రూట్‌ మరో చరిత్ర | Joe Root becomes the first England batter to complete 50 Fifties in ODIs | Sakshi
Sakshi News home page

రూట్‌ మరో చరిత్ర

Nov 15 2026 11:16 AM | Updated on Nov 15 2026 11:22 AM

Joe Root becomes the first England batter to complete 50 Fifties in ODIs

source: X

ఇటీవలికాలంలో వరుసపెట్టి రికార్డులు సాధిస్తున్న ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌, తాజాగా మరో రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియాలో ఇవాళ జరుగుతున్న రెండో వన్డేలో హాఫ్‌ సెంచరీ (62) చేయడంతో ఇంగ్లండ్‌ తరఫున వన్డేల్లో యాభై హాఫ్‌ సెంచరీలు చేసిన తొలి ఇంగ్లండ్‌ ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన 21వ బ్యాటర్‌గా నిలిచాడు. 

ఈ జాబితాలో 96 హాఫ్‌ సెంచరీలతో సచిన్‌ టెండూల్కర్‌ మొదటి స్థానంలో ఉండగా.. 80 అర్ద శతకాలతో విరాట్‌ కోహ్లి రెండో స్థానంలో ఉన్నాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ మధ్య ఇవాళ అడిలైడ్‌ వేదికగా రెండో వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. 19 పరుగులకే బెన్‌ డకెట్‌ (9) వికెట్‌ కోల్పోగా.. టామ్‌ బాంటన్‌, రూట్‌ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. రూట్‌ 62 పరుగుల వద్ద ఔట్‌ కాగా.. బాంటన్‌ (96) సెంచరీ దిశగా పయనిస్తున్నాడు. అతడికి జతగా కెప్టెన్‌ బ్రూక్‌ (4) క్రీజ్‌లో ఉన్నాడు. 30 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 175-2గా ఉంది. 

కాగా, ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌ గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. పెర్త్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో అరంగేట్రం బౌలర్‌ మహ్లి బియర్డ్‌మన్‌ (6-24) చెలరేగడంతో  తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 131 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఆసీస్‌ స్వల్ప లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది.

ఇదీ చదవండి: రోహిత్ శర్మ చెత్త రికార్డు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement