ఐదో వన్డేలో న్యూజిలాండ్‌ చిత్తు.. సిరీస్‌ టీమిండియాదే | India Clinch ODI Series 3-1 After Thrilling 22-Run Victory Over New Zealand in Decider | Sakshi
Sakshi News home page

NZ vs IND: ఐదో వన్డేలో న్యూజిలాండ్‌ చిత్తు.. సిరీస్‌ టీమిండియాదే

Nov 15 2026 3:23 PM | Updated on Nov 15 2026 3:45 PM

India Clinch ODI Series 3-1 After Thrilling 22-Run Victory Over New Zealand in Decider

మౌంట్ మాంగనుయ్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన సిరీస్ డిసైడ‌ర్ ఐదో వ‌న్డేలో 22 ప‌రుగుల తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో ఐదు వ‌న్డేల సిరీస్‌ను 3-1 తేడాతో టీమిండియా కైవ‌సం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భార‌త బౌల‌ర్లు అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. 

210 పరుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని డిఫెండ్ చేసుకునే క్ర‌మంలో మ‌న బౌల‌ర్లు నిప్పులు చెరిగారు. అర్ష్‌దీప్‌ సింగ్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ సిరాజ్, అక్షర్‌ పటేల్‌ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు అకిబ్ నబీ, నమన్ ధీర్‌, యశ్ ఠాకూర్ తలా వికెట్ పడగొట్టారు. 

దీంతో కివీస్ లక్ష్య చేధనలో 46 ఓవర్లలో 175 పరుగులకే ఆలౌటైంది. బ్లాక్ క్యాప్స్ బ్యాటర్లలో డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్(31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. శాంట్నర్‌(24), నిక్‌ కెల్లీ(24) కాస్త ఫర్వాలేదనిపించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 42.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ అయింది.

భారత బ్యాటర్లలో అక్షర్‌ పటేల్‌(46), ఇషాన్‌ కిషన్‌(46) టాప్‌ స్కోరర్‌లగా నిలిచారు. ఈ మ్యాచ్‌లో స్టార్‌ ప్లేయర్లు రోహిత్‌ శర్మ(7), విరాట్‌ కోహ్లి(5) విఫలమయ్యారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో జాకబ్‌ డఫీ, మిచెల్‌ శాంట్నర్‌ తలా మూడు వికెట్లు చొప్పున పడగొట్టారు.
చదవండి: IND vs NZ: సిరాజ్ సూప‌ర్ డెలివ‌రీ.. కివీస్ బ్యాట‌ర్ ఫ్యూజ్‌లు అవుట్! వీడియో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement