భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌.. ఐసీసీ అధికారిక ప్రకటన | ICC Announces Dates For World Cup, T20 World Cup | Sakshi
Sakshi News home page

ICC: భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌.. ఐసీసీ అధికారిక ప్రకటన

Nov 15 2026 7:54 PM | Updated on Nov 15 2026 7:55 PM

ICC Announces Dates For World Cup, T20 World Cup

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్  భవిష్యత్ క్రికెట్ టోర్నీలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. 2027 నుంచి 2035 వరకు జరగనున్న ప్రధాన పురుషుల ఐసీసీ టోర్నీల తేదీలను, విండోలను ఐసీసీ ఖరారు చేసింది. ముఖ్యంగా 2027లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, మెన్స్ వన్డే వరల్డ్ కప్ జరగనుండగా.. అప్పటినుంచి 2035 చివరి నాటికి మొత్తం 12 ఐసీసీ మెగా టోర్నీలు నిర్వహించనున్నట్లు ఐసీసీ స్పష్టం చేసింది. 

ఇప్పటివరకు 2031 వరకు జరగాల్సిన టోర్నీల తేదీలు, వేదికలను ఆమోదించిన ఐసీసీ.. 2031 తర్వాత జరిగే టోర్నీల వేదికలను మాత్రం త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది.

కీలక టోర్నీల వేదికలు ఇవే..

2031 వన్డే ప్రపంచకప్ టోర్నీకి భారత్, బంగ్లాదేశ్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. అయితే ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ (2029, 2031 సంవత్సరాలకు సంబంధించి) యథావిధిగా ఇంగ్లండ్‌లోనే జరగనున్నాయి.

కాగా 2027 సౌతాఫ్రికా వన్డే ప్రపంచకప్ తర్వాత ప్రారంభమయ్యే ఈ విండోలో భాగంగా.. 2035 నాటికి నాలుగు టీ20 ప్రపంచకప్‌లు, రెండు ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలతో పాటు పలు ఐసీసీ ఈవెంట్లను నిర్వహించేందుకు క్యాలెండర్‌ను సిద్ధం చేసింది. క్రికెట్ అభిమానులకు రాబోయే దశాబ్ద కాలం పాటు అసలైన వినోదం అందనుంది.

2027 నుండి 2035 వరకు ఐసీసీ మెగా టోర్నీల షెడ్యూల్ ఇదే

2027: పురుషుల వన్డే ప్రపంచకప్ (సౌతాఫ్రికా)

2028 (జూన్): టీ20 ప్రపంచకప్ (ఆస్ట్రేలియా అండ్‌ న్యూజిలాండ్)

2028 (అక్టోబర్): ఛాంపియన్స్ ట్రోఫీ

2029 (జూన్): వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ (ఇంగ్లండ్)

2029 (అక్టోబర్): టీ20 ప్రపంచకప్ (భారత్ అండ్‌ శ్రీలంక)

2030 (ఫిబ్రవరి): ఛాంపియన్స్ ట్రోఫీ (పాకిస్తాన్)

2030 (జూన్): టీ20 ప్రపంచకప్ (యూకే)

2031 (జూన్): వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (ఇంగ్లండ్)

2031 (అక్టోబర్-నవంబర్): వన్డే ప్రపంచకప్ (భారత్ అండ్‌ బంగ్లాదేశ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement