ఆసియాతో అనుబంధమే భారత్‌కు కీలకం: మోదీ | Asean ties at the heart of Indias Act East Policy PM Modi | Sakshi
Sakshi News home page

ఆసియాతో అనుబంధమే భారత్‌కు కీలకం: మోదీ

Nov 16 2026 8:57 AM | Updated on Nov 16 2026 9:03 AM

Asean ties at the heart of Indias Act East Policy PM Modi

( ఫైల్‌ ఫోటో )

న్యూఢిల్లీ: భారత్‌ విదేశాంగ విధానంలో ఆసియా దేశాలతో సంబంధాలకు అత్యంత ప్రాధాన్యత ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తన ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’లో ఆసియా దేశాల భాగస్వామ్యమే కీలకమని పేర్కొన్నారు. సోమవారం (నవంబర్ 16) మూడు రోజుల పర్యటన నిమిత్తం ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాకు బయలుదేరే ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

నవంబర్ 17న జరిగే 23వ ఆసియాన్‌-భారత్‌ శిఖరాగ్ర సమావేశం, 21వ తూర్పు ఆసియా సదస్సులో మోదీ పాల్గొంటారు. వాణిజ్యం, పెట్టుబడులు, రవాణా అనుసంధానం, సముద్ర భద్రత, సాంకేతికత వంటి రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించనున్నారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సహకారంపై తూర్పు ఆసియా సదస్సులో వివిధ దేశాధినేతలతో అభిప్రాయాలు పంచుకోనున్నట్లు మోదీ తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో పాటు ఆస్ట్రేలియా, జపాన్‌ నేతలతో కలిసి క్వాడ్‌ శిఖరాగ్ర సమావేశంలోనూ పాల్గొనే అవకాశం ఉంది. చైనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో వ్యూహాత్మక సహకారం ఈ భేటీలో ప్రధాన అంశం కానుంది.
 

భారత్‌-ఆసియాన్‌ మధ్య వార్షిక వాణిజ్యం సుమారు 122 బిలియన్‌ డాలర్లకు చేరింది. రక్షణ రంగంలోనూ పెట్రోలింగ్‌ నౌకలు, రాడార్లు, డ్రోన్లు, హెలికాప్టర్లు, వైమానిక రక్షణ వ్యవస్థల వంటి అంశాల్లో సహకారాన్ని విస్తరించాలని భారత్‌ భావిస్తోంది. క్వాడ్‌ దేశాలు ఆర్థిక భద్రత, వ్యూహాత్మక మౌలిక సదుపాయాలపై కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. 

ఇదీ చదవండి: బద్రీనాథ్‌పై మంచు దుప్పటి.. చివరి దర్శనాలకు భారీ క్యూ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement