ఫిలిప్పీన్స్‌లో మోదీ  | PM Narendra Modi attends ASEAN and East Asia summits in Manila | Sakshi
Sakshi News home page

ఫిలిప్పీన్స్‌లో మోదీ 

Nov 17 2026 5:35 AM | Updated on Nov 17 2026 5:35 AM

PM Narendra Modi attends ASEAN and East Asia summits in Manila

నేడు ఆసియాన్, తూర్పు ఆసియా, క్వాడ్‌ సమావేశాలు

మనీలా: రెండు కీలక శిఖరాగ్ర సమావేశాల నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఫిలిప్పీన్స్‌ చేరుకున్నారు. రాజధాని మనీలాలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఆ దేశ సమాచార, ప్రసార మంత్రి రాబర్ట్‌ జోసెఫ్‌ జే మాంటెస్‌ డి కార్లో మోదీకి స్వాగతం పలికారు. ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు ఫెర్డినాండ్‌ ఆర్‌.మార్కోస్‌ జూనియర్‌ ఆహా్వనం మేరకు అక్కడ పర్యటిస్తున్న ఆయన, మంగళవారం 23వ ఆసియాన్, 21వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొననున్నారు.

 భారత్, అమెరికా, జపాన్, ఆ్రస్టేలియాలతో కూడిన క్వాడ్‌ సమాఖ్య భేటీ లో కూడా మోదీ పా ల్గొనే అవకాశముంది. ఆ్రస్టేలియా, జపాన్‌ ప్రధానులు ఆంటోనీ ఆల్బనీస్, సనాయే తకైచీ ఇప్పటికే మనీలా చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనా ల్డ్‌ ట్రంప్‌ మంగళవా రం చేరుకోనున్నారు. మోదీ బస చేస్తున్న హోటల్‌ వద్ద భారత సంతతి ప్రజలు ఆయనకు హార్దిక స్వాగతం పలికారు. స్థానిక కళాకారులు సంప్రదాయ గీతాలాపన, నాట్యాలతో అలరించారు. 

ఇరు దేశాలకు చెందిన చిన్నారులు పూర్ణ కుంభ శ్లోకాలాపనతో పాటు బాలీవుడ్‌ గీతాలు, భాంగ్రా నృత్యాలతో అలరించారు. ప్రత్యేకంగా రామాయణ ప్రదర్శన కూడా జరిగింది. ‘‘మనీలాలో దిగాను. ప్రవాస భారతీయులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది’’అంటూ ఎక్స్‌లో మోదీ పోస్ట్‌ పెట్టారు. వర్తక, వాణిజ్య, సాగర రక్షణ, టెక్నాలజీ తదితర రంగాల్లో ఆసియాన్‌ దేశాలతో భారత్‌కు వందలాది ఏళ్లుగా లోతైన సంబంధాలున్నట్టు ఆయన గుర్తు చేశారు.

 ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లపై అర్థవంతమైన చర్చకు ఈ శిఖరాగ్రాలు ముఖ్యమైన వేదిక కాగలవని అన్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యాక్ట్‌ ఈస్ట్, మహాసాగర్‌ విదేశీ విధానాల దృష్ట్యా వాటితో సత్సంబంధాలు అత్యంత కీలకం. ఇండో పసిఫిక్‌ విజన్‌కు కూడా ఆ దేశాలతో బంధం కీలకమని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. 

1967లో ఏర్పాటైన ఆసియాన్‌ కూటమిలో బ్రూనై, కాంబోడియా, ఇండొనేసియా, లావోస్, మలేసియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, తైమూర్‌ లెస్టే, వియత్నాం ఉన్నా యి. భారత్‌తో పాటు అమెరికా, చైనా, జ పాన్, ఆ్రస్టేలియా తదితర దేశాలు చర్చా భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. 2026ను సముద్ర సహకారం తదితరాల నిమిత్తం భారత్‌–ఆసియాన్‌ ఏడాదిగా ఇప్పటికే ప్రకటించారు. ఇక ఆసియాన్‌ సారథ్యంలో కొనసాగుతున్న తూర్పు ఆసియా శిఖరాగ్రంలో భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, అమెరికా, రష్యా సహా 11 దేశాలున్నాయి. 

పసందైన విందు 
మోదీతో సహా శిఖరాగ్ర భేటీ నిమిత్తం విచ్చేసిన దేశాధినేతల గౌరవార్థం ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు ఫెర్డినాండ్‌ సోమవారం సాయంత్రం ఘనంగా విందు ఇచ్చారు. ప్రధాని ఈ సందర్భంగా ఫిలిప్పీన్స్‌ సంప్రదాయ వస్త్రధారణ అయిన బారోగ్‌ తాగలోగ్‌తో ఆకట్టుకున్నారు. స్థానికతను ప్రతిబింబించే పలు ప్రత్యేక వంటకాలు చవులూరించాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement