమస్యలు ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. పంజాబ్ పంజాబ్‌లో 13 లోక్‌సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ 8 స్థానాలు, ఎన్డీఏ కూటమి 4, ఆప్ 1 సీటు గెలుచుకున్నాయి. పంజాబ్ అసెంబ్లీలో 117 స్థానాలు ఉండగా ప్రస్తుతం ఆప్ అధికారంలో ఉంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. భగవంత్‌మాన్, సుఖ్బీర్సింగ్ బాదల్, సునీళ జాఖడ్ కీలక నేతలు. అమృత్సర్, గురుదాస్‌పుర్ కీలక నియోజకవర్గాలు. రైతు సమస్యలు, శాంతి భద్రతలు ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. హరియాణా హరియాణాలో 10 లోక్‌సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ మొత్తం స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. హరియాణా అసెంబ్లీలో 90 స్థానాలు ఉండగా ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్, జేజేపీ, ఐఎన్ఎల్డీ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. మనోహర్‌లాల్ ఖట్టర్, నాయబ్‌సింగ్ సైనీ, భూపీందర్ హుడా, కుమారి శెల్జా, ఓంప్రకాశ్ చౌతాలా కీలక నేతలు. రోహ్తక్, కురుక్షేత్ర కీలక నియోజకవర్గాలు. రైతుల సమస్యలు, హిందూత్వ వాదం ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. ఢిల్లీ ఢిల్లీలో 7 లోక్‌సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 7 స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలు ఉండగా ప్రస్తుతం ఆప్ అధికారంలో ఉంది. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్, వీరేందర్ సచ్దేవ, అర్విందర్ సింగ్ కీలక నేతలు. న్యూఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ కీలక నియోజకవర్గాలు. సీఏఏ, ఆప్-కాంగ్రెస్ జట్టు కట్టడం ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్‌లో 5 లోక్‌సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 5 స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో 70 స్థానాలు ఉండగా ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. పుష్కర్‌సింగ్ ధామీ, కరణ్ మాహరా కీలక నేతలు. హరిద్వార్, నైనిటాల్-ఉద్దమ్ సింగ్ నగర్ కీలక నియోజకవర్గాలు. యూసీసీ, నిరుద్యోగం, మహిళలపై నేరాల పెరుగుదల ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్‌లో 4 లోక్‌సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 4 స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో 68 స్థానాలు ఉండగా ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. సుఖ్విందర్ సింగ్ సుఖ్ఖూ, రాజీవ్ బిందల్ కీలక నేతలు. హమీర్పుర్, మండి కీలక నియోజకవర్గాలు. అయోధ్య రామాలయం, కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. జమ్మూకశ్మీర్ ప్రస్తుతం గవర్నర్ పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్‌లో 5 లోక్‌సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ 2 స్థానాలు, నేషనల్ కాన్ఫరెన్స్ 3 సీట్లు గెలుచుకున్నాయి. భారతీయ జనతా పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ కీలక నేతలు. ఆర్టికల్ 370 రద్దు, తగ్గుతున్న ఉగ్రవాద ఘటనలే ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. నియోజకవర్గాల పునర్విభజన కోసం ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ నివేదిక ఇంకా కొలిక్కిరాకపోవడంతో అధికారికంగా ఇంకా అసెంబ్లీ సీట్ల సంఖ్య ఖరారు కాలేదు. -
15,256 అడుగుల ఎత్తులో 52 మంది ఓటర్లు!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ బూత్ అయిన తాషిగ్యాంగ్ పోలింగ్ కేంద్రం హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. ఇది సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులో ఉంది. ఈ పోలింగ్ బూత్‌లో మూడోసారి ఓటింగ్ జరగనుంది. తాషిగ్యాంగ్‌లో పోలింగ్ స్టేషన్‌ను నిర్మించిన తర్వాత 2019లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 2021లో తాషిగ్యాంగ్ పోలింగ్ బూత్‌లో లోక్‌సభ ఉప ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు మూడోసారి. 2024లో ఈ పోలింగ్ స్టేషన్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని అధికారులు తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఈ సంవత్సరం దీన్ని మోడల్ పోలింగ్ స్టేషన్‌గా మార్చింది. ఇక్కడ 52 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 52 మంది ఓటర్లలో 30 మంది పురుషులు, 22 మంది మహిళలు ఉన్నారు. ఈ పోలింగ్ స్టేషన్ కాజా సబ్ డివిజన్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. రహదారి నుండి కేవలం 200 మీటర్ల దూరంలో ఉంది. అయితే, ప్రస్తుతం ఇక్కడ అడుగు మందం మేర మంచు కురుస్తోంది. దీంతో ఎన్నికల సంఘం జూన్ 1న ఇక్కడ ఓటింగ్‌ను ఏర్పాటు చేసింది. తాషిగ్యాంగ్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటుకు ముందు గ్రామస్థులు ఓటు వేయడానికి 14,567 అడుగుల ఎత్తులో ఉన్న హిక్కిమ్ గ్రామానికి వెళ్లాల్సి ఉండేది. తాషిగ్యాంగ్ కంటే ముందు, ఇదే భారతదేశంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ బూత్. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ 45 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 27 మంది పురుషులు, 18 మంది మహిళలు ఉన్నారు. 2021లో మండి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరిగినప్పుడు 49 మంది ఓటర్లు ఉండగా వీరిలో 29 మంది పురుషులు, 20 మంది మహిళలు. ఈ రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ 100 శాతం ఓటింగ్ నమోదైంది. -
సొంత నేతలతో కాంగ్రెస్‌కు తలనొప్పులు?
హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని కష్టాలు వెంటాడుతున్నాయి. దీనికి ఆ పార్టీలోని సీనియర్ నేతలే కారణమంటూ పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికలు పార్టీకి కత్తిమీద సాములా మారాయి. హిమాచల్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ హిమాచల్‌లోని మండి స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయడానికి ససేమీరా అంటున్నారు. ప్రతిభా సింగ్ 2019లో మండి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక్కడ ఆమెకు అమితమైన ప్రజాదరణ ఉంది. కాగా మండి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సినీ నటి కంగనా రనౌత్ పోటీ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే లోకసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రతిభా సింగ్‌తో పాటు పలువురు సీనియర్ నేతలు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభా సింగ్ తనయుడు విక్రమాదిత్య సింగ్ కూడా ఇదే వైఖరితో ఉన్నట్లు సమాచారం. దీనికితోడు వీరభద్ర సింగ్ గ్రూపులోని పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు వైఖరిని ప్రదర్శిస్తున్నారట. విక్రమాదిత్య సింగ్ వర్గం హిమాచల్ సీఎం కుర్చీపై కన్నేసింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మరింతగా పెరిగిపోతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. -
కాంగ్రెస్ రెబల్స్‌కు సుప్రీంలో చుక్కెదురు
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్‌లోని అధికార కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు రెబల్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ అనర్హులుగా ప్రకటించడంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ ఆరుగురు శాసనసభ్యులు ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. అనర్హత నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వీరు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం విచారణ జరిపింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా కార్యాలయానికి నోటీసు పంపింది. పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున అసెంబ్లీ కార్యకలాపాలతోపాటు ఓటింగ్‌లోనూ పాల్గొనరాదని ఆరుగురికి ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 6వ తేదీకి వాయిదా వేసింది. ఖాళీ అయిన ఆరు స్థానాల్లో నామినేషన్ల దాఖలుకు మే 7 ఆఖరు తేదీ. -
Rishikesh: ‘హిమాచల్’ సంక్షోభం మళ్లీ మొదటికి..?
రిషికేష్: హిమాచల్‌ప్రదేశ్ సంక్షోభం మళ్లీ మొదటికి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ఓటింగ్‌కు పాల్పడ్డ ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మొత్తం 11 మంది తాజాగా శనివారం(మార్చ్ 9) ఒక ప్రత్యేక బస్సులో బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లోని రిషికేష్ చేరుకున్నారు. అత్యంత భద్రత నడుమ బస్సు దిగి తాజ్ రిషికేష్ హోటల్‌లోనికి ఎమ్మెల్యేలు వెళ్లారు. శుక్రవారమే హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిశారు. రెబల్స్‌ను మళ్లీ తీసుకుంటారా అని ఢిల్లీలో మీడియా ఆయనను ప్రశ్నించగా తప్పు తెలుసుకుంటే మరో చాన్స్‌కు అర్హులవుతారు అని సుఖు సమాధానమిచ్చారు. ఇంతలోనే రెబల్ ఎమ్మెల్యేలు మళ్లీ క్యాంపునకు వెళ్లడం చర్చనీయాంశమైంది. కాగా, ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటు వేయడంతో బలం లేని కాషాయ పార్టీ అభ్యర్థి రాజ్యసభ ఎంపీగా గెలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మనుసింఘ్వి ఓటమి పాలయ్యారు. ఈ సంక్షోభం తర్వాత స్పీకర్ ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ నుంచి బయటపడి మళ్లీ మెజారిటీలోకి వెళ్లింది. అయితే స్పీకర్ నిర్ణయంపై రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌పై సుప్రీం నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. ఇదీ చదవండి.. లోక్‌సభ ఎన్నికల వేళ.. బిహార్‌లో ఈడీ దాడుల కలకలం -
Suman Kumari: స్నైపర్ గురి
800 మీటర్ల దూరం.. అంటే ముప్పావు కిలోమీటరు నుంచి కూడా గురి తప్పకుండా కాల్చే రైఫిళ్లు స్నైపర్లు. వీటిని ఉపయోగించే వారిని కూడా స్నైపర్లు అనే అంటారు. ఇంతకాలం మగవాళ్లే స్నైపర్లుగా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ సుమన్ కుమారి అత్యంత కఠినమైన శిక్షణ పొంది మన దేశ తొలి మహిళా స్నైపర్‌గా అర్హతను పొందింది. 1984 ‘ఆపరేషన్ బ్లూస్టార్’ తర్వాత రాజీవ్ గాంధీ హయాంలో 1988లో ‘ఆపరేషన్ బ్లాక్ థండర్’ పేరుతో స్వర్ణదేవాలయంలో మిగిలి ఉన్న సిక్కు వేర్పాటువాదులను ఏరివేసే మిలటరీ చర్య జరిగింది. ‘ఆపరేషన్ బ్లూస్టార్’ సమయంలో ఇరువర్గాల్లోనూ ప్రాణనష్టం ఎక్కువ. కాని ‘ఆపరేషన్ బ్లాక్ థండర్’లో మిలటరీ సిబ్బంది ప్రాణనష్టం జరక్కుండా సిక్కు వేర్పాటువాదులను అణిచివేయగలిగారు. దీనికి కారణం స్వర్ణ దేవాలయాన్ని మారణాయుధాలతో పై నుంచి కాపలాకాస్తున్న ఐదుగురు వేర్పాటువాదులను చాలా దూరం నుంచి కాల్చి చంపడం. మొదటిసారి ‘స్నైపర్స్’ ఉపయోగం వల్ల కలిగిన ప్రయోజనం అది. స్నైపర్ అంటే శత్రునిర్మూలన ఏదో సినిమాలో ‘నన్ను చూడాలంటే నీ జీవితం సగం తగలడిపోయి ఉండాలి’ అని బ్రహ్మానందం అంటాడు. స్నైపర్ రంగంలో దిగాడంటే శత్రువు జీవితం ముగింపు దశలో ఉందని అర్థం. స్నైపర్లు శత్రువును బంధించడానికి కాదు. నిర్మూలించడానికి. మనదేశంలో ముందు నుంచి కూడా అత్యాధునిక ఆయుధాల పట్ల కాకుండా సంప్రదాయ ఆయుధాల పట్ల మొగ్గు ఉండటం వల్ల స్నైపర్లను ఆదరించింది లేదు. కిలోమీటరు నుంచి ఒకటిన్నర కిలోమీటరు దూరం వరకూ కూడా శత్రువును కాల్చి చంపగల స్నైపర్ రైఫిల్స్‌ను ఎలా ఉపయోగించాలో తెలియడానికి ఆ కాలంలో మన మిటలరీ యోధులు ఇజ్రాయిల్, ఫ్రాన్స్ వెళ్లాల్సి వచ్చేది. 1980లలోనే కొద్దిగా స్నైపర్స్ ఉపయోగం తెలిసింది. ఇటీవల సరిహద్దుల వెంబడి వివిధ దేశాల దాడులను ప్రతిఘటించడానికి స్నైపర్లు సమర్థంగా ఉపయోగపడుతున్నాయని వాటిని ఉపయోగించే నిపుణులను తయారు చేస్తున్నారు. మధ్యప్రదేశ్– మహౌలోని ‘ఇన్ఫాంట్రీ స్కూల్’లో, ‘ఇండోర్‌లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్’ కేంద్రంలో స్నైపర్స్ శిక్షణ ఇస్తున్నారు. ఇంతవరకూ మగవాళ్లకే సాగిన ఈ శిక్షణ సుమన్ కుమారి వల్ల స్త్రీలకు కూడా ఇవ్వడం మొదలైంది. పంజాబ్‌లో చూసి హిమాచల్ ప్రదేశ్‌లో మండి జిల్లాకు చెందిన సుమన్ కుమారి 2021లో బి.ఎస్.ఎఫ్.లో ఇన్స్పెక్టర్ హోదాలో చేరింది. పంజాబ్‌లో ఆమెకు విధులు కేటాయించారు. అక్కడ ఉండగా సరిహద్దు దేశాల నుంచి శత్రువులు స్నైపర్లతో మనవారి మీద దాడులు చేయడం సుమన్ గమనించింది. మన వద్ద తగినంత మంది స్నైపర్లు లేరని కూడా అవగాహన చేసుకుంది. అంతే. తనకు తానే స్నైపర్‌గా శిక్షణ తీసుకునేందుకు అనుమతి అడిగింది. ‘సాధారణంగా స్నైపర్‌గా తీసుకునే శిక్షణ కఠినమైనది. మగవారే వెనకాడుతారు. శిక్షణలో సగం మంది వెనుతిరుగుతారు. కాని సుమన్ 8 వారాల పాటు శిక్షణను సమర్థంగా పూర్తి చేసింది. 56 మంది ఉన్న బ్యాచ్‌లో ఆమె మాత్రమే మహిళ. శిక్షణ బాగా పూర్తి చేసిన వారిని ‘ఆల్ఫా’ అని, ‘బ్రేవో’ అని నైపుణ్యాన్ని బట్టి విభజిస్తాం. కాని సుమన్ ప్రతిభ అంతకు మించింది. అందుకే ఆమెకు ఇన్స్ట్రక్టర్ హోదా ఇచ్చాం. దాని అర్థం ఆమె స్నైపర్ మాత్రమే కాదు స్నైపర్ శిక్షకురాలు కూడా’ అని ఒక మిలటరీ అధికారి తెలియచేశారు. ఎప్పుడెప్పుడు హైజాక్‌లు, కిడ్నాప్‌లు, టెర్రరిస్ట్ అటాక్‌లు, ముఖ్య నేతలను బందీలుగా పట్టుకోవడం, సరిహద్దులు దాటి శత్రువులు రావడం వంటి సందర్భాలలో స్నైపర్లు రంగంలో దిగుతారు. పరిసరాలకు తగినట్టుగా పై తొడుగులు (కామూఫ్లాజ్) ధరించి శత్రువుకు వీలైనంత దగ్గరగా వెళ్లి తూటాతో సమాధానం చెప్పడమే వీరు చేసేపని. సుమన్ సేవలు ఇకపై దేశానికి రక్షణ ఇస్తాయి. ‘నేను స్నైపర్ కావడం స్త్రీలకు స్ఫూర్తినిస్తుందనే అనుకుంటున్నాను. మిలటరీలోకి మరింతమంది మహిళలు రావాలని కోరుకుంటున్నాను’ అందామె. -
మైనస్ 25 డిగ్రీల టెంపరేచర్లో... మాంగల్య తంతునానేనా!
సాధారణంగా ఎవరైనా పెళ్లిమండపం ఎంపిక చేసుకోవడానికి సౌకర్యాలు, అనుకూలతలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అయితే అన్ని పెళ్లిళ్లూ ఒకేలా ఉండవు అని చెప్పడానికి ఈ పెళ్లి ఒక ఉదాహరణ. హిమాచల్‌ప్రదేశ్‌లోని స్పితి వ్యాలీలో మైనస్ 25 డిగ్రీల ఉష్ణోగ్రతలో గుజరాతీ జంట పెళ్లి చేసుకుంది. ‘ఏ మ్యారేజ్ లైక్ దిస్ టూ! ఏ లవింగ్ కపుల్ ఫ్రమ్ గుజరాత్’ కాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. పెళ్లికి వచ్చిన అతిథుల సందడి కూడా వీడియోలో కనిపిస్తుంది. వరుని పక్కన కూర్చోబెట్టుకొని పూలతో అలంకరించిన ఎరుపు రంగు కారును వధువు నడపడంతో వీడియో ముగుస్తుంది. అయితే ఈ వీడియోను చూసి ప్రశంసించిన వాళ్ల కంటే ‘ఓవర్ యాక్టింగ్’ అని వెక్కిరించిన వాళ్లే ఎక్కువ. ‘మీ పెళ్లి సంబరం సరే, అక్కడ ఎంత చెత్త పేరుకు పోయి ఉంటుందో’ అని ఒక యూజర్ స్పందించాడు. -
హిమాచల్ కాంగ్రెస్‌లో రగులుతున్న అసమ్మతి
సిమ్లా/చండీగఢ్: హిమాచల్ ప్రదేశ్‌లోని అధికార కాంగ్రెస్‌లో అసమ్మతి రోజురోజుకీ ముదురుతోంది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు రాజిందర్ రాణా సారథ్యంలో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. అనంతరం అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌కు గైర్హాజరైన వీరిని కాంగ్రెస్ పార్టీ అనర్హులుగా ప్రకటించింది. అదే ఎమ్మెల్యే రాజిందర్ రాణా శనివారం మరో బాంబు పేల్చారు. సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కూ వైఖరితో విసుగుచెందిన మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నట్లు చెప్పుకున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులతోపాటు మరో తొమ్మిది మంది తనతో టచ్‌లో ఉన్నట్లు ఓ ఇంటర్వ్యూలో రాణా చెప్పారు. సీఎం సుక్కూను అబద్ధాల కోరుగా ఆయన అభివర్ణించారు. ఇలా ఉండగా, హిమాచ్ కేబినెట్ సమావేశంలో విధానపర అంశాలపై వాడీవేడి చర్చ అనంతరం మంత్రులు జగత్ నేగి, రోహిత్ ఠాకూర్ అర్ధంతరంగా బయటకు వెళ్లిపోయినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
అందుకే క్రాస్ ఓటేశాం.. హిమాచల్ రెబల్స్
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి క్రాస్ ఓటు వేసిన విషయం తెలిసిందే. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య ఓట్లు టై కావటంతో టాస్ వేసి ఫలితాలు ప్రకటించారు. ఈ అనూహ్య పరిణామాల నడుమ బీజేపీ అభ్యర్థి హర్ష మహాజన్ గెలుపొందారు. అయితే సర్కార్ కూలిపోయే అవకాశాలు కనిపించడంతో.. ఆ వెంటనే క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఆరుగురు ఎమ్మెల్యేలపై ఆ రాష్ట్ర స్పీకర్ అనర్హత వేటు వేశారు. తాజాగా ఈ మొత్తం పరిణామాలపై రెబల్ ఎమ్మెల్యేలు స్పందించారు. ఎమ్మెల్యే రాజేంద్ర రానా క్రాస్ ఓటింగ్ విషయంపై మాట్లాడుతూ.. ‘హిమాచల్ ప్రదేశ్ ప్రజలపై ఉన్న గౌరవం, మర్యాద ప్రకారం మేం క్రాస్ ఓటు నిర్ణయం తీసుకున్నాం. హిమాచల్ ప్రదేశ్‌కు దేవభూమిగా పేరుంది. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా నిలపడానికి ఇంకా ఎవరూ లేరా?. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు కాంగ్రెస్‌కి కనిపించలేదా?. అసలు హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎవరూ ప్రాతినిధ్యం వహించాలి?’ అని రాజేంద్ర రానా ప్రశ్నించారు. ‘మేము కోర్టుకు వెళ్తాం. తీవ్రమైన ఒత్తిడి కారణంగా స్పీకర్ మాపై అనర్హత వేటు వేశారు. పోలీసు మా అనుచరులకు చలాన్లు జారీ చేయటం మొదలుపెట్టారు. మేము రాష్ట్రం ఆత్మాభిమానాన్ని రక్షిస్తాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు.. కేవలం సుఖ్విందర్ సింగ్ సుఖు స్నేహితుల ప్రభుత్వం. ప్రతిఒక్కరికి రాష్ట్ర పరిస్థితి ఏంటో తెలుసు. యువత ఉద్యోగ పరీక్షలు రాసి రోడ్లమీద ఉన్నారు. వారు ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చటం లేదు. కొంత మంది ఎమ్మెల్యేలను అవమాన పరుస్తున్నారు. మరో తొమ్మిది మంది మా వెంట వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని రాజేంద్ర రానా అన్నారు. -
హిమాచల్‌లో మళ్లీ కాంగ్రెస్ అలర్ట్.. సీన్లోకి విక్రమాదిత్య
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో అధికార కాంగ్రెస్‌లో ముసలం ఇంకా ముగియలేదనే సంకేతాలు అందుతున్నాయి. రెబల్ ఎమ్మెల్యేలకు మరికొందరు తోడవుతున్నట్లు సమాచారం. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ మరింత జాగ్రత్త పడింది. ప్రభుత్వం కుప్పకూలిపోయే అవకాశాలు పూర్తిగా పోయేంతవరకు అప్రమత్తత అవసరమని ఆ పార్టీ భావిస్తోంది. ఈ తరుణంలో మంత్రి విక్రమాదిత్య సింగ్‌ను రంగంలోకి దించింది. . రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ ఆరుగురు ఎమ్మెల్యేలపై హిమాచల్ ప్రదేశ్ స్పీకర్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాళ్లంతా హర్యానా(బీజేపీ పాలిత రాష్ట్రం) పంచకుల్లాలో మకాం వేశారు. స్పీకర్ నిర్ణయాన్ని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో సవాల్ చేశారు వాళ్లంతా. ఈ క్రమంలో.. ఆ రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ ఆ ఆరుగురిని కలవడం అక్కడి రాజకీయాలను ఆసక్తికరంగా మార్చేసింది. మాజీ ముఖ్యమంత్రి అయిన విదర్భ సింగ్(దివంగత) కుమారుడు విక్రమాదిత్య సింగ్.. హిమాచల్ కేబినెట్లో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లో విక్రమాదిత్య క్రాస్ ఓటింగ్‌కు పాల్పడకపోయినప్పటికీ.. అదేరోజు భావోద్వేగపూరితంగా మీడియా ముందుకు వచ్చారు. తన తండ్రిని కాంగ్రెస్ తీవ్రంగా అవమానిస్తోందని చెబుతూనే.. బీజేపీతో పోరాటే శక్తి కాంగ్రెస్‌కు లేదంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే పార్టీకి, పదవికి సైతం ఆయన రాజీనామా చేశారు. అయితే హైకమాండ్ జోక్యంతో సాయంత్రానికి ఆయన చల్లబడ్డారు. తన రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇలాంటి సంక్షోభ సమయంలో తాను పార్టీని వీడొద్దని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఇక.. ఈ ఉదయం రెండ్రోజుల ఢిల్లీ పర్యటనకు బయల్దేరిన విక్రమాదిత్య.. మార్గం మధ్యలో ఆ ఆరుగురు రెబల్ ఎమ్మెల్యేలను కలుసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఢిల్లీ పర్యటన ముగిశాక తిరుగు ప్రయాణంలోనూ ఆయన మరోసారి వాళ్లతో భేటీ అవుతారని సమాచారం. ఇదిలా ఉంటే.. ఆరుగురు రెబల్స్‌కు మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సంఖ్య మరింత పెరగకమునుపే.. విక్రమాదిత్యను సీన్లోకి దించి మంతనాలు జరిపిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. అవునా.. నాకు తెలియదు! ఇదిలా ఉంటే.. రెబల్స్‌ను విక్రమాదిత్యసింగ్ కలిసినట్లు వస్తున్న వార్తలపై ఆయన తల్లి, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ స్పందించారు. ఓ జాతీయ మీడియా సంస్థతో ఆమె మాట్లాడుతూ.. తన కుమారుడి పర్యటన షెడ్యూల్ వివరాలు తనకి తెలియవని అన్నారు. గత రాత్రి తను(విక్రమాదిత్య) ఇక్కడే ఉన్నాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాడో నాకు తెలియదు అని అంటున్నారామె. అయితే ఎప్పటికప్పుడు పరిణామాలను మాత్రం హైకమాండ్‌కు తాము నివేదిస్తామని చెప్పారామె. ఇక ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంతో మొదటి నుంచి అసంతృప్తిగా ఉంటోంది వీరభద్ర సింగ్ కుటుంబం. తాజా సంక్షోభం నేపథ్యంలో.. మరోసారి ఆ డిమాండ్‌నే అధిష్టానం వద్ద ఉంచినట్లు వినవస్తోంది. అయితే సుఖ్విందర్ సింగ్ సుఖు మాత్రం తాను ఫైటర్ని అని.. తానే ఐదేళ్ల పాటు సీఎంగా ఉంటానని ప్రకటించుకుంటున్నారు. ఆ ఆరుగురికి కాంగ్రెస్ ఆఫర్ అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలను తిరిగి సొంతగూటికి తెచ్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. సుధీర్ శర్మ, రవి ఠాకూర్, రాజిందర్ రాణా, ఇందర్ దత్, చేతన్య శర్మ, దేవిందర్ కుమార్‌తో చర్చలు జరిపే బాధ్యతను మంత్రి విక్రమాదిత్యకు అప్పగించింది. పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటే.. అనర్హత వేటు వెనక్కి తీసుకుంటామని హామీ ఇస్తున్నారని హిమాచల్ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. -
ఇదేందయ్యా ఇది..! డెస్టినేషన్ వెడ్డింగ్.. వేరే లెవల్!
ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట. అచ్చం..మురారీ సినిమాలోలాగ, అదీ కాదంటే తమ అభిమాన హీరో హీరోయిన్ల పెళ్లిలా..ఎవరైనా ఇలాంటి పెళ్లి సందడి కోరు కుంటారు. కానీ గుజరాత్‌కు చెందిన జంట మాత్రం వెరైటీ పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటో చూసేయండి మరి..! అందిరిలా మేమూ చేసుకుంటే ‘కిక్’ ఏంటి అనుకున్నారేమో ఈ జంట మైనస్ 25 డిగ్రీల ఉష్ణోగ్రతలో చలికి గజ గజ వణికిపోతూ మూడు ముళ్ల ముచ్చటను తీర్చుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మంచుతో కప్పి ఉండే స్పితి లోయలో వివాహం చేసుకున్నారు. ఒక పక్క మంచు పూలవర్షమే అక్షితలుగా చలికి వణికి పోతూ మంచులో ముచ్చటగా పెళ్లి చేసుకున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు అంతేనా ఈ పెళ్లి ఫోటోషూట్, కెమెరామెన్లు, బంధువులు, పంతుళ్లు ఇలా అందరికీ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. పెళ్లికి సంబంధించిన వీడియోలను హిమాచల్ ప్రభుత్వ అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ అజయ్ బన్యాల్, గో హిమాచల్ ట్విటర్ ఖాతాలో షేర్ అయ్యాయి. కుండలినీ యోగాతో అల్జీమర్స్‌కు చెక్: తాజా పరిశోధన లవర్ మాట కాదనలేక ఈ పెళ్లికి ఒప్పుకున్నాడట అబ్బాయి. స్పితిలోని మురాంగ్లో జరిగిన అపూర్వ వివాహం జరిగింది. డెస్టినేషన్ వెడ్డింగ్‌కి అనే మాట ఇది వేరే లెవల్ అంటూ నెటిజన్లు కమెంట్ చేశారు. అంతేనా 'ఓవర్‌యాక్టింగ్' అని ఒకరు, "షాదీ అండ్ హనీమూన్ డన్’’ అటూ మరొకరు కమెంట్ చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేసి, మీకే మనిపించిందో కమెండ్ చేయండి. అంతలోనే ఎంత విషాదం : మాజీ మిస్ ఇండియా కన్నుమూత एक विवाह ऐसा भी! गुजरात का प्रेमी जोड़ा, प्रेमिका की जिद्द ने स्पीति पहुंचाया, फिर माईनस 25 डिग्री तापमान में सजाया मंडप, यह अपने आप में पहली तरह का मामला है। स्पीति के मुरंग में आज हुआ अनोखा विवाह। यह है डेस्टिनेशन वेडिंग का example। pic.twitter.com/4lnaRl0c5h — Ajay Banyal (@iAjay_Banyal) February 26, 2024 Gujarat couple gets married at -25 degrees in Himachal Pradesh's Spiti Valley.😍 pic.twitter.com/nGLImoguLh — Go Himachal (@GoHimachal_) February 29, 2024 -
హిమాచల్ రాజకీయ సంక్షోభంలో కీలక ట్విస్ట్
-
ఆరుగురు కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు
హిమాచల్ ప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల అనంతరం నెలకొన్న రాజకీయ గందరగోళం మరో మలుపు తిరిగింది. ఆరుగురు కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దయ్యింది. కాంగ్రెస్ పిటిషన్ నేపధ్యంలో స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా ఈ నిర్ణయం తీసుకున్నారు. ధర్మశాల ఎమ్మెల్యే సుధీర్ శర్మ, సుజన్పూర్ ఎమ్మెల్యే రాజేంద్ర రాణా, కుత్లహర్ ఎమ్మెల్యే దేవేంద్ర భుట్టో, గాగ్రెట్ ఎమ్మెల్యే చైతన్య శర్మ, లాహౌల్ స్పితి ఎమ్మెల్యే రవి ఠాకూర్, బాద్సర్ ఎమ్మెల్యే ఇంద్ర దత్ లఖన్‌పాల్ తదితరులు సభ్యత్వం రద్దయిన ఎమ్మెల్యేల జాబితాలో ఉన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్ ఈ నిర్ణయం తీసుకుని వీరందరినీ అనర్హులుగా ప్రకటించారు. ఈ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎన్నికల అభ్యర్థి హర్ష్ మహాజన్‌కు అనుకూలంగా ఓటు వేశారు. ఈ ఆరుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌ను రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో ఇతర సభ్యులు లేవనెత్తారు. బుధవారం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్‌ను ఆమోదించింది. మరోవైపు భోజన విరామానికి ముందు భారతీయ జనతా పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇది కాకుండా మిగిలిన ఎమ్మెల్యేలు తమ మాట విననందుకు నిరసనగా సభను బహిష్కరించారు. సభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లేకపోవడంతో అధికార పక్షానికి అనుకూలంగా మూజువాణి ఓటుతో బడ్జెట్ ఆమోదం పొందింది. అనంతరం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కార్యకలాపాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు తలెత్తకపోతే, తదుపరి సమావేశాలు జూలై, ఆగస్టులలో వర్షాకాల సమావేశాలుగా ప్రారంభమయ్యే అవకాశముంది. #WATCH | Himachal Pradesh Assembly Speaker Kuldeep Singh Pathania says, "Six MLAs, who contested on Congress symbol, attracted provisions of anti-defection law against themselves...I declare that the six people cease to be members of the Himachal Pradesh Assembly with immediate… pic.twitter.com/QQt92aM10v — ANI (@ANI) February 29, 2024 -
టార్గెట్ హిమాచల్‌ప్రదేశ్?
సిమ్లా/న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్ రాజకీయ పరిణామాలు రసకందాయంలో పడ్డాయి. రాజ్యసభ ఎన్నికల్లో అనూహ్య ఓటమితో కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడపై సందేహాలు మొదలయ్యాయి. ప్రభుత్వంపై శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రతిపక్ష బీజేపీ సిద్ధమవుతున్నట్లు ప్రచారం మొదలైంది. లోక్‌సభ ఎన్నికల ముందు చోటుచేసుకున్న ఈ పరిణామాలు కాంగ్రెస్‌ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. నష్ట నివారణ కోసం ఆ పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని సంకేతాలిచి్చంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముగ్గురు సీనియర్ నేతలు భూపేష్ బఘేల్, భూపీందర్ సింగ్ హుడా, డీకే శివకుమార్‌ను పార్టీ పరిశీలకులుగా హిమాచల్‌ప్రదేశ్‌కు పంపించారు. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలుండగా, కాంగ్రెస్‌కు 40 మంది, బీజేపీకి 25 మంది, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ పట్ల అసంతృప్తితో ఉన్న పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు ముగ్గురు స్వతంత్ర సభ్యులు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఒక రాజ్యసభ స్థానానికి మంగళవారం జరిగిన ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌కు తగిన బలం ఉన్నప్పటికీ క్రాస్ ఓటింగ్ జరగడంతో ఆ పార్టీ అభ్యర్థి అభిõÙక్ మనూ సింఘ్వీ ఓడిపోయారు. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రఎమ్మెల్యేలు బీజేపీ అభ్యరి్థకి ఓటువేశారు. ఈ 9 మంది ఎమ్మెల్యేలు బుధవారం అసెంబ్లీకి వచ్చారు. ‘జైశ్రీరామ్, బన్ గయా కామ్’ అని నినదిస్తూ బీజేపీ సభ్యులు వారికి స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా, హిమాచల్‌ప్రదేశ్ ప్రజా పనుల శాఖ మంత్రి విక్రమాదిత్య సింగ్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు సమరి్పంచానని చెప్పారు. ప్రభుత్వంలో తనకు, తన కుటుంబానికి అవమానాలు ఎదురయ్యాయని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నానని తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో అసలు ఏం జరుగుతోందో అధిష్టానం తెలుసుకోవాలని కోరారు. తన అనుచరులతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకుంటానని వెల్లడించారు. బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు హిమాచల్‌ప్రదేశ్ శాసనసభలో బుధవారం అనూహ్య పరిణామం చేసుకుంది. 15 మంది ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ కులదీప్ సింగ్ పఠానియా సస్పెన్షన్ వేటు వేశారు. వీరిలో ప్రతిపక్ష నేత జైరామ్ ఠాకూర్ కూడా ఉన్నారు. బీజేపీ సభ్యులు సభలో స్పీకర్‌ను అగౌరవపరుస్తున్నారని, ఇతరులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, సభ సజావుగా సాగాలంటే వారిని సస్పెండ్ చేయాలని కోరుతూ మంత్రి హర్షవర్దన్ చౌహాన్ ప్రవేశపెట్టిన తీర్మానం అసెంబ్లీలో ఆమోదం పొందింది. బడ్జెట్‌ను ఆమోదింపజేసుకోవడానికే తమను సస్పెండ్ చేశారని జైరామ్ ఠాకూర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారీ్టలో పడిందని, ముఖ్యమంత్రి సుఖీ్వందర్ సింగ్ సుఖూ రాజీనామా చేయాలని జైరామ్ ఠాకూర్ అన్నారు. బీజేపీ సభ్యుల సస్పెన్షన్ అనంతరం అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం పొందింది. ప్రజా తీర్పును కాపాడుకుంటాం హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రజా తీర్పును కాలరాచే ప్రయత్నాలను సహించబోమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ చెప్పారు. రాష్ట్రంలోని పార్టీ ఎమ్మెల్యేలందరితో మాట్లాడి, త్వరలో సమగ్ర నివేదిక సమరి్పంచాలని కాంగ్రెస్ పరిశీలకులను ఖర్గే ఆదేశించారని తెలిపారు. వ్యక్తుల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని, అదే సమయంలో ప్రజలు ఇచి్చన తీర్పును కాపాడుకోవడం ముఖ్యమని తేలి్చచెప్పారు. హిమాచల్‌లో అధికారంలోకి రావడానికి బీజేపీ తప్పుడు మార్గాలు వెతుకుతోందని ఆరోపించారు. -
హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు రాజీనామా
-
హిమాచల్ సీఎం రేసులో ప్రతిభా సింగ్? ఆమె నేపథ్యం ఏమిటి?
హిమాచల్ ప్రదేశ్‌లో రాజకీయ గందరగోళం నెలకొంది. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో సీఎంను మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖును తొలగించి, సీనియర్ నేత ప్రతిభా సింగ్‌ను ముఖ్యమంత్రిని చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత ప్రతిభా సింగ్ దివంగత నేత వీరభద్ర సింగ్ భార్య. వీరభద్ర సింగ్ ఆరుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రతిభా సింగ్ 1998 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. హిమాచల్‌లోని మండి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఆమె తొలిసారి ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే నాడు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత 2004 లోక్‌సభ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 2012లో ఆమె భర్త వీరభద్ర సింగ్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన లోక్‌సభకు రాజీనామా చేశారు. దీంతో 2013లో ఉప ఎన్నికలు జరిగాయి. ప్రతిభా సింగ్ ఎన్నికల బరిలో నిలిచి, బీజేపీ నేత జైరామ్ ఠాకూర్‌ను ఓడించారు. 2014లో లోక్‌సభ ఎన్నికల్లో మోదీ వేవ్‌లో బీజేపీ నేత రామ్ స్వరూప్ శర్మ 39 వేలకు పైగా ఓట్ల తేడాతో ప్రతిభా సింగ్‌పై విజయం సాధించారు. అప్పట్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ప్రతిభా సింగ్ ఓటమితో నేతలంతా కంగుతిన్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత 2021లో ప్రతిభా సింగ్ ఎన్నికల బరిలో విజయం సాధించారు. 2022, ఏప్రిల్ 26న, హైకమాండ్ ప్రతిభా సింగ్‌ను హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ 32వ అధ్యక్షురాలిగా నియమించింది. ప్రతిభా సింగ్ హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో 1956 జూన్ 16న జన్మించారు. ప్రతిభా సింగ్ వీరభద్ర సింగ్‌ను 1985లో వివాహం చేసుకున్నారు. ప్రతిభ అతనికి రెండవ భార్య. వీరభద్ర సింగ్ మొదటి భార్య కుమార్తె అభిలాషా కుమారి గుజరాత్లో న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రతిభా సింగ్, వీరభద్ర సింగ్‌ల కుమారుడు విక్రమాదిత్య సింగ్ సిమ్లా రూరల్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యునిగా పనిచేశారు. -
హిమాచల్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. మంత్రి రాజీనామా
సిమ్లా: కాంగ్రెస్ పాలిత హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కుమారుడు, ప్రస్తుత మంత్రి విక్రమాదిత్య సింగ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా విక్రమాదిత్య సింగ్ మాట్లాడుతూ.. నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను. నా రాజీనామా లేఖను త్వరలో ముఖ్యమంత్రి, గవర్నర్‌కు సమర్పిస్తాను. భవిష్యత్తు కార్యాచరణపై త్వరలో నిర్ణయం తీసుకుంటాను. ప్రస్తుత పరిస్థితుల్లో నేను ప్రభుత్వంలో భాగంగా కొనసాగడం కరెక్ట్ కాదు. అందుకే మంత్రిమండలికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను అని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ హైకమాండ్‌పై ఉంది. #WATCH | Himachal Pradesh Minister Vikramaditya Singh steps down from his position, a day after the Rajya Sabha election result in the state. He says, "All I would like to say is that under the current circumstances, it is not correct for me to continue as a part of the… pic.twitter.com/VNp0nuSfnR — ANI (@ANI) February 28, 2024 ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు మా పార్టీ ఎమ్మెల్యేలను పట్టించుకోలేదు. కాంగ్రెస్ సీనియర్ నేత, మా తండ్రి వీరభద్రసింగ్‌ను కూడా అగౌరవపరిచేలా మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎమ్మెల్యేల గొంతులను అణచివేయడం, హైకమాండ్ కూడా సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదని ఫైరయ్యారు. ఇదిలా ఉండగా.. హిమాచల్‌ప్రదేశ్‌రాజ్యసభ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగి అధికార కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవడంతో ఇక్కడి ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బీజేపీ ఆట మొదలు పెట్టింది. రాజ్యసభ ఎన్నికల మరుసటి రోజు బుధవారం ఉదయమే రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేత జైరాంఠాకూర్ నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. వెంటనే రాష్ట్ర అసెంబ్లీలో బల పరీక్ష(ఫ్లోర్ టెస్ట్) నిర్వహించాల్సిందిగా బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కోరారు. అనంతరం జైరాం ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిందని, అందుకే గవర్నర్‌ను కలిసి ఫ్లోర్ టెస్ట్ పెట్టాల్సిందిగా కోరామని తెలిపారు. మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేయడంతో అసెంబ్లీలో ఆ పార్టీ బలం ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సాధారణ మెజారిటీ కంటే దిగువకు పడిపోయింది. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు సమానంగా 34 ఓట్లు వచ్చి ఫలితం టై అయింది. లాటరీ తీయగా బీజేపీ అభ్యర్థి హర్ష్ మహజన్ గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మనుసింఘ్వి ఓటమి పాలయ్యారు. -
జోరుగా క్రాస్ ఓటింగ్
బెంగళూరు/లఖ్‌నవూ/సిమ్లా/న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల్లో జోరుగా క్రాస్ ఓటింగు సాగింది. దాంతో సంఖ్యాబలం ప్రకారం 8 స్థానాలు నెగ్గాల్సిన బీజేపీ మరో రెండు చోట్ల అనూహ్య విజయం సాధించింది! యూపీలో సమాజ్‌వాదీ పార్టీకి, హిమాచల్‌ప్రదేశ్‌లో పాలక కాంగ్రెస్‌కు గట్టి షాకిచ్చింది. ఏప్రిల్‌లో ఖాళీ అవుతున్న 56 రాజ్యసభ స్థానాలకు గాను 41 చోట్ల ఎన్నిక ఇప్పటికే ఏకగ్రీవం కావడం తెలిసిందే. యూపీలో 10, కర్ణాటకలో 4, హిమాచల్‌లో ఒకటి చొప్పున మిగతా 15 స్థానాలకు మంగళవారం ఓటింగ్ జరిగింది. అసెంబ్లీల్లో సంఖ్యాబలం మేరకు యూపీలో బీజేపీ 7, ఎస్పీ 3; కర్ణాటకలో కాంగ్రెస్ 3, బీజేపీ 1; హిమాచల్‌లో ఏకైక స్థానంలో కాంగ్రెస్ గెలవాల్సి ఉంది. కానీ బీజేపీ హిమాచల్‌లో పోటీకి దిగడమే గాక యూపీలో 8వ అభ్యర్థిని రంగంలోకి దించింది. కర్ణాటకలో కూడా ముగ్గురు కాంగ్రెస్, ఒక బీజేపీ అభ్యర్థితో పాటు దాని మిత్రపక్షం జేడీ(ఎస్) నుంచి ఐదో అభ్యర్థీ పోటీకి దిగారు. యూపీలో ఏడుగురు ఎస్పీ, ఒక బీఎస్పీ ఎమ్మెల్యేలు; హిమాచల్‌లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా ఓటేశారు. దాంతో హిమాచల్‌లోని ఏకైక సీటుతో పాటు యూపీలో 8వ రాజ్యసభ స్థానమూ బీజేపీ కైవసమయ్యాయి. కర్ణాటకలో మాత్రం బీజేపీ ఎత్తులు పారలేదు. సంఖ్యాబలానికి అనుగుణంగా కాంగ్రెస్ 3, బీజేపీ ఒక స్థానంలో నెగ్గాయి. అయితే ఒక బీజేపీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటేయడమే గాక మరొకరు ఓటింగ్‌కు దూరంగా ఉండి పార్టీకి షాకిచ్చారు! మూడు పార్టీలూ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై చర్యలకు తమ సిద్ధమవుతున్నాయి! హిమాచల్‌లో టాస్ హిమాచల్ అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలకు గాను పాలక కాంగ్రెస్‌కు 40 మంది ఎమ్మెల్యేలుండగా బీజేపీకి 25 మందే ఉన్నారు. అయితే ముగ్గురు స్వతంత్రులతో పాటు ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థి హర్‡్ష మహాజన్‌కు ఓటేశారు. దాంతో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి అనుహ్య ఓటమి చవిచూశారు. అభ్యర్థులిద్దరికీ సమానంగా చెరో 34 ఓట్లు రావడంతో టాస్ ద్వారా హర్‡్షను విజేతను తేల్చారు. ఇక యూపీలో హైడ్రామా చోటుచేసుకుంది. ఓవైపు పోలింగ్ జరుగుతుండగానే సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ మనోజ్ పాండే పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ నిర్వహించిన సమావేశానికి ఆయనతో పాటు మరో ఏడుగురు ఎస్పీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. వీరిలో కనీసం ఏడుగురు బీజేపీకి అనుకూలంగా ఓటేసినట్టు తేలింది. ఒక బీఎస్పీ ఎమ్మెల్యే కూడా బీజేపీకి ఓటేశారు. దాంతో ఆ పార్టీ అభ్యర్థులు ఆర్పీఎన్ సింగ్, తేజ్‌వీర్‌సింగ్, అమర్‌పాల్ మౌర్య, సంగీతా బల్వంత్, సుధాన్షు త్రివేది, సాధనాసింగ్, నవీన్ జైన్, సంజయ్ సేథ్ విజయం సాధించారు. సమాజ్‌వాదీ నుంచి జయాబచ్చన్, రాంజీలాల్ సుమన్ నెగ్గగా అలోక్ రంజన్ ఓటమి పాలయ్యారు. కర్ణాటకలో మాత్రం ఊహించిన ఫలితాలే దక్కాయి. కాంగ్రెస్ అభ్యర్థులు అజయ్ మాకెన్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్, బీజేపీ అభ్యర్థి నారాయణ కె.బాండే గెలుపొందగా జేడీ(యూ) అభ్యర్థి కుపేంద్రరెడ్డి ఓటమి చవిచూశారు. అయితే యశవంతపుర బీజేపీ ఎమ్మెల్యే ఎస్.టి.సోమశేఖర్ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయగా యల్లాపుర బీజేపీ ఎమ్మెల్యే శివరాం హెబ్బార్ పోలింగ్‌కు దూరంగా ఉన్నారు! వారిద్దరూ కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. వారిపై చర్యలకు బీజేపీ సిద్ధమైంది. క్రాస్ ఓటింగ్ నేపథ్యంలో హిమాచల్‌లో సుఖ్విందర్ సింగ్ సుఖు సర్కారు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వాలను కూల్చేయడం మోదీ సర్కారుకు అలవాటుగా మారిందంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నిప్పులు చెరిగారు. -
బీజేపీ థ్రిల్లింగ్ విక్టరీ.. కాంగ్రెస్‌కు బిగ్గెస్ట్ షాక్!
సిమ్లా: రాజ్యసభ ఎన్నికల్లో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు అయ్యింది. హిమాచల్ ప్రదేశ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఓటింగ్‌లో ఫలితం సమం కావడంతో డ్రా కాగా.. టాస్‌లో తమ అభ్యర్థి హర్ష మహాజన్ నెగ్గినట్లు బీజేపీ ప్రకటించుకుంది. దీంతో సంఖ్యా బలం లేకున్నా బీజేపీని అదృష్టం వరించినట్లయ్యింది. అయితే ఈ ఫలితంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. హిమాచల్ ప్రదేశ్ ఒక్క రాజ్యసభ సీటు ఉంది. దీనికి మంగళవారం ఓటింగ్ జరిగింది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 68 ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో కాంగ్రెస్‌కు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మరోవైపు బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే.. రాజ్యసభ సీటు గెల్చుకోవడానికి అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు కంటే ఐదుగురు కాంగ్రెస్‌కు ఎక్కువే ఉన్నారు. దీంతో కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడకే అని అంతా భావించారు. అయితే.. సంఖ్యా బలం లేకున్నా అనూహ్యంగా రాజ్యసభ బరిలో అభ్యర్థిని నిలిపింది బీజేపీ. దీంతో ఓటింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇవాళ జరిగిన ఓటింగ్‌లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. అలాగే స్వతంత్ర అభ్యర్థులు కూడా బీజేపీకే ఓటేసినట్లు. దీంతో ఊహించని రీతిలో.. ఫలితం 34-34తో సమం అయ్యింది. డ్రా కావడంతో టాస్ అనివార్యం కాగా.. అందులో తామే నెగ్గినట్లు బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు ప్రతిపక్ష నేత జైరామ్ థాకూర్ ప్రకటన కూడా చేశారు. అయితే.. తమ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారనంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ సర్కార్‌కు ముప్పు.. హిమాచల్ ప్రదేశ్ తాజా పరిణామాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదంలో పడింది. రాజ్యసభ ఫలితం పరిణామంతో ప్రభుత్వం మెజారిటీలో లేదని స్పష్టమవుతోందని జైరామ్ ఠాకూర్ అన్నారు. ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని ఠాకూర్ డిమాండ్ చేస్తున్నారు. రేపటి బడ్జెట్ సమావేశాల తర్వాత ప్రభుత్వంపై ఫ్లోర్ టెస్ట్ ఒత్తిడికి డిమాండ్ చేస్తామని అన్నారాయన. ఒకవేళ.. అదే జరిగితే రెండేళ్లు తిరగకుండానే హిమాచల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. అదే విధంగా దేశంలో కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా.. హిమాచల్‌ను కోల్పోతే ఆ సంఖ్య రెండుకే పరిమితం కానుంది. -
విషాదం: పారాగ్లైడింగ్ చేస్తూ హైదరాబాద్ టూరిస్టు మృతి
తెలంగాణకు చెందిన ఓ టూరిస్టు పారాగ్లైడింగ్ చేస్తూ దుర్మరణం చెందారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కులూలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదానికి కారణమైన పారాగ్లైడింగ్ పైలట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సేఫ్టీ బెల్ట్‌ను తనిఖీ చేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన నవ్య(26)..మనాలి సమీపంలోని దోభీ గ్రామంలో పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందారు. టెన్డం ఫ్లైట్‌లో టేకాఫ్ అయిన నిమిషాలకే ఈ దుర్ఘటన జరిగింది. మానవ తప్పిందంగానే ప్రమాదం జరిగినట్లు పర్యాటకశాఖ అధికారులు పేర్కొన్నారు. పర్యాటకురాలి సేఫ్టీ బెల్ట్‌ను తనిఖీ చేయకుండానే అనుమంతించడంతో ప్రమాదం జరిగినట్లు తేలడంతో.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పారాగ్లైడింగ్ పైలట్‌ను పోలీసులు అరెస్ఠ్ చేసినట్లు తెలిపారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. టూరిజం అధికారిణి సునైనా శర్మ మాట్లాడుతూ.. మానవ తప్పిదమే ఈ దురదృష్టకర సంఘటనకు దారితీసి ఉండొచ్చని తెలిపారు. పారాగ్లైడింగ్ చేసిన ప్రదేశం, ఎక్విప్మెంట్కు అనుమతి ఉందని, పైలట్‌కు రిజిస్ట్రేషన్ ఉందన్నారు. వాతావరణ సమస్యలు సైతం లేవన్నారు. ఈ ప్రమాదంతో ప్రస్తుతం దోభీ పారాగ్లైడింగ్‌ను తాత్కాలికంగా నిషేధించినట్లుట్లు తెలిపారు. ఐపీసీ సెక్షన్ 336, 334 కింద పైలట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారని, ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు అధికారిణి చెప్పారు. మృతిచెందిన టూరిస్టు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: Hyderabad:చాక్లెట్ ప్రియులకు అలర్ట్.. డైరీ మిల్క్‌లో పురుగు.. -
ఐదు జాతీయ రహదారులతోపాటు 475 రోడ్లు బంద్
హిమాచల్ ప్రదేశ్‌లో తాజాగా కురుస్తున్న మంచు కారణంగా ఐదు జాతీయ రహదారులతో సహా 475 రహదారులు మూతపడ్డాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాంతంలో మంచు కురుస్తున్న కారణంగా 333 విద్యుత్ సరఫరా పథకాలు, 57 నీటి సరఫరా పథకాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హిమపాతం కారణంగా చంబాలో 56, కాంగ్రాలో ఒకటి, కిన్నౌర్‌లో ఆరు, మండిలో 51, సిమ్లాలో 133 రోడ్లు మూసుకుపోయాయని విపత్తు నిర్వహణ విభాగం పేర్కొంది. అంతకుముందు శనివారం రాష్ట్రంలో 504 రహదారులను మూసివేశారు. వీటిలో నాలుగు జాతీయ రహదారులు ఉన్నాయి. అంతేకాకుండా పలు చోట్ల మంచు కురుస్తుండటంతో విద్యుత్ సరఫరా, నీటి సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని లాహౌల్-స్పితిలోని తొమ్మిది ప్రాంతాలలో మంచు తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. లాహౌల్ స్పితి పోలీసులు తమ సోషల్ మీడియా హ్యాండిల్లో జిల్లా వాతావరణం, రహదారి పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేశారు. నూతన సంవత్సరం ప్రారంభమైనది మొదలు హిమాచల్ ప్రదేశ్‌కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తున్నారు. అయితే హిమాచల్ ప్రదేశ్‌కు వచ్చే పర్యాటకులు ఇక్కడి వాతావరణ పరిస్థితులను తెలుసుకుని ప్రయాణానికి ప్లాన్ చేసుకోవాలని స్థానిక పోలీసులు సూచిస్తున్నారు. -
హిమాచల్‌లో అగ్ని ప్రమాదం.. దూకేసిన సిబ్బంది
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవివంచింది. ఓ కాస్మోటిక్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది భవనంపై నుంచి దూకేశారు. ఈ ప్రమాదంలో 19 మందికి తీవ్రగాయాలయ్యాయి. మొత్తం 41 మంది సిబ్బందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. #Himachal: major fire in a cosmetic factory in Baddi factory. 32 injured rescued, 24 feared missing. pic.twitter.com/hhD0xakgDs — Diksha Verma (@dikshaaverma) February 2, 2024 Massive fire broke out in cosmetic & perfume manufacturing factory in Baddi, Himachal Pradesh. About 130 employees were working in the factory at the time & many are feared to be trapped. Fire brigade & health department teams reached the spot.#Baddi #HimachalPradesh #fire pic.twitter.com/AyDt6EyA5J — Mirror Now (@MirrorNow) February 2, 2024 -
Video: అకస్మాత్తుగా కూలిన అయిదు అంతస్తుల భవనం
అది అయిదు అంతస్తుల భవనం.. చుట్టు కొండల మధ్య ఒక్కటే బిల్డింగ్. శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఆ బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. అందరూ చూస్తుండగానే పేకమేడల్లా నెలకొరిగింది. అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.. అసలు ఏం జరిగిందంటే.. హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాకు 26 కిలోమీటర్ల దూరంలో ధామి పట్టణంలోని మరహ్వాగ్ అనే గ్రామం ఉంది. అక్కడ రాజ్ కుమార్ అనే వ్యక్తికి అయిదు అంతస్తుల భవనం ఉంది. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో అతని ఇంటి చుట్టుపక్కల ఉన్న కొండచరియలు విరిగిపడ్డాయి. కొండ రాళ్లు ఈ బిల్డింగ్ గోడలను ఢీకొట్టాయి. ఈ క్రమంలో దానికి మరమ్మత్తులు చేశారు. అయినా కొన్ని రోజులుగా బిల్డింగ్‌లో కదలికలు రావడంతో అప్రమత్తమైన యజమాని.. బిల్డింగ్‌లోని నివాసితులను ఖాళీ చేయించి, మళ్లీ రిపేర్ చేయాలని భావించాడు. అధికారులను స్పందించగా బిల్డింగ్ ఎప్పుడైనా కూలిపోతుందని.. మరమ్మతులు చేయించిన ఫలితం ఉండదని చెప్పడంతో ఆ బిల్డింగ్‌ను అలాగే ఉంచేశాడు.. దీంతో కొన్ని రోజులకు బిల్డింగ్ బేస్మెంట్కు పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బిల్డింగ్ అకస్మాత్తుగా కూలిపోయింది. అందులోని నివాసితులను అధికారులు ముందుగానే ఖాళీ చేయించారు. విద్యుత్ సరాఫరా కూడా నిలిపివేశారు. దీంతో ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు. అయితే ధామి ప్రభుత్వ డిగ్రీ పాఠశాలకు వెళ్లే రహదారి దెబ్బతింది. ట్రాఫిక్‌కు సైతం అంతరాయం ఏర్పడింది. 15 సెకన్ల నిడివిగల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (రూరల్) నిశాంత్.. ఇంటి పైన ఉన్న కొండ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టడం వల్లే భవనం కూలిపోయిందని తెలిపారు. చదవండి: భారత్‌లోకి మయన్మార్ సైనికులు.. భారత్ కీలక నిర్ణయం Breaking: Major landslide in Shimla, where a 5-story building collapsed, and cracks appeared in the adjoining area and buildings. No casualties reported till now. #Shimla #Himachal pic.twitter.com/hRVXPY45Km — Gagandeep Singh (@Gagan4344) January 20, 2024 -
లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ అరుదైన ఘనత.. రికార్డు గణాంకాలు నమోదు
విజయ్ హజారే ట్రోఫీ 2023లో భాగంగా నిన్న (డిసెంబర్ 5) జరిగిన మ్యాచ్‌ల్లో రెండు ప్రధాన రికార్డులు నమోదయ్యాయి. మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర జట్టు టోర్నీ మూడో అత్యధిక స్కోర్ (427) నమోదు చేయగా.. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్ బౌలర్ అర్పిత్ గులేరియా 8 వికెట్ల ప్రదర్శనతో రికార్డు గణాంకాలు నమోదు చేశాడు. అర్పిత్ నమోదు చేసిన ఈ గణాంకాలు (9-0-50-8) లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే 11వ అత్యుత్తమ గణాంకాలుగా రికార్డు కాగా.. భారత్ తరఫున 8 వికెట్ల ఘనత సాధించిన మూడో బౌలర్‌గా అర్పిత్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నాడు. 26 ఏళ్ల అర్పిత్ ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అర్పిత్‌కు ముందు షాబాజ్ నదీం (8-10), రాహుల్ సింఘ్వి (8-15) లిస్ట్-ఏ క్రికెట్లో భారత్ తరఫున అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్లుగా ఉన్నారు. ఓవరాల్‌గా కూడా లిస్ట్-ఏ క్రికెట్లో వీరిద్దరివే అత్యుత్తమ గణాంకాలు కావడం విశేషం. మ్యాచ్ విషయానికొస్తే.. అర్పిత్ గులేరియా 8 వికెట్లతో విజృంభించినా హిమాచల్ ప్రదేశ్ ఓటమిపాలైంది. గుజరాత్ నిర్ధేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించడంతో హిమాచల్ విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. గులేరియా ధాటికి 49 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో అద్బుతంగా పోరాడిన హిమాచల్ లక్ష్యానికి 8 పరుగుల దూరంలో (49.5 ఓవర్లలో 319 ఆలౌట్) నిలిచిపోయింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ఉర్విల్ పటేల్ (116) సీజన్ రెండో సెంచరీతో విజృంభించగా.. మరో ఓపెనర్ ప్రయాంక్ పంచల్ (96) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. హిమాచల్ ఇన్నింగ్స్‌లో ప్రశాంత్ చోప్రా (96) నాలుగు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. ఆఖర్లో సుమీత్ వర్మ (47 బంతుల్లో 82; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ధసెంచరీతో హిమాచల్ గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. -
హిమాచల్‌లోనూ సొరంగ ప్రమాదం.. ఎప్పుడంటే..
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలి 41 మంది కూలీలు చిక్కుకున్నారు. కార్మికులంతా క్షేమంగా ఉండడం, 10వ రోజు రెస్క్యూ ఆపరేషన్‌లో కార్మికులందరి ఫొటోలు బయటకు రావడం కాస్త ఊరట కలిగించింది. కాగా హిమాచల్‌ప్రదేశ్‌లో తొమ్మది ఏళ్ల క్రితం కూడా ఇటాంటి సొరంగ ప్రమాదమే చోటు చేసుకుంది. నాటి ప్రమాదంలో ఇద్దరు కూలీలు సజీవంగా బయటపడ్డారు. ఒక కూలీ మృతి చెందాడు. సొరంగంలో చిక్కుకున్న ఈ కూలీలు పది రోజుల పాటు ఆహారపానీయలు లేకుండా దయనీయ స్థితిలో కాలం గడిపారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కిరాత్పూర్-మనాలి దగ్గరున్న సొరంగంలో 2015, సెప్టెంబరు 15న ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్‌లో మాదిరిగానే నాడు ఈ సొరంగంలో కొంత భాగం కూలిపోవడంతో కార్మికులు లోపల చిక్కుకుపోయారు. మొదట ఎంత మంది కార్మికులు లోపల చిక్కుకున్నారో తెలియరాలేదు. నాడు దీనికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ అప్పటి డీసీ మాన్సీ సహాయ్ నేతృత్వంలో జరిగింది. ఆయన ప్రస్తుతం హిమాచల్‌లో లేబర్ కమిషనర్‌గా ఉన్నారు. నాడు కిరాత్పూర్-మనాలి దగ్గరున్న సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు 211 గంటల 47 నిమిషాల సమయం పట్టింది. 42 మీటర్ల మేర సొరంగంలో డ్రిల్లింగ్ చేసిన అనంతరం రెస్క్యూ టీం ఇద్దరు కార్మికులను క్షేమంగా బయటకు తీసుకువచ్చింది. ఇది కూడా చదవండి: సొరంగంలో చిక్కుకున్నవారంతా క్షేమం.. ఫొటో విడుదల! -
హిమాచల్ సీఎంకు అస్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు
ఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖును ఢిల్లీలోకి ఎయిమ్స్ తరలించారు వైద్యులు. వైద్య పరీక్షల కోసం శుక్రవారం సీఎంను ఎయిమ్స్‌కు తీసుకెళ్లినట్లు ఐజీఎమ్‌సీ సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ రావు తెలిపారు. అయితే, సుఖ్విందర్ సింగ్ బుధవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో, కుటుంబ సభ్యులు ఆయనను సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో చేరారు. ఈ సందర్బంగా డాక్టర్ రాహుల్ రావు మాట్లాడుతూ.. బుధవారం రాత్రి నుంచి అన్ని రకాల పరీక్షలు చేశాం. కడుపులో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు బయటపడింది. మరిన్ని వైద్యపరీక్షల నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించామని తెలిపారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆరోగ్యం నిలకడగా ఉందని, అన్ని నివేదికలు సాధారణంగానే ఉన్నాయని చెప్పారు. ఇక, సిమ్లాలో సీఎంను పరీక్షించిన వైద్యబృందం కూడా ఆయన వెంట వెళ్లింది. Himachal Pradesh Chief Minister Sukhvinder Singh Sukhu has been shifted to AIIMS New Delhi today as he was diagnosed with Pancreatitis by the doctors of Indira Gandhi Medical College and Hospital (IGMC), Shimla. As confirmed by the IGMC Sources "He has been shifted to AIIMS for… — ANI (@ANI) October 27, 2023 అయితే, ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు గత కొద్దిరోజులుగా విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కొన్నిసార్లు బయట ఆహారం తీసుకోవాల్సి వచ్చింది. దానివల్లే ఆయన ఇన్ఫెక్షన్కు గురయ్యారు అని సుఖు ప్రధాన మీడియా సలహాదారు వెల్లడించారు. -
ఒక్క ఆడపిల్ల ఉంటే రూ.2 లక్షలు
సిమ్లా: ఆడపిల్లల భ్రూణ హత్యల నివారణకు హిమాచల్‌ప్రదేశ్ ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఒకే ఒక్క ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులకు రూ.2 లక్షలు ప్రోత్సాహకంగా ఇస్తామని ప్రకటించింది. గతంలో ఒక్క ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులకు రూ.35 వేలు ఇన్సెంటివ్‌గా ఇచ్చే వారు. ఇప్పుడు దానికి 2 లక్షల రూపాయలకు పెంచినట్టుగా హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు చెప్పారు. డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సేఫ్టీ అండ్ రెగ్యులేషన్స్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఒక కార్యక్రమానికి హాజరవడానికి వచ్చిన సీఎం సుఖు విలేకరులతో మాట్లాడారు. ఒక్క ఆడపిల్ల పుట్టిన తర్వాత కుటుంబ నియంత్రణ పాటించే తల్లిదండ్రులకు లక్ష రూపాయలు, ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఇక పిల్లలు వద్దు అనుకున్న వారికి మరో లక్ష రూపాయలు అందిస్తామని చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్‌లో లింగ నిష్పత్తి 1000:950గా ఉంది. దేశంలో అత్యుత్తమ రాష్ట్రాల్లో మూడో స్థానంలో నిలిచింది. -
ఫ్రెండ్ కారులో వీకెండ్ ట్రిప్‌కు చెక్కేస్తున్నారా? అయితే ఇది మీకోసమే!
వీకెండ్‌లోనో, లేదా అత్యవసరం అనుకున్నపుడో ఫ్రెండ్కారును తీసుకొని వెళ్లడం చాలామందికి అలవాటు. అలాగే అద్దె కారులో అయినా సరే హిల్ స్టేషన్లకు చెక్కేస్తారు చాలామంది. అయితే అలాంటి వారి గుండ గుభిల్లు మనే వార్త ఇది. స్రేహితుడి కారులో రోడ్ ట్రిప్‌కు వెళ్లిన ఒక ఫ్యామిలీకి చేదు అనుభవం ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఫ్రెండ్ కారు తీసుకొని హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లిన టూరిస్ట్‌లకు భారీ పెనాల్టి విధించారు అక్కడి పోలీసు అధికారులు. దీనికి సంబంధించిన వీడియోను సీతారామ్ 12456 తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేశారు. దీని ప్రకారం అక్కడి ట్రాఫిక్ పోలీసులు కారులో ప్రయాణిస్తున్న కుటుంబాన్ని ఆపారు. చిన్న వీడియోలో కుటుంబం ప్రయాణిస్తున్న కారు కనిపించలేదు. కానీ వీడియోలోని వ్యక్తి తన స్నేహితుడి కారులో ప్రయాణిస్తున్నాడని చెప్పాడు. అతను చూపించిన పత్రాలను చూసిన పోలీసులు మరొకరి కారును ఉపయోగించడనాఇకి అనుమతిలేదని చలాన్ జారీ చేస్తామని డ్రైవర్‌కు చెప్పడం, దీంతో ఇరువురూ కాసేపు వాదించు కోవడం చూడొచ్చు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని పేర్కొన్న పోలీసులు అసలు కారు ఓనరుకు ఫోన్ చేసి మరీ నిర్ధారించుకున్నారు. చివరికి చలానా విధించారు. (ట్రంప్ టవర్స్‌లోకి రణబీర్ అండ్ అలియా: అద్దె ఎంతో తెలిస్తే షాక్‌వుతారు) అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటంటే స్నేహితుడు లేదా బంధువు కారును వారి సమ్మతితో తీసుకు వెళ్లడం, నడపడం నిజానికి చట్టవిరుద్ధం కాదు. కానీ దీన్ని అలుసుగా తీసుకున్న చాలామంది టూర్ ఆపరేటర్లు కమర్షియల్ వెహికల్ ట్యాక్స్ ఆదా చేసేందుకు పర్యాటకులకు ప్రైవేట్ రిజిస్టర్డ్ కార్లను ఆఫర్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు అలా వ్యవహరించారా అనేది తేలాల్సి ఉంది. అసలు యజమాని నుండి సమ్మతితో కారును తీసుకున్నట్లయితే, అది చట్టవిరుద్ధం కాదు. ఒకవేళ పోలీసులు తప్పుగా చలాన్ జారీ చేస్తే, ఈ విషయాన్ని క్లియర్ చేసేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. అలాగే చెన్నైలో యజమానికి తెలియకుండా స్నేహితుడి లేదా బంధువుల వాహనం నడుపుతూ పట్టుబడితే, చెన్నై పోలీసులు మూడు నెలల జైలు శిక్ష లేదా రూ. 500 జరిమానా విధిస్తారు. సాధారణ తనిఖీల సమయంలో కారు లేదా బైక్ తమ స్నేహితుడిదేనని చాలా మంది పేర్కొంటున్నందున, నగరంలో వాహనాల దొంగతనాల సంఖ్యను తగ్గించేలా ఇలా నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అయితే హైదరాబాద్‌లో ఇలాంటి నిబంధన ఉన్నట్టుగా అధికారికంగా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. (ఫెస్టివ్ సీజన్: బంగారం, వెండి ధరలు, ఎన్నాళ్లీ ఒత్తిడి!) -
హిమాచల్‌లో దారుణం.. కోడలి జుట్టు కత్తిరించి, ముఖానికి నల్లరంగు పూసి
హిమాచల్ ప్రదేశ్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. 21 ఏళ్ల మహిళ జుట్టు కత్తిరించిన అత్తమామలు ఆమెను తీవ్రంగా వేధించారు. కోడలు ముఖానికి నల్లరంగు పూసి గ్రామంలో ఊరేగించారు. హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖ సొంత జిల్లా హమీర్‌పూర్‌లోని భోరంజ్ సబ్‌డివిజన్‌లోని ఓ గ్రామంలో ఆగస్టు 31 జరిగిన ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసుంది. అత్తమామల దాష్టీకానికి సంబంధించిన మూడు నిముషాల వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అత్తమామలతో సహా అయిదుగురిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల మేరకు.. మహిళకు కొన్నాళ్ల క్రితం వివాహామైంది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమె తన ఇంటికి వెళ్లింది. అయితే ఆమె తిరిగి రాగానే అత్తమామలు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. కోడలికి వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో అత్తమామలు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్తమామలపై కేసు ఫైల్ చేసి చర్యలు తీసుకుంటున్నామని హమీర్పూర్ ఎస్పీ ఆకృతి శర్మ తెలిపారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశామని, తదుపరి విచారణ జరుగుతోందని ఆమె తెలిపారు. ఈ ఘటన దురదృష్టకరమని హిమాచల్ ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ప్రబోధ్ సక్సేనా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిందని, కేసును విచారిస్తున్న అధికారులు పూర్తి నివేదికను సమర్పించాలని తెలిపారు. ఈ కేసులో బాధిత మహిళ వాంగ్మూలాన్ని తీసుకున్నామని, ఆమెకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ స్థాయిలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఎం సొంత జిల్లాలోనే ఈ ఘటన జరగడంతో ఈ అంశం రాజకీయ విమర్శలకు దారితీసింది. శాంతిభద్రతలు పూర్తిగా స్తంభించాయని హిమాచల్ బీజేపీ కార్యదర్శి నరేంద్ర అత్రి అన్నారు. ఎలాంటి భయం లేకుండా సంఘ వ్యతిరేకులు నేరాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. मुख्यमंत्री सुखविंदर सुक्खू जी के गृह जिला में मानवता शर्मसार।#जनता_विरोधी_कांग्रेस_सरकार #कांग्रेस_का_कुप्रशासन#Congress #bhoranj#Hamirpur #cmsukkhu #himachal #himachalpradesh pic.twitter.com/g1jQvi0cYk — BJP Himachal Pradesh (@BJP4Himachal) September 15, 2023 -
Video: హిమాచల్‌లో వర్ష బీభత్సం.. చూస్తుండగానే ఇళ్లు నేలమట్టం
హిమాచల్ ప్రదేశ్‌లో వర్షం బీభత్సం కొనసాగుతోంది. గతకొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వానలకు రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. కులు జిల్లాలోని అన్నీ అనే ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. చూస్తూండగానే పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. బస్టాండ్ సమీపంలోని ఏడు పెద్ద భవనాలు నేలమట్టమయ్యాయి. భవనాల శిథిలాల కింద అనేకమంది చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో..బహుళ అంతస్తుల భవనాలు పేకమేడల కుప్పకూలడం, భారీగా దుమ్ము లేవడం కనిపిస్తోంది. వెన్నులో వణుకు పుట్టించే దృశ్యాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇక కులు జిల్లాలోని అన్నీ టౌన్లో ఉన్న భారీ బిల్డింగ్లు కూలిపోయాయి. అయితే భవనాలకు పగుళ్లు ఏర్పడటంతో మూడు రోజుల క్రితమే ఆ బిల్డింగ్‌ల నుంచి జనాన్ని తరలించారు. కులు-మండి హైవేపై భారీ వర్షం వల్ల వాహనాలు నిలిచిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎస్ వంటి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌కు భారత వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. నేటి నుంచి మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇళ్లు కూలిన ఘటనపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు స్పందించారు. కులులో కొండచరియలు విరిగిపడటంతో భారీ భవనాలు కూలిపోతున్న దృశ్యాలు కలవరపరిచాయని తెలిపారు. అయితే రెండు రోజుల ముందే ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు.ఆ బిల్డింగ్‌ల నుంచి ప్రజలను వేరే ప్రాంతానికి తరలించారని ట్విటర్లో పేర్కొన్నారు. #WATCH | Himachal Pradesh: Several buildings collapsed due to landslides in Anni town of Kullu district. (Visuals confirmed by police) pic.twitter.com/MjkyuwoDuJ — ANI (@ANI) August 24, 2023 -
రైల్వే ట్రాక్ ఎలా వేలాడుతుందో చూడండి..
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు షిమ్లా సమ్మర్ హిల్‌లో ఒక చోట రైల్వే ట్రాక్ కింద ఉన్న భూభాగం తుడిచిపెట్టుకు పోయింది. దీంతో ఆ రైల్వే ట్రాక్ గాల్లో వేలాడుతూ ఉంది. కాకపోతే ఇది సాధారణ రైల్వే ట్రాక్ కాదు. యునెస్కో వారు పర్యాటకం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. దీనిపై టాయ్ ట్రైన్ ప్రయాణిస్తుంటుంది. షిమ్లా సమ్మర్ హిల్ హిమాచల్ ప్రదేశ్ పర్యాటకంలో ఒక భాగం. ఈ ట్రాక్ పైన వెళ్లే టాయ్ ట్రైన్ ప్రయాణం చాలా మందికి బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసే యునెస్కో వారి ప్రత్యేక ఆకర్షణ. ఈ ట్రాక్ కక్ల నుండి షిమ్లా వైపుగా 96 కి.మీ. ప్రయాణిస్తుంటుంది. ఐదు గంటల పాటు సాగే ఈ ప్రయాణంలో హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన హిమాలయాల సొగసులు, ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలు దర్శనమిస్తాయి. కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ ట్రాక్ కింద భూభాగం కొట్టుకుపోవడంతో ఈ ట్రాక్ గాలిలో వేలాడుతోంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే టాయ్ ట్రైన్ రాకపోకలు ప్రస్తుతానికైతే నిలిచిపోయాయి. దీని మరమ్మత్తులకు కనీసం రూ.15 కోట్లు వ్యయం అవుతుందని దాని కోసం సుమారు నెలరోజుల సమయం పడుతుందని రైల్వే అధికారలు చెబుతున్నారు. ఇదే షిమ్లా సమ్మర్ హిల్ సమీపంలో మరొక దేవాలయం కూడా భారీ వర్షాలకు నేలకొరిగింది. భారీ సంఖ్యలో భక్తులు సావాన్ ప్రార్ధనలు నిర్వహిస్తుండగా ఈ దేవాలయం కుప్పకూలింది. విపత్తు నిర్వహణ బృందం సహాయక చర్యలు చేపడుతుండగా శిథిలాల్లో 13 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రమంతా అతలాకుతలమైంది. ఎక్కడికక్కడ వాన నీరు నిలిచిపోయి రహదారులు నదులను తలపిస్తుంటే నదులు మాత్రం నీటిప్రవాహానికి పోటెత్తుతూ ఉన్నాయి. ఇదిలా ఉండగా కొండ ప్రాంతాల్లో మాత్రం ఘాట్ రోడ్డు పొడవునా కొండచరియలు విరిగిపడటంతో వాహనదారులకు తీవ్ర అంతరాయం కలిగిస్తూ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ మాట్లాడుతూ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్‌లో భారీ నష్టం వాటిల్లిందని 60 మంది ప్రాణాలు కోల్పోగా ప్రభావిత ప్రాంతాలను పునరుద్ధరించేందుకు కనీసం రూ.10,000 కోట్లు ఖర్చవుతుందని దానికి ఏడాదికి పైగా సమయం పడుతుందని అన్నారు. "Guys this is very scary" Heavy damage to Kalka-Shimla railway track due to heavy rain and landslides. The earth below the track and been washed away at one place.#Himachal #HimachalPradeshRains #HimachalFloods #himachalrains #HimachalPradesh #TRAIN @AshwiniVaishnaw pic.twitter.com/E4V8jIS2uZ — कालनेमि (Parody) (@kalnemibasu) August 14, 2023 ఇది కూడా చదవండి: చంద్రయాన్-3లో కీలక ఘట్టం..మాడ్యూలర్ నుంచి విడిపోయిన ల్యాండర్ -
కొనసాగుతున్న వర్ష బీభత్సం.. రూ.10 వేల కోట్ల ఆస్తి నష్టం..
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఇంకా వర్ష బీభత్సం కొనసాగుతోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో బుధవారం ఉదయం సమ్మర్ హిల్ ప్రాంతంలో మళ్లీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నట్టుగా సమాచారం. సహాయ బృందాలు యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాయి. గత వారం రోజులుగా సమ్మర్ హిల్, కృష్ణానగర్, ఫగ్లీ ప్రాంతాలు కొండచరియల బీభత్సంతో వణికిపోతున్నాయి. ఇప్పటివరకు 71 మంది మరణించారు. దాదాపుగా 10 వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు తెలిపారు. ఖంగ్రా జిల్లాలో వర్షబీభత్స ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే నిర్వహించారు. అధికారులతో సమావేశమై పునరుద్ధరణ పనులపై చర్చించారు. ‘‘ఈ ఏడాది వర్షాలు చాలా నష్టాన్ని మిగిల్చాయి. పునరుద్ధరణకు ఏడాది సమయం పట్టేలా ఉంది. అయినా యుద్ధ ప్రాతిపదికన పనులు నిర్వహిస్తాం’’ అని చెప్పారు. రోడ్లు, నీటి ప్రాజెక్టులు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణాలు అతి పెద్ద సవాల్‌గా మారాయని, ఏడాదిలోగా అన్ని పనులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా వివరించారు. చదవండి: రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘంలో రాహుల్ గాంధీ! Massive devastation due to heavy rains in Mandi of Himachal Pradesh. #HimachalPradesh #HimachalDisaster pic.twitter.com/U7H4ZTYkIs — Inside India (@_InsideIndia) August 17, 2023 Incessant rainfalls have been thrashing the states of Himachal Pradesh and Uttarakhand with landslides and flood like situations In l last 3 days death tolls have gone up to 71. More than 1000 peoples have been evaluated from vulnerable areas#floods #WeatherUpdate #omshanti pic.twitter.com/f3Tnf4R5uv — Hamara Bharat (@AvyuktKrisha) August 17, 2023 'Gods must be angry': Spine-chilling videos show houses, people being washed away in Himachal Pradesh. "We Stand With Himachal" Let's Pray for the Speedy Recovery @CMOFFICEHP @SukhuSukhvinder @BJP4Himachal #floods #HimachalDisaster #HimachalPradesh pic.twitter.com/fyiq5oW9t2 — Hardik (@Hardik742639398) August 17, 2023 -
అభివృద్ధి అనకొండ!
విపరీతమైన వానలు, దాంతో వరదలు, విలయం. బీభత్సం ముగిసిందని అనుకొనే లోగానే నెల రోజుల్లో రెండోసారి హిమాచల్‌ప్రదేశ్‌పై ప్రకృతి పంజా విసిరింది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదులు, విరిగిపడుతున్న కొండచరియలు, పేకముక్కల్లా కూలుతున్న భవనాలు, నేలవాలుతున్న భారీ వృక్షాలు, కోసుకుపోయిన రోడ్లు, వంతెనలు, శిథిలాల్లో చిక్కుకున్న ప్రాణాలతో పర్వత ప్రాంత రాష్ట్రం అతలాకుతలమైంది. పెరుగుతున్న గంగమ్మ వరదలో ఉత్తరాఖండ్ ఉసూరుమంటోంది. ప్రమాదకర స్థాయిలో సాగుతున్న యమున మళ్ళీ ఢిల్లీ సహా పలు ప్రాంతాల్ని భయపెడుతోంది. జూన్ ద్వితీ యార్ధం నుంచి జూలై చివరి వరకు వానలు, వరదలు ఒక్క హిమాచల్‌లోనే 150 మందిని బలిగొని, రూ. 10 వేల కోట్ల పైగా నష్టం కలిగిస్తే, తాజా విలయం ఇప్పటికే 60 మందిని పొట్టబెట్టుకొంది. హిమాలయాలు, దేశ కోస్తా ప్రాంతాలపై వాతావరణ పర్యవసానాలు గట్టి దెబ్బ కొట్టనున్నాయని ‘ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్’ (ఐపీసీసీ) 6వ నివేదిక పేర్కొంది. హిమాలయాల్లో సగటు ఉష్ణోగ్రత మిగతా దేశంతో పోలిస్తే వేగంగా పెరుగుతోంది. ఈ వర్షాకాలం అసాధారణ రీతిలో కురుస్తున్న వర్షాలు అందుకు తగ్గట్టే ఉన్నాయి. స్వల్పవ్యవధిలో భారీ వర్షం కురిపించే మేఘపతనం, ఆకస్మిక వరదలకు వాతావరణ మార్పులు కొంత కారణమే. అయితే, మనసును కుది పేసే ఈ బీభత్సానికి మతి లేని అతి అభివృద్ధికి దిగిన మానవ తప్పిదాలే ప్రధాన హేతువు. పుడమి తల్లిని పట్టించుకోకుండా కొండల్ని తొలిచి, శిథిలావశేషాల్ని నదుల్లో పడేసి, ఇష్టారాజ్యంగా సాగిన అక్రమ గనుల తవ్వకాలు, సహజమైన నదీ ప్రవాహాల్ని నిరోధించిన నిర్మాణాలు, అశాస్త్రీయంగా చేపట్టిన భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లు కలిసి హిమాచల్ మెడకు ఉరితాళ్ళయ్యాయి. హిమాలయాల్లో వరదలు, విరిగిపడే కొండచరియలు కొత్త కాదు. అందులోనూ హిమాచల్‌లోని మొత్తం 12 జిల్లాల్లో కొండచరియల పతనం తరచూ తప్పదని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఎప్పుడో తేల్చింది. అంత సున్నితమైన ఈ హిమాలయ పర్వతశ్రేణుల్లో ప్రగతి పేరుతో పాలకులు చేతులారా ప్రకృతి విధ్వంసం చేశారు. ఫలితంగా కొన్నేళ్ళుగా ఏటవాలు ప్రాంతాలు మరింత అస్థిర మయ్యాయి. కేవలం 2020 నుంచి 2022 మధ్య కొండచరియల పతనాల సంఖ్య ఆరు రెట్లు పెరిగిందని డేటా. ఈ పర్వతసానువుల్లో గత పదేళ్ళలో ఇష్టారాజ్యంగా రోడ్లు విస్తరించారు. ఏకంగా 69 నేషనల్ హైవే ప్రాజెక్ట్‌లకు ఆమోదం తెలిపారు. నాలుగు లేన్ల హైవేలు వాటిలో అయిదున్నాయి. హిమా లయాల్లో ఇప్పటికే 168 జల విద్యుత్కేంద్రాలుంటే, 2030 నాటికి 1088 కేంద్రాలు రానుండడం శోచనీయం. పర్యావరణాన్ని పట్టించుకోని ఈ అంధ ఆర్థికాభివృద్ధి మంత్రం ఇక్కడికి తెచ్చింది. పద్ధతీ పాడూ లేకుండా కొండల తవ్వకాలు, మతి లేకుండా రోడ్ల నిర్మాణం, నిర్మాణ వ్యర్థాలను ఏమి చెయ్యాలనే ఆలోచనైనా లేకపోవడంపై హిమాచల్ హైకోర్ట్ నిరుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గమనిస్తే – దాదాపు ప్రతి వర్షాకాలం ఉత్తరాదిలో అస్సామ్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరా ఖండ్ లాంటి రాష్ట్రాలు వానలు, వరదలతో అతలాకుతలమవుతున్నాయి. గతంతో పోలిస్తే వరదల సంఖ్య, ఆస్తి, ప్రాణనష్టాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. వరదల నివారణకు సమర్థమైన ప్రణాళిక లోపిస్తోంది. ఈ తప్పు కూడా పాలకులదే తప్ప ప్రకృతిది కాదు. మన దేశంలో 4 కోట్ల హెక్టార్లకు పైగా ప్రాంతం, అంటే దేశ భూభాగంలో దాదాపు 12 శాతానికి వరదల ముప్పుందని లెక్క. భూకంపాల లాంటి ప్రకృతి వైపరీత్యాలతో పోలిస్తే వరదల్ని ముందే అంచనా వేయడం, అడ్డుకోవడం చేయదగిన పనే. కానీ ప్రభుత్వాలు ఆ పనీ చేయట్లేదు. అనేక రాష్ట్రాల్లో వరద ముంపు నకు ఇష్టారాజ్యంగా అడవుల నరికివేత, నదీ పరివాహక ప్రాంతాల్లోని వృక్షచ్ఛాయల విధ్వంసం, పేరుకున్న పూడికలతో నదికి నీటిని నిల్వచేసే సామర్థ్యం తగ్గిపోవడం... ఇలా అనేక కారణాలు. దానికి తోడు నదీ తలాలు, నదీ మైదానాల ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయి. డ్యామ్‌ల వరద గేట్ల నిర్వహణలో సమన్వయ లోపాలు సరేసరి. ఈ స్వయంకృతాలన్నీ శాపాలవుతున్నాయి. విచిత్రం ఏమిటంటే – వరద పరిస్థితుల్లో సత్వర చర్యలు పర్యవేక్షించేందుకు దేశంలో ఒకే విభాగమంటూ ఏదీ లేకపోవడం! ఆ మాటకొస్తే, వరదల నిర్వహణకు మన రాజ్యాంగంలో నిర్ణీత ఏర్పాటేదీ లేదు. వాతావరణ శాఖ వర్షసూచనలు చెబితే, వరద ముప్పు సూచనలు చెప్పే బాధ్యత కేంద్ర జల సంఘానిది. వరద ముంపునకు గురయ్యాక సహాయ, పునరావాస చర్యలు చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో ప్రకృతి వైపరీత్యాల సహాయ సంస్థలున్నాయి. బాధితుల పునరావాసం, దెబ్బతిన్న ప్రాథమిక వసతుల పునరుద్ధరణ బాధ్యత స్థానిక సంస్థలది. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయం కీలకం. ఇంకా విడ్డూరం – నీరు, సాగునీటి పారుదల, తదితర అంశాలన్నీ రాష్ట్ర జాబితాలోవే కానీ, వరదల్లో సహాయ బాధ్యతల నిర్వహణ మాత్రం కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలు వేటిలోనూ లేకపోవడం! పదే పదే వరదల ముప్పు తలెత్తుతున్న వేళ ఈ కీలక అంశాలపై కేంద్ర పెద్దలు తక్షణం సమగ్రంగా దృష్టి పెట్టాలి. 1970లలో నెలకొల్పిన ‘వరదలపై జాతీయ కమిషన్’ తరహాలో వరదల సమస్యలపై ఆచరణాత్మక వ్యూహాన్ని సూచించేలా ఉన్నత స్థాయి నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేయాలి. ఇకనైనా వరదలపై అన్ని విభాగాలనూ సమన్వయ పరిచే సమగ్ర విధానం అత్యవసరం. అదే సమయంలో సున్నితమైన పర్యావరణాన్ని గౌరవించాలి. లేకపోతే తలెత్తే దుష్పరిణామాలకు హిమాలయ బీభత్సం ప్రతీక. మరి, ఈ మాటైనా హిమాలయాల మాట చెవికెక్కించుకుంటారా? -
హిమాచల్ ప్రదేశ్‌లో వర్ష బీభత్సం (ఫోటోలు)
-
Yamuna River Floods: యమునా నది ఉగ్రరూపం
న్యూఢిల్లీ: ఉత్తరాదిని అతలాకుతలం చేస్తున్న వర్షాల ప్రభావానికి యమునా నది మరోసారి పోటెత్తింది. కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అటు ఉత్తరాఖండ్ ఇటు హిమాచల్ ప్రదేశ్ రెండు రాష్ట్రాలలో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. మరో 24 గంటలపాటు భారీ వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ శాఖ తెలపడంతో అధికారులు ఢిల్లీలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. గత నెలలో దేశ రాజధానిలో కురిసిన భారీ వర్షాలకు రహదారులన్నీ నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. యమునా నది ప్రవాహమైతే జులై 13న అత్యధికంగా 208.66 మీ. రికార్డు స్థాయికి చేరుకోగా తాజాగా మరోసారి అలాంటి పరిస్థితే నెలకొంది. మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో యమునా నది ప్రవాహం పాత రైల్వే బ్రిడ్జి వద్ద 205.39 మీటర్లకు చేరినట్లు సెంట్రల్ వాటర్ కమీషన్(CWC) తెలిపింది. హర్యానాలోని యమునానగర్ హాత్నికుండ్ బ్యారేజ్ వద్ద నిన్న సాయంత్రానికి నీటి ప్రవాహం ఉధృతి 30,153 క్యూసెక్కులకు చేరినట్లు చెబుతోంది సెంట్రల్ వాటర్ కమీషన్. హిణాచల్ ప్రదేశ్ లోనూ, ఉత్తరాఖండ్ లోనూ మరో 24 గంటలపాటు భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు ఐఎండీ శాఖ తెలిపింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్ లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు కొండతట్టు ప్రాంతాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొండ చరియలు జారి పడటం, వరదలు, మేఘ విస్ఫోటనాలు సంభవించడంతో ప్రాణ నష్టం కూడా పెరుగుతూ వచ్చింది. ఒక్క హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనే ఇప్పటివరకు 55 మంది మృతి చెందారు. #WATCH | Water level of River Yamuna rises in Delhi again. Drone visuals from this morning show the current situation around Old Yamuna Bridge (Loha Pul) pic.twitter.com/PATydIBQXZ — ANI (@ANI) August 16, 2023 యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు మొదలుపెట్టామని రహదారులపై చిక్కుకున్న వారిని విడిపించేందుకు విపత్తు నిర్వహణ బృందాలు కృషి చేస్తున్నాయని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు. కల్క -షిమ్లా, కీరత్ పుర్-మనాలి, పఠాన్ కోట్ - మండి, ధర్మశాల - షిమ్లా రహదారులన్నీ మూసివేసినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: ఎర్రకోట వేడుకకు హాజరుకాని మల్లికార్జున ఖర్గే.. నెట్టింట వైరల్‌గా ఖాళీ కుర్చి -
హిమాచల్‌లో వర్ష బీభత్సం.. నేడు, రేపు స్కూల్స్ బంద్
