మొజాంబిక్‌లో పుట్టి.. భారత్‌కు వచ్చి.. | Dolly Vadalia Mozambique Born Woman Gets Indian Passport After Legal Battle | Sakshi
Sakshi News home page

మొజాంబిక్‌లో పుట్టి.. భారత్‌కు వచ్చి..

Nov 17 2026 7:32 AM | Updated on Nov 17 2026 7:32 AM

Dolly Vadalia Mozambique Born Woman Gets Indian Passport After Legal Battle

అహ్మదాబాద్‌: ఆమె పుట్టిందేమో మొజాంబిక్‌ దేశంలో. పసిబిడ్డగా ఉండగానే తల్లిదండ్రులు ఆ దేశం వదిలిపెట్టారు. భారత్‌కు వచ్చి చేరారు. పసిబిడ్డకు ఏ రకమైన గుర్తింపూ లేకపోయినా గుజరాత్‌లో ఆమె జీవితమైతే సాగిపోయింది. పెరిగి పెద్దయ్యింది. కెనెడాలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని మనువాడింది కూడా. చివరికి.. మూడు విఫల ప్రయత్నాలు, న్యాయపోరాటాల తరువాత ఆమె చిరకాల వాంఛ అయిన ‘భారతదేశ పాస్‌పోర్టు’కడా దక్కింది. 

ఇదీ డాలీ వడాలియా స్టోరీ. ఈ అమ్మాయి 2000 సంవత్సరం ఫిబ్రవరి 18న మొజాంబిక్‌లోని షాయ్‌–షాయ్‌లో పుట్టింది. పుట్టిన ఇరవై రోజుల్లోనే తల్లిదండ్రులు ఆ దేశాన్ని కుదిపేసిన వరదల కారణంగా భారత్‌లోని స్వగ్రామం రాజ్‌కోట్‌కు తిరిగి వచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో డాలీని కొన్ని పత్రాలతో తీసుకురాగలిగారు కానీ.. పాస్‌పోర్టు కోసం ఆమె 2023, 2025లలో చేసిన దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. భారత పౌరసత్వాన్ని నిరూపించే పత్రాలు, ముఖ్యంగా అత్యవసర ధ్రువపత్రం రద్దు లేదా భారత కాన్సులేట్‌లో జనన నమోదుకు సంబంధించిన ఆధారాలు లేకపోవడం దీనికి కారణం.  

లోక్‌సభ సభ్యుడు రమేష్‌ ధడూక్, పరశోత్తం రూపాలా జోక్యం చేసుకోవడంతో పరిస్థితి మారింది. వారు ఈ అంశాన్ని రాజ్‌కోట్‌ కలెక్టర్‌ కార్యాలయంతో మొదలుపెట్టి రాష్ట్ర సచివాలయం ద్వారా కేంద్ర హోం మంత్రిత్వశాఖ విదేశాంగ మంత్రిత్వశాఖలకు చేర్చగలిగారు. డాలీ మొజాంబిక్‌ నుంచి తిరిగి వచ్చిన తరువాత ఏడాదిలోపు కాన్సులేట్‌లో నమోదు చేసుకోలేదని, కాబట్టి ఆమెకు భారతీయ పౌరసత్వం ఇవ్వలేమని హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మొజాంబిక్‌ ప్రభుత్వం నుంచి కూడా సరైన స్పందన లేకపోవడంతో డాలీకి పాస్‌పోర్టు దక్కడం కలగా మిగిలిపోయింది. 

ఈ పరిస్థితుల్లో పలుమార్లు విచారణ జరిపిన తరువాత...మొజాంబిక్‌లోని భారత రాయబార కార్యాలయం, కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఒక మెమోరాండం జారీ చేశాయి. దీని ఆధారంగా మొజాంబిక్‌ రాజధాని మపుటోలోని భారత హైకమిషన్‌లో డాలీ పుట్టుకను ఈ నవంబరులో నమోదు చేశారు. ఆ జనన ధ్రువపత్రాన్ని ఉపయోగించి పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకోగా ఈ నెల 11వ తేదీ అది జారీ అయ్యింది. 2023లో డాలీ, రాజ్‌కోట్‌ వాసి కెనడాలో పనిచేస్తున్న ఖిలన్‌కుమార్‌ వడాలియాను వివాహం చేసుకుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement