మైనస్‌ 25 డిగ్రీల టెంపరేచర్‌లో... మాంగల్య తంతునానేనా! | Gujarat Couple Gets Married At Minus 25 Degrees In Himachal Pradesh Spiti Valley, Photo Goes Viral - Sakshi
Sakshi News home page

మైనస్‌ 25 డిగ్రీల టెంపరేచర్‌లో... మాంగల్య తంతునానేనా!

Mar 3 2024 6:21 AM | Updated on Mar 3 2024 1:23 PM

Gujarat couple gets married at minus 25 degrees in Himachal Pradesh Spiti Valley - Sakshi

వైరల్‌

సాధారణంగా ఎవరైనా పెళ్లిమండపం ఎంపిక చేసుకోవడానికి సౌకర్యాలు, అనుకూలతలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అయితే అన్ని పెళ్లిళ్లూ ఒకేలా ఉండవు అని చెప్పడానికి ఈ పెళ్లి ఒక ఉదాహరణ. హిమాచల్‌ప్రదేశ్‌లోని స్పితి వ్యాలీలో మైనస్‌ 25 డిగ్రీల ఉష్ణోగ్రతలో గుజరాతీ జంట పెళ్లి చేసుకుంది. ‘ఏ మ్యారేజ్‌ లైక్‌ దిస్‌ టూ! ఏ లవింగ్‌ కపుల్‌ ఫ్రమ్‌ గుజరాత్‌’ కాప్షన్‌తో పోస్ట్‌ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది.
 
పెళ్లికి వచ్చిన అతిథుల సందడి కూడా వీడియోలో కనిపిస్తుంది. వరుని పక్కన కూర్చోబెట్టుకొని పూలతో అలంకరించిన ఎరుపు రంగు కారును వధువు నడపడంతో వీడియో ముగుస్తుంది. అయితే ఈ వీడియోను చూసి ప్రశంసించిన వాళ్ల కంటే ‘ఓవర్‌ యాక్టింగ్‌’ అని వెక్కిరించిన వాళ్లే ఎక్కువ. ‘మీ పెళ్లి సంబరం సరే, అక్కడ ఎంత చెత్త పేరుకు పోయి ఉంటుందో’ అని ఒక యూజర్‌ స్పందించాడు.

Advertisement
 
Advertisement
Advertisement