సిమ్లా: ఈ ఏడాది ఉత్తరాదిలో వర్షాలు దండికొడుతున్నాయి. గతకొద్ది రోజులుగా హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు నెలలుగా ఆ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో పలు నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వరదల కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. మరోవైపు.. ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్ట ఐఎండీ హెచ్చరించింది. The destruction happened in #HimachalPradesh and #Uttarakhand is unprecedented but the whole mainstream media is silent. This happened in Mandi #Himachal #HimachalDisaster #HimachalFloodspic.twitter.com/FENPh2efDR — Anis Hussain 🙋 (@Anis_Husain) August 16, 2023 ఇదిలా ఉండగా.. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు హిమాచల్ ప్రదేశ్‌లో 55 మంది చెందారు. ఇక, వచ్చే 24 గంటల్లో మూడు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పాటే, ఆరెంజ్ అలర్ట్‌ను కూడా విధించారు. ఈ నేపథ్యంలో కాంగ్రా జిల్లాలో నేడు(బుధవారం), రేపు(గురువారం) విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. మరోవైపు.. హిమాచల్ రాజధాని సిమ్లాలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. వరదల్లో చిక్కుకున్న 440 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. A landslide has occurred in a part of the Indian state of Himachal Pradesh, causing multiple houses to collapse. pic.twitter.com/MpaVTY6Xu2 — Akin💯 (@ics923) August 16, 2023 ఇదే సమయంలో, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ, నదులు మరియు కాలువల దగ్గరకు వెళ్లవద్దని డిప్యూటీ కమిషనర్ అందరినీ ఆదేశించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే జిల్లా విపత్తు నిర్వహణ కేంద్రంలోని టోల్ ఫ్రీ నంబర్ 1077కు సమాచారం అందించాలని ఆయన కోరారు. बल्ह घाटी का मझ्याली नाला। घर, सामान और कुछ हद तक साहस....कुछ नहीं बचा।#HimachalPradesh#HimachalFloods pic.twitter.com/3FuadgwPIg — नवनीत शर्मा-Navneet Sharma (@nsharmajagran) August 14, 2023 ఇక, భారీ వర్షాల నేపథ్యంలో ఏడు ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో, అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. పలు ఇళ్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. మండి, సిమ్లా, బిలాస్పూర్ జిల్లాల్లోని 621 రోడ్లపై రాకపోకలను నిలిపివేశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. Monsoon damages have been enormous in ongoing #HimachalFloods. Old timers are saying they have never seen devastation of this scale. Below video of today's cloud burst at Sambhal Pandoh shared by an HP friend. Praying for safety & well being of all affected in HP & #Uttarakhand! pic.twitter.com/iE7SRgRvqo — jeevan (@jeevan13470725) August 15, 2023 ఇది కూడా చదవండి: హిమాచల్, ఉత్తరాఖండ్‌లో భీకర వర్షం -
హిమాచల్, ఉత్తరాఖండ్‌లో భీకర వర్షం
షిమ్లా/డెహ్రాడూన్: హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను భీకర వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొంచచరియలు విరిగిపడుతుండడంపై పలు రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లు సైతం కూలిపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో ఆదివారం సాయంత్రం మొదలైన వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. వర్షాలు, కొండచరియల ధాటికి రాష్ట్రంలో కనీసం 51 మంది మరణించారని అధికారులు సోమవారం ప్రకటించారు. వీరిలో ఏడుగురు రాజధాని షిమ్లాలోని సమ్మర్ హిల్ ప్రాంతంలో శివాలయంపై కొండచరియలు విరిగిపడడంతో రాళ్ల కింద చిక్కుకొని సజీవ సమాధి అయ్యారని వెల్లడించారు. ఆలయం కూడా ధ్వంసమైంది. ఈ రాళ్ల కింద మరికొంత మంది ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. షిమ్లాలో ఈ శివాలయం ఎంతగానో ప్రసిద్ధిగాంచింది. నిత్యం పద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అలాగే షిమ్లాలోని ఫగ్లీ ప్రాంతంలో కొండచరియల వల్ల ఐదుగురు మరణించారు. ఇక్కడ శిథిలాల కింద చిక్కుకున్న 17 మందిని అధికారులు రక్షించారు. అంతేకాకుండా చాలా ఇళ్లు బురదలో కూరుకుపోయాయి. వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో సోమవారం కాలేజీలు, స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ముందుజాగ్రత్తగా 752 రహదారులపై రాకపోకలను నిలిపివేశారు. సైన్యంతోపాటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ సిబ్బంది, రాష్ట్ర పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో అత్యధికంగా కాంగ్రాలో 273 మిల్లీమీటర్లు, ధర్మశాలలో 250 మిల్లీమీటర్లు, సుందర్‌నగర్‌లో 168 మిల్లీమీటర్లు, మండీలో 140 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో 12 జిల్లాలకుగాను 9 జిల్లాల్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అమిత్ షా దిగ్భ్రాంతి షిమ్లాలో కొండచరియలు విరిగిపడడం వల్ల ధ్వంసమైన శివాలయాన్ని ముఖ్యమంత్రి సుఖీ్వందర్‌సింగ్ సుఖూ సందర్శించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీసుకురావడానికి సహాయక చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. హిమాచల్ ప్రదేశలో వర్షాల వల్ల పెద్ద సంఖ్యలో జనం మరణించడం పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఎన్డీఆర్ఎఫ్ అధికారులను ఆదేశించారు. కేదార్‌నాథ్‌కు రాకపోకలు బంద్ ఎడతెరిపిలేని భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ రాష్ట్రం చిగురుటాకులా వణికిపోతోంది. కొండచరియలు విరిగి పడడంతో పలు ఇళ్లు నేలకూలాయి. రహదారులు దెబ్బతిన్నాయి. వర్షాల ధాటికి రాజధాని డెహ్రాడూన్ సమీపంలోని ప్రైవేట్ డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్ ధ్వంసమైంది. వర్ష బీభత్సం వల్ల రాష్ట్రంలో నలుగురు మరణించారు. మరో 10 మంది గల్లంతయ్యారు. పలుచోట్ల జాతీయ రహదారులు ధ్వంసం కావడంతో ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రికి రాకపోకలు నిలిచిపోయాయి. చార్దామ్ యాత్రను రెండు రోజుల పాటు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. రుద్రప్రయాగ్, దేవప్రయాగ్, రిషికేశ్‌లో అలకనంద, మందాకినీ, గంగా నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. రిషికేశ్‌లో 435 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
Cloudburst: యాభై మందికిపైగా మృతి
ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలు ఉత్తరాదిన జల ప్రళయాన్ని సృష్టించాయి. వర్షాలకు తోడు అకస్మిక వరదలు పోటెత్తడంతో ప్రజల జీవన విధానాన్ని అస్తవ్యక్తం చేశాయి. అనేక చోట్ల కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. కొండల్లో నుంచి వచ్చిన వరద నీటితోపాటు కొట్టుకువచ్చిన బురద, మట్టి వందలాది ఇళ్లను నేలమట్టం చేసింది. #WATCH | River flowing in full spate along road to Prashar Lake in Mandi district of Himachal Pradesh pic.twitter.com/01MxFkRmC6 — ANI (@ANI) August 14, 2023 41 మంది మృతి హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలతో పలుచోట్ల కొండచరియలు పేకమేడల్లా విరిగిపడుతున్నాయి.https://www.sakshi.com/telugu-news/national/954-police-medals-including-63-telugu-sates-onn-independence-day-eve-1735070 ఇప్పటి వరకు ఈ రకమైన ఘటనల్లో 41 మంది మృత్యువాతపడ్డారని రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ వెల్లడించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయని తెలిపారు. పొరుగున ఉన్న ఉత్తరాఖండ్‌లో కుండపోత వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, వంతెనలు, ఇళ్లు కొట్టుకుపోవడం, నదుల నీటి మట్టం పెరిగి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని పేర్కొన్నారు. చదవండి: 954 మందికి పోలీసు పతకాలు.. తెలుగు రాష్ట్రాల నుంచి 63 మంది ఎంపిక #UPDATE | A total of 41 people have lost their lives in Himachal Pradesh due to landslides and incessant rainfalls in the region. Search and rescue operation is underway: CMO Himachal Pradesh https://t.co/I7BYA9rsmQ — ANI (@ANI) August 14, 2023 జల ప్రళయానికి సాక్ష్యం తాజాగా మండీ జిల్లాలో భారీ వర్షంతో ఆకస్మిక వరదలు వచ్చి ఏడుగురు కొట్టుకుపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ను స్వయంగా ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ భయంకరమైన పరిస్థితి నుంచి బయటపడటానికి ప్రస్తుతం సహాయ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయన్నారు. వీడియో చూస్తుంటే అక్కడ జల ప్రళయం ఎలా ఉంది అనటానికి సాక్ష్యంగా నిలుస్తోంది. చదవండి: తండ్రీకొడుకుల్ని బలిగొన్న నీట్.. స్టాలిన్ ఆవేదన #UPDATE | A total of 41 people have lost their lives in Himachal Pradesh due to landslides and incessant rainfalls in the region. Search and rescue operation is underway: CMO Himachal Pradesh https://t.co/I7BYA9rsmQ — ANI (@ANI) August 14, 2023 కొండచరియలు విరిగిపడి తొమ్మిది మంది మృతి అంతకుముందు భారీ వర్షాలకు సంబంధించి రెండు వేర్వేరు ఘటనల్లో 16 మంది చనిపోయారు. సోలన్ జిల్లాలోని జాదోన్ గ్రామంలో ఆదివారం ఆకస్మిక వరదలు సంభవించడంతో రెండేళ్ల చిన్నారి సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు మరణించారని అధికారులు తెలిపారు. మరో ఘటనలో సిమ్లా నగరంలోని సమ్మర్ హిల్ ప్రాంతంలోని శివాలయం వద్ద కొండచరియలు విరిగిపడి తొమ్మిది మంది మరణించారు. #WATCH | Solan, Himachal Pradesh: Restoration work underway by administration near Chakki Mod after a landslide occurred near Shimla-Kalka highway (Parwanoo). pic.twitter.com/lBkyv64c5G — ANI (@ANI) August 14, 2023 ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు సోలన్ జిల్లాలోని బలేరా పంచాయతీలో కొండచరియలు విరిగిపడటంతో ఇల్లు కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. వారిలో ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు. రామ్‌షెహెర్ తహసీల్‌లోని బనాల్ గ్రామంలో కొండచరియలు విరిగిపడి మరో మహిళ చనిపోయింది. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హమీర్‌పూర్‌లో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు గల్లంతయ్యారని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ప్రతికూల వాతావరణం దృష్ట్యా జిల్లావాసులందరూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, అనవసరంగా బయటకు వెళ్లకుండా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. #WATCH | Rise in water level of river Ganga in Rishikesh due to heavy rainfall in Uttarakhand pic.twitter.com/ghdSjc6FVs — ANI UP/Uttarakhand (@ANINewsUP) August 14, 2023 విద్యాసంస్థలు బంద్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలను ఆగస్టు 14 (సోమవారం) మూసివేస్తున్నట్లు సీఎం సుఖ్వీందర్ సింగ్ ప్రకటించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను దూరంగా వెళ్లాలని ఆయన కోరారు. అలాగే ఈ సంక్షోభ సమయంలో రాష్ట్ర పర్యటనను టూరిస్టులు వాయిదా వేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో రూ. 7020.28 కోట్ల నష్టం మరోవైపు వర్షాలతో అల్లకల్లోమవుతున్న హిమాచల్ ప్రదేశ్‌లో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డిఆర్ఎఫ్) బృందాలు సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. వరద కారణంగా సంభవించిన మరణాలు చాలా బాధాకరమైనవని పేర్కొన్నారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ప్రకారం వరదల కారణంగా రాష్ట్రంలో 752 రోడ్లను మూసేశారు. వరదలు కొండచరియలు విరిగిపడటం వల్ల హిమాచల్ ప్రదేశ్ దేశంలోనే అత్యధికంగా ప్రభావితమైన రాష్ట్రంగా ఉంది. జూన్ 24న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో రూ. 7020.28 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు ఆదివారం పేర్కొన్నారు. #WATCH | Uttarkhand CM Pushkar Singh Dhami is conducting an aerial survey of Mohanchatti, the disaster-affected area of Yamkeshwar block of Pauri district. pic.twitter.com/v2ERGRMF5M — ANI UP/Uttarakhand (@ANINewsUP) August 14, 2023 621 రోడ్లు మూసివేత మండి, సిమ్లా, బిలాస్పూర్ జిల్లాల్లోని 621 రోడ్లపై రాకపోకలను నిలిపివేశారు. సిమ్లాను చండీగఢ్‌ను కలిపే సిమ్లా-కాల్కా జాతీయ రహదారిపై రహదారి గత రెండు వారాలుగా పదే పదే కొండచరియలు విరిగిపడటంతో తీవ్రంగా ప్రభావితమైంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా గత 48 గంటల్లో కురిసిన వర్షాల దెబ్బకు బియాస్, దాని ఉపనదులు పొంగి పొర్లుతున్నాయి. మాన్, కునా ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. హమీర్‌పుర్‌లో భవనాలు దెబ్బతిన్నాయి. పంటలు నీట మునిగాయి. కేదార్నాథ్ యాత్ర నిలిపివేత మరోవైపు ఉత్తరాఖండ్‌లో వర్షాల తీవ్రత అధికంగానే ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంతో గత 48 గంటల్లో అనేక ప్రాంతాలు దెబ్బతిన్నాయి. రోడ్లు కొట్టుకుపోయాయి, వంతెనలు దెబ్బతిన్నాయి. రెండు రోజులపాటు కేదార్నాథ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. గంగా నది మట్టం కూడా పెరుగుతోందని, దీనిని దృష్టిలో ఉంచుకుని రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచారని తెలిపారు. #WATCH | Uttarakhand CM Pushkar Singh Dhami says "Several places have been damaged in the last 48 hours, due to incessant rainfall in the region. Roads have washed away, bridges have been damaged. Kedarnath Yatra has been stopped for the next 2 days. Water level in Ganga River is… https://t.co/0plFr17Pny pic.twitter.com/61aVP9SD84 — ANI UP/Uttarakhand (@ANINewsUP) August 14, 2023 ఎడతెరిపి లేని వర్షాలతో ట్రాఫిక్ జామ్ కొండచరియలు విరిగిపడి, జాతీయ రహదారులతోపాటు వివిధ రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయింది. తెహ్రీలోని కుంజపురి బగర్ధర్ సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో రిషికేశ్-ఛంబా నేషనల్ హైవేను అధికారులు మూసివేశారు. హరిద్వార్‌లో గంగానది 294.90 మీటర్ల వద్ద ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. చమోలీ జిల్లాలోని త్రాలి, నందానగర్ ఘాట్ ప్రాంతాలు భారీ వర్షాల కారణంగా ప్రభావితం అయ్యాయి. పిండర్, నందాకిని నదుల్లో నీటి మట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. ఓ మోటార్‌బ్రిడ్జ్, సస్పెన్షన్ బ్రిడ్జ్‌లు కొట్టుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. -
ఉత్తరాఖండ్ ను వణికిస్తున్న వరుణుడు
-
హిమాచల్ ప్రదేశ్‌లో జల ప్రళయం.. 29 మంది మృతి..
సిమ్లా: ఎడతెరిపిలేని వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ వణికిపోతోంది. గతకొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు కూడా విరిగిపడుతున్నాయి. తాజాగా సోలాన్ జిల్లాలోని మామిసిఘ్ గ్రామంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. గత 24 గంటల్లో వివిధ ఘటనల్లో వర్షాల కారణంగా 29 మంది మరణించారని అధికారులు తెలిపారు. ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడి గ్రామంపైకి దూసుకొచ్చాయి. ఈ ఘటనలో రెండు ఇళ్లు, పశువుల పాకలు కూలిపోయాయి. ఏడుగురు మృతి చెందారు, మరో ఆరుగుర్ని రక్షించామని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖూ సంతాపం తెలిపారు. ఘటనస్థలంలో సహాయక చర్యలు చెపట్టాలని అధికారులను ఆదేశించారు. 16 Killed, Many Feared Trapped As Monsoon Fury Returns To Himachal Read here: https://t.co/5bjrcB342e pic.twitter.com/k3QM3rfryM — NDTV (@ndtv) August 14, 2023 తీవ్రంగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఆగష్టు 14న నిర్వహించనున్న పీజీ, బీఈడీ పరీక్షలను రద్దు చేశారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే వర్షాలతో రాష్ట్రంలో 257 మంది మృతి చెందారు. రూ.7,020 కోట్ల నష్టం జరిగిందని వెల్లడించారు. కాగా.. 32 మంది తప్పిపోయారు. 290 మంది గాయపడ్డారు. శివ మందిర్ కూలి.. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో సిమ్లాలో శివ మందిర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. శ్రావణమాసం సందర్భంగా ప్రార్థనల కోసం భక్తులు గుమికూడారని సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖూ తెలిపారు. ఈ క్రమంలో మందిరం కూలిపోగా.. భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేస్తోంది. శిథిలాలను తొలగిస్తున్నారు. Rescue Operations Underway As Temple Collapses Due To Landslide In Shimla pic.twitter.com/WJYBNXVchQ — NDTV (@ndtv) August 14, 2023 ఉత్తరాఖండ్‌లోనూ.. ఉత్తరాఖండ్‌లోనూ వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. దీంతో పలు నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. బాదల్ నది ప్రవాహాంలో డెహ్రాడూన్‌లోని మాల్దేవత ప్రాంతంలో ఉన్న డిఫెన్స్ కాలేజ్ కూలిపోయింది. ఈ దృశ్యాలు భీతికొల్పుతున్నాయి. కాగా.. రాష్ట్రంలో ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాలతో ఇప్పటివరకు 60 మంది మరణించారు. 17 మంది తప్పిపోయారు. #WATCH | A college building collapsed due to incessant rainfall in Dehradun, Uttarakhand. (Source: Dehradun Police) https://t.co/i4dpSQs2MH pic.twitter.com/1XhTLTafCi — ANI UP/Uttarakhand (@ANINewsUP) August 14, 2023 వర్షాలతో తెహ్రీ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. రిషికేష్- చంభా జాతీయ రహదారిలో రాకపోకలు నిలిపివేశారు. రిషికేష్- దేవప్రయాగ జాతీయ రహదారిలో వాహనాలు ఎక్కడిక్కడే నిలిపివేశారు. 1,169 ఇళ్లు నేలమట్టమయ్యాయి. పంటపొలాలు ధ్వంసమయ్యాయి. ఇదీ చదవండి: Dwarka Expressway: ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే వ్యయంపై కాగ్ సంచలన వ్యాఖ్యలు -
దారుణం: కుంగిన రహదారి.. లోయలో బస్సు బోల్తా.. ఏడుగురి మృతి..
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో దారుణం జరిగింది. బస్సు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. సిమ్లాకు వెళ్లే దారిలో మండి జిల్లాలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. రహదారి దెబ్బతిన్న కారణంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో జాతీయ రహదారి 5పై ఉన్న సిమ్లా-కల్కా రోడ్డును గత కొద్దిరోజులుగా మూసి ఉంచారు. గురువారమే ఆ దారిలో తేలిపాటి వాహనాలకు అనుమతులు ఇచ్చారు. ఆ రహదారిలో బస్సు రావడంతో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. దీంతో ప్రమాదం జరిగింది. ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వర్షాలతో రాష్ట్రంలో దాదాపు 200 రోడ్డు మార్గాలను మూసివేశారు. సుమారు 200 మార్గాల్లో ఎలక్ట్రిసిటీని కూడా నిలిపివేశారు. ప్రస్తుతం కొన్ని మార్గాల్లో తేలికపాటి వాహనాలను అనుమతించారు. దీంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదీ చదవండి: నూహ్ అల్లర్లు: ప్రముఖ టీవీ ఛానల్ ఎడిటర్ అరెస్టు.. -
భద్రతను విస్మరించే అభివృద్ధా?
హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. చార్ ధామ్ హైవేతో సహా వందలాది రోడ్లపై వాహనాలను కొండచరియలు నిరోధించాయి. అనేక పెద్ద జలవిద్యుత్ డ్యామ్‌లు వరదల ముప్పు కారణంగా ప్రణాళిక లేకుండా నీటిని విడుదల చేశాయి. పర్వత ప్రాంతాల్లో ప్రాజెక్ట్‌లను ఎలా మెరుగ్గా నిర్వహించాలి, తీసుకునే నిర్ణయాల్లో ప్రజలను ఎలా భాగస్వాములను చెయ్యాలి అనే విషయాలపై ఇవి కీలకమైన పాఠాలను అందిస్తున్నాయి. పర్యావరణం, జీవితం, ఆస్తి వంటి విషయాల్లో మెరుగైన భద్రత కావాలంటే, సమర్థమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. హిమాలయ అడవులను నాశనం చేస్తూనే విపత్తులను నివారించగలమా? ఇలాంటి ప్రశ్నలకు జవాబులు కూడా వెతకాల్సి ఉంటుంది. పర్వత ప్రాంత రాష్ట్రాలైన హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఒకదాని తర్వాత మరొకటి జూలై నెలలో వరదలతో అతలాకుతలమయ్యాయి. ఈ వరదలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన ప్రాథమిక సమస్యలను ఎత్తి చూపుతున్నాయి. ఈ వరదల్లో అత్యధికంగా దెబ్బ తిన్న రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్. జూలై మొదటి 11 రోజులలో కులు, బిలాస్పూర్, మండి, సిమ్లా, సోలన్లలో 77 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతంతో పోలిస్తే, సగటున రోజూ 250 మి.మీ. నమోదైంది. ఉత్తరాఖండ్‌లో జూలై మొదటి 10 రోజులలో సాధారణం నుండిసంచిత వర్షపాతం హిమాచల్ కంటే కొంచెం ఎక్కువగా ఉంది. కుండపోత వర్షం భారీ నష్టాన్ని మిగిల్చింది. జూలై 14 వరకు హిమాచల్‌ప్రదేశ్‌లో 108 మరణాలు నమోదు కాగా, జూలై 15 వరకు 26 మంది చనిపోయినట్లు ఉత్తరాఖండ్ నివేదించింది. ఉత్తరాఖండ్‌లో ప్రతిష్ఠాత్మకమైన, అన్ని వాతావరణాల్లో పనిచేసే చార్ ధామ్ హైవేతో సహా వందలాది రోడ్లపై వాహనాలను దాదాపు ప్రతిరోజూ కొండ చరియలు నిరోధించాయి. దీనివల్ల నివాసితులకు, పర్యాటకులకు కష్టాలు, ఆర్థిక నష్టాలు ఎదురయ్యాయి. గిర్థీ నదిపై వంతెన కూలి పోవడంతో చమోలి జిల్లాలో ఇండో–టిబెట్ సరిహద్దు వరకు రక్షణ బలగాల రాకపోకలు దెబ్బతిన్నాయి. విద్యుత్, నీటి సరఫరాలకు అంతరాయం ఏర్పడి రెండు రాష్ట్రాల్లోనూ పాఠశాలలు చాలా రోజులు మూతపడ్డాయి. వంతెనలు మునిగిపోయాయి లేదా కూలిపోయాయి. కొండచరియలు విరిగిపడటమే కాకుండా హిమపాతం పట్టణాలను ముంచెత్తింది. హైవేలు విచ్ఛిన్నమైపోయాయి. అనేక భవనాలు, వాహ నాలు కొట్టుకుపోయాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌లో వినాశనం మరింత స్పష్టంగా కనిపించింది. ఈ విపత్తు సమయంలో, బియాస్ అత్యంత విధ్వంసకరంగా మారింది. సహజ కారణాల వల్ల మాత్రమే కాదు... బియాస్ నది పరివాహక ప్రదేశంలోని అనేక పెద్ద జలవిద్యుత్ డ్యామ్‌లు, తమ ప్రాంతాలలో వరదల ముప్పు కారణంగా అకస్మాత్తుగా ప్రణాళిక లేకుండా నీటిని విడుదల చేశాయి. ఇప్పటికే పొంగి పరవళ్లు తొక్కు తున్న నదిలోకి ఈ అదనపు ఉప్పెనలు వెల్లువెత్తి దిగువ ప్రాంతాల్లో నష్టాలను అధికం చేశాయి. ఉత్తరాఖండ్‌లోనూ ఇలాంటి సమస్యలే కనిపించాయి. జూలై 11న, ఉత్తరాఖండ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ తాను నిర్వహిస్తున్న 19 ప్లాంట్లలో పదిహేడింటిని మూసివేసింది. నదీ పర్యావరణ వేత్తలు, యాక్టివిస్టులు పదేపదే చెబుతూ వచ్చిన ట్లుగా... జలశక్తి లేదా పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు లకు సంబంధించిన కేంద్ర మంత్రిత్వ శాఖలు, శాస్త్రీయంగా పర్యావ రణ ప్రవాహాలను ఏర్పాటు చేసి, డ్యామ్ ఆపరేటర్లు వాటిని అనుసరించేలా చూసినట్లయితే, ఆనకట్ట సంబంధిత సమస్యలను గణనీయంగా తగ్గించవచ్చు. మౌలిక సదుపాయాల సైట్ల చుట్టూ కూడా కనీవినీ ఎరుగని విధ్వంసం సంభవించింది. నిటారుగా ఉన్న లోయలతో కూడిన చిన్న పర్వత ప్రవాహాలు, పరిమితమైన వరదను భరించే సామర్థ్యాన్ని మాత్రమే కలిగి ఉంటాయి. ప్రాజెక్టుల నుండి నిర్మాణ శిథిలాలు అటువంటి ప్రవాహాలలోకి డంప్ అవుతున్నాయి. వరదను భరించే వాటి సామర్థ్యాన్ని అవి మరింతగా తగ్గిస్తున్నాయి. స్థానిక నివాసితులు రికార్డ్ చేసిన ఒక వీడియో క్లిప్‌ని చూస్తే... క్రూరంగా విరుచుకుపడే, బురదతో కూడిన వరద ప్రవాహం థునాగ్ పట్టణంలోని మార్కెట్ లేన్ లోకి దూసుకెళ్లి విధ్వంసం సృష్టించింది. మాజీ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ స్వస్థలమైన తాండి గ్రామంలోని ఒక రహదారి నిర్మాణ ప్రాజెక్ట్ శిథిలాలను, అక్రమంగా నరికివేసిన చెట్ల మొదళ్లను నదీ ప్రవాహ మార్గంలో పడేశారు. ఇటువంటి ప్రాజెక్టులను తరచుగా పేలవమైన ప్రణాళికలతో, నిర్మాణ గడువులను వేగంగా చేరుకునే లక్ష్యంతో నాసిరకంగా నిర్మిస్తారు. నాలుగు లేన్లతో ఉన్న మండి–మనాలి జాతీయ రహదారిలో 100 మీటర్లకు పైగా అతి పెద్ద నిర్మాణ ఉల్లంఘనలు జరిగినట్లు ఒక డ్రోన్ వీడియో చూపించింది. వీటి కారణంగానే మనాలిలో సుమారు 7,000 వాహనాలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల, హైవేను వాస్తవానికి నది ఒడ్డున నిర్మించారు. ఇక్కడ రహదారిని మెత్తటి నిక్షేపాలపై నిర్మించి ఉండవచ్చు. దీంతో బియాస్ ప్రాంతంలోని నేల కోత మరిన్ని ఇబ్బందులకు కారణమైంది. ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ హైవేపై 2013 లోనూ ఇలాంటి వైఫల్యాలే చోటుచేసుకున్నాయి. అయితే హైవే డెవల పర్లు, ఇంజినీర్లు ఆనాడు జరిగిన పెను విపత్తు నుండి ఏ పాఠాలూ నేర్చుకోలేదు. ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ హైవేకి చెందిన ఒక భాగం కూలిపోవడం కూడా, అటువంటి నిర్మాణంలో కొండచరియలు విరిగి పడే అవకాశం ఉందని రుజువు చేసింది. నదీ తీరాలకు కనీసం 100 మీటర్ల దూరంలో భవనాలు ఉండాలనే హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు నిబంధనను కూడా ఉల్లంఘించడంతో మనాలిలోని మూడంతస్తుల హోటల్ బియాస్ నదిలోకి కూలి పోయింది. నిజానికి, మనాలి నది ఒడ్డున హోటళ్లు, గృహ సముదా యాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి. హరిద్వార్, రిషికేశ్, ఇతర ఉత్తరాఖండ్ నదీతీర పట్టణాలలోనూ ఇదే విధమైన ఉల్లంఘ నలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పెరుగుతున్న వాతావరణ కార్బన్ డై ఆక్సైడ్ స్థాయులు, భూతాపం, అధిక సముద్ర ఉష్ణోగ్రతలు ఎక్కువ తేమతో కూడిన మేఘాలను ఉత్పత్తి చేస్తాయి. అయితే స్థానిక పరిస్థితులు అత్యధిక వర్షపాత సంఘటనలను నిర్ణయిస్తాయి. భారతదేశంలో, ప్రపంచ వ్యాప్తంగా కూడా వర్షపాత తీవ్రత, తరచుదనం పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇవి అధిక జనాభా ఉన్న లేదా ఆర్థికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో సంభవించినప్పుడు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగా ఉంటుంది. పర్యావరణం, జీవితం, ఆస్తి వంటి విషయాల్లో మెరుగైన భద్రత కావాలంటే, సమర్థవంతమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. నిర్మాణ సమయంలోనూ ఆ తర్వాత కూడా నిజా యితీగా, క్రమబద్ధమైన పర్యవేక్షణను చేపట్టాలి. ఇవన్నీ సాధ్యపడా లంటే మంచి పాలన అవసరం ఉంటుంది. అధిక వర్షపాతాన్ని, వరద తీవ్రతలను తట్టుకునే నిర్మాణ భద్రతాంశాలు మెరుగ్గా ఉండి, మంచి ఇంజినీరింగ్ పద్ధతులకు కట్టుబడి ఉంటే మరణాల సంఖ్య, విధ్వంసం తగ్గుతాయి. ప్రేరేపిత విపత్తులు సంభవించినప్పుడు ప్రజల జీవితాలు ప్రమాదంలో పడతాయి కాబట్టి, మౌలిక ప్రాజెక్టుల ప్రణాళిక,మంజూరు, పర్యవేక్షణలో ప్రజలు సమర్థమైన స్వరాన్ని కలిగి ఉండాలి. నిజాయితీగా సిద్ధం చేసిన పర్యావరణ ప్రభావ అంచనాలు, పబ్లిక్ హియరింగ్‌లు వంటివి ప్రకృతి, జీవితాలు, ఆస్తికి చెందిన భద్రతలను పెంచడంలో సహాయపడతాయి. నియంత్రణ వ్యవస్థలు, పర్యావరణ ప్రభావిత అంచనాలకు సంబంధించిన ఫ్రేమ్‌వర్క్ క్రమానుగతంగా బలహీనపడటం అనేది ప్రజలకు, ప్రకృతికి వ్యతిరేక మైనది. సమర్థవంతమైన ఆర్థిక వృద్ధి పేరుతో పాలనా యంత్రాంగం ఎన్ని వాదనలు చేసినప్పటికీ వాటన్నింటినీ ఖండించాలి. చివరగా, మరిన్ని పెద్ద ప్రశ్నలు వేసుకుందాం. సున్నితమైన హిమాలయ ప్రాంతానికి ఉన్న మోసే సామర్థ్యం ఎంత? స్థిరమైన ఆర్థిక వృద్ధికి పరిమితులు ఏమిటి? మనం హిమాలయ అడవులను ఇంకా నాశనం చేస్తూనే విపత్తులను నివారించగలమా? పర్యావరణ సున్నితమైన హిమాలయ నదీ లోయల గుండా తమ వాహనాలను నడపడానికి మరింత మంది పర్యాటకులను ప్రోత్సహిస్తూనే ఉందామా? ఇప్పుడు వీటన్నింటికీ సమాధానాలు వెతకాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. రవి చోప్రా వ్యాసకర్త ప్రముఖ పర్యావరణవేత్త (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
హిమాచల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా దివ్యాంగ మహిళలు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో ఇద్దరు దివ్యాంగ మహిళలు అరుదైన ఘనత సాధించారు. అంధులైన వీరిద్దరూ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమితులయ్యారు. పట్టుదల, అంకితభావంతో తమ కలలను నిజం చేసుకున్నారు. రైతు కుటుంబంలో జని్మంచిన ముస్కాన్ ప్రముఖ గాయకురాలు. హిమాచల్‌ప్రదేశ్ నుంచి ఎన్నికల సంఘం యూత్ ఐకాన్‌గా ఇప్పటికే గుర్తింపు పొందారు. దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. 2013లో రాజ్‌కియా కన్య మహావిద్యాలయలో సంగీతంలో ప్రవేశం పొందారు. ఇప్పుడు అదే విద్యాసంస్థలో సంగీతంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ముస్కాన్ చురుగ్గా ఉంటున్నారు. సాధారణమధ్య తరగతి కుటుంబంలో జని్మంచిన ప్రతిభా ఠాకూర్ సైతం అంధురాలు. పీహెచ్డీ పూర్తిచేశారు. విద్యా రంగంలో సేవలు అందించాలన్నది ఆమె చిన్నప్పటి కల. రాజీవ్ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితురాలైంది. -
గిరిసీమ విధ్వంసం రేపుతున్న ప్రశ్నలు
ఉత్తరాదిలో కురిసిన వానలకు ముఖ్యంగా పర్వత ప్రాంతాలు జలమయమైనాయి. జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం బాధాకరమే అయినప్పటికీ ఇదేదో ప్రకృతి ప్రకోపమని సర్ది చెప్పుకునేందుకు వీల్లేదు. ఇది ప్రకృతి హెచ్చరికలను పెడచెవిన పెట్టిన మనిషి దురాశ ఫలితమే. పర్వత ప్రాంతాల్లోని నదులు, వంకలు, వాగులు చిన్న వానకే అకస్మాత్తుగా ఉరకలెత్తే అవకాశాలెక్కువ. అయినా ఇళ్ల నిర్మాణాల కోసం డిజైన్ కోడ్ పాటించకపోవడం; సరైన రీతిలో తయారు చేసిన కాంక్రీట్, తగిన పిల్లర్లు వాడకపోవడం వల్లనే ప్రస్తుత విధ్వంసం జరిగింది. పర్వతాల్లో నిర్మాణాలు చేపడుతున్నప్పుడు ప్రకృతిని గౌరవించడం అలవర్చుకోవాలి. అవసరమైనంత మాత్రమే కట్టుకోవడం, మిగిలినది ప్రకృతి ఛాయలోనే ఉంచడం మేలు. వారం అంటే వారం చాలు... ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా సాగాల్సిన హాలిడే సీజన్ కాస్తా పర్యావరణ విధ్వంసంగా మారిపోయేందుకు! అప్పుడే వేసిన రోడ్లు కొట్టుకుపోవడం, వంతెనలు నదుల్లోకి చేరి ప్రవహించడం, కొండచరియలు విరిగిపడటం, పెద్ద పెద్ద భవంతులు పునాదులు కదిలిపోయి నీళ్లలోకి చేరిపోవడం చూశాం. బహుశా ఇవేవీ కొత్త దృశ్యాలు కాకపోవచ్చు కానీ, ఇరవై ఏళ్ల క్రితంతో పోలిస్తే ఈమధ్య తరచూ చూడాల్సి వస్తోంది. వార్తాపత్రికల్లోని వార్తలు, సోషల్ మీడియా పోస్టులు హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రకృతి వైపరీత్యాన్ని కళ్లకు కడుతున్నాయి. అనూహ్యమైన వర్షాలు, ఆకస్మిక వరదలు పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం కలిగించాయి. యాత్రీకులు దిక్కుతోచని విధంగా చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కూడా మరీ కష్టసాధ్యంగా మారాయి. ఒక ఆర్కిటెక్ట్‌గా ఈ గిరిసీమలో నేను చాలా కాలంగా పనిచేస్తున్నాను. చిన్నప్పుడు భూటాన్‌లో పెరిగినప్పటి నుంచి పర్వతాలతో నాకు అనుబంధం ఉంది. అయితే పర్వత ప్రాంతాల్లోని భవనాల గురించి మొదట తెలిసింది విఖ్యాత అధ్యాపకులు ఎంఆర్ అగ్నిహోత్రి వద్ద రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేసినప్పుడే. పర్వతారోహకుడు, ఆర్కిటెక్ట్, విద్యావేత్త కూడా అయిన ప్రొఫెసర్ అగ్నిహోత్రి లాంటి వ్యక్తి ఇంకొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఉత్తరకాశీ ప్రాంతంలో నేనూ, ఆయనా కలిసి ఎన్నో చోట్ల పర్యటించాం. 1992 నాటి భయంకరమైన భూకంపం తరువాత పదేళ్లపాటు పునరావాస కార్యక్రమాలను పరిశీలించాం. సమీక్షించాం. ప్రాజెక్టులో నాలుగు నెలలు పనిచేస్తే, సగం క్షేత్రస్థాయిలో మిగిలిన సగం ఆఫీసులో ఉంటూ ‘వరల్డ్ కాంగ్రెస్ ఆన్ డిజాస్టర్ మిటిగేషన్ ’ కోసం నివేదిక సిద్ధం చేస్తూ గడిపాము. అదో అద్భుతమైన అనుభవం. ఇప్పటికీ నాకు ఎంతో అపురూపమైంది. అనుభవంలో తలపండిన వ్యక్తి ద్వారా పర్వత ప్రాంతాలు ఒక అకెడమిక్ కోణంలో పరిచయం కావడం నా అదృష్టం. ఆ ప్రాజెక్టులోనే నాకు ఓ అద్భుతమైన విషయం తెలిసింది. భాగీరథి నదీ తీరం వెంబడి ఉన్న మానేరి గ్రామంలో ఓ చిన్న జలవిద్యుత్ కేంద్రం ఉంది. డ్యామ్‌కు రహదారికి మధ్య నదీ తీరంలో ఉంటుంది ఈ గ్రామం. ఆర్సీసీ ‘పిల్లర్లు’, ‘లింటార్’ నిర్మాణాలతో అన్నీ ‘పక్కా’ ఇళ్లే ఉండేవి అక్కడ. ప్రాజెక్టు నిర్మాణానికి వాడిన ఉక్కు, కాంక్రీట్‌తోనే వీటినీ కట్టారేమో అనుకునే వాడిని. 1992 భూకంపంలో ఈ గ్రామం మొత్తం ధ్వంసమైపోయిందని తెలిసినప్పుడు నాకు ఆశ్చర్యంగా అనిపించలేదు. ఆ గ్రామంలో ఉన్న వారందరూ ఆ భూకంపంలో మరణించినట్లు తెలిసింది. భూకంపం కదా, ప్రాణనష్టం ఉంటుందని అనుకోవచ్చు. ఆర్సీసీ స్తంభాలు వాడారని చెప్పుకున్నాం కదా... దాన్ని చాలా సున్నితంగా పరిస్థితులకు తగ్గట్టుగా వాడాల్సి ఉంటుంది. ఇంజినీరింగ్ విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, పట్టించుకోకపోయినా పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నది అదే. సరైన రీతిలో తయారు చేయని ఆర్సీసీ, డిజైన్ కోడ్ పాటించకపోవడం వల్లనే ప్రస్తుత విధ్వంసం జరిగింది. స్థానిక కాంట్రాక్టర్ మాటల ప్రకారం, అక్కడ ఇళ్ల నిర్మాణానికి ‘3 అడుగులు బై 3 అడుగుల’ కాలమ్స్‌ను ఉపయోగిస్తునారు. భవనం ఎత్తు ఎంత ఉన్నా ఇంతే సైజు స్తంభాలను వాడుతున్నారు. కొందరైతే వీటి మీదే నాలుగైదు అంతస్తుల భవనాలు కట్టారు. ఆ ప్రాంతం బిల్డింగ్ కోడ్ ప్రకారం రెండు అంతస్తుల కంటే ఎత్తయిన భవనాలు కట్టరాదు. ఎక్కువ అంతస్తులుండటం లాభాలు తెస్తుంది కానీ, ప్రమాదం కూడా చెప్పకుండా వచ్చేస్తుంది. అల్మోరా(ఉత్తరాఖండ్)లో చాలా ఏళ్ల క్రితం నేను ఓ భవనం కట్టించా. ఆ సందర్భంలో కాంట్రాక్టర్ ఆందోళనతో ఫోకస్ చేశాడు. భవన నిర్మాణానికి సంబంధించిన డ్రాయింగ్స్ సరిగానే ఉన్నాయా? అని అడిగాడు. ఎందుకంటే ఆ చిత్రాల్లో స్తంభాల అడుగు భాగాలు (ఫుటింగ్స్) భారీ సైజుల్లో ఉన్నాయి. ఆ సైజులో ఫుటింగ్స్ ఏర్పాటు చేయడం వల్ల ఖర్చులు ఎక్కువవుతాయన్నది ఆయన ఆందోళన. ఎలాగైనా వీటి సైజులు తగ్గించాలని అభ్యర్థించాడు. అంత మొత్తంలో ఉక్కు కూడా ఎవరూ వాడరని వాదించాడు. అయితే నేను వాటిని తగ్గించలేదు. ఎందుకంటే భూకంపం రాగల ప్రమాదమున్న జోన్లలో అత్యంత ప్రమాదకరమైన ఐదవ జోన్ లో అంత మొత్తం కాంక్రీట్ వాడాల్సిందే. భవనం కట్టిస్తున్న వారితో మాట్లాడి... ఈ విషయాలన్నీ వారికి వివరించి కాంట్రాక్టర్‌కు కొంచెం ఎక్కువ చెల్లించేలా ఒప్పించి మరీ భవన నిర్మాణాన్ని కొనసాగించాము. పర్వతాలిప్పుడు భవనాలతో నిండిపోయి కనిపిస్తున్నాయి. స్థానిక మేస్త్రీలే కాంట్రాక్టర్ల అవతారమెత్తి కట్టేస్తున్నారు. స్థానికులు కూడా చౌకగా అందుబాటులో ఉన్నారని వీరికే పనులప్పగిస్తున్నారు కూడా. ఆధునిక సమాజంలో ఇంజినీరింగ్ సాంకేతిక పరిజ్ఞానాలతో అద్భుతాలు సృష్టించవచ్చునని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ టెక్నాలజీలు, ఆధునిక హంగులకు కొంత ఖర్చూ అవుతుంది. కొన్నిసార్లు ఈ ఖర్చు చాలా ఎక్కువ. సైజు, స్థాయి పెరిగే కొద్దీ ఖర్చు ఇబ్బడిముబ్బడి అవుతూంటుంది. అయితే టెక్నాలజీ వాడకంలో నష్టాలూ లేకపోలేదు. తగిన విధంగా ఉపయోగించకుంటే, నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం అమలు చేయకుంటే దారుణ వైఫల్యాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. టీవీల్లో చూపినట్లు భవనాలు, వంతెనలు కుప్పకూలిపోవడం, ప్రవహిస్తూండటం టెక్నాలజీని సక్రమంగా వాడని ఫలితమే. మానేరి గ్రామం వద్ద గడిపిన సమయంలో నేను కొన్ని సాధారణ పాఠాలు నేర్చుకోగలిగాను. ఇందులో అతి ముఖ్యమైంది... నీటి ప్రవాహానికి సమీపంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మాణాలు చేపట్టకూడదన్నది! పర్వత ప్రాంతాల్లోని నదులు, వంకలు, వాగులు ఒక్క చిన్న వానకే అకస్మాత్తుగా ఉరకలెత్తే అవకాశాలెక్కువ అన్నది గుర్తించాలి. రెండో పాఠం... పర్వత సానువులను కోయవద్దు. దీనివల్ల పైభాగంలోని చెరియలు విరిగిపడిపోయే అవకాశాలెక్కువ. దురదృష్టవశాత్తూ హైవేల నిర్మాణంలో, వెడల్పు పెంచే సందర్భంలో సానువుల కోత తరచూ జరుగుతోంది. మూడో అంశం... స్థానిక భవన నిర్మాణ శైలిని గౌరవించాలి. వీలైనంత వరకూ భవన నిర్మాణ వ్యవస్థలు స్థానికమైనవిగా ఉండేలా చూసుకోవాలి. నిర్మాణం విషయంలో స్థానికులకు ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. చివరగా... పర్వతాల్లో నిర్మాణాలు చేపడుతూంటే ప్రకృతిని గౌరవించడం అలవర్చుకోవాలి. అవసరమైనంత మాత్రమే కట్టుకోవడం... మిగిలినది ప్రకృతి ఛాయలోనే ఉంచడం మేలు. ప్రకృతి నుంచి మనకు కావాల్సింది తీసుకోవడానికి మాత్రమే పరిమితం కాకూడదు; వీలైనంత వరకూ మొక్కలు, చెట్లు, అడవులు పెంచాలి. పర్వత ప్రాంతాలను దక్షిణ ఢిల్లీ, శిమ్లా నగరాల్లా మార్చవద్దు. నిజానికి ఇవేవీ కొత్త విషయాలు కావు. కానీ వీటిని పట్టించుకోకపోవడం మన అజ్ఞానం, అంతే. ప్రస్తుతం శూన్య కర్బన ఉద్గారాలు, సుస్థిరాభివృద్ధి, ప్లాటినమ్ రేటింగ్ అంటూ చాలా కొత్త మాటలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ సరే కానీ, భవనాలపై కూడా దృష్టి పెట్టాల్సిన తరుణం వచ్చేసింది. పర్వతాల్లో, నదుల్లో, అడవుల్లో వాతావరణ మార్పుల మధ్యన ఉండేవి ఇవే. తరచూ వరదల బారిన పడుతున్నవి కూడా ఇవే. ఈ అంశాలపై కనీసం కొన్ని ఆర్కిటెక్చరల్ పాఠశాలల్లోనైనా చర్చ మొదలు కావాలి. వ్యాసకర్త ఆర్కిటెక్ట్ (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
భారీ వర్షాలు.. మండపానికి వెళ్లలేని పరిస్థితి.. ఆ ఐడియాతో వాళ్ల పెళ్లి జరిగిపోయింది!
పెళ్లి అంటే జీవితంలో ముఖ్యమైన రోజు. మరిచిపోలేని రోజు కూడా. అందుకే బంధువులు, స్నేహితులు, అతిథుల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకుంటారు. కొందరు విమానంలో, పడవలో, చివరకు నీటి అడుగున ఇలా ఎవరికి నచ్చినట్లుగా వాళ్లు తమ వివాహాలను ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు.. కొందరి వివాహాలు మాత్రం తాము అనుకున్నట్లు కాకుండా పరిస్థితులు బట్టి మరోలా జరుగుతున్నాయి. తాజాగా ఓ జంట పెళ్లి మండపంలో కాకుండా ఆన్లైన్లో చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే.. ప్రస్తుతం ఉత్తర భారతంలో భారీ వర్షాలు కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడికక్కడ రోడ్లు స్తంభించిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ కారణంగా హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ జంట మండపానికి వెళ్లడం కుదరలేదు. వేదమంత్రాలు, పెద్దల ఆశీస్సులతో పెళ్లి పీటలు ఎక్కాలని భావించిన ఓ జంటకు అనూహ్యంగా ప్రకృతి అడ్డుతగిలింది. ఒకవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఒక్కటి కావడానికి ఇవేవీ అడ్డంకి కాబోవని ఆ దంపతులు భావించారు. అందుకు ఓ ఉపాయాన్ని ఆలోచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వారి వివాహం జరుగుతోందని అందరికీ తెలియజేసి, పెళ్లికి సంబంధించిన ఆన్లైన్ లింక్‌ను అందరికీ పంపారు. అనంతరం వారి పెళ్లిని ఆన్లైన్లో నిర్వహించారు. ఈ ఆన్లైన్ వెడ్డింగ్‌లో ఇద్దరి కుటుంబ సభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్యే రాకేష్ సింగ్ కూడా పాల్గొన్నారు. అనుకున్న సమయానికి పెళ్లి చేసుకుని ఎట్టిపరిస్థితుల్లోనూ వెనకడుగు వేయని ఆ నవ దంపతులకు సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. పెద్దలు నిర్ణయించిన సరైన సమయానికి ఆన్లైన్లో పెళ్లి చేసుకుని తమ జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. చదవండి: లైకులు, కామెంట్ల కోసం చావు వార్తని సోషల్ మీడియాలో.. -
మంత్రి హరీష్ చొరవ.. హిమాచల్‌లో హైదరాబాద్ వైద్యులు క్షేమం
సాక్షి, సుల్తాన్‌బజార్: హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి వరదల్లో చిక్కుకున్న ముగ్గురు హైదరాబాద్ వైద్యులు క్షేమంగా ఉన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వైద్యుల క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు. వారిని అక్కడినుంచి సురక్షితంగా హైదరాబాద్‌కు చేర్చాలని అధికారులను ఆదేశించారు. ఉస్మానియా మెడికల్ కళాశాలకు చెందిన ముగ్గురు వైద్యులు హిమాచల్ ప్రదేశ్ మనాలి వరదల్లో చిక్కుకున్నారనే వార్త రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ బానోతు కమల్‌లాల్, డాక్టర్ రోహిత్ సూరి, డాక్టర్ శ్రీనివాస్‌లు కోఠిలోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో పీజీ పూర్తి చేశారు. హాస్టల్లో ఉంటూ ఉస్మానియా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. పీజీ పూర్తయిన సందర్భంగా వీరు హిమాచల్‌ప్రదేశ్‌కు టూర్‌కు వెళ్లారు. ఇటీవల ఆ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వరదలు ముంచెత్తాయి. ముగ్గురు వైద్యులు మనాలి వరదల్లో చిక్కుకున్నారని తోటి వైద్యులకు సమాచారం అందింది. వారిని మళ్లీ సంప్రదించేందుకు ప్రయత్నించగా ముగ్గురి ఫోన్లూ స్విచ్ఛాఫ్ వచ్చాయి. రంగంలోకి మంత్రి హరీష్ రావు.. దీంతో వైద్యుల తల్లిదండ్రులు, తోటి వైద్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వైద్యుల ఆచూకీ కోసం జూనియర్ డాక్టర్ల సంఘం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు సమాచారం అందించింది. వెంటనే స్పందించిన హరీశ్‌రావు వారు ఎక్కడ? ఎలా? ఉన్నారో తక్షణమే తెలుసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మనాలిలోని ప్రభుత్వ అధికారులను సంప్రదించిన తెలంగాణ అధికారులు.. వైద్యులు క్షేమంగా ఉన్నట్లు మంత్రికి ఫోన్లో సమాచారాన్ని అందించారు. వైద్యులను సురక్షితంగా హైదరాబాద్‌కు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఇది కూడా చదవండి: ‘నాకు సీఎం కావాలనే ఆశ లేదు’.. బీఆర్ఎస్ మంత్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